What is puffer-fishing ? This New TOXIC DATING TREND Raising Red Flags In 2026 @Sakshitvfamily
Author Name:Sakshi Family
Youtube Channel Url:https://www.youtube.com/@Sakshitvfamily
Youtube Video URL:https://www.youtube.com/watch?v=30loUSP39ig
Transcript:
(00:00) నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ షాహిదా మారుతున్న కాలంతో పాటు మోడర్న్ డేటింగ్ ప్రపంచంలో రోజుకో కొత్త పదం పుట్టుకొస్తుంది. ఘోస్టింగ్ బ్రెడ్ క్రంబ్బింగ్ లాంటి పదాలను మర్చిపోకముందే 2026 లో పఫ్ఫర్ ఫిషింగ్ అనే సరికొత్త డేటింగ్ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పదం వినడానికి చేప పేరులా ఉంది కానీ మరి దీనికి డేటింగ్ కి సంబంధం ఏంటో చూద్దాం.
(00:25) డేటింగ్ లో భాగస్వామి ప్రవర్ధించే ఒక వింత ధోరణిని సూచించడానికి మానసిక నిపుణులు ఈ పేరు పెట్టారు. సాధారణంగా పఫ్ఫర్ ఫిష్ అనే చేప తనకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందని అనిపించినప్పుడు తనను తాను రక్షించుకోవడానికి శరీరాన్ని ఒక ముళ్ళ బంతిలా మార్చుకొని దూరంగా జరిగిపోతుంది. డేటింగ్ లో కూడా కొందరు వ్యక్తులు సరిగ్గా ఇలాగే ప్రవర్తిస్తారు. ఇద్దరి మధ్య బంధం బలపడుతున్నప్పుడు [సంగీతం] విషయం పెళ్లి లేదా సీరియస్ రిలేషన్షిప్ల వైపు వెళ్తున్నప్పుడు వారు ఒక్కసారిగా మానసికంగా దూరమవడం లేదా ఎలాంటి కారణం లేకుండా బ్రేకప్ చెప్పి పారిపోవడాన్ని పఫర్ ఫిషింగ్ అంటారు. బంధం
(00:57) మొదలైన కొత్తలో వీరు ఎంతో కేరింగ్ గా అమితమైన ప్రేమను కురిపిస్తూ ప్రాణం ఇచ్చేలా నటిస్తారు. ఎప్పుడైనా బంధం క్యాజువల్ కెమిస్ట్రీ నుంచి నిజమైన ఎమోషనల్ బాండింగ్ వైపు మళ్లుతుందో అప్పుడు వీరిలో భయం మొదలవుతుంది. ఒక్క క్షణం దగ్గరగా ఉంటూనే మరుసటి క్షణమే ఊపి రాడనంతగా ఫీల్ అవుతూ దూరంగా జరిగిపోతారు. రిలేషన్ సీరియస్ అవుతున్న కొద్దీ భాగస్వామిలోని చిన్న లోపాలను పెద్దవిగా చేస్తూ గొడవలు పడడం స్టార్ట్ చేస్తారు.
(01:23) కఠినమైన లేదా నిజాయితీతో కూడిన సంభాషణలు వస్తే చాలు. సమాధానం చెప్పకుండా తప్పించుకుంటారు. చెప్పా పెట్టకుండా ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసి మాయమైపోతారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమి తెలియనట్లు వచ్చి పాత బంధాన్ని అక్కడి నుంచే కొనసాగించాలని చూస్తారు. రిలేషన్షిప్ నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్నతనంలో వారి కుటుంబ వాతావరణం సరిగ్గా లేకపోవడం లేదా గతంలో ప్రేమ పేరుతో మోసపోవడం వల్ల వీరు ఇలా తయారవుతారట.
(01:48) బంధంలో లోతు పెరిగితే అవతలి వారు ఎక్కడ తమను కంట్రోల్ చేస్తారేమో అని లేదా మళ్ళీ ఎక్కడ మోసపోతానేమో అని భయం వారిని వెంటాడుతుంది. అయితే స్పేస్ కోరుకునే ప్రతి ఒక్కరు పఫర్ ఫిష్ కాదని సరైన కమ్యూనికేషన్ లేకుండా తరుచు పారిపోయే వారిని మాత్రమే ఈ కేటగిరీలోకి చేర్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. థెరపీ స్వీయ అవగాహన ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దుకోవచ్చని సూచిస్తున్నారు.
(02:12) సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరిత్య నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.
No comments:
Post a Comment