Monday, July 19, 2021

పెద్ద పెద్ద డాక్టర్ల నుంచి కూడా అభినందనలూ అందుకుని అద్బుతమైన కీర్తి గడించింది. ఆ తల్లి పేరు సూలగుత్తి_నరసమ్మ గారు.

పెరుగుతున్న పద్మ అవార్డుల విలువ..నిస్వార్థంగా సమాజ సేవ చేసిన వారికి మాత్రమే చెందాలి..🙏🙏🙏

ఏ చదువూ లేని ఈవిడ వైద్యం చేస్తున్నందుకు ప్రజల నుంచీ చివరికి పెద్ద పెద్ద డాక్టర్ల నుంచి కూడా అభినందనలూ అందుకుని అద్బుతమైన కీర్తి గడించింది. ఆ తల్లి పేరు సూలగుత్తి_నరసమ్మ గారు.
97 సంవత్సరాల వయస్సున్న ఆవిడ కర్ణాటక రాష్ట్రంలో బాగా వెనుకబడిన కొండ ప్రాంతంలో ఎటువంటి వైద్య సదుపాయాలు లేని, కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేని తాండాలలో ప్రక్రృతి వైద్యం చేస్తుంది. ముఖ్యంగా గర్భవతులకు సుఖప్రసవం చేయించడంలో ఈవిడ దిట్ట.
ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని కొన్ని గర్భస్త శిశువు లక్షణాలను ఈవిడ తన ప్రక్రృతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలదు. ఎంతో అనుభవం వున్న Specialistలు గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు సైతం ఈవిడ ప్రతిభకు అబ్బురపడుతున్నారు.

బెంగుళూరులోని అనేక Multi/Super Specialty ఆసుపత్రుల డాక్టర్లు సైతం ఈవిడకు అభిమానులుగా మారి ప్రకృతి వైద్య ప్రక్రియకు విలువిచ్చి చూస్తున్నారు.
తల్లి గర్భంలోని వున్న శిశువు నాడి ఎలా కొట్టుకుంటుంది,
తల ఏ దిశలో ఉంది,
ఉమ్మనీరు పరిస్థితి ఏమిటీ,
శిశువు ఆరోగ్యంగా ఉందా,
శిశువుకు అంగవైకల్యం ఏమైనా ఉందా,
ప్రసవం ఎన్ని రోజుల్లో కాగలదు,
సిజేరియన్ తప్పనిసరా,
పుట్టబోయే బిడ్డ బరువు ఎంత వుండవచ్చు? ఇలాంటి విషయాలు ఖచ్చితంగా చెప్పేస్తున్నారు
ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందే చేరేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తుంది.
"సూలగుత్తి నరసమ్మ" అంటే కన్నడ భాషలో "ప్రసవాలు చేసే దాది లేదా మంత్రసాని అని అర్ధం. ఈమె నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవిత కాలంలో 15,000 సుఖ ప్రసవాలు చేసింది.,తను ఎటువంటి డబ్బులూ తీసుకోదు., అన్నీ పూర్తి ఉచితంగా... ఒక్క పైసా అయినా తీసుకోకుండా...
Tumkur యూనివర్సిటీ ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది...
ఎవరైనా తనకు డబ్బులు గాని, బహుమతులు గానీ ఆవిడ ఇంటికి పంపిస్తే వాటిని ఆవిడ స్వయంగా పంపించినవారి ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళిపోతారు.
ఆ మహాతల్లి తానూ తన కుటుంబం జీవించడానికి రోజువారీ వ్యవసాయ కూలీగా బ్రతుకుతున్నారు.
జీవితంలో అల్ప సంతోషిగా వుండడం లో వున్న సంతోషం ఆరోగ్యం ఆనందం ఆత్మసంతృప్తి ఎక్కడా లభించవు. మీ అమ్మగారు మీ దగ్గర ఎంత డబ్బు తీసుకుంటున్నారు పొద్దున్నే లేచి మిమ్మల్ని చూసుకుంటున్నదుకు ఆమె సంతోషంగా లేదా?
అనుకుంటే అందరూ బిడ్డలేకదమ్మా... అని చాలా మామూలుగా మాట్లాడే ఈ మహాతల్లి వెయ్యేళ్ళు జీవించాలని మనసావాచా కోరుకుంటున్నాను. ఆ సృష్టి శక్తిని ప్రార్ధిస్తున్నాను. - Dr Gautham Kashyap

Source - Whatsapp Message

No comments:

Post a Comment