160123h1911. 170123-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*హనుమంతుడికి…*
*ఒంటె ఎలావాహన మయ్యింది?*
➖➖➖✍️
*హనుమంతుడు యెజనాల కొద్దీ దూరాన్ని ఒక్క అంగలో అధిగమించగలిగినవాడు.*
*స్వయంగా రుద్రాంశ సంభూతుడు. వాయు పుత్రుడూ! సూర్యుణ్ణే పండనుకొని భ్రమించి, సూర్య గ్రహం దాకా యెగిరి వెళ్లగలగడంలోనే ఆయన యెంత వేగంతో ఎలా ప్రయాణించగలరనేది అర్థమవుతోంది కదా!*
*అటువంటి స్వామికి ఒక వాహనం అవసరమేముంది. ఆమాటకొస్తే, త్రిమూర్తులకీ, వారి దేవేరులకీ, ఇలా దేవతా గణమందరికీ ఏదొక వాహనం ఉందికదా!*
*అయినా వానర రూపంలో ఉన్న ఆంజనేయునికి ఒంటె వాహనం అవ్వడం అనేది కాస్త ఆసక్తికరమైన కథే కదూ!*
*ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.*
*దక్షణాదిన ఆంజనేయ స్వామి గుడులలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా అరుదనే చెప్పాలి.*
*కొన్ని ప్రదేశాలలో, ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహం ఉంటుంది.*
*ఒంటె, ఆంజనేయస్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాధ ఉంది.*
*రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వధిస్తాడు. అతడి మృత దేహాన్ని ఋష్యమూక పర్వతం (నేటి హింపీ ప్రాంతం) పై పడేశాడు.*
*ఈసంఘటనే వాలి, సుగ్రీవుల మధ్య వైరం రగులుకోవడానికి కారణమవుతుంది.*
*మరో వైపు వాలి శాపాన్ని పొందేందుకు కారణమవుతుంది. ఆ ఋష్యమూక పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న మాతంగ మహాముని దుందుభి మృతదేశాన్ని…. తాను తపస్సు చేసుకుంటున్న ఆ పర్వతం పైన పడేయడాన్ని ఇది చూసి, వాలి కనుక షష్యమూక పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపిస్తాడు.*
*ఆ తర్వాత సుగ్రీవుణ్ణి - వాలి చంపడానికి వెంటపడినప్పుడు, శాపోదంతం తెలుసున్న సుగ్రీవుడు ఋష్యమూక పర్వతానికి వెళ్లి దాక్కుంటాడు.*
*ఆ సమయంలో సుగ్రీవుణ్ణి చూడటానికి వచ్చిన హనుమంతుడు ఒకరోజు అక్కడే ఉన్న పంప సరోవరాన్ని తిలకించాలని అనుకుంటాడు.*
*దాంతో మిత్రుడైన హనుమంతుడు పంపా సరోవరం తీరంలో తిరగడానికి అనువుగా ఒంటెను సిద్ధం చేస్తాడు సుగ్రీవుడు.*
*అలా అది ఆయనకు వాహనం అయ్యిందని కథనం…*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment