Wednesday, July 14, 2021

60 ఏళ్ళు నిండిన మనము రెండు తరాలకు సాక్షులం !!!

60 ఏళ్ళు నిండిన మనము రెండు తరాలకు సాక్షులం !!!
👉స్వచ్చమైన గాలి నీళ్ళు,. పచ్చటి పొలాలు🌾🌴
పరిశుభ్రమైన వాతావరణం లో పుట్టి పెరిగిన వాళ్ళం...

👉👦తలపై నుండి. చెంపల మీదకు కారిపోయేలా నూనె రాసుకుని📚 చేతికి పుస్తకాలు, సంచి తగిలించుకుని...,
ఒక్కడిగా, బయలుదేరి దారిలో స్నేహితులను
ఒక్కొక్కళ్లను కలుపుకుంటూ పెద్దగుంపుగా 👦 👦 👩👧 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి కాళ్లకు చెప్పులు లేకుండా నడచి వెళ్ళిన తరం వాళ్ళం🚶🏃

👉 జారిపోయే నిక్కరు మీదకు మొలతాడు లాక్కుంటూ చిరుగు అంగీ/ నిక్కర్/లంగా జాకెట్ బొక్కలకు గుడ్డ ముక్కలు అతుకులేయించుకున్న వాళ్ళం... 🕺

👉10 వ తరగతి అయ్యే వరకు నిక్కరు,అంగీ/ లంగా,జాకెట్ వేసుకున్న. , తరం మనదే...🌲

👉🤸🤹గోలీలు,బొంగరాలు,కర్రా బిళ్ళ, నేలా బండ,. ఉప్పాట,ఏడు పెంకులాట..
🥎 బంతి పుచ్చుకుని నేరుగా కొట్టేసుకుంటే బంతి లాగ వంటి మీద ముద్ర పడే ముద్రబాల్. లాంటి ఆటలాడిన తరం...,

👉🚴🏊🤽
బడికి వేసవి కాలం సెలవులు రాగానే తాటి చెట్లూ, సీమ తుమ్మ చెట్లూ ఈతచెట్లు, చింతచెట్లూ, మామిడిచెట్లూ, ఎక్కి కాయలు కోసుకొని తిన్న వాళ్ళం, చెరువులు, కాలవల్లో స్నానాలు చేసిన వాళ్ళం , తాటి బుర్రలు బండితో ఆడినోళ్లం...

👉🪔🪔🪔
దీపావళికి తాటి బొగ్గుల రవ్వల దివిటీ కోసం వళ్ళంతా మసి పూసుకొని మరీ తయారు చేసుకనే వాళ్ళం...

👉5 ps ఐస్ ఫ్రూట్ తిన్నది మనమే, పది పైసలతో బళ్ళో మ్యాజిక్ షో చూసింది మనమే....

👉🌦️ వర్షం వస్తె తాటాకు గొడుగూ, యూరియా సంచులు, కప్పుకుని బడికి వెళ్ళిన వాళ్ళం..

👉📖 second hand text books కోసం పరీక్షలు
అయినప్పటి నుండి ముందు తరగతి వాళ్ళని బతిమాలిన తరం...

👉🚴సెకెండ్ హ్యాండ్ సైకిల్ తో పక్క తొక్కుడుతో సైకిల్ నేర్చుకున్నోల్లo మనమే...

👉✉️ఉత్తరాలు.., రాసుకున్న, అందుకున్న తరంవాళ్ళం... 🌴

👉పండగ సెలవులు,
వేసవి సెలవులు,దసరా సంక్రాంతి సెలవులు
ఎన్ని సెలవులు వొచ్చినా ఐదు పైసలు ఖర్చులేకుండా ఆనందాన్ని. 🤼 🏃🏻 ⚽ 🏸 🪁🏹 🤸 ⛹️. 🏊 అనుభవించిన తరంవోళ్ళం...,

👉👨👩👧👦 పెద్దలు/పిల్లలూ అందరం వీధి అరుగుల మీద కూర్చుని ఎన్నో సాయంత్రాలు/రాత్రులు ఆనందంగా కబుర్లు చెప్పుకుని పొట్ట చెక్కలయ్యేలా😃😁
నవ్వుకున్నదీ మనమే.... ☘️

👉ఊర్లో ఎవరి ఇంట్లో ఏ వేడుక జరిగినా మన ఇంట్లో జరిగినట్లు అంతా మనదే. ,అంతా మనమే అన్నట్లుగా భావించి స్వచ్చందంగా నిస్వార్థంగా పాలుపంచుకున్న తరం మనదే...🍁

👉🕵🏻ఉర్లో ఒక ఇంట్లో దొంగలు పడ్డారని, పిల్లలు, పెద్దలూ అందరం కలిసి ఊరు చుట్టూ తెల్లవార్లూ ఎన్నో రాత్రులు🔦టార్చిలైట్లు, కర్రలు పట్టుకుని కాపలా కాసిన వాళ్ళం మనమే...

🕉️ 🚩 🛕
ప్రతీ శ్రీరామనవమి కీ గుడి దగ్గర తాటాకు పందిరికి రంగు కాగితాలు అంటించడం, మామిడి తోరణాలు కట్టడం కోసం. ముందు రోజు రాత్రంతా జాగారం చేసింది మనమే. .🌾

👉👨👩👧👧చుట్టాలు వస్తేనే అమ్మ special వంటలు వండి పెట్టిన తరం....🍁

👉అత్తయ్యా, మామయ్య, పిన్ని,బాబాయ్, అక్కా, బావ అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న తరం,
స్కూలు మాష్టారు కనపడితే భయంతో పక్కనున్న సందుల్లోకి పారిపోయిన తరం... ,🌺

👉పుల్లల పొయ్యి మీద అన్నంకూర ఉడుకుతున్నప్పడు వచ్చే అద్బుతమైన పరిమళాన్ని ఆస్వాదించిన తరం వాళ్ళం..,🌱

👉 పొయ్య మీదనుంచి నేరుగా పళ్ళెంలోకి వచ్చిన వేడి వేడి అన్నంలో ఆవకాయ, వెన్నపూస వేసుకుని పొయ్యి దగ్గరే
తాతయ్యలు, అమ్మమ్మ/నాయనమ్మ, అమ్మా నాన్నా, పెదనాన్న ,
పెద్దమ్మ,, పిన్ని బాబాయ్,. అత్తయ్య మామయ్య, అక్కలు చెల్లెళ్లు అన్నయ్యలు తమ్ముళ్లు అందరం ఒకే దగ్గర చేరి మధురమైన అనుభూతితో కూర్చుని అన్నం తిన్న తరం ...🦋

👉 అమ్మమ్మలు/నాయమ్మల చేత గోరుముద్దలు తిన్నది,. అనగనగా ఒక రాజు.... కథలు విన్నది మనమే .,🌵

👉 నూనె పిండితో నలుగు పెట్టించుకుని కుంకుడు కాయ పులుసుతో తలంటు స్నానం చేయించు కున్న తరం.., 🍀

👉 📻 రేడియో, దూరదర్శన్📺
టూరింగ్ టాకీస్📽️ కాలం వాళ్ళం... .🍁

👉🎥 40 పైసల నేల టిక్కెట్ తో నేల మీద కూర్చుని, 20 రూపాయల కుర్చీ టిక్కెట్ తో బాల్కనీ లో కూర్చుని సినిమా చూచిందీ మనమే ...🌵

👉 స్కూల్ , కాలేజీ రోజుల్లోనే ఎలక్షన్లు చూచిన వాళ్ళం.. 🍂

👉 అమ్మా నాన్నలతో సంవత్సరానికి ఒక సారి, పరీక్ష పాస్ అయ్యావా .. అని మాత్రమే అడిగించు కున్న తరం వాళ్ళం ...🌹

👉📲🖥️🖨️
ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాలైన WhatsApp/ Fb/ skype / Twitter లను పిల్లలతో పాటు పోటీ పడి సమానంగా వాడేస్తున్నదీ మనతరమే ..

👉 పోస్టాఫీస్, బ్యాంక్ లు తొలిసారి చూసిన వాళ్ళం మనమే ..🍀

👉 ల్యాండ్ లైన్ ఫోన్ తొలిసారి చూసిందీ, యిప్పుడు చారవాణితో మొత్తం ప్రపంచాన్ని క్షణాల్లో చూస్తున్నదీ మనమే ..🍀

👉 ATM, PAYTM, GOOGLE PAY, PHONE PAY లను వాడుతూ ఆర్థికరంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు చూస్తున్నదీ మనమే .🍀

👉 మనమే ఆ తరానికి ఈ తరానికి మధ్యవర్తులం ...🍀

👉 అవును...రెండు తరాల మద్యలో జరిగిన అనూహ్యమైన మార్పులకు మనమే సాక్షులం 🌸

👉 మన తల్లిదండ్రులు, పెద్దలపై భయభక్తులు ఉన్న వాళ్ళం మనమే..మన పిల్లలు వాళ్ల పిల్లలకు భయపడుతున్నది చూస్తున్నదీ మనమే ..🌺

👉 మనం మాత్రం అటు తలిదండ్రులకు ఇటు పిల్లలకు భయపడే అనిశ్చిత తరం 🍀🌺
😀😀😀😀😄😄😄😄😄😄

Source - Whatsapp Message

No comments:

Post a Comment