Wednesday, April 7, 2021

శాంతంగా ఉందాం . సంతోషం గా ఉందాం

🌸శాంతంగా ఉందాం . సంతోషం గా ఉందాం🌸

ప్రతి ఒక్కరూ శాంతిగా ,సుఖంగా ,సంతోషంగా ఉండాలను కొంటారు . కోరికలు తీరినప్పుదే ఇవన్నీ కలుగుతాయనీ భావిస్తారు . కానీ ,కోరిక మరో కోరికకు ఆజ్యం పోస్తుందని ,ఇది నిరంతర దాహమని మరచిపోతారు . సంతోష మనేది బయట లేదు, మన మనస్సులోనే ఉందనే అనుభవం మనిషికి కలగాలంటే వివేకంతో కూడిన వైరాగ్యం అంకురించాలి . సాక్షీ భావం అలవాటు అవ్వాలి . అప్పుడే ఎలాంటి సంఘటన ఎదురైనా మనిషి భయపడడు .

నిరాశలో కూరుకుపోడు .అలాగే సంతోషాలకు పొంగిపోడు .

వివేకంతో కూడిన వైరాగ్యం , సాక్షీ భావం నిరంతరం మనలో నిలిచి ఉండే విధంగా మనం చేసే సాధనాలలో అతి ముఖ్యమైనది ధ్యానం .

🌹ధ్యానమంటే ఏమిటి ? దేని పై ధ్యానం చేయాలి ?ఏకాగ్రత , ధ్యానం రెండూ ఒక్కటేనా ?
రోజూ కాసేపు చేసి వదిలేసేది ధ్యానమా ? ధ్యానంలో మనస్సు నెమ్మది స్తుందా? మెదడు లో ఆలోచనలు పూర్తిగా తగ్గి చిత్త వృత్తులు కూడ అణగి పోతాయా ? ధ్యానానికి , నిద్రకు తేడా ఏమిటి ? మానసిక స్థాయిని బట్టి ధ్యానాన్ని రకరకాలుగా చేయవచ్చా ? ధ్యానంలో అంతర్లీనంగా ఉండే సూత్రం ఏమిటి ?

🌹మనిషి ధ్యానం చేయడానికే పుట్టాడా ? ధ్యానమంటే అది ఒక పనా ?లేదా అది ఒక జీవన విధానమా ?

ఇవన్నీ మీరూ ఆలోచించండి .మీ అభిప్రాయాలు పంచుకోండి .

ఎందుకంటే , ధ్యానం గురించి ఎంత చెప్పినా ప్రయోజనం శూ న్యం .అది ఎవరికీ వారు అనుభూతి చెందవలసిన క్రియ .కాబట్టి ధ్యానాన్ని మొదలు పెట్టండి . మీ మీ అనుభవాలు ధ్యానులందరితో పంచు కోండి .

దేవుణ్ణి తెలుసుకోవటం వేరు , దేవుణ్ణి గురించి తెలుసుకోవటం వేరు .

అలాగే ధ్యానాన్ని గురించి తెలుసుకోవటం కాక , ధ్యానాన్ని అనుభూతి చెందండి.

సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment