Friday, January 28, 2022

"ధ్యానం .. ఖచ్చితంగా 40 రోజులు చెయ్యాలా?"

ప్రశ్న: "ధ్యానం .. ఖచ్చితంగా 40 రోజులు చెయ్యాలా?"

పత్రీజీ : నలభై రోజుల ధ్యానం అన్నది తప్పనిసరి! ఒక రాయిని సుత్తితో గట్టిగా కొడుతూ ఉంటే పదిహేను దెబ్బలవరకు ఏమి జరిగినట్లు కనపడదు; ఆ తరువాత కేవలం ఒక చిన్ని దెబ్బకే అది రెండుగా పగులుతుంది. అయితే అది చివరి దెబ్బ గొప్పతనం కాదు;అది అంతవరకు శ్రమించి కొట్టిన పధ్నాలుగు దెబ్బల ఫలితమే !

అలాగే ధ్యానం కూడా 40 రోజులు ఖచ్చితంగా చెయ్యాలి !ముందు కొన్ని రోజులు పాటు బయటికి ఏమీ కనపడకపోయినా .. ఒక్కొక్క దెబ్బకు రాయి లోపల ఉన్న పరిస్థితిలో కొద్దికొధ్దిగా మార్పు వచ్చి చివరికి పగిలిపోయినట్లే .. ఒక్కొక్క రోజు ధ్యానం వల్ల మన అంతరంగం లోపలి ఒక్కొక్క చక్రస్థాయిలో చిక్కుకుపోయిన జన్మజన్మల చెడు కర్మ ఫలితాలు విఘటితం చెందుతూ మన నాడిమండలాన్ని మనం పరిశుద్ధం చేసుకుంటూ వుంటాం.

తపనతో కూడిన శ్రద్ధతో ధ్యానసాధన చేస్తూ వుంటే రాయిలా ఉన్న మనం .. పగలక ముందు నరుడైన అర్జునుడిలా పదే పదే దుఃఖానికి గురవుతూ వున్నవారం ధ్యానం ద్వారా పగిలి రెండుగా విడిపోయాక .. నారాయణుడైన కృష్ణుడిలా ఆత్మజ్ఞానంతో విలసిల్లుతూ ప్రతిక్షణం ఆనందంగా గడుపుతూంటాం ! అంతకు ముందు అనేకానేక సందేహాలతో నిండి వున్న మనకు నలభై రోజుల ధ్యాన సాధన తరువాత ప్రతి ఒక్క సందేహానికీ మన అంతరంగం నుంచే సమాధానం వస్తుంది.

సేకరణ

No comments:

Post a Comment