Sunday, January 30, 2022

శ్రీ రమణ మహర్షి ఉపదేశసారము

శ్రీ రమణ మహర్షి ఉపదేశసారము:

ఓం నమో భగవతే శ్రీరమణాయ

1.  దైవశాసనము బట్టి కర్మఫలము లభిస్తుంది. కర్మదైవమా? కానేకాదు కర్మ జడపదార్థం.

2.  కర్మఫలం అనిత్యమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు హేతువగుచున్నది. అందుచే పరమగతిని అది నిరోధిస్తుంది.

3.  ఈశ్వరార్పణ బుద్దితో ఆచరించిన నిష్కామ కర్మలు మనస్సును పరిశుద్ధి కావించి ముక్తికి సాధక మవుతాయి.       

4.  పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనస్సు చేత చేయబడుతున్నాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమమైనది.

5.  బ్రహ్మ భావనతో చేయు మానవ సేవయే అష్టమూర్తులు గల భగవానుని పూజ యగుచున్నది.

6. భగవత్ స్తుతి కంటే వాచక జపము, వాచకజపము కంటే మౌనజపము, మౌనజపము కంటే ధ్యానము ఉత్తమములు.

7.  నదీ ప్రవాహంలా, నేతి ధారలా, నిరాఘాటంగా సాగే సరళధ్యానం ఆటంకంతో కూడిన విరళచింతనం కన్నా మిన్న.

8. పరమాత్మా వేరు, నేను వేరు అనే భేద జ్ఞానము కన్నా అతడే నేను అనే అభేద జ్ఞానమే పావనమైనది. 
      
9.  ద్వైత భావమును దాటి ‘ఆ పరమాత్మే నేను’ నీలోను నాలోను అన్నిటా ఆ అంతర్యామి నిండి ఉన్నాడు అనే భావనా బలిమిచే కలిగే సద్భావస్థితిని ఉత్తమమైన భక్తి అంటారు.

10.  మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ,భక్తీ,జ్ఞాన యోగ మార్గాల ఉపదేశసారం.

11.  వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామము చేత మనస్సు కుదుటపడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము.

12.  ఈస్వరశక్తి యనెడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి.

13.  లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును. నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు.

14.  ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మ యనెడి ఒకేఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది.

15.  మనసు నశించిన పరమయోగికి చేయదగిన కర్మ అంటూ ఏముంటుంది?

16.  దృశ్యవస్తువుల నుండి చిత్తమును వెనుకకు మరల్చి చిత్స్వరూపమును ఎరుగుటయే తత్త్వ దర్శనము.

17.  మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసేలేదని రూడి అవుతుంది. అదే సరైనదారి.

18.  వృత్తులన్నీ అహం (అంటే నేను) వృత్తిపై ఆధారపడి యున్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు.

19.  నేను అనేది ఎక్కడనుంచి పుడుతోంది? అని అన్వేషిస్తే ఆ నేను పతనమౌతుంది. ఇదే ఆత్మవిచారము.

20.  ఎప్పుడైతే ఈ నేను నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది, పరిపూర్ణమైనది, సత్ స్వరూపమైనది నగు ‘అహం అహం’ అను ఆత్మయే ప్రకాశించును.

21.  అహం వ్రుత్తి లయించినపుడు సదా సత్పదార్థము భాసించుటచే అదే నేను అను పదమును లక్ష్యార్ధమై యున్నది.

22.  దేహము, ఇంద్రియములు ప్రాణము,బుద్ధి,అవిద్య నేను కాను. అవి జడములు. ఏకసద్రూపమే నేను.

23.  సత్తు ను తెల్పుటకు చిత్తు వేరుగా యున్నదా? సత్తుయే చిత్తూ, చిట్టుయే నేను?

24.  శరీరాది ఉపాదులవలన జీవేశ్వరులలో భేదము కనుపించు నప్పటికీ ఇద్దరు సత్స్వ రూపులు అవడంవల్ల ఒకే వస్తువై యున్నారు.

25.  ఉపాధులను తొలగించినచో జీవుడు ఈశతత్వమును దర్శిస్తాడు. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది.

26.  ఆత్మ అద్వితీయము కనుక ఆత్మగా నుండుటయే ఆత్మను తెలుసుకొనుట యగును.

27.  జ్ఞానము – అజ్ఞానము రెండింటిని దాటిన జ్ఞానమే నిజమైన జ్ఞానము.సమస్తమునకు అతీతమై, సర్వాత్మకమై వెలయు జ్ఞానమును తెలుసుకొనుటకు వేరువస్తువు ఏమున్నది.

28.  తన నిజస్వరూపము ఎప్పుడైతే దర్శించబడిందో, అప్పుడు తనే ఆద్యంతములు లేని పూర్ణ చిదానందమని తెలుసుకొనును.

29.  తన్ను తాను తెలుసుకొనెడి ఈ అత్మానుభావమును పొందిన దైవికుడు జ్ఞాని బంధము గాని ముక్తిగాని లేని పరమ సుఖస్థితిని పొందుతాడు.

30.  నేను అనునదిలేని స్వస్వరూపానుభవమే ఉన్నతమైన తపస్సుయని రమణుని దివ్యవాణి పల్కుచున్నది. దేహము ఘటము వాలే జడమైనది. దీనికి నే నను తలపు లేనందునను, దేహము లేని నిద్రయందు గూడ దినమును మనముండుట చేతను, దేహము నేను కాదు; నేను ఎవరిని?ఎక్కడనించి వచ్చాను? అని సూక్ష్మ బుద్ధి చేత వెదికిచూచి, తన యందు నిలకడ జెందినవారల హ్రుదయాంతరంగమందు పరిపూర్ణుడైన అరుణాచల శివుడు ‘అహం’ స్పురణరూపుడై స్వయంగా భాసితున్నాడు.

🙏ఓం నమో భగవతే
శ్రీ రమణాయ🙏
🌹🌹🕉️🌼🚩🌼🕉️🌹🌹

సేకరణ

📻రేడియో కార్యక్రమాలు & రేడియో పంచిన ఆనందం* ఇలా ఉండేది...

📻రేడియో కార్యక్రమాలు & రేడియో పంచిన ఆనందం ఇలా ఉండేది...

📻ఉదయం ఆరు గంటలకు

📻ఆకాశవాణి... విజయవాడ కేంద్రం ఇప్పుడు సమయం (గంటలు, నిమిషాలు, సెకండ్లు) చెప్పేవారు.

📻రెడీగా దగ్గర పెట్టుకున్న గడియారంలో టైము సరిచేసేసుకొనేవారు!

📻రేడియోలో ప్రతి హిందూ పండగకి ఉదయం 4 గంటలకే కార్యక్రమాలు మొదలయ్యేవి.

📻4 గంటలనుండి మంగళ స్నానం చేసుకునే సమయంలో మంగళ వాయిద్యాలు (సన్నాయి) ప్రసారం చేసేవారు.

ఆరు గంటలకు
పుష్పాంజలి మొదలయ్యేది.

📻ఆదివారం నాడు
'శ్రీ సూర్య నారాయణ... వేద పారాయణ...',

సోమవారం నాడు
📻భూకైలాస్, భక్త కన్నప్ప పాటలు, 'శ్రీ ఆంజనేయా ప్రసన్నాంజనేయా' అన్నపాటో, కలియుగ రావణాసురుడు సినిమాలో 'నమో నమో హనుమంతా' అన్నపాటో... ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ వుండేది ఏంవినబోతున్నామో!

7
గంటలకు! వార్తలు చదువుతున్నది "అద్దంకి మన్నార్ "

📻మధ్యాహ్నం 'ఆకాశవాణి! వార్తలు చదువుతున్నది...' అంటూ కందుకూరి సూర్యనారాయణో, అద్దంకి మన్నారో, పార్వతీ ప్రసాదో... ఎవరో ఒకరు పలకరించేవారు. ఆ తర్వాత... '

📻కార్మికుల కార్యక్రమం'.
చిన్నక్క, ఏకాంబరం కలిసి కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు, వారి హక్కులు, బాధ్యతలు తెలియజేస్తూ మధ్యమధ్యలో అప్పుడప్పుడు చిత్రగీతాలు ప్రసారం చేసేవారు.

📻సరిగ్గా ఒంటిగంటా పదినిమిషాలవ్వగానే పసిడిపంటలు మొదలయ్యేది.

పసిడిపంటలవ్వగానే ప్రాంతీయ వార్తలు చదివేవారు... ప్రయాగ రామకృష్ణ లేక తిరుమలశెట్టి శ్రీరాములు.

📻అవవ్వగానే
మనోరంజని! మీరు కోరిన మధురగీతాలు వింటారు! అని మీనాక్షో, ఏవియస్ రామారావో అనగానే ఇంట్లో అందరం సంబరపడిపోయేవాళ్ళం.

📻ఆ అరగంటా ఎటువంటి ప్రకటనలు లేకుండా మంచి మంచి పాటలన్నీ వేసేవారు. అవన్నీ చెవులు రిక్కించి మరీ వినేవాళ్ళం.

📻రెండవ్వగానే
ఢిల్లీ నుంచి వార్తలు అని చెప్పేవారు. ఇంకా కొన్ని సెకన్లు ఉంటే... కు... కు... కు... అంటూ ఏదో రకం సౌండ్ పెట్టేవారు. ఇంగ్లీషులో వార్తలు... ఢిల్లీనించి ప్రసారమయ్యేవి.

ఆ ఇంగ్లీషు వింటూ ఏ పదాన్ని ఎలా పలకాలో, స్పష్టమైన ఇంగ్లీషు ఎలా మాట్లాడాలో నేర్చుకునేవాళ్ళం.

📻ఇక ఆదివారాలు
సంక్షిప్త శబ్ద చిత్రం, సాయంత్రం నాటికలు, నాటకాలు ప్రసారం చేసేవారు... వి.బి.కనకదుర్గ, నండూరి సుబ్బారావు, ఎ.వి.యస్. రామారావు, పాండురంగ విఠల్... వీరందరూ ఎక్కువగా వినబడేవారు. వాళ్ళ గొంతు వింటోంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్ళం. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు, ఉచ్చారణలో ఎట్టి పొల్లూలేని ఆ భాష వింటే చాలు...మనకి ఎంత ప్రయత్నించినా వక్రభాష రాదు.

📻ఇక రాత్రిపూట చిత్రలహరి, మధురిమ అంటూ పాటలవీ వేస్తుండేవారు.

📻అన్నీ అయ్యాక రాత్రి ఢిల్లీనుంచి
శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెలువడేది. ఉద్దండులైన కళాకారులందరూ వినిపించే ఆ స్వరవిన్యాసాన్ని ఆలకించిన మాజన్మలు ధన్యం.

📻ఇక
సిలోన్ ఇక్కడ హిందీ పాటలు బాగా వచ్చేవి. మధ్యాహ్నం కొన్ని తెలుగు పాటలు వచ్చేవి. 📻ఆ సిలోన్ స్టేషన్ సరిగ్గా వచ్చేది కాదు, కానీ, చెవి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినేవాళ్ళం.

📻రేడియో ఒక ప్రసారసాధనంలానో, పాటలపెట్టెలానో కాకుండా మాకు భాషమీద మంచి పట్టును తెచ్చిపెట్టిన యంత్రంలా మేమందరం ఇప్పటికీ గుర్తుంచుకుంటాం.

📻ఆ కాలంలో... పసితనం నుండి మనమందరం రేడియోతో పెనవేసుకుపోయాం. కాలక్షేపం, వినోదం అంతా రేడియోతోనే!

📻అప్పట్లో... సినిమా, రేడియో తప్ప వేరే వినోదం అనేది ఉండేది కాదు. రేడియోలో పాత, కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం.

📻ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల మ్యూజిక్ ను బట్టి ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో, పాట ఏమిటో చెప్పే వాళ్ళం. S.D. బర్మన్, నౌషాద్, మదన్ మోహన్...శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ , R. D. బర్మన్...ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు.

📻ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

📻అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం...అమాయకత్వం..

📻ఆదివారం మధ్యాహ్నం గుమ్మం ముందు కూర్చుని రేడియో లో
సంక్షిప్తశబ్ద చిత్రం
(
ఒక గంటకి కుదించిన) సినిమాని వింటే ఎంత ఆనందం...

📻📻రారండోయ్... రారండోయ్...'
హైదరబాదు బాలలమూ జైహిందంటూ పిలిచామూ...రఁయ్ రఁయ్ మంటూ రారండోయ్...రేడియో ప్రోగ్రామ్ వినరండోయ్...అని
ఆంధ్ర బాలనంద సంఘం రేడియో కార్యక్రమం ప్రారంభంలో వినిపించే పిలుపు పాట.
ప్రోగ్రామ్ అయిపోయిం తర్వాత...
📻బాలవినోదం విన్నాము... బాలల్లారా ఈపూట... చాలిక కథలు చాలిక మాటలు చాలిక పాటలు... నాటికలు...చెంగున రారండి...చెంగు చెంగున పోదాము* అని ఉండేది.

సేకరణ

మరొక వ్యాపార జిహాదీ-మన మధ్యలో

మరొక వ్యాపార జిహాదీ-మన మధ్యలో👇

E Store అనే సూపర్ మార్కెట్లు ఇప్పుడు చాలా వస్తున్నాయి. ఇవి కూడా ఇలాంటి ప్రమాదకర మైనవే. ఇది కూదా Muslims సంస్థ. ఉదాహరణకు ₹50 లక్షలు మనం పెట్టుబడి పెడితే ఆ సంస్థ E Store super Market పెడుతుంది. Rent & employees ను వాళ్ళే పెట్టుకుంటారు. Establishment మొత్తం వాళ్ళదే. అయితే, ఇక్కడ ఉంటుంది అసలు తిరకాసు... దాదాపు ప్రతీ store manager/incharge లు Muslims మాత్రమే ఉంటారు..
ప్రతీ ఏరియా లో ఏరియా ఇన్చార్జులు ఉంటారు. దాదాపు వీళ్ళందరూ ముస్లింలు...🙄
మన పెట్టుబడికి (₹50 lkhs)monthly ₹2.00 lakhs 35 నెలలు ఇస్తారు... మరియు ప్రతి నెల 5% టర్న్ ఓవర్ పై కమిషన్.... ఆ తరువాత E Store వాళ్ళ పూర్తిగా సొంతం అవుతుంది... ఆ నాటి నుండి కేవలం 3% టర్న్ ఓవర్ పై కమిషన్ లైఫ్ టైం ఇస్తాడు.. తిరిగి ప్రతి సంవత్సరం పూర్తి కాగానే, 1% వచ్చిన గతేడాది కమిషన్ లో 1/3వ వంతు రెన్యూవల్ కై కంపెనీ కే చెల్లించాల్సి ఉంటుంది...అంటే,
ఇప్పుడు దాదాపు తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ లో 30మొత్తం స్టోర్ లుఉన్నాయి.. దేశంలో ఇప్పుడు దాదాపు 250 stores ఉన్నాయి. ఇవన్నీ దాదాపు 2,3 years తర్వాత ఈవన్నీ వాళ్ల సొంతం అవుతాయి. అంటే, ఒక్క పైసా సొంతంగా పెట్టబడి పెట్టకుండానే... వందలకొద్ది స్టోర్ లు వాళ్ళ(ముస్లిం వ్యాపరస్తుల)సొంతం కాబోతున్నాయి...దీన్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు మాత్రం more than 90% హిందువులే. (మనకు డబ్బు మీద ఉన్న పిచ్చి దేశం/ధర్మం పట్ల ఉండవు అని అందరికీ తెలిసిందే కదా)
ఇందులో అన్ని వస్తువుల పై అందరికీ 4% (Flat)డిస్కౌంట్ ఉంటుంది...ఇది నాణేనికి ఒకవైపే.. మరొక వైపు... ఎక్కువ జనాభా శాతం ఉన్న మన హిందువులే టార్గెట్.. అది ఎలా అంటే! E store లో పై డిస్కౌంట్ ధరల్లో లభించాలంటే
ఈ స్టోర్ లో ₹8891/- membership తీసుకుంటే , మనకు ప్రతీ నెల ₹825/-(బాంక్ కు నగదు బదిలీ) ఇస్తారు. ఇంకా నెలకు ₹165/- value కల(wallet) వస్తువులపై, 33% extra డిస్కౌంట్ ( మామూలు 4% కాకుండా ఇది extra. అంటే, మొత్తం 37%ఇస్తారు. అంటే? more than ₹8/- వడ్డీ..🤔 పడుతుంది. మన పెట్టుబడి 50.00 లక్షల పైన ₹4/- వడ్డీ పడుతుంది. ఎక్కడనుండి ఇంత income ఇస్తున్నారు?
హిందువుల డబ్బుతో వ్యాపారం చేసి, ఎక్కువ income ను offer చేస్తూ. మన వ్యాపార వ్యవస్థను ఆక్రమించడం వీళ్ళ లక్ష్యం,(already పూలదుకాణాలు, చెప్పుల షాపులు, టీ కొట్లు, పండ్ల దుకాణాలు, పాన్ షాపులు, ఆటోమోబైల్షాపులు...మొ౹౹వి) యింకా ముస్లింలకు మాత్రమే employment ఇవ్వడం వీళ్ళ లక్ష్యం...హిందువులు ఎవరూ దీనికి attract కావొద్దని మనవి.
ఇంకా ఈ సంస్థ వాళ్ళు కాఫీ Shop లు, గార్మెంట్ stores కూదా ఇదే కాన్సెప్ట్ తో మొదలు అయ్యాయి. EV స్కూటర్, మూవీ మేకింగ్ లో కూడా అడుగు పెట్టారు అని వార్తలు వస్తున్నాయి. హిందువులారా జాగ్రత్త.
గమనిక Income వస్తుందిగకదా అని, ఎలా వస్తె మాకేంటి అనుకుంటే అది మూర్కత్వమే అవుతుంది...ఎందుకంటే.. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడంలో సమాజిక-రాజకీయ-ఆర్థిక.. పోరాటాలే ముఖ్య కారణాలు గా చెప్పుకోవచ్చు... అందులో భాగంగానే.. ఈ ఆర్థిక వ్యవస్థ లోకి ముస్లింలు చాలా సున్నితమైన మరియు చాకచక్యంగా హిందువుల పొట్టమీదేకాకుండా... జాతి పైనే.. దెబ్బకొడుతున్నారనేది నగ్న సత్యం.. ఇలా గే మన దేశంలో వివిధ రూపాలలో మనం ఊహించని విధంగా మన మధ్యలో వారి వారి కార్యకలాపాలను కొనసాగిస్తూ.... మన హిందూ వ్యవస్థ నిర్మూలనదిశగా... ఇదొక లవ్ జిహాదీ.. లాగానే బిజినెస్ జిహాదీ గా చాపకింద నీరులా... వచ్చేసింది... త్వరలోనే హిందూ సంఘాలు/ప్రజలు మేల్కోకపోతే... భారత్ మరొక ముస్లిం దేశంగా మరడంలో అతిశయోక్తి కాదు...
🌄🇮🇳🔥🇮🇳🔥🇮🇳🔥🇮🇳🔥🇮🇳🔥🇮🇳🎯
( Written by Syama Sundera Rao)

సేకరణ

వేమన గురించి..

యోగి వేమన జయంతి ఈరోజు (jan 24) ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ......

చాలా మందికి వేమన గురించి..
సినిమా వాళ్ళు ఎంత చూపించారో అంతే తెలుసు.....కానీ వాస్తవం వేరు..
ఈయన అసలు పేరు ""బెదమ కోమటి చిన వేమారెడ్డి""
ఈయన అన్న పేరు ""బెదమ కోమటి పెద వేమారెడ్డి""
అప్పటి కడప..కర్నూలు..అనంతపురం కలిపి ఒకే రాజ్యంగా ఉండేది...
దానికి సామంత రాజు బెదమకోమటి పెదవేమారెడ్డి గారు.
అతని మంత్రి ""తురగారాముడు.
తురగారాముడు ఎలాగైనా అన్నదమ్ములనిద్దరినీ చంపి
తాను రాజు కావాలని ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటాడు...
ఇప్పుడు మనం చినవేమారెడ్డిని వేమన అని పిలిచుకుంటున్నాము....
ఇతడు మహా ధైర్యవంతుడు...
పేరుకు అన్నగారు రాజు..
కానీ మొత్తం రాజ్యం వేమన్న ధైర్యసాహసాలు కనుసన్నులో ఉంటుంది....
అతని ధైర్యానికి ఉదాహరణ...

ఒక మదపుటెద్దు ఊరి మీద పడి అందరినీ కుమ్ముతూ హడలెత్తిస్తూ ఉంటుంది...
అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెడుతూ వుంటారు...
ఎద్దుకు మదమెక్కితే దాన్ని ఆపడం ఏ పహిల్వాన్ చేత కూడా కాదు....
అటుగా వస్తున్న వేమన మీదికి వెళుతుంది....
అది ముందరికి రాగానే ఒక్కసారిగా గట్టిగా దాని కళ్ళలోకి చూసి ""ఏయ్"'అని
గద్ధిస్తాడు...
ఆ శబ్దం ఆ ఎద్దు చెవులనుంచి దూరి ఊరి మొత్తం ప్రతిధ్వనిస్తుంది.....
దాని కళ్ళకు వేమన మహా సింహం లాగా కనిపిస్తాడు.... హడలెత్తి తోకముడుచుకొని
పారిపోతుంది....దాన్ని ప్రత్యక్షంగా చూసిన తురగారాముడు, ముందు
వేమన్నను మట్టు బెడితే గానీ తన పని సులువు కాదని,,,
వేమన ఉన్నంత వరకూ తానేమీ చేయలేనని తెలుసుకుంటాడు...

తన దృష్టిని వేమన మీద ఉంచుతాడు..వేమనకు భోగంగత్తెల (వేశ్యల) సాంగత్యం ఎక్కువ..ఎక్కడైనా కొత్తగా భోగంసానిగా వృత్తిలోకి వచ్చింది అంటే ఈయన ముందు వెళ్ళేవాడు....వేమనకు
""విశ్వద """అనే ఒక ప్రేయసి కూడా ఉంటుంది...
వేమన అంటే ఆమెకు చాలా ఇష్టం....
ఎన్నోసార్లు తన రాజ్యం గురించి,,,,
తాను నిర్వర్థించాల్సిన ధర్మం గురించి అనేక సార్లు
హెచ్చరిస్తుంది..కానీ వేమన అవేమీ పట్టించుకునేవాడు కాదు....
మీరు శరీర అందం వెనుక పరిగెడుతున్నారు....కానీ అది శాశ్వతము కాదు....
అందం వెనుక అందవికారం కూడా దాగి ఉంటుంది...
యవ్వనంలో కనపడినట్లు ఈ శరీరం ముసలితనంలో తన ప్రాభవం కోల్పోతుంది.
ఏదైతే ఇప్పుడుండి ఇక మీదట ఉండదో దాని కొరకు మీరు పరిగెడుతున్నారు....
మీరు కాస్త ఆగి యోచించాలని హెచ్చరిస్తుంది....
కానీ వేమన పట్టించుకునే వాడు కాదు....
తురగారాముడి కుయుక్తులను కూడా గుర్తు చేస్తుంది...కానీ ఫలితం ఉండదు....
అప్పుడే దసరా తిరునాళ్ళు మొదలవుతాయి....
వేంపల్లి సంబరాలకు ముస్తాబవుతుంది....
ఆ తిరునాళ్ళలో మహా అందెగత్తె ""మాంచాల నాగులు భోగమాటను ప్రారంభిస్తుంది....
ఆమె గురించి ఆ నోటా,,,ఈ నోటా,,,వేమనకు చేరుతుంది...
వేమన ఒక సారి వేంపల్లెకు వెళ్లి చూస్తాడు.....
ఆమె అందానికి దాసుడై పోతాడు....
ఇక తన మకాం పూర్తీగా వెంపల్లె నాగుల యింటికి మారుస్తాడు....
ఓ ప్రేయసి కంటే ఎక్కువగా అభిమానిస్తాడు.
నెలలు గడుస్తాయి.....
నెలల కొద్దీ ఇంటికి రాకపోయే సరికి అన్నకు వదినకు సందేహం కలుగుతుంది....
వేమన నాగులు అనే వేశ్య ఇంటికే పరిమితమయ్యాడని తెలుసుకుంటారు..
డబ్బులన్నీ ఇలా ఆమెకు ధారపొయ్యడం మంచిది కాదని,,,
రాజ్యం శిస్తులన్నీ వాడుకోవడం ధర్మం కాదని..
రాజ్య పరిపాలన దెబ్బతింటుందని వదిన వారిస్తుంది....

""విశ్వద" కు వేమన్న భవిష్యత్తు కళ్లముందర కనిపిస్తుంది..
అతని భవిష్యత్తు అంధకారమై పోతుందని గ్రహించి...
సత్యం చెప్పే తీరాలని నిర్ణయించి వేమన్నను పిలిచి..
తొందరలోనే మీరు మరణించబోతున్నారు...
శరీరానికి నెలలు కాదు రోజులు మాత్రమే ఉన్నాయి...
ఈ శరీరం దేనికోసం తీసుకున్నావో దానిని ఇక మీరు నిర్వర్తించలేరు..
ఇప్పటికైనా మేల్కొనండి....
జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోండి...
ఆ మార్గంలోకి వెళ్లే ప్రయత్నం చెయ్యండి అంటుంది...

వేమన పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు...
వేమన ""నాగులు"" కి పచ్చి బానిస అయ్యాడని గ్రహించిన
తురగారాముడు వెళ్లి నాగులును లోబర్చుకుంటాడు....
కొంత మంది సైన్యాన్ని కూడా లోబర్చుకుని ఉంటాడు...
సైన్యంతో నాగులు దగ్గరకు వెళ్లి ఆమె చేతికి విషం ఇచ్చి దాన్ని వేమన మీదికి ప్రయోగం
చేయవలసిందిగా చెబుతాడు....
దానికి గానూ ఆమెకు డబ్బు,,,
జాగీరు ఎరగా చూపుతాడు....
చెయ్యకపోతే తానే వేమన్నను చంపి ఆ అభియోగం నీమీదికి తోస్తానని
బెదిరిస్తాడు....చేసేది లేక ఆమె ఒప్పుకుంటుంది....

ఒక అమావాస్య రోజు పాయసం చేసి భోగలాలసలో వున్నప్పుడు తాగమని ఇస్తుంది....
వేమన తన ప్రేయసి ఎంతో ప్రేమతో చేసిందని తాగుతాడు....
అంతే పూర్తిగా దాదాపు శరీరాన్ని వదిలేసినంతగా కోమాలోకి వెళ్ళిపోతాడు..
నాగులు తురగారామునికి పని పూర్తి అయిందని కబురు బెడుతుంది...
తురగారాముడు తన సైన్యాన్ని పురమాయించి శవాన్ని దట్టమైన కారడవులలో
వేయించేస్తాడు....
ఆ అడవులలో"" అభిరామ"" అనే వైద్యుడు ఆకుల రసాలతో ఇనుమును బంగారంగా
చేసే పరసువేది విద్యను నేర్చుకుంటూ ఉంటాడు....
ఒక రోజు ఆకుల కోసం వెళ్ళినప్పుడు వేమన్న శవాన్ని చూస్తాడు....
అతని నాడిని చూసి ఎక్కడో ఒక మూల ప్రాణం ఉందని గ్రహించి అతన్ని తీసుకెళ్లి తన
వైద్యం తో బ్రతికిస్తాడు....మెలకువ వచ్చిన తర్వాత వేమన ఏమీ మాట్లాడేవాడు కాదు....మౌనంగా కూర్చునేవాడు...ఏ వివరాలూ ఎంత అడిగినా ఏమీ చెప్పేవాడు కాదు.....
మహా మౌనంగా ఉండేవాడు...తాను చేసే వైద్య వృత్తిలో కాస్త మక్కువ చూపేవాడు....
విశ్వద చెప్పిన సత్యం,,,,నాగులు,,,తురగారాముడు చేసిన మోసం కళ్ళముందు
కదిలేవి....తానే ఏమరపాటుగా ఉన్నానని తెలుసుకునే వాడు..
ఆకులు అలముల కోసం అప్పుడదప్పుడూ అడవులకెళ్లి తెచ్చేవాడు....

అభిరాముడు..తన గురువుగారైన విశ్వకర్మ యోగి ని
కలిసి జ్ఞానాన్ని తెలిసుకుంటూ ఉండేవాడు....ఒక రోజు విశ్వకర్మయోగి తాను శరీరం వదిలేస్తున్నానని,,,తాను సంపాదించిన జ్ఞానాన్ని తనకు వాహకత్వం ఇస్తానని
రేపు రావలసిందిగా చెబుతాడు...అలాగే అని చెప్పి అభిరాముడు వెళ్ళిపోతాడు...
మరుసటి రోజు అభిరాముడు ఆకుల కోసమని వేమనతో చెప్పి బయలుదేరుతాడు...
దారిమధ్యలో ఒక పులి కనబడడంతో పరుగులు పెడతాడు.... దాంతో ఆ అడవులలో దారి తప్పిపోతాడు......
అభిరాముడు ఎంతకూ ఆకులు తీసుకురాలేదని గ్రహించి చీకటి పడుతుండడంతో
వేమన బయలుదేరుతాడు....వేమన సరాసరి విశ్వకర్మయోగి ఉన్న గుహలోకి వెళతాడు.....విశ్వకర్మయోగి చెందవలసిన వాడు,,,,రావలసిన వాడు రానే వచ్చాడు ,,
అని వేమన్నను పిలిచి ధ్యాన,,,జ్ఞాన,విద్యను నేర్పించి,, మూడోకన్నును ఉద్దీపనం చెందించి వాహకత్వం ఇచ్చి శరీరం వదిలేస్తాడు.... ఆ క్షణమే వేమనకు జగత్తు సత్యం అర్థమైపోతుంది....అంతలోనే అభిరాముడు అక్కడికి చేరుకుంటాడు....
తాను పొందవలసిన దాన్ని పొందలేక పోయానని బోరున విలపిస్తాడు....
వేమన దానికి అభిరామా....దుఃఖించకు ,,భాధ పడకు,,,
నా ప్రేయసి నా కళ్ళు ఎన్నోసార్లు తెరిపించినప్పటికీ నేను పెడచెవిన పెట్టాను....
ఈ రోజు నువ్వు పొందవలసిన దాన్ని దైవేచ్చలో భాగంగా నేను పొందడం జరిగింది...
విశ్వద ...అభిరామా ఇద్దరూ చెబుతూ వుంటే వేమన్న వింటున్నట్టుగా ప్రపంచానికి తెలియపరుస్తాను. అని చెబుతాడు...
విశ్వద ..అభిరామా ఇద్దరూ కలిసి వినరా వేమా...అని నాకు భోధిస్తున్నట్టుగా,,,చెబుతున్నట్టుగా ప్రపంచానికి చెబుతాను అని చెబుతాడు...
అందుకే..విశ్వదాభిరామా వినురావేమా..!అని చెప్పింది.

ఇది నాకిష్టమైన పద్యం.

కుండ కుంభమన్నా,,కొండ పర్వతమన్నా,,
నుప్పు లవనమన్నా,,నొకటి కాదే
భాషలిట్టే వేరు పరతత్వం ఒక్కటే
విశ్వదాభి రామ వినురవేమ....!

కుండ అన్నా,,,
కుంభమన్నా,,,
ఉప్పు అన్నా,,,
లవణ మన్నా,,,
కొండ అన్నా,,,
పర్వతం అన్నా,,,
అంతా ఒక్కటే.....
భాషలే వేరు....
భగవంతుని తత్వం ఒక్కటే... వేమన్న..
భాషలు వేరు కానీ భావం ఒక్కటే...
భాషలు వేరే....కానీ ఉన్నది
ఆ ""ఒక్కటే "".
భగవంతుడు..అని తెలియచెప్పాడు.
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
శ్రీ మాత్రే నమః

సేకరణ

బుద్ధుడిలా బతికేయడం సులభం బుద్ధుడి భార్యలా బతకగలరా

ఈ post #మహిళామణులకుఅంకితం
బుద్ధుడిలా బతికేయడం సులభం
బుద్ధుడి భార్యలా బతకగలరా 🙏

జ్ఞానం సంపాదించిన బుద్ధుడు తన భార్య బిడ్డను చూడడానికి వచ్చాడు

భార్య ఇలా ప్రశ్నించింది
నన్ను వదిలి వెళ్లారు పరవాలేదు కానీ నాతో ఒక్క మాట చెప్పి వెళ్ళుండొచ్చు. నేను మీ ఆలోచనకు అడ్డు చెప్పి ఉండను కదా కానీ మీరు నన్ను నమ్మలేదు అన్నదే ఎక్కువ బాధ కలిగించింది. ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టారని అడిగింది

బుద్దుడు తన భార్య దగ్గర క్షమాపణ కోరి నేను చెప్పకుండా వెళ్ళింది నీకు భయపడి కాదు నాకు భయపడి నిన్ను బిడ్డను చూస్తే ఎక్కడ నా మనసు మారిపోతుందో అని చెప్పాడు

భార్య మళ్ళీ ఒక ప్రశ్న అడిగింది ఈ రాజ్యాన్ని వదిలి వెళ్లకుండా ఇక్కడే మీరు ఆ జ్ఞానాన్ని సంపాదించ ఉండలేరా అని

నిజమే నేను కొండలు అడవులు ఆశ్రమాలు వెతుక్కుని వెళ్లాల్సిన పని లేదు కానీ ఇక్కడ నుండి వెళ్లేప్పుడు నాకు అది అర్థం కాలేదు అన్నాడు

అందరూ బుద్ధుడి గురించే మాట్లాడుతారు కానీ ఆయన భార్య యశోధర గురించి ఆలోచించరు

బుద్ధుడు వెళ్ళినట్టే తన భార్య అర్దరాత్రి గడప దాటి ఉంటే ఈ లోకం ఆమెను మంచిది అని చెప్పేదా??

లేచిపోయింది అని చెప్పి ఉండేవాళ్ళు,ఇప్పుడు కూడా అక్కడ వారు అనని మాటలు లేవు

పెద్ద వయసేమి కాలేదు అందంగా ఉంది ఇంత రాజ్యము ఆవిడ సొంతమే తనకు నచ్చినట్టు ఉండొచ్చులే అని నిందలేసింది

పసి పిల్లాడు నాన్న కోసం అడుగుతుంటే అర్థం కానీ అతనికి ఏమని చెప్పి సముదాయించిందో ఎంత పోరాడిందో

ఇవన్నీ వదిలేసి ఎటువంటి సమస్య లేకుండా సన్యాసం పుచ్చుకున్నాడు బుద్ధుడు
అన్నీ ఉన్నా సన్యాసిలానే బతికింది యశోధర

ఏది కఠినం ఏది కష్టం
ఎవరు సన్యాసం పుచ్చుకున్నది చెప్పండి..🙏

సేకరణ:-Budda's Book

సేకరణ

టీచర్‌ తిట్టినా, కొట్టినా బాగానే ఉంటుంది: పూరీ జగన్నాధ్

టీచర్‌ తిట్టినా, కొట్టినా బాగానే ఉంటుంది: పూరీ జగన్నాధ్

టీచర్‌‌పై ఫిల్మ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ విశ్లేషణ

ఉపాధ్యాయులంటే మన రక్త సంబంధీకులని.. వాళ్లను గౌరవించకపోతే మన మీద మనకు గౌరవం లేనట్లేనని పూరీ జగన్నాథ్‌ అన్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పేందుకు టీచర్లు కూడా ప్రతి రోజూ సాధన చేస్తూనే ఉంటారన్నారు. తన వెబ్‌కాస్ట్‌. పూరి మ్యూజింగ్స్‌ లో భాగంగా ఈ సారి ‘టీచర్లు’ అనే అంశంపై ఆయన తన విశ్లేషణ పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే మీ కోసం..
‘‘ జీవితంలో మీరు బాగుపడి ఉన్నత స్థానంలో ఉంటే.. మీ అమ్మానాన్న కంటే ఎక్కువ ఆనందపడేది మీ టీచర్‌. మనతో అ.ఆ.లు దిద్దించి.. అంకెలు నేర్పించి. రోజుకో పాఠం చెప్పే టీచర్‌ మన తల్లిదండ్రి కంటే ఎక్కువ . మన అందరికీ టీచర్‌తో ఒక తెలియని అనుబంధం ఉంటుంది. ఒకడు చదువులో శుంఠ కావచ్చు. పనికిమాలిన వెధవకావచ్చు. అలాంటి వాడికి మాస్టారును చూడగానే ఓ గౌరవం వస్తుంది. టీచర్‌తో ఉన్న బంధం లెక్చరర్‌తో, ప్రొఫెసర్‌తో కూడా ఉండదు. ఇది వేరే అది వేరే. టీచర్‌ అంటే కుటుంబం. మనల్ని పెంచారు వాళ్లు. ఎన్నో నేర్పుతూ పెంచారు. టీచర్‌లో ఎన్నో లక్షణాలు ఉంటాయి. కమ్యునికేషన్‌ స్కిల్స్‌, లిజనింగ్‌స్కిల్స్‌, ఫ్రెండ్లీగా ఉండటం, ఓపిక, క్రమశిక్షణ, EMPATHY.. ఇలా ఎన్నో. క్లాస్‌లో మీరే కాదు.. మీ టీచర్‌ కూడా రోజూ చదువుకుంటూ ఉంటారు. కష్టమైన విషయాలు మీకు సులభంగా చెప్పడం కోసం ప్రతిరోజూ సాధన చేస్తూ ఉంటాడు. నవ్వుతూ పాఠాలు చెప్తారు. అందుకే మంచి టీచర్‌ ఉంటే క్లాస్‌ మిస్సవ్వబుద్ధి కాదు. మనకు నచ్చిన టీచర్‌ తిట్టినా, కొట్టినా ఎంతో బాగుంటది’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘టీచర్‌ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. అందుకే గురువుకు చాలా ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో ఉపాధ్యాయులకు భారీగా జీతాలు చెల్లిస్తారు. మన దేశంలో కూడా అలా జరగాలి. {స్విట్జర్లాండ్‌, లక్సంబర్గ్‌, కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, యూనైటెడ్‌ స్టేట్స్‌, ఐర్లాండ్‌, డెన్మార్క్‌....Etc.} వాళ్లకు ఎందుకు ఎక్కువ ఇస్తారంటే.. ఒక టీచర్‌ వల్ల యువత, దేశం మారతాయని నమ్ముతాయి కాబట్టి. మనం పాస్‌ అయినా.. ఫెయిల్‌ అయినా టీచర్‌ దగ్గర చాలా నేర్చుకుంటాం. అందుకే రౌడీగా మారి పది హత్యలు చేసిన వాడు కూడా టీచర్‌ కనిపిస్తే లేచి నమస్కారం పెడతాడు. ఒక మంచి ఉపాధ్యాయుడు గుండెల్లోంచి పాఠం చెబుతాడు.. పుస్తకంలోంచి కాదు. మన పాఠశాల రోజుల తర్వాత మనం మన ఉపాధ్యాయులను కలవకపోవచ్చు.. మాట్లాడకపోవచ్చు. కానీ.. వాళ్లంటే మనందరికీ తెలియని గౌరవం ఉంటుంది. మన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. దానికి నిదర్శనం టీచర్లను చూడగానే పాత విద్యార్థుల పెదాలపై చిరునవ్వు రావడం. ఆప్యాయంగా మాస్టారు అంటూ దగ్గరికి వెళతారు. నీ టీచర్‌ మీద నీకు గౌరవం లేకపోతే.. నీమీద నీక్కూడా గౌరవం లేనట్టే. అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, అన్నయ్య.. వీళ్లతో పాటు మన టీచర్‌ కూడా మన రక్త సంబంధీకులే. హ్యాట్సాప్‌ టు ది బ్యూటిఫుల్‌ టీచర్‌. గ్రేట్‌ టీచర్‌ ఆల్‌వేస్‌ ఇన్‌స్పైర్స్‌’’ అంటూ ముగించారు.

సేకరణ

ధ్యానం ఒకరి స్వంత చైతన్యాన్ని" మాత్రమే "మార్చగలదు

⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
ధ్యానం ఒకరి స్వంత చైతన్యాన్ని" మాత్రమే "మార్చగలదు
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
ఆచార్య రజనీష్‌ను ఆయన అనుచరుడు ఒకరు ప్రశ్నించారు.
ప్రశ్న - జిహాదీలు ఇళ్లు, ఆస్తులు తగలబెడుతున్నప్పుడు, హత్యలు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి? మేము హిందూ ముస్లిం సోదర సోదరభావాన్ని ప్రోత్సహించాలా లేదా మన స్వంత భద్రత కోసం ఏదైనా చర్య తీసుకోవాలా, దయచేసి మార్గనిర్దేశం చేయండి.

ఆచార్యుని సమాధానం -
🙏 మీ ప్రశ్న మీ మూర్ఖత్వాన్ని తెలియజేస్తోంది, మీరు చరిత్ర నుండి ఏమీ నేర్చుకున్నట్లు అనిపించడం లేదు. మహ్మద్ గజ్నీ సోమనాథ్ ఆలయంపై దాడి చేసినప్పుడు, ఆ సమయంలో భారతదేశంలో సోమనాథ్ అతిపెద్ద మరియు ధనిక దేవాలయం. ఆ ఆలయంలో పూజలు చేసే 1200 మంది హిందూ పూజారులు, మనవారందరూ ధ్యానం, భక్తి, ఆరాధన, అంటూ పగలు మరియు రాత్రి అనే తేడా లేకుండా నిమగ్నమై ఉన్నారు కాబట్టి దేవుడు మనలను రక్షిస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు, ఆ దేవుడు మన/తన రక్షణ కోసం ఎటువంటి ఏర్పాటు చేయలేదు, దానికి విరుద్ధంగా, తమను తాము రక్షించుకోగల క్షత్రియులు కూడా రక్షించడానికి నిరాకరించారు.
తత్ఫలితంగా, మహ్మూద్ గజ్నీ వేలాది మంది నిరాయుధ హిందూ పూజారులను చంపి, విగ్రహాలు మరియు దేవాలయాలను పగలగొట్టి చాలా సంపద, వజ్రాలు, నగలు, బంగారం మరియు వెండిని ఎత్తుకెళ్లాడు.
భగవంతుడిని ధ్యానం, భక్తితో చేసిన పూజలు వారిని రక్షించలేకపోయాయి.

ఈరోజు వందేళ్ల తర్వాత కూడా అదే మూర్ఖత్వం కొనసాగుతోంది, మీ మహానుభావుల జీవితాల నుండి మీరు ఏమీ నేర్చుకున్నట్లు కనిపించడం లేదు.

దుష్టుల హృదయాన్ని మార్చగలిగేంత శక్తి ధ్యానానికి ఉన్నట్లయితే, రామచంద్ర జీ ఎప్పుడూ తన వద్ద విల్లు మరియు బాణాన్ని ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది. ధ్యానం యొక్క శక్తితో, అతను రాక్షసులను మరియు రావణుని హృదయాన్ని మార్చేవాడు, వారిని సుర-అసుర సోదరులు మరియు సోదరులుగా వివరించి విభజించే వాడు గొడవ ముగిసేది. కానీ రాముడు కూడా ఎవరికీ వివరించలేకపోయాడు. మరియు రామ-రావణుల యుద్ధ నిర్ణయం ఆయుధం ద్వారానే నిర్ణయించబడింది.

ధ్యానానికి అంత శక్తి ఉంటే అది ఇతరుల మనస్సును మార్చగలదు. అలాంటప్పుడు పూర్ణావతారం శ్రీకృష్ణుడు కంసుడిని, జరాసంధుడిని, శిశుపాలుడ్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది?! ధ్యానంతోనే వారిని మార్చగలిగాడా?!

ధ్యానానికి మరొకరి మనసు మార్చే శక్తి ఉంటే మహాభారత యుద్ధం ఉండేది కాదు, కృష్ణుడు తన ధ్యాన బలంతో దుర్యోధనుడిని మార్చి యుద్ధం నివారించి ఉండేవాడు. కానీ అందుకు విరుద్ధంగా ధ్యానంలోకి వెళ్లాలనుకున్న అర్జునుడిని కృష్ణుడు అడ్డుకుని యుద్ధంలో నిమగ్నమయ్యేటట్లు చేశాడు.

మహాభారత యుద్ధం చరిత్రలో కోట్లాది మందిని ఊచకోత కోసిన అతి పెద్ద యుద్ధం.

గత 1200 సంవత్సరాలలో భారతదేశంలో ఎంతో మంది మహర్షులు, సాధువులు గోరఖ్‌నాథ్ నుండి రవిదాస్ వరకు మరియు కబీర్, గురునానక్ నుండి గురుగోవింద్ సింగ్ వరకు, ధ్యానం యొక్క శక్తి వీరందరినీ కూడా ముస్లిం ఆక్రమణదారులు మరియు బ్రిటిష్ వారి దౌర్జన్య, దమన, హత్య, అత్యాచారాల నుండి కాపాడలేకపోయింది. ఈ సమయంలో కోట్లాది మంది హిందువులను ఊచకోత కోసి వారి మతాన్ని బలవంతంగా మార్చేశారు.

వారిని చంపి ఇస్లాంలోకి మార్చారు.
ఆ సాధువుల బోధనలు ఆక్రమణదారులను మార్చలేకపోయాయి. గురునానక్ తన మత తత్వశాస్త్రాన్ని ముస్లింలు సులభంగా అర్థం చేసుకోగలిగేలా మరియు గ్రహించగలిగే విధంగా అందించారు. కానీ అదే గురు సంప్రదాయంలో, గురుగోవింద్ సింగ్ ముస్లింలపై కత్తి పట్టవలసి వచ్చింది. హిందూ మతాన్ని రక్షించడానికి, నిరాయుధ సిక్కులు ఆయుధాలు పట్టవలసి వచ్చింది.

ధ్యానం ఒకరి స్వంత చైతన్యాన్ని మాత్రమే మార్చగలదని దీని నుండి స్పష్టమవుతుంది.
మన భౌతిక దేహాన్ని, మన ఆస్తులను, సంప్రదాయాలను, సంస్కృతిని మనమే రక్షించుకోవాలి, అందుకు శాస్త్ర సాంకేతిక సహాయం తీసుకోవాలి.

దేశంలోని 70% కంటే ఎక్కువ సమస్యలకు ధ్యానం పరిష్కారం కాదు.

శ్రీకృష్ణుడు రాయబారిగా దుర్యోధనుడుని పాండవుల క్షేమం కోసం 5 గ్రామాలను కోరాడు.

మన దేశ సనాతన ధార్మిక వ్యవస్థ ప్రయోజనాల కోసం 5 చట్టాలు అడుగుతున్నాం!!

సమాన విద్య
ఏకరీతి పౌర స్మృతి
మార్పిడి నియంత్రణ
చొరబాటు నియంత్రణ
జనాభా నియంత్రణ

ఈ ఐదు చట్టాలు రాకపోతే, ప్రస్తుతం భారతదేశంలోని తొమ్మిది రాష్ట్రాల మాదిరిగానే సనాతన ధార్మిక వ్యవస్థ మొత్తం ప్రపంచంలో పూర్తిగా నాశనం అవుతుంది.
???????????????????????????
మరి మన దేశాన్ని మరియు మన సోదరీమణులు/కూతుళ్లను రక్షించేందుకు
మనం ఏమి చేయాలి?
???????????????????????????



🚩జై శ్రీ రామ్🏹...

సేకరణ

జనవరి 1 నూతనసంవత్సరాది ఎందుకు కాదంటే........ .ఆ రోజున.

జనవరి 1 నూతనసంవత్సరాది ఎందుకు కాదంటే........ .ఆ రోజున.

1.ఏ యుగ పురుషుడు/సంఘ సంస్కర్త/ప్రవక్త /శాస్త్ర వేత్త ఎక్కడా జన్మించలేదు.

2. లోక కంటకుడు ఎవడూ సంహరించబడలేదు(దీపావళి వలె)

3.ఆయనములలో మార్పు లేదు(సంక్రాంతి )..

4.ఋతువుల్లో మార్పు లేదు. .

5..ఖగోళంలో ఎటువంటి మార్పులు రాలేవు....

6.ప్రకృతిలో మార్పులు లేవు ....

7.ఏ రాజు/చక్రవర్తి సింహాసనం అధిరోహించలేదు....విజయాలు సాధించిన రోజు కూడా కాదు. .

8.ఎటువంటి విప్లవాలు ప్రారంభం కాలేదు.

9.కొత్త పంటలు చేతికి రాలేదు..

10. చెట్లు చిగురించే కాలమూ కాదు. ప్రకృతిలో పచ్చదనమే కనబడదు.

11.ఏ మతపరంగా చూసినా ఎటువంటి ప్రాముఖ్యత లేదు..

12..శాస్తీయపరంగా ఎటువంటి ప్రాధాన్యత లేదు.

13.ఏ ధర్మ గ్రంథాలలోనూ ఈ రోజు ప్రశస్తి లేదు.మరి ఎందుకు జరుపుకోవడం?

వేలంవెర్రిగా TVలు డబ్బుల ఆశకు,rating పెంచుకోవడానికి , నైతిక విలువలు నాశనం చేసి , పిచ్చి పిచ్చికార్యక్రమాలతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తుంటే,దాన్ని చూసి 31 డిసెంబర్ అర్ధరాత్రి తాగి రోడ్లపై తూగుతూ వికృతంగా ప్రవర్తిస్తే, అల్లరి చేస్తే అది ఏ సంస్కారానికి గుర్తు? విదేశీ విశృంఖలత్వాన్ని new year day పేరుతో పంచుతూ,సమాజాన్ని, ముఖ్యంగా యువత ను భ్రష్టు పట్టంచడమే ధ్యేయంగా పని చేస్తున్న కొన్ని TV ఛానల్లు, సంస్థలు.

బహుపరాక్ జాగ్రత్త. ....వాస్తవాలు తెలియజేయండి.

""స్వదేశీ విధానాన్ని మూర్ఖంగా వ్యతిరేకించొద్దు..విదేశీ విధానాలు గుడ్డిగా అనుసరించొద్దు""

సేకరణ

మనిషి చేసే ప్రతి కర్మలకు పద్దెనిమిది రకాల సాక్షులు, అవి ఏమిటో చూద్దాం.

🙏 మనిషి చేసే ప్రతి కర్మలకు పద్దెనిమిది రకాల సాక్షులు, అవి ఏమిటో చూద్దాం.🙏

🤝చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం, ఒకరి మీద లేని పోని నిందలు వేయడం మానవ బలహీనత...కానీ ‘'నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు’' అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు.

🤝మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించే మూగసాక్షులు పద్దెనిమిది (18) ఉన్నాయి. అవి ఏమిటంటే నాలుగు వేదాలు, పంచ భూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి... మొత్తం పద్దెనిమిది.

🤝వీటినే అష్టాదశ మహా సాక్షులు అంటారు. ఈ మూగ సాక్షులు మనిషి వెంటే వుంటు అనుక్షణం నీడలా తిరుగుతూ పర్యవేక్షిస్తు గమనిస్తుంటాయి. ఇవి మూగ సాక్షులు కాబట్టి ఈ లోకంలో ఉన్న న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పలేకపోవచ్చును గాని, శిక్ష మాత్రం దానంతట అదే అమలు జరిగిపోతుంది.

🤝 ఎప్పటికప్పుడు వీటి గమనికల వలన మనిషికి ఏర్పడిన కర్మల నుండి తప్పించుకోవడం ఎట్టి పరిస్థితులలో సాధ్యపడదు. మనిషి దీన్ని గుర్తించక ఇవన్నీ జడ పదార్థాలే కాబట్టి, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమ పడుతుంటాడు, అవి మనిషి ప్రతి చర్యనూ ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటాయని గ్రహించడు.

🤝ఆ నివేదికలన్ని ఎప్పటికప్పుడు విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచివి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు స్వాగత సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి.

🤝అవి ఏవో మరుజన్మకో ఆ తరువాత ఎప్పుడో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు జరగవచ్చు... లేదా దృతరాష్ట్రుడు వలె 50 జన్మల తరువాత అయిన కర్మ సిద్దాంతాన్ని పొందవచ్చు ఎప్పటికైనా విడిచి పెట్టవు.

🤝ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం, అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు, అది మనం చేసే ప్రతి పని మంచిదా? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే మన మనసుకు తెలియపరుస్తుంది కాని అజ్ఞానం వలన బోధపడదు.

🤝 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు. అది అన్ని విధాల అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవ పూర్వకం.

🤝 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం. కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోలేము, అందువల్ల అంతరాత్మ ఒకటి అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం. అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .

🤝ఈ ఎరుక కలిగిన ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి ఉపక్రమించడు, పైగా ఇతరులకు తోచిన సహాయ సహకారాలు చేస్తూ దన్యుడవుతాడు.

🤝 కాబట్టి ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి ఎప్పుడూ సాధ్యమైనన్ని మంచి పనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులను నోచుకుంటాడు.. మీ శ్రేయోభిలాషి, జై శ్రీరాం!
🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩

సేకరణ

🥞జొన్న రొట్టే కదా అని తేలిగ్గా తీసుకోకండి.. పోషక విలువలు అధికమంటున్న పరిశోధకులు

🥞జొన్న రొట్టే కదా అని తేలిగ్గా తీసుకోకండి.. పోషక విలువలు అధికమంటున్న పరిశోధకులు



మధుమేహులకు మంచిదంటున్న డైటీషియన్లు
పోషక విలువలు అధికమంటున్న పరిశోధకులు
జొన్న.. తింటే ఆరోగ్యం మిన్న జొన్న రొట్టె.. ఒకప్పుడు పేదలు తినే ఆహారం. వరి అన్నం ఫేమస్‌ అయ్యాక వారూ జొన్నల వినియోగం తగ్గించారు.
తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ చాలా ఇళ్లల్లో ఆహారంగా తీసుకునేది జొన్న రొట్టెనే. బీ కాంప్లెక్స్‌ విటమిన్స్‌కు తోడు ఫైబర్‌, విటమిన్‌ ఏ, విటమిన్‌ సీ, క్రూడ్‌ ఫ్యాట్‌, అమినో యాసిడ్స్‌ ఇలా అత్యవసర పోషకాలు అధికంగా ఉండే ఆహారం జొన్న. ఆరోగ్యం మెరుగుపడాలంటే ఇది తప్పనిసరి. మధుమేహులకు ఇది చక్కటి భోజనం అని కూడా చెబుతున్నారు.
నగరంలో జొన్నరొట్టెలకు ప్రాచుర్యం ఇటీవల బాగా పెరిగింది. అంతకు ముందు హోటల్స్‌లో జొన్న రొట్టె కనిపించడం తక్కువే కానీ, పెరిగిన ఆరోగ్యాభిలాషులతో స్టార్‌ హోటల్స్‌ కూడా జొన్న రొట్టెను తమ మెనూలో జోడించాయిప్పుడు. వీధులలో రూ.10లకే లభిస్తున్న జొన్నరొట్టె పలు హోటల్‌లలో వాటి స్థాయిని బట్టి రూ.30 నుంచి రూ.150 వరకూ చార్జి చేస్తున్నారు.


🧑🏻‍⚕️ఏ రోటీ మంచిది..

చపాతీ, రోటీ ఏదైనా తక్కువ కాలంలోనే తినేయాలి. లేదంటే అవి పాడైపోయే అవకాశాలున్నాయి. కానీ జొన్నరొట్టెకు ఆ ఇబ్బంది లేదు. కాస్త ఆలస్యమైనా దీనిని ఇబ్బంది లేకుండా తినేయొచ్చు. జొన్నరొట్టెలో ఉన్న రెండు రకాలలో ఒకటి కడక్‌ రోటీ. ఇది గట్టిగా ఉంటుంది. మరోటి సాఫ్ట్‌రోటీ మెత్తగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే దీనిని తినేయాలి. కానీ కడక్‌ రోటీ అలా కాదు. కొన్ని వారాలైనా పాడయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీనిని సంప్రదాయ పద్ధతులలో నిల్వ చేస్తే వీటి జీవితకాలం మరింత పెరుగుతుంది. మన నగరంలో జొన్న రొట్టెను వెజిటేబుల్‌ కర్రీ లేదంటే చికెన్‌ కర్రీ లాంటి వాటితో కలిపి తీసుకుంటుంటారు. కొంతమంది పచ్చడితో కలిపి కూడా తింటుంటారు.

జొన్న అనగానే ముందుగా గుర్తొచ్చేది జొన్నరొట్టెనే కానీ, పశువుల మేతకు కూడా జొన్నలు వాడుతుంటారు. అయితే, ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి ఈ జొన్నతో సిరప్‌, ఇథనాల్‌, బయో ఫ్యూయల్‌ కూడా తీయొచ్చంటూ నూతన వంగడాలనూ సృష్టించారు. ఇంకో విశేషమేమిటంటే, ప్లాస్టిక్‌ కూడా దీని నుంచి తీయొచ్చని చెబుతున్నారు.


🧑🏻‍⚕️మేలైన ఆహారం..

పోషకాలు సమృద్ధిగా కలిగిన ఆహారం జోవార్‌. గ్లూటెన్‌ లేకపోవడం, పలు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా న్యూ క్వినోవాగా దీన్ని పిలుస్తున్నారు. దీనిలో కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ ఉండటం వల్ల మధుమేహులకు చక్కటి అవకాశంగా నిలిచింది. ఇది నెమ్మదిగా గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. శాఖాహారులకు ఇది అత్యుత్తమం. 100 గ్రాముల జొవార్‌లో 10.4 గ్రాముల ప్రోటీన్‌ ఉంది. మన శరీరానికి ప్రతిరోజూ అవసరమైన ఫైబర్‌లో 40శాతం ఇది అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గించడంలో సహాయపడటంతోపాటుగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గ్లూటెన్‌ పదార్థాల ఎలర్జీ ఉన్న వారితో పాటుగా ఉదరకుహర వ్యాధి (సెలియాక్‌ డిసెజస్‌) ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. జొన్నలలో ఐరన్‌, కాల్షియం, విటమిన్‌ బి, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటివి ఉన్నాయి. దీనివల్ల చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి దోహదపడతాయి. జీర్ణక్రియనూ మెరగుపరుస్తుంది. జొన్నలను రోటీ రూపంలో మాత్రమే కాదు ఇడ్లీ, దోశ రూపంలో తినొచ్చు. ఊబకాయులు బరువు తగ్గేందుకు కూడా ఇది చక్కటి ఎంపిక.

🌀☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️🌀

సేకరణ

*_నేటి మాట_* *కాకి నేర్పే సత్యం*

నేటి మాట

కాకి నేర్పే సత్యం

‘’ కావు కావు కావు కావు! ఏవీ శాశ్వతం కావు! ’’...
కాకి ప్రతీ ఊరిలో, ప్రతీ ఇంటిపై వాలి ఏదో ఒక సమయంలో అరిచే ఉంటుంది.
ఏమని? కావు కావు కావు అని...!!!
అనగా ఏవి శాశ్వతం కావు అని! ...
నువ్వు నిరంతరం ఎంతో శ్రమించి సంపాదించిన సంపదలు శాశ్వతం కావు...
బంధాలు శాశ్వతం కావు...
ఏ కోరికలూ శాశ్వతం కావు...
నువ్వు చూసేవి చేసేవి ఏవీ శాశ్వతం కావు...
ఎదీ శాశ్వతం కానపుడు మరి ఎందుకు ఇంత తపన?
నీది కాని దాని కోసం నువ్వు ఎంత తపించినా ప్రయోజనము లేదు.
నీకు చెందవల్సింది నీవు వద్దు అన్నా నీకు చెంది తీరుతుంది.
లేనిదాని కోసం ఉన్నదానిని వదులుకోకు!
ప్రపంచం అసత్యం, అశాశ్వతం. ఒక్క పరమాత్మ మాత్రమే సత్యము, శాశ్వతమని తెలుసుకుని మసలుకో!
సంపాదించిన సంపాదన నాది నాది అని దాచుకొని, వెళ్ళిన నాడు వెంట రాదు, అది నీకు ఇచ్చిన పరమాత్ముడికి ఇవ్వడానికి నీకు మనసు రాకపోతే, నువ్వు సంపాదించి, నావారు అని దాచిపెట్టి ఇచ్చిన వారికి ఎలా మనసు వస్తుంది...
అందుకే వారు వృద్దాశ్రమంలో, ఉంచి చూస్తుంటారు...
దీనికి కారణం ఎవరు అని ఒక్కసారి ఆలోచించండి, అప్పడు మనకే అర్థం అవుతుంది,
జీవితం ఉన్నప్పుడే కాళ్లు చేతులు సరిగా పనిచేసినప్పుడే భగ్వద్ చింతనలో ఉండి, భగ్వద్ కార్యంలో పాల్గొన్నప్పుడు, " నీ జీవనానికి ఎట్టి ఇబ్బందీ ఉండదు, పరిపూర్ణమైన శాంతి లభిస్తుంది..."

🌿శుభమస్తు🌿
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

సేకరణ

💞సుఖం...!*💞

💞సుఖం...!💞


ప్రతి మనిషీ- జీవితంలో సుఖంగా ఉన్నాడా ?

అసలు సుఖం అంటే

మనసుకు శాంతి అన్నా, సుఖం అన్నా ఒక్కటేనా ?

జీవితంలో డబ్బు ఉంటే.... సుఖం ఉన్నట్లేనా ?

డబ్బు ఉన్న ప్రతి ఒక్కరూ మానసిక శాంతి అనుభవిస్తున్నారా ???

జీవితం ఎంత చిత్రం, విచిత్రం? "ఏమి లేనపుడు కడుపుకు.... ఇంత కూడు చాలు అనిపిస్తూ..... తరువాత కాస్త గొంగళి, తర్వాత ఉండేదానికి కాస్త గూడు అనీ..,ఇంతవరకువచ్చి తృప్తిగా ఉన్నామా, లేదే.... ?

ఇంకా,ఇంకా ఎదగాలి! ఎదిగావు..!! ఇంకా డబ్బు సంపాదించాలి !!

సంపాదించావు ..!
నా పిల్లలు లగ్జరీగా పెరగాలి !! పెరిగారు .. !

పెద్ద భవంతులు కావాలి! కొన్నావు .. !! నా పరపతి పెరగాలి ! పెరిగింది .. !! అయినా ఇంకా ఏదో.....

ఏమిటి ఆ ఏదో .... ?
ఏదో తెలియని అసంతృప్తి ! ఎందుకు అంటే ........ ఏమో .....?

ప్రతి మనిషికి...., ప్రతి మనసుకు.... ఎన్ని కధలు మరెన్ని వ్యధలు ..?

కధ.. కధ.. మాటున దాగిన... కన్నీటి చెలమలు ఎన్నో... ఎన్నెన్నో ... !

డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండక ... ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండక ... భార్యా భర్తల గొడవలు .. , పిల్లలు మాట వినటంలేదని వేదన..., ఉధ్యోగం... , వ్యాపారం... , పెళ్లి , ఇల్లు , వాకిలి..., ఇలా ఎన్నో ఎన్నెన్నో ...

ఎన్నో కధలు విని .. కలత పడిన మనసు ప్రశ్నిస్తుంది ..
'అసలు సుఖంగా ఉన్నవారు ఉన్నారా? సుఖం అంటే ఏమిటి ? '

అవును సుఖం అంటే ఏమిటి.... ?
శాంతి అంటే ఏమిటి ??
శాంతి ఎక్కడ దొరుకుతుంది ?

నీకు నచ్చిన విధంగా ...
నీ మనసు మెచ్చిన విధంగా జరిగిన ఏ విషయమైనా నీకు సంతోషం అనిపిస్తే అదే సుఖం ... !

నీకు నచ్చని ఏ సంఘటన జరిగినా , అది దుఃఖం అనుకుంటావు ... !

అంటే సుఖం అయినా దుఃఖం అయినా నీ మనసులో కలిగే భావాలే...!

ఆ భావనకు అతీతంగా స్థిమితంగా జీవించ గలిగితే.... స్థిత ప్రజ్ఞతే .... !!

ఈ స్థితికి మనసును ఎలా తీసుకు వెళ్ళాలి ... ?

'నేనే.. ఈ మేను..!'అనుకున్నంతవరకు యెద చీకటేగా...! ''

కంటిలో నలుసులా కుదుట పడనీయదు ...

ఇక్కడ నేను అతిధిని మాత్రమే ...!
నాలుగు రోజుల అతిధిని మాత్రమే... !! 'ఇది నాది కాదు కాదు..కానే కాదు...!!!' అనే స్పృహ...
పరుగులు తీస్తున్న అరిషడ్వర్గాలను 'సత్యం' అనే అంకుశంతో నిత్యం... ఒక్కమారు స్పృశిస్తే ....
సత్యం బోధపడుతుంది .. !
సాక్షిగా నీ చూపు నిలబడుతుంది ...!!

డబ్బు, సిరులు, సంపదలు....
మేనికి సుఖాన్ని ఇస్తాయి కానీ... మనసుకు శాంతిని, ప్రశాంతతని ఇవ్వలేవు ...

మనసుకు శాంతి మాత్రం ....

మరణం లేని 'మీరు .... మీరేన'ని గ్రహించిన క్షణం మాత్రమే ... !

you are not a body ...!
you are a soul... !!
*love you all .. !!!️

సేకరణ

ముందు ఎవరు మాట్లాడాలి...?

★★★ ముందు ఎవరు మాట్లాడాలి...? ★★★

నానాటికీ ఛిద్రమవుతున్న మానవ సంబంధాలు!
దూరమయిపోతున్న రక్తసంబంధీకులు! ప్రతి వ్యక్తికీ ఎదురవుతున్న సమస్య!

ఒక అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు వచ్చాయి. మాటపట్టింపు మూలాన అనుబంధం ఎడమయ్యింది. రెండు కుటుంబాలు పరస్పర వైషమ్యంతో దూరమయ్యాయి.
కాలక్రమాన దూరమూ పెరిగింది. తరాలు మారాయి.
అన్నగారి కొడుకు వృత్తి వ్యాపారాలలో ఎదుగుదల సాధించాడు. అన్నగారు కన్ను మూశారు. కొంతకాలానికి అన్న కొడుకు తన తండ్రికి అభీష్టమైన రామాయణాన్ని పారాయణ చేశాడు. తన నాన్నపై భక్తి, ఆ నాన్నకి ఇష్టమైన రామునిపై భక్తిగా రెండు రూపాలయింది.

నాన్న పై ప్రేమయే రామాయణ పారాయణాన్ని చేయించింది. పారాయణ పూర్తి చేశాక - పెద్ద ఎత్తున పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు. బంధుమిత్ర బలగాన్ని ఆహ్వానించదలచుకున్నాడు. ఆహ్వాన పత్రాలను కూడా శోభాయమానంగా ముద్రించాడు. మొదటి పత్రం దేవుని పేర రాశాడు. ఇక - తరువాతి పత్రం - మానవ సంబంధాలలోని వారిలో - ఎవరికీ తొలిగా ఇవ్వాలనేది ప్రశ్న, నాన్న పరమపదించాడు. ఆ తరువాత? తండ్రి తరువాత తండ్రి బాబాయి. ఏనాడో విడిపోయిన బంధం. ఎక్కడున్నారో? ఎలా ఉన్నారో..!

కానీ వెతికి సాధించి అయినా మొదటి పత్రం బాబాయికే ఇవ్వాలి - అని నిశ్చయించుకున్నాడు?

ఇన్నాళ్ళు తమ కుటుంబాన్ని పట్టించుకోని బాబాయిని, పిల్లలమని కనికరం కూడా లేక, పలకరించని బాబాయిని... తానే ముందుగా పలకరించి పిలవాలా? మహాకష్టం కలిగినప్పుడు కూడా స్పందించి చేరదీయని ఆ కుటుంబానికి తానే పని కట్టుకొని, మొదట పిలవాలా?
ఈ ప్రశ్నలు కలిగాయి. కలగడం సహజం కూడా 'నేను' అనే భావాన్ని అంత తేలిగ్గా వంచడం సాధ్యం కాదు.

కానీ ఆ సమయంలో తాను పారాయణ చేసిన రామాయణం గుర్తుకు వచ్చింది.
"పూర్వభాషీ ప్రియంవదః" అని రామ చంద్రుని వర్ణించాడు వాల్మీకి.
"తానే మొదట మాట్లాడతాడు - ప్రియంగా మాట్లాడతాడు" ఇదీ రాముని మాట సొగసు.
అంతేనా - "వేయి అపకారాలైనా మరచిపోయి క్షమించగలడు. ఒక్క చిన్ని ఉపకారాన్ని సైతం కలకాలం గుర్తుపెట్టుకునే కృతజ్ఞతా మూర్తి".
"ర్కిణామపివత్సలః" శత్రువుని కూడా క్షమించగలిగే ప్రేమమూర్తి.
ఈ విశేషణాలు స్ఫురించాయి.

అంతే.. కృతనిశ్చయంతో పట్టుపట్టి ఎంతో శ్రమపడి బాబాయి సమాచారం సేకరించి, అతడున్న ఊరికి వెళ్ళి కలుసుకున్నాడు. బహుకాలం తర్వాత అన్న కొడుకు తనంతట తానే వచ్చి పాదనమస్కారం చేసి పలకరించగానే తమ్ముడి మనసు కరిగింది.

"బాబాయ్! శ్రీరామ పట్టాభిషేకం చేసుకుంటున్నాను. నాన్న పోయాక, నా చేతులు మీద చేస్తున్న పెద్ద శుభకార్యం ఇది. నాన్న తర్వాత అంతటి వాడవు నువ్వే దగ్గరుండి దీనిని నిర్వహించాల్సిన బాధ్యతనీదే" అని ఆదరంగా పిలిచాడు అన్న కొడుకు. కరిగిన మనసు కన్నీరై స్రవించింది బాబాయికి.

గాఢంగా అన్న కొడుకుని ఆలింగనం చేసుకున్నాడు. ఇంటిల్లిపాది రాముని పట్టాభిషేకపు పండగకి తరలివెళ్ళారు. అంతా కలసి నిండుగా హాయిగా రామారాధన చేసుకున్నారు.
ఇది ఒక యథార్థ సంఘటన. స్వయంగా ఆ కుటుంబమే చెప్పగా విన్న విషయం.
మన ధార్మిక గ్రంథం వల్ల జీవితపు విలువలు, మానవ సంబంధాల మెరుగుదల ఎంత చక్కగా పటిష్టమౌతాయో తేల్చి చూపిన వాస్తవం.

మనుషుల మధ్య మాట పట్టింపులు, లేదా ఏ చిన్న సంఘటనకో స్నేహ బాంధవ్యాలను తెంపుకొనే తెగింపు అప్పుడప్పుడు సంభవిస్తుంటాయి. కానీ వాటిని కొనసాగించుకొని దూరమవడం వాంఛనీయం కాదు.

ముఖ్యంగా తిరిగి వెనకటి ప్రేమలు లోనుండి పొంగుతున్నా పంతమో పట్టింపో దానిని వెలికి తీయనివ్వదు. దూరం దూరం మిగిలి పెరుగుతుంది.

ఆ పట్టింపు రాతి పొరను ఛేదించే శక్తి పూర్వభాషిత్వం. సాధారణంగా ఒక మనిషి మరో మనిషిని పలకరించడానికి కూడా బిగువు, అహం అడ్డువస్తాయి. ప్రధానంగా ఒకే రంగంలో ఉన్న వారి నడుమ ఉన్న ఈర్ష్యా స్పర్ధల వలన కూడా ఇటువంటి బిగింపులుంటాయి.

ఆ సందర్భంలో మనమే ముందు పలకరించడం, మాట్లాడడం వల్ల ప్రతికూల భావాలు కూడా పటాపంచలై స్నేహ బంధం దృఢపడుతుంది.

సౌమనస్య భావం సమకూర్చుకోవడమే లక్ష్యంగా జీవితం సాగితే దానికి మనసారా మాట్లాడుకోవడమే మంచి మార్గం. తానే తొలి అడుగువేసి పలకరించడం ఉత్తమ పురుషుల సంస్కారంగా మన ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి.

అందుకే రామాయణాది సద్గ్రంథాలు మన వ్యక్తిత్వాన్ని మెరుగుపెట్టి, నేటి మానవసంబంధ సమస్యలను పరిష్కరించే కరదీపికలుగా నడిపిస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.

[''బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు" రచించిన వ్యాసం.]

🍁🍁🍁🍁🍁

సేకరణ

ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు 60, 70 మరియు 80 సంవత్సరాల వయస్సు గల స్నేహితులకు తెలియజేయండి, తద్వారా వారు వారి వయస్సు గురించి గర్వపడతారు.

జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ డైరెక్టర్ ఏమంటున్నారంటే,
వృద్ధుల మెదడు సాధారణం కంటే , చాలా ప్లాస్టిక్‌గా ఉంటుందట. ఈ వయస్సులో, మెదడు కుడి-ఎడమ అర్ధగోళాల పరస్పర చర్య శ్రావ్యంగా మారుతుంది, ఇది మన సృజనాత్మక అవకాశాలను విస్తరిస్తుంది.
అందుకే 60 ఏళ్లు పైబడిన వారిలో, సృజనాత్మక కార్యకలాపాలను ప్రారంభించిన అనేక మంది వ్యక్తులను మీరు కనుగొనవచ్చు.
వాస్తవానికి, మెదడు ఇప్పుడు యువతలో ఉన్నంత వేగంగా ఉండదు. కాని, ఇది అనుకూలతలో గెలుస్తుంది. అందుకే, వయసు పెరిగే కొద్దీ మనం సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు ప్రతికూల భావోద్వేగాలకు గురికాదు. మెదడు పూర్తి శక్తితో పనిచేయడం ప్రారంభించినప్పుడు, గరిష్ట స్థాయి మానవ మేధో కార్యకలాపాలు 70 సంవత్సరాల వయస్సులో జరుగుతుంటాయట. .

కాలక్రమేణా, మెదడులోని మైలిన్ పరిమాణం పెరుగుతుంది, ఇది న్యూరాన్ల మధ్య సంకేతాలను వేగంగా వెళ్లేలా చేస్తుంది. దీని కారణంగా, సగటుతో పోలిస్తే మేధో సామర్థ్యాలు 300% పెరుగుతాయి.

మరియు ఈ పదార్ధం యొక్క అత్యున్నత క్రియాశీల ఉత్పత్తి 60-80 సంవత్సరాల వయస్సులో వస్తుంది. 60 సంవత్సరాల తర్వాత, ఒక వ్యక్తి 2 అర్ధగోళాలను ఒకే సమయంలో ఉపయోగించగలడనే వాస్తవం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలుగుతుంది.

మాంట్రియల్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మోంచి ఉరి, వృద్ధుల మెదడు తక్కువ శక్తితో కూడిన మార్గాన్ని ఎంచుకుంటుంది, అనవసరమైన వాటిని వదిలివేయడం, సమస్యను పరిష్కరించడానికి సరైన ఎంపికలను మాత్రమే తీసుకుటుందట.
వివిధ వయసుల వారు పాల్గొన్న ఒక అధ్యయనంలో ఏమి తేలిందంటే : పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేటప్పుడు యువత చాలా గందరగోళానికి గురవుతారు, అయితే 60 ఏళ్లు పైబడిన వారు సరైన నిర్ణయాలు తీసుకున్నారట.

ఇప్పుడు 60-80 సంవత్సరాల వయస్సులో మెదడు యొక్క లక్షణాలను చూద్దాం.

వృద్ధుల మెదడు లక్షణాలు.

1. చుట్టుపక్కల అందరూ అనుకుంటున్నట్లు మెదడులోని న్యూరాన్లు చనిపోవు. వ్యక్తులు మానసికమైన పనిలో నిమగ్నమవకపోతే వారి మధ్య సంబంధాలు అదృశ్యమవుతాయి.

2. విపరీతమైన సమాచారం లభించే అవకాశమున్న కారణంగా అన్యమనస్కం మరియు మతిమరుపు కనిపిస్తుంది. అందువల్ల, మీరు మీ జీవితమంతా అనవసరమైన స్వల్పమైన విషయాలపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు.

3. 60 సంవత్సరాల వయస్సులో ప్రారంభించి, ఒక వ్యక్తి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, యువకుల వలె ఒకే సమయంలో, ఒక అర్ధగోళాన్ని ఉపయోగించరు, రెండింటినీ ఉపయోగిస్తారు.
4.: ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన జీవనశైలిని, అంటే కదలికలు, శారీరక శ్రమ మరియు పూర్తి మానసిక కార్యకలాపాలు కలిగి ఉంటే, మేధో సామర్థ్యం 80-90 సంవత్సరాల వయస్సులో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి.

కాబట్టి వృద్ధాప్యానికి భయపడవద్దు. మేధోపరంగా అభివృద్ధి చెందడానికి కృషి చేయండి.
కొత్త హస్తకళలను నేర్చుకోండి,
సంగీతాన్ని అలవరచుకోండి, సంగీత వాయిద్యాలను వాయించడం నేర్చుకోండి, చిత్రాలను చిత్రించండి! నాట్యం!
జీవితంలో ఆసక్తిని పెంచుకోండి, స్నేహితులతో కలవండి మరియు వారితో నిరంతరం కార్యకలాపాలు క೧నసాగించండి ,
భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకోండి,
మీకు వీలైనంత ఉత్తమంగా ప్రయాణించండి. దుకాణాలు, కేఫ్‌లు, కచేరీలకు వెళ్లడం మర్చిపోవద్దు.
మిమ్మల్ని ఒంటరిగా లాక్ చేసుకోవద్దు - ఇది ఏ వ్యక్తికైనా విధ్వంసకరం.
మంచి ఆలోచనలతో జీవించండి:


యునైటెడ్ స్టేట్స్లో జరిగిన ఒక పెద్ద అధ్యయనం కూడా క్రింది విషయాలను కనుగొందట

▪ఒక వ్యక్తి యొక్క అత్యంత ఉత్పాదక వయస్సు 60 నుండి 70 సంవత్సరాల వరకు ఉంటుంది;
▪ 2వ అత్యంత ఉత్పాదక మానవ దశ 70 నుండి 80 సంవత్సరాల వయస్సు;
▪ 3వ అత్యంత ఉత్పాదక దశ - 50 మరియు 60 సంవత్సరాల మద్య వయస్సు;
▪ అంతకు ముందుగా , వ్యక్తి అభ్యున్నతి శిఖరానికి చేరుకోలేరు.
▪నోబెల్ బహుమతి గ్రహీతల సగటు వయస్సు 62;
▪ప్రపంచంలోని 100 అతిపెద్ద కంపెనీల అధ్యక్షుల సగటు వయస్సు 63 సంవత్సరాలు;
▪యునైటెడ్ స్టేట్స్‌లోని 100 అతిపెద్ద చర్చిలలో పాస్టర్ల సగటు వయస్సు 71;
▪తండ్రుల సగటు వయస్సు 76 సంవత్సరాలు;
▪ ఇది ఒక వ్యక్తి యొక్క ఉత్తమ మరియు అత్యంత ఉత్పాదక సంవత్సరాల వయస్సు 60 మరియు 80 సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారిస్తుంది;
▪ఈ అధ్యయనాన్ని వైద్యులు మరియు మనస్తత్వవేత్తల బృందం న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించింది;
▪60 సంవత్సరాల వయస్సులోనే భావోద్వేగ మరియు మానసిక సామర్థ్యాల గరిష్ట స్థాయికి చేరుకుంటున్నారని వారు కనుగొన్నారు మరియు ఇది మీకు 80 ఏళ్లు వచ్చే వరకు ఇది కొనసాగుతుంది;
▪ కాబట్టి, మీ వయస్సు 60, 70 లేదా 80 ఏళ్లు అయితే, మీరు మీ జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఉన్నారనే అర్ధం.

మూలం: న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్

ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు 60, 70 మరియు 80 సంవత్సరాల వయస్సు గల స్నేహితులకు తెలియజేయండి, తద్వారా వారు వారి వయస్సు గురించి గర్వపడతారు.

సీనియర్లందరికీ శుభవార్త... ఇది చాలా నిజమని నేను భావిస్తున్నాను😛
అందరం మన వృద్ధాప్య రోజులను ఆస్వాదిద్దాం!❤️❤️❤️

సేకరణ

ఒక ఉదాత్తమైన కార్యం జరిగినప్పుడు దాని వలన కలిగే ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి. అప్పుడు చైతన్యం నిరంతరంగా పెరుగుతుంది.

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథ తో

♥️ కథ-52 ♥️

చదవడానికి ముందు... నెమ్మదిగా కళ్లు మూసుకోండి... ఈ స్వేచ్ఛా వాతావరణంలో, చిరునవ్వుతో దీర్ఘంగా ఊపిరి పీల్చుకోండి... స్వేచ్ఛను అనుభూతి చెందండి... చదవడం కొనసాగించండి...

రష్యాలో వివాహం
సుధా నారాయణమూర్తి ఒక స్వీయ అనుభవాన్ని పంచుకుంటూ ఇలా రాశారు:

ఇటీవల నేను రష్యాలోని మాస్కోలో ఉన్నప్పుడు.... ఓ రోజు ఆదివారం అక్కడి పార్కుకి వెళ్లాను.
వేసవి నెల, కానీ వాతావరణం చల్లగా ఉంది, కొద్దిగా చినుకులు పడుతున్నాయి. నేను గొడుగు కింద నిలబడి ఆ ప్రాంతఅందాలను ఆస్వాదిస్తున్నప్పుడు, అకస్మాత్తుగా నా దృష్టి ఒక యువ జంట మీద పడింది.
వాళ్ళు కొత్త పెళ్లిఅయిన వారని స్పష్టంగా తెలుస్తోంది. ఆ అమ్మాయికి దాదాపు ఇరవై ఏళ్లు ఉంటాయి.
అబ్బాయి కూడా దాదాపు అదే వయసులో, చాలా అందమైన సైనిక యూనిఫాంలో ఉన్నాడు.
ఆ అమ్మాయి ముత్యాలు, అందమైన లేస్‌తో అలంకరించబడి, శోభాయమానంగా ఉన్న అందమైన తెల్లటి శాటిన్ గౌను ధరించి ఉంది. ఆమె వెనుక, ఇద్దరు తోడుపెళ్లి కూతురులు నిలబడి, పెళ్లి గౌను మురికి కాకుండా దాని అంచుని ఎత్తిపట్టుకున్నారు.
ఆ కుర్రాడు తడవకుండా తలపై గొడుగు పట్టుకున్నాడు. అమ్మాయి ఒక పూల గుత్తిని పట్టుకొని ఉంది. ఇద్దరూ చేతులు ముడుచుకుని నిలబడ్డారు.
ఆ దృశ్యం చాలా అందంగా ఉంది.
నేను వారిని చూసి చాలా ఆశ్చర్యపోయాను, పెళ్ళైన వెంటనే ఈ వర్షంలో ఇక్కడ ఈ పార్కుకు ఎందుకు వచ్చారా అని ఆశ్చర్యపోయాను. వారు కావాలనుకుంటే దీనికంటే ఇంకా ఆనందకరమైన ప్రదేశానికి వెళ్లి ఉండవచ్చు. నేను చూస్తూండగా వారిద్దరూ కలిసి పార్క్ లో ఉన్న ఒక స్మారక చిహ్నం దగ్గర ఉన్న ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తూ వెళ్లి, పుష్పగుచ్ఛాన్ని అక్కడ ఉంచి, మౌనంగా తలవంచుకుని, నెమ్మదిగా వెనక్కి వచ్చారు.
నేను ఈ దృశ్యాన్ని చాలాసేపు ఆస్వాదించాను. కానీ నాకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది.
నవ వధూవరులతో కలిసి నిలబడి ఉన్న ఓ వృద్ధుడిపై నా చూపు పడింది. ఆ పెద్దాయన కళ్ళు నా చీర మీద పడగానే, "మీరు భారతీయులా?" అని అడిగాడు.
“ అవును నేను భారతీయురాలినే”అని నమ్రతగా బదులిచ్చాను. చాలా ఆప్యాయంగా ఇద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఈలోగా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుదామని ఎదురుచూస్తూ, కుతూహలంగా, అతనికి ఇంగ్లీష్ ఎలా తెలుసు అని అడిగాను.
అతను చాలా మర్యాదపూర్వకంగా ఇలా బదులిచ్చాడు: "నేను విదేశాలలో పనిచేశాను."
దానితో, నేను, "ఈ యువ జంట తమ పెళ్లి రోజున యుద్ధ స్మారక చిహ్నం వద్దకు ఎందుకు వచ్చారో దయచేసి నాకు చెప్పగలరా?", అని అడిగాను.
"ఇది రష్యా ఆచారం, ఇక్కడ వివాహాలు తరచుగా శనివారం లేదా ఆదివారం జరుగుతాయి" అని అతను చెప్తూ, "ఇక్కడ వివాహ కార్యాలయంలో రిజిస్టర్‌పై సంతకం చేసిన తర్వాత, ప్రతి వివాహిత జంట వాతావరణంతో సంబంధం లేకుండా సమీపంలోని ప్రముఖమైన జాతీయ స్మారక చిహ్నాలను సందర్శించాలి. ఈ దేశంలోని ప్రతి అబ్బాయి కనీసం రెండేళ్లపాటు సైన్యంలో పనిచేయాలి. అతని హోదా ప్రకారం, వివాహానికి తన సర్వీస్ యూనిఫాం మాత్రమే ధరించాలి", అని వివరించాడు.
నేను చాలా ఆశ్చర్యపోయాను, "ఇక్కడ అలాంటి ఆచారం ఎందుకు ఉంది?" అని అడిగాను.
అది విని, "ఇది కృతజ్ఞతాభావం. మా పూర్వీకులు రష్యా చేసిన వివిధ యుద్ధాలలో తమ ప్రాణాలను అర్పించారు. వాటిలో కొన్ని మేం గెలిచాం, కొన్ని ఓడిపోయాం, కానీ వారు ఎల్లప్పుడూ దేశం కోసమే త్యాగం చేశారు. కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్క జంట తమ పూర్వీకుల త్యాగం వల్లే తాము శాంతియుతమైన, స్వేచ్ఛాయుత రష్యాలో జీవిస్తున్నామని గుర్తుంచుకోవాలి. అందుకే వారి ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలి."
“పెళ్లి వేడుకల కంటే దేశం పట్ల ప్రేమే ముఖ్యమని ఇక్కడి మా పెద్దల నమ్మకం.. అందుకే మాస్కో అయినా, సెయింట్ పీటర్స్‌బర్గ్ లేదా రష్యాలోని మరే ఇతర ప్రాంతంలో అయినా, పెళ్లి రోజున సమీపంలోని యుద్ధ స్మారక చిహ్నం వద్దకు వెళ్లే, ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని మేం పట్టుబడుతున్నాం."
ఆ పెద్దాయనతో మాట్లాడిన తర్వాత నా మనసులో ఒక్కటే మెదిలింది, ఇక్కడ మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం?
మన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజున మన అమరవీరులను స్మరించుకునే రివాజు మనకు ఉందా?
మన దేశంలో వివాహాల సమయంలో, చీరల కోసం షాపింగ్ చేయడం, ఆభరణాలను కొనుగోలు చేయడం, విస్తృతమైన వంటకాలను సిద్ధం చేయడం, డిస్కోలలో పార్టీలు చేసుకోవడం మొదలైన వాటితో తీరిక లేకుండా గడుపుతాం.
బహుశా మనం దాని గురించి ఎప్పుడూ ఆలోచించమేమో.
ఈ సంఘటన నా కళ్ళను నీళ్లతో నింపింది. ఈ గొప్ప ఆలోచన, ఆచారం గురించి మనం కూడా రష్యన్‌ల వద్ద నుండి నేర్చుకోవాలని నేను కోరుకున్నాను.
మన దేశం కోసం, మన ఈ రోజు కోసం, మన రేపటి కోసం - ప్రాణత్యాగం చేసిన అమరవీరులను మనం కూడా గౌరవించవచ్చు,...!

♾️

ఒక ఉదాత్తమైన కార్యం జరిగినప్పుడు దాని వలన కలిగే ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి. అప్పుడు చైతన్యం నిరంతరంగా పెరుగుతుంది. 🌼
దాజీ


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

అనువాదబృందం ఆంధ్రప్రదేశ్

సేకరణ

మనం పుణ్యకార్యాలు ఎందుకు చేయాలి??

🌹మనం పుణ్యకార్యాలు ఎందుకు చేయాలి??

ఒక వ్యక్తి జీవించి ఉన్నంత వరకు బంధాలు బాధలు ఉంటాయి...
ఎలా అంటే ఒక దీపం వెలిగేటప్పుడు దానికి చమురు (నెయ్యి లేదా నూనె) కావాలి,
ఎక్కువ గాలి ఉండకూడదు, అలా అని అస్సలు గాలి లేకుండా కూడా ఉండకూడదు.. ప్రతిదీ దానికి ప్రాణ సంకటమే ...
అదే ఇక సారి దీపం ఆరిపోతే ఇక దానికి గాలితో కానీ చమురుతో కానీ దేనితో పని లేదు..
అక్కడితో దాని కధ ముగిసింది అని అర్థం ...

అలాగే ఒక వ్యకి జీవించి ఉన్నంత వరకు ప్రతిదీ కావాలి , ప్రతీది అవసరమే ...
ఒక సారి జీవం పోగానే ఈ ప్రాపంచిక విషయాలు బంధాలు అవసరం లేదు,

వారు చేసిన పుణ్యం తప్ప ఏది కూడా ఉండదు,
ఎవరు వెంట కూడా వెళ్ళలేరు,
అక్కడితో ఆ వ్యక్తి కధ ముగిసినట్టే,...

దీనిని పట్టి మనకు అర్థం ఏమవుతుందంటే ... ఈరోజు మనం పెంచుకున్న బంధాలు, ప్రేమలు, కోపాలు , తాపాలు, అన్ని అశాశ్వతమైనవే, కేవలం మనము చేసిన సేవనే మన వెంట వస్తుంది అని అర్థమవుతుంది, కాబట్టి నిత్యం మనం , పుణ్యకార్యాలు చేయాలి అని పురాణ వచనం🙏

మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతే కొలమానం !!

అవగాహనే మనసుకు మంచి మందు. అవగాహన అంటే మనసుకు విషయం సంపూర్ణంగా, సమగ్రంగా, సమూలంగా అర్ధంకావడం. మనకు బాల్యం నుండి మనసును పోల్చుకోవడం, పోటీపడటం అలవాటుగా మారింది. అదే అలవాటుతో దేవుడు, సాధన, ముక్తి వంటి ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనసు పోల్చుకోవడం, పోటీ పడటం చేస్తోంది. నిజానికి మన జీవనం సాఫీగా సాగటానికి ఎవరితోనూ పోటీ పడక్కర్లేదు. మనతో మనం సక్రమంగా ఉంటే సరిపోతుంది. మన గుణాలను దాటటానికి, ప్రవృతిని మార్చుకోవడానికి అనుదినం మనతో మనమే పోటీపడాలి. మనలో వచ్చే మార్పే శాంతికి సోపానం. మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతే కొలమానం. దీన్ని ఎవరినీ అడిగి తెలుసుకోవాల్సిన పనిలేదు. మనం నిత్యజీవితంలో ఎంత శాంతిగా ఉంటున్నాం, ఎన్ని విషయాల్లో శాంతిగా ఉంటున్నామనేది ఎవరిది వారికే తెలిసే విషయం !
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
---------------------------------------

నచికేతుడు
>÷<>÷<>÷<>÷<
🦜

మనిషికి విద్య అవసరం.
నేర్చుకొన్న విద్య నిర్వీర్యమవకుండా వుండాలంటే, ఆ విద్యలను ఇతరులకు నేర్పాలి.
అప్పుడే ఆ విద్యలకు శాశ్వతత్త్వం
కలుగుతుంది.
విద్యార్జన అనంతం. జ్ఞానసముపార్జన మహాసాగరం. ఎంత లోతుకు తరచి చూస్తే అంత విజ్ఞానం కలుగుతుంది.

ఇంటి లోని పిల్లలను ఐదు సంవత్సరాలదాకా మహారాజుల్లా
పెంచాలి.
తరువాత15 సంవత్సరాలదాకా , పనివారిలాగ చూడాలి. అన్ని పనులూ స్వంతంగా చేసుకునే నైపుణ్యం నేర్పాలి.
16 సంవత్సరాల నుండి ఆ యువకుడిని ఒక మంచి స్నేహితునిగా చూడాలని మన
శాస్త్రములు వివరిస్తున్నాయి.
పాఠశాలకు వెళ్ళడానికి ముందుగానే ఆపిల్లవాని బుధ్ధి వికాసానికి తండ్రి తోడ్పడుతున్నాడు.
తరువాత 15 సంవత్సరాల
దాకా పాఠశాలకు వెళ్ళి
విద్యని ఆర్జించాలి.
ఆ తరువాత ఆ పిల్లలు తమకు కావలసిన
విద్యలన్నీ నేర్చుకుంటారు.
అప్పటినుండి వారు తండ్రికి మిత్రులవుతారు.

పాఠశాలకు వెళ్ళే వయసు పెద్దలు చెప్పినట్లుగా విని ఆచరించవలసిన కాలం. ఆ సమయంలో వారిని
పనివారిగా చూడాలని శాస్త్రం చెప్తోంది.
ఈ పది సంవత్సరాలలో
వారు నేర్చుకొన్న విద్యే
వారికి భుక్తిని , సంఘంలో
విలువను పెంచుతుంది.

దానికి ఉదాహరణ గా నచికేతుని కధ తెలుసుకుందాము.

నచికేతుడు గురుకులవాసం
చేసి , సకల విద్యలనభ్యసించి గొప్ప పాండిత్యం సంపాదించి
ఇంటికి తిరిగి వచ్చాడు.
నచికేతుడు ఇంటికి వచ్చిన
సమయంలో అతని తండ్రి
వాజశ్రవసు మహర్షి
ఒక యాగం తలపెట్టి ,
యాగ ద్రవ్యాలను సమకూర్చుకోసాగాడు .
నచికేతుడు అన్నీ విద్యలు అభ్యసించి వచ్చినందున ,తన తండ్రిని ఒక ప్రశ్న అడిగాడు.
"మీరు యాగం చేస్తున్నారు కదా ..
గోదానం చేయాలంటే ఒక దూడను ఈనిన తరువాత మరల చూలుతో వున్న
గోవును మాత్రమే దానమివ్వాలి . అంతేకాని మనకు పనికిరాని
వట్టి పోయిన గోవుని దానమివ్వరాదు " అంటూ మొదలు పెట్టి, తనకు తెలిసిన విషయ పరిజ్ఞానం అంతా తండ్రి ముందు ప్రదర్శించాడు.
తిరిగి మాట్లాడడం మొదలు పెట్టి, " నిజానికి యీ యాగ సమయంలో మీరు ఇక్కడ వున్నవన్నీ దానంగా యిచ్చి వేయాలి , ఏది సొంతానికి
వుంచుకో కూడదు. అటువంటప్పుడు, నన్ను
ఎవరికి దానమిస్తారు ?
అని అతి తెలివితేటలతో అడిగాడు.

యాగం ఏర్పాట్లలో నిమగ్నమైన
అతని తండ్రి
నచికేతుని ప్రశ్నలకి సమాధానాలు విడమరచి చెప్పలేక , ఒకే మాటలో " నిన్ను ఆ యమునికి దానం యిచ్చెస్తాను",
అని అన్నాడు.
నిజానికి ఆయనికి ఆ మాటనడంలో ఎటువంటి ఉద్దేశ్యమూ లేదు. కొడుకు మాటలకు విసుగుచెంది
ఆ మాట అనేశాడు.
కోపంలో వచ్చిన మాట అని తెలిసినా, తండ్రి మాట నెరవేర్చడానికి , యముడు
వున్న చోటు వెతుకుతూ వెళ్ళాడు నచికేతుడు.
నచీకేతుడు అక్కడికి వెళ్ళేటప్పడికి యముడు అక్కడ లేడు. అక్కడే
ఆహారం లేకుండా మూడు రోజులు గడిపాడు నచికేతుడు. నాలుగవరోజున
వచ్చిన యమునికి తను వచ్చిన విషయం తెలిపాడు
నచికేతుడు.

"మూడు రోజులుగా ఆహారం
లేకుండా అతిధిగా వుంచి, వుపచరించక పోవడం
నాదే తప్పు. దానికి పరిహారంగా ,నీకు వరాలిస్తాను కోరుకోమని " అని మాట
🙏🙏🙏🙏🙏

సేకరణ

కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి? ఫలమేమిటి?

 *కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి? ఫలమేమిటి?*


సమాధానం;- ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి, ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి.


చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో ఉండిపోవలసిందేనా? 


లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు. 


అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు


అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది.


మొదటిది కర్తృత్వ త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము.


రెండోది ఫలత్యాగం. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే. అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.


మూడోది సంగత్యాగం. ఇది నాది, ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. 


*ఈ త్రివిధ త్యాగాలు ఎలా చెయ్యాలి?*


*ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెప్పు, చాలు.*


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*


*పై త్రివిధ త్యాగాలను త్రికరణశుద్ధిగా అవలంబించాలి*


*కృష్ణార్పణం*

వెనక‘బడి’పోయారు.. ఎదురుతిరుగుతున్నారు!* *♦️బడి పిల్లల ప్రవర్తనలో తీవ్ర మార్పులు* *♦️నిర్లక్ష్యం పెరిగింది... క్రమశిక్షణ లోపించింది* *♦️కొత్త అలవాట్లూ నేర్చుకున్నారు*

 *🟥వెనక‘బడి’పోయారు.. ఎదురుతిరుగుతున్నారు!*


*♦️బడి పిల్లల ప్రవర్తనలో తీవ్ర మార్పులు*


*♦️నిర్లక్ష్యం పెరిగింది... క్రమశిక్షణ  లోపించింది*


*♦️కొత్త అలవాట్లూ నేర్చుకున్నారు*


*మూడు నెలల కాలంలో గుర్తించిన ఉపాధ్యాయులు*


*♦️వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు*


* ఓ పిల్లాడు బడిలోనే గుట్కా తింటున్నట్టు కరీంనగర్‌ జిల్లాలోని ఉపాధ్యాయుడు గుర్తించి ప్రశ్నించారు. ‘‘బడికి రాకూడదనే అనుకున్నాను  సర్‌. పరీక్షలు కదా! నాలుగు రోజులు  వచ్చిపోతా’’ అనే జవాబు అవతలవైపు నుంచి రావడంతో ఆయన  అవాక్కయ్యారు.


* ‘‘హోంవర్క్‌ చేయకుండా బడికెందుకొచ్చావు. ఇంటికిపో’ అని గద్దించిన ఉపాధ్యాయుడికి ఓ పాఠశాల  విద్యార్థి షాక్‌ ఇచ్చాడు. మారు మాట్లాడకుంటే ఇంటికి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. చివరికి ఆయనే బతిమాలి బడిలో కూర్చోబెట్టాల్సి వచ్చింది.



* నిజామాబాద్‌లోని ఓ వైద్య   కళాశాల ప్రిన్సిపల్‌ నుంచి విద్యార్థి తండ్రికి  ఫోన్‌ వచ్చింది. ‘మీ అబ్బాయి రోజూ ఆలస్యంగా వస్తున్నాడు. అడిగితే గుర్రుగా చూస్తున్నాడు. మీరు మార్చుకుంటారా? నన్నే మార్చమంటారా?’’ అనడంతో ఆయన అవాక్కయ్యాడు.


* ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ   ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయులు బోర్డుపై రాస్తుండగా మొబైల్‌ ఫోన్లతో ఫొటోలు తీస్తూ పలుమార్లు విద్యార్థులు దొరికారు. తోటి అమ్మాయిల ఫొటోలు కూడా తీస్తున్నట్టు అక్కడి గురువులు గుర్తించారు.


ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కారణంగా బడులు మూతపడటం, తర్వాత ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగడంతో దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు విద్యార్థులు బడులకు దూరమయ్యారు. ఈ కాలంలో చాలామంది చదువులను అటకెక్కించేశారు. పొలం పనులు సహా ఇతర కూలీ పనులకు వెళ్లడం అలవర్చుకున్నారు.  కరోనా రెండో ఉద్ధృతి తర్వాత సెప్టెంబరు 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష తరగతులు మొదలై పిల్లలు మళ్లీ బడిబాట పట్టినప్పటికీ దీర్ఘకాలం బడికి దూరమైన నేపథ్యంలో వారి ప్రవర్తనలో మార్పులు వచ్చినట్టు ఉపాధ్యాయులు గుర్తించారు. మూడు నెలలుగా విద్యార్థులను గమనిస్తున్న ఉపాధ్యాయులు.. కొందరి వైఖరిలో తీవ్ర మార్పులను గమనించి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తున్నారు. ‘‘ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఏమైనా అంటే ఎదురు ప్రశ్నిస్తున్నారు. మాపైనే జోకులు పేలుస్తున్నారు. అందరూ అలాగే ఉన్నారని చెప్పలేంగానీ కనీసం 25 శాతం మంది వైఖరిలో పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా బాలురలో క్రమశిక్షణ లోపించింది. నిర్లక్ష్య ధోరణి, మొండితనం పెరిగిందని’’ పలువురు ఉపాధ్యాయులు ఉన్నతాధికారుల సమావేశాల్లో చెబుతున్నారు. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే కాదు. ప్రైవేటు పాఠశాలలు, ఇంజినీరింగ్‌ సహా వృత్తి విద్య కళాశాల విద్యార్థుల్లోనూ ఇలాంటి వ్యవహార శైలే గుర్తించినట్లు అధ్యాపకులు చెబుతున్నారు.


*మూడో వేవ్‌ వస్తుంది.. పాసైపోతాంలే*


చాలా మందిలో చదువుపై గతంలో ఉన్నంత ఆసక్తి కనిపించడంలేదనే భావనను ఎక్కువ మంది వ్యక్తపరుస్తున్నారు. ‘బాగా గుర్తుండేలా చేసే క్రతువులో భాగంగా చదివింది రాసుకుని వచ్చే విధానాన్ని గత కొన్నేళ్లుగా అమలుచేసి సత్ఫలితాలు సాధించా. ఇప్పుడు రెండు మూడు ప్రశ్నలకు కూడా జవాబులు రాయకుండా వచ్చేవాళ్లు అధికంగా ఉంటున్నారు’ అని మంచిర్యాల జిల్లాకు చెందిన గణితం ఉపాధ్యాయుడు ఒకరు చెప్పారు. ‘‘పదో తరగతి కదా. పరీక్షలు దగ్గరికొస్తున్నాయి. కష్టపడాలి’ అని చెబితే ‘‘కరోనా మూడో వేవ్‌ వస్తుంది. పాసైపోతాంలే’ అని సమాధానం కొందరి నుంచి వస్తోందని మరో ఉపాధ్యాయుడు వాపోయారు.


*మొబైల్‌తో నాలుగు గంటలు*



పిల్లల వ్యవహార శైలి బాగా మారిపోయింది. హోంవర్క్‌ చేయడం లేదు. ఎందుకిలా జరుగుతుందో తెలుసుకునే క్రమంలో ఒక్కో విద్యార్థిని పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించాం. ‘ఇంటికి వెళ్లిన తర్వాత కనీసం నాలుగు గంటలపాటు మొబైల్‌తో గడుపుతున్నట్టు తెలుసుకున్నాం’ అని ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుడు తెలిపారు.


ప్రధానంగా విద్యార్థుల్లో గుర్తిస్తున్న మార్పులివీ


* క్రమశిక్షణ లోపించింది. తల్లిదండ్రుల కోసం బడికొస్తున్నామనే భావన కన్పిస్తోంది. మందలించినా తేలిగ్గా తీసుకుంటున్నారు.


* ‘నాకు చదువు రాదు సార్‌’ అనే వాళ్లు ఎక్కువయ్యారు. చదవాలనే జిజ్ఞాస తగ్గింది.


* వేషధారణలో బాగా మార్పు వచ్చింది. ముఖ్యంగా చాలామంది తలకట్టు (హెయిర్‌ స్టైల్‌) మార్చారు.


* అమ్మాయిలపై జోకులు, వ్యాఖ్యలు(కామెంట్లు) చేయడం అధికమైంది. ఫొటోలు తీయడం వంటివీ  చేస్తున్నారు.


* వ్యసనాలకు బానిసలయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తమకన్నా పెద్ద వయసు వాళ్లతో కలిసి తిరగడం, పనులకు వెళ్లడం వంటి కారణాలతో కొత్త అలవాట్లు అధికమయ్యాయి.


*మాట్లాడుకోవడానికి సమయం ఇవ్వాలి*


ఆన్‌లైన్‌ పాఠాలతో ఫోన్లు చేతుల్లోకి వచ్చాయి. చిన్న పిల్లలు వీడియో గేమ్‌లు, పెద్దవాళ్లు వాట్సప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాలకు అలవాటుపడ్డారు. ఉన్నట్టుండి వాటికి దూరమైనప్పుడు సహజంగానే తిరుగుబాటు వస్తుంది. తోటి పిల్లలతో మాట్లాడుకునేందుకు ఒక పీరియడ్‌ను కేటాయించే విధానాన్ని ఈ విద్యా సంవత్సరం వరకైనా అమలుచేయాలి. దానివల్ల ఏడాదిన్నరగా ఒంటరిగా ఉంటూ కోల్పోయిన జీవితాన్ని కొంత వరకు భర్తీ చేసుకునే అవకాశం వారికి వస్తుంది. ఉపాధ్యాయులు కూడా పిల్లలను గమనిస్తూ స్నేహపూర్వకంగా మెలుగుతూ సమస్యలు తెలుసుకుంటూ వారిలో మార్పుతెచ్చే ప్రయత్నం చేయాలి.


*- వాసిరెడ్డి అమర్‌నాథ్‌, విద్యావేత్త*


*సెలబ్రేషన్‌ సంస్కృతి పెరిగింది*


ప్రతి సందర్భాన్నీ ఉత్సవంగా జరుపుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం, సినిమాలపై ముచ్చట్లు, దుస్తులు, హెయిర్‌ స్టైల్‌లో సినీనటులను అనుకరించడం లాంటి సంస్కృతి పెద్దవాళ్లతోపాటు పాఠశాల పిల్లల్లోనూ చూస్తున్నాం. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని కుటుంబాల్లోని పిల్లల్లో ఇది ఎక్కువగా ఉంది. గతంలో బడి వదిలిపెడితే ఇంటికి వెళ్లేవారు. ఇప్పుడు బజార్లలో కాలక్షేపం చేసిన తర్వాతే వెళుతున్నట్లు గమనించాం.  


*- బెండి ఆషారాణి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత*


*అందరిలో ఉన్నప్పుడు మందలించొద్దు*



ఆన్‌లైన్‌ పాఠాలు వింటూ ఫోన్లకు అలవాటుపడ్డారు. పాఠాలు వింటున్నారనే భావనతో తల్లిదండ్రులు వారితో మాట్లాడటం మానేశారు. దాంతో పిల్లలు తమ భావాలను వ్యక్తపరచడానికి, గతంలో మాదిరిగా స్నేహితులతో మాట్లాడటానికి వీల్లేకుండా పోయింది. ప్రస్తుత విపరీతాలకు అదే ప్రధాన కారణం. ఇప్పుడు తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు వారితో స్వేచ్ఛగా మాట్లాడించాలి. వారి భావాలను వినాలి. ఆలోచనలను తెలుసుకోవాలి. తప్పుచేసినా అహం దెబ్బతినేలా అందరిముందు మందలిస్తే మొండిగా తయారవుతారు. కనుసైగలతోనే చేసే తప్పులను గమనిస్తున్నామనే సంకేతాలను వారికి పంపగలగాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆప్యాయంగా మాట్లాడితే చేసిన తప్పులను తెలుసుకుని దిద్దుకునే ప్రయత్నం చేస్తారు.


*- పి.జవహర్‌లాల్‌ నెహ్రూ, సైకాలజిస్టు*

కృష్ణునికి తగ్గ కొడుకు - ప్రద్యుమ్నుడు!

 👉 తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి

https://t.me/teluguvelugu01


*కృష్ణునికి తగ్గ కొడుకు - ప్రద్యుమ్నుడు!*

 

కృష్ణభగవానుడి గొప్పతనం గురించి చెప్పుకొనేదేముంది. బాల్యంలో అల్లరి చేసిన యశోదాకృష్ణుని మొదలుకొని... జీవితసారాన్ని తేల్చిచెప్పిన గీతాకృష్ణుని వరకూ ఆయనలోని ప్రతి అడుగూ హిందువులకు పూజనీయమే! కృష్ణుని అన్ని పాత్రలలోనూ చూసిన మనకి తండ్రిగా ఆయన గురించి తెలిసింది తక్కువే! కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుని గురించి తెలుసుకుంటే... ఆ లోటూ తీరిపోతుంది.

*మన్మథుని పునర్జన్మ*


కృష్ణునికి చాలామంది కుమారులే ఉన్నారు. కానీ వారిలో ప్రద్యుమ్నుడు ముఖ్యుడు. ఒకనాడు శివుని తపస్సుని భంగం చేయబోయి ఆయన కోపానికి భస్మమైన మన్మథుని కథ తెలిసిందే! లోకకళ్యాణం కోసం ప్రయత్నించి భస్మమైపోయిన తన భర్తని చూసి రతీదేవి గుండె పగిలిపోయింది. తన భర్తని ఎలాగైనా తిరిగి జీవింపచేయమంటూ పరమేశ్వరుని వేడుకుంది. అప్పటికే కోపం చల్లారిన ఈశ్వరుడు, ఆమె భర్త శ్రీకృష్ణుని ఇంట పుడతాడంటూ వరమిస్తారు. అలా శ్రీకృష్ణునికీ, రుక్మిణికీ ప్రద్యుమ్నుని రూపంలో జన్మిస్తాడు మన్మథుడు.

 

*శంభరాసురుని వధ*

 

ప్రద్యుమ్నుడు భూలోకంలో జన్మించే సమయంలో శంభరాసురుడు అనే రాక్షసుడు ప్రజలను పీడించసాగాడు. ఆయనకు ప్రద్యుమ్నుని చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ చావు లేదన్న వరం ఒకటి ఉంది. దాంతో చిన్నప్పుడే ప్రద్యుమ్నుని వధించి తనకి శత్రుశేషం లేకుండా చూసుకోవాలనుకున్నాడు శంభరాసురుడు. పొత్తిళ్లలో ఉండగానే ప్రద్యుమ్నుని ఎత్తుకుపోయి సముద్రంలో పడేస్తాడు.


సముద్రంలో పడిన ప్రద్యుమ్నుని ఒక చేప మింగుతుంది. విధివశాత్తూ ఆ చేప శంభరాసురుని రాజ్యంలోని జాలర్లకే చిక్కుతుంది. ఆ భారీ చేపను చూసిన జాలర్లు దానిని శంభరాసురునికి బహుమతిగా అందిస్తారు. ఆయన వంటవారు దానిని కోసిచూస్తే ఏముంది! చేప పొట్టలో అందమైన బాలుడు కనిపిస్తాడు. రాజాస్థానంలోని ఒక యువతి ఆ బాలుని పెంచి పెద్దచేస్తుంది. ఎలా పెరిగినా, ఎక్కడ పెరిగినా ప్రద్యుమ్నుడు యోధునిలాగే ఎదిగాడు. ఒకనాడు శంభరాసురుని రాజ్యానికి వచ్చిన నారదుని ద్వారా తన అసలు తండ్రి ఎవరన్న విషయాన్ని తెలుసుకుంటాడు ప్రద్యుమ్నుడు. తనని చంపతలపెట్టిన శంభరాసురుని మీద పగతీర్చుకునేందుకు బయల్దేరాడు. శంభరాసురునికీ, ప్రద్యుమ్నుడికీ మధ్య జరిగిన భీకర పోరులో ఆ లోకకంటకుడు మరణించాడు.


*ద్వారకకు చేరి*


శంభరాసురుని వధ తర్వాత ప్రద్యుమ్నుడు తన తండ్రిని వెతుక్కుంటూ ద్వారకకు చేరుకున్నాడు. రాజ్యంలోకి అడుగుపెట్టగానే కృష్ణుని పోలిన ఆ యువకుడిని చూసి జనమంతా గుమికూడారు. ఆపై అతను చెప్పిన వివరాలు తెలుసుకున్న రుక్మిణీదేవి... తన పొత్తిళ్లలోంచి కనపడకుండా పోయిన బిడ్డ అతనే అని తెలుసుకుంది. మొత్తానికి ప్రద్యుమ్నుని రాకతో కథ కొంతవరకూ సుఖాంతమయ్యింది. అసలే గొప్ప వీరుడైన ప్రద్యుమ్నుడు, శ్రీకృష్ణుని తర్ఫీదులో మరింత రాటుదేలాడు. తండ్రికి తగ్గ తనయుడన్న పేరు తెచ్చుకొన్నాడు.


*నికుంభుని వధ*


తండ్రికి తోడుగా ప్రద్యుమ్నుడు, కొడుకుని గమనించుకుంటూ కృష్ణుడు ఉండేవారు. అలా వారిద్దరూ కలిసి ఒక రాక్షసునే ఎదుర్కొన్న సందర్భం కూడా ఉంది. నికుంభుడనే రాక్షసుడు పరమశివభక్తుడు. దేవుని చేతిలో కానీ, దేవతల చేతిలో కానీ, దానవుల చేతిలో కానీ తనకు చావు ఉండకూడదనే వరాన్ని పొందినవాడు. మానవులు తననేమీ చేయలేరన్న అహంతో వారి నుంచి చావు రాకూడదన్న వరాన్ని మాత్రం కోరుకోలేదు నికుంభుడు. అదే అతని పాలిట శాపంగా మారింది. మానవ జన్మనెత్తిన శ్రీకృష్ణుని చేతిలో అతని చావు మూడింది. భానుమతి అనే యాదవ రాకుమార్తెని ఎత్తుకుపోయే ప్రయత్నంలో నికుంభుడు కృష్ణుని ఎదుర్కొంటాడు. ఒకవైపు కృష్ణుడు, మరోవైపు ప్రద్యుమ్నుడు ఆ రాక్షసుని ఎదిరించి అతన్ని తుదుముట్టిస్తారు.


*తండ్రిని నొప్పించకుండా*


కురుక్షేత్ర సంగ్రామంలో యాదవులంతా కౌరవులవైపు, కృష్ణుడు మాత్రం పాండవుల పక్షాన నిలిచిన విషయం తెలసిందే! కానీ ప్రద్యుమ్నుడు మాత్రం తండ్రికి వ్యతిరేకమైన పక్షంలో ఉండేందుకు ఇష్టపడలేదు. కురుక్షేత్ర సంగ్రామానికి దూరంగానే ఉన్నాడు. ప్రద్యుమ్నుని శ్రీకృష్ణుని అంశగా భావిస్తారు. పైగా వైష్ణవాస్త్రం అనే అద్భుతమైన అస్త్రం కలిగినవాడు. అలాంటి ప్రద్యుమ్నుడు కురుక్షేత్ర సంగ్రామంలో ఉంటే పోరు ఇంకెంత రసరవత్తంగా ఉండేదో!


ప్రద్యుమ్నుడు తన మేనమామ కూతురైన రుక్మావతిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ పుట్టిన అనిరుద్ధుడు కూడా అసమాన్యునిగా పేరుగాంచాడు. ఇంతలో యాదవులంతా కొట్టుకుని చస్తారనే మునుల శాపం నిజమైంది. ఆ కొట్లాను ఆపే ప్రయత్నంలో ప్రద్యుమ్నుడు కూడా మరణిస్తాడు. చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతూ సాగిన అతని కథ అలా అంతమవుతుంది. కానీ తండ్రికి తగ్గ తనయుడన్న పేరు మాత్రం నిలిచిపోయింది.

అమ్మ ఒడి

 👉 తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి

https://t.me/teluguvelugu01


అమ్మ ఒడి


 అమ్మలో సృష్టికారకత్వమైన బ్రహ్మతత్త్వమే కాదు, స్థితి కారకత్త్వమైన విష్ణుతత్త్వం కూడా ఉంటుంది.


 రక్షకత్వం అమ్మ నర-నరానా జీర్ణించుకుని ఉంటుంది. ఇది చంటితనంలో పాలివ్వడంలోనే కాదు, బిడ్డకు ఎన్నేళ్ళ వయసొచ్చినా, పుట్టిన కొడుకు కృతఘ్నుడే అయినా వాడు నూరేళ్ళు బతకాలని అమ్మ కోరుకుంటుంది.


 నోములు, వ్రతాలు, పూజలు, ప్రార్థనలు అన్నీ బిడ్డ క్షేమం కోరే చేస్తుంది. ఆమెకు ఎంత వయసొచ్చినా ఇది అమ్మ లక్షణం.. అమ్మ స్థితికారకత్వం.


శరీరం విడిచిపెట్టిన తరువాత అంత్యేష్ఠి సంస్కారం మంత్రవైభవంతో చెప్తారు. జీవుడు శరీరాన్ని వదలి వెళ్ళే దశల్లో చివరన వ్యానవాయువనేది జీవుడిని, శరీరాన్ని పట్టుకుని ఉంటుంది. అలా పట్టుకుని ఉన్నప్పుడు – కన్నబిడ్డలనే కాదు, జ్ఞాతులందరినీ అపేక్షిస్తుంది. అందుకే జ్ఞాతులు 11 రోజులు మైలపడతారు. వారి సంక్షేమంకోసం కొడుకు 11వ రోజున శ్మశానంలోనే ఆనంద హోమం చేస్తాడు. 


 ఆ సమయంలో కొడుకు వెళ్ళి శవరూపంలో ఉన్న అమ్మతో ఒకమాట చెప్తాడు. 


 ‘‘పిచ్చితల్లీ ! శరీరం జర్జరీభూతమయిపోయింది. ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటావు మా మీద వ్యామోహం! అమ్మా! మేం సంతోషంగా ఉన్నాం. వదిలిపెట్టేయ్‌ శరీరాన్ని. వెళ్ళిపో. పోయి మంచి శరీరాన్ని పొంది రా. మళ్ళీ లోకంలో పుణ్యకర్మలు చేసుకో. వదిలిపెట్టెయ్‌’’ అని కొడుకు చెప్పిన మంత్రానికి వదిలేస్తుంది శరీరాన్ని. అప్పటివరకు వదలదు.


 శిథిలమయిపోయిన భవనం మీద తన యాజమాన్య హక్కు పెట్టుకున్నట్లు జీవుడు (తండ్రికానీ, తల్లికానీ) శరీరాన్ని పట్టుకుని ఉంటాడు. కొడుకు చెప్పిన మంత్రంతో వదిలేస్తాడు. అదీ వాళ్ళిద్దరి అనుబంధం.


 అమ్మ కడుపులో నుంచి బయటికి రావడంతో నాభీబంధం (బొడ్డు) తెగిపోవచ్చు. కానీ హృదయ సంబంధం మాత్రం తెగదు. కొడుకు ధార్మికుడైతే ఆ హృదయ సంబంధం ఉన్నందుకు ఎక్కడ ఉన్న పితృదేవతలనైనా ఉద్ధరించగలడు. 


 ఇక్కడ గయా శ్రాద్ధం పెట్టి ఎవరినైనా ఉద్ధరించగలడు. అటువంటి కొడుకు పుట్టాలని తల్లిదండ్రులు కోరుకుంటారు.


  కాబట్టి అమ్మ అంటే రక్షకత్వం. శిశువు జన్మించిన నాటినుండి నాలుగు లేదా ఆరు నెలల వరకూ శిశువు శరీరానికి కావలసిన సమస్త పోషకవిలువలున్న పాలు పరమ పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తయరయ్యేది ఒక్క అమ్మలోనే – అని డాక్టర్లు చెబుతుంటారు.


నేను చెబుతున్నది సనాతన ధర్మశాస్త్రాలలోది కాదు, సనాతనం కేవలం ‘మాతృదేవోభవ’ అన్నది. పుస్తకాల్లో డాక్టర్లు రాసిన మాట మీతో మనవి చేసుకుంటున్నా. అమ్మ అన్నం తిన్నందుకు అమ్మలో పాలు ఊరవు. బిడ్డ చప్పరిస్తే వాడి ఆకలి తీరలేదన్న భావనచేత ఊరతాయట. వాడి కడుపు నిండుతుంటే అమ్మకు ఆరోగ్యం కలుగుతుందని రాశారు. అంత గొప్ప స్వరూపం అమ్మలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టే అమ్మ విష్ణువు.


 అమ్మను మించిన రక్షకుడు లోకంలో ఉండరు. అందువల్ల ‘‘మా అమ్మగారా... *నా వద్దే ఉంటున్నారండీ’’* అనకు. అది చాలా తప్పు మాట. *‘‘నా అదృష్టమండీ, నాకిన్నేళ్ళు వచ్చినా అమ్మ చేతి అన్నం తింటున్నాను’’* అని అనాలి. అంతే తప్ప *‘అమ్మకు నేను అన్నం పెడుతున్నాననడం కృతఘ్నత.*


సృష్టికారకుడైన బ్రహ్మ, స్థితికారకుడైన విష్ణువులే కాదు, లయ కారకుడైన రుద్రుడి అంశ కూడా అమ్మలో ఉంది. ఆమెలో ఉన్నది శివశక్తి.


 చాలా మంది రుద్రుడు అనగానే ఆయన చంపేస్తాడనుకుంటారు. అలా అర్థం చేసుకోకూడదు. అలా అయితే శివార్చనలు ఎందుకుంటాయి లోకంలో? అలా ఉండదు.


 లయ కారకుడైన రుద్రుడు మూడు రకాలైన ప్రళయాలు చేస్తాడు. ఒకటి – నిత్య ప్రళయం. రోజూ చేసేది నిత్య ప్రళయం. మనకు పరమేశ్వరుడు జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఇచ్చాడు. వీటిని విచ్చలవిడిగా వాడేసారనుకోండి. అవి అలసిపోతాయి. వాటికి మళ్ళీ శక్తి కావాలి. మనం పడుకున్నప్పుడు రుద్రుడు మనకు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి, మనం ఆ సుఖం అనుభవిస్తుండగా ఇంద్రియాలన్నింటికీ పటుత్వమిస్తాడు. అంటే అవి కోల్పోయిన శక్తిని మళ్ళీ ఇస్తాడు. దీనిని నిత్య ప్రళయమంటారు. 


 రెండవది – ఆత్యంతిక ప్రళయం, అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిస్తాడు.


 మూడవది – మహా ప్రళయం. అంటే జీవుడు తనను పొందలేకపోతే యుగాంతంలో తానే జీవుడిని పొందేస్తాడు. మైనపు ముద్ద నల్లపూసల మీద పడ్డట్లు తనని పొందలేకపోయిన జీవులను మహా ప్రళయంతో పరమాత్మ తానే పొందేస్తాడు. ఇవి మూడూ చేస్తాడు. అందుకే ఆయన శివుడయ్యాడు.


 అమ్మలో శివాంశ ఉంటుంది. ఎలా అంటే... అమ్మ చేసే చాలా గొప్ప పని నిద్రపుచ్చడం. అమ్మదగ్గర పిల్లలు పడుకున్నంత తేలిగ్గా మరెక్కడా పడుకోరు. పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నా, అమ్మ ఒక్కసారెత్తుకుని ఇలా జోకొడితే చాలు... అమ్మ స్పర్శతగలగానే... నిద్రలోకి జారుకుంటారు. అమ్మ నోటిమాటవింటే చాలు.. నిద్రపోతారు. అమ్మ నిద్రాకాలిక సుఖాన్నిస్తుంది. 


అమ్మ ఒడిలో నిద్రపోవాలన్న కోరికకు కృష్ణ పరమాత్మ అంతటివాడు పరవశించిపోయాడు. 


 అమ్మంటే తెలియని పరమాత్మ... అమ్మ ఒడిచేరేటప్పటికి నిద్రపోయాడు. ఇక మనమెంతటి వాళ్ళం!


 అమ్మ ఒడికి సమానమైనది లేదు. అది శివపర్యంకం. అమ్మ శివస్వరూపమై ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతుంది. నిత్య ప్రళయం చేస్తుంది. ఇది అమ్మలోని రుద్రాంశ.

మానవ_జన్మ

 #మానవ_జన్మ.


ఈ ప్రపంచలోకి వచ్చేటప్పుడు ఏ జీవి కూడా 

తన వెంట ఏదీ తీసుకురాలేదు, 

అదే విధంగా వెళ్లేటప్పుడు కూడా ఏదీ తీసుకువెళ్లలేదు’ ఈ జీవిత సత్యాన్ని గుర్తించడమే కాదు..

ఎల్లవేళలా స్మరించుకోవాలి.


చెదపురుగు పుట్టి గిట్టుతుంది. 

దానివల్ల మరొకరికి లాభం లేదు కేవలం నష్టం తప్ప. అట్లాకాక మనిషిగా పుట్టి విచక్షణా జ్ఞానం ఉన్నందువల్ల భగవద్గీతలో చెప్పినట్టు 

మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి, 

దాని వల్ల వచ్చే ఫలితాన్ని భగవంతుడికే వదిలివేయాలి. మనిషి జీవితం భగవంతుడి చేతుల్లో నడుస్తుంది. 

మనం నిమిత్తమాత్రులమని సదా జ్ఞప్తిలో ఉంచుకోవాలి.


సృష్టిలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. 

ఏ ఇతర జీవికి భగవంతుడు ఇవ్వని వరం మనిషికి మాట్లాడే రూపంలో ఇచ్చాడు. 

మన మాటలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులు సంతోషిం చేవిధంగా మాట్లాడాలి. 

భగవంతుడి ప్రతి నిర్ణయం వెనుక పరమార్థం 

దాగి ఉంటుంది. 

దాని నుండి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయడం కూడా మంచిది కాదు. 

‘మానవసేవే మాధవసేవ’ అన్న నానుడిని ప్రతి ఒక్కరూ గుర్తించుకుని సామాజిక సేవలో నిమగ్నం కావాలి. జీవితంలో నీతిగా, నిజాయితీగా ఉంటూ 

ప్రశాంతంగా జీవించాలి. 

ఇతరులకు ఆదర్శంగా నిలవాలి.


భగవంతుడు గుణాతీతుడు. 

మనిషి గుణాలకు అధీనమై ఉండేవాడు. 

గుణాల్లోను రజోగుణం, తామస గుణం వల్ల మనిషికి కామక్రోధాదులు కలుగుతాయ. 

కోరిక ఉద్భవించడం, అది తీరక పోవడం వల్ల 

కోపంతో ఇతరులను తిట్టడం వారి మీద 

కసి, ద్వేషం పెంచుకోవడం జరుగుతుంది. 

మనకు దక్కనిది ఇతరులకు దక్కుతుందనగానే 

వారిని నాశనం చేయాలనే దుష్టబుద్ధి ఏర్పడ్డం జరుగుతుంది. 

వీటి అన్నింటికీ కారణం మాత్రం రజోతామసగుణాలే. కనుక ఈ గుణాలను అణచివేయాలంటే గుణాతీతుడైన భగవంతుని పాదపద్మాలే శరణ్యం. 


ఎప్పుడైతే భగవంతుడే అన్నింటికి కారణుడు 

అని తెలుసుకొంటే అపుడు బుద్ధి అందరిలోను భగవంతుని అంశను చూడగలుగుతుంది. 

భగవంతుని అంశను చూసినపుడు సమత్వబుద్ధి 

దానితో పాటు ఎవరికీ నష్టం చేయకూడదు 

ఇది కేవలం పురాకృత కర్మ వల్ల వచ్చిన స్థితి మాత్రమే అని తెలుస్తుంది. 


కర్మఫలితాలను అవతారమూర్తలు కూడా అనుభవించినట్టు ఇతిహాసాలు పురాణాలు చెబుతాయి.

ఇతరులకు సేవఛేయడంలోనే మనుష్యజన్మకు 

సార్థకత ఏర్పడుతుంది. 

సమాజసేవ చేస్తూ నలుగురి మంచికోసం 

పాటు పడినప్పుడు భగవంతుని తత్వం బోధపడుతుంది.

మహాభారతం_నుండి_నేర్చుకోవాల్సిన_12_ముఖ్యమైన_విషయాలు

 #మహాభారతం_నుండి_నేర్చుకోవాల్సిన_12_ముఖ్యమైన_విషయాలు


1. జీవితం లో  గెలవడానికి  జాలి,  దయ,   మంచితనం  మాత్రమే  ఉంటే  చాలదు ..

 

కర్ణుడు  అంటేనే  మంచితనానికి,  దాన,ధర్మలకి      పెట్టింది  పేరు,  కాని  సమయాన్ని  బట్టి  నడుచుకోక పోవడం వలన  చెడు  ( కౌరవుల )  వైపు  నిలబడి ప్రాణాలని  పోగొ  ట్టుకున్నాడు,  కావున  జీవితం లో గెలవాలంటే  మంచితనం తో  పాటు  చుట్టూ  ఉండే సమాజ  పరిస్థితులని,  సమయాన్ని  బట్టి నడుచుకోవాలి ...


2.చెడు  స్నేహం  ఊహలకి  కూడా  అందని 

విధంగా  మీ  జీవితం  నాశనం  చేయొచ్చు ...


శకుని ..  పరోక్షంగా  కౌరవ  సామ్రాజ్యం  మొత్తాన్ని నాశనం  చేసి, వారితో  స్నేహంగా  వారి  ఆస్థానం లో ఉంటూనే  వారికి  కలలో  కూడా  ఊహించని పరాజయాన్ని  మిగిల్చాడు,  శకుని  లాంటి

జీవితంలో  చాలామంది  మనకు  మిత్రుల  

రూపంలో ఎదురవుతారు,  అలాంటి  వారి 

చెడు  సలహాలని  దూరం  పెట్టాలి ...


3. ఎటువంటి  బేధాలు  చూడని  నిజమైన  స్నేహం జీవితంలో  ఉన్నత  స్థానానికి  తీసుకెళ్తుంది ..


పాండవులు  శ్రీ కృష్ణుడుని,  కౌరవులు  కర్ణుడుని పొందటం  అది  వారికి  యుద్ధం  సమయంలో  ఏ స్థాయిలో  ఉపయోగపడిందో  తెలిసినదే,  కర్ణుడి 

లేని  రారాజు  బలం  ఏ  పాటిదో ,  కౌరవ  సేనకు కర్ణుడు  ఏ  స్థాయి  ధైర్యమో  తెలిసిన  సంగతే  కదా, కుల,  మత,  పేద  మరియు  ధనిక  భేదాలని చూడకుండా  మంచివారితో  స్నేహం  చేసేవారు ఖచ్చితంగా  జీవితంలో  గెలుస్తారు ...


4. అధికం  అనేది  అత్యంత  ప్రమాదకరం


కౌరవుల  తల్లి  అయిన  గాంధారీ కి  వంద  మంది కుమారులు  ఉండటం  వల్ల  వారిని  పెంచటంలో చాలా  కష్టపడాల్సి వచ్చింది,  రాజ్యాన్ని  బిడ్డలకి సమంగా  పంచటమూ  వారి బాగోగులు  చూస్తూ క్రమశిక్షణతో  పెంచటమూ  కూడా  చాలా  కష్టం, అలాగే  దుర్యోధనుడికి  ఉన్న  అధికమైన  కోపం, అధికమైన  రాజ్యకాంక్ష  కారణంగా  కౌరవులు నాశనం  అయ్యారు ..!  కాబట్టి  అన్ని  చోట్ల ముఖ్యంగా  చెడు  పక్షాన  అధికం  అనేది 

అత్యంత  ప్రమాదకరం ...


5. ఎవరి  పనులు  వారే  చేసుకోవడం ..


అరణ్య  వాసం,  అజ్ఞాతవాసంలో ఉన్న  పాండవులకి వాళ్ళు  నేర్చుకున్న  ఇంటి,  వంట  పనులు  చాలా ఉపయోగపడ్డాయి,  అలాగే  మనకి  కూడా  మన అవసరాల  కోసం  అయిన  కొన్ని  పనులు నేర్చుకోవాలి ...


6. మనకి  సంభందించిన  దాని  కోసం  ఎంత 

 కష్టమైన  పోరాడాలి ..


కౌరవులతో  పోల్చుకుంటే  పాండవుల  సైన్యం 

చాలా  తక్కువగా  ఉన్న  పాండవులు  తమ 

కష్టాన్ని  మాత్రమే  నమ్ముకొని  చిత్తశుద్దితో 

పోరాటం  చేసి  విజేతలుగా  నిలిచారు ...


7. అతి  ప్రేమ  నష్టం  కలిగిస్తుంది ..


ద్రుతరాష్ట్రుడు  అటు  బిడ్డల  మీద  ప్రేమ  ఇటు తను  నమ్ముకున్న  సిద్దాంతాల  మధ్య  ఎలా నలిగిపోయాడో,  కొడుకుల  వినాశనం  అంతా తెలుస్తున్నా  వారి  తప్పులని  ఆపలేకపోయాడు,

అదే  ద్రుతరాష్ట్రుడు  తన  బిడ్డల  మీద  అంత ప్రేమని  పెంచుకోక  వారిని  క్రమశిక్షణలో  పెట్టి ఉంటే విషయం  అంత  వరకూ  వెళ్ళేది  కాదేమో .. 

ఎవరి  మీద  అయిన  అతి ప్రేమ,  అతి  నమ్మకం నాశనానికి,  మోసానికి  దారితీస్తాయి ...


8. విద్య  జీవితాంతం  నేర్చుకోవటమే  మీకు 

ఉత్తమ  బహుమతి ..


అర్జునుడు  తన జీవితం  ఆసాంతం  విద్యలు నేర్చుకుంటూనే  ఉన్నాడు  ద్రోణా  చార్యుల  వారి నుండీ  యుద్ద  శాస్త్రం,  దైవ  సంబందమైన ఆయుధాల  వాడకం  ఇంద్రుడు  ద్వారా,

మహదేవుడి  నుండి  పాశు పతాస్త్రం, యుధిష్టరుడు,  కృష్ణుడి  నుండి మరెన్నో  రాజ  నీతులు  ఇలా  ప్రతి దశలోనూ  అభ్యసించటమే  అర్జునుడికి  ఓ  ప్రత్యెక స్థానం  దక్కింది,  నిత్యం  నేర్చుకోవడం  వలన ఖచ్చితంగా  విజయం  సాధించవచ్చు ...


9.కొన్నిసార్లు  శత్రువులు  కూడా  మిత్రుల  రూపంలో  ఎదురవుతారు ..


కౌరవుల  పక్షాన  ఎంతో  మంది  ఉన్నా  వాస్తవానికి వారిలో  చాలా  మంది  పాండవులకి  సహాయపడ్డ వాళ్ళే , బీష్మ,  విదుర,  ద్రోణ  రహస్యంగా పాండవులకి  ఎంత  సహాయం  చేసారో తెలిసినదే, ఇక  విదురుడు  అయితే  కౌరవుల  ప్రతీ  అడుగు పాండవులకి  మోసుకొచ్చిన  వాడు  కదా ...


10. స్రీలని  ఆపదల  నుండి  కాపాడటం ..


నిజానికి  ద్రౌపది  ఐదుగురు  భర్తలు సంపన్నులు, అత్యంత  బలవంతులు  కూడా  కానీ  సభామందిరాన  అవమానం  ఆపలేకపోవటంలో విఫల మయ్యారు  కదా ...


11. అర్ధజ్ఞానం  అత్యంత  ప్రమాదకరం ..


పద్మవ్యూహం  లోనికే  ప్రవేశించటమే  కానీ బయటపడటం  తెలియక  తనకున్న  అర్ధ జ్ఞానమతో  అభిమన్య్యుడు  వంటి  మహావీరుడే నేల  రాలి పోయాడు.  ఏ  పనిని  అయిన  పూర్తిగా తెలుసుకున్నాకే  మొదలు పెట్టాలి,  అలా తెలుసు కోకపోతే  ఆ  పనిని  మధ్యలో నే వదిలేయాల్సిన  పరిస్థితి  వస్తుంది ...


12. స్త్రీని  అవమానికి  గురి  చేయరాదు.


కేవలం  ద్రౌపదికి  జరిగిన  అవమానం  వలన,  ఆమె కౌరవ  సామ్రాజ్యం  మీద  పెంచుకున్న  కోపం  చివరికి  కౌరవులని  వాళ్ళ సామ్రాజ్యాన్ని  నామ  రూపాలు లేకుండా  చేసింది,  స్త్రీలు  దేవతలతో  సమానం వాళ్ళని  అవమాన  పరచడం  అనేది  చాలా  పెద్ద పాపం ... !!

పంచ' దంపతులు *ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా 5 విధాలు గానే ఉంటారు.

🙏🙏🙏🙏🙏
పంచ' దంపతులు
🌹🌹🌹🌹🌹
ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా 5 విధాలు గానే ఉంటారు.

మొదటివారు లక్ష్మీనారాయణులు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై ఆలోచనకూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట

రెండవవారు
గౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం,
తలనుంచి కాలిబొటనవ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు, రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత,ఆలోచనలకు తల,కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం,
కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.

మూడవవారు
బ్రహ్మ సరస్వతుల జంట
బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం, దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని ఇలా
ఏ మాట మాట్లాడినా,
ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య ..ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.

నాల్గవవారు
ఛాయా సూర్యులు సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు,
అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది.
తనభర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు.అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది,ఛాయాదేవి.
ఏ ఇంట భర్త కఠినంగా. కోపంగా ,పట్టుదలతో ఉంటాడో.
ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.

ఐదవవారు
రోహిణీ చంద్రులు
రోహిణీ కార్తెలో
రోళ్ళు కూడా పగులుతాయనే
సామెత ఉంది,
చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని,
ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడునూ,
ఏ జంట భర్త మెత్తగా ఉండి,లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోనుఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.
🙏🙏🙏🙏🙏

సేకరణ

ఈ వ్యాసం పూర్తిగా చదవడం పై అమ్మాయిలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి..* *రోగులకు అవసరమైన శరీర భాగాలు ఎక్కడ నుండి వస్తాయి..??*

 *సిబిఐ చీఫ్ లక్నో నివేదిక*

😲😲☺️☺️😲😲

*Be Alert Everyone..*


 *ఈ వ్యాసం పూర్తిగా చదవడం పై  అమ్మాయిలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి..* 


 *రోగులకు అవసరమైన శరీర భాగాలు ఎక్కడ నుండి వస్తాయి..??*


40 లక్షలు చెల్లించి కిడ్నీ మార్చుకోండి అనే మాట మీరు వినే ఉంటారు. అదీ 16 నుంచి 25 ఏళ్ల వయసులో వారి ఆరోగ్యకరమైన కిడ్నీ..


ఇప్పుడు ఆలోచించండి ఈ శరీరభాగాలు ఎక్కడి నుండి వస్తున్నాయో..??

శవాగారాల్లో పడివున్న మృతదేహాల నుండో లేక ప్రమాదాలలో మరణించిన వారినుండో కాదు. ఇంకొక స్థలం ఉంది.  అదే... మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిలు.. వీరిలో చాలామందికి సిగరెట్, గుట్కా, మద్యం వంటి అలవాట్లు ఉండవు కాబట్టి వారి దంతాలు, ఎముకలు, ప్రేగులు, గుండె, కాలేయం, మెదడు, మూత్రపిండాలు, అన్నీ మెడికల్లీ మార్పిడికి బాగా అనువైనవి..


 *ప్రేమలో పడేయడం* లేదా *జాబ్ బ్లఫ్స్* ఇవ్వడం ద్వారా ఈ అమ్మాయిలను ఎక్కడికైనా తీసుకెళ్లడం సులభం..


చాలా అందమైన స్మార్ట్ హీరో టైప్ అబ్బాయిలు ఈ అమ్మాయిలను నెట్‌లో ట్రాప్ చేస్తారు.. ఈ అబ్బాయిలు నిజంగా *ప్రొఫెషనల్ క్రిమినల్స్*

డబ్బు కోసం ఏమైనా చేయగలరు..

 

మన దేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి నాటికి మధ్యతరగతి కుటుంబానికి చెందిన 4 లక్షలమంది బాలికలు ఇంటినుంచి అదృశ్యమవుతున్నారు.. ఫిబ్రవరిలోనే ఎందుకు ఎక్కువగా అదృశ్యమవుతున్నారంటే ఫిబ్రవరి 14న వచ్చే *ప్రేమికుల దినోత్సవం* ప్రభావంగా తెలుస్తున్నది..


 *ప్రేమతో ఇంటినుంచి పారిపోయి,* 

*కేసుపెట్టలేదు*, *ఎవరూ వెదకలేదు*..

ఆ తర్వాత ఎవరికీ తెలియదు.. ఒక్కసారి ఆలోచించండి, ఈ అమ్మాయిలు ఎక్కడికి చేరుకుంటారు..??


ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోగలరు..


నిజానికి మొదటిగా అమ్మాయిలు కొంతకాలం శారీరకంగా అనుభవించబడి, ఆ తరువాత రకరకాల వేధింపులకు గురవుతారు.. చివరగా వారిని చంపి శరీర భాగాలను అమ్మి కోట్లు సంపాదించి ఆడబ్బుతో ఆయుధాలు, విస్ఫోటక పదార్థాలు కొని దేశ విఛ్ఛిన్నకర శక్తులుగా విరుచుకుపడ్తున్నారు.. 

 

ఒకసారి గూగుల్‌లో *మానవ శరీర భాగాల బ్లాక్ మార్కెట్ ధర..* అని సెర్చ్ చేయడం ద్వారా అవయవాల ధరలను చూడండి..


*20 ఏళ్ల అమ్మాయి శరీర భాగాలకు సరైన ధర ఉంటే కనీసం 5 కోట్లు సులువుగా లభిస్తాయి..*


 ఇప్పటి వరకు ప్రేమ పేరుతో మానవ అక్రమ రవాణాపై ఎటువంటి చట్టాన్ని రూపొందించలేదు..


ఇంకో విషయం

ఇటువంటి సంఘటనలు లక్నో, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

ఈ సంఘటనలు ఎక్కువగా బలహీనంగా ఉన్న కుటుంబాలు  లేదా ఎలాంటి రాజకీయ లేదా చట్టపరమైన అవగాహన లేని అమ్మాయిలతోనే జరుగుతాయి.


2015లో 4000 మంది బాలికలు యూపీలో కనిపించకుండా పోగా, 2017 నుంచి 2018 వరకు 7000 మంది బాలికలు అదృశ్యమయ్యారు..


పోయిన ఏడాది 2020లో హైదరాబాద్‌లో ఒక వారం రోజుల్లోనే 500 మంది పైగా అమ్మాయిలు అదృశ్యమైన విషయం గుర్తుండే ఉంటుంది..


 

మనవారిని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే..

 *ఎక్కడో కాదు, మన ఊరిలో, మన వీధిలో కూడా త్వరలో ఇలాంటివి జరగవచ్చు...!* అలాగే ఎవరి వలలో పడకుండా అవగాహన పెంచుకోండి..


  *ఏ ఆడ బిడ్డ ఇలాంటి కుట్రకు బలికాకుండా జాగ్రత్త గా ఉండండి..!*


మౌనం వీడి ఇలాంటి విషయాలపై కుటుంబంలో, ఇంట్లో, స్నేహితుల్లో  చర్చ జరగడం వలన చెల్లెలి-కూతుళ్ల విలువైన ప్రాణాన్ని కాపాడుకోగలం..

 


 *క్రైమ్ బ్రాంచ్ లక్నో,*

 *ఉత్తర ప్రదేశ్ వారి విన్నపం:*

మన నైతిక బాధ్యతను నిర్వర్తిద్దాం. మేము ప్రతిరోజూ ఇలాంటి సందేశాలు పంపుతూనే ఉన్నాము, ఇది మన దేశ సోదరీమణులు మరియు కుమార్తెల గౌరవం మరియు జీవితానికి సంబంధించిన ప్రశ్న, 

దయచేసి ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ షేర్ చేయండి ధన్యవాదాలు..


*-సిబిఐ చీఫ్ లక్నో*

పొగడ్త చెరుకు ముక్క!!

 👉 తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి

https://t.me/teluguvelugu01


_*🎋పొగడ్త చెరుకు ముక్క!!🎋*_

🕉️🌞🌎🏵️🌼🚩


 *పొగడ్త చెరుకు ముక్క లాంటిది. దాన్ని ఆస్వాదించాలి. అంతేగాని ఆసాంతం మింగేయాలనుకొంటే ప్రమాదం. తొలి గెలుపు అంతిమ విజయానికి సోపానం కావాలి. ముఖస్తుతికి లొంగిపోతే కళ్లు బైర్లు కమ్మి, పైకి చేర్చే నిచ్చెన కనిపించదు. ‘నిరంతరం నిన్ను పొగుడుతూ ఉండేవాడు లోలోపల నిన్ను ద్వేషించే శత్రువైనా అయి ఉండాలి. లేదా నీ నాశనం కోరే కపటి అయినా అయి ఉండాలి’ అంటాడు విదురుడు మాయాజూదంలో గెలిచిన దుర్యోధనుడితో. మహాభారతంలో* 


*ముఖస్తుతితో, కపట ప్రేమతో కౌరవుల నాశనానికి కారకుడయ్యాడు శకుని. నిజానికి మహాభారత యుద్ధానికి పరోక్షంగా శ్రీకృష్ణుడికి సహాయపడింది శకునే! అందుకే పార్థసారథికి సౌబల్యుడు (సుబలుడి కొడుకైన శకుని) అంటే ఇష్టం.* 


 *పశ్చాత్తాపాలకు తావులేని శాశ్వతమైన విజయాలు విమర్శలను స్వీకరించేవాడికే లభిస్తాయని అనుభవజ్ఞులు అంటారు. ఎందుకంటే తప్పొప్పులు బేరీజు వేసుకోవడం విమర్శల వల్లే అలవడుతుంది. మనల్ని మరింత ఎదగాలని మనసారా కోరేవారు పొగడ్తల కన్నా నిజమైన విమర్శలతోనే స్ఫూర్తినిస్తారు.*


*కొడుకు విజయాన్ని కోరే తండ్రి అందుకే అతిగా పొగడడు. పొగడ్తలు మనం ఇతరులతో వెర్రిగా పోటీపడటానికి మాత్రమే ప్రోత్సహిస్తాయి. ఎదుటివాడి బలాన్ని గుర్తించలేం. విమర్శలు మనతో మనమే పోటీ పడేలా చేస్తాయి. దీంతో ఎదగడం సులువవుతుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేంత వివేకం లభిస్తుంది. అప్పుడు మనల్ని పొగిడేవారిని ఇష్టపడకపోవడమే కాక, మనల్ని ఇష్టపడనివారిని సైతం ప్రశంసించగలుగుతాం.* 


 *పొగడ్తల వల్ల దురభిమానం పెరిగి, వినమ్రత తగ్గే ప్రమాదం ఉంది. ప్రమాదం ఎందుకవుతుందంటే మన బలహీనతల్ని మనం గమనించడం మరచిపోతాం. మన ఎదుగుదలకు* 


*తోడ్పడేవారు మన విజయంలో జరిగిన చిన్న పొరపాట్లను సైతం ఎత్తి చూపి ‘అలా చేయకుండా ఉంటే గెలుపు సంపూర్ణమయ్యే’దని అంటారు. మనలోని లోపాల్ని తెలుసుకొంటే నిజమేమిటో, భ్రమలేమిటో ఎరుకలోకి వస్తాయి. పర్యవసానంగా జ్ఞానం పెరుగుతుంది. అప్పుడు కానీ తెలియదు- మనం ఇంకా ఎంత ఎదగాల్సి ఉందో!* 


 *సద్విమర్శలు మనం ఇంకా చేయాల్సిన పనుల గురించి చెబుతాయి. జీవితంలో ఎదుగుతున్నవాణ్ని, ఎదిగే అవకాశాలు ఉన్న వ్యక్తిని పొగడ్తలతో ముంచెత్తరాదని పెద్దలు అంటారు. ఒక గొప్ప విమర్శ మహాత్ముల మార్గంలో నడిపిస్తుంది. అనుచిత పొగడ్త విజయాన్ని నియంత్రిస్తుంది. మనకు ఉన్నది ఒక్క జీవితం మాత్రమే. పొగడ్తలకు, అసూయాపరుల అసత్య ప్రశంసలకు లొంగకపోతేనే- ఈ జీవితాన్ని విజయవంతంగా గడపగలుగుతాం.* 


 *సాధకుణ్ని అభినందించాల్సిందే. అభినందనకు, అనుచిత పొగడ్తకు తేడా ఉంది.* 


*అభినందన మెరుగుపరచుకోవడానికి తోడ్పడుతుంది. ముఖస్తుతి అభివృద్ధికి అడ్డంకి అవుతుంది. కుటిలురు మూర్ఖుల్ని పొగుడుతుంటారు. మూర్ఖులు ఆత్మస్తుతి, పరనిందలో మునిగి ఉంటారు. అనుచిత పొగడ్త సాలెగూడు లాంటిది. దానికి లొంగిపోతే వెలుపలికి రావడం కష్టం. పొగడ్తలు వింటూ వినాశనానికి దారులు వేసుకొంటూ సాగితే- విమర్శల్ని స్వీకరించి బాగుపడే అవకాశాలను కోల్పోతాం. వివేకవంతులు ఆత్మవిమర్శ, పరుల అభినందనలతో ఎదుగుతూ నిత్యవికాసాన్ని పొందుతూ ఉంటారు. ఈ లోకంలో సద్విమర్శ చేస్తూ నిజాన్ని చెప్పడంకంటే కష్టమైన పని లేదు; కుటిలత్వంతో ముఖస్తుతి చేయడంకంటే సులువైంది లేదని కౌటిల్యుడి వ్యాఖ్య...*

 https://chat.whatsapp.com/FzSgSrhbQQN2nbSdhx1hU0

నిరంతరం పక్కనే ఉంటూ పొగిడేవాడు, ఆ పొగడ్తలను వినేవాడు... ఇద్దరినీ ముఖస్తుతి నాశనం చేస్తుంది...🙏