Friday, April 30, 2021

శీలం అంటే...

🌷శీలం అంటే...🌹
🕉️🌞🏵️🌎🌼🚩

శీలం అంటే అన్ని విషయాల్లో మంచి నడత. దానగుణం, దయాగుణం ఉన్నవారు ఏ వృత్తిలో ఉన్నా... వారు చేసే వృత్తిని బట్టి చీదరించుకోకూడదు. ధనం కాదు... గుణమే ప్రధానం. వేశ్య వృత్తి చేస్తూ సత్య, ధర్మచరితులైన వారి కథలు చాలా ఉన్నాయి. వాటిలో శూద్రకుడు రాసిన మృచ్ఛకటికం నాటకంలోని వసంతసేన లాంటి కథలు ప్రసిద్ధమైనవి. ఇలాంటి కథలకు పునాది అయిన నగరశోభిణి కథ.
ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన కథ.

పూర్వం ఇంద్రప్రస్థ నగరాన్ని రాజధానిగా చేసుకొని, కురు రాజ్యాన్ని కౌరవ్య మహారాజు పాలిస్తూ ఉండేవాడు. అతని తరువాత అతని కొడుకు బోధి కుమారుడు రాజు అయ్యాడు. పరమ ధార్మికుడైన అతని పాలనలో రాజ కుటుంబాలలోని వారి నుంచి సాధారణ ప్రజల వరకూ ధర్మాన్ని ఆచరించి చూపేవారు. దానితో ఆ రాజ్యం సుభిక్షంగా, ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తూ ఉండేవారు.

ఆ సమయంలోనే కళింగ ప్రాంతంలోని దంతపురి రాజ్యాన్ని కాళింగుడు పాలిస్తున్నాడు. అతని రాజ్యం అశాంతితో, అల్లర్లతో ఉండేది. చివరకు వర్షాభావం కలిగి కరువు కాటకాలు తాండవించాయి. ఈ పరిస్థితులను ఎలా సరిదిద్దాలని తన మంత్రులను కాళింగుడు అడిగాడు. రాజా! మనం ఉపవాస దీక్షలు చేద్దాం. దర్భగడ్డి మీద పక్షం రోజులు పడుకుందాం అన్నారు. అలాగే చేశారు. అయినా పరిస్థితులు మారలేదు. రాజా! యజ్ఞ యాగాలు చేద్దాం అన్నారు. అలాగే చేశారు. అయినా మార్పు లేదు.

మహారాజా! కురు రాజ్యం సుభిక్షంగా ఉంది. దానికి కారణం ఆ రాజు దగ్గర ఉండే అంజనవర్ణి అనే తెల్ల ఏనుగు. దాన్ని తెద్దాం అన్నారు. కురు రాజు దానశీలి. అడిగింది లేదనకుండా ఇచ్చే దాత. కొందరు పండితులు వెళ్ళి, ఆ ఏనుగును తెచ్చారు. అయినా పరిస్థితులు చక్కబడలేదు. అంజనవర్ణి లేకపోవడం వల్ల కురు రాజ్యానికి వచ్చిన నష్టమేదీ కనిపించలేదు. చివరకు కాళింగుని అనుమతితో పండితులు బోధి మహారాజును కలిశారు. మీ సుభిక్షతకు కారణం ఏమిటి? అని అడిగారు. తమ రాజ్య పరిస్థితిని విన్నవించారు.అప్పుడు ఆ మహారాజు మేము పాటించే కురు ధర్మం అన్నాడు. కురు ధర్మమా? అదేమిటో సెలవియ్యగలరా? అని అడిగారు పండితులు. కురు ధర్మం అంటే పంచశీల. జీవహింస చేయకపోవడం, ఇతరుల ధనాన్ని అయాచితంగా ఆశించకపోవడం, మోసపు మాటలు మానడం, కామ దురాచారానికి పాల్పడకపోవడం, ప్రమత్తత కలిగించే పదార్థాల్ని సేవించకపోవడం. ఈ అయిదింటినీ చక్కగా ఆచరిస్తే అదే కురు ధర్మం. అయినా ఈ ధర్మాన్ని మీకు చెప్పడానికి నేను తగను. ఈ ఆచరణలో చిన్న దోషం చేశాను. మీరు వెళ్ళి మా తల్లిగారిని అడగండి అని పంపాడు బోధి మహారాజు. నేను కూడా అందుకు తగను. యువరాజును అడగండి అని అంది మహారాజు తల్లి. అలా వారు యువరాజు దగ్గర నుంచి పురోహితుడు, మంత్రి, రథ సారథి, శ్రేష్టి, కొలతలు వేసే ఉద్యోగి, ద్వారపాలకుడు... ఇలా ఒకరి తరువాత ఒకరి వద్దకు వెళ్ళారు. చివరకు నగర శోభిణి (వేశ్య) దగ్గరకు వెళ్ళారు.
అయ్యా! నాకు కురు ధర్మాన్ని చెప్పే అర్హత లేదు. ఎందుకంటే... నాకు ఒక రాత్రికి వెయ్యి నాణేల ధర చెల్లించేవారు. అలా ఒక రోజు ఒక వ్యక్తి వచ్చాడు. వెయ్యి నాణేలు ఇచ్చి... రాత్రికి వస్తానన్నాడు. కానీ అతను రాలేదు. అలా అతని కోసం రోజులు ఎదురు చూశాను, నెలలు ఎదురు చూశాను. మూడేళ్ళు ఎదురు చూశాను. అప్పటికీ రాలేదు. ఒకరి దగ్గర వెల కుదిరి, మరొకరి దగ్గర వెల పుచ్చుకోవడం దోషం కదా! తప్పు కదా! ఈ మూడేళ్ళలో నేను దాచుకున్నదంతా తరిగిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. తిండి లేదు. అయినా అతను ఇచ్చిన ఆ వెయ్యి నాణేల్లో ఒక్కటి కూడా ఉపయోగించుకోలేదు. చిక్కి శల్యమైపోయాను. జీవించే ఆశను వదులుకున్నాను. నేను ఇక బతకాలంటే ఆ వెయ్యి నాణేలే గతి. నగర న్యాయాధికారి వద్దకు వెళ్ళాను. అంతా చెప్పాను. అప్పుడు ఆయన శోభిణీ! నీకు ధనం ఇచ్చినవాడు రాకుండా మూడేళ్ళు నిండాయి. కాబట్టి ఆ ధనం మీద అతనికి అధికారం లేదు. అది నీదే! అన్నారు. సంతోషంతో వీధిలోకి వచ్చాను. అప్పుడే ఒక వ్యక్తి ఒక్క రాత్రికి వెయ్యి నాణేలకు కుదుర్చుకొని, ఆ ధనాన్ని నాకు ఇవ్వబోయాడు. మనసులో వద్దు అనుకుంటూనే ఉన్నా. కానీ ఆ ధనాన్ని స్వీకరించడానికి నా చెయ్యి కదిలింది. సరిగ్గా అదే సమయంలో... మూడేళ్ళ క్రితం నాకు ధనం ఇచ్చిన మనిషి కనిపించాడు. వెంటనే నా చేతిని వెనక్కు తీసుకున్నాను. నా ప్రవర్తన నాకే సిగ్గనిపించింది. అందుకే మీకు కురు ధర్మాన్ని చెప్పడానికి నేను అర్హత లేనిదాన్ని అంది.

ఆమె చెప్పింది వినగానే పండితులు ఆశ్చర్యపోయారు. నోరు వెళ్ళబెట్టారు. కన్నీరు సుడి తిరిగింది. ధర్మాచరణతో ఇంత నిబద్ధంగా బతకాలి. అదే లోకానికి శ్రేయస్కరం అని భావించారు. వెళ్ళి తమ రాజుకు చెప్పారు. ఆనాటి నుంచి కాళింగుడు కురు ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేశాడు. క్రమంగా అతని రాజ్యం కూడా సుఖ శాంతులతో వర్ధిల్లింది.

👏👏👏👏👏👏

Source - Whatsapp Message

దేవుడు ఒక దుకాణం తెరిచాడట.

దేవుడు ఒక దుకాణం తెరిచాడట.⚜️
🕉️🌞🌎🏵️🌼🚩

🍃🌹 అక్కడికి ఒక ఆసామి వెళ్ళి 'ఇక్కడ ఏం దొరుకుతాయి? ' అని అడిగాడు. ఏది కావాలంటే అది దొరుకుతుంది." అన్నాడు దేవుడు.'అలాగా, అయితే డబ్బు దొరుకుతుందా?'
చెప్పానుగా. దొరుకుతుంది
'మరి మనశ్శాంతి?'
"దొరుకుతుంది"

ఆరోగ్యం, సుఖం.. ప్రేమ?'
ఊ...తలూపాడు దేవుడు.
'
సరే అయితే గెలుపు దొరుకుతుందా?'
"చెప్పానుగా అన్నీ దొరుకుతాయి నీకేంకావాలో చెప్పు ముందు? ఇంకా క్యూలో చాలామంది ఉన్నారు"
ఊ ...అయితే నాకు సక్సెస్ ఫుల్ లైఫ్ కావాలి.అడిగాడు ఆసామి
సరే తీసుకో అని ఒక గింజను చేతిలో పెట్టాడు దేవుడు.
ఏమిటిది?'
ఆశ్చర్యంగా అడిగాడు.
విత్తనం"ఎందుకిది?'
"సక్సెస్ ఫుల్ జీవితం కావాలన్నావుగా,.ఇది ముందు నాటితేనే కదా , పెరిగి పెద్దదయి నీకు ఫలితాన్నిచ్చేది"
బుద్దుడికి చెట్టు క్రింద జ్ఞానోదయం అయినట్టు ఆ చెట్టుకి మూలమైన విత్తనం చేతిలో పడగానే బల్బు వెలిగింది. దేవుడి దుకాణంలో పండు దొరకదు విత్తనం దొరుకుతుంది.🦜

🐄
ఏదీ కష్ట పడకుండా ఏమీ చేయకుండా రాదు. డబ్బు, శ్రమ, ఆలోచన.. ఇంకోటా,..మరోటా...ఏదో ఒక పెట్టుబడి పెట్టాలి. ఏది నాటితే అదే కాస్తుంది .కానీ ఖచ్చితంగా కాస్తుంది.🐓

🍃🌷ఈ భావాన్ని మన పిల్లలలో నాటితే వాళ్ళు గొప్ప వారు అవుతారు. ఆ దేవుడి దుకాణానికే విత్తనాలు పంపిస్తారు* 🌝 .

మానస సరోవరం.

Source - Whatsapp Message

అబల కాదు తబలే .. ఇప్పటికీ!

అబల కాదు తబలే .. ఇప్పటికీ!
🕉️🌞🌎🏵️🌼🚩

బ్రహ్మదేవుడు ఏ బ్యాడ్ మూడ్ లో ఉండి సృష్టించాడో,ఆడదాని బతుకు ఎప్పుడూ గండ్రగొడ్డలి కింది ఎండుకొమ్మే!
కిందే కాదు.. పై ప్రపంచంలోనూ! బ్రహ్మయ్యకు రిమ్మ తెగులు. శివయ్య సగం శరీరం భార్యకు ఇచ్చినట్లే ఇచ్చి మరో గంగానమ్మను నెత్తికెత్తుకున్నాడు. హరి మాత్రం! హరి.. హరీ! కట్టుకున్న దానిని ఆకట్టుకోవలసింది పోయి కాళ్ల దగ్గర అచ్చంగా కట్టిపడేసుకున్న మహానుభావుడాయన.

'ఆడదానికి స్వేచ్ఛిసేస్తే మహా అపాయం' అని ఆ మనువెవరో అన్నాట్ట కదా! ఆయనన్న మిగతా సుద్దుల్ని మాత్రం గట్టున పెట్టేసి, ఈ ఒక్క ముక్కను వేదంలా మన మగమహారాజులు ఈ ఇరవైయొకటో శతాబ్దం దాకా వేదంలా ఈడ్చుకొచ్చారు!

ఒక్క మగాడనేమిట్లే, గ్యాసుబండలు, యాసిడ్ సీసాలు, సెల్ఫోన్ కెమేరాలు, సినిమా బడితె బొమ్మలు, కట్నం వేధింపులు, అత్యాచారాలు, అతి ఆచారాలు, అనారోగ్యాలు, భ్రూణహత్యలు, పరువుహత్యలు, లైంగిక వేధింపులు, గాడిద చాకిర్లు, తక్కువ జీతాలు.. అబ్బో.. జల్లెడ చిల్లుల కన్నా ఎక్కువ ఆడదాని కడగండ్లు!

వేళకు వంట చేసి వడ్డించడానికి, మగాడికి బిడ్డల్ని కని.. పెంచడానికి, ఇంటిని కనిపెట్టుకునుండటానికి, వంటికి సుఖమందించడానికి, బైట బడాయి షోలకు, వేణ్నీళ్లకు చన్నీళ్లని వంక పెట్టి సంపాదించిందంతా కుమ్మేయడానికి, సినిమాల కెళ్లినప్పుడు క్యూలల్లో త్వరగా టిక్కెట్లు కోయించుకోడానికి, బస్సుల్లో ఆడాళ్ల సీట్లనూ అక్రమంగా అక్రమించడానికి, బ్యాంకుల్లో దొంగపేర్లతో ఖాతాలు తెరుచుకోడానికి.. మాత్రమే భగవంతుడు ఆడదాన్ని తనకు జోడీగా కుదిర్చాడనుకుంటున్నాడు మగాడు.

బల్లిని చూసి భయపడేటంత సున్నితమైన మనస్సు నిజానికి ఏ అమ్మడుకయినా. అయినా ఒక మగాడి సంసారం గాడినపెట్టడానికి నవమాసాలు నరకయాతన నవ్వుతూ సహించేందుక్కూడా సిద్ధపడే సాహసి సహచరి. బిడ్డ పుట్టుకకు అవసరమైతే కత్తికోతకైనా తను సిద్ధపడే త్యాగశీలి తరుణి.

గంట పనికే వందలు డిమాండు చేసే వ్యాపార ప్రపంచంలో పాచి పని నుంచి రాత్రి పడక పని దాకా సహస్రావతారాలతో సమర్థంగా శ్రమించే స్త్రీ మూర్తి శుశ్రూషకు పైసల్లో, పెన్నీల్లో విలువ గడితే పది మంది బిల్ గేట్స్, అంబానీల సంపాదలన్నీ కలిపినా ఒక వారానికి మించి సరిపోతాయా?

మగమనుషులు మద మాత్సర్యాలతో ఒకరినొకరు ఆడిపోసుకునే నీచ సంస్కృతిలో కూడా పాపం ఏ ప్రమేయం లేని అమ్మలక్కల ప్రస్తావనలే వస్తాయి! మనుషులలో సరే.. మనసులలో సంగతి!

పులి అడవిలో కదిలేటంత చురుగ్గా ఇంటిలో కలితిరిగే శక్తి కలది స్త్రీ. ఇంటి నాలుగు గోడల మధ్య పనిపాటల చేసుకొనే సందర్భంలో అమ్మ నడిచే దూరం ముందు ఏ మారథాన్ పరుగుపందెం విజేత రికార్డయినా బలాదూర్! ఇంటి బరువు బాధ్యతలను ఒంటిచేతి మీదుగా నిర్వహించే ఆమె దారుఢ్యం ముందు ఎంత మంది కరణం మల్లీశ్వరులు ధృఢంగా నిలబడగలిగేది!
ఇంటికి ఆమే యమర్జెన్సీ వైద్యురాలు. ఏ శిక్షణా అక్కర్లేని సుశిక్షణగల ఉపాథ్యాయురాలు. అనుక్షణం బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే జీతమివ్వని వార్డెన్ కూడా ఆమే. కుటుంబ సభ్యులు ఎవరికైనా కష్టం వాటిల్లితే పైసా ముట్టకుండా చక్కని కౌన్సిలింగు ఇచ్చే సామర్థ్యం ఆమె సొంతం. ఎవరి ఇష్టాయిష్టాలేమిటో పెదవి విప్పకుండానే ఇట్టే పసిగట్టి వీలును బట్టి ఉన్న వనరులతో అందరికి సంతృప్తి కలిగించే ట్రబుల్ షూటర్ అమ్మ తరువాతే భూమ్మీద ఇంకెవరైనా.

సంసారమనే విమానానికి ఆమే ప్రధాన చోదకురాలు. ఎయిర్ హోస్టెస్. రచ్చలో కూర్చున్న రాజేంద్రునికి మల్లే భర్త కాలు కదపక పెత్తనం చెలాయిస్తున్నా, ఆమె కలికి కామాక్షికి మల్లే వదిగి ఉంటున్నందు వల్లనే ఇల్లు ఓ కైలాసగిరిగానో.. అమరావతికి మల్లేనో బైటి కళ్లకు శోభకలిగించేది.

ఆధార్ కార్డ్ సైతం ఓ పట్టాన దొరకని ఈ కలికాలంలో ఇంటిల్లిపాదీ గుడ్డిగా ఆధారపడ్డా ఇబ్బంది లేని ఆమె సేవలు ఉదారంగా దొరకడం మగమారాజు చేసుకున్న అదృష్టం. మెడలో మూడు ముళ్లు పడి, సహచరునితో ఏడడుగులు నడిచిన మరుక్షణం నుంచి ఇంటి పేరును మార్చు, మార్చక పో వంటి తీరును భర్త వంశానికి మీదు కట్టే త్యాగమయులు భూమ్మీద తరుణుల తప్ప ఇంకెవరుంటారు!

రాముడొచ్చి కూల్చే వరకు రావణబ్రహ్మనైనా గడ్డిపోచ కింద దూరం పెట్టగలిగిన సీతనీతి స్త్రీ జాతిది. కాళ్ల పారాణి ఆరక ముందే కట్టుకున్న భర్త సోదర ప్రేమతో కానలు పట్టిపోతున్నా కంటి నీరు కొనుకుల కట్ట నుంచి ఉబికి రానీయని ఊర్మిళకట్టు ఉదిత జాతిది. పతిని దేవుడనుకోడం వట్టి మాటలలోనే కాదు; ప్రాణగండం ముంచుకొస్తే సాక్షాత్ ఆ దేవుడితో తలపడేందుకైనా వెనక్కు తగ్గని సావిత్రిసాథ్వీగుణం కూడా స్త్రీ జాతిదే. తనవాడుగా తలచిన మరుక్షణం మనువాడే తెగింపుగుణం రుక్మిణికి వలె మనం మగులందరిలోనూ చూడగలం. భర్తకు లేని దృశ్యభాగ్యం తనకు మాత్రం ఎందుకు.. వద్దని కళ్లకు గంతలు కట్టుకుంది పట్టపురాణి గాంధారి! బుద్ధిలో నాలుగు రెట్లు, సాహసబుద్ధిలో ఎనిమిది రెట్లు స్త్రీకే ఆధిక్యతని చెప్పేందుకు ఈ తరహా ఉదంతాలు చరిత్రలో ఇంకెన్నో!

మగవాడి మతలబు కేవలం ఐదు పదాల్లో తేల్చేసిన అమరుకం, ఆడదాని విషయంలో నూటనలభై నాలుగు పదాలు వాడీ 'ఇహ నా వల్ల కాదు పొమ్మ'ని గుడ్లు తేలేసింది. కావ్యాలంకారాల అష్టవిధ నాయికల నుంచి, కన్యాశుల్కం మార్కు మధురువాణి వరకు స్త్రీ మనసు అర్థం చేసుకోనేందుకు మగవాడు పడ్డ ఆపసోపాలు అన్నీ ఇన్నీ కావు. స్త్రీ అంతరంగ గంగనూ ఎంత తిరగ దోడినా మగాడి మనసనే చేదకు దక్కేది రవ్వంత బొట్టే!

హృదయంతో కాకుండా పెదవులతో కొలవబోతే కోమలి కొలతలకు ఏనాడూ అందదు. యుగయుగాలుగా చిక్కుబడ్డ స్త్రీ-పురుష సంబంధం చక్కబడాలంటే మగవాడికి కావాల్సింది ఒక్క నేర్పే కాదు! కష్టానికి సుఖానికి విడిపోకుండా వుండే ఓర్పు.

అప్పడాల కార్ట్యూన్లు కేవలం మగాడి మనోవికార సూచితాలే! అసలుకు అప్పడంలా నలుగుతున్నది స్త్రీ జాతి మగాడి అహమనే కరకు కోరల మధ్యన చిక్కి . చంద్రమతి నాటి సత్యకాలం నుంచి.. దివ్య దిశాల ఈనాటి కలియుగం వరకు వ్యథ ఒకేలా సాగుతున్నది.. వ్యక్తీకరణల్లోనే ఆధునికత.. వైవిధ్యం!

సునీతా మిలియమ్స్, నైనా సెహ్వాలు, మలాలా, ఇందిరా ప్రియాంకాలు, ఇంద్రా సూకీ.. ఎన్ని కోట్ల మందిలో కొట్లాడి పరజితులవగా చివరకు గెలిచిన విజేతల జాబితాలో కనిపించేది?

నిన్నటి దాకా వంటిళ్ళు, పడగ్గదుల వరకే పరిమితమై నోరు విప్పే అవకాశం లేని నారి తంటాలు. విశాల ప్రపంచంలోకి వచ్చి పనిపాటలు చేసుకోక తప్పని ఆర్థిక వాతావరణంలోనూ మారని దుస్థితి! మగవాడి మదమాత్సర్యాల మూలకంగా ఈనాటికీ ఆడదాని పరిస్థితి ముల్లు పక్కన అరటి ఆకు అధోగతే! ఇదే వాస్తవ పరిస్థితి!

ఆత్మరక్షణకు మహిళలు వాడుకునే 'పెప్పర్ స్ప్రే' పార్లమెంటు వాడకం వరకూ పెరిగిందే కానీ, ఆత్మగౌరవానికై మహిళకు హామీ ఇచ్చిన 'రిజర్వేషన్ బిల్లు' అదే పార్లమెంటులో ఎన్నో దశాబ్దాల బట్టి పెండింగులో పడివుంది! 'చీపురు కట్ట'కు దక్కిన రాజకీయ గుర్తింపు ఆ చీపురే అనాదిగా ఆయుధంగా వాడే స్త్రీ జాతికి ఇరవైఒకటో శతాబ్దం వచ్చినా దక్కకపోవడం.. మగాడి హిపోక్రసీ బుద్ధి.. రంగులు మార్చే ఊసరవెల్లి చెల్లికి అక్క అవుతోందని తేటతెల్లమవడంలా!

'అబల' అనగానే లబలబలాడటమే గానీ, మగవాడి పెత్తందారీ కచేరీలో ఆడదాని పరిస్థితి 'తబలా' కు మించి ఏం మెరుగ్గా ఉందని!

' ఆడ పుటక'మగ సమాజం పానకంలో ఇంకా పుడకలాగే ఉంది. 'తిరిగి ఆడది .. తిరక్క మగాడు' చెడతారన్న మనువు సూత్రం మంట గలిసేదాకా ఆడది తిరగబడి ప్రశ్నించడం కొనసాగాల్సుంది అందుకే!

ఏడాదికి ఏదో ఓ ఎన్నిక చేసుకున్న రోజు మహిళా దినోత్సవం జరుపుకోడం కాదు.. ఏడాదంతా మహిళకు ఉత్సవంలా సాగాలంటే ముందు మగవాడి అంతరంగానికి శాశ్వతంగా మరమ్మత్తు చేసే చాతుర్యం కావాలి!

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

Thursday, April 29, 2021

మంచి.. మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు,. మీకు మీ కుటుంబసభ్యులకు పూజ్య గురుదేవులు నడిచే దేవుడు చంద్రశేఖర గురుదేవులు పూజ్య గురుదేవులు రాఘవేంద్ర స్వామీ వారు దత్తాత్రేయ స్వామివారు పూజ్య గురువులు సాయి బాబావారు తదితర పూజ్య గురుదేవుల అనుగ్రహసంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంతో ఉండాలని కోరుకుంటూ.. ప్రతిఒక్కరు కరోనా మహమ్మారిని ఎదుర్కొంటానికి చేతులు సాధ్యమైనన్ని సార్లు శుభ్రం చేసుకోండి తప్పక మాస్క్ ధరించండి నోరు ముక్కు పూర్తిగా కవరయ్యేలాగా, వాక్సిన్ వేయించుకొండ, అవసరమైతే తప్ప బయటకి వెళ్ళకండి ఇంట్లో ఉండండి క్షేమముగా ఉండండి. అందరు బాగుండాలి అందులో మనముండాలి.. మీ ఆత్మీయబంధువు AVB సుబ్బారావు 💐🤝

గురు వారం 29.04.2021

ఈ రోజు AVB మంచి.. మాట.. లు

ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆందోళన అసంతృప్తి తో బతుకుతున్నారు అనుకున్నది సాధించలేదని సంపాదన లేదని కార్ బంగాళాలు లేవని, కాని మన ఆలోచన విధానం మార్చుకుంటే నేను చాలా మంది కన్నా బాగున్నాను చాలి చాలని సంపాదన తో చాలా మంది బతకగలుగుతున్నారు , చిన్న ఇంటిలో ఎలా ఉండగలుగుతున్నారో అని అనుకుంటు దేముడు మనకు ఇచ్చినదానితో సంతృప్తి చెందుదాం అని అనుకుంటే చాలు

జీవితం క్షణికమైనది దానిని సద్వినియోగం చేసుకుందాం, ఏదైనా నిలువ ఉంటే చెడిపోతుంది వాసన వస్తుంది ఎవరికీ పనిరాకుండపోతుంది అది వస్తువైనా డబ్బులైన మనం వాటిని శుద్ధి చేసుకుంటూండాలి అవసరమైన వారికీ ఇస్తే శుద్ధి అవుతాయి ఆలోచించు మిత్రమా

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకు మిత్రమా, ఎవరి సమస్యలు వారికీ ఉన్నాయి నువ్వు భోజనం చేస్తేనే నీ ఆకలి తీరుతుంది అని తెలుసుకో మిత్రమా

లోకంలో మంచి చెప్పేవారు చాలా మంది ఉన్నారు, కాని ఆచరించేవారు చాలా తక్కువ మంది ఉంటారు, నీ అనుభవం నుంచే పాఠాలు నేర్చుకో మిత్రమా అప్పుడు మంచేదో నీకె అవగతం అవుతుంది

మన మనసే అన్నిటికి మూలం మన ఆలోచనలే మన ఆరోగ్యం కైనా అనారోగ్యానికైనా కారణం ఎల్లప్పుడూ మన ఆలోచనలు మంచిగా ఉండేలా చూసుకుందాం మిత్రమా
ఇంట్లోనే ఉందాం జాగర్తగా ఉందాం ఈ కరోనా ఆపత్కాలములో మన క్షేమమే మన కుటుంబానికి కావలసింది

మీ ఆత్మీయ బంధువు
AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

పంచభూతాల శక్తి.

పంచభూతాల శక్తి.

ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవుతున్నారో.. అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు.
మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు ? అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు.
నిజాన్ని పరిశీలిస్తే… పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం.

మన కాళ్ళు.. ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.

మన చేతులు.. కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.

మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు. ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది. మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా.. అని మీరు అడగవచ్చు

కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు.

మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి. ‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు.
చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది. మరి మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా ? అన్నదే ఈనాటి మన ప్రశ్న!

పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ… వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి.
ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు ?

ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.

వాయువు కు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.

అగ్ని కి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.

జలము కు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము (రుచి)లు.

భూమి కి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ, రూప, రస, గంథాలు.
ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.

అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.

వాయువు…‘రస, గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.

ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు… ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు ? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి.అంటే ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే !
*‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే.
అదే దైవ సాక్షాత్కారం అంటే.

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

అన్వేషించేది మనిషి
ఆకర్షించేది మనసు
అందనిది ఆకాశం
ఆగనది కాలం
అంతరించేది జీవితం
🌹అనునిత్యం మనందరి తోడు ఉండేది మనం చేసిన మంచితనం.
🌹చేస్తున్న పని పట్ల శ్రద్ధ కనబరిస్తే అది పలువురి ప్రశంసలు పొందుతుంది. ఫలితం బాగుంటుంది....."
🌹ఏడుపు ముఖంతో ఇష్టం లేకుండా చేసేపనికి ఫలితం ఏడుస్తున్నట్లే ఉంటుంది
🌹లభించిన వృత్తినే పరమ పవిత్రంగా భావించి నిజాయితీతో పనిచేయాలి
🌹ఆలోచనలెప్పుడూ నిర్మలంగా ఉండాలి.
🌹ఎలాంటి పరిస్థితుల్లోనూ అదుపు తప్పకూడదు
🌹స్వచ్ఛమైన ఆలోచనలతోనే మనిషి ఆదర్శప్రాయుడవుతాడు.
🌹అందరి అభిమానం చూరగొంటాడు.


" ఒక మనిషిగా తను జీవితంలో..

ఎలా ఉండకూడదో! ఎలా ఉండాలో విచక్షణ కలిగి జీవించటానికి.. గొప్ప గ్రంధాలే చదవాల్సిన అవసరం లేదు..

గొప్ప ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు.

ఒకసారి తన జీవితపు గతించిన అనుభవాలు నిశితంగా పునరావలోకనం చేసుకోగలిగితే చాలు. "

మానస సరోవరం.

Source - Whatsapp Message

Tuesday, April 27, 2021

ఈ మహమ్మారిని ఎలా నివారించాలి? ఈ ప్రశ్నను ఓషోకి 40 సంవత్సరాల క్రితం AIDS కాలంలో అడిగారు!

ఈ మహమ్మారిని ఎలా నివారించాలి?
ఈ ప్రశ్నను ఓషోకి 40 సంవత్సరాల క్రితం AIDS కాలంలో అడిగారు!

మీరు తప్పు ప్రశ్న అడుగుతున్నారు... అంటూ ఓషో బదులిచ్చారు. సరైన ప్రశ్న ఏ విధంగా ఉండాలంటే:
"అంటువ్యాధి (మహమ్మారి) వల్ల చనిపోయే భయాన్ని ఎలా నివారించాలి ..?"

వైరస్ను నివారించడం చాలా సులభం, మీలో మరియు ప్రపంచంలో భయాన్ని నివారించడం చాలా కష్టం. మహమ్మారి కారణంగా కాకుండా ప్రజలు ఈ భయం కారణంగా ఎక్కువ చనిపోతారు.

భయం కంటే ప్రమాదకరమైన వైరస్ ఈ ప్రపంచంలో లేదు.
ఈ భయాన్ని అర్థం చేసుకోండి, లేకపోతే మీ శరీరం చనిపోయే ముందు మీరు మృతదేహంగా మారతారు.

దీనికి వైరస్‌తో సంబంధం లేదు. ఈ క్షణాల్లో మీరు అనుభూతి చెందుతున్న భయానక వాతావరణం సామూహిక పిచ్చి ...
ఇది అనేక సార్లు జరిగింది మరియు ఇక మీదట కూడా కొనసాగుతుంది.
జనసమూహం మరియు భయం యొక్క మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకోకపోతే ఇది కొనసాగుతూ ఉంటుంది ...

మీరు సాధారణంగా మీ భయాన్ని అంచున ఉంచుతారు, కానీ సామూహిక పిచ్చి యొక్క క్షణంలో, మీ స్పృహ పూర్తిగా తొలగిపోతుంది. మీరు మీ భయంపై నియంత్రణను కోల్పోయినది కూడా మీకు తెలియదు.

అప్పుడు భయం మిమ్మల్ని ఏదైనా చేయగలదు ...

అటువంటి పరిస్థితిలో మీరు మీ స్వంత జీవితాన్ని లేదా ఇతరుల జీవితాలను కూడా బలిగొంటారు.
రాబోయే కాలంలో చాలా జరుగుతుంది: చాలా మంది తమను తాము చంపుకుంటారు మరియు చాలా మంది చావుకు కారణమవుతారు ...

జాగ్రత్త వహించండి.
భయాన్ని ప్రేరేపించే వార్తలను చూడవద్దు.
మహమ్మారి గురించి మాట్లాడటం మానేయండి. అదే విషయాన్ని పదే పదే చెప్పడం స్వీయ-హిప్నాసిస్ లాంటిది.
భయం అనేది కారణం అవుతారు మీ మనసుని లొంగదీసుకుంటుంది.
ఈ ఆలోచన శరీరంలో రసాయన మార్పులకు కారణమవుతుంది ...

మీరు అదే ఆలోచనను పదే పదే పునరావృతం చేస్తే, ఒక రసాయన మార్పు ప్రేరేపించబడుతుంది, అది కొన్నిసార్లు విషపూరితం కూడా కావచ్చు అది మిమ్మల్ని హతమార్చగలదు ...
ఒక అంటువ్యాధి సమయంలో, ప్రపంచవ్యాప్తంగా శక్తి అహేతుకంగా మారుతుంది ...
ఈ విధంగా మీరు ఎప్పుడైనా కాల రంధ్రంలో పడవచ్చు ...

ధ్యానం అప్పుడు రక్షణ కవచం గా మారుతుంది. దీనిలో ప్రతికూల శక్తి ప్రవేశించదు ...

జీవితమనే ప్రయాణాన్ని నిర్భయంగా కొనసాగించేందుకు ప్రయత్నించండి మరియు నిర్భయంగా ఉండండి ...
👏👏👏👏👏

Source - Whatsapp Message

చక్కటి నీతికథ.

చక్కటి నీతికథ.
నారాయణపురంలోవున్న ధనవంతుల్లో నరసింహం ఒకడు. అందరితో మంచిగా వుంటూ, అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తాడని, ఆయనకు పేరున్నది.

ఒక రోజు ఉదయం ఆయన స్నానం చేసి, పూజకోసం ఇంటి ముందున్న నందివర్థనం పూలు కోస్తూండగా, అయ్యగారూ, నమస్కారం! నరసింహంగారంటే తమరేగదండీ? అంటూ ఒక పన్నెండేళ్ళ కుర్రాడు వచ్చాడు.
"అవును, నువ్వెవరివి?" ఏంకావాలి నీకు? అని అడిగాడు నరసింహం.

నా పేరు కృష్ణుడు. మీ ఇంట్లో పనికావాలి అయ్యగారూ! అన్నాడు కుర్రాడు వినయంగా చేతులు జోడించి.
నరసింహం నవ్వి, నువ్వేం పనిచేయగలవు, కృష్ణా? అని అడిగాడు. "‘ఏ పని చెప్పినా చేస్తాను. చిన్నప్పుడే అమ్మా నాన్నా పోయారు. మామయ్య ఇంట్లో పెరిగాను. మా అత్తయ్య ఇంటి పనంతా నాతోనే చేయించేది. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళవడంతో ఖర్చు పెరిగిందని, నాదారి నన్ను చూసుకోమన్నారు. మా ఊళ్ళో మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. అందుకే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను, అన్నాడు కృష్ణుడు.

నరసింహం కాస్సేపు ఆలోచించి, నీకివ్వడానికి మా ఇంట్లో పనేంలేదు. నువ్వు చదువుకుంటానంటే చదువు చెప్పిస్తాను, అన్నాడు.

కృష్ణుడు చప్పున నరసింహం కాళ్ళ మీద పడి, ""నాకు చదువంటే ప్రాణం! ఈ సంవత్సరమే మా అత్తయ్య, నా బడిమానిపించేసింది,"" అన్నాడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూండగా.

నరసింహం, లోపలి గదిలోవున్న అదే ఈడువాడయిన తన కొడుకు రాముడిని పిలిచి, "ఈ అబ్బాయి పేరు కృష్ణ. నీతోపాటు నీగదిలోనే వుంటాడు. నీతో బడికి తీసుకెళ్ళు. నేను పంతులుగారితో మాట్లాడతాను." అన్నాడు. "అలాగే, నాన్నా!" అంటూ కృష్ణుడిని తనగదిలోకి తీసుకుపోయాడు రాముడు.

నరసింహం భార్య భాగేశ్వరికి ఇది ఏ మాత్రం నచ్చలేదు. "ఎంతమంది అనాధలను, ఇలా చేరదీసి పోషించగలం?" అన్నది కోపంగా.

‘‘చూద్దాం!'' అంటూ నవ్వేశాడు నరసింహం. కృష్ణుడు ఇంటి పనిలో భాగేశ్వరికి సహాయపడుతూనే, రాముడితో బడికి వెళ్ళి చదువుకునేవాడు. కృష్ణుడు తన తరగతిలో చేరనంత కాలం, రాముడు ఏ పరీక్ష పెట్టినా ప్రథముడుగా వచ్చేవాడు.

ఇప్పుడు రాముడికి ఏ పరీక్షలో అయినా ద్వితీయ స్థానంతో సరిపెట్టుకోవలసివచ్చింది. అన్ని పరీక్షలలోనూ, కృష్ణుడిదే ప్రథమ స్థానం. ఇది గమనించిన నరసింహం, ‘‘కృష్ణుడు నీకన్నా తెలివైనవాడు. నీకు తెలియనివి వాడిని అడిగి చెప్పించుకో,'' అన్నాడు రాముడితో. తండ్రి అలా అనడం ఎంతో అవమానంగా తోచింది, రాముడికి. వాడొక రోజు తల్లితో, ‘‘అమ్మా, ఆ కృష్ణుడిని ఇంట్లోంచే కాదు, బడిలోంచి కూడా పంపించేయండి. నేనే తరగతిలో ప్రథముడిగా వుండాలి,''అన్నాడు.

భాగేశ్వరి ఆ మాటలకు నెత్తిబాదుకుని, ‘‘నేను ముందు నుంచే, ఈ తద్దినాన్ని ఇంట్లోకి తీసుకురావద్దన్నాను. మీ నాన్నకు నా మాట అంటే లక్ష్యం లేదు!'' అన్నది.

తర్వాత ఆమె పెరట్లో బాదం చెట్టుకింద కూర్చుని చదువుకుంటున్న కృష్ణుడి దగ్గరకు వెళ్ళి, ‘‘ఒరే, కృష్ణా! తరగతిలో ఏ పరీక్ష పెట్టినా నువ్వు ఒక ప్రశ్నకు జవాబు రాయకుండా వదిలేయి, తెలిసిందా?'' అన్నది.

‘‘నాకు అన్ని ప్రశ్నలకూ జవాబులు తెలుసు, అమ్మగారూ!'' అన్నాడు కృష్ణుడు, ఆశ్చర్యంగా భువనేశ్వరి ముఖంలోకి చూస్తూ.

‘‘అయినా సరే! ఇకపై ప్రతి పరీక్షలోనూ ఒక ప్రశ్నకు సమాధానం రాయకూడదు. అంతే,'' అన్నది భాగేశ్వరి కరకుగా.

ఆ తర్వాత అన్ని పరీక్షలలోనూ రాముడికి ప్రథమ స్థానం, కృష్ణుడికి ద్వితీయ స్థానం రాసాగింది. ఈ మార్పు పంతులుగారికి ఆశ్చర్యం కలిగించింది. తరచి తరచి అడిగి, కృష్ణుడి ద్వారా సంగతంతా తెలుసుకున్న ఆయన, కృష్ణుడికి ప్రత్యేక పరీక్ష పెట్టి, వాణ్ణి పైతరగతికి పంపించేశాడు. తరగతిలోంచి కృష్ణుడు వెళ్ళి పోవడంతో ఎంతో ఆనందం కలిగింది, రాముడికి.

పంతులుగారి ద్వారా జరిగిందేమిటో తెలుసుకున్న నరసింహం, ఆయనతో, ‘‘మీరు చేసిన పనివల్ల కృష్ణుడికి న్యాయం జరిగింది, అయితే రాముడు నష్టపోయాడు.

పక్కవారిని చూసి ఈర్ష్యపడకూడదని, రాముడు గ్రహించాలి. తెలియనివి ఎవరినైనా అడిగి తెలుసుకోవడంలో తప్పులేదనీ, మనిషి మానసికంగా ఎదగడానికి పోటీ అనేది తప్పని సరిగావుండాలనీ, రాముడికి తెలియాలి. రాముడు మంచి బాలుడుగా ఎదిగే ప్రయత్నం మీరే చేయాలి, పంతులుగారూ!" అన్నాడు.

ఇందుకు పంతులుగారు కాసేపు ఆలోచించి, ‘‘సరే, రాముడికి కూడా నష్టం జరక్కుండా చూస్తాను,'' అన్నాడు. ఆ రోజు తరగతిలో పంతులుగారు, ఒక కథ చెప్పాడు: అనగనగా ఒక రాజు. ఆయనకు ఒక్కడే కొడుకు. ఈ యువరాజు గురప్రు స్వారీలో దిట్ట.

తరచుగా గుర్రాన్ని అడవిలో దౌడు తీయించేవాడు. అతణ్ణి, తమ గుర్రాలతో అందుకోవడం, పరివారంలో ఎవరికీ సాధ్య పడేదికాదు. అందరూ గురప్రుస్వారీలో యువరాజును మించిన వాళ్ళు లేరని పొగడుతూండేవాళ్ళు.

ఒకనాడు అనుకోకుండా యువరాజుకు, కోమలనాయకుడి కొడుకుతో పరిచయమైంది. ఆ కోమలనాయకుడు, యువరాజు కన్నా వేగంగా, గురప్రుస్వారీ చేసేవాడు. ఇప్పుడు పరివారంలోని వాళ్ళు అతణ్ణి మరింతగా పొగడసాగారు. అది యువరాజుకు నచ్చలేదు. ఈర్ష్యతో అతడి మనసు రగిలిపోసాగింది. ఒకసారి కోమలనాయకుడు, యువరాజుతో, ‘‘గుర్రాన్ని వేగంగా పరిగెత్తించడమే కాదు, నీకు మరికొన్ని ఒడుపులు కూడా నేర్పుతాను,'' అన్నాడు.

నీ దగ్గర నేర్చుకునే ఖర్మ నాకు పట్టలేదు. నాకు పోటీదార్లంటేగిట్టదు. ఇకపై నా కంటపడకు!'' అన్నాడు యువరాజు కోపంగా.

ఆ తర్వాత ఒక రోజున యువరాజు, తన పరివారం నుంచి వేరుపడి, అడవిలో చాలా దూరం వెళ్ళాడు. కోమలయువకుడు కొండ దేవతకు మొక్కుకుని, గుర్రం మీద వస్తూ యువరాజును పలకరించబోయాడు. కానీ, యువరాజు అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నాడు. అంతలో పొదలచాటు నుంచి, ఒక చిరుతపులి గాండ్రిస్తూ వాళ్ళకేసిదూకింది.

యువరాజు వెంటనే ఒరలోంచి కత్తిదూయ బోయాడు గాని, గుర్రంబెదిరి, అతడి స్వాధీనంతప్పి చెట్ల మధ్య అటూ ఇటూ పరిగెత్తసాగింది. చిరుతపులి దాన్ని వెంబడించింది. ఐతే, ఈ లోపల బెదిరిన తన గుర్రాన్ని, కోమలయువకుడు కళ్ళాలను బిగించి పట్టుకుని అదుపు చేసి, జీను నుంచి వేళ్ళాడుతున్న బళ్ళాన్నిలాగి గురిగా చిరుతపులి కేసివిసిరాడు. బళ్ళెం దానివెన్నులో దిగింది. చిరుతపులి పెద్దగా ఒకసారి గాండ్రించి కింద పడిగిలగిలా తన్నుకోసాగింది. యువరాజు వెను తిరిగి చూసి, జరిగిందే మిటో గ్రహించి, గుర్రాన్ని కోమలయువకుడి దగ్గరకు నడిపి, ‘‘నువ్వు గురప్రుస్వారీలో గొప్ప ఒడుపులు నేర్చినవాడివేకాదు, సమయస్ఫూర్తిని కూడా ఎరిగినవాడివి. నా ప్రాణంకాపాడావు, కృతజ్ఞుణ్ణి!'' అన్నాడు.

ఈ కథ చెప్పి పంతులుగారు, ‘‘చూశారా! యువరాజు, కోమలయువకుడి దగ్గర గురప్రుస్వారీలో మెళకువలు తెలుసుకుని వుంటే, చిరుతపులిని ఎదిరించడంలో విఫలుడయ్యేవాడు కాదు గదా! మనిషి ఆ జన్మాంతం విద్యార్థే. తెలియని విషయాలు, తెలిసినవాళ్ళను అడిగి తెలుసుకోవడం చిన్నతనంగా భావించకూడదు. మన ఈర్ష్య మనకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. మనం ఎదగాలంటే, మన పక్కన మనకంటే అన్ని విషయాల్లో ఉన్నతుడైనవాడుండాలి. పోటీతత్వం వున్నప్పుడే మనం పైకిరాగలం!'' అన్నాడు రాముడి ముఖకవళికలు గమనిస్తూ.

మర్నాడు రాముడు, పంతులుగారితో, ‘‘నాక్కూడా ప్రత్యేక పరీక్ష పెట్టి, పై తరగతికి పంపించండి. నేను కృష్ణుడితో పోటీపడి చదవాలనుకుంటున్నాను,'' అన్నాడు. రాముడిలో వచ్చిన మార్పుకు, పంతులుగారు ఎంతో సంతోషించాడు.

🕉️🌞🌎🏵️🌼🚩

Source - Whatsapp Message

మంచి మాట.. లు

ఆత్మీయ బంధు మిత్రులకు మంగళవారం శుభోదయ శుభాకాంక్షలు. మా ఇంటి దైవం శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో నా ఇష్టదైవం తిరుత్తని వల్లీ దేవసేన సమేతశ్రీ సుబ్రమణ్యస్వామి వారి అనుగ్రహం తో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ...మీ ఆత్మీయ బంధువు AVB 💐🤝
మంగళ వారం --: 27-04-2021

ఈ రోజు AVB మంచి మాట.. లు
జీవితంలో ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు ఉన్నన్ని రోజులు ఒకరికొకరు తోడుగా కలిసిమెలిసి సంతోషంగా బ్రతకడంలోనే ఉంది నిజమైన ఆనందం .

స్నేహం మనం కొనుక్కుంటే వచ్చేది కాదు ! అడుక్కుంటే వచ్చేది కాదు , స్వచ్ఛమైన నమ్మకంతో కూడిన తొలిపరిచయంతో ఏర్పడుతుంది ఆ సమయంలో రెండు గుర్తుండే విషయాలు తెలుస్తాయి ఒకటి జీవితాంతము తోడుండే స్నేహితులు , రెండు జీవితాంతము గుర్తుండే గుణపాఠాలు .

చూడడానికి చిక్కులుగా కనిపించిన ప్రయాణిస్తే సరైన మార్గంగా ఉంటుంది , జీవితం కూడా అంతే ఎన్నో సమస్యలతో కూడుకొని ఉన్నా అడుగు ముందుకు వేస్తే పరిష్కారం కచ్చితంగా దొరుకుతుంది .

సంతోషానికి పొంగకు దుఃఖానికి కుంగకు , కష్టానికి వంగకు , కన్నీళ్లకు కరగకు , భయానికి బెదరకు , బంధాలను మరువకు , అందరిని నమ్మకు , ఎవరికి లొంగకు , చివరికి విజయం నీదే .

అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది . తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది , కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది .

దయచేసి చేతులు శుభ్రంగా కడుక్కోండి ఎక్కువ సార్లు

మాస్క్ సక్రమముగా ముక్కు పూర్తి గా కవర్ అయ్యేలా ధరించండి

వాక్సిన్ వేయించుకోండి ఇమ్యూనిటీ పెంచుకోండి

అవసరం అయితే తప్ప అనవసరంగా బయటకు వెళ్ళకండి

ఇంట్లో ఉండండి క్షేమముగా ఉండండి

అందరు బాగుండాలి అందులో మనముండాలి

హనుమాన్ జయంతి శుభాకాంక్షలతో

సేకరణ ✒️మీ ...AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

నీతి వాక్యము

నీతి వాక్యము


ఒక ఊళ్లో భిక్షకుడు గుడి ముందు అడుక్కుంటూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఆ గుడికి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో చెట్టు కింద ఉంటుండేవాడు. ఒక భక్తుడు గుడికి వచ్చినప్పుడల్లా ఆ భిక్షకుడి పాత్రలో నాణేలు వేసేవాడు. అతణ్ని ఆప్యాయంగా పలకరించి పండో, ప్రసాదమో చేతిలో పెడుతుండేవాడు. అలా ఆ భక్తుడంటే భిక్షగాడికి ఒక గౌరవ భావం ఏర్పడింది.

కొన్నాళ్లకి ఆ భిక్షకుడికి బాగా జబ్బు చేసింది. తనకి చివరి క్షణాలు సమీపించాయని అతనికి అర్థమైంది. ఆ సమయంలో ఆ భక్తుడితో తన మనసులోని కోరిక విన్నవించుకున్నాడు. చనిపోయాక తనని ఆ చెట్టు కిందనే సమాధి చెయ్యాలని కోరాడు. దానికి ఆ భక్తుడు అంగీకరించాడు.

భిక్షకుడు కన్నుమూశాడు. భక్తుడు అతను చెప్పిన స్థలంలోనే గొయ్యి తవ్వాడు. ఆశ్చర్యం.. బంగారు నిధి బయటపడింది. అదతని సొంతమైంది.
ఏళ్ల తరబడి దైవ సన్నిధిలో భగవన్నామ స్మరణ చేస్తూ గడిపినందుకు ఆ భిక్షకుడు స్వర్గానికి వెళ్లాడు. భక్తుడికి బంగారు నిధి దొరికిన విషయం అక్కడ తెలిసింది. మొదట నిర్ఘాంతపోయాడు. తనని ప్రేమగా పలకరించే వ్యక్తికి అది దొరికినందుకు తర్వాత సంతోషించాడు. అయితే అతడిలో ఓ సందేహం.

‘‘జీవితాంతం నేను ఆ నిధి మీదే కూర్చున్నాను. కానీ, చివరి వరకూ భిక్షగాడిగానే ఉండిపోయాను. నాలుగు డబ్బులు దానం చేసిన ఆ భక్తుడు కోటీశ్వరుడయ్యాడు. ఏంటీ మాయ’’ ఇంద్రుణ్ని అడిగాడు ఆ యాచకుడు.
‘‘నీ జీవితమంతా భగవంతుడి సాన్నిధ్యంలో గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది. అయితే, నీ సమీపంలోనే ఉన్న నిధి గురించి నువ్వు తెలుసుకోలేకపోయావు. అతను రోజూ భగవత్సేవ చేస్తూ యథాశక్తి నీకు దానం చేశాడు. అందుకే అతణ్ని ఆ నిధి వరించింది. నిజానికీ చాలా మంది తమలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక ఇతరుల మీద ఆధారపడుతుంటారు. దానివల్ల పక్కవారు లాభం పొందుతుంటారు’’ సమాధానమిచ్చాడు ఇంద్రుడు. మౌనంగా తలదించుకున్నాడు ఆ యాచకుడు.

Source - Whatsapp Message

మంచి మాట.. లు

ఆత్మీయ బంధు మిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించండి కరోనాను సమర్థవంతంగా ఎదురుకుందాం.. AVB సుబ్బారావు 💐🤝🙏
సోమవారం --: 19-04-2021
ఈ రోజు AVB మంచి మాట.. లు
నీ జీవితం లో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయాలనీ చూడకు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ తిరిగి రాదూ .

జీవితం అంటే మనం చనిపోయేంతవరకూ బ్రతికి ఉండటం కాదు పది మంది మనసులలో పది కాలాల పాటు జీవించి ఉండటమే జీవితం .

కన్న వాళ్ళ మీద కొడుకుల కంటే కూతుర్లకే అనురాగం ఎక్కువ ఎందుకంటే కొడుకులు ఆస్తులు పంచుకుంటే కూతుర్లు మాత్రం అలా కాదు అనురాగాన్ని పంచి ఇస్తారు .

మనిషికి కాలం విలువ తెలుసు మనిషికి డబ్బు విలువ తెలుసు మనిషికి స్వేచ్ఛ విలువ తెలుసు మనిషికి బంధాల విలువ తెలుసు మనిషికి ప్రాణం విలువ తెలుసు , ఇవన్ని తెలిసిన మనిషికి ఇంకో మనిషి విలువ ఎందుకు తెలియడం లేదు ?

సంతోషం అనేది మనకు గొప్ప ఖజానా , ఈ ఖజానా సంపన్నంగా ఉన్న వారు భాగ్యవంతులు , ఏదో చేస్తేనే సంతోషం వస్తుంది అని బ్రమ పడకూడదు . మనం సంతోషంగా ఉండగలిగితే ఏదైనా సరే సాధిస్తామని అర్థం చేసుకోవాలి . మీరు సంతోషంగా ఉండంది మీ వద్దకు వచ్చిన వారికి కూడా సంతోషాన్ని పంచుతూ ఉండండి మనం ఎదంటి వారికి సంతోషాన్ని ఎంత పెంచుతామో అంత మీకు సంతోషం రెట్టింపు అవుతుంది . అందుకే ఎదుటి వారికి మనం సంతోషం పంచడమే అన్నింటికన్నా గొప్ప దాన గుణం

సేకరణ ✒️మీ .. AVB సుబ్బారావు 💐🤝🙏

Source - Whatsapp Message

మంచి మాటలు......

మనం చూసేదంతానిజం కాకపోవచ్చు,
అలా అని చూడనిది అబద్దమూ కాకపోవచ్చు,
చేతులతో తడిమి చూసి,
నిజం అనుకొన్నా బాగుంటుంది కానీ,
కళ్ళతో చూసి అదే నిజం అనుకుంటే,
ఈ మాజిక్ ప్రపంచంలో,
కేవలం ఒక ప్రేక్షకుడిగా ఉండిపోవాల్సి వస్తుంది..
అవును మన కళ్ళు,
మనల్ని మోసం చేస్తాయి,.
చేస్తునే ఉంటాయి..

పేపర్ బాయ్ లంతా,
"అబ్దుల్ కలాం" లు అవ్వలేరు!
పెట్రోలు పట్టినంత మాత్రానా,
"అంబానీ" లు అయిపోరు!!
"అనుకరణే" అతి పెద్ద ప్రమాదం?
"అంతఃప్రతిభే" నీకు అసలు ప్రమాణం..
మన కోసం "ఆస్తులు" సంపాదించుకోవడం కన్నా,
మన గురించి ఆలోచించే,
'ఆప్తులను" సంపాదించుకోవడం మిన్న..

Source - Whatsapp Message

మంచి మాట...లు

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః🙏
ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు, పూజ్య గురుదేవులు శంకరాచార్యుల వారు, గురు రాఘవేంద్ర స్వామి వారు బాబా వార్ల అనుగ్రహంతో మీకు మీ కుటుంబగసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కష్టాలు లేని మానవుడు ఎవరు లేరు కష్టాలు ఎదుర్కోవలసింది మనమే. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు. నువ్వే పోరాడాలని గుర్తు చేసుకో నేస్తమా.. మీ ఆత్మీయుడు AVB సుబ్బారావు 💐🤝🙏
గురువారం --: 15-04-2021 :-- ఈరోజు AVB మంచి మాట...లు

నా గురించి ఎవరూ ఏం అనుకున్న నేను నవ్వతునే ఉంటా నాకు నచ్చింది చేస్తా ఎవరినో మెప్పించేతా టైం కానీ వారికోసం నటించేంతా గొప్ప మనసు కాని నాకు లేదు

నీలో ఎన్ని లోపాలున్నా బలహీనతలున్నా నిన్ను నీవు ఎలా ప్రేమిస్తావో సమర్థించుకుంటావో అలానే ఎదుటి వారి లోపాలనూ బలహీనతలను అర్థం చేసుకుంటే అందరూ మంచిగానే కనిపిస్తారు ‌. అందరూ నీ వారవుతారు .

మనల్ని ఎవరు ఎంత హేలన చేసిన నీవు తోందరపడకు హేలన చేసిన వారితో సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది ఓర్పుతో ఉండు నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది .

ఒకరు మన పై ఎక్కువ కోపం చూపిస్తున్నారు అంటే వారికి మన పై ఎక్కువ ప్రేమ ఉంది అని అర్థం . ఆ కోపంలో మనంఎక్కడ దూరం అవూతామో అనే భయం ఉంటుంది . చీటికి మాటికి గొడవపడి అలిగే వాళ్ళ మనసు చాలా స్వచ్చంగా ఉంటుంది అర్థం చేసుకో అద్భుతంగా ఉంటుంది ఆ భందం .

సేకరణ ✒️మీ ...AVB సుబ్బారావు 💐🤝🙏
📞9985255805🇮🇳

Source - Whatsapp Message

మంచి మాటలు......

స్నేహం డబ్బులాంటిది,

సంపాదించడం కన్నా కాపాడుకోవటం కష్టం.

కష్టం అందరికీ శత్రువే,

కానీ

కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే,

సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.

కష్టం విలువ తెలిసినవారు ఎవరినీ కష్టపెట్టరు...

ఇష్టం విలువ తెలిసినవారు ఎవరిని వదిలిపెట్టరు...

అన్వేషించేది మనిషి

ఆకర్షించేది మనసు

అందనిది ఆకాశం

ఆగనది కాలం

అంతరించేది జీవితం

అనునిత్యం మనందరి తోడు ఉండేది మనం చేసిన మంచితనం.

చేస్తున్న పని పట్ల శ్రద్ధ కనబరిస్తే

అది పలువురి ప్రశంసలు పొందుతుంది.

ఫలితం బాగుంటుంది....."

ఏడుపు ముఖంతో ఇష్టం లేకుండా చేసేపనికి ఫలితం ఏడుస్తున్నట్లే ఉంటుంది

లభించిన వృత్తినే పరమ పవిత్రంగా భావించి

నిజాయితీతో పనిచేయాలి

ఆలోచనలెప్పుడూ నిర్మలంగా ఉండాలి.

ఎలాంటి పరిస్థితుల్లోనూ అదుపు తప్పకూడదు

స్వచ్ఛమైన ఆలోచనలతోనే మనిషి ఆదర్శప్రాయుడవుతాడు.

అందరి అభిమానం చూరగొంటాడు.


ఓటమి గురువులాంటిది.

ఏమి చెయ్యకూడదో ఎలా చెయ్యకూడదో అది నేర్పుతుంది....


" నీలో ఉన్న శక్తిని నీవు తెలుసుకున్నప్పుడే గమ్యం చేరగలవు.

కనుక

ముందు నీగురించి నీవు పరిశోధించుకో "


" నువ్వు ఎప్పుడూ భయపడలేదంటే...

లేదా ఇబ్బంది పడలేదంటే...

లేదా మనస్తాపానికి గురి కాలేదంటే...

నువ్వెన్నడూ అవకాశాల జోలికి పోవన్నమాట. "



Source - Whatsapp Message

అనంత పద్మనాభస్వామి దేవాలయ చరిత్ర..

అనంత పద్మనాభస్వామి దేవాలయ చరిత్ర.. భారతదేశం ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఇక్కడ శిల్పకళలకు కొదవలేదు. అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. నభూతో న భవిష్యత్ అనే విధంగా దేవాలయాలను నిర్మించారు. కొన్ని వేల సంవత్సరాలు చెక్కుచెదరకుండా దృఢంగా ఉన్నాయి. అంతేకాకుండా దేవాలయాలకు ఎంతో విశిష్టత కూడా ఉంది. కేవలం కట్టడాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచంలో పేరొందిన శాస్త్ర వేత్తలకు సైతం అంతు చిక్కని రహస్యాలతో అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి దేవాలయాలను నిర్మించారు మన పూర్వికులు.

దేవాలయాలు నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా వాటిలో అనంతమైన సంపదను కూడా కట్టుదిట్టమైన భద్రతతో అందులో పొందుపరిచారు. ఇప్పుడు మనం దానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకుందాం. అందులో భాగంగానే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అనంత పద్మనాభ స్వామి దేవాలయ రహస్యం గురించి తెలుసుకుందాం.

మొన్నటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా పేరుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న గదులను తెరిచిన తర్వాత అందులో బయటపడిన అనంత సంపదతో ఒక్కసారిగా అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా రికార్డులకెక్కింది. అంతేకాకుండా కేవలం సంపద విషయం లోనే కాకుండా గుడికి సంబంధించిన రహస్యాల విషయంలోనూ ప్రసిద్ధి కెక్కింది. దేవస్థానానికి సంబంధించిన చరిత్ర, దేవాలయం వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకుందాం.

హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీమహావిష్ణువు అవతరించిన 108 పవిత్ర క్షేత్రాల్లో ఒకటైన అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి సుమారు 5 వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. అత్యంత పురాతనమైన ఈ దేవాలయం విట్టల్ పిల్ల మార్ అనే ఎనిమిది కుటుంబాల హయాంలో నడుస్తూ వస్తోంది. ఆ తర్వాతి కాలంలో ట్రావెన్కోర్ సంస్థాన భక్తుడైన రాజు మార్తాండవర్మ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని 1729 సంవత్సరంలో పునరుద్ధరించారు.

ఆలయ నిర్మాణం:
శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 7000 మంది తాపీ పనివారు, 5000 మంది శిల్పకళ నిపుణులు, 800 ఏనుగు లను ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారని అప్పటి శాసనంలో పొందుపరిచారు. స్వామివారి ఆలయ విస్తీర్ణం సుమారు ఏడు ఎకరాల వరకు ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన టేకుతో బంగారు కవచంతో తయారు చేయబడిన దేవాలయ ధ్వజస్తంభం ఎత్తు సుమారు వంద అడుగుల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని మాత్రం 1566 సంవత్సరంలో నిర్మించారు.

అంతేకాకుండా ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అనంత పద్మనాభ స్వామి ఆలయం ముందున్న ద్వారం నుండి చూస్తే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ద్వారంలో ఉన్న రంధ్రాల నుండి సూర్యుడు స్పష్టంగా కనిపిస్తాడు. అంతేకాకుండా సూర్యుడు అస్తమిస్తుండడం దేవాలయం ద్వారం నుండి చూడటం మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మాటల్లో వర్ణించలేని విధంగా ఆ దృశ్యం మన కళ్ళకు కనిపిస్తుంది.

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో స్వామివారిని చూడాలంటే మూడు ద్వారాల నుండి చూడాలి. స్వామివారి మూలవిరాట్ విగ్రహాన్ని 1208 సాలగ్రామలతో తయారు చేశారు. మూలవిరాట్ ని చూడడానికి ఆదిశేషునిపై పవళించి ఉన్న స్వామి వారిని మొదటి ద్వారం నుండి చూస్తే తల భాగం కనిపిస్తుంది. మధ్య భాగం నుండి చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు కనిపిస్తుంది. మూడో ద్వారం నుండి చూస్తే పాద భాగం కనిపిస్తాయి. ఎంతో తేజోవంతమైన ఈ విగ్రహాన్ని దర్శించుకోవడం కొత్త అనుభూతిని కూడా కలిగిస్తుంది.

ఇవే కాకుండా స్వామివారి విగ్రహాన్ని ఎంతో ప్రత్యేకంగా తయారు చేశారని చెప్పుకోవచ్చు. అనంత పద్మనాభ స్వామి ఆలయం నుండి విగ్రహాన్ని రూపొందించడానికి వాడిన సాలగ్రామాలను నేపాల్ నుండి ప్రత్యేకంగా ఉరేగిస్తూ తీసుకొచ్చారు. అంతేకాకుండా ప్రతి సాలగ్రామాన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మిశ్రమంతో తయారు చేసిన పదార్థాలను ఉపయోగించారు. ఆ తయారు చేసిన ఆయుర్వేద మిశ్రమాన్ని అతకడానికి వాడారు.

అంతేకాకుండా క్రిమికీటకాల నుండి విగ్రహాన్ని కాపాడడానికి ఆయుర్వేద మిశ్రమాన్ని వాడినట్టు ఇక్కడివారు చెబుతుంటారు. అంతేకాకుండా పద్మనాభస్వామి విగ్రహం, ముఖం, చాతి మినహా మిగతా భాగాలు మొత్తం పూర్తిగా బంగారంతో చేయబడినవి. స్వామివారి విగ్రహాన్ని తయారు చేయడానికి వాడిన ఆయుర్వేద మిశ్రమం వెనక ఒక బలమైన కారణం ఉంది.

ముస్లిం రాజుల దండయాత్రలతో విగ్రహాం ధ్వంసం కాకుండా కాపాడుకోవడం కోసం, విగ్రహానికి ఎటువంటి హాని కలగకుండా ఆయుర్వేద మిశ్రమాలు వాడినట్లు ఇక్కడివారు చెబుతుంటారు. అంతేకాకుండా స్వామి కిరీటం, చెవులకున్న కుండలాలు, చాతిని అలంకరించిన భారీ సాలగ్రామాల మాల, శివుడి విగ్రహనికి ఉన్న కంకణం, కమలం పట్టుకున్న ఎడమ చేయి, నాభి నుండి బ్రహ్మదేవుడు ఉన్న కమలం తీగ వరకు, స్వామి పాదాలు కూడా అంతా బంగారంతో చేయబడినవి.

స్థల పురాణం:
అనంత పద్మనాభ స్వామి స్థల పురాణం గురించి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతూ ఉంటారు. అందులో ఒక స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం. పద్మనాభ స్వామి దేవాలయం ఎంతో విశిష్టత కలిగినది. దివాకర అనే ముని శ్రీ కృష్ణ భగవానుడి దర్శనం కోసం తపస్సు చేస్తుండగా మునిని కనుకరించడానికి శ్రీకృష్ణ భగవానుడు మారురూపంలో ఒక పిల్లవాడిగా ముని వద్దకు వచ్చాడు. ముని పూజలో ఉండగా ఆ బాలుడు ఒక సాలగ్రామాన్ని తీసుకొని మింగడంతో ముని పిల్లవాడిని వెళ్ళిపోమని ఆగ్రహిస్తాడు.

అప్పుడు పిల్లవాడు సమీపంలో ఉన్న ఒక చెట్టు వెనుక వెళ్లి దాక్కొని ఉంటాడు. ఆ సమయంలో ఆ చెట్టు విరిగి కింద పడి శ్రీమహావిష్ణువు విగ్రహంగా మారిపోతుంది. అంతేకాకుండా స్వామి వారు శయన భంగిమలో అనంతశయనం యోగనిద్ర మూర్తి తరహాలో కనిపిస్తాడు. స్వామివారి భారీ ఆకారాన్ని చూసి పూర్తిగా తనివితీరా దర్శించుకొలేక పోతున్నానని దివాకర ముని చింతిస్తాడు. దాంతో స్వామి వారిని దివాకర ముని వేడుకుంటాడు..

స్వామి మీ భారీ ఆకారన్ని నేను తనివితీరా చూడలేకపోతున్నాను.. దయచేసి మీ ఆకారంలో మూడో వంతుకు తగ్గండి అని ప్రాధేయపడతాడు. ముని విన్నపాన్ని ఆలకించిన శ్రీమహావిష్ణువు తన భారీ ఆకారాన్ని మూడోవంతుకు తగ్గిస్తాడు. అయితే నన్ను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు నన్ను మూడు ద్వారాల గుండా దర్శించుకోవాలని మునితో అంటాడు. ఇప్పుడున్న ఆ మూడు ద్వారాలు రావడానికి అదే కారణమని ఇక్కడ స్థలపురాణం చెబుతుంది. అంతేకాకుండా స్కంద, పద్మ పురాణాలలో ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి విశేషాలు ఉన్నాయి.

అనంత పద్మనాభస్వామి అనంత సంపంద:
పద్మనాభ స్వామి లక్ష కోట్లు ఎవరికి ...

పురాతన ఆలయాలన్నింటికీ అపారమైన సంపదలున్నాయి. ఆస్తులకు కొదవ లేదు. వేలాది ఎకరాల భూములు, నగదు ఉండటం మామూలే. అయితే అనంత పద్మనాభుడి ఆస్తులు ఇతర దేవాలయాలతో పోల్చదగినవి కాదు. తిరుమలేశుని సంపద కంటే ఎక్కువే. ఇటీవల దేవాలయంలోని నేలమాళిగలో బయట పడిన నిధులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనంత పద్మనాభుడి ఆలయంలో ధన కనక రాశులను భద్రపరిచే రహస్య భూ గృహాలు ఆరున్నాయి. వీటిలో దేవుడి సంపద కొంత దాగుందని ఒకప్పుడు కొందరికి, ఇప్పుడు అందరికీ తెలిసిన రహస్యం. ఈ సంపదను ఎప్పుడూ ఎవరూ లెక్కించిన ఆనవాళ్లు లేనట్లే. రాళ్లతో మూసివుండే ఈ గదుల్లో కొన్నింటిని తెరిచి దాదాపు 150 ఏళ్లు దాటిపోయింది.1860 లో కొన్ని గృహాలను ఏదో కారణం వల్ల మూసి వేశారు.

ఆలయ సంపద నిర్వహణలో అక్రమాలు నెలకొన్నాయని, వీటిని గాడిలో పెట్టాలని సుందర రాజన్ అనే న్యాయవాది 2011 లో, సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దేవాలయాన్ని నిర్వహించే ట్రస్టుకు, ఆస్తులు సంరక్షించే శక్తి సామర్థ్యాలు లేవని సుందర రాజన్ తన పిటీషన్లో ఆరోపించారు. అగ్నిమాపక దళం శాఖకు చెందిన ప్రభుత్వాధికారులను, పురావస్తు శాఖకు చెందిన అధికారులను, గర్భ గుడిలోని రహస్య గృహాలను తెరిచి తనిఖీ చేసి చూడాల్సిందిగా, వారికి కనిపించిన వస్తువులేంటి అని తేల్చాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

అంతకు ముందే, కేరళ హై కోర్టు, దేవాలయ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని ఇచ్చిన ఉత్తర్వును సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. కోర్టు ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించి సంపదను లెక్కించాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆలయ సంపద లెక్కింపు మొదలవడం, రోజు రోజుకూ అపార ధన, కనక రాశులు కోకొల్లలుగా బయటపడడం బయట పడ్డ విలువ తెలుసుకున్న కమిటీ సభ్యులు వారి ద్వారా యావత్ ప్రపంచం ఆశ్చర్య పోవడం విశేషం.

ఆ విధంగా ఆ నేల మాళిగలలోని అనంత సంపద వెలుగు చూసింది. ఇప్పటివరకు ఐదు నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనె అనంతమై సంపద బయట పడింది. ఇంకా ఆరో గది తెరవ వలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాల పెద్దది, అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉంచబడి ఉన్నదని తెలుస్తుంది. ఇప్పటికే బయట పడిన సంపదతో ప్రపంచంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు బయటపడిన సంపదలో బంగారం, వజ్రాబరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు. బస్తాలకొద్ది బంగారు వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు గొలుసులు బయల్పడ్డాయి.

అనంత పద్మనాభస్వామి దేవాలయ చరిత్ర

పదహారవ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణెలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లబ్య మయాయి. అంతే గాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నొ ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి. ఆలయంలో లభ్యమైన సంపద ఇన్ని లక్షల కోట్ల రూపాయలని, విదేశీ కరెన్సీలో ఇన్ని బిలియన్ల డాలర్లేనని చెప్పడం అవివేకం తప్ప మరేమీ కాదు. ఆ సంపదకున్న పురావస్తు ప్రాధాన్యతా దృష్టితో మాత్రమే దాన్ని చూస్తే, ఆ విలువ మరిన్ని రెట్లనడమే కాకుండా, బహుశా విలువ కట్టలేనిదని కూడా అనాల్సి వస్తుందేమో! విలువ కట్టడానికి, ఆ సంపదేమన్నా బహిరంగ మార్కెట్లో అమ్మే అంగడి సరుకు కాదు కదా! అందుకే కేరళ రాష్ట్ర ముఖ్య మంత్రి అంతులేని ఆ వింత సంపదంతా పద్మనాభుడిదేనని తేల్చి చెప్పారు.

అనంత పద్మనాభస్వామి అనంత సంపందపై సుప్రీం కోర్టు కమీటి :

దేవాలయ నేలమాళిగలకు సంబంధించి మొత్తం ఆరు ఖజానా గదులున్నాయి. గర్భ గుడి కింద వున్న ఆ గదులను తెరిచేందుకు న్యాయస్థానం, “ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్” గదులుగా వాటికి పేరు పెట్టారు. వీటిలో “ఎ, బి” గదులు గత 130 సంవత్సరాలలో ఎన్నడూ తెరవలేదు. “సి, డి, ఇ, ఎఫ్” లేబులున్న గదులు మాత్రం అప్పుడప్పుడూ తెరుస్తూనే వున్నారు. ఆ నాలుగు గదుల “సంరక్షకులు” గా వున్న ఇద్దరు దేవాలయ పూజారులు “పెరియ నంబి”, “తెక్కెడం నంబి” పర్యవేక్షణలో మాత్రమే అవి అప్పుడప్పుడూ తెరవడం జరుగుతోంది.

నిత్యం దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలకు భంగం వాటిల్లని రీతిలో మాత్రమే, “సి, డి, ఇ, ఎఫ్” లేబులున్న గదులు తెరవాల్సి వుంటుందని, అవి తెరవడానికుద్దేశించిన పని పూర్తైన తర్వాత తిరిగి యథావిధిగా మూసేసి వుంచాలని ఇటీవలి సుప్రీం కోర్టు ఉత్తర్వుల సారాంశం. ఇక “ఎ, బి” గదుల విషయానికొస్తే, వాటిల్లో నిక్షిప్తమై వున్న, నిధుల లెక్కింపు చేసి, రికార్డులలో నమోదు కార్యక్రమం పూర్తైన వెంటనే, వాటినీ మూసేసి వుంచాలని కూడా కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం, “ఎ” అని మార్కు చేసి వున్న గదిని తెరవడం, అందులోని నిక్షిప్తమై వున్న అపార సంపదను గుర్తించడం పూర్తైంది.

అంతుచిక్కని అనంత పద్మనాభస్వామి అరవ గది రహస్యం:
అరవ ఆలయ గదిలో ...

“బి” అని లేబుల్ వున్న అరవ గదికి నాగ బంధం వుందని, ఇనుప గోడలతో పటిష్టంగా గదిని నిర్మించారని, ఆ గదిని తెరిస్తే తీవ్ర అరిష్టం వాటిల్లే ప్రమాదముందని, గది లోపల నుంచి సముద్రం మధ్యలోకి మార్గముందని, తెరిచిన మరుక్షణంలోనే సముద్రంలోని నీరు కేరళ రాష్ట్రాన్ని ముంచేస్తుందని, రకరకాల అనుమానాలు అపోహలు వాస్తవానికి చేరువగా వుండే కొన్ని చారిత్రక సాక్ష్యాలు ప్రచారంలోకి వచ్చాయి. “ఎ” గదిని తెరవడానికి నియమించిన కమిటీ సభ్యుల్లో కొందరి అనారోగ్యం కలిగిందన్న వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో సుప్రీం కోర్టు నియమించిన సభ్యులను ఆ గదులను తెరువకూడాదని అదేశించింది.

సాధువుల వాదన:
సదువులు

ఆరో గది తెరిస్తే దేశానికి రాష్ట్రానికి చాలా అర్థాలు వస్తాయని, అంతేకాకుండా కేరళ రాష్ట్రం మొత్తం సముద్రంలో మునిగి పోతుందని వారు వాదిస్తున్నారు. అంతే కాకుండా ఆరవ గదిని ఎంతో ప్రసిద్ధి చెందిన తంత్రికులతో నాగబంధనం వేయించారని వారు చెబుతున్నారు. నాగబంధాన్ని చేధించడం అంత సులభం కాదని. ఆ గదిని తెరవడం కూడా అంత సాధ్యం కాదని సాధువుల అంటున్నారు. కేవలము నాగ శాస్త్రం, నాగబంధనం తెలిసిన వారు మాత్రమే శాస్త్ర ప్రకారంగా ఆ గదిని తెరువగలరని సాధువులు అంటుంన్నారు. వారు తప్ప మిగతా వారెవ్వరూ ఆ గదిని తెరువలేరని సాధువులు వెల్లడిస్తున్నారు. అలా కాదని ఆ గదిని ధరిస్తే వినాశనం తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు. నాగసాధువుల మాటల్లో ఎంత వరకు నిజం ఉందో! అబద్ధమో ఉందో ! కాలమే సమాధానం చెప్పాలి.

దేవాలయ చరిత్ర

ఇక ఈ దేవాలయమే కాకుండా మన భారతదేశంలో ఇలాంటివి కొన్ని వేల ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో అంతుచిక్కని రహస్యాలు, అంతులేని సంపదలు దాగి ఉండవచ్చని పురావస్తుశాఖ వారు అభిప్రాయపడుతున్నారు. కేవలం సంపద విషయం మాత్రమే కాకుండా.. ఆలయ నిర్మాణాలు వాటిపై ప్రత్యేకతలు, విశిష్టతలు రహస్యాలు ఇప్పటి శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని విధంగా నిర్మింపజేశారు అని కూడా మనం చెప్పుకోవచ్చు.

అంతటి మేధో సంపత్తితో మన భారత శిల్పులు దేవాలయాలను నిర్మింపజేశారు. ప్రపంచనికి జ్ఞానం పరిచయం చేసింది మన భారతదేశం అని ఇప్పుడు వెలుగు చూస్తున్న సంఘటనలే నిదర్శనం. ఎటువంటి పరిజ్ఞానం లేకుండానే మన భారతీయులు మన శాస్త్రజ్ఞులు పూర్వ కాలంలోనే ఎన్నో విషయాలను కనిపెట్టారు. అంతటి గొప్ప దేశం మన భారత దేశం.
🙏🙏🙏
🌻🌻🌹🌹🌻🌻

Source - Whatsapp Message

ఎరుకతో ధ్యానం

🌸ఎరుకతో ధ్యానం🌸

మనిషి ఉనికి ఆత్మశక్తిపై ఆధారపడి ఉంది. అది ఉన్నందుకే ‘నేను ఉన్నాను’ అని మనిషి భావించగలుగుతున్నాడు ఇతరులతో ఉన్నప్పుడు ‘నేను’ అనే మాట పలుకుతాడు. సర్వకార్యాలు నిర్వర్తించగలుగుతాడు.

‘విలువలతో చక్కగా జీవించే మనిషికి ఉనికి మొదటిస్థానం, హృదయం రెండోస్థానం, మనసు మూడోస్థానంలో ఉంటాయి’ అని ప్రసిద్ధ తత్వవేత్త ఓషో అనేవారు.

హృదయం స్పందిస్తుంది. మనసు ప్రతిస్పందిస్తుంది. ఉనికి గమనిస్తుంది. కేవలం ‘గమనించడం’ మాత్రమే తెలిసిన ఏకైక గుణం ఉనికిది. ‘గమనించడం’ అంటే చూడటమే! కాని, చూడటంకన్నా ‘గమనించడం’ ఉన్నతమైంది. ‘గమనించడంలో- చూడటం, వినడం రెండూ ఉంటాయి’ అని అనేవారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి!

పశుపక్ష్యాదులు ఎప్పుడూ గమనింపుతో జీవిస్తాయి. అందుకనే అవి ఎరుకతో ఉంటాయి. ఫలితంగా, రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. ఎన్నో తెలివితేటలున్న మనిషి మాత్రం ప్రమాదాల బారిన పడుతుంటాడు. కారణం, అనవసరమైన ఆలోచనల వలలో అతడు చిక్కుకోవడంవల్లే! అంటే, పరధ్యానంలో పడటమన్నమాట.

ప్రస్తుత క్షణాల్లో ఉండకుండా గతానికి సంబంధించిన ఆలోచనలతో గడపడమే పరధ్యానమంటే! మనిషి పరధ్యానంలో ఉంటే ఎరుక తప్పుతాడు. అప్పుడు సమస్యలు కాకుల్లా వచ్చి అతడిపై వాలతాయి. మనిషి ఆలోచనలతో ఉన్నంతవరకు, మనసు బయట సంచరిస్తూ ఉంటుంది. అదే మనిషి ఒక పనిలో నిమగ్నమైతే ఆ వెంటనే మనసు నిశ్చలమవుతుంది. అప్పుడది లోపలికి చూస్తుంది. చేపట్టిన పనికి కావాల్సిన జ్ఞానం అంతశ్చేతనలో నుంచి తీసి ఇస్తుంది.

మనసు సముద్రగర్భం వంటిది. సముద్రం లోపల అప్పుడప్పుడూ హిమ ఖండాలు(ఐస్‌బర్గ్స్‌) తయారవుతాయి. అవి పర్వతాల్లా పరచుకొని పెరుగుతాయి. పైకిమాత్రం కొనతేలి చిన్న మంచుముక్కలా కనబడతాయి. వాటిని సరిగ్గా గమనించకపోతే సముద్ర ప్రయాణికులు ఆపదల్లో చిక్కుకున్నట్లే! మనిషికి వచ్చే వ్యాధులూ హిమ ఖండాల్లా మనసు లోతుల్లో ప్రాణం పోసుకుంటాయి. తదుపరి మనసులోపలే పర్వతాల్లా పెద్దగా అవుతాయి. ఆ తరవాత శరీరాన్ని తాకుతాయి. అంటే, ముదిరిన తరవాత వ్యాధి బయటపడటమన్న మాట! అప్పుడుగాని మనిషి తనకు జబ్బు చేసిందని గ్రహించడు. ఇలా ఎందుకు జరుగుతుంది? మానసిక స్థిరత్వం లేకపోవడం వల్లే! ఎప్పుడైతే మనసు నిలకడగా ఉండదో అప్పుడు ఎరుక ఉండదు. ఎరుక లేనప్పుడు తన ఉనికిపట్ల స్పృహ ఉండదు. అంటే తనతోతాను ఉండనప్పుడు, తన శరీరం లోపల ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండటం అన్నమాట!

రాత్రిపూట ఇంట్లో హఠాత్తుగా దీపాలు ఆరిపోతే ఏమవుతుంది? ఆ చిమ్మచీకట్లో ఎవరికీ ఏమీ కనపడదు. అప్పటివరకూ ఏవేవో పనులు చేసుకుంటున్న మనసు ఆ క్షణంలో నిశ్శబ్ధమై పోతుంది. అప్పుడు మనిషి ఉనికి అతడి స్పృహలోకి వస్తుంది. ఎరుక మేల్కొంటుంది. చీకట్లో కొవ్వొత్తి కోసం చేసే వెతుకులాటలో గమనింపు సహకరిస్తుంది. ఇదంతా ధ్యానమే! అందువల్లే ‘ధ్యాన సాధనలో గమనించడమే ప్రధానం’ అంటారు తత్వవేత్తలు!

మనిషి ఏ పనిచేసినా, చివరలో ఒక ఫలితం కచ్చితంగా వస్తుంది. అది ప్రకృతి సూత్రం! ఒక అంకురం మట్టిలో నాటితే అది పెరిగి పెద్దదవుతుంది. పువ్వులు, ఫలాలు ఇస్తుంది. కనీసం రెండు ఆకులైనా ఇస్తుంది. ఏదీ ఇవ్వలేదంటే అసలక్కడ మొక్కే నాటలేదు, లేదా నాటిన మొక్కను బాగా చూసుకోలేదని నిర్ధారించుకోవచ్చు.

ధ్యానసాధనలో సాధకుడు కరుణామూర్తిగా మారాలి. ప్రేమికుడై పోవాలి. ఆనందపరవశుడు కావాలి. కొత్తగా నాటిన మొక్కకు పువ్వు పూసినట్లుగా, ధ్యానం చేసేవారికి ఒకరోజు ప్రేమ వికసించాలి. అలా జరగకపోతే ధ్యానంలో ఏదో లోపం ఉందని భావించాలి. గమనింపు- రెప్పలేని ‘కన్ను’ లాంటిది. మనసు- ఆ కంటికి ‘రెప్ప’వంటిది. రెప్ప తెరిస్తేనే చూడటం ఆరంభమవుతుంది. అప్పుడు ‘ఆనందం’ మనిషి సొంతమవుతుంది.

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

మన ధైర్యమే మనకు రక్షణ

🙈మన ధైర్యమే మనకు రక్షణ🙉

✍️ మురళీ మోహన్

👌👌ప్రతీ ఒక్కరికీ కరోనా ఉండే ఉంటుంది అనుకుంటున్న తరుణంలో.. అమెరికా శాస్త్రవేత్తలు ఒక మరణశిక్ష పడిన నేరస్తుని శరీరం మీద పరిశోధనలు చేయాలని తలచారు. సదరు వ్యక్తి తనను ఉరి తీయడానికి బదులుగా త్రాచు పాము కాటుతో చంపాలని కోరాడు. అతని కోరిక మేరకు పెద్ద త్రాచు పాముని తెప్పించారు అతని ఎదురుగా పామును ఉంచి కళ్ళకు గట్టిగా గంతలు కట్టారు. ఆ తరవాత అతనిని పాము కాటుకు గురిచేయలేదు. డానికి బదులుగా ఒక పరిశుభ్రమైన సూదితో అతని శరీరంపై గుచ్చారు. ఆశ్చర్యకరంగా సూది గుచ్చిన రెండు సెకండ్లకే అతను మరణించాడు.

అతని శవపరీక్ష ( post- martem report) పరిశీలించగా ఆతని శరీరంలో పాముకాటు విషం అన్నట్లు తేలింది. డాక్టర్లకు.. శాస్త్రవేత్తలకు ఆ విషం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు ఆశ్చర్యానికి లోనయ్యారు. పరిశోధనలో వెల్లడైన విషయం ఏమిటంటే ఆ విషం ఆతని శరీరం నుండే ఉత్పత్తి అయింది. అదెలా సాధ్యం!? విషం శరీరంలోకి ఎలా ప్రవేశించింది అని పరిశీలించగా ఆతని శరీరం పాముకాటు అనే మానసిక ఒత్తిడికి గురి కావడంతో అతని శరీరంలోని హార్మోన్లు నుండి ఈ విషం ఉత్పత్తి అయినట్లు తేలింది.

ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే మన మానసిక స్థితి మీదే అంతా అధారపడి ఉంటుంది. మనం మంచి జరుగుతుందని ఆలోచిస్తే మంచే జరుగుతుంది! చెడు జరుగుతుందని ఆలోచిస్తే చెడే జరుగుతుంది. ధృఢమైన సానుకూల దృక్పథంతో మనం ఉంటే మన జబ్బును తగ్గించే 90% శక్తిని మన శరీరంలోని హార్మోనులే ఉత్పత్తి చేస్తాయి. మనకు జబ్బు నయం కాలేదు అంటే దానికి కారణం మన మనస్సులో కలిగే అపసవ్య ఆలోచనలే! ఇప్పుడు మనిషి తనకు తానే తప్పుడు/వ్యతిరేక
ఆలోచనలతో తన శక్తిని బూడిదపాలు చేసుకుంటున్నాడు. దీన్నిబట్టి మనం ప్రధాన విషయం ఏమిటంటే కరోనా ఆలోచనలు మన హృదయానికి చేరనీయకూడదు!. పసి పిల్లల నుంచి పెద్దల దాకా కరోనా సమయంలో ఇలాంటి వ్యతిరేక ఆలోచనలతోనే ఉన్నారు, అనవసర భయాందోళనలతో దాదాపుగా అందరూ ఉన్నారు. పొరబాటున కూడా గణాంకాల జోలికి పోవద్దు. కరోనా కారణంగా చనిపోయిన వారు కేవలం కరోనా వల్ల కాదు.. వారికి ఉన్న ఇతర వ్యాధుల వల్ల కూడా అన్న సంగతి గుర్తెరగాలి! ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎవ్వరూ ఇంటి దగ్గర చనిపోలేదు.. హాస్పిటల్ లో మాత్రమే చనిపోయారు! అంటే హాస్పిటల్ వాతావరణం సృష్టించే ప్రతికూల ప్రభావం మనస్సును పాడు చెయ్యడం వల్లనే! కాబట్టి సానుకూల దృక్పథంతో ఉండండి మంచి ఆలోచనలు మాత్రమే చేయండి

1) కరోనా పట్ల మనకున్న అవగాహన చాలు. ఇంకా కరోనాకు సంబంధించి వార్తలు వినవద్దు.. చూడవద్దు.
2) మరింత సమాచారం కోసం అన్వేషణ తక్షణం ఆపేయండి! ఎందుకంటె ఇది మీ మానసిక స్థైర్యాన్ని బలహీన పరుస్తోంది.
3) కరోనా వైరస్ కు సంబంధించిన సలహాలు ఇతరులకు ఇవ్వొద్దు! ఎందుకంటే అందరి మానసిక సామర్థ్యం ఒకేలా ఉండదు. మీ మాటల వల్ల కొందరు డిప్రెషన్ కు లోనవుతారు!
4) సంగీతాన్ని ఆస్వాదించండి. భక్తి గీతాలు వినండి. పిల్లలతో, కుటుంబ సభ్యులతో కలసి హాయిగా గడపండి.
5) తరచూ చేతులు కడగండి కొత్త వ్యక్తులు వస్తే కనీసం మీటరు దూరంలో ఉండి మాట్లాడండి.
6)వైరస్ గురించి అతిగా భయపడే నీలోని ఆలోచనలు వైరస్ మీద పోరాడే నీలోని శక్తినీ, హార్మోన్లను నిర్వీర్యం చేస్తాయి. శారీరకంగా మానసికంగా నీలో ఉన్న శక్తిని
ఇలాంటి ఆలోచనలు దహించి వేస్తాయి.
7) అత్యావశ్యకమైనది, ముఖ్యమైనది ఏమిటంటే ఈ కరోనా మహమ్మారి నుంచి మనం త్వరలోనే బయట పడుతున్నాం.. మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి.

🙏🙏🏻🙏🏻🙏🏻

Source - Whatsapp Message

Monday, April 26, 2021

కొడుకులు మాత్రం 5 రకాలుగా ఉంటారు అని మన ధర్మ శాస్త్రాలు చెప్తున్నాయి.

పుత్రుడు...

ప్రతి తండ్రీ తన కొడుకుని ప్రేమగానే చూసుకుంటాడు.. కాని ఆ కొడుకులు మాత్రం 5 రకాలుగా ఉంటారు అని మన ధర్మ శాస్త్రాలు చెప్తున్నాయి.

1. #శత్రుపుత్రుడు :-

ఇతడు చిన్నతనం నుంచి తండ్రి చేసే ప్రతి పనికి వ్యతిరేకిస్తూ, ఏ పనితోను తండ్రికి ఆనందం కలిగించక పోవడమే కాక తండ్రి మరణించే వరకు ప్రతి పనితోను తండ్రిని భాదిస్తూనే ఉంటాడు.

గత జన్మలలో ప్రబలమైన శత్రుత్వం కలవాడే ఈ జన్మలో శత్రు పుత్రుడిగా జన్మిస్తాడు.

2. #మిత్ర
పుత్రుడు :-

ఇతడు చిన్నతనం నుంచి తండ్రితో ఒక స్నేహితుని వలె సంబంధాన్ని కొనసాగిస్తాడు.. కాని ఒక పుత్రుడు తండ్రికి ఇచ్చే ఏ సంతోషాన్ని అతడు తండ్రికి ఇవ్వలేడు.

గత జన్మలలో ఆప్త మిత్రుడు ఐనవాడే ఈ జన్మలో మిత్ర పుత్రుడుగా జన్మిస్తాడు.

3. #సేవకపుత్రుడు :-

ఇతడు అన్ని విషయాలలోనూ రాణిoచక పోయినా తండ్రి చెప్పిన మాటని తు.చ. తప్పకుండా పాటిస్తాడు. తండ్రి చేయవలసిన పనులను కూడా ఇతడు చేస్తూ ఉంటాడు. తండ్రికి కేవలం సేవ చేయడానికి మాత్రమే జన్మిస్తాడు.

పూర్వ జన్మలలో సేవకుడిగా ఉండి యజమాని నుండి పొందిన లబ్ధికి కృతజ్ఞత పూర్వకంగా తన జీవితాంతం ఉండి ఈ జన్మలో సేవక పుత్రుడు గా జన్మిస్తాడు.

4. #కర్మ
పుత్రుడు :-

ఇతడు కేవలం ఒక కొడుకుగా తండ్రికి చేయవలసిన కర్మ కొరకు మాత్రమే జన్మిస్తాడు. చిన్నతనం నుంచి తండ్రికి దూరం గానే ఉంటాడు. అప్పుడప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో తండ్రికి దూరం గానే ఉంటాడు. కేవలం అంత్యేష్టి కొరకు మాత్రమే జన్మిస్తాడు.

ఇతడిని కర్మ పుత్రుడు అంటారు.

5. #నిజ_పుత్రుడు :-

ఇతడు పుట్టిన దగ్గరనుంచి తన ప్రతి పని తోటి తండ్రిని ఆనందింపచేస్తూ తండ్రికి అభేదంగా ఉంటాడు .ఇతడిని విడిచి తండ్రి క్షణకాలం కూడా బ్రతుకలేడు. చివరికి తన అంత్యకాలము నందు కూడా తన కొడుకు చేతిలోనే సంతోషంగా ఏ భాధ లేకుండా అనాయాసమైన మరణాన్ని తన తనయుడి
ఒడిలోనే పొందుతాడు. మర్చిపోకుండా మాసికం పెడతాడు. తప్పకుండా తద్దినం పెడతాడు., గయ లో శ్రార్ధం పెడతాడు. తండ్రికి పుణ్యలోకాలు కలిగేల చేస్తాడు. ప్రతి క్షణం ప్రతి పనిలోనూ తన తండ్రినే స్మరిస్తాడు. అరమరికలు లేకుండా తండ్రి పోలికల తోటే ఉండి తండ్రి లాగే ప్రవర్తిస్థూ తండ్రి కోసమే బ్రతుకుతాడు.

ఇతడిని మాత్రమే శాస్త్రాలు నిజ పుత్రుడు అన్నాయి..

సర్వేజనా సుఖినోభవంతు...

🌹🌹🌹 🙏🙏🙏🙏🌹🌹🌹

Source - Whatsapp Message

పిడికెడు ఉప్పు

🤘 పిడికెడు ఉప్పు🍁

✍️ మురళీ మోహన్

"స్వామీజీ...
నా జీవితమంతా కష్టాలే.
ఈ జీవితాన్ని భరింoచలేకపోతున్నాను.
దయచేసి నా కష్టాలు తీరే మార్గo చెప్పండి."

గురువు ఆ యువకుడి వైపు చూశాడు.

ఒక గ్లాసు నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేయమన్నాడు.
యువకుడు అలాగే చేశాడు.

"తాగు"

యువకుడు గ్లాసు పైకెత్తాడు. నీటిని తాగాడు.
వెంటనే ఉమ్మేశాడు...

"అబ్బ... భరిoచలేని ఉప్పు...."

ఇంకో పిడికెడు ఉప్పు తీసుకుని ఆ యువకుడిని చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు గురువు.

"ఈ ఉప్పు ఈ చెరువులో వెయ్యి. ఈ నీటిని తాగు"

యువకుడు చెరువు నీటిని గడగడా తాగేశాడు.

"ఎలా ఉంది?"

"నీరు తీయగా ఉంది"

"అదే పిడికెడు ఉప్పు. అప్పుడెందుకు భరించలేకపోయావు.
ఇప్పుడెలా భరించావు?"

అది తక్కువ నీరు.
గ్లాసుడు నీరు.
అందుకే ఉప్పగా ఉంది.
ఇది చెరువు.
అంటే ఎక్కువ నీరు...
అందుకే ఉప్పదనం లేదు."
అన్నాడు యువకుడు.

"నాయనా...
సమస్యలు పిడికెడు ఉప్పు లాంటివి.
అది గ్లాసులోనూ పిడికెడే.
చెరువులోనూ పిడికెడే.
కానీ నీ జీవితం గ్లాసులా ఉండాలా...
చెరువులా ఉండాలా అన్నది మాత్రం నువ్వే నిర్ణయించుకోవాలి.
నీ పరిధి పెరిగితే పిడికెడు ఉప్పు తక్కువవుతుంది.
నీ పరిధి సంకుచితమైతే పిడికెడు ఉప్పు భరించలేనంత అవుతుంది"
అన్నాడు గురువు. 👍

Source - Whatsapp Message

ఇంట్లో ఉండటం భాధ అనిపిస్తుందా మనం ఇష్టపడే వారితో ఇంట్లోనే ఉండాల్సిరావడాన్ని లాక్డౌన్ గా పరిగణించవద్దు

ఇంట్లో ఉండటం భాధ అనిపిస్తుందా మనం ఇష్టపడే వారితో ఇంట్లోనే ఉండాల్సిరావడాన్ని లాక్డౌన్ గా పరిగణించవద్దు.

తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిపాలైతే తప్ప ఒంటరితనాన్ని భరిస్తున్నట్టు కాదు.

ఇంటి బయటకు వెళ్లలేకపోతున్నామని, ఏమీ తోచట్లేదని, విసుగ్గా ఉందని చెప్పడం మానండి; ఆసుపత్రిపాలైన వారంతా ఇంటికెప్పుడు వెళదామా అని ఎదురు చూస్తున్నారు!

కాబట్టి, మీరు ఇంట్లో ఉండవలసి వస్తే దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి, ఏదేమైనా, డబ్బున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, మీరు ఉండగలిగే అన్ని చోట్లలోకెల్లా ఉత్తమమైన ప్రదేశం మీ ఇల్లే. మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమించే వారే!

మీరు బస చేసేందుకు అద్భుతమైన ప్రదేశంగా మీ ఇంటిని మలచుకోడానికి ఇదే సమయం.

ఏదేమైనా, మీరెదుర్కొంటున్న పరిస్థితిని విభిన్న దృక్కోణంతో చూడండి!!

మీ ఇంటిని సంబరాలకు నిలయంగా చేసుకోండి: సంగీతం వినండి, పాడండి, నృత్యం చేయండి......

మీ ఇంటిని దేవాలయంగా చేయండి ప్రార్థించండి, ధ్యానించండి, కోరుకోండి, కృతజ్ఞత చూపండి, ప్రశంసించండి, విజ్ఞప్తి చేయండి ...

మీ ఇంటిని పాఠశాలగా మార్చండి: చదవండి, రాయండి, గీయండి, చిత్రలేఖనం చేయండి, అధ్యయనం చేయండి, నేర్చుకోండి, నేర్పండి ...

మీ ఇంటిని వాణిజ్యకేంద్రంగా మార్చివేయండి: శుభ్రపరచండి, పద్ధతిగా ఒద్దికగా ఉంచండి, అలంకరించండి, చిట్టా వ్రాయండి,అనవసరమైన వస్తువులను & ఆలోచనలను , తరలించండి, తొలగించండి ,మీకు అధికమైనవి దానం చేయండి ...

మీ ఇంటిని రెస్టారెంట్ గా మార్చేయండి: వండండి, తినండి, వంటకాలను సృష్టించే ప్రయత్నం చేయండి, సుగంధ ద్రవ్యాలనిచ్చే మొక్కలను పెంచండి, మొక్కలను నాటి తోటను పెంచండి...

ఏమైనా సరే...
"మీ ఇంటిని, కుటుంబాన్ని - ప్రేమపూరితమైన వాతావరణంలో ఉంచండి".

*జీవితకాలంలో అరుదుగా లభించే ఈ అవకాశాన్ని అత్యుత్తమంగా ఉపయోగించుకోండి ....

మానస సరోవరం

Source - Whatsapp Message

విజేత అంటే... అందరికంటే ముందుగా లక్ష్యాన్ని చేరుకున్నవాడు.

విజేత అంటే... అందరికంటే ముందుగా లక్ష్యాన్ని చేరుకున్నవాడు. అందరికంటే ముందుగా చేరు కున్నాడంటే... అందరికంటే ముందుగా సాధన ప్రారంభించి ఉంటాడు. అందరికంటే ముందుగా ప్రారంభించాడంటే, అందరికంటే ముందే లక్ష్యం గురించి ఆలోచించి ఉంటాడు. అందరికంటే ముందే ఆలోచించాలంటే, అందరికంటే ముందే నిద్రలేవాలి. అంటే, "ది ఫైవ్ ఏఎమ్ క్లబ్ లో సభ్యులు కావాలి. రాబిన్‌ శర్మ తాజా పుస్తక సారాంశం ఇదే.
〰〰〰〰〰〰〰〰
1. పొద్దున్నే నిద్రలేవడం బ్రహ్మవిద్యేం కాదు. మనల్ని మనం కష్టపెట్టుకోవడం అంతకన్నా కాదు. దేనికైనా ప్రారంభం, ముగింపు అనేవి ఉంటాయి. ఏ ఏడింటికో, ఎనిమిదింటితో రోజు మొదలు కాదు. మన పెద్దలు బ్రాహ్మీ ముహూర్తమని చెప్పిన సమయం నుంచే... అంటే తెల్లవారుజామున ఆ రోజు ఆరంభం అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడు మెల్కొన్నా ' లేట్ అటెండెన్స్' కిందే లెక్క. ఆలస్యంగా వచ్చిన విద్యార్థికి పాఠమూ ఆలస్యంగానే అర్థం అవుతుంది. మార్కులు కూడా అంతంతమాత్రంగానే వస్తాయి. ముందుగా బడికి వచ్చిన విద్యార్థి ఎప్పుడూ ముందే ఉంటాడు. కాబట్టి, జీవిత పాఠశాలలో 'లాస్ట్ బెంచ్ ఫెలో' అని పించుకోకూడదంటే, తెల్లవారు జామున మేల్కొనాల్సిందే.
2. సమాజంలో ఐదుశాతం మంది... విజేతలూ నాయకులూ. మిగిలిన తొంభై అయిదు శాతమూ అనుచరులూ పరాజితులే. ఆ ఐదుశాతం మందిని పరిశీలిస్తే... వాళ్ల దినచర్య తెల్లవారు జామునే మొదలవుతుంది. అంతా నిద్రపోతున్న వేళలో వాళ్లు మేల్కొంటారు. అంతా కలలు కంటున్న సమయంలో వాళ్లు కలల్ని నిజం చేసుకోవడం గురించి ఆలోచి స్తారు. అంతా పరుగు ప్రారంభించే సమయానికే వాళ్లు గమ్యాన్ని చేరుకుంటారు. ఓ గంట ముందు లేస్తే పోయేదేం లేదు.... బద్దకం తప్ప !
3. ప్రమోషన్లు వచ్చేవరకో, సొంతిల్లు కొనేవరకో, కోటి రూపాయలు సంపాదించే వరకో.... మీ ఆనందాన్ని వాయిదా వేసుకోకండి. గమ్యం వైపుగా సాగించే ప్రయాణంలో ప్రతి నిమి షాన్నీ ఆస్వాదించండి, ఆనందించండి.
4. ఎవరో పిలిచి కిరీటం పెట్టినప్పుడు మాత్రమే ... మన శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శించాలనే పిచ్చి నిర్ణయానికి కట్టుబడిపోయి.. మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం వాయిదా వేయకండి. ప్రపంచం గుర్తించిన తర్వాత మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కాదు, మిమ్మల్ని మీరు నిరూపించుకున్నాకే ప్రపంచం గుర్తిస్తుంది..
5. వికాసానికి ఓ ముగింపు అంటూ లేదు. ఓ శిఖరాన్ని చేరుకోగానే పర్వతారోహణ పూర్తయి పోదు. అంతకంటే ఎత్తయిన మరో పర్వతం మీకోసం సిద్ధంగా ఉంటుంది. నన్ను అధిరో హించమంటూ సవాలు విసురుతుంది. జిజ్ఞాసి నిత్య విద్యార్థి. నిరంతర యాత్రికుడు.
పేదరికానికి కారణం... చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, మనసును *చుట్టుముట్టిన భావ దారిద్ర్యం. కాబట్టి, ఎంత తొందరగా నిద్ర మేల్కొంటే, అంత తొందరగా ప్రపంచాన్ని ఏలుకుంటావు.

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

Sunday, April 25, 2021

ఉద్యోగంలో విజయానికి భగవద్గీత చెప్పే 7 పాఠాలు!!

ఉద్యోగంలో విజయానికి భగవద్గీత చెప్పే 7 పాఠాలు!! 🕉️🌞🌎🏵️🌼🚩

భగవద్గీత! ఐదు వేల సంవత్సరాల నుంచి లోకాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ప్రపంచం ఎంతగా మారినా, మనిషి జీవితం ఎంత మారినా... భగవద్గీత ఇప్పటికీ మనకి దారి చూపిస్తూనే ఉంది. పుట్టుక దగ్గర నుంచీ చావు దాకా, నాయకత్వం దగ్గర నుంచీ యుద్ధం దాకా ప్రతి రంగానికీ ఉపయోగపడుతోంది. అలాంటి భగవద్గీత మన రోజువారీ ఉద్యోగాలలో ఏమన్నా ఉపయోగపడుతోందా అంటే లేకేం...

అర్జునుడు తన ఆయుధాలన్నింటినీ పడేయడంతో భగవద్గీత మొదలవుతుంది. యుద్ధంలో ఎటుచూసినా తనవారే కనిపిస్తున్నారనీ, వారితో తను యుద్ధం చేయలేననీ అర్జునుడు బాధపడతాడు. అప్పుడు కృష్ణుడు అనవసరమైన విషయాల గురించి బాధపడి, పిరికితనానికి లోనుకావద్దని మందలిస్తాడు. ఒక రాజుగా తన కర్తవ్యాన్ని పాలించడమే ధర్మమని బోధిస్తాడు. ఈ సూత్రం ఉద్యోగానికి కూడా ఉపయోగపడుతుంది. తనచుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో, వాళ్లకి ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచనలతో భయంభయంగా ప్రవర్తించకూడదు. ఒక ఉద్యోగిగా మన బాధ్యతలని నూటికి నూరుపాళ్లూ నిర్వర్తించాలి. ఎలాంటి భయమూ, మొహమాటమూ లేకుండా ధర్మాన్ని పాటించాలి. ఆ నిక్కచ్చితనం లేకపోతే ఉద్యోగికీ, సంస్థకీ కూడా నష్టం తప్పదు.

మన బాధ్యతని పాటిస్తాం సరే! మరి ఆ పనికి తగ్గ ఫలితం రాకపోతే ఎలా? అన్న బాధ ఎవరికైనా తప్పదు. ‘పనిని సక్రమంగా చేయడం వరకే మన బాధ్యత, ఫలితం మన చేతుల్లో ఉండదు’ అన్నది గీతలో ప్రముఖంగా వినిపించే మాట. ఫలితం ఒకోసారి వెంటనే వస్తుంది, ఒకోసారి చాలా... చాలా ఆలస్యంగా పలకరిస్తుంది. మనవైపు నుంచీ ఎలాంటి లోపమూ లేకుండా, నూటికి నూరుపాళ్లూ ప్రయత్నిస్తే... ఎప్పటికైనా విజయం తప్పదు.

ఆఫీసులో రకరకాల మనుషులు ఉంటారు. కొంతమంది పని చేసే తీరు చూస్తే కోపం వస్తుంది, కొంతమంది ప్రవర్తన చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఆఫీసులో అందరి ప్రవర్తననీ గమనిస్తూ ఉండాల్సిందే! కానీ అది మన ఆలోచనాతీరుని ప్రభావితం చేయకూడదన్నది గీత చెబుతున్న మాట. భగవద్గీత రెండో అధ్యాయంలోనే కృష్ణుడు కోపం వల్లా, ద్వేషం వల్లా సరైన నిర్ణయాలు తీసుకోలేమని చెప్పుకొస్తాడు.

భగవద్గీతలోని ప్రతి అధ్యాయంలోనూ ‘శరీరం శాశ్వతం కాదు, ఆత్మ ఒకటే శాశ్వతం’ అన్న మాట వినిపిస్తుంది. ఈ మాట నుంచి రెండు విషయాలు నేర్చుకోవాలంటున్నారు. డబ్బు, హోదాలాంటి తాత్కాలికమైన ప్రలోభాలకి లొంగిపోకూడదన్నది మొదటి విషయం. ఎలాంటి మార్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నది రెండో విషయం.

భగవద్గీతలో జ్ఞానానికి చాలా ప్రాధాన్యత కనిపిస్తుంది. అది మనం పెంచుకునేదైనా కావచ్చు. ఇతరుల నుంచి నేర్చుకునేదైనా కావచ్చు. చదువుతో, పరిశీలనతో, గురువులని కలవడంతో వీలైనంత జ్ఞానాన్ని పొందాలని చెబుతాడు కృష్ణుడు. ఉద్యోగంలోనూ అంతే! చేసే పని గురించి అవగాహన సాధిస్తే, ఎలాంటి లక్ష్యాన్నయినా చేరుకోగలం.

Attachment with detachment అనే సూత్రం భగవద్గీతలో స్పష్టంగా కనిపిస్తుంది. నూటికి నూరు శాతం మనసు పెట్టి పని చేయాలి. కానీ పని పూర్తయిన తర్వాత ఇక దాని గురించి ఆలోచించకూడదు. ఆఫీసులో ఇంటి గురించి ఆలోచిస్తూ, ఇంట్లో ఆఫీసు పని గురించి కంగారుపడుతూ ఉండేవారికి ఇదో పాఠం. నిన్న చేసిన పని గురించే ఆలోచిస్తూ కూర్చునేవారికిదో గుణపాఠం.

చివరగా ఒక్క మాట! ఒకరు చెడిపోవడానికైనా, బాగుపడటానికైనా అతని ఆలోచనలే కారణం. మన ఆలోచనలు గొప్పగా ఉంటే, మనకి బెస్ట్‌ ఫ్రెండ్‌ మనమే! అదే మన ఆలోచనలు సవ్యంగా లేకపోతే మన బద్ధ శత్రువు కూడా మనమే అని చెబుతోంది భగవద్గీత.

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

మట్టి కుండ (కథ)

మట్టి కుండ

ఒకానొక ఊర్లో భీద కూలివాడు
ఉండేవాడు. ఒకరోజు ఒక చెక్కల వ్యాపారి దగ్గరకు
వెళ్లి ఏదైనా పని చెప్పండి అని
బ్రతిమలాడేడు. చెక్కల వ్యాపారి సరే అని చెప్పి.
జీతం మాత్రం నువ్వు ఎంత చేస్తే అంత అని చెప్పేడు.

కూలివాడు నాకు నా,పిల్లలకు రోజుకు బ్రతకడానికి 100 రూపాయలు అవసరము
అవతాయి. కాబట్టి నాకు
100 రూపాయలు ఇస్తే చాలు అన్నాడు.అప్పుడు కలప వ్యాపారం చేసే యజమాని అలా కుదరదు.

నీ పనికి తగ్గట్టుగా నీ జీతం
ఉంటుంది. పని ఎంత ఎక్కువగా చేస్తే అంత డబ్బు వస్తుంది. అని బదులిచ్చాడు.
కూలివాడు యజమాని చెప్పిన ఒప్పందం నికి వేరే దారిలేక సరే అని చెప్పేడు.

అప్పుడు ఆ యజమాని ఆ కూలివాడుకి ఒక మంచి బలమైన కత్తి ఒకటిచ్చి
అడవిలో పెద్ద పెద్ద చెట్లను
నరికి తెమ్మన్నాడు.

కూలివాడు సరే అని వెళ్లి అడవిలో చెట్లను నరకడం మొదలుపెట్టేడు. ఎలాయితేనే పొద్దు కునికే సరికి 15 చెట్లను నరికి వాటిని తెచ్చి యజమానుడుకి అప్పజేప్పేడు.
యజమానుడు భళా దాసుడా.
ఎవరైనా ఒక్కరోజులో 7 చేట్లకంటే ఎక్కువగా నరకలేరు.
నువ్వు ఏకం గా 15 చెట్లు నరికావు. భళా అని పొగిడి..
నువ్వు మొదటి రోజే చాల ఎక్కువ కష్టపడ్డావ్ అని మెచ్చుకుని. చెట్టుకు 10 రూపాయలు చొప్పున
ఆ కూలివాడుకి 150 రూపాయలు ఇచ్చాడు.

ఆ కూలివాడు మరుసటి రోజు
అడవికి వెళ్లి ఇంకా ఎక్కువ కష్టపడితే ఇంకా డబ్బులువస్తాయి కదా అని
మొదటి రోజు కంటే ఎక్కువ సేపు కష్టపడి పోద్దు కున్కేసరికి 10 చెట్లను నరికి తెచ్చి యజమానుడుకి చెట్టుకు
10 రూపాయలు చొప్పున 10 చెట్లు అప్పజెప్పి 100 రూపాయలు కూలి తీసుకున్నాడు.

మూడవరోజు కూలివాడు ఇంకా కష్టపడి పనిచేసి పోద్దు కునికేసరికి 5 చెట్లు నరికి యజమానుడుకి అప్పజెప్పి
చెట్టుకు 10 రూపాయలు చొప్పున 50 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు ఎలా అయిన
ఎక్కువ చెట్లు నరకాలని వేకువ
జామున చీకటితో బయలుదేరివెల్లి ఆ అడవిలో ఎన్నడులేనంత గా కష్టపడి వేకువజామున నుండి చీకటి
పడేవరకు కష్టపడి ఒకే ఒక చెట్టు నరికి యజమానుడుకి
అప్పజేప్పేడు.

అప్పుడు ఆ యజమానుడు చెట్టుకు 10 రూపాయలు చొప్పున పది రూపాయలు తీసి ఆ పనివాడి చేతిలో పెట్టేడు.
పనివాడు పది రూపాయల నోటు వైపు దీనంగా చూస్తూ శాయశక్తులా కష్టం పెంచినా ఫలితం పది రూపాయలేే
అని తలంచి. ఎంత చేస్తే అంత అన్నయజమానుడితో
ఉన్న ఒప్పందం గుర్తెరిగి
చేసేది ఏమీ లేక. వెళ్ళిపోతూ...

అయ్యగారు నా కష్టం లో ఎటువంటి లోపం లేదు. చీకటి పడేవరకు చెమట ఓర్చి శ్రమించాను కాని ఒకటి కంటే
ఎక్కువ నరకలేకపోయాను.అని దీనంగా అన్నాడు.

అపుడు యజమానుడు నేను నీకు ఇచ్చిన కత్తికి పదును పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది ? అని అడగగానే. కూలివాడు నేను రోజు నా పనిలో మునిగిపోవడంవలన కత్తికి పదును పెట్టె సమయం నాకు లేదు. అందుకే కత్తికి ఒక్కసారికూడా పదును పెట్టలేదు అని అన్నాడు.
అపుడు యజమానుడు
అర్ధం లేని నీ శ్రమకు,
నీ ఆర్ధిక పతనానికి, నీ శరీర శ్రమలకి కారణం కత్తికి పదును లేకపోవడమే.

పదును పలితం. ఎటువంటి సమస్యనైనా సులువుగా
కోసిపారేయడమే. మార్పు లేని జీవితం, పదును లేని మొద్దుబారిన కత్తిలాంటిది.
ఏవేవో శ్రమలు పడతాం కాని
ఫలితం ఆవిరి. కష్టపడుతున్న..
కష్టపెట్టే పరిస్థితులు మాత్రం
మారనే మారవు పదునైన ఆలోచనలతో మాత్రమె గోప్పవిజయాలు సాధించగలము.

భగవంతుడు మట్టి బొమ్మకు ప్రాణం పోసి జ్ఞానమనే గొడ్డలిని కి ఆలోచన అనే పదును పెట్టి మన చేతికి ఇస్తే మనం పైన చెప్పిన కూలీల
ప్రాపంచిక విషయాలన్నీ
దానితో నరుక్కుంటూ పోయి
వృద్ధాప్యం వచ్చిన తర్వాత పదును తగ్గిన తరువాత ఎందుకు నా జీవితం ఇలా తయారయింది అని మనల్ని మనం చూసుకొని బాధపడుతూ ఉంటాం. దానికి కారణం యవ్వనంలో వచ్చే విజయాలన్నీ నా వల్లే వచ్చాయి అనే మూర్ఖత్వం భావనలో మనం ఉండడమే!

కానీ నిజనికి మనం సాధించడానికి ప్రేరణ మరియు కారుకుడు భగవానుడు అనే విషయాలను వృద్ధాప్యంలో తెలుసుకుని ఏం ప్రయోజనం
సరిదిద్దుకోవడానికి సమయం లేకుండా పోయింది, శరీరం అంతకన్నా సహకరించకుండా పోతుంది అని నిట్టూర్పు విడవటం తప్ప మన చేతుల్లో ఏమీ మిగిలి ఉండదు.

అందుకు చిన్న ఉదాహరణ చెబుతాను.

ఒక చక్రవర్తి యుద్ధంలో గెలిచి వచ్చాడు. భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశ యిల్లింది. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహా మంత్రే ఆయనకా సమయంలో చులకనగా కనిపించాడు. దీన్నే అంటారు కళ్లునెత్తికెక్కాయని. అతనిలో గర్వంతో బాటు అహంభావం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మరచిపోయాడు.

‘మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహ కర్తలు. ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుం డును’ అన్నాడు. అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు.

తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు.

తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు. దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి ఎండ మండిపోతోంది. ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు’ అన్నాడు.

పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు. ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి. దాహం తీరి ఉండదు. మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు అన్నాడు మంత్రి మళ్ళీ, పరిచారకుడు మట్టి కుండలోనుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు.

వెంటనే రాజు ఆలోచించాడు మంత్రి ఒక్క సారిగా నీటిని గురించి ప్రస్తావించడడం, పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్ర ల్లోని నీటిని తెప్పించడం ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు. వివేకవంతుడు కనుక వెంటనే అర్థమయింది,జ్ఞానోదయమయింది.

వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, ‘గురు దేవా! మన్నించండి. గర్వాతిశయంతో కాని మాట అన్నాను. బంగారు పాత్ర విలువైనదే కావచ్చు. అందంగా ఉండవచ్చు. కాని దానికి నీటిని చల్ల్లపరిచే గుణం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు. అయినా నీటిని చల్ల్లగా ఉంచు తుంది. అందం కాదు గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు. నా అపరాధాన్ని మన్నించండి’ అన్నాడు.

ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు మౌర్య చంద్ర గుప్తుడు. ఆ మహా మంత్రి మరెవరోకాదు. మహారాజనీతి వేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరు గాంచిన చాణక్యుడు.

విజయగర్వంతో భగవంతుని మనం మరచిన తను మాత్రం మనల్ని మరువడు పైన చెప్పిన మంత్రి గారి లా ఎప్పుడు మన విజయాన్ని ఆకాంక్షిస్తూ ఉంటాడు.

ప్రాణంతో ఉన్నప్పుడు మట్టి మన కడుపు నింపే ప్రయత్నం చేస్తుంది ప్రాణం పోయాక తన కడుపులో మనల్ని నింపుకుంటుంది.

మట్టి కుండలు అన్నం వండుకుని తినే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని
కలిగి ఉన్నం మనం, కానీ మనల్ని మనం తెలుసుకోలేని,రక్షించుకోలేని దీనావస్థలో ఉన్నాం. అందుకు కారణం
నేను అమాయకత్వమే.

అలోచించుకుందాం మన కర్మ కు కూలి ఏంత గిట్టుబాటు అయిందో ఈ జీవితకాలనికి.


Source - Whatsapp Message

Saturday, April 24, 2021

టైంమెషిన్ లో 50 ఏళ్ల గతంలోకి! ( అర్ధశతాబ్ద పూర్వం జీవన శైలి.)

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


టైంమెషిన్ లో 50 ఏళ్ల గతంలోకి!
➖➖➖✍️
(అర్ధశతాబ్ద పూర్వం జీవన శైలి.)

ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందుం పుల్లలు అని కూడా అనే వారు.

కొంతమంది కచ్చిక (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ఉపయోగించేవారు.

మొగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి.

ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు.

కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు.

బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది UMRAO వత్తుల స్టౌ (కిరసనాయిలుది) / పంపు స్టౌ వాడేవారు.

అదే విధంగా గా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం( పావు వీశ)గా తూచే వారు.

ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ  రాచ్చిప్ లు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు,  ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే.

అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి.

అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు.

బియ్యం లో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసాన్నాలు, SLO, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, SLO మధ్య రకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు.

సీతారామాభ్యానమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్ళకు వచ్చి తిథి వార నక్షత్రాలు చెప్పి (ఇప్పుడు WhatsAppలో రోజూ ఉదయం పంచాంగం పోస్ట్ చేస్తున్నట్టుగా) వెంటనే వెళ్లి పోయేవారు. వెళ్లిపోయే లోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసే వారు. ఒక వేళ మిస్స్ అయితే ఏదో తప్పు చేసినట్లుగా, అపరాధ భావనతో ఉండి, మర్నాడు ముందే రెడీగా ఉండి, రెండు గుప్పెళ్లు వేసేవారు బియ్యం.

రాత్రిపూట7, 8 గంటలకు మాదాకాలం తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు పేచీ పెడుతుంటే మాదాకాళo అబ్బాయికిచేస్తానని భయపెట్టేవారు తల్లులు.

టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్ర నూక ఉప్మా లాంటివి ఉండేది.

పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినే వారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు.

ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు.

డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితి మంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వారు.

3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బు కి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది.

వైద్యం కి RMP డాక్టర్ చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరుకు ఇచ్చే వారు. జ్వరం తగ్గే వరకూ లంఖణమే. తర్వాత bread, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్  భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది.

ఇంకా, పిల్లల చదువుల మీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు. అంతే. ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసే వారు కాదు.

పుస్తకాలు ఎప్పుడు 2nd hand వే. పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేట్ కి టెక్స్ట్ బుక్స్ కొనే వారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. Last year నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త బుక్ లా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు.

రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం అర్థం అయినా కాకపోయినా. రాత్రి పెంద్రాలే నిద్ర. వేసవి కాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసినికర్రే.

ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది. 2 రూపాయలు పెట్టి ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు.

అదీ ఆరోజుల్లో జీవన శైలి.

ఎవరికీ ఏ చీకూ చింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు  నిర్వహించేవారు......✍️

🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Source - Whatsapp Message

నీతి - గాడిదలతో వాగ్వివాదాలు పెట్టుకోకండి

నీలం రంగు గడ్డి
🌹🌈💦🦚🎈💖

🍃🌹గడ్డి నీలం రంగులో కదా ఉండేది?"
అని ఒక గాడిద పులిని అడిగింది..

దానికి పులి,
"నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి?.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది"
అని జవాబిచ్చింది..

గాడిద
"ఏడ్చావులే! గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని వాదించింది..

అలా అలా.. గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది...

ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి....

దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది.

అక్కడికి చేరుకోగానే
పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా

గాడిద
"వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా ఉండేది.. అవునా కాదా? మీరే చెప్పండి " అంది.

"అవును!
గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం

అది విని గాడిద
ఇంకా రెచ్చిపోతూ ...
"చూడండి మహారాజా! అలా అని నేను ఎంత చెప్పినా ఈ పులి ఒప్పుకోవడం లేదు, అలా కాదని నాతో వాదిస్తుంది,
దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది.

"అవును,
పులికి తప్పకుండా శిక్ష పడవలసిందే..
పులిని ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచండి!!"
అని ఆదేశించింది సింహం.

పెల్లుబికిన ఉత్సాహంతో రంకెలేసుకుంటూ అడవంతా పరిగెత్తడం మొదలెట్టింది గాడిద ..

పులి నీరసంగా
సింహం దగ్గరకు వెళ్ళి
"అదేమిటి మహారాజా! గడ్డి ఆకుపచ్చ రంగులో కదా ఉండేది?" అంది.

"అవును గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది!"
అంది సింహం.

"మరి నాకెందుకు శిక్ష విధించారు మహారాజా?"
అంది పులి.

దానికి సింహం
"గడ్డి నీలం రంగులో ఉంటుందా? లేక ఆకుపచ్చ రంగులో ఉంటుందా?
అనే విషయం గురించి నిన్ను శిక్షించడం జరగలేదు.

బుద్ధిలేని ఒక గాడిదతో వాదించి, మరలా దానికి తీర్పు ఇవ్వమని నా దగ్గరకు వచ్చినందుకు
నీకు శిక్ష పడింది.." అంది.

నీతి -
"గాడిదలతో వాగ్వివాదాలు పెట్టుకోకండి

సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

ఏప్రిల్‌ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం (వరల్డ్‌ బుక్‌ డే)

🔰ఏప్రిల్‌ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం (వరల్డ్‌ బుక్‌ డే)

✍️ మురళీ మోహన్

👉ఓ మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తోంది. పుస్తకాన్ని చదవడం కనుక మనం అస్వాదించగలిగితే అది తృప్తినిస్తుంది.. పుస్తకం అమ్మలా లాలిస్తుంది.. నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది.. ఒంటరితనంలో స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది... బాధపడే వారిని ఓదారుస్తుంది . అలసిన మనసులను సేద తీర్చుతుంది.. అందుకే పుస్తకం అనితరమైన ఆయుధంగా, నేస్తంగా సమస్తంగా అన్ని తరాలవారినీ అలరిస్తోంది .ఏప్రిల్‌ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం పురస్కరించుకుని కొన్ని విషయాలు..

👉‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో...కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో. ఓ మంచి పుస్తకం స్నేహితుడితో సమానం. ఓ మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుంది’ అని కందుకూరి ‍వీరేశలింగం పంతులు చెప్పిన మాటలు నేటికి పుస్తక ప్రియుల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి.
కాలం ఎంతగా మారినా పుస్తక ప్రియులకు కొదవేలేదు. సినిమాలు, టెలివిజన్‌, ఇంటర్నెట్, మొబైల్ మాయలెన్ని దరిజేరినా పుస్తకం విలువ చెక్కుచెదరలేదు.‘మనల్ని గుచ్చి గాయపరిచి, ఇబ్బందిపెట్టే రచనల్నే మనం చదవాలి. మనం చదువుతున్న పుస్తకం తలపై ఓ మొట్టికాయవేసి మనల్ని మేల్కొలపాలి . లేనిపక్షంలో అసలు చదవడం ఎందుకు ? మంచి పుస్తకం ఒక దుస్సంఘటన లాగా మనల్ని ప్రభావితం చేయాలి. మనకన్నా మిన్నగా మనం ప్రేమించే ఆప్తుల మరణం లాగా మనల్ని తీవ్రంగా కలచివేయాలి. అందరికీ దూరంగా ఏకాంతంగా అరణ్యాలకు పారిపోవాలనిపించేలా ప్రేరేపించాలి. పుస్తకం మనలో గడ్డకట్టిన
సముద్రాల్ని గొడ్డలిలాగా పగలగొట్టాలి’ అంటాడు ప్రముఖ రచయిత కాఫ్కా.

👉ప్రపంచ పుస్తక దినోత్సవ కథనాలు
ఏప్రిల్ 23 పుస్తక దినోత్సవం. ఆ రోజును ప్రపంచ పుస్తక దినోత్సవంగా పరిగణించడంపై విభిన్న కథనాలున్నాయి. 17వ శతాబ్దంనాటి యూరప్‌లో ఈ రోజును సెయింట్ జార్జ్ డే గా పాటించేవారు. స్పెయిన్ లో ఇదే రోజున ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని బహుమతిగా ఇస్తారు. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616 సంవత్సరంలో ఇదే రోజు మరణించారు. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా ఇంకా చాలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజు మరణించడమో, జన్మించడమో కూడా ఈ పుస్తక దినోత్సవం చేసుకోవడానికి ఒక కారణం. ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు తేదీల్లో పుస్తక మహోత్సవాలు నిర్వహించినా ఇన్ని ప్రత్యేకతలున్న ఏప్రిల్ 23 వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవం పాటించాలని 1955లో యునెస్కో ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ పుస్తక, కాపీ హక్కుల దినంగా జరపాలని, రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అలాగే ఏటా ప్రపంచంలోని ఒక ప్రముఖ నగరాన్ని ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా ప్రకటిస్తూ వస్తోంది. 2017 సంవత్సరానికి గానూ రిపబ్లిక్‌ ఆఫ్‌ గినీలోని ‘కొనాక్రీ’ సిటీని, 2018 సంవత్సరానికి గానూ గ్రీస్‌లోని ‘ఏథెన్స్‌’ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది. 2019 సంవత్సరానికి కూడా దరఖాస్తులు చేస్కోవాల్సిందిగా తాజా ప్రకటన చేసింది యునెస్కో.

👉ఎక్కువ చదువరులు భారతీయులే
ప్రపంచంలో ఏదేశ వాసులు ఎక్కువసేపు పుస్తకాలు చదువుతారు అనే విషయంపై ఓ సర్వే‍ నిర్వహించారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడైనాయి. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువసేపు పుస్తకాలు చదివేవారు భారతీయులేనట. అవును.. ఇండియన్లు వారానికి సగటున 10.2 గంటలపాటు పుస్తకపఠనం చేస్తారని దశాబ్దం క్రితమే చేసిన ఒక అధ్యయనం తేల్చింది. 2013 నాటి సర్వేలో ఈ సమయం 10.4 గంటలకు పెరిగింది. టీవీలు, సినిమాలు, ఇంటర్‌నెట్‌ వినియోగం.. మారుతున్న జీవనశైలి కారణంగా ఇటీవలికాలంలో మనలో పుస్తకపఠనంపై మోజు తగ్గిందనుకుంటున్నాంగానీ ఈ విషయంలో ఇప్పటికింకా మనమే టాప్‌. ఈ సంఖ్య మరింత పెరగాలని పుస్తకాలు చదవడంలో ఎప్పటికీ భారతీయులే అగ్రస్థానంలో ఉండాలని పుస్తక ప్రియులు కోరుకుంటున్నారు.

👉పుస్తకం – పరిణామక్రమం
మనిషి మేధస్సును, విజ్ఞానాన్ని పెంచడానికి పుస్తకాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఒక్కసారి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే తుదివరకు అది మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. మహోన్నత విజ్ఞానాన్ని అందించేది పుస్తకం. అందుకే పుస్తకం ఎప్పుడూ మన చేతిని అలంకరించి ఉండాలని చెప్పారు పెద్దలు. కాలక్రమేణా పుస్తకాలలో అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు నడుస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ బుక్స్‌ వచ్చాయి. కానీ పుస్తక పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగక మానదు.

👉మొట్టమొదటి పుస్తకం : ప్రపంచంలోనే మొట్టమొదటి పుస్తకం చైనాలోని 8వ శతాబ్దంలో ప్రింట్‌ చేశారు. ఈ పుస్తకానికి ఉడ్‌బ్లాక్స్‌ను వాడారు. ఆ తర్వాత 14వశతాబ్దంలో చైనాతో పాటు కొరియా కూడా పుస్తకాలను ప్రింట్‌ చేయడం ప్రారంభించింది.

👉మొట్టమొదటి ఇంగ్లీషు పుస్తకం: 1473లో విలియం కాక్స్‌టన్‌ అనే వ్యక్తి ఇంగ్లీషులో మొట్టమొదటి పుస్తకం ప్రింట్‌ చేశాడు. దీని పేరు The Recuyell of the Historyes of Troye, కానీ అధికారికంగా చాసర్స్‌ సెంచర్‌ చ్యూరీ టేల్స్‌ అనే పుస్తకం మొట్టమొదటిసారిగా ఇంగ్లీషులో ప్రచురించిన పుస్తకంగా ఉంది. ఈ పుస్తకాన్ని 1477లో ఇంగ్లాండ్‌లో ప్రచురించారు.

👉మొట్టమొదటి అమెరికన్‌ పుస్తకం : 1638లో ప్రచురించబడిన ‘మసాచుసెట్స్‌ బే కాలనీ, ఓత్‌ ఆఫ్‌ ఫ్రీ మాన్‌’ అనే పుస్తకమే అమెరికాలో మొట్టమొదట ప్రచురించబడింది. రెండవ పుస్తకం 1639లో ప్రచురించారు. దానిపేరు ‘అల్కనాక్‌ ఫర్‌ ద లియర్‌ ఆఫ్‌ అవర్‌ లార్డ్‌’’

👉అతిపెద్ద పుస్తకం: ప్రపంచంలో అతిపెద్ద పుస్తకం 5m8.06m (16.40ft26.44ft)ల సైజులో ఉంటుంది. ఈ బుక్‌ మొత్తం 429 పేజీలు ఉన్నాయి. ఈ బుక్‌ బరువు 1500 కేజీలు. దీన్ని 2012 ఫిబ్రవరి 27లో దుబాయ్‌లో ఎమ్‌షాహిద్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ వారు ప్రచురించారు. 50మంది కలిసి ఈ బుక్‌ను తయారు చేశారు. ఇంతకీ ఈ బుక్‌ పేరు చెప్పలేదు కదా! దీని పేరు ‘దిస్‌ ద ప్రొపెట్‌ మొహ్మద్‌ (this the prophet mohamed)


👉అతిచిన్న పుస్తకం: ఈ అతి చిన్న బుక్‌ని చదవాలంటే మీరు మైక్రోస్కోప్‌ సహాయం తప్పక ఉండాల్సిందే. కెనడాకు చెందిన ఇద్దరు వ్యక్తులు రూపొందించిన 30పేజీల ఈ పుస్తకం ఖరీదు పదిహేను వేల డాలర్లు. దీన్ని మాల్కోమ్‌ డాగ్లాస్‌ చాప్లిన్‌ అనే వ్యక్తి రాయగా అతని సోదరుడు ప్రచురించాడు. 70మైక్రోమీటర్ల పరిమాణంలో ఈబుక్‌ ఉంటుంది. ఈ బుక్‌ పేరు ‘టీనీ టెడ్‌ ఫ్రమ్‌ టర్నిప్‌ టౌన్‌’. 2012 సంవత్సరంలో ఈ బుక్‌ అత్యంత చిన్న పుస్తకంగా గిన్నిస్‌బుక్‌ రికార్డులోకెక్కింది.

👉ఎలక్ట్రానిక్‌ పుస్తకాలు: ఎలక్ట్రానిక్‌ బుక్స్‌ని ఈ బుక్స్‌ అంటున్నాం మనం. ఇవి ఇప్పటివి కావు, ఇరవైయేళ్ళుగా ఇవి అందుబాటులో ఉన్నాయి. మొదటి ఎలక్ర్టానిక్‌ బుక్‌కి ఎక్కువ సమాచారం, నిక్షిప్తం చేసుకునే కెపాసిటీ లేదు. స్క్రీన్‌ కూడా అతిచిన్న సైజులో ఉండేది. 1991లో తయారు చేసిన ఎలక్ట్రానిక్ బుక్స్‌ బైబిల్‌. దీనిలో ఒక్కసారికి కేవలం నాలుగు లైన్లు మాత్రమే కనిపించేవి. కానీ ఇటీవల కాలంలో మొబైల్‌ఫోన్లో కూడా ఈ బుక్‌ అందుబాటులోకి వచ్చింది. ఇలా పుస్తకం తన రూపం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వినూత్నంగా తన విశిష్టతను నిలబెట్టుకుంటోంది. కానీ ఎలక్ట్రానిక్‌ బుక్స్‌ వల్ల కాస్త కనుమరుగు అవుతోంది. పెరుగుతున్న విజ్ఞానంతో పుస్తకం మరింత ఆధునీకరణ చెందుతుందని ఆశిద్దాం.

👉పుస్తకాల నది
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో.. ఉరుకుల పరుగుల జీవితంలో పుస్తక పఠనం తగ్గిపోయింది. ఏదైనా చదవాల్సి వస్తే ఆన్‌లైన్‌లోనో, కిండిల్‌ నోట్‌లోనో చదువుతున్నారు. పుస్తకాలను పట్టుకొని చదవడం ప్రజలు మర్చిపోతున్నారనే చెప్పాలి. అందుకే పలు స్వచ్ఛంద సంస్థలు తమకు తోచినట్టుగా ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే కొందరు ఆర్టిస్టులు రోడ్డుపై ‘పుస్తకాల నది’ ఏర్పాటు చేశారు. పుస్తక పఠనంపై ఆసక్తి, అవగాహన పెంచేందుకు స్పెయిన్‌కి చెందిన ‘లుజింటెరప్టస్‌’ అనే సోషల్‌ ఆర్టిస్టు బృందం కెనడాలోని టొంరొంటోలో రద్దీ రహదారిపై ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించింది. దాతలు ఇచ్చిన దాదాపు 10వేల పుస్తకాలను రాత్రివేళ రహదారులపై పర్చారు. ‘లిటరేచర్‌ వర్సెస్‌ ట్రాఫిక్‌’ పేరుతో రహదారుల్ని పుస్తకాల నదిలా మార్చేశారు. ఇది చూపరుల్ని బాగా ఆకట్టుకుంది. పుస్తక పఠనం ఇష్టమైనవాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చని, ఫొటోలు తీసుకోవచ్చని, ఇంటికి తీసుకెళ్ళవచ్చుననీ ప్రకటించారు. దీంతో ఆ దారిలో వెళ్తున్న వారు, ఇరుగుపొరుగు వారు తమకు నచ్చిన పుస్తకాలను తీసుకెళ్ళారు. తెల్లవారేసరికి రోడ్డు ఖాళీ అయిపోయింది. ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించారు.

👉ఆరోగ్యానికి మేలు
పుస్తక పఠనంతో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. మేధస్సు సక్రమంగా పని చేసి ఆలోచనలు నియంత్రించేందుకు పఠనం దోహదం చేస్తుంది. అనవసర ఆలోచనల్ని నియంత్రించి శారీరక ఆరోగ్యం చేకూరుస్తుంది. ఒత్తిడి నుండి విముక్తి చెందాలంటే, రాత్రి పడుకోబోయే ముందు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదివడం మంచిది. గాడ నిద్ర పట్టి శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఏకాగ్రత చేకూరి ఒంటరితనాన్ని దూరం చేస్తుంది.

👉ఎదిగే పిల్లలకు ఒక్కో వయస్సులో ఒక్కో తరహ పుస్తకం అవసరం. ప్రారంభంలో బోమ్మలు, కథల పుస్తకాలతో మొదలుపెట్టి ప్రపంచ నాగరికతలు, వింతలు, శాస్త్రవేత్తలు, పరికరాలు, సాహసగాథలు ఇలా ఒక్కో రోజు ఒక్కొక్క కొత్త విషయాన్ని తెలియజేసే పుస్తకాలు చదివించాలి. అలా చదివించి పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. ఇంటర్‌నెట్‌ పుణ్యమా అని కనీసం వార్తాపత్రిక కూడా కొనుక్కోకుండా ఇంటర్‌నెట్‌లోనే అన్నీ ఫ్రీగా చదివేస్తున్నాం. కానీ దానితో పాటే రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. అదేపనిగా కూర్చుని ఇంటర్‌నెట్‌లో చదవడం వల్ల కళ్ళు పాడవడం, ఊబకాయం వంటి సమస్యలకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పైగా కంప్యూటర్‌పై చదవడం వల్ల ఊహాశక్తికి తావు ఉండదు, అదే పుస్తక పఠనం ద్వారా చిత్రాలను మనసులో ఊహించుకోగలం తద్వారా ఊహాశక్తి పెంపొందు తుందని పరిశోధకులు చెబుతున్నారు.

Source - Whatsapp Message