Wednesday, June 30, 2021

మంచి మాట....లు

చంద్రః
దథిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) ।
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణం

🙏ఓం నమఃశివాయ 🙏

ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు.. మీకు మీ కుటుంసభ్యులకు శ్రీ గంగా పార్వతి సమేత ప్రసన్న రామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ

సోమవారం --: 28-06-2021 :--
. ఈ రోజు
AVB మంచి మాట....లు
ఈ సమాజంలో అవసరాల
ప్రేమలు అసత్యపు మాటలు అవసరంకోసం నటించడం తీరాక చెడు ప్రచారం చేయడం నమ్మిన వాళ్ళతో నటించడం ప్రేమించే వాళ్ళను మోసగించడం వెంటే ఉండి వెన్నుపోటు పొడవడం ఈలోకంలో పరిపాటిగా మారింది . తస్మాత్ జాగ్రత్త సుమి .

ప్రతి
బాధకి ఒక సంతోషం ఉంటుంది ప్రతి సమస్యను సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెబుతుంది మనం లేదు అనుకుంటే ఏదీ ఉంటుంది ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది .

ఈ ప్రపంచంలో
వెలకట్టలేని సంపదలు రెండే రెండు . ఒకటి మనశ్శాంతి రెండవది సంతృప్తి ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్లు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు . కానీ వాటిని సంపాదించటం అంత సులభమైన పని కాదు దానికి ఓర్పు సహనంతో పాటు ప్రేమ ఉండాలి .

ఎవరి
తప్పలు వాళ్ళు తెలుసుకోవాడానికి సమయం ఉండదు కానీ అదేం విచిత్రమో ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావాలసినంత తీరిక సమయం దొరుకుతాయి .

🌹అందరు
బాగుండాలి .. అందులో నేను ఉండాలి 🌹

సేకరణ ✒️ మీ ... ఆత్మీయ బంధువు
AVB* సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

బంధాలు - అనుబంధాలు

చివరి వరకు తప్పక చదవండి

💞బంధాలు💚 అనుబంధాలు 💞


రామకృష్ణ మఠానికి చెందిన ఒక స్వామీజీనీ అమెరికాకు చెందిన ఒక విలేకరి చేసిన ఇంటర్వ్యూ.

విలేకరి:
స్వామీజీ! ఇంతకుముందు మీరు ఇచ్చిన ఉపన్యాసంలో "బంధాలు అనుబంధాలు" గురించి వివరించారు. నాకు సరిగా అర్థం కాలేదు మళ్ళీ వివరించగలరా?

దానికి స్వామీజీ నవ్వుతూ ప్రశ్నను దాటవేస్తూ, విలేకరిని తిరిగి ఇలా ప్రశ్నించారు
"మీరు న్యూయార్క్ నుంచి వస్తున్నారా? "

విలేకరి: అవును.

స్వామీజీ : మీ ఇంటిలో ఎవరుంటారు?

ఈ ప్రశ్న పూర్తిగా వ్యక్తిగతము మరియు అసంబద్ధం కావడంతో విలేకరి స్వామీజీ తన ప్రశ్నను దాటవేస్తున్నారు అనుకున్నారు. అయినప్పటికీ విలేకరి చెప్పసాగాడు
"అమ్మ చనిపోయారు, నాన్న అక్కడే ఉంటున్నారు. ఇంకా నాకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. అందరికీ వివాహం అయింది."

ముఖంలో చిరునవ్వు చెదిరిపోకుండా స్వామీజీ మళ్లీ ఇలా అడిగారు...

"నీవు మీ నాన్నగారితో మాట్లాడుతున్నావా? "

విలేకరి ముఖకవళికలు మారటం మొదలైంది.

స్వామీజీ: ఆఖరిసారి ఎప్పుడు మాట్లాడావు?

జేవురించిన ముఖంతో విలేకరి ఇలా చెప్పాడు
"సుమారు ఒక నెల అయి ఉండొచ్చు. "

స్వామి గారి ప్రశ్నల పరంపర కొనసాగింది.
"మీ అన్న చెల్లెళ్ళను ఎంత తరచుగా కలుసుకుంటారు? ఆఖరిసారిగా కుటుంబమంతా ఎప్పుడు కలిసి ఉన్నారు? "

ఆ సమయంలో విలేకరి నుదుట నుంచి చెమట కారణం స్పష్టంగా కనిపించింది. అక్కడ ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది.
స్వామీజీ నా? లేక విలేకరా?
నాకైతే స్వామీజీ విలేకరిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా అనిపించింది.
ఒక నిట్టూర్పుతో విలేకరి చెప్పాడు
" సుమారు రెండు సంవత్సరాల క్రితం … క్రిస్మస్ సందర్భంలో మేమందరము కలిశాము. "

స్వామీజీ : మీరందరూ కలిసి ఎన్ని రోజులు ఉన్నారు?

నుదుటన స్వేదబిందువులు తుడుచుకుంటూ విలేకరి అన్నాడు
"మూడురోజులు."

స్వామీజీ :
ఎంతకాలం మీ నాన్నగారితో గడిపావు? ఆయన పక్కనే ఎంతకాలం కూర్చున్నావు?

ముఖం కందగడ్డలా మారిన విలేకరి కాగితంపై పిచ్చిగీతలు గీయడం మొదలుపెట్టాడు.

స్వామీజీ :
నీవు ఎప్పుడైనా మీ నాన్నగారితో కలిసి భోజనంచేసావా? ఆయన ఎలా ఉన్నారని ఎప్పుడైనా అడిగావా? మీ తల్లి చనిపోయిన తర్వాత ఆయన రోజులు ఎలా గడుపుతున్నారో అడిగావా?
విలేకరి కంటినుంచి కన్నీరు కారటం స్పష్టంగా కనిపించింది.

అప్పుడు స్వామీజీ విలేకరి చేతిని ప్రేమతో అందుకని ఇలా అన్నారు

"బాధపడకు నాన్నా! నిన్ను తెలియకుండా బాధించి ఉంటే క్షమించు. కానీ నీవడిగిన బంధం అనుబంధాలకు సమాధానం ఇదే. "

మీ నాన్నగారితో నీకు బంధం ఉంది. కానీ అనుబంధం లేదు. అనుబంధం అంటే హృదయానికి హృదయం కలిసిపోవడం. కలిసిఉండడం. కలిసిభోజనం చేయడం. ఒకరిపై ఒకరు ప్రేమ చూపించడం,స్పర్శించటం,చేతులు కలపడం, కళ్ళలోకి సూటిగా చూడగలగటం, కలిసి సమయాన్ని గడపడం. మీ సోదరులందరితో కూడా నీకు బంధం ఉంది. కానీ అనుబంధం లేదు.

ఆ విలేకరి కన్నీళ్ళు తుడుచుకుంటూ స్వామీజీతో అన్నాడు "బంధం- అనుబంధాల" గురించి ఇంత అద్భుతమైన బోధన చేసినందుకు ధన్యవాదాలు.

ఇదీ నేటి వాస్తవికత.

*సమాజంలో గానీ, ఇంటిలోగానీ అందరికీ బోలెడు బంధాలు ఉన్నాయి. కానీ అనుబంధాలు కనుమరుగయ్యాయి. ఎవరితో ఎవరికీ సంబంధం లేకుండా, ఎవరి ప్రపంచంలో వారు జీవిస్తున్నారు. మనం కూడా బంధాలకు కాకుండా అనుబంధాలకు ప్రాముఖ్యతను ఇద్దాం! పరస్పర ఆప్యాయతలతో కలిసి మెలిసి ఉందాం!!

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Tuesday, June 29, 2021

Beautiful letter written by a father to his son and daughter

Beautiful letter written by a father to his son and daughter👌

Make sure your children read it too.

Following is a letter to his daughter from a renowned Hong Kong TV Broadcaster and Child Psychologist.
The words are actually applicable to all of us, young or old, children or parents.!
This applies to all sons & daughters too.

All parents can use this in their teachings to their children.

Dear Children,

I am writing this to you because of 3 reasons...

1. Life, fortune and mishaps are unpredictable, nobody knows how long he lives.

2. I am your father, and if I don't tell you these, no one else will.

3. Whatever written is my own personal bitter experiences that perhaps could save you a lot of unnecessary heartaches.

Remember the following as you go through life.

1. Do not bear grudge towards those who are not good to you. No one has the responsibility of treating you well, except your mother and I.

To those who are good to you, you have to treasure it and be thankful, and ALSO you have to be cautious, because, everyone has a motive for every move. When a person is good to you, it does not mean he really will be good to you. You have to be careful, don't hastily regard him as a real friend.

2. No one is indispensable, nothing is in the world that you must possess.

Once you understand this idea, it would be easier for you to go through life when people around you don't want you anymore, or when you lose what you wanted the most.

3. Life is short.
When you waste your life today, tomorrow you would find that life is leaving you. The earlier you treasure your life, the better you enjoy life.

4. Love is nothing but a transient feeling, and this feeling would fade with time and with one's mood. If your so called loved one leaves you, be patient, time will wash away your aches and sadness.

Don't over exaggerate the beauty and sweetness of love, and don't over exaggerate the sadness of falling out of love.

5. A lot of successful people did not receive a good education, that does not mean that you can be successful by not studying hard! Whatever knowledge you gain is your weapon in life.

One can go from rags to riches, but one has to start from some rags !

6. I do not expect you to financially support me when I am old, neither would I financially support your whole life. My responsibility as a supporter ends when you are grown up. After that, you decide whether you want to travel in a public transport or in your limousine, whether rich or poor.

7. You honour your words, but don't expect others to be so. You can be good to people, but don't expect people to be good to you. If you don't understand this, you would end up with unnecessary troubles.

8. I have bought lotteries for umpteen years , but could never strike any prize. That shows if you want to be rich, you have to work hard! There is no free lunch !

9. No matter how much time I have with you, let's treasure the time we have together. We do not know if we would meet again in our next life.

Your Parents
X Y Z

Read it twice

Ask your son and daughter to read it thrice.

Worth a read.

Source - Whatsapp Message

Sunday, June 27, 2021

సాధనకు సమయం?

సాధనకు సమయం?

పడకగదిలో తన మంచంపై పడుకుని ఉన్న రాధాకృష్ణ ఏదో అలికిడి కావడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు. అతని ఎదురుగా ఒక దివ్యకాంతి ప్రకాశిస్తూ కనబడింది. చూస్తూండగా ఆ కాంతి ఒక స్త్రీ రూపాన్ని దాల్చింది. దేదీప్యమైన కాంతులను వెదజల్లుతున్న ఆ స్త్రీమూర్తి సాక్షాత్తు ఆ జగన్మాతేనని గ్రహించిన రాధాకృష్ణ, "అమ్మా!" అంటూ ఆ తల్లి పాదాలపై పడాలని అనుకున్నాడు. కాని, మంచంపై అతనిని ఎవరో కట్టేసినట్లు అనిపించడంతో ఒక్క అంగుళం కూడా కదలలేకపోయాడు. 'ఏమైంది నాకు?' అనుకుంటూ రాధాకృష్ణ తన వంక తాను ఒకసారి చూసుకుని ఆశ్చర్యపోయాడు. అతని శరీరం బక్కచిక్కిపోయి, చర్మం ముడతలు పడిపోయి ఉంది. లేచేందుకు ఏమాత్రం ఓపిక తనలో మిగలలేదని, తన అంత్యకాలం సమీపించిందని అర్థం చేసుకున్న రాధాకృష్ణ ఆ పరమేశ్వరి వంక చూస్తూ, "తల్లీ! నన్ను నువ్వే కాపాడాలి... నాకు నీ వద్దకు రావాలని ఉంది" అన్నాడు.

“అవును, కుమారా! నాకూ నిన్ను నాతో తీసుకెళ్లాలని ఉంది కానీ, నీవు ఈ జన్మలో చేసిన పుణ్యం అందుకు సరిపోయేటట్టు లేదు. అదే నా బాధ", అంది జగన్మాత విచారంగా.

"అమ్మా! నేను ఇప్పటివరకూ ఎవ్వరికీ కష్టం కలిగించకుండా ఉన్నానే... అది సరిపోదా?" అడిగాడు రాధాకృష్ణ.

“సరిపోదు, నాయనా! నువ్వు నాతో రాగలిగేందుకు కావలసిన అర్హతను పొందాలంటే నీకు లభించిన మానవ జన్మను భగవత్సేవకు అంకితం చెయ్యాలి. నేను నీకిచ్చిన ఈ తొంబై అయిదు సంవత్సరాలలో నువ్వు ఏనాడూ నా సన్నిధిలో దీపం కూడా వెలిగించినట్టు లేవు" అంది పరమేశ్వరి.

"నిజమేనమ్మా! నువ్విచ్చిన సుఖాలను అనుభవించానే తప్ప ఇన్నాళ్లు నిన్నెలా సేవించాలో నేనసలు ఆలోచించలేదు. నన్ను మన్నించమ్మా... నాకు ముక్తిని ప్రసాదించు" అని అమ్మను వేడుకున్నాడు రాధాకృష్ణ.

"సరే నాయనా! నా బిడ్డవు కాబట్టి నీకొక చివరి అవకాశం... నీకు కచ్చితంగా పది నిమిషాల వ్యవధి ఇస్తున్నాను. ఈ పది నిమిషాలలో నీకు తోచిన విధంగా నన్ను సేవించి, నాతో వచ్చేందుకు అర్హతను సంపాదించు, నాయనా!" అంది పరమేశ్వరి.

“ఆహా... అమ్మా! నువ్వు కరుణామయివి. నేను ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాను" అని అమ్మను ఎలా సేవించాలా అని, ఆలోచనలో పడ్డాడు రాధాకృష్ణ. 'పత్రం, పుష్పం, ఫలం, తోయం' అన్నారు కాబట్టి పెరటిలో ఉన్న నాలుగు పుష్పాలు కోసుకుని వచ్చి అమ్మ పాదాలపై వేద్దామనుకున్నాడు రాధాకృష్ణ. లేచే ప్రయత్నం చేసినప్పుడు కానీ రాధాకృష్ణకి అతడు లేవలేని స్థితిలో ఉన్నాడని గుర్తుకు రాలేదు. చేతులు జోడించి అమ్మనుగూర్చి ప్రార్థన చేద్దామని రాధాకృష్ణ తన రెండు చేతులను ఒక దగ్గరకు అతికష్టం మీద తీసుకుని వచ్చాడు. నరాల బలహీనతవల్ల చేతులు వణికిపోయాయి. రెండు నిమిషాలన్నా నమస్కార ముద్రను నిలపలేకపోయాడు రాధాకృష్ణ. తనకు తెలిసిన పాటను సంగీత సేవగా భావిస్తూ శ్రావ్యంగా పాడదామని రాధాకృష్ణ అనుకున్నాడు. కానీ, వృద్ధాప్యం వల్ల గొంతులో కఫం అడ్డుపడి పాడలేకపోయాడు.

'ఇక నావల్ల కాదమ్మా! నువ్వే దారి చూపించు' అని అమ్మవంక దీనంగా చూశాడు రాధాకృష్ణ.

"అయ్యో నాయనా! నువ్వు పడుతున్న అవస్థను చూడలేకపోతున్నాను. పోనీ నీకు వచ్చిన స్తోత్రంతో నన్ను స్తుతించు." అడిగింది జగజ్జనని.

"అలాగేనమ్మా!" అంటూ రాధాకృష్ణ తను చిన్నప్పటినుండీ విన్న శ్లోకం ఒకటి టకాటకా చెప్పేశాడు కానీ అతని పళ్ళన్నీ ఊడిపోవడంవల్ల ఆ శ్లోకంలో చాలా పదాలు స్పష్టంగా పలకలేకపోయాడు. అందువల్ల కొన్ని పదాల అర్థాలు కూడా మారిపోయాయి.

"పోనీలే నాయనా! నన్ను చూసి నా రూపాన్ని వర్ణించు... తృప్తి చెందుతాను" అంది ఆ తల్లి.

రాధాకృష్ణకు వయసు వల్ల చూపు బాగా మందగించింది. తన కళ్ళను ఎంత చిట్లించి చూసినా అమ్మ రూపు స్పష్టంగా కనబడలేదు.

"నాయనా! నా చుట్టూ ఉన్న తరంగాలు నా బీజాక్షరాన్ని నిరంతరం ప్రతిధ్వనించేలా చేస్తాయి. జాగ్రత్తగా విను" అంది జగన్మాత. రాధాకృష్ణ తన డెబ్భైయ్యవ ఏటనే వినికిడి శక్తిని కోల్పోవడంతో చెవులు రిక్కించి విన్నప్పటికీ తనకు ఎటువంటి శబ్దమూ వినబడలేదు.

'అమ్మా! ఇప్పుడేం చెయ్యనూ?' అన్నట్టు అమ్మవంక చూశాడు రాధాకృష్ణ.

"ఇక ఆఖరి ప్రయత్నంగా నీ మనసు ఒక రెండు నిమిషాలపాటు నాపై లగ్నం చెయ్!" అంది తల్లి.

రెండు నిమిషాలు ప్రయత్నించిన తర్వాత, "మహానీయులకు సైతం మనసును ఏకాగ్రచిత్తముతో నీపై నిలపడం సులభం కాదు. నావంటి అల్పునికి అదెలా సాధ్యపడుతుందమ్మా? నావల్ల కాదు" అని అన్నాడు రాధాకృష్ణ దీనంగా.

జగన్మాత రాధాకృష్ణకు ఇచ్చిన పది నిమిషాల గడువు ముగిసింది.

"అమ్మా నిన్ను ఏ విధంగానూ సేవించలేకపోయాను" అని కడు దుఃఖంతో అన్నాడు రాధాకృష్ణ. పశ్చాత్తాపంతో అతని కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి.

"ఇదంతా నీ స్వయంకృతం, నాయనా! నువ్వు తరించడానికే నికీ మానవజన్మ లభించిందన్న విషయం నువ్వు విస్మరించావు. నీ పేరు చెప్పినప్పుడల్లా నా నామాన్ని స్మరించావు కనుకనే ఈ విధంగానైనా నీకు నా దర్శన భాగ్యం కలిగింది. భగవద్విషయాలను జీవిత చరమాంకంలో తెలుసుకోవచ్చులే అని అనుకోవడం అవివేకం. నీకు మానవజన్మ లభించిన దగ్గరినుండి ప్రతి నిమిషం అమూల్యమే, నాయనా! భగవద్భక్తికి బాల్యంలోనే బీజం పడాలి. జీవితం చివర్లో సత్యాన్ని గ్రహించినా, చేసేందుకు శరీరం సహకరించకపోయే ప్రమాదం ఉంది. సమయం విలువను తెలుసుకో... ఇకనైనా మేలుకో అని చెప్పి ఆ దివ్యకాంతి అంతర్థానమయ్యింది.

"అమ్మా... అమ్మా! నాకు నువ్వు కావాలి" అని ఏడుస్తూ నేలపై పడ్డాడు రాధాకృష్ణ.

అంతలో, "నాయనా రాధా! నేనురా నీ అమ్మను. కలేమైనా కన్నావా? లే నాయనా లే" అంటూ, నిద్రపోతూ మంచంపై నుండి కిందపడ్డ రాధాకృష్ణను అతని తల్లి లేవదీసింది.

రాధాకృష్ణ కళ్ళు నులుముకుంటూ తనకొచ్చినది కల అని తెలిసి ఆశ్చర్యపోయాడు. కలలో జగన్మాత చేసిన బోధను గుర్తుచేసుకుంటే రాధాకృష్ణకు తను చేస్తున్న తప్పులన్నీ తెలియవచ్చాయి. తనకు పాతకాలంనాటి పేరు పెట్టినందుకు పెద్దలను నిందించిన సందర్భాలూ గుర్తుకు వచ్చాయి.

రోజు ఇంట్లోని పెద్దవాళ్ళు వెంటపడితే కానీ స్నానం చెయ్యని రాధాకృష్ణ ఆ రోజు పూర్తిగా తెల్లవారకమునుపే స్నానం ముగించి, ఇంట్లోని దేవుని మందిరం దగ్గరకు వెళ్లి, భగవంతునికి భక్తిగా నమస్కరించి, ఆ తర్వాత తన బామ్మవద్దకు వెళ్లి, "బామ్మా! ప్రతిరోజూ నీతో గుడికి రమ్మని నన్ను అడుగుతూ ఉంటావుగా... ఇవాళ నువ్వు గుడికెళ్లేటప్పుడు చెప్పు నేను కూడా వస్తాను" అని అన్నాడు రాధాకృష్ణ.

ఎప్పుడూ - నేనింకా చిన్నవాడిని! నాకప్పుడే గుళ్ళూ, గోపురాలూ, భగవంతుడూ, భక్తి ఎందుకే బామ్మా?" అంటూ చిరాకుపడే తన పన్నెండేళ్ల మనవడు రాధాకృష్ణలో అకస్మాత్తుగా వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతూ, 'అమ్మా పరమేశ్వరీ! ఇన్నాళ్ల నా ప్రార్థనను విన్నావా తల్లీ' అని అనుకుంటూ ఆనందపడిపోయింది రాధాకృష్ణ బామ్మ.

శ్రీ మాత్రే నమః🙏 మానవజన్మ యొక్క మూల అంకం ఇదే....

Source - Whatsapp Message

తద్దినము - విశిష్టత

తద్దినము - విశిష్టత

తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు.
పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని కాపాడేది వాళ్ళే. వాయనము ఇస్తాము, కూరలు ఇస్తాము, బియ్యము ఇస్తాము అని అంటే కుదరదు. మీరు వుండే ఇంట్లో పెడితేనే చాలా మంచిది.
దేవతలకు చేసే కార్యము కాని, పితృ దేవతలకు చేసే కార్యము కాని రెండూ మీరు వున్న ఇంట్లోనే చేయాలి, అలా చేస్తే అది మీకు మీ ఇంటికి మంచిది.
కర్మ క్షయం కాని జీవుడు మరణించిన వెంటనే ఎక్కడో ఒక చోట పుడతాడు అన్నది నిజమేనా ?? అలాగయితే మనం చేసే పితృకర్మలు వారికి ఎలా చెందుతాయి ?? జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేక ఇక ఆ జన్మతో బంధం ఉండదు కదా.. మరి పితృదేవతగా ఎలా తర్పణాదులు స్వీకరిస్తాడు? పెళ్ళి/పిల్లలు సరిగా లేకపోతే పితరులకు హాని కలుగుతుంది అంటారు కదా..వ్యక్తిగతంగా చేసిన పాప పుణ్యాల వల్ల కర్మలు ఏర్పడినపుడు ఇలా వంశం చేసిన పాపాల వల్ల ఎలా హాని కలుగుతుంది? పిల్లలు లేకపోతే పున్నామ నరక బాధలు తప్పవా?ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా వివరంగా చెప్పవలసి ఉంది. కానీ ఒక అవగాహన ఏర్పడినా చాలు అనే ఉద్దేశంతో, కొందరు స్నేహితులు అడిగినదానికి ఇక్కడ సమాధానం ఇస్తున్నాను.
పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు. మనందరి (జీవుల) రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు.. మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు.
కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం. కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము. ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు. అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ధ, ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధార పడి ఉంటుంది.
ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది. ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేసేరు. ఉదాహరణకు..ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది. వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగజేస్తారు. ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరే విధంగా వస్తుంది. ఉదాహరణకు మనం మనీఆర్డరు చేసిన అడ్రసులో ఎవరూ లేకపొతే మనకే తిరిగి వస్తుంది కదా. కానీ గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక మనం జీవించి ఉన్నంత కాలం పితృకర్మలు చేయవలసినదే.పితృ కార్యమప్పుడు ఒక భోక్తను పితృ స్థానంలో ఇంకొక భోక్తను విష్ణు స్థానంలో కూర్చో పెడతాం .పితృ స్థానంలో కూర్చోపెట్టిన భోక్తకు వాసు రుద్రా ఆదిత్య రూపంలో ఉన్న తండ్రి తథా ముత్తాత మూడు తరాల వారిని ఆవాహన చేస్తాం కదా .అందుకనే భోక్తలను సంతృప్తిగా భోజనం చేయమని తొందర పెట్టకుండా అడిగేది .పూర్వపు రోజులలో భోక్తగా ఉండేవారు ఇప్పుడు నలువురు తినే భోజనం తినేవారు .అరచేతి మన్దమ్ గారెలు బెల్లపు పరవాన్నంలో నెయ్యిపోసుకొని నంచుకు తినేవారు దగ్గరగా పది పన్నెడు గారెలు అవలీలగా తినేవారు భోజనంతో పాటుగా వారు నిజమైన భోక్తలు .ఇప్పుడు అసలు వారు భోజనం చేయటం చాలా తక్కువ షుగర్ అని బీపీ అని .భోక్తగా ఉండాల్సినవారు నియమ నిష్ఠ అంగవైకల్యం లేకుండా ఇంకా చాలా ఉన్నాయ్ .ఈ రోజులలో దొరుకుతున్నారా . ఇంతకుముందు తద్దినం అంటే అపరాహ్నం వచ్చిన తరువాత యింటివారి భోజనం సుమారు నాలుగు గంటల తర్వాతే .ఇప్పుడు తొమ్మిదికి ప్రారంభం పదిన్నరకు పూర్తి కార్యాలయమునకు వెళ్లడం .ఆ ఒక్కరోజు సెలవు పెట్టె వ్యవధి ఉండదు అర్గేంట్ పనులు .అదే వేరే ఏ పనికైనా సెలవులు కావాల్సినన్ని .శ్రద్ద లేని శ్రాద్ధాలు .అదేమంటే పెట్టామా లేదా .ఆప్రాంహం అయితే గానీ పితృదేవతలు రారు .వాళ్ళు రాకుండా తద్దినం ఎవరికోసం .భోక్తల భోజనం కోసమా ఎదో అయిపోయింది అనిఇంచుకోవటానికాజన్మతో బంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతావారికి గతించిన తరువాత కూడా తన పూర్వీకులతోనూ, తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది. మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారు.
సంప్రదాయ బద్ధంగా పెళ్ళి జరుగనప్పుదు ఇరువైపుల పితరులు (ముందు తరాలు, తరువాతి తరాలు) అధోగతి చెందుతారన్నది నిజం. వారు వ్యక్తిగతంగా పుణ్య చరిత్రులైనప్పటికీ ఈ బాధ తప్పదు. అందుకే మనవారు పెళ్ళిళ్ళలో సంప్రదాయానికి అంత విలువనిస్తారు. గతించిన వారి పుణ్య సాంద్రత మరీ ఎక్కువగా ఉంటే ఏ మహర్షివలననో ఉత్తమగతులు మళ్ళీ పొందే అవకాశం ఉంది కానీ ఖచ్ఛితంగా చెప్పలేము. అందుకే ఇదివరకు ఎవరైనా సంప్రదాయానికి విరుద్ధంగా పెళ్ళి చేసుకుంటే వారితో తలిదండ్రులు, బంధువులు సంబంధాన్ని త్రెంచుకునేవాళ్ళు. అది అభిమానం లేక కాదు. వారు, వారి పితరులు అధోగతిపాలు కాకూడదని మనసులో బాధపడ్డా అలా చేసే వాళ్ళు.
ఆ పైన పిల్లలు కలిగి, వారు పితృకర్మలు సరిగా చేస్తే పున్నామ నరక బాధలు తప్పుతాయనేది వాస్తవం. అందుకే మనవారు వంశం కొనసాగాలని అనుకునేవారు. కానీ మన ప్రయత్న లోపం లేకుండా సంతానం కలగనప్పుడు అంతగా విచారించనక్కర్లేదు. దానికి ప్రత్యామ్నాయంగా… దేవతల కళ్యాణాలు, మరి కొన్ని వ్రతాలు ఉన్నాయి. వాటిని ఆచరించడం వలన ఇది వరకు జన్మలలో చేసిన ఏ పాపం వలన పిల్లలు లేరో ఆ పాపాలని నాశనం చేసి, వారిని, వారి పితరులను కూడా తరింపజేసుకోవచ్చు. …స్నేహితులకు ధన్యవాదములతోశ్లోకం : "దేవకార్యదపి సదా పితృకార్యం విశిష్యతే "
వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి . నవమాసాలు కడుపులో పెట్టుకొని, రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణ భారము వహించిన తండ్రికి క్రృతజ్ఞత చూపడము మానవత్వము విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి .
దేవ కార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి. పితృకర్మలు, పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలనిస్తారు అనగా దేవ కార్యాలను వదిలి వేయాలని చెప్పడం కాదు. పితృకార్యాలు మాని ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలం లేదు పితృకార్యాలు చేసిన వారికే దేవ కార్యాలు ఫలిస్తాయి. అబీష్టసిద్దికి, వంశ వృద్దికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం.
మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం. అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని పురాణ వచనం.
మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.
మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్తను అనాదారణ చేసిన ఎడల పునర్జన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును. సర్ప హత్యా లేదా ఏదైనా నిరపరాదిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.
పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను యది మీకు సంభవము కాని ఎడల పితృ పక్షములో శ్రార్దము చేయవలెను. వైధీకులు రెండూ ను చేయాలి.శ్రాద్ధాచరణ విషయము నందు విశ్వేదేవతలు సాక్షిగా ఉందురు.శ్రీ మహా విష్ణువు శ్రాద్ధమునకు పర్యవేక్షకునిగా వుండును.ప్రధాన దేవతలు పితృదేవతలు ముగ్గురు.తండ్రి,తాత,ముత్తాత ,తండ్రి వసు స్వరూపుడు, తాత రుద్ర స్వరూపుడు, ముత్తాత ఆదిత్య స్వరూపుడు ఈ ముగ్గురూ వసు,రుద్ర,ఆదిత్య లోకముల యందు ఉందురని శాస్త్ర సంప్రదాయము. ఒకొకపుడు ఈ ముగ్గురూ వారి కర్మఫలాను భవానంతరము ఆ లోకములను విడిచి కర్మానుగుణముగ మరో లోకములో ప్రవేశించి ఉండవచ్చును. కానీ వారు ప్రవేశించిన లోకములు వారి స్థితి వసురుద్రాదిత్య లోకముల యందే తెలియబడును. శ్రాద్ధాచరణ విషయములో ఒకానొక స్థితిలో భోక్తలగు బ్రాహ్మణులు లభించనిచో కర్త అరణ్యమునకు వెళ్ళి నాకు బ్రాహ్మణులు లభింపలేదు అందుచేత శ్రాద్ధమును ఆచరించలేక పోవుచున్నాను. అని పెద్దగా ఏడవ వలెను. మరియు శ్రాద్ధాచరణ వాషయంలో ఇట్లుండవలెను. భోక్తలు తమ భోజన కాలములో కర్తవలు తమ కొరకు వండిన భక్ష్యాది పదార్ధములలో అపేక్షిత పదార్ధములను అడిగి భుజించవలెను.ఆయా భక్ష్య పదార్ధములు భుజించవలెనన్న కోరిక ఉన్ననూ సిగ్గుతో అడగలేక భక్షించలేకపోయినచో ఆ దోషము భోక్తలదే. అయిననూ కర్త పరిశీలిస్తూ అడిగివేయనిచో ఆదోషము కర్తదేయగును.
శ్రాద్ధము జరుగుచుండగా విశ్వేదేవతలు వసురుద్రఆదిత్య లోకములకు వెళ్ళి అచటనున్న పితృదేవతలతో ఇట్లు చెప్పెదరు.
ఓ పితృదేవతలారా భూలోకములో మీ పుత్రపౌత్రాదులు మీ కొరకు శ్రాద్ధము ఆచరించుచున్నారు.అని చెప్పెదరు.ఆసమయంలో పితృదేవతలు ఆ లోకములోనే ఉన్నచో భూలోకములో పితృదేవతా స్వరూపముతో భుజించుచున్న బ్రాహ్మణుల భోజన తృప్తిననుసరించి పితృదేవతలు తృప్తి చెందెదరు.ఒకవేళ పితృదేవతలు ఆ లోకములో లేక లోకాన్తరములో ఉన్నచో వారెచట ఉన్నది వసురుద్రాదిత్య లోకములో విచారించి విశ్వేదేవతలు వారేలోకములో ఉండిరో ఆ లోకములో వారికి శ్రాద్ధకర్త సమర్పించిన పిండము మున్నగు ఆహారములను సంక్రమింపజేసెదరు.ప్రస్తుతము పితృదేవతలు ఏ లోకమున ఉండెనో ఆ లోక వాసులు ఏ ఆహారమును తినెదరో అట్టి ఆహారముగా కర్త ఇచ్చిన పిండాది అన్నము మున్నగు పదార్ధములను మార్చి పితృదేవతలకు చెందునట్లు చేసెదరు.అదెట్లనగా పితృదేవతలు పుణ్యవశమున దేవలోకమున ఉన్నచో అప్పుడు భూలోకము లో కర్త ఇచ్చిన పిండాది అన్న విశేషములను దేవతలకు ఆహారమైన అమృత స్వరూపముగా అందించగలరు. రాక్షస లోకములో ఉన్నచో కర్త ఇచ్చిన పిండాది అన్న విశేషములను రాక్షసులకు ఆహారమైన మాంసము,నెత్తురు గా మార్చి భుజింపచేయగలరు. భూలోకములో పశు స్వరూపముగా ఉన్నచో లేత పచ్చగడ్డి మున్నగు పశువులకు యోగ్యమగు ఆహారముగా మార్చి సమర్పించగలరు.
శ్రీ శ్రీ

Source - Whatsapp Message

మహనీయుల మాటలు అక్షరసత్యాలు

🌞 మహనీయుల మాటలు అక్షరసత్యాలు💓🙏💓

💖నీ గమ్యం ఎంత ఎత్హు లో ఉన్నప్పటికీ, దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళకిందనుండే మొదలవుతుంది.!

💖వాడని ఇనుము తృప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.

💖నా జీవితం మహా అద్భుతంగా ఉంది. ! ప్రపంచమంతా మహా అద్భుతంగా ఉంది. అని రోజుకు ఒక్క సారైనా అనుకోండి. ఆతర్వాత జరిగే అద్భుతాలను చూడండి.!

💖లోపలి స్థితి ముఖ్యమా! బయట స్థితి ముఖ్యమా,! అంటే లోపలి స్థితికే ఓటు వేయాలి. ఎందుకంటే.లోపల స్థితి బాగుంటే, అన్నీ బాగున్నట్లే!

💖మనం సంతోషంగా ఉండటానికి ఎదో అవసరం అన్నది కేవలం భ్రమ మాత్రమే! సంతోషం అన్నది మనలోపలి ఒకానొక మానసిక స్థితి!

💖శరీరంలో అలసట వస్తే పర్వాలేదు! అదే అలసట మనసులో వస్తే వెంటనే స్పందించు! మరచిపోకు!

💖నీ జీవితం నీ చేతుల్లోకి రావాలంటే నీ దృష్టి ఇతరులను నియంత్రించడం లోకాదు .నీ దృష్టి నీపై మాత్రమే ఉండాలి.!,

💖నీవు నిజంగా సత్యం లో సత్య సాధనలో ఉంటే ఇతరుల మాటలతో నీకు పని లేదు! చివరికి నీకు తప్పక స్వేచ్ఛ లభిస్తుంది.!

మానస సరోవరం 👏

Source - Whatsapp Message

ఏకాంతంగా కాసేపు మనతో మనం

ఏకాంతంగా కాసేపు మనతో మనం ...

🌷🌷🌷🧘‍♀️🧘‍♀️🧘‍♀️🌷🌷

ప్రశాంత వాతావరణంలో ఏకాంతంగా ఆలోచిస్తే
వారి వారి ఆలోచనా విధానం,
బలాబలాలు,
శక్తి సామర్ధ్యాలు,
ఆశలు ఆశయాలు,
విదితమౌతాయి.

ఏకాంతంగా సమయం గడప చేతగాని వారిలో లోపం ఉంటుంది.

భూమిలో నాటబడిన విత్తనం ఒంటరిగానే భూమిని చీల్చుకొని మొక్కవుతుంది.

నీటిలో ఈదే చేప కూడా ఒంటరిగానే ఈదుతుంది.

ఆకాశంలో పక్షి మినహాయింపేమి కాదు మరి.

గొప్పవారైనవారు గుట్టుగా గడిపిన సమయం లెక్కకు మిక్కువే.
గోప్యంగా వేసుకున్న ప్రణాళికలు ఎక్కువే.

రాజకీయనాయకులు, వ్యాపారులు, విద్యావేత్తలు, సంఘసంస్కర్తలు, దైవ సేవకులు.

పురోగతికైనా, అధోగతికైనా ఏకాంత సమయం ఎంతో అవసరం.

🌷🌷🌷🧘‍♀️🧘‍♀️🧘‍♀️🌷🌷🌷

మహా మృత్యుంజయ మంత్ర ధ్యానం


🧘‍♀️🧘‍♀️🧘‍♀️🌷🌷🌷🧘‍♀️🧘‍♀️🧘‍♀️

ఏకాంత సమయంలో తట్టిన ఆలోచనల్ని ఆచరణలో పెట్టుటకు
స్వశక్తి, ఇతరుల శక్తి కూడ బెట్టుకోవాలి.

మోటార్ సైకిల్ను నడుపుతూ సర్వీసింగ్ చేయగలమా ... సర్వీసింగ్ లేని మోటార్ బైక్ కొంత కాలానికి పనిచేయడం ఆగిపోతుంది .. ఆలాగే మన మెదడు కూడా ..
మన మెదడు లో ఆలోచనలకి కాస్త రెస్ట్ ఇచ్చి ... ధ్యానం లేదా నామ జపం తో ఏకాంతం లో మన మెదడునీ మనసుని కాస్త శుద్ధి చేసుకుని రెట్టించిన ఉత్సాహంతో .. మరిన్ని అవకాశాలు అందుకోవాలి ....

అత్యంత శక్తివంతమైన ఏకాంత సమయాన్ని సంపూర్ణంగా మన అభివృద్ధి కి ఉపయోగ పడేలా చేయగల శక్తి కేవలం ఆ భగవన్నామ స్మరణం కి మాత్రమే ఉంది ...

భగవన్నాస్మరణ ఎంత మృధు మధురంగా ఉంటుందో తెలుసా???

ప్రయత్నించి ప్రయోజనం సొంతం చేసుకుంటారని ఆశిస్తూ.

ఉషోదయం తో మానస సరోవరం.👏

Source - Whatsapp Message

జీవిత సత్యాలు.

జీవిత సత్యాలు.

ఏడు తరాల కోసం ఎంత ఆర్జిస్తే మాత్రం ఏం లాభం ....

రెండో తరానికి నువ్వు కట్టిన ఇంట్లో ఫొటో పెట్టే ఆసక్తి లేనప్పుడు.....


నీ మూడో తరానికి నీ పేరే గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తి లేనప్పుడు.....

సంపాదన మానేయడం కాదు.

మితిమీరి సంపాదించటం మానేయడం ఉత్తమం..


సూర్యుని బొమ్మను చూపించి సూర్యకాంతి వస్తుంది అంటే రాదు....

హోటల్‌లో సర్వరు వంటల పట్టిక ఎంతసేపు ఏకరువు పెట్టినా

ఆకలి తీరటం కాని, రుచిని ఆస్వాదించటం కాని జరుగదు....

అదే విధంగా

వంటకు కావలసిన పప్పు, ఉప్పు, బియ్యం, కారం, చింతపండు, కాయగూరలు, నూనె వగైరా అన్నీ ఉన్నా

తింటానికి కావలసింది తయారుకాదు.....

అగ్ని లేకపోతే పదార్థాలన్నీ కూడా వాటి పూర్వస్థితిలోనే ఉండిపోతాయి.....

పొయ్యి కింద నిప్పుపెట్టి, పదార్థాలను అన్నిటిని తగుపాళ్ళలో ఉపయోగించి వంట చేసినప్పుడే కదా..

కావలసిన రుచి, తింటానికి పదార్థం లభిస్తుంది.

పదార్థాలు పక్వం అవ్వటానికి, ఆహారం తినటానికి నిప్పు ఎంత అవసరం అయిందో

అదే విధంగా

ఆత్మానందాన్ని అనుభవించటానికి

ఆత్మజ్ఞానం కూడా అంతే అవసరం అయి ఉంది....


" ఎదుటోడి తప్పును గుర్తించేవాడు మేధావి.

తన తప్పును గుర్తించేవాడు జ్ఞాని.


దౌర్భాగ్యం ఏమిటంటే మనచుట్టు మేధావులకు కొదవలేదు.

జ్ఞానులకు ఉనికి లేదు "


" నిజాన్ని మార్చే శక్తిఈ ప్రపంచంలో ఎవరికి లేదు.

కానీ

ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. "

అర్థం అయిన వారికి జవాబు ఇస్తే చర్చ బాగుంటుంది.

అర్థం కాని వారికి జవాబు ఇస్తే వాదన జరుగుతుంది.
                             
లక్ష్య వస్తువుపై ఏకాగ్రత పెంచుకోవడానికి ముందు

మీరు ఇతర విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి.


దీరులు ...సమర్థులైన అయిన కార్యసాదకులకే అదృష్టం అనుకూలిస్తుందీ .

దైర్యసాహసాలతో కడవరకు ప్రయత్నాన్ని కొనసాగించే వారికే విజయం వరిస్తుంది..


" కల అంటే నిద్ర వచ్చేది కాదు,

నిద్రపోనివ్వకుండా చేసేది. "

నిజం నిలకడగా నివాసం
ఉండాల్సింది

మనిషి హృదయంలో.....
పైపై పెదవులపై కాదు...


మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండి కాదు.....

నాణ్యమైన మట్టి!

అలాగే ......

పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు
సంస్కారం

ఉషోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Saturday, June 26, 2021

స్త్రీ అంతరంగం.....

స్త్రీ అంతరంగం......

ఓడిపోతున్నానో
ఒదిగివుంటున్నానో
ఓపికపడుతున్నానో
ఒంటరిగా పోరాడుతున్నానో

ఏమో
సాగిపోతున్న కాలంలో

నేను
ఒకరికి కూతురిని
ఒకరికి చెల్లిని
ఒకరికి అక్కని
వేరొకరికి భార్యని
మరొకరికి కోడలిని
ఇప్పుడు ఓ అమ్మని
రేపు ఓ అత్తని
ఇలా ఎన్నో బంధాలను అల్లుకుపోతున్న
బాధ్యతలతో అలిసిపోతున్న
అయినా గుర్తించేవారు లేరు
అనుక్షణం ఆరాటం తో పరిగెడుతున్న
అలుపెరుగని పయనంలో ఒంటరి బాటసారిలా వున్న
ఏ బంధాలు తోడుండవు
ఎందుకంటే
అన్నిటికి నేనే నీడని కాబట్టి
అందుకే
ఓడిపోతున్నానో
ఒదిగివుంటున్నానో
ఓపికపడుతున్నానో
ఒంటరిగా పోరాడుతున్నానో
ఏమో నన్ను నేను కోల్పోయి
మరొకరికి అన్ని నేనే అవుతున్న
అందుకు నేను గర్వపడుతున్నా
🙏🙏🙏

సేకరణ

Source - Whatsapp Message

కాఫీ మూత తీయమనడంలో ఎంత చక్కని విషయం చెప్పింది ఈ బామ్మ

🍀🍀🍀

కాఫీ మూత తీయమనడంలో ఎంత చక్కని విషయం చెప్పింది ఈ బామ్మ చూడండి

👌చుట్టూ అన్నీ పళ్ళ చెట్లు పూలచెట్లు మధ్యలో అందమైన ఇల్లు అందులో ఇద్దరే బామ్మ తాతయ్య ఉన్నారు
రోజూ సంధ్యవేళ ఆరు బయట ఆ తోటలో కాఫీ తాగుతూ కాసేపు గడుపుతారు

పక్కింటిలోకి ఓ పెళ్ళైన కొత్త జంట దిగారు
వారు ఇరువురు ఉద్యోగం చేస్తారు వారం చివరిలో ఈ బామ్మ తాతయ్యతో కాసేపు గడిపేవాళ్లు

వీరికి వారం అంతా పడ్డ శ్రమ ఆ ఒక్క సాయంత్రం అక్కడ గడిపేస్తే చాలా ప్రశాంతంగా ఉంటారు బాగా అలవాటైంది
బామ్మ చేతి కాఫీ కూడా అందుకు ఒక కారణం
బామ్మ కాఫీ డబ్బా తీసుకొచ్చి కాస్త మూత తీసిపెట్టబ్బా అని తాతయ్యను అడగడం
ఆయన తన మీసం మెలేసి మూతను తీసివ్వడం బామ్మ నవ్వుతూ వెళ్ళి నలుగురికి కాఫీ కలుపుకు వచ్చి ఇవ్వడం జరిగింది

ఇలా రెండు వారాలు చూసిన జంట బామ్మకు కాఫీ మూత సులభంగా తీయగల సాధనాన్ని తెచ్చి ఇచ్చారు
అయినా కూడా బామ్మ అదే తంతు తాతయ్య దగ్గరకు తేవడం మూత తీసివ్వమనడం
ఇది చూసిన ఏ అమ్మాయి బామ్మతో పాటు వెళ్ళి
బామ్మా నేను ఇచ్చిన సాధనం వాడలేదా అని అడిగింది
అందుకు బామ్మ చెప్పిన విషయం నిజంగా అర్థం చేసుకుని నడుచుకుంటే జీవితం ఇంత ఆనందంగా గడపవచ్చా అని అనిపిస్తుంది

మూత తీయడం పెద్ద కష్టం ఏమీ కాదమ్మా
నేను తీయగలను కానీ నా చేత కావడం లేదు మీరు కాస్త తీసివ్వండి అన్నప్పుడు ఆయన కళ్ళలో నేను బలశాలి అనే నమ్మకం కనబడుతుంది
నా భార్యకు అన్నీ నేనే
నన్నే నమ్ముకుంది అనే ప్రేమ కనబడుతుంది
వయసు పెరిగినా ఇంకా నా వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంది అనే ఆత్మవిశ్వాసం కనబడుతుంది
ఈ భూమికి భారంగా నేను లేను అనే సంతోషం కనబడుతుంది

అందుకే ప్రతిరోజు ఇలా చేస్తాను అని చెప్పింది బామ్మ

నిజమే కదండీ మనిషి నావల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కృంగిపోయి నశించిపోతారు అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల వారిని ఉన్నంతవరకు సంతోషంగా ఉంచొచ్చుకదా

వయసు మీదపడ్డవారు ఏదైనా చేస్తాను అన్నప్పుడు అడ్డుపడకండి
మీ వల్ల కాదు అని నిరాశను వారికి ఇవ్వకండి 🌹

Source - Whatsapp Message

స్వేఛ్ఛ,సంతోషం మన ఎంపికే

🍁 స్వేఛ్ఛ,సంతోషం మన ఎంపికే🍁


👌ఒక రోజు ఆది శంకరాచార్యులు
శిష్యులతో కలిసి వెళ్తుంటే, ఒక వ్యక్తి ఆవును తాడుతో లాగటం తారసపడింది.

శంకరులు తన శిష్యులతో, ‘ఆవు ఆ మనిషికి కట్టుబడి ఉందా.
లేదంటే, మనిషి ఆవుకు కట్టుబడి ఉన్నాడా?’ అని అడిగారు.
.
శిష్యులు ఏమాత్రం సంకోచించకుండా ‘గురువర్యా! తప్పకుండా ఆవే మనిషికి కట్టుబడి ఉంది.
మనిషి తాడు పట్టుకొని ఉన్నాడు.
ఆవు ఎక్కడికి వెళ్లినా అతణ్ని అనుసరించాలి.
మనిషి యజమాని, ఆవు బానిస’ అని చెప్పారు.

ఇప్పుడు చూడండి’ అని శంకరాచార్యులు ఆ తాడును కత్తిరించారు. వెంటనే ఆవు పారిపోయింది.
యజమాని దాని వెంట పరుగుపెట్టాడు.

అప్పుడు శంకరులు ‘శిష్యులారా! ఆవుకు తన యజమాని పట్ల అస్సలు ఆసక్తి లేదు. నిజానికీ ఆవు ఆ మనిషి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తోంది.

మన మనసు విషయంలో కూడా అదే జరుగుతుంది. మనసు దానంతట అదే చెడు ఆలోచనల మీద ఆసక్తి చూపదు.
మనమే చెడు ఆలోచనలతో దాన్ని నింపుతున్నాం.
వాటికి బదులు మంచి ఆలోచనలకి మనసులో స్థానం ఇవ్వాలి.
అప్పుడు చెడు ఆలోచనలు ఆ ఆవులాగే వెళ్లిపోతాయి. స్వేచ్ఛ, సంతోషం మన ఎంపికే’ అని బోధించారు శంకరులు.🤘

Source - Whatsapp Message

కరిగిపోయిన కాలం తిరిగిరాని జ్ఞాపకం.

కరిగిపోయిన కాలం తిరిగిరాని జ్ఞాపకం.

తలచి, తలచి నిలిచిపోతే
సాగదు నీ జీవితం.

తిరిగిరాదు నీకు ఇష్టమైన గతం.

ఆగిపోదు కష్టమైనా వర్తమానం.

ఎన్ని ఆటుపోటులు ఎదురైనా ఆగదు నీ హృదయం.

అది ఆగేసరికి - మిగలదు ఈ జీవితం.

మరెందుకు నీ దారికిరాని వాటికై ఈ ఆరాటం.

అనుభవించు - కష్టమైనా నష్టమైనా తిరిగిరాని ఈ నిముషం.

కరిగి, వెళ్ళిపోయిన కాలం ఎప్పుడూ మళ్ళీ మన జీవితాన తిరిగిరాని జ్ఞాపకం.

అది మధురమై ఉండొచ్చు,

లేదా చేదుగా ఉండచ్చు.

ఆ జ్ఞాపకమై అక్కడే నిలిచి,
దాని గురించే ఆలోచిస్తూ ఉంటే మన జీవితం సాగదు.

మన జీవితాన జరిగిన అందమైన,

ఎంతో ఇష్టమైన గడిచిన జ్ఞాపకాలు ఎన్నడూ తిరిగిరావు.

ప్రస్తుతం ఉన్న కొనసాగుతున్న జీవితం కష్టముగా ఉన్నా అది ఎన్నడూ దేనికోసమనీ ఆగదు.

ఎన్ని ఎగుడు దిగుడ్లు ఉన్నా మన మనసు ఆలోచన ఆగిపోదు.

ఒకవేళ అది ఆగిపోవడమంటూ జరిగితే, మన ప్రాణం పోయినప్పుడే కానీ మామూలుగా మాత్రం అలా జరుగదు.

మన దగ్గరికి మళ్ళీ తిరిగిరాని - గతించిన జ్ఞాపకాల వెంట ఎందుకు పరుగులాటలు?

ప్రస్తుతం మీ ముందున్న వర్తమానం లోని ప్రతి నిమిషాన్నీ - అది సంతోషమే గానీ, బాధతో కూడినదై ఉండనీ - దాన్ని మనస్పూర్తిగా అనుభవించడం చేయకతప్పదు.

Source - Whatsapp Message

మనం ఆరోగ్యంగా ఉండాలంటే

🌻🌻🌻🌻🌻 💥

🤔ఆశ్చర్యకరమైన పరిశోధన ఫలితాలు:
1. Acidity: కేవలం ఆహారం తీసుకొనే విధానంలో లోపాల వల్ల మాత్రమే కాదు.
అధిక ఒత్తిడి వలన కూడా ఎక్కువ ఆధికం అవుతుంది
2. Hypertension: కేవలం ఉప్పు ఎక్కువుగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మాత్రమే కాదు.
ప్రధానంగా భావోద్వేగాలను నియంత్రించడంలో వైఫల్యం కారణంగా కూడా వస్తుంది
3. Chollesterol కేవలం కొవ్వు పదార్ధాలు తినటం వలన మాత్రమే కాదు,
అధిక సోమరితనం లేదా నిశ్చల జీవన విధానం ఎక్కువ కారణం అవుతుంది.
4. Asthma కేవలం ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగటం వలన మాత్రమే కాదు.
తరచుగా విచారకరమైన ఆలోచనలు కూడా ఊపిరితిత్తులను అస్థిరంగా మారుస్తాయి.
5. Diabetes కేవలం గ్లూకోజ్ వుండే ఆహారం ఎక్కువగా తినడం వల్ల మాత్రమే కాదు.
స్వార్థపూరిత మరియు మొండి వైఖరి కూడా క్లోమం యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది.
6. Kidney stones కేవలం కాల్షియం ఆక్సలేట్ డిపాజిట్స్ వలన మాత్రమే కాదు.

భావోద్వేగాలు మరియు ద్వేషం వలన కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చును.
7. Spondylitis కేవలం L4, L5 లేదా గర్భాశయ రుగ్మతల వలన మాత్రమే కాదు.
ఎక్కువ పని భారం లేదా భవిష్యత్తు గురించి ఎక్కువ చింత వలన వెన్నుముక సమస్యలు రావొచ్చును.
కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే:
1)మొదటిగా మన మనస్సును నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి.
2) ప్రతివారితో ప్రేమగా, స్నేహముగా ఉండాలి.
3) రెగ్యులర్ గా వ్యాయామాలు చేయాలి.
4) ప్రతీ రోజు భగవంతుని ప్రార్ధించాలి.
5) ఇతరులను నవ్వించండి మీరూ నవ్వండి.
6) చేసేపనిని ఇష్టంతో చేయండి.
ఈ చర్యలు మన మనస్సును ఉత్సాహంగా ఉంచటంతో బాటు మన శరీరాన్ని బలోపేతం చేయడానికి మనకు సహాయపడతాయి ...
ఆరోగ్యంగా ఉండండి జీవితాన్ని ఆస్వాదించండి.
శరీరమాద్యం ఖలుధర్మ సాధనం🌻🌻🌻🌻

Source - Whatsapp Message

ఫాల్స్ ప్రిస్టేజ్ కు పోయి టిప్పు విగ్రహ ఏర్పాటుకు పూనుకోవద్దని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు!

ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి ఒక విన్నపం! ముస్లిం మతానికి చెందిన గొప్ప వారి విగ్రహాలు ఏర్పాటు చెయ్యాలనుకొంటే దయచేసి అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యండి! అందరం ఆ మహానుభావునికి చేతులెత్తి మొక్కుతాము! అంతేకానీ టిప్పు సుల్తాన్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బీన్ తుగ్లక్, మహమ్మద్ గజనీ, మహమ్మద్ ఘోరీ, ఔరంగేబు లాంటివారి విగ్రహాలు అవసరం లేదు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిప్పు విగ్రహం ఒక్కటైనా ఉన్నదా? ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రదేశ్ క్రీ.శ. 1954 లో విడిపోగా ఆనాటి నుండి ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పేంతవరకూ ఆంధ్రులకెవ్వరికీ టిప్పు స్వాతంత్య్ర పోరాట యోధుడని తెలియకుండా పోయిందా? భారత (కాంగ్రెస్) చరిత్రకారుల మాటలు నమ్మి టిప్పు సుల్తాన్ కడపలో వివాహం చేసుకున్నాడని ఎమ్మెల్యే గారు చెబుతున్నారు. కానీ ఎమ్మెల్యే గారు చెపుతున్నది తప్పు వాస్తవమేమంటే టిప్పు తండ్రి హైదర్ ఆలీ కడప కోటలో గవర్నర్ గా పనిచేస్తున్న మైనుద్దీన్ కుమార్తెను వివాహం చేసుకొన్నాడు. టిప్పు సుల్తాన్ తల్లి ఫక్రున్నీసా (ఫాతిమా) కు కడపతో సంబంధం వుంది.

ఎమ్మెల్యే గారూ! దయచేసి సంజయ్ ఖాన్ నటించిన టీవీ సీరియల్, కాంగ్రెస్ పాలనలో రచించిన చరిత్రను చూసి టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై నిర్ణయాలు తీసుకోకండి!

ప్రొద్దుటూరులో విగ్రహం ఏర్పాటు చెయ్యొద్దని ప్రజలు కోరుతుంటే కాంగ్రెస్ హయాంలో బెంగుళూరులో నిర్మించిన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని తొలగించగలరా అని ఎమ్మెల్యే గారు మాట్లాడడం వితండవాదం అవుతుంది. ఎమ్మెల్యే గారూ! కర్నాటకలోని మేల్కోటే లో వందల సంవత్సరాలుగా అక్కడి ప్రజలు దీపావళి పండగను ఎందుకు నిషేధించారో మీరు మెచ్చుకొంటున్న భారత (కాంగ్రెస్) చరిత్రకారులు వ్రాశారా వ్రాయలేదా?

ఎమ్మెల్యే గారూ! మీరు చెబుతున్న భారత (కాంగ్రెస్) చరిత్రకారుల కళ్ళకు టిప్పు 17 సంవత్సరాల పాలనలో కొడగు (కూర్గ్), చిత్రదుర్గ, మేల్కోటే, మంగళూరు, మలబార్ తీర ప్రాంతాలలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటనలు కనిపించలేదా? ఎమ్మెల్యే గారూ! దయచేసి చరిత్రలను పక్కనపెట్టి ఒక్కసారి కూర్గ్, మేల్కోటే, చిత్రదుర్గలకు మీరే స్వయంగా వెళ్లి అక్కడి ప్రజలను విచారించండి! అప్పుడుకూడా మీకు ప్రజలు చెప్పేది తప్పని భారత (కాంగ్రెస్) చరిత్రకారులు వ్రాసిందే ఒప్పని అనిపించిందంటే ఈ విషయాన్ని ప్రజలు మీ విచక్షణకే వదిలేస్తారు!

టిప్పు తండ్రి హైదర్ ఆలీ మైసూర్ రాజుల దగ్గర పనిచేసేవాడు! నమ్మకంతో వారు హైదర్ ఆలీని శ్రీరంగపట్నానికి సామంతరాజును చేస్తే కొంత కాలానికి ఎదురుతిరిగి శ్రీరంగపట్నాన్ని మరికొంత కాలానికి మైసూర్ పై దాడి చేసి మైసూర్ ను వశపరచుకొన్నాడు! వీలులేక మైసూర్ వడియార్ రాజులు బ్రిటీషు వారిని ఆశ్రయించారు!

ఎమ్మెల్యేగారేమో టిప్పు చరిత్రను బ్రిటీషు వారు వక్రీకరించారంటున్నారు మరి పోర్చుగీస్ వారు వ్రాసిన చరిత్ర మాటేమిటి? పోర్చుగీస్ చరిత్రకారుడు ఫాదర్ బెర్తులోమియా వ్రాసిన చరిత్ర కూడా అబద్దమేనా? టిప్పు తన సేనాధికారులకు వ్రాసిన ఉత్తరాలూ అబద్దమేనా? మేల్కోటేలో ఆనాడు దుర్మరణానికి గురైన వారి వారసులు అబద్దాలు చెపుతున్నారని మీ అభిప్రాయమా? చిత్రదుర్గ, కూర్గ్ ప్రాంత ప్రజలు చెప్పేవి కూడా అబద్దాలేనా?

ఏ చరిత్రకారుడు కాదనలేని సత్యమేమంటే యుద్దంలో టిప్పు మరణించిన తర్వాత బ్రిటీష్ వారు శ్రీరంగపట్నం, మైసూర్ లను వడియార్ రాజులకే అప్పగించారు! తర్వాత బ్రిటీష్ వారు భారతదేశం గర్వించదగ్గ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశరయ్య ఆధ్వర్యంలో మైసూర్ రాజుల కోసం మైసూర్ ప్యాలెస్ ను, మైసూర్ రాజుల అభ్యర్థన మేరకు కృష్ణరాజసాగర్ డ్యాం మరియు బృందావన్ గార్డెన్స్ ను నిర్మించారు! బ్రిటీష్ వారు మంచివారని చెప్పడం కోసం ఈ మాటలు చెప్పడం లేదు! కేవలం జరిగిన చరిత్ర చెప్పడం జరిగింది!

ఇక టిప్పు విషయానికొస్తే భారతదేశంపైకి దండెత్తి రావాలని, అందరం కలిసి భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మారుస్తామని ఆఫ్గనిస్తాన్ రాజు జమాన్ షా కు టిప్పు అనేక ఉత్తరాలు వ్రాశాడు. అలాంటి వ్యక్తి స్వాతంత్య్ర సమరయోధుడు ఎలా కాగలడు? కేవలం బ్రిటీష్ వారితో యుద్ధం చేసినంత మాత్రాన టిప్పు సుల్తాన్ భారత స్వాతంత్య్ర పోరాటవీరుడు కాదు ఎందుకంటే టిప్పు నిజాం నవాబులతో, మరాఠా రాజులతో, కేరళ రాజులతో యుద్దాలు చేశాడు. దీన్నిబట్టి టిప్పుకు వున్న అనేకమంది శత్రువులలో బ్రిటిష్ వారు కూడా ఒకరు అంతే.

బ్రిటిష్ చరిత్ర కారుడు లూయీస్ రయిస్ వ్రాసిన మైసూర్ గజెట్, మలబార్ గజెట్ ల ప్రకారం టిప్పు తన 17 సంవత్సరాల పరిపాలనలో 99.9% హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం, విగ్రహాలను పగులగొట్టడం, సంపదను దోచుకోవడం చేసినట్లు నమోదుచేశారు. లూయిస్ రయిస్ లెక్క ప్రకారం దాదాపు 8000 ఆలయాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అయితే శ్రీరంగపట్నంలోని రంగనాథాలయం మరియు ఇంకో ఆలయం జోలికి టిప్పు వెళ్ళలేదు. కారణమేమంటే ఈ ఆలయాల్లో ప్రతిరోజు పూజలు చెయ్యడం వలన టిప్పుకు మేలు కలుగుతుందని కొందరు బ్రాహ్మణ జ్యోతిష్యులు చెప్పి వుండడం, ఆమాటలను టిప్పు విశ్వసించడం. టిప్పు లాంటి వ్యక్తికి అంతగా నమ్మకం కలిగించి శ్రీరంగపట్నంలోని రెండు ఆలయాలను కాపాడిన ఆ బ్రాహ్మణ జ్యోతిష్యులు మహాఘటికులని చెప్పవచ్చు. శ్రీరంగపట్నంలోని రంగనాథాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ గైడ్ ఈ విషయం చెప్పాడు.

కొందరు కాంగ్రెస్ మూర్ఖులు టిప్పు సుల్తాన్ ను కన్నడ భాషాభిమానిగా భావిస్తారు. అయితే వాస్తవం ఏమంటే టిప్పు తన పరిపాలనా భాషగా పార్శి భాషను ప్రవేశపెట్టాడు. ఈరోజుకు కూడా కర్ణాటక రెవిన్యూ రికార్డులను పరిశీలిస్తే టిప్పు ప్రవేశపెట్టిన ఖాతా, బగర్ హుకుం లాంటి పదాలు కనిపిస్తాయి. టిప్పు మైసూర్ పేరును నజరాబాద్, కాలికట్ ను ఇస్లామాబాద్ గా, సక్లేష్పూర్ ను మంజ్రాబాద్ గా మార్చాడు. టిప్పు పతనం తరువాత ఆ పేర్లన్నీ తిరిగి తమ పాత పేర్లతో పిలువబడుతున్నాయి. టిప్పు ఆనాటి హిందూ క్యాలెండర్ ను రద్దు చేసి ఇస్లామిక్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టాడు. టిప్పు ప్రవేశపెట్టిన క్యాలెండర్ ప్రకారం ఏడాదికి 350 రోజులు మాత్రమే ఉండేవి.

నిస్సందేహంగా టిప్పును నరహంతకుడుగా, విచక్షణ లేనివానిగా, హిందూ ద్రోహిగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఇతర రాజ్యాలపై యుద్ధం చేసి గెలిచినట్లైతే అక్కడ పట్టుబడిన అందమైన హిందూ స్త్రీలను శ్రీరంగపట్నానికి పంపమని మరియు ఎంతమంది హిందువులను ఇస్లాం మతంలోకి మార్చారో వివరాలు చెప్పమని తన సేనాధిపతులకు ఉత్తరాలు వ్రాసేవాడు. ఈ ఉత్తరాలన్నీ ప్రస్తుతం లండన్ లోని భారత కార్యాలయంలో వున్నాయి. పోర్చుగీస్ చరిత్రకారుడు ఫాదర్ బెర్తులోమియా వ్రాసిన చరిత్రలో టిప్పు ఆనాడు హిందువులపై సాగించిన అరాచకాలను వివరించాడు. హిందువులపై టిప్పు చేసిన అకృత్యాలను ఇంకొకరితో పోల్చవలసివస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ ఘోరీ, మహమ్మద్ గజని, ఔరంగజేబులతో పోల్చవచ్చని బ్రిటిష్ చరిత్రకారుడు విలియం లార్డ్ మలబార్ గజెట్ లో పేర్కొనడం జరిగింది.

ఎమ్మెల్యే గారూ! టిప్పుసుల్తాన్ క్రీ.శ. 1790 నరకచతుర్దశి రోజు రాత్రి మేల్కోటే ఆలయ ప్రాంగణంలో 800 మందిని నిర్దాక్షిణ్యంగా వధించిన ఘటన మీకు తెలుసా? లేక మీరు మెచ్చుకొంటున్న భారత (కాంగ్రెస్) చరిత్రకారులు వ్రాయలేదా?

క్రీ.శ. 1790 లో టిప్పు సుల్తాన్ దురాక్రమణ: తన అత్యంత క్రూరమైన సహాయకులు, సైన్యం కలిసి టిప్పు మేల్కోటే ఆలయానికి చేరుకున్నాడు. అప్పటికి ఆ ఆలయంలో 1000 మంది భక్తులు నరక చతుర్దశి పండుగను, ఊరేగింపును జరుపుకుంటున్నారు. టిప్పు ఆలయ తలుపులు, ప్రధాన ద్వారాలు మూసివేసి 1000 మందిలో 800 మందిని ఊచకోత కోశాడు. పసిపిల్లలు అని కూడా దయ చూపలేదు. 200 మంది సుందర స్త్రీలను బంధించాడు. మరుసటి రోజు ఉదయం అంటే దీపావళి రోజున టిప్పు మేల్కోటే ఆలయాన్ని కూలగొట్టి, సంపదను కొల్లగొట్టాడు. ఆలయ సంపదను తరలించడానికి 26 బలమైన ఏనుగులు, 180 గుర్రాలకు మూడు రోజులు సమయం పట్టింది.

టిప్పు భూమిపై ఇప్పటివరకు నివసించిన అత్యంత క్రూరమైన పాలకులలో ఒకడు. ఆనాటి ఘటనకు గుర్తుగా ఇప్పటికీ మైసూరు మేల్కోటే ప్రాంతంలో చాలామంది దీపావళి పండుగను జరుపుకోరు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ ప్రాంతానికి చెందినదే కావడంతో ఆమె కూడా తన జీవితంలో ఎప్పుడూ దీపావళి పండుగ జరుపుకోలేదు.

ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ భారతీయ చరిత్రను ఎలా మార్చి టిప్పును పొగుడుతూ పిల్లల పాఠ్యపుస్తకాల్లో అబద్దాలు వల్లించిందో అందరూ గమనించాలి.

టిప్పుచే దోచుకోబడ్డ కొన్ని దేవాలయాల జాబితా..👇

త్రిపాంగోట్, త్రిచెంబరం, తిరునవయ, తిరువన్నూర్, కాలికట్ తాలి, హేమాంబికా ఆలయం, పాల్ఘాట్ లోని జైన దేవాలయం, మామియూర్, పరంబతాలి, వెంకటంగూ, పెమ్మాయనడు, తిరువంజుకులం, తేరుమనవ, తైమళూన్, తెమపనుమ, వడకళ కేరళీశ్వర, త్రిక్కండియూర్, సుకాపురం, భగవతి ఆలయం, మరణేహి ఆలయం, వెంగర ఆలయం, టికులం, రామనాథక్రా, అజింజలం.

టిప్పు ప్రధాన పండుగ రోజులలో ఊచకోత కోయడానికి మరియు దోపిడీ చేయడానికి ఎంచుకునేవాడు. కారణం ఆ రోజున అధిక భక్తులు దేవాలయాలకు చేరుకుంటారు మరియు హిందూ దేవుళ్ళ విగ్రహాలను బంగారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలతో అలంకరించేవారు. అప్పట్లో అధిక సంపద దేవాలయాల ఆధ్వర్యంలోనే ఉండేది.

ఎమ్మెల్యే గారూ! ఒక్క విషయం ఆలోచించండి మీరు ఎన్నో విగ్రహాలు పెట్టించారు ఎవరైనా అభ్యంతరం తెలిపారా లేదే! ఇప్పుడు కూడా అబ్దుల్ కలాం గారి విగ్రహం పెట్టించండి లేదా పోతులూరి వీరబ్రమ్హేంద్రస్వామి గారి శిష్యుడు సిద్దయ్య గారి విగ్రహం పెట్టించండి ఎవ్వరూ వద్దనరు! దయచేసి ఫాల్స్ ప్రిస్టేజ్ కు పోయి టిప్పు విగ్రహ ఏర్పాటుకు పూనుకోవద్దని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు!

(లండన్ లైబ్రరీలో భద్రపరచబడిన టిప్పు యొక్క వాస్తవ చిత్రాన్ని చూడండి)

Source - Whatsapp Message

ఆణి ముత్యాలు

నిజాయితీగా ఉండడం కూడా ఓ యుద్దం లాంటిదే....
యుద్ధంలో ఒంటరిగా నిలబడటం ఎంత కష్టమో,,,,

సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం....

""""""""""""''''''''""""""""""""""""""""""""""'''''''''''"'""""""'"'"''"

మనిషికీ కత్తి ఇచ్చి వీరున్ని చేయవచ్చు,,,,!!!
పుస్తకాలు ఇచ్చి మేధావిని చేయవచ్చు,,,,

కానీ,,,,!

మంచివాడు కావాలంటే మాత్రం,,,,
మంచి మనసు ఉండాలి తప్ప,,,,
అది మనం ఇవ్వలేం....



నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది....

అదే వేరొకరి పై వుంచితే అది మీ బలహీనత అవుతుంది....
_

Source - Whatsapp Message

ఆత్మవిశ్వాసం

ఆత్మవిశ్వాసం :-

ఓ వ్యాపారవేత్త వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల పాలయ్యాడు. అందులో నుంచి బయటపడటానికి ఎలాంటి మార్గమూ కన్పించలేదు.
అతనికి అప్పులు ఇచ్చిన వాళ్లు బాకీ తీర్చమని వేధించడం మొదలుపెట్టారు. అతనికి వస్తువులు సరఫరా చేసిన వాళ్లు డబ్బులు చెల్లించమని రోజూ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు.

ఇలాంటి పరిస్థితుల్లో అతను ఓ రోజు ఉదయం ఇందిరా పార్క్‌కి వచ్చి తల పట్టుకు కూర్చున్నాడు. తన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు.

అప్పుడే అతని దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. అతని వయసు 70 సంవత్సరాలు ఉండవచ్చు. వ్యాపారవేత్త ఏదో బాధలో వున్నట్టు అతను గమనించాడు.
‘చాలా బాధలో వున్నట్టున్నావు?’ ప్రశ్నించాడు.

వ్యాపారవేత్త తన పరిస్థితిని వివరించాడు. ‘నీకు నేను సహాయం చెయ్యగలను’ చెప్పాడు ఆ వ్యక్తి.

వ్యాపారవేత్త పేరు అడిగి తెలుసుకొని పది లక్షలకి చెక్ రాసి అతనికిచ్చి ఇట్లా అన్నాడు. ‘ఈ డబ్బు అవసరమైతే వాడుకో. సరిగ్గా సంవత్సరం తరువాత ఇక్కడే కలుద్దాం. అప్పుడు ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేద్దువు’

వ్యాపారవేత్త ఆలోచించేలోపే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు. దేవుడే అతడిని పంపించాడని అనుకున్నాడు. ఆ వ్యక్తి సంతకాన్ని చూస్తే అతని పేరు సుబ్బరామిరెడ్డి అని ఉంది.

ఈ డబ్బుతో నా బాధలు తొలగిపోతాయని ఆ వ్యాపారవేత్త అనుకున్నాడు. కానీ ఆ చెక్కును అప్పుడే వాడుకోదల్చుకోలేదు.

తన ఐరన్ సేఫ్‌లో భద్రపరిచి తన వ్యాపారాన్ని తిరిగి సమర్థవంతంగా కొనసాగించడం మొదలుపెట్టాడు. ఆ చెక్కు అతనికి కొండంత బలం ఇచ్చింది. అంతగా అవసరమైతే చెక్కును వాడుదామని అనుకున్నాడు.

చాలా ఆశావహంగా తన వ్యాపారాన్ని కొనసాగించాడు. తన బాకీదారులని, డిస్ట్రిబ్యూటర్లకి డబ్బు చెల్లిస్తానన్న నమ్మకం కలిగించాడు. కొన్ని నెలలు గడిచాయి. అతని వ్యాపారం అభివృద్ధి చెందింది. అప్పుల బాధ నుంచి అతను బయటపడ్డాడు.

సరిగ్గా సంవత్సరం తరువాత అతను మళ్లీ ఇందిరాపార్క్‌కి వచ్చి ఆ చెక్కు ఇచ్చిన వ్యక్తి కలిసిన ప్రదేశానికి వచ్చాడు. ఆ వ్యక్తి అక్కడ కన్పించాడు. ఆ చెక్కుని అతని చేతిలో పెట్టి తాను ఎలా వ్యాపారంలో అభివృద్ధి చెందానో అతనికి చెప్పడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే ఓ నర్సు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుంది.

‘అమ్మయ్యా! ఇతన్ని పట్టుకున్నాను’ అరిచింది ఆ నర్సు.

‘ఇతను నిన్ను విసిగిస్తున్నాడా! ఎప్పుడూ ఇంటి నుంచి పారిపోయి వస్తుంటాడు. ఇతనికి మతిస్థిమితం లేదు. ఇతని బాగోగులు నేను చూస్తుంటాను. ఎప్పుడూ ఈ పార్క్‌కే వస్తూ ఉంటాడు. రెండు సంవత్సరాలుగా ఇదే పని. ఎవరినీ ఏమీ అనడు’ అని చెప్పి అతన్ని తీసుకొని నర్స్ వెళ్లిపోయింది.

వ్యాపారవేత్త ఆశ్చర్యానికి లోనయినాడు. కొయ్యబారిపోయాడు. సంవత్సరంపాటు తన దగ్గర పది లక్షల రూపాయలు ఉన్నాయన్న ధైర్యంతో అప్పుల వాళ్లని, కస్టమర్లని, తనకు వస్తువులు సరఫరా చేసిన వ్యక్తులని సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. వాళ్లని ఒప్పించగలిగాను. కష్టాల నుంచి బయట పడగలిగాను.

కొద్దిసేపటికే అతనికి అర్థమైంది. తనను సమర్థవంతంగా ముందుకు నడిపించింది డబ్బు కాదు.

తనలో ఏర్పడ్డ ఆత్మవిశ్వాసం. సాధించాలన్న కాంక్ష !!!
Self Confident...
Positive Attitude...
Willpower will is must....

Source - Whatsapp Message

అరవై సామెతలతో అందమైన కథ

🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹
అరవై సామెతలతో అందమైన కథ
🌷🌷🌷

కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది ..
అంటూ గొణుగుతూ.. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భర్త కాంతారావు గారికి కాఫీ తెచ్చి ఇచ్చింది సుమతి.." ఏంటోయ్ నీలో నువ్వే గొణుక్కుంటున్నావు.. ఏంటో.. అర్ధమయేటట్లు చెప్పొచ్చు కదా! " అన్నారు ఆయన..
      " ఏం చెప్పమంటారు.. చిలక్కి చెప్పినట్లు చెప్పాను  మీకు.. విన్నారా.. మీ అక్కగారి నోట్లో నువ్వు గింజ దాగదు  అని.. నామాట వినకుండా.. ఆవిడ చెవిలో ఊదారు.. ఆవిడ సంగతి తెలిసిందేగా  తిరిగే కాలూ తిట్టే నోరూ ఊరుకోదని  మనమ్మాయికి కుజ దోషం వుందని  ఆవిడ ఊరంతా టాంటాం చేస్తోంది. ఒకరిని అనుకుని ఏం లాభం..  మన బంగారం మంచిదవాలి కానీ  ఇక దీనికి పెళ్లి అయినట్టే.." అంది సుమతి.
" ఔనా.. మా అక్క అలా చెప్పదే ఎవరికీ..  అనుమానం.. పెను భూతం  అనవసరంగా అపార్థం చేసుకోకు.. మీ పుట్టింటి వాళ్ళేమయినా చెపుతున్నారేమో కనుక్కో.. జాతకం రాయించింది మీ తమ్ముడేగా.. " అన్నాడు కాంతారావు.
     " ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు  ప్రతీదానికీ మా అన్నదమ్ముల్ని ఆడిపోసుకోవడమే మీరు. ఆడలేక మద్దెల ఓడిందన్నట్టు లాగా... అయినా మా తమ్ముడేం మీ అక్కయ్య లాగా ఎవరికీ చాటింపులు వేసే రకం కాదు.." అంది సుమతి.
         " ముంజేతి కంకణానికి అద్దమేల .. అయినా.. ఇప్పుడు ఆ గోల ఆపి అసలు సంగతికి రా... ఇంతకీ నీ బాధ... మా అక్క అందరికీ చెపుతోందనా... మనమ్మాయి పెళ్ళి కావడం లేదనా..  చెవిలో జోరీగ లాగా నస పెట్టకుండా ఏదో చెప్పు ముందు.." అన్నాడు కాంతారావు.
      " ఇంకేం వుందీ చెప్పడానికీ.. మీకు ఎప్పుడూ కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం  నా మాట ఎప్పుడైనా పట్టించుకున్నారు గనకనా.. అమ్మాయికో మంచి సంబంధం వాకబు చేద్దాం అని గానీ.. అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేద్దామనిగానీ.. ఆలోచనే లేదు.. " అంది సుమతి  నిష్ఠూరంగా..
  " ఓసి, పిచ్చిదానా.. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే ఆ ఘడియ రాలేదింకా మన పిల్లకి.. " అన్నాడు తాపీగా..
   " అబ్బబ్బా మీకు చెప్పీ చెప్పీ నా తల ప్రాణం తోకకివస్తోంది  చెవినిల్లు కట్టుకుని పోరినా  వినిపించుకోరు. మీ పెదనాన్న కొడుకు.. చూడండి.. ఎంచక్కా రెండేళ్ళలో ఇద్దరి ఆడపిల్లలు పెళ్ళి చేసి  గుండెల మీద కుంపటి దించేసుకున్నారు.. కాస్త ఆయన ఎరికలో ఏవైనా మంచి సంబంధాలున్నాయేమో అడగండి. " అంది సుమతి.
      " వాడినా?.. వాడు ఉపకారం అంటే ఊళ్ళోంచి పారి పోయేరకం వాడినుంచి నేను సహాయం ఆశించడం  ఇసుకలో నూనె పిండినంత .. అయినా వాడు అయినవాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ పెట్టే రకం. 
  " అయ్యో.. అలా అనుకుంటే ఎలా అండీ.. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు  పట్టుకున్నాడు ఆయన ముందు మనమెంతటివారం.. అయినా మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది మీరోసారి ఫోను చెయ్యండి.. ఆ తర్వాత అందితే జుట్టు అందకపోతే కాళ్ళు  పట్టుకుందాం." అంది సుమతి.
    " వాడి గురించి  అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు  చెప్పినా నీకు అర్ధం కావడం లేదు. సరేలే.. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటే నీ తృప్తి కోసం వాడిని అడుగుతాను. ఆ ఫోన్ ఇటు తీసుకురా.. హలో.. అన్నయ్యా.. నేనురా.. కాంతారావు ని.. ఎలా వున్నావు? అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా? కులాసాగా వున్నారా ?.. ఆ.. ఏం లేదు.. ఈ ఏడు మేము మా శ్రీవల్లికి సంబంధాలు చూడడం మొదలెట్టాము.. నీ ఎరికలో ఏవైనా మంచి సంబంధాలుంటే చెప్పమని మీ మరదలు అడగమంటే.. అందుకని ఫోను చేస్తున్నాను.. నీకు... మేనరికమా... లేదన్నయ్యా! నీకు తెలీనిదేముందీ..  పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు  అయినా.. వాడిని గారాబంతో చెడగొట్టింది అక్క... మొక్కై వంగనిది మానై వంగునా వాడికి ఇంకా ఉద్యోగం.. సద్యోగం లేదు.. స్ధిరపడలేదు... ఓ పక్క.. అక్కయ్య అంటూనేవుందిలే.. సంబంధం కలుపుకోరా.. అంటూ... మా ఇద్దరికీ సుతారామూ ఇష్టం లేదు.. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు  వద్దు అని చెప్పేసాలే అక్కకి.. ఏదైనా సాంప్రదాయ కుటుంబం, మంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాడెవరైనా వుంటే చెప్పు.. నా స్ధితిగతులు నీకెరికేగా..... ఔను.. జాతకంలో కొంచెం కుజ దోషం వుందట.. ఏవో పరిహార పూజలు చేయించింది మీ మరదలు.. అక్క చెప్పిందా..."  అన్నాడు కాంతారావు..
    ఆ ఫోను లో ఆ అన్నగారి  మాటలు అన్నీ విని విసురుగా ఫోను పెట్టేసారు కాంతారావు గారు..
    " ఏంటండీ.. ఏమన్నారు మీ అన్నయ్య? " అంది సుమతి.
    " నీ మాట విని వాడికి ఫోన్ చేసాను... నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి.  మంచోడు మంచోడు అంటే మంచం కింద దూరాడంట, కడుపు నిండిన బేరాలూ  కడుపు నిండిన మాటలూ వాడివి. ఏంటో ఆడపిల్ల పెళ్ళి చేయడమంటే ఆషామాషి అనుకుంటున్నావా.. నాకంటే ఏదో అదృష్టం పుచ్చి మంచి సంబంధాలు వచ్చాయి... అందరికీ అలా రావు... ఎవరైనా పెళ్ళిళ్ళ పేరయ్యని పట్టుకుని  గంతకి తగిన బొంతని వెతుక్కోమని ఉచిత సలహా పడేసాడు.
ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు అనవసరంగా వీడికి ఫోన్ చేసి మాటలనిపించుకున్నాను " అన్నాడు కాంతారావు కోపంగా..
      " అయ్యో.. అంతమాటన్నారా.. అయినా.. జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి పోన్లెండి ఆయన బుధ్ది బయటపడింది... తలని తన్నేవాడొకడుంటే తాడిని తన్నేవాడొకడుంటాడు ఏదో ఒకరోజు ఆయనకే తెలుస్తుంది.. " ఉంగరాల చేత్తో మొట్టేవాడు చెపితేనే మాట వింటారు కొందరు ..  మీరేం బాధ పడకండి..  మనసుంటే మార్గముంటుంది. ఆ దేముడే మనకే దారి చూపిస్తాడు. చెప్పడం మర్చిపోయా... నా చిన్నప్పటి స్నేహితురాలు పార్వతి నిన్న గుళ్ళో కనపడింది... తనకి తెలిసిన మంచి సంబంధాలు వున్నాయట.. ఈ రోజు మనింటికి  వచ్చి.. చెపుతానంది.. చూద్దాం తనేం చెపుతుందో...  విత్తం కొద్దీ  వైభోగం  పైగా మన దురదృష్టం  గోరు చుట్టు మీద రోకలి పోటు లాగా  పిల్లకి కుజ దోషం ఒకటీ... అది కప్పెట్టి పెళ్ళి చేయలేం కదా.. " అంది సుమతి.
   మర్నాడు.. కాంతారావు ఆఫీసు నుంచి.. రాగానే.. ఆనందంతో ఎదురెళ్ళింది సుమతి.
  " ఏంటోయ్..  గాజుల కళకళ గుమ్మంలోనే ఎదురయిందీ ... కొంపతీసి ఉదయం నేను  నక్కని తొక్కివెళ్ళినట్టున్నాను .. అన్నాడు చమత్కారంగా..
     " పోండి.. మీకెప్పుడూ వేళాకోళమే... ముందిలా కూర్చుని కాఫీ తాగుతూ... నేను చెప్పే విషయం సావధానంగా వినండి. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకండి అంది. 'ముద్దొచ్చినపుడే చంకనెక్కాలి' అన్నది సుమతి.
        బుద్ధిగా చేతులుకట్టుకుని.." ఆ.. ఇప్పుడు చెప్పు " అన్నాడు కాంతారావు.
      " నిన్న.. నా స్నేహితురాలు పార్వతి గురించి చెప్పాను కదా..  మధ్యాహ్నం తను వాళ్ళాయనని తీసుకుని మన ఇంటికి వచ్చింది. ఆయన  బేంక్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యారట. పెద్దది ఆడపిల్ల కి పెళ్ళి చేసి.. కాపురానికి పంపారట. తర్వాత అబ్బాయి.. వేణుగోపాల్.. ఎమ్ బి ఏ.. చేసి.. ఏదో పెద్ద కంపెనీలో చేస్తున్నడట. నెలకి లక్ష పైగా జీతం వస్తోందట. గుళ్ళో నాతో పాటు మన  వల్లిని చూసారు కదా.. పిల్ల చక్కగా  చిదిమి దీపం  పెట్టుకునేలా వుంది అనిపించిందట. వాళ్ళ వేణుకి చేసుకుంటామని అడిగారు. అప్పటికీ చెప్పాను.. అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వుంది అన్న చందాన పిల్ల జాతకంలో కుజ దోషం గురించి కూడా చెప్పాను. వాళ్ళ కి అలాంటి పట్టింపులు ఏవీ లేవనీ... అసలు జాతకాల గురించి ఆలోచించమనీ.. పైగా పెట్టుపోతలు కూడా ఏవీ ఆశించమనీ.. చెప్పారు. నాకైతే... వెతకపోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు అనిపించింది. ఉయ్యాల్లో బిడ్డని పెట్టుకుని ఊరంతా తిరిగామేమో మనం. ఇదిగో అబ్బాయి ఫోటో ఇచ్చి వెళ్ళారు.. చూడండి.. దొరబాబు లా వున్నాడు.. మన శ్రీవల్లి పక్కన చూడ ముచ్చటగా వుంటాడనిపించింది. ఇంతకంటే గొప్ప సంబంధం మనం తేలేము.. ఆలోచించండి.." అంది సుమతి.. సంబరంగా.
    " నువ్వు చెప్పిందీ నిజమే సుమతీ... పిల్లాడు బావున్నాడు.. కుటుంబమా.. మంచి సాంప్రదాయ కుటుంబమని చెపుతున్నావు.. పైగా వాళ్ళకి ఈ జాతకాల పట్టింపు లేకపోవడం... నిజంగా మన అదృష్టం. సరే మరి.. రేపు వెళ్లి మంచీ చెడూ మాట్లాడి వద్దాం. " అన్నాడు కాంతారావు.
      రేపటిదాకా ఎందుకూ.. శుభస్య శీఘ్రం ...  తలుచుకున్నపుడే తాత ప్రయాణం అన్నట్లుగా ఇప్పుడే బయలుదేరదాం. మనం వస్తున్న్నట్టు పార్వతి కి ఫోన్ చేస్తాను. మీన మేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది .. లేవండి.. లేవండి.." అంది సుమతి.
    లేడికి లేచిందే పరుగు .. మా లేడీ గారు యమ హుషారుగా వున్నారు.. ఉండు పనిలో పని... మా పెదనాన్న కొడుక్కి ఫోన్ చేసి.. ఈ విషయం చెప్పాలి.
గంతకి తగిన బొంత అన్నాడుగా... ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం వాడికి  కుక్క కాటుకి చెప్పు దెబ్బ  అనిపించాలి. ఇనుము విరిగినా అతకవచ్చుకానీ మనసు విరిగితే అతకలేము అంతలా నా మనసుని బాధ పెట్టాడు వాడు. " అన్నాడు కాంతారావు.
       " పోన్లెండి..  ఊరందరిదీ ఓ దారి ఉలిపిరి కట్టెదో దారి వదిలేయండి.. ఆయనని.. గురివింద గింజ తనకింద నలుపెరగదట మనకెందుకింక ఆయన సంగతి.. ముందు బయలుదేరదాం పదండి" అంటూ భర్త ని తొందరపెట్టింది సుమతి.
       వెళ్లే దారిలో..." ఏవండీ.. చెప్పడం మర్చిపోయా.. ఇందాక పార్వతీ.. వాళ్ళాయన వచ్చినపుడు మీ అక్కయ్య గారు వచ్చారు.. విషయం అంతా తెలుసుకున్నారు.. వాళ్ళు వెళ్ళాక.. తన కొడుక్కి.. శ్రీవల్లి ని ఇవ్వడంలేదని ఉక్రోషంతో.. నానా మాటలు అన్నారు.. ఏ రాయైతేనేం పళ్ళూడకొట్టుకోవడానికి . ఆ జాతకాల పట్టింపులు నాకు లేవన్నాను.. అయినా నా మాటకి విలువీయకుండా పరాయి సంబంధాలకి పోతున్నారూ..  కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పోతుంది  అంటూ.. శాపనార్థాలు పెట్టిందావిడ.  శుభం పలకరా పెళ్ళి కొడకా అంటే పెళ్ళి కూతురు ఏది ?  అన్నట్టుగా.. ఈవిడ అపశకునపుమాటలేంటీ.. అని బాధేసింది నాకు " అంది సుమతి.
    " పోనీలే.. మా అక్క సంగతి తెలుసుకదా... నువ్వు ఎందుకు.. గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకుంటావు  పట్టించుకోకు... గుడ్డి గుర్రానికి పళ్ళుతోమడం తప్ప దానికి వేరే పనీపాటా లేదు.  పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు అది అలా వాగుతూనే వుంటుంది.  వదిలేయి తన మాటలు.. ఎప్పుడూ వుండేవేగా.. " అంటూ భార్య ని ఓదార్చాడు.
          పెళ్లి  చూపులు అయిపోవడం..  పెళ్లి మాటలు మాట్లాడుకోవడం.. ఆకాశమత పెళ్ళి పందిరిలో భూదేవంత అరుగు మీద కాంతారావు, సుమతి దంపతులు.. పెళ్లి కొడుకు కి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం అయిపోయి.. . అమ్మాయిని అత్తగారింటికి సాగనంపారు.
      పై పంచతో చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ. " అందరికాళ్ళు మొక్కినా అత్తవారింటికి పోక తప్పదు కదా  ఈ జాతకాలు కుదరడం  లేదనే వంకో.. ఈ కుజ దోషం కారణంగానో.. చాలా మంది ఆడపిల్లలకి.. సరైన సమయంలో వివాహం కాకపోవడమో.. అసలు వివాహాలే కాకపోవడమో జరుగుతోంది. విఙ్ఙానం ఇంతలా వెల్లివిరిసి.. ప్రపంచం ఆధునికంగా ముందుకు కు సాగిపోతోంటే... ఇంకా ఈ మూఢ నమ్మకాలేంటి ? ఆడపిల్లల జీవితాలకి ఈ జాతకాలు ఓ అడ్డుగోడ.. చదువుకున్నవారిలోనే ఈ జాడ్యం ఎక్కువగా వుంది.. అందరికీ.. మా శ్రీవల్లి చేయందుకున్న వేణుమాధవ్.. ఓ ఆదర్శం కావాలి... అనుకున్నాడు కాంతారావు.
       ఇంతలో ఫోన్ మోగింది.... ఈ పెళ్ళి కి పిలవలేదుగా.. అందుకే ఈ సంగతి తెలీక ...  కాంతారావు పెదనాన్న కొడుకు.... " ఒరేయ్ కాంతారావూ... మీ అమ్మాయికి ఏదైనా నా సంబంధం వుంటే చెప్పమన్నావుగా... ఇక్కడ.. ఈ. సేవ లో పనిచేస్తూంటాడు.. నెలకి పదివేలు జీతం .. అతనికీ కుజ దోషం వుందట..   సరిపోతుంది ఇద్దరికీ.. వాళ్ళ నెంబర్ ఇస్తాను.. ఓ సారి మాట్లాడి.. సంబంధం కుదుర్చుకో... నాపేరు చెపితే.. కట్నంలో.. కాస్త తగ్గిస్తారు.. " అన్నాడు..

    " ఆ.. అన్నయ్యా... దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్కలు మొరిగాయట  .. అర్ధమయిందనుకుంటాను.. " అంటూ ఫోన్ పెట్టేసాడు.

Source - Whatsapp Message

Friday, June 25, 2021

నేటి జీవిత సత్యం.

🌹నేటి జీవిత సత్యం.

దూరంగా ఉన్నప్పుడు అందరూ మనవాళ్ళే !దగ్గరకు వెళ్ళాక తెలుస్తుంది..?ఎవరూ మన వాళ్ళు కాదని !!
నమ్మి, ఎవరితో ఏది చెప్పకండి,ఎందుకంటే,అందరి నిజస్వరూపం సమయం వచ్చినప్పుడే బయటపడుతుంది..

మెడలో వేసుకునే బంగారాన్ని బట్టి,బ్రతుకులో బలాలు లెక్కగట్టకు ! రోల్డ్ గోల్డ్ బతుకులు..చాలానే ఉన్నాయి నేటి సమాజంలో..!! ఎన్ని అభినందనలు వచ్చాయన్నది కాదు..?ఎంత మందిని "ఆలోచింప చేసింది" అన్నదే ముఖ్యం..ఇదే "సోషల్ మీడియా"లో పాటించాల్సిన సూత్రం..


🍃🌹కాలం ఎప్పుడు గిర్రునతిరుగుతూనే ఉంటుంది

త్రాడు వదిలిన బొంగరంలా! కాలాన్ని కాపాడుకోవాలి కంటిపాప లా

ఎల్లప్పుడూ,ఎందుకంటే పసిడి కన్నా,మేలిమి వజ్రం కన్నా, విలువైనది కదా!!!

కాలాన్ని ఒడిసి పట్టుకుంటే ఆనందాన్నిస్తోం ది.అశ్రద్ధ చేస్తే విషాదాన్ని నింపు తుంది.కాలాన్ని అందుకోవాలనే ఆలోచన చేసెకంటే శ్రమ,శక్తితో సక్రమంగా వినియోగించుకుంటే నీ జీవన గమనం సులభమౌతుంది.

కాలం జీవనవాహినిలా తెరలు, తెరలుగా నిరంతరం సాగుతూనే వుంటుంది.ఆపగలిగే శక్తి లేని మనిషి దాని విలువ తెలుసుకొని నడిస్తే అతడు ఎందరికో "మార్గదర్శి" కాగలడు..

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

హితోక్తులు

హితోక్తులు.

వినేటప్పుడు వినయంతో వినాలి

మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి

ఆడిగేటప్పుడు ఆప్యాయతగా అడగాలి

సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పడం

కాదన్నపుడు ముద్దుగా కాదనడం

ఇవే ఓక మనిషి యొక్కగొప్ప లక్షణాలు

ఈ లక్షణాలు నీలో ఉంటే

ప్రపంచంలో నిన్ను ప్రేమించని మనిషి అంటూ ఎవరు ఉండరు


ఎల్లప్పుడూ ...

గర్వంగా ఉంటే
అందరి ఆశీశ్శులు కోల్పోతాం ....

పొగరుగా ఉంటే
అందరి ప్రేమని కోల్పోతాం ...

ఈర్ష్యగా ఉంటే
స్నేహితులను కోల్పోతాం ...

కోపంగా ఉంటే
మనల్ని మనమే కోల్పోతాం ...

బాధగా ఉంటే
భరించేవారిని కోల్పోతాం ...

ఏడుస్తూ ఉంటే
ఊరుకోపెట్టేవారిని కోల్పోతాం ....

నవ్వుతూ ఉంటే
నలుగురికి ఆదర్శంగా ఉంటాం ....

మీ మానస సరోవరం 👏

Source - Whatsapp Message

మనం అంతా దేవుళ్ళం

🙏 మనం అంతా దేవుళ్ళం - పత్రీజీ సందేశం 🙏

♻️“మనం అంతా దేవుళ్ళం” అన్నదే పరమ సత్యం! ఈ సత్యాన్ని ప్రతి రోజూ పదే పదే మనం మననం చేసుకోవాలి. పదే పదే పలుకుతూ ఉండాలి. ఏది మన నోటిలోంచి పదే పదే బయటికి వస్తుందో అదే మా “నుదుటి మీది వ్రాత”గా మారుతుంది. కనుక మనం పదే పదే ఈ సత్యాన్ని పలుకుతూ ఉండాలి.

♻️మన నోటిలోంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా ఒక “పెన్ను”గా మారి మన నుదుటి మీద వ్రాతను చకచకా వ్రాసేస్తుంది .. మరి మన జీవితాలను నిర్దేశిస్తుంది.

♻️వేరెవరో పై వాళ్ళు మన నుదుటి వ్రాతను ఎన్నటికీ వ్రాయజాలరు! నకారాత్మక మాటలను మన పెదవిదాటి బయటకు రానివ్వకూడదు. తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి.

Source - Whatsapp Message

నిజమైన సంపద.

నిజమైన సంపద.

పెద్దపెద్ద భవంతులు, ఎకరాలకొద్దీ పొలాలు, విలాసవంతమైన జీవితం, ఖరీదైన వాహనాల్లో ప్రయాణం, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం సంపదగా పరిగణిస్తాం. డబ్బుతోనే గొప్పతనం, గౌరవం వస్తాయనే ఆలోచన కొంతవరకు వాస్తవమే అయినా నిజమైన సంపద ఇది కాదు!
మనిషి ఏదైనా సాధించడానికి శరీరమనే ఉపాధి కావాలి. ఇది ఉన్నంతవరకే మనమేమి చేయాలనుకున్నా, ఏ లక్ష్యాన్ని చేరాలనుకున్నా సాధ్యమయ్యేది. అందువల్ల దీన్ని జాగ్రత్తగా పోషించుకోవాలి. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ఇహపర సాధనకు సాధనం ఈశరీరమే.
కష్టకాలంలో మన పక్కన స్నేహితులను కలిగి ఉండటమన్నది, ఎంతో గొప్ప సంపద. సంస్కారవంతులుగా, జ్ఞానవంతులుగా మనల్ని తీర్చిదిద్దేది చదువు. విచక్షణ, వివేకాలనే చక్షువులనిచ్చి మనిషిని సన్మార్గంలో పయనించేటట్లు చేస్తుంది. తన పుట్టుకకు ఇతర ప్రాణుల పుట్టుకకు భేదాన్ని తెలుసుకునే మేధనిస్తుంది. ఈ సకల చరాచర సృష్టిలో తన స్థానాన్ని, ప్రాముఖ్యాన్ని, కర్తవ్యాన్ని మనిషికి బోధపరచేది చదువే. అది చాలా విలువైన సంపద.
మనిషి ఒంటరిగా జీవించలేడు. ఎదుటివారితో ఎలా మసలుకోవాలో, ఎలా సంభాషించాలో ప్రథమంగా తన కుటుంబ సభ్యులనుంచి, తన పెద్దలనుంచి గ్రహించాలి. వారి సత్ప్రవర్తనను అలవరుచుకోవాలి. అది   సమాజంలో తోటివారితో ప్రవర్తించే తీరుపై ప్రతిబింబించి సత్ఫలితాలనిస్తుంది. సంబంధ, బాంధవ్యాలను నిలుపుకొనే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే మన బంధాలు హాయిగా సాగిపోతాయి. అందరినీ కలుపుకొనే స్నేహపూర్వక ప్రవర్తన మనకు ఐశ్వర్యం లాంటిదే.
సంపదంటే ధనాన్ని ఎక్కువగా సంపాదించడం కాదు. మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేయడం అంతకన్నా కాదు. అలాగని ఎక్కువగా పొదుపు చేయడమూ కాదు! సంపాదన ఒక స్థాయికి చేరుకున్న తరవాత ఇక సంపాదించవలసిన అవసరంలేదన్న భావన కలగడం. దాన్నే తృప్తి అంటారు. అది మనిషికి కలగనినాడు అశాంతికి గురవుతాడు. మనశ్శాంతి కరవవుతుంది. కంటిమీద కునుకే ఉండదు. తృప్తి కొంతమందికే దక్కే అరుదైన సంపద.
తమ సృజనతో అద్భుతమైన రచనలు చేసేవారు, నిష్ణాతులైన కళాకారులు, రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులు, ప్రయోగశాలలో అహరహం పరిశోధనలు చేస్తూ మానవాళికి ఉపకరించే అనేక వస్తువులకు రూపకల్పన చేసే శాస్త్రవేత్తలు, భావితరాలను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో దేశాన్ని రక్షించే సైనికులు... ఏ దేశానికైనా విలువైన సంపద.
మహాపురుషులందించిన జ్ఞానసంపద, మన పూర్వీకులందించిన విజ్ఞానం, పెద్దలు మనకోసం ఏర్పరచిన సదాచారాలు, సత్సంప్రదాయాలు, మన జీవితానికొక క్రమశిక్షణను, పథాన్ని ఇస్తాయి. వాటిని పాటిస్తూ, వారు చూపిన ధర్మపథంలో కొనసాగడమే ఆ వారసత్వ సంపదకు మనమివ్వగలిగే నిజమైన గౌరవం. అది ఘనమైన సంపద.
దాస్యశృంఖలాలను బద్దలుచేసి దేశమాతకు స్వేచ్ఛా ఊపిరులూదడంలో తమ ధన, మాన, ప్రాణాలను కోల్పోయిన ఎందరో త్యాగధనులు తరతరాలు మనసులో నిలుపుకోవలసినవారు. వారు జాతికి అమూల్యమైన సంపద.
‘మనిషి కడవరకు తోడు ఉండాల్సిదేమిటి?’ అని యక్ష ప్రశ్నల్లో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు. మనోబలమని సమాధానమిస్తాడు యుధిష్ఠిరుడు. మనవెంట ఎవరున్నా, ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటిరావు. మనిషి తుదిశ్వాస వరకు ఉండవలసిన ఈ సుగుణం ఎంతో అద్భుత సంపద.
సంపద అనగానే మనకు వచ్చే లౌకిక దృష్టి, భావనల నుంచి బయటపడి నిజమైన సంపదను గుర్తెరగాలి. జీవితానికొక ఔన్నత్యం చేకూరేదప్పుడే.

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

నేటి ఆణి ముత్యాలు.

నేటి ఆణి ముత్యాలు.

మన శక్తి కన్నా,
సహనం చాలాసార్లు మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

బయట కనిపించే మురికిగుంతల కన్నా,
మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతో చాలా ప్రమాదం.

వికశించే పుష్పం నేర్పింది
తనలా అందంగా జీవించమని.

రాలిపోయే ఆకు నేర్పింది
జీవితం శాశ్వతం కాదని.

ప్రవహించే వాగు నేర్పింది
అవరోధాలు దాటి వెళ్ళమని.

మెరిసే మెరుపు నేర్పింది
క్షణ కాలమైనా ప్రకాశించమని.

డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతం కాదు
కానీ మనసుతో పంచె స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.

ఎంతమంది హృదయాలను మనం గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే...
ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు..
మనకంటే మంచివారు ఇంకెవ్వరూ ఉండరు.

నిన్ను తిట్టేవారందరూ నీ శత్రువులు కాదు
నిన్ను మెచ్చుకున్న వారందరూ నీ మిత్రులు కాదు

కష్టం మిత్రుడిని చూపిస్తుంది
కన్నీరు శత్రువును గుర్తిస్తుంది


"హృదయం కూడా భూమి లాంటిదే.
ద్వేషం అనే మొక్కను నాటితే విషం చిమ్ముతూ పెరుగుతుంది.
ప్రేమ, విశ్వాసం అనే విత్తనాలను నాటితే సమాజానికి పనికివచ్చే మొక్కలను ఇస్తుంది."

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

జీవితం వడ్డించిన విస్తరి కాదు

జీవితం వడ్డించిన విస్తరి కాదు
🕉️🌞🌎🏵️🌼🚩

జీవితం కొందరికి వడ్డించిన విస్తరిగా అనిపిస్తుంది. ధనమే జీవితానికి పరమావధిగా భావిస్తుంటారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటే, లోకమంతా రంగులమయంగా కనిపిస్తుంది. డబ్బు అలా విసిరేస్తే కొండమీది కోతి అయినా ఇలా దిగివస్తుందని తలపోస్తారు. దిలాసాగా జీవితం గడిపేస్తుంటారు. ఏదో అనుకోని సంఘటన... వూహించని జీవన ఉత్పాతం... సంభవిస్తుంది. అనుకోని కష్టాలు ఎదురవుతాయి. అసలలాంటి బాధలు ఉంటాయని కూడా ఆలోచించి ఉండం. ఎలా ఆ కష్టాల నుంచి బయటపడటం అని... అప్పుడు.. అప్పుడు ఆలోచిస్తాం. మనిషి హాయిగా జీవించేయడానికి బాసటగా ఉన్నవారిని అకస్మాత్తుగా కోల్పోవచ్చు. కలలోనైనా వూహించని సంఘటన జరిగి సర్వస్వాన్నీ పోగొట్టుకోవచ్చు. అప్పుడిక కష్టాలన్నీ మనలను వెన్నంటే ఉంటాయి. నడి సముద్రంలో చిక్కుకొన్న మనిషిలా ఆశలు కొలబోతాయి. ఒడ్డున పడటం మన వీలు కాదని అనుకొంటున్న సమయంలో. అప్పుడు మన మనసులో శతకోటి ఉపాయాలు మెదులుతాయి. ఏదో ఒక యుక్తి వల్ల జీవితంలో ఆలంబన లభిస్తుంది. ఆ కష్టసమయంలో మనం చేసే ప్రయత్నమే మన అదృష్టంగా మారుతుంది. ఆ అదృష్టమే కష్టాల కడలినుంచి తీరానికి చేరుస్తుంది.

ఆ కష్టం సంభవించే దాకా మనిషికి తాను అలాంటి ప్రయత్నం చేయగలనని తెలియదు. కష్టమే మన ప్రయత్నానికి వూతమై అదృష్టవంతుణ్ని చేస్తుంది. ప్రారంభంలో మనిషి, అన్ని చతుష్పాద (నాలుగు కాళ్ల) జంతువుల్లాగానే భూమిపై తిరిగేవాడని మానవ ఆవిర్భావ సిద్ధాంతాలు తెలుపుతున్నాయి. కష్టాలను దూరం చేసుకొనే ప్రయత్నంలోనే సుఖాల అన్వేషణ చేశాం. నేడు సుఖంగా మనుగడ సాగించగలిగే సౌకర్యాలను
సమకూర్చుకొని అదృష్టవంతులమయ్యాం ! మనిషికి కష్టాలే లేకపోతే సుఖాలను శోధించే అవసరమే ఉండేది కాదు. శారీరక, ఆర్థిక, మానసిక, సామాజిక కష్టాల బారిన పడినంత మాత్రాన మనిషి నిరుత్సాహపడకూడదు. మనిషిలోని ఆలోచన, ఉద్వేగాలు ఎంతో గొప్పవి ఎప్పుడూ కష్టాలకు భయపడుతూ బతకడం మానవనైజం కాదు

మనిషి తనకు కలిగిన కష్టాలను దూరం చేసుకొనే అశక్తుడిగా మారినా వెరవడు. తన సృష్టి ఎలా జరిగిందో తెలుసుకొని అందుకు కారకుడైన అంతర్యామిని గ్రహించగలిగాడు. తన బాధలను, తాను తీర్చుకోలేని కష్టాలను గ్రహించగలిగాడు. తన బాధలను, తాను తీర్చుకోలేని కష్టాలను దైవానికి విన్నవించుకొనేందుకు ప్రార్థనను సృజించగలిగి మహా అదృష్టవంతుడయ్యాడు తనను అన్ని విధాలా కష్టాలనుంచి కాపాడగలిగే దైవం ఉన్నాడనే భావన మనిషికి ఎనలేని ధైర్యాన్ని ఇస్తుంది.. కష్టాల్లోనూ, అన్నిరకాల బాధల్లోనూ దైవాన్ని శరణువేడి ప్రార్థిస్తే మనిషికి లభించే ధైర్యం మహనీయమైనది. ఆ ధైర్యమే మనిషికి శ్రీరామరక్ష, చీకట్లు ఆవహించగానే ఆ .కష్టాన్ని తీర్చుకోవడానికి వెలుగులను సృష్టించుకుని అదృష్టవంతుడయ్యాడు. ప్రయత్నం చేస్తే చెడుకాలం తొలగి మంచికాలం వస్తుందని తెలుసుకొన్నాడు. సృష్టినీ సృష్టికర్తనూ తెలుసుకోగలిగాడు. ఒంటరిగా జీవించే కష్టాలకు దూరం కావడం కోసం సమాజాన్ని

సృష్టించుకొన్నాడు. ద్వేషం కష్టాలకు కారణమని గ్రహించి ప్రేమించడంలోని గొప్పతనాన్ని తెలుసుకొని అదృష్టవంతుడయ్యాడు ప్రేమించి ప్రేమను పొందడంలో దైవత్వం ఉందని తెలుసుకొన్నాడు. ప్రేమవల్ల త్యాగం, త్యాగంవల్ల నిర్మలత్వం, నిర్మలత్వం వల్ల దైవత్వం సిద్ధిస్తుందని గ్రహించాడు. అన్నింటికీ ఆ దైవమే ఉన్నాడనే భావననూసృజించుకొని మనిషి మహా అద్భుతమైన ధైర్యవంతుడయ్యాడు. ధైర్యం మనిషిని శక్తిమంతుడిని చేసే అదృష్టానిస్తుంది. కష్టకాలాల్లో ఎంతటి బాధలనైనా ఎదుర్కొని ముందుకు సాగే శక్తిని దైవబలం మనిషికిస్తుంది. జటిలమైన సమస్యలనైనా పరిష్కరించుకోగలిగే యుక్తి మనిషికి దైవం ఉన్నాడనే భావనవల్ల కలుగుతుంది

కష్టాలతో ఎంత పోరాడగలిగితే అంత బలం మనిషికి లభిస్తుంది. కష్టాలే మనిషి విజయానికి సోపానాలు మనిషిలోని నిద్రాణమైన భావం, యుక్తి, శక్తి- కష్టాలు సంభవించినప్పుడే ఉత్తేజితమవుతాయి. అలాంటి పరిస్థితుల్లోనే మనిషి కొత్త జీవితాన్ని ఆవిష్కరించుకోగలుగుతాడు. ఎంతో అదృష్టవంతుడవుతాడు. అందుకే కష్టాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... కష్టాలే అదృష్టాలు

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

ఆల్భర్ట్ ఐన్-స్టీన్ ని అడిగేవాళ్ళట 'మీకు దేవుడి మీద నమ్మకం ఉందా '

విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఆల్భర్ట్ ఐన్-స్టీన్ పలు విశ్వవిద్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు అతడిని
'మీకు దేవుడి మీద నమ్మకం ఉందా ' అని అడిగేవాళ్ళట.

"ఉంది. స్పినోజా చెప్పిన దేవుడి మీద నమ్మకం" అనేవాడట ఐన్-స్టీన్.

స్పినోజా 17 వ శతాబ్దపు డచ్ తాత్వికవేత్త.
అతడు చెప్పినదాన్ని ఎవరో చాలా గొప్పగా తెలుగులో ఈ విధంగా అనువదించారు.

దేవుడు మనిషికి చెప్పేది.. స్పినోజా మాటల్లో :
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
"..ప్రార్థనలేవీ అక్కర్లేదు. ప్రపంచం లోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి.
సృష్టి సర్వం తో మమేకం కండి.
హాయిగా నవ్వండి. భువన గానం లో భాగం కండి.

ప్రార్థనా మందిరాలకు వెళ్లడం దేనికి? నేనక్కడ ఉంటానని ప్రకటిస్తూ అవన్నీ మీ నిర్మాణాలేగా!

పర్వతాలూ, చొరలేని అరణ్యాలూ, నదులూ, సరోవరాలూ, సాగర తీరాలూ... ఇవీ నా నివాసాలు.

మీ దౌర్భాగ్యాలకు నన్ను నిందించడం వదిలెయ్యండి.
మీ తప్పటడుగులూ, పాపాలతో నాకు ప్రమేయం లేదు.

మీ పవిత్ర గ్రంధాలతో నాకే సంబంధమూ లేదు.

ఒక పొద్దు పొడుపులో, ఒక నిర్జన మైదానంలో, ఒక ఆత్మీయ మిత్రుడి స్పర్శలో, మీ బిడ్డ కళ్ళలో ఉంటాను నేను.
ఏవో పుస్తకాల పుటల్లో కాదు.

అవధి లేని ప్రేమ నేను. నేను ఏ తీర్మానాలు చెయ్యను, నిన్ను విమర్శించను. నువ్వంటే కోపాలూ , పట్టింపులూ ఉండవు.

క్షమాపణలేవీ నన్ను అడగకు. క్షమించ వలసినవేవీ ఉండవు.

నీ పరిధులూ, పరితాపాలూ, ఉద్వేగాలూ, సుఖాలూ, అవసరాలూ అన్నీ నేను నీలో నింపినవే. అలాంటప్పుడు నీ అతిక్రమణలకు నిన్నెలా శిక్షిస్తాను నేను?

నిన్ను కాల్చివేసే నరకమొకటి నేను సృష్టించి ఉంటే నేనేం దేవుణ్ణి ?

నిత్య జాగృతిలో బతుకు. అదే నీ దిక్సూచి. ఇతరులు నీకేది చేయకూడదని నువ్వు భావిస్తావో అది నువ్వు వాళ్లకు చెయ్యకు.

బతుకంటే అదేదో పరీక్ష కాదు.
ఒక రిహార్సల్ కాదు.
ఏ స్వర్గద్వారాలకో పీఠిక అసలు కాదు.
ఇక్కడ నడిచే, గడిచే వాస్తవం!!! అంతమాత్రంగానే చూడు దాన్ని.

పరిపూర్ణ స్వేచ్ఛనిచ్చాను నీకు.
శిక్షలూ, పురస్కారాలూ, పాపాలూ, సద్గుణాలూ నా నిఘంటువులో మాటలు కాదు.
ఏదో కలంతో వాటినెవ్వరూ నా దివాణంలో లెక్క కట్టరు. స్వర్గం, నరకం నీకు నువ్వే నిర్మించుకోవాలి.
ఆ స్వేఛ్చ నీదే.

ఈ బతుకు ముగిశాక ఇంకొకటేదైనా ఉందో, లేదో నేను చెప్పను. కానీ దీని తరువాత ఇంకేదీ లేదన్నంత దీక్షగా బతుకు. ఇంకొక బతుకు ఉంటే ఇంతకుముందు నువ్వు ఏం చేశావు, ఇంకేం విస్మరించావు - అనే లెక్కలు నేను తిరగదోడను.

నన్ను నమ్మకు.
నమ్మడం అన్నది ఊహాత్మకం.
నిన్ను నువ్వు నమ్ముకో.

ఏ సాగర జలంలోనో ఈత కొడుతున్నప్పుడో, ఒక శిశువును హత్తుకున్నప్పుడో, పెంపుడు పశువును నిమిరేటప్పుడో నేను గుర్తురావడమే నేను ఆశించేది.

నీ కీర్తనలు అన్నీ వదిలెయ్యి.
వాటికి ఉప్పొంగిపోతే నేనేం దైవాన్ని?

నీ ఆరోగ్యం, నీ సంబంధాలూ, సంతోషాలూ సరిచూసుకో.

అదే నాకు నువ్వు పఠించే స్తోత్ర పాఠం.

నా గురించి ఇప్పటికే నీ బుర్ర నిండా ఉన్న సరంజామా అంతా చేజార్చుకో.
చిక్కుముడి అదంతా. అద్భుతాలూ, వాటికి అన్నేసి వివరణలూ దేనికి ?

నువ్వు ఇప్పుడు ఇక్కడ శ్వాసిస్తూ ఉన్నావ్.

అంతకు మించిన అద్భుతం ఏదో ఇంకా ఎందుకు...? 🙏🏻💐🙏🏻🌹🙏🏻🥀

Source - Whatsapp Message

మంచి మాట.. లు

శుక్రః
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ॥

లక్ష్మీ శ్లోకః
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం ।
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం ।
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ।
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు. పార్వతి గాయత్రీ సరస్వతి లక్ష్మి అమ్మ వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
శుక్ర వారం --: 25-06-2021 :--
ఈ రోజ్ AVB మంచి మాట.. లు

ప్రతి రోజు సూర్యుడు ఉదయిస్తాడు ఇది సత్యం .. నువ్వు ఎదగటానికి కూడా అవకాశాలు వస్తుంటాయి.. వాటిని పట్టుకుంటావో వదిలేస్తావో అనేది ని ఇంగితం బట్టి ఉంటుంది.. ఉపయోగించుకోవడానికి ప్రయత్నించ్చు.. అదృష్టం అనేది రోజు రాదు.. అది వచ్చినదాకా ఊరుకోకుండా నువ్వు ఏదో ఒక ప్రయత్నాం కొనసాగించాటమే ని కష్టానికి ప్రతిఫలం అదృష్టం రూపంలో అప్పుడు వస్తుంది

అవసరానికి మించి ఖర్చు చేయటం అన్నివిధాలా అనర్థంఅందునా ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యంగా ..

. అలానే కోల్పోయిన దానిని తిరిగి పొందటం కూడా కష్టమే అది మనిషి అయినా వస్తువు అయినా

మనిషి చుట్టూ మంచి చెడు కష్టం నష్టం ప్రేమ ద్వేషం అన్నీ ఉంటాయి దేన్ని వదిలేస్తాం దేన్ని తీసుకుంటాం అన్నదాన్ని బట్టే మన సంతోషం ఆధారపడి ఉంటుంది .

మనం ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళకింద , మన ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది . సంపాదించింది ఏదీ మనది కాదు . ఒక మంచి తనం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప . నువ్వు నిజాయితీగా ఉంటే నీతో చాలా మంది మిత్రులు ఉండకపోవచ్చు . కానీ ఖచ్చితంగా సరైన వ్యక్తులే నీకు మిత్రులుగా మిగులుతారు .

మంచి చేసే అలవాటున్నవారికి
మంచిని అభినందించే లక్షణమున్న వారికి మనసు హాయిగా ఉంటుంది.
సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయం అవుతుంది .

పనికిరాని వస్తువులు ఇంటికి బరువు పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు పరులసొమ్ము ఆశించేవాడు భూమికి బరువు

సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

🌹ప్రపంచంలో విలువైనదంటూ ఏమీ లేదు మన మనస్సుకి నచ్చిన వారి నుండి పొందే ప్రేమ తప్ప..

🍃🌹వయస్సు పెరిగే కొద్ది సమాజంలో మనిషి జీవితం ఆప్యాయతకి మంచి తనానికి చిరునామా మరియు అలంకరణ కావాలి,కానీ అహంకారానికి,ద్వేషానికి, గొడవలకు మూలం కాకూడదు..

🍃🌹అన్నీ సాధించాకే ఆనందంగా ఉంటుందని అనుకోకు మనం అనందంగా ఉంటేనే అన్నీ సాధించగలం అనుకో..

🍃 🌹జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం,చెడిపోవడం,పడిపోవడం అంటూ ఏమి ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది ..

కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు..మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడలో అని నేర్చుకుంటారు..

ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు..

జీవితం అనేది ఒక పాఠశాల ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది..

🍃🌹శుభ శుభోదయం* తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

హితోక్తులు

హితోక్తులు.

వినేటప్పుడు వినయంతో వినాలి

మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి

ఆడిగేటప్పుడు ఆప్యాయతగా అడగాలి

సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పడం

కాదన్నపుడు ముద్దుగా కాదనడం

ఇవే ఓక మనిషి యొక్కగొప్ప లక్షణాలు

ఈ లక్షణాలు నీలో ఉంటే

ప్రపంచంలో నిన్ను ప్రేమించని మనిషి అంటూ ఎవరు ఉండరు


ఎల్లప్పుడూ ...

గర్వంగా ఉంటే
అందరి ఆశీశ్శులు కోల్పోతాం ....

పొగరుగా ఉంటే
అందరి ప్రేమని కోల్పోతాం ...

ఈర్ష్యగా ఉంటే
స్నేహితులను కోల్పోతాం ...

కోపంగా ఉంటే
మనల్ని మనమే కోల్పోతాం ...

బాధగా ఉంటే
భరించేవారిని కోల్పోతాం ...

ఏడుస్తూ ఉంటే
ఊరుకోపెట్టేవారిని కోల్పోతాం ....

నవ్వుతూ ఉంటే
నలుగురికి ఆదర్శంగా ఉంటాం ....

మీ మానస సరోవరం 👏

Source - Whatsapp Message

ఆణి ముత్యాలు.

నేటి ఆణి ముత్యాలు.

మన శక్తి కన్నా,
సహనం చాలాసార్లు మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

బయట కనిపించే మురికిగుంతల కన్నా,
మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతో చాలా ప్రమాదం.

వికశించే పుష్పం నేర్పింది
తనలా అందంగా జీవించమని.

రాలిపోయే ఆకు నేర్పింది
జీవితం శాశ్వతం కాదని.

ప్రవహించే వాగు నేర్పింది
అవరోధాలు దాటి వెళ్ళమని.

మెరిసే మెరుపు నేర్పింది
క్షణ కాలమైనా ప్రకాశించమని.

డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతం కాదు
కానీ మనసుతో పంచె స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.

ఎంతమంది హృదయాలను మనం గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే...
ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు..
మనకంటే మంచివారు ఇంకెవ్వరూ ఉండరు.

నిన్ను తిట్టేవారందరూ నీ శత్రువులు కాదు
నిన్ను మెచ్చుకున్న వారందరూ నీ మిత్రులు కాదు

కష్టం మిత్రుడిని చూపిస్తుంది
కన్నీరు శత్రువును గుర్తిస్తుంది


"హృదయం కూడా భూమి లాంటిదే.
ద్వేషం అనే మొక్కను నాటితే విషం చిమ్ముతూ పెరుగుతుంది.
ప్రేమ, విశ్వాసం అనే విత్తనాలను నాటితే సమాజానికి పనికివచ్చే మొక్కలను ఇస్తుంది."

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

మంచి మాట...లు

గురుః
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభం ।
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ॥
ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు పూజ్య గురువులు అది శంకరాచార్యుల వారు గురు దత్తాత్రేయ స్వామి వారు, గురు రాఘవేంద్ర స్వామి గారు గురు సాయినాథని అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకోంటూ..

గురువారం :- 24-06-2021
నేటి AVB మంచి మాట...లు

బ్రతుకు ఎలాగైనా బ్రతకవచ్చు కాని పలువురు చెప్పుకునేలా నలుగురికైనా ఉపయోగపడేలా బ్రతికితే అ బ్రతుకు సార్థకం చేసుకున్నవాళ్ళం అవుతాం.. మనల్ని కాటికి మోసే నలుగురు కూడా మన శవాన్ని కాటికి మోసే అదృష్టం దక్కిందని ఆనందపడేలా ఉండాలి మన ఙివితం.. ప్రయత్నించండి మిత్రామా...
ఒక్కడివే వస్తావు భూమిమీదకు.. ఒక్కడివే పోతావు భూమిలోకి.. మరి మంచి చేయటానికి తోడు కోసం ఎందుకు ఎదురుచూడటం .. ఒక్కడివే ముందుకుసాగు మిత్రమా
[
పొదుపు చెయాల్సిన దగ్గర ఖర్చు చేయడం ఎంత తప్పో ,, ఖర్చు చెయాల్సిన దగ్గర పొదుపు చేయడం కూడా అంతే తప్పు,, గుర్తుంచుకోండి,, సంపాదించేటప్పుడు రూపాయిని కూడా వంద అనుకోని సంపాదించాలి,, అవసరానికి ఖర్చు చేసే టప్పుడు వందను కూడా రూపాయి అనుకోని ఖర్చు చెయ్యాలి,


మనకు ఎవరెవరు ఏమేమిస్తున్నారో ,, అది తప్పకుండా తిరిగి ఇచ్చేయ్యాలి ,, అది ప్రేమ అయినా,, ద్వేషం అయినా ,, బాధ అయినా ,, సంతోషం అయినా,, నాకు ఎవ్వరేవ్వరు ఏమేమి ఇస్తున్నారు అనేది నా మనసు అనే పుస్తకంలో లిఖిస్తున్నాను,, దైవసాక్షిగా చెపుతున్నాను తప్పకుండా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను,,,, ఆలస్యం కావొచ్చేమో కాని ఇవ్వటం అయితే పక్కా

సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు💐🤝

Source - Whatsapp Message

ఆణి ముత్యాలు

కోల్పోవడంలో ఉన్న బాధ
తెలిసిన వారు పక్క వాళ్ళను
ఎప్పుడూ దోచుకోరు....

ఇవ్వడంలో ఉన్న ఆనందం
తెలిసినవారు ఉన్నది దాచుకోరు...

దోచుకోలేని ధనం " మంచితనం"...

దాచుకోలేని ధనం "ఆనందం".....!!

సుఖంలో తోడు ఉండేవారు
బంధువులైతే....

దుఃఖంలో తోడుండేవారు
భగవత్ స్వరూపులు....!!

ఏదీ శాశ్వతం కాదు...ఈ లోకంలో

గడుపుతున్న
ఈ క్షణం మాత్రమే మనది...
నిన్న అనేది తీరిపోయిన ఋణం...
రేపు అనేది దేవుడిచ్చిన వరం...!!

గెలిచే మనస్తత్వం ఉన్నవారు
ఇతరుల గెలుపుకి సహాయపడతారు.

ఓడిపోయే మనస్తత్వం ఉన్నవారు
ఇతరుల ఓటమిని కోరుకుంటారు....!!

చీకటి మంచిదే
వెలుగు విలువను
చూపెడుతుంది

మితం మంచిదే...
అతిలో మతిని
మందలిస్తుంది....!!*

మానస సరోవరం 👏

Source - Whatsapp Message