Saturday, December 12, 2020

అజ్ఞానం నుండే జ్ఞానం వైపు...

🌸 అజ్ఞానం నుండే జ్ఞానం వైపు... 🌸

🌸 ఏది జ్ఞానం...? ఏది అజ్ఞానం...? రెండు మన చైతన్య వికాశానికే... కాల మాన పరిస్థితుల వల్ల జరిగే పరిణామం అనేది వాస్తవం... ఇక్కడ చేర్చించేది ఒకటే మనం మన ప్రణాళిక ప్రకారం ఉన్నామా లేదా విశ్వప్రణాళికలో ఉన్నామా అనేది అసలు అంశం... దీనికోసం చర్చ జరిగితే వచ్చేది మాత్రము ఖచ్చితంగా జ్ఞానమే... కాని అక్కడ మనం దాటివచ్చిన స్థితులు లేదా పరిస్థితులు ఒప్పుకొని రావలసిందే...
ఒక ఆత్మజ్ఞాని అజ్ఞాని అవుతాడా...? అనే ప్రశ్న చాలా అమాయకంగా ఉంటుంది... కానీ సమాధానం అందుకోలేని విధంగా ఉంటుంది... అది ఎలాగో చూద్దాం..

🌸 చిన్నప్పటినుండి పూజలు, జపాలు, దీక్షలు చేసిన వానికి... చిన్నప్పటినుండి అల్లరి, ఆతకాయతనం, మాట దురుసు... లోకానికి వ్యతిరేకంగా వెళ్లే ఇద్దరు ఎక్కడైనా సమస్తితిలో చూడగలమా... సహజంగా కుదరదు... కాలం గడిచేకొద్దీ పరిస్థితులు మార్పు గురౌతాయి... ఆ మార్పులు మొదటి వ్యక్తికి ఎక్కువ ప్రభావం చూపవు... కానీ రెండో వ్యక్తికి ఉహించలేని మార్పులు వస్తాయి... కారణం ఎంత వ్యతిరేకిస్తూ జీవిస్తారో అంతగా మార్పుకు గురౌతారు... ఆ మార్పు ఎదుగుదల కోసమా లేదా బతుకుబండి లాగటం కోసమా అనేది రెండో వ్యక్తి పోరాటంలో వచ్చిన ఆలోచన బట్టి ఉంటుంది అనేది వాస్తవం.. ఇక్కడ మొదటి వ్యక్తి ఎంత జప తపాదులు చేసిన ప్రశాంతత ఉంటుంది కానీ ప్రవాహంలో కల్సిపోతాడు... వ్యతిరేకంగా నడిచే వ్యక్తి ఎప్పుడు తనని తాను మర్పుకు అనుగుంగా మలుచుకుంటు ఉన్నంతలో ఉన్నతమైనది వేతుకుతాడు..
మొదటి వ్యక్తికి మూర్తి పూజ మెట్టు కాదు అగడ్త అని తెలిసేవరకు మార్పు తనమీద ప్రభావం చూపదు... వెదికే వానికి తనే దైవం అని తెలిసేవరకు ఆగడు...

🌸 వేదికేవాడికి ఎప్పుడు వచ్చిన అనుభవాలను ప్రోగుచేసుకుంటు దానిని పునాదిగా నడవటం వల్ల ప్రశ్న లేదా సమాధానం రెండింటిలో దేనినైనా అనుభవ కోణం నుంచి చూస్తాడు.. అక్కడ ఎదుగుదల అనుభవంతో పాటే ఉంటుంది... అంటే అనుభవాలన్ని తనలోని తన పుట్టుకకు దోహదపడతాయి.. ఒకసారి తనకు ఆత్మజ్ఞానం పరిచేయమయ్యాక అజ్ఞాని అవ్వడం అనేది జరగదు... గాక ... జరగదు... ఎందుకంటే ఇక్కడ భయం అనేది ఉండదు కనుక...
పూజలు, జపాలు, దీక్షలు భయం పునాదిగా బతుకుతాయి... కానీ కొద్దిపాటి క్రమశిక్షణ అలవరచడం వల్ల మార్పు ఇతనిని ఇబ్బంది పెట్టదు... అనుభవాలే ఎదిరించే వానికి ఎరువు అంటే నీటిఅడుగుకు చేరే వ్యర్ధాలే పద్మం పుట్టుకకు వేదిక... అలాగే అనుభావాలనే మెట్లుగా నడిచేవారు తన నుండి తాను పుట్టవలసిందే... సాధన, స్వాధ్యాయా, సజ్జనసాంగత్యంల బలిమితో.. ఇక్కడ ఎన్ని మార్పులు వచ్చిన ఇతనిలో ఇమిడిపోవలసిందే..

ఎప్పుడైతే మనలో భయం లేకుండా పోతుందో అప్పుడే మనలోని అసలైన "నేను" పుడుతుంది..

🌸 ఎవరు ఎలా జీవించిన చివరికి మనకు మనమే సమాధానం చెప్పుకోవాలి.. అక్కడ భయం ఉంటే పాప,పుణ్యాలు ఉంటాయి... ఎప్పుడైతే భతరహితంగా ఉంటామో కోరుకున్నవి మనతో ఉంటాయి... నిర్ణయం మనదే...మనమే దైవాలం అని తెలుసుకునే వరకు ప్రయాణం ఆగదు... అంటే పులిమీద స్వారీ దిగితే పులి తింటుంది పట్టుకొని వెళ్లితే మొదట కష్టం అనిపించినా తరువాత ఇద్దరు అంగీకరించటం వల్ల ఒకరికొకరు తోడుగా మారతారు... అంటే పులి తను ఒకటే అని తెలిసేవరకు గోల.. తెలుసుకుంటే లీల...

జీవితాన్ని జీవిద్దాం లీలగా..

ఇప్పటికీ ఇంతవరకు..

Thank you...🌸🌸🌸

Source - Whatsapp Message

No comments:

Post a Comment