Wednesday, May 31, 2023

మనకు కష్టం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ కూర్చుంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు.

 మనకు కష్టం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ కూర్చుంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు.

ఓ రోజు ఒక వనం లో ఒక పాము చాలా హుషారుగా పాకుతూ, దొర్లుతూ  అటువైపుగా వెళ్తోంది.
దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...
ఆ పాము కోతిని కాటు వేయబోయింది...
భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... 
గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టువున్న మిగతా కోతులన్నీ అక్కడకు వచ్చి పామును పట్టుకున్న కోతిని చూసి ఇలా అనుకున్నాయి.
ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..
కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...
మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...
మనం దూరంగానే ఉండటం మంచిది అని అన్ని కోతులు వెళ్లిపోయాయి...

తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన
కోతికి నిరాశే ఎదురయ్యింది...
అలాగే భయంతో ఆ పాముని గట్టిగా పట్టుకుని కూర్చుంది.

అదే సమయంలో అటువైపుగా ఒక ముని వెళుతూ... 
కోతి స్థితిని
అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు.
' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది.
వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.
దాన్ని వదిలేయి" అన్నారు ఆ ముని... 

ఆ ముని మాటలు విని కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు పైకి ఎక్కేసింది... 
ఇందులోని నీతి ఏంటంటే...

నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు...

కష్టాన్ని దూరంగా విసిరేసి కష్టానికి పరిష్కారం వెతకాలి.

అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ కుటుంబ సభ్యులు, బంధువులు, ఎవ్వరూ నిన్ను రక్షించడానికి ...
నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు అని గట్టిగా గుర్తు పెట్టుకోవాలి.

ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోతారు...

నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎవరి సహాయం కోసం చూడకూడదు..

కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు...

కష్టాన్ని మంచి పరిష్కారంలో తరిమికొట్టాలి...
అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు నీ జీవితం సుఖమయం కాగలదు...

✍🏼 నేటి కథ ✍🏼* *నిజాయతీ*

 *✍🏼 నేటి కథ ✍🏼*


*నిజాయతీ*


ఒక బాలుడు ఇంటి వసారాలో కూర్చొని శ్రద్ధగా లెక్కలు చేసుకొంటున్నాడు. అవి వాళ్ళ ఉపాధ్యాయుడు ఇంటి వద్ద చేసుకొని రమ్మని ఇచ్చిన లెక్కలు. ఆ బాలుడు ఒక్కటి తప్ప మిగిలిన అన్ని లెక్కలు చేశాడు. ఆ ఒక్క లెక్క ఎట్లా చెయ్యాలో అతనికి తోచలేదు. అతడు లెక్కల పుస్తకం తీసుకొని ఒక స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ స్నేహితుడి అన్నగారు ఉన్నారు. ఆయన ఆ లెక్కను ఎట్లా చెయ్యాలో ఆ బాలుడికి చెప్పాడు. అతడు ఇంటికి వచ్చి ఆ లెక్క కూడా చేశాడు.

మరునాడు తరగతిలో ఉపాధ్యాయుడు పిల్లలు ఇంటి వద్ద చేసుకువచ్చిన లెక్కలు చూడటం మొదలు పెట్టాడు. అందరి పుస్తకాలు చూడటం పూర్తి అయింది. అన్ని లెక్కలు సరిగా చేసినవాడు ఈ బాలుడు ఒక్కడే! ఆయనకు చాలా సంతోషం కలిగింది. ఆ బాలుడుకి ఒక బహుమతిని ఇస్తాను అన్నాడు. ఆ బాలుణ్ణి తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆయన తన బల్ల సరుగులో బహుమతిగా ఇవ్వతగిన వస్తువును వెదుకుతున్నాడు. ఆ బాలుడు లేచి నిలుచున్నాడు గాని ఉపాధ్యాయుని వద్దకు వెళ్లలేదు. ఉపాధ్యాయుడు తల ఎత్తి చూశాడు. ఆ బాలుడు ఏడుస్తున్నాడు.

ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆ బాలుని వద్దకు వచ్చి, "నాయనా! ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు. ఆ బాలుడు, "అయ్యా ! లెక్కలన్ని సరిగా చేశాననిగదా, మీరు నాకు బహుమతి ఇస్తున్నారు! ఈ లెక్కలు అన్ని నేను చెయ్యలేదు. వీటీలో ఒక లెక్క నా స్నేహితుడు అన్న గారి చేత చెప్పించుకొని చేశాను. కనుక ఈ బహుమతిని తీసుకొనటానికి నేను తగను." అన్నాడు. అయితే, ఏడవటం ఎందుకు? అని అడిగాడు ఉపాధ్యాయుడు. లెక్కలన్ని విద్యార్థులు స్వయంగా చెయ్యాలని గదా, మీ ఉద్దేశం? కాని నేను ఒక లెక్కను ఇతరులచేత చెప్పించుకొని చేసి, మిమ్ములను మోసగించాను. అందుకు నన్ను శిక్షించండి. అని బాలుడు ఇంకా ఏడవటం మొదలుపెట్టడు.

ఉపాధ్యాయుడు ఆ బాలుడు తల నిమురుతూ, నాయనా నిన్ను శిక్షించటం కాదు. అభినందించాలి. నీకు బహుమతి తీసుకొనటానికి అర్హత ఇంకా పెరిగింది. అయితే ఈ బహుమతి లెక్కలు చేసినందుకు కాదు. అంతకంటే గొప్ప పనికి! నీ "నిజాయితీకి" అని ఆ బాలుడుకి బహుమతిని ఇచ్చాడు ఉపాధ్యాయుడు. 

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

*✍🏼 నేటి కథ ✍🏼* *దేశ సేవ*

 *✍🏼 నేటి కథ ✍🏼*


*దేశ సేవ*


శౌరికి చిన్నతనం నుంచి దేశసేవ చేయాలని కోరిక, వాడు కూడలి దగ్గర పిల్లలకు దేశసేవ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. 'స్వయంగా సంపాదించే మార్గం చూసుకో! నాతో పొలం పనులకు రా!' అంటూ వాడిని కోప్పడేవాడు తండ్రి.. అయితే శౌరికి తండ్రి స్వార్థపరుడిలా కనిపించాడు. ప్రతివాడు దేశం గురించి కూడా ఆలోచించాలి! స్వార్థం మానుకోవాలి! అనేవాడు. కొందరు ఊరి పెద్దలు 'ఇక్కడి మూర్ఖులకు నీ ఉపన్యాసాలు అర్థంకావు'. రాజధానికి వెళ్ళి రాజుగారిని కలుసుకో! అక్కడ నీ శ్రమకి గుర్తింపు లభిస్తుంది! అన్నారు.

శౌరి రాజధానికి వెళ్ళాడు. ఉద్యానవనంలో రాజు గారిని కలిశాడు. దేశసేవ చేయడానికి ఊరువదిలి వచ్చాను! అన్నాడు. తన గురించి అంతా చెప్పాడు. రాజు శౌరిని అభినందించాడు. కొన్నాళ్ళు నా అతిధిగా వుండు! అన్నాడు. మర్నాడు శౌరి సత్రం ఖాళీ చేశాడు. రాజుగారు వాడిని విడిదికి తీసుకువెళ్ళాడు. అది చాలా విశాలమైన భవంతి. ఇంటినిండా సేవకులు వాళ్ళు ముందుగదిని అలంకరిస్తున్నారు. 'ఈ భవంతిలో విశ్రాంతి తీసుకో!' నేను నాలుగు రోజులలో వస్తాను! అని వెళ్ళిపోయాడు రాజు. లోపలి గదిలోకి అడుగుపెట్టి, నిర్ఘాంతపోయాడు శౌరి, లోపల ఇరవై గదులు వున్నాయి. అన్నీ బూజు పట్టి ఉన్నాయి. పైగా గబ్బిలాల కంపు! పరదాలు చిరిగి తలుపులు విరిగి, గచ్చులు పగిలి వుంది! పెరడంతా పిచ్చిమొక్కలు! శౌరి పనివాళ్లతో 'లోపలి గదులు శుభ్రం చేయండి!' అన్నాడు. నాలుగు రోజులలో మొత్తం భవంతి శుభ్రపడింది. కొత్తపరదాలు కిటికీలు అమిరాయి పెరడు శుభ్రపడింది. పూల మొక్కలు, పళ్ళ మొక్కలు నాటబడ్డాయి. ఆరోజు రాజుగారు శౌరి ని చూడవచ్చారు. ఆయన భవంతిని చూసి, 'అద్భుతంగా వుంది! భవంతి స్వరూపమే మారిపోయింది!' అంటూ శౌరిని మెచ్చుకున్నాడు. 'వీళ్ళు ఇరవై గదులను పాడుపెట్టారు ముందుగదినే అలంకరిస్తూ కూర్చున్నారు ముందుగది ఎంత అందగా వున్నా ఏం లాభం! ఇల్లంతా భూతాలకొంపలా ఉన్నప్పుడు' అన్నాడు శౌరి.

నీ నుంచి ఈ జవాబే నేను ఆశించాను, దేశం అంటే రాజధాని నగరం మాత్రం కాదు! ముందుగదిని అలంకరించినట్లుగా రాజధానినే అభివృద్దిపరచుకుని ప్రయోజనం లేదు. నువ్వు అన్ని గదులు బాగుపరిచావు. అలాగే దేశంలో ఊళ్ళన్నీ బాగుపడాలి! అప్పుడే దేశం బాగుపడుతుంది అన్నాడు రాజు. శౌరి శ్రద్దగా ఆయన మాటలు వింటున్నాడు. రాజుగారు మళ్ళీ నోరు విప్పారు. ప్రతివాళ్ళు తమ ఇంటిని, ఊరుని బాగు చేసుకోవాలి! అదే నిజమైన దేశసేవ! అందుకు రాజధానికి రావలసిన పనిలేదు! అందరూ కలిసి బంజరు భూముల్ని సాగులోకి తీసుకురండి. చదువురాని వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పండి. పూడికలు తీయండి! రహదారులు బాగు చేయండి! రోడ్లు వెంట చెట్లు నాటండి. శ్రమ దానానికి మించిన దేశసేవ లేదు. దేశసేవ పేరుకోసం కాదు. దేశం కోసం చేయాలి! అన్నారు. శౌరి కళ్ళముందు తెరలు తొలగి పోయాయి. ఈ రోజే మా ఊరికి వెళతాను ఉపన్యాసాలు మాని నడుంకట్టి పని చేస్తాను. అప్పుడు మానాన్న సంతోషిస్తాడు. మా ఊరు, వాడా బాగుపడుతుంది. అంటూ రాజుగారి వద్ద సెలవు తీసుకున్నాడు శౌరి. 

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

*నానుడి కథ -* *ససేమిరా

 *నానుడి కథ -*


*ససేమిరా* 
         
         ససేమిరా అనే నానుడి మనం తరచు వింటూ ఉంటాం. ఎవరైనా మంకుపట్టు పడితే ససేమిరా అన్నాడు అంటూ ఉంటాం.  అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచటానికి సి.ఎమ్. జగన్మోహనరెడ్డి ససేమిరా అంటున్నాడు అనే వాక్యం దీనికి ఉదాహరణగా చెప్పుకోవొచ్చు.  తాను పట్టిన పట్టును వదలకుండా వుండే మనస్తత్వాన్ని ససేమిరా నానుడితో పోల్చటం పరిపాటి అయింది. ఈ నానుడి మంచన కవి రచించిన కేయూరబాహు చరిత్ర కావ్యంలో ఉన్న ఓ కథ ఆధారంగా ఉద్భవించినట్టు చెబుతారు.  అదేమిటో చూద్దాం.
      పూర్వం విశాల నగరాన్ని నందుడు అనే రాజు పాలించేవాడు. అతడికి జయంతుడు అనే కొడుకు ఉండేవాడు. అతడు ఒట్టి మూర్కుడు. దురహంకారి. మంత్రిని, రాజోద్యుగులను లెక్కచేసేవాడు కాదు. తన ఇష్టానుసారంగా వ్యవహరించేవాడు. అతడి ప్రవర్తన తప్పని మందలించిన ముసలి మంత్రి  'శత నందుడిని' రాజ్యం నుండి భహిష్కరించాడు. 
     ఒక సారి అతడు వేటకు వెళ్ళాడు. క్రూర మృగాలు ఉన్నాయని ఎంతమంది చెప్పిన వినకుండా  అడవి మధ్యలోకి వెళ్ళాడు. కొంతసేపు వేటాడాడు. బాగా దాహం అయింది. నీటి కోసం వెతికి వెతికి విసిగి వేసారి ఓ చెట్టుకింద కూలబడ్డాడు. అంతలో ఓ పులి వచ్చింది . అతడు గబగబా చెట్టు ఎక్కాడు. అప్పటికే ఎక్కడ ఓ ఎలుగుబంటి ఉంది. అతడు భయంతో వణికిపోయాడు. రక్షించమని వేడుకున్నాడు. ఎలుగుబంటి ధైర్యం చెప్పింది. "భయపడకు నిన్ను కాపాడతాను" అని కిందపడకుండా తన ఒడిలో పెట్టుకుంది. వెంటనే కిందున్న పులి ఇలా చెప్పింది. "ఎలుగు మిత్రమా! ఈ మానవుడిని ఎందుకు కాపాడతావు.  వీడు మనిద్దరికి శత్రువే. వీడిని కిందకు తొయ్యి. హాయిగా తిని వెళ్లిపోతాను" అంది.  శరణు కోరి వచ్చాడు.  కాబట్టి శత్రువైన కాపాడాల్సిందే. ఇది ధర్మం" అని మరి కాస్త గట్టిగా పట్టుకుంది ఎలుగుబంటి.
       కొంత సేపటికి ఎలుగుబంటి నిద్రపోయింది.  కిందున్న పులి ఇలా అంది. " ఓ మానవుడా! ఎలుగును కిందకు నెట్టు. దాన్ని తిని నా దారిన నే పోతాను. నీ దారిన నీవెళ్లు" అంది.  వెంటనే వాడు ఎలుగుబంటిని కిందకు నెట్టాడు. అది అప్రమత్తంగా ఉండి సమయస్ఫూర్తితో  కొమ్మకు వేలాడుతూ కిందకు పడకుండా ఆగిపోయింది. కృతజ్ఞత చూపకుండా రక్షించిన నన్నే చంపటానికి ప్రయత్నించావు కనుక  "మతి భ్రమించి తిరుగు" అని శపించింది..
     అప్పటి నుండి వాడు మతిభ్రమించి తిరగసాగాడు. ఎవరేమి అడిగినా 'ససేమిరా' అనేవాడు. మరో మాట  పలికే వాడు కాదు.
     అలా తిరుగుతూ తిరుగుతూ తండ్రి పంపిన పరివారానికి దొరికాడు. అతడి దుస్థితికి  తండ్రైన రాజు ఎంతో చింతించాడు. వైద్యులతో చికిత్స చేయించాడు. మంత్ర వేత్తలకు చూపించాడు. అంత్రాలు వేయించాడు. అయినా ఫలితం లేదు. చివరికి రాజ్య బహిష్కరణకు గురైన మంత్రి వచ్చాడు. జరిగిన విషయం తెలుసుకున్నాడు.
         'ససేమిరా'' అనే ఈ నాలుగు అక్షరాలతో ప్రారంభిస్తు నాలుగు శ్లోకాలతో ఎలుగుబంటి కాదంత చెప్పాడు. అతడికి శాప విమోచన కలిగింది. మాములుగా అయ్యాడు. 
        ఇలా జయంతుడిలా మూర్ఖంగా ఉంటూ, ఎవరి చెప్పిన వినకుండా మంకుపట్టు పట్టె  విషయాన్ని గుర్తు చేసే సందర్భంలో  ఈ నానుడి వాడకంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కథను 'ససేమిరా' చదవను అనకండేం.. ఇప్పుడే చదవండి. సరేనా?
   *౼ డా.దార్ల బుజ్జిబాబు*

*నీతి కథలు -* *రంగమ్మ గంగమ్మ

 🌈⛱🌈⛱🌈⛱🌈⛱🌈⛱🌈⛱🌈⛱🌈
💦 *నీతి కథలు -*

*రంగమ్మ గంగమ్మ*

ఒక ఊళ్ళో రంగమ్మ, గంగమ్మ అనే ఇద్దరు ఆడవాళ్ళు ప్రక్కప్రక్కనే కాపురం వుంటున్నారు. రంగమ్మకు రెండు గేదెలు ఉన్నాయి. నెయ్యి వ్యాపారం చేస్తూ వుంది. గంగమ్మకు ఎనిమిది గేదెలు వున్నాయి. పాలు అమ్ముకుని జీవిస్తున్నది ఆమె. ఇలా వుండగా ఒకసారి గంగమ్మ రంగమ్మ దగ్గర వీశెడు నెయ్యి అప్పుతీసుకున్నది. ఎన్నిరోజులు గడిచినా బాకీ తీర్చలేదు. గంగమ్మ గయ్యాళి గంప. ఎప్పుడూ ఇరుగుపొరుగు వాళ్ళతో నిష్కారణంగా తగవులాడుతూ వుంటుంది. ఆమె నోటికి భయపడి అందరూ ఏమీ అనలేక ఊరుకునేవారు. ఇలాంటి మనిషిని నెయ్యి బాకీ తీర్చమని ఎలా అడిగేది భగవంతుడా అని బుద్ది మంతురాలయిన రంగమ్మ లోలోపల మదనపడింది. చివరకు ఎలాగో ధైర్యం చేసి 'గంగమ్మక్కా! నా దగ్గార వీశెడు నెయ్యి అప్పు తీసుకున్నావు. నీవే బాకీ తీరుస్తావని వూరుకున్నాను కానీ, నెలలు గడిచిపోయినా నీవు ఆ ప్రస్తావనే చేయలేదు. మరచిపోయావేమోనని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇంట్లో చుట్టాలొచ్చారు. నెయ్యి అప్పు తీరుస్తావా అక్కా!' అని ఎంతో మర్యాదగా అడిగింది. అది విని గంగమ్మ వెర్రెత్తినట్లు బర్రెగొంతుతో బిగ్గరగా అరుస్తూ పొట్లాటకు దిగింది.

ఆహా! చోద్యంగా వుందే! నేనేమిటి? నీ దగ్గర నెయ్యి అప్పుతీసుకోవడమేమిటి! ఎనిమిది గేదెల పాడి చేస్తున్న నేను ముష్టి రెండు గేదెలతో బతుకుతున్న నీ దగ్గర వీశెడు నెయ్యి అప్పు తీసుకున్నానంటే ఎవడైనా నమ్మే విషయమేనా? ఇక నోరుమూసుకొని ఊరుకో! ఎవరైనా వింటే నవ్విపోతారు. అని రంగమ్మపై విరుచుకుపడింది. ఆమెతో పోట్లాడే శక్తిలేక రంగమ్మ అప్పటికి ఏమీ మాట్లాడకుండా ఊరుకొని తర్వాత మర్యాదరామన్న దగ్గరికి వెళ్ళి విషయమంతా వివరించి గంగమ్మ పై ఫిర్యాదు చేసింది.

మర్యాద రామన్న ఒకనాడు గంగమ్మను న్యాయసభకు పిలిపించాడు. సభలో అడుగుపెడుతూనే గంగమ్మ గణాచారిలా చేతులు తిప్పుకుంటూ పెద్దగా అరవటం మొదలుపెట్టింది. అయ్యా! ఇదేనా మీధర్మం? నన్ను సభకుపిలిపించడం న్యాయమేనా? నాకు ఎనిమిది గేదెల పాడి వుంది. ఈ రంగమ్మ రెండు గేదెలు పెట్టుకొని బ్రతుకుతున్నది. అలాంటిది నేను ఆమె దగ్గరికిపోయి నెయ్యి అప్పు అడిగే అవసరం ఏముంటుంది? ఎవరినయినా చెప్పమనండి. ఇది నమ్మదగిన విషయమేనా? వినడానికే వింతగాలేదూ? నాపై గిట్టక ఆ రంగమ్మ లేనిపోని అబద్దాలు కల్పించి నా మీద ఫిర్యాదు చేసింది. మీరు ఆలోచించి రంగమ్మకు తగిన విధంగా బుద్ది చెప్పండి అని అన్నది రంగమ్మ. మర్యాద రామన్న ఆమె మాటల ధోరణి గమనించాడు. ఆమె మాటలలోని కపటం గ్రహించాడు. తీర్పు వాయిదా వేసి మరునాడు రంగమ్మను, గంగమ్మను ఇద్దర్నీ సభకు రావలసినదిగా ఆదేశించాడు. మరునాడు రామన్న తన న్యాయస్థానం ముందు భాగమంతా అడుసుపోయించి అంతా బురదగా వుండేటట్లు చేయించాడు. సభ ప్రారంభమయ్యే సమయానికి రంగమ్మ, గంగమ్మ వచ్చారు. వారిద్దరూ ఆ బురదలో నడూస్తూ న్యాయసభ దగ్గరకు రావలసి వుంది. అలాగే రంగమ్మ, గంగమ్మ మోకాలి లోతు బురదలో నడుచుకుంటు మర్యాదరామన్న సమక్షానికి వచ్చారు. వెంటనే రామన్న వాళ్ళిద్దరికి బురద కాళ్ళు కడుక్కోవడానికి రాజభటులచేత రెండు చెంబులతో నీళ్ళు తెప్పించాడు.

రంగమ్మ చెంబుడు నీళ్ళలోసగం నీళ్ళతోనే శుభ్రంగా బురద కడుక్కొని ఇంకా సగం నీళ్ళు మిగిల్చింది. కాని గంగమ్మ చెంబుడు నీళ్ళు ఖర్చుచేసినా కాళ్ళబురద పోలేదు. మరో చెంబు నీళ్ళు అందించారు భటులు, రామన్న ఆజ్ఞ ప్రకారం. అలా రెండు చెంబుల నీళ్ళు ఖర్చు చేసినా గంగమ్మకాళ్ళకు బురద పూర్తిగా పోలేదు. అది చూచి రామన్న గంగమ్మతో ఏవమ్మా! రెండు చెంబులునీళ్ళు ఇచ్చినా నీవు నీ కాళ్ళబురద వదిలించుకోలేకపోయావు. కాని రంగమ్మ సగం చెంబు నీళ్ళతోనే శుభ్రంగా బురద కడిగేసుకున్నది. దీన్ని బట్టి నీవు ఎంతటి దుబారా మనిషివో తేలిపోతుంది. నీకు వుండటానికి ఎనిమిది గేదెలు ఉన్నా, నెయ్యితీసి పొదుపుచెయ్యడం నీకు చేతకాదు. దుబారాగా ఖర్చుచేయటం నీకు అలవాటు. నీకు రంగమ్మ దగ్గర వీశెడు అప్పు తీసుకున్న మాట వాస్తవమే! రంగమ్మకు రెండు గేదెలున్నా పొదుపుగా వాడుకొనే మనిషి కాబట్టి నీవు వెంటనే వీశెడు నెయ్యి రంగమ్మకు ఇవ్వు, లేకపోతే నీకు మరణశిక్ష పడుతుంది అని అన్నాడు. గంగమ్మ మారూమాట చెప్పలేకపోయింది. చేసిన తప్పు మర్యాదగా ఒప్పుకొని వీశెడు నెయ్యి తెచ్చి రంగమ్మకు ఇచ్చింది.       
           💦🐬🐥🐋💦

దుష్టులతో స్నేహం

 *✍🏼 నేటి కథ ✍🏼*

*దుష్టులతో స్నేహం*

ఒక రోజు ఓ నక్క నదీ తీరాన్న కూర్చుని భోరు భోరుమని ఎడుస్తోంది. అది విని చుట్టు పక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయిటికి వచ్చి నక్కను “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాయి.“అయ్యో! నన్ను నా బృందంలోని వేరే నక్కలన్ని అడివిలోంచి తరిమేసేయి” అని ఎడుస్తూనే సమధనమిచ్చింది నక్క. పీతలు జాలిగా ఎందుకల జరిగిందని అడిగాయి.

“ఎందుకంటే ఆ నక్కలన్ని మిమ్మల్ని తినాలని పన్నాగమల్లుంతుంటే నేను వద్దన్నాను – మీ లాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి?” అంది నక్క. “ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు” అని అడిగాయి పీతలు. “తెలీదు, ఎమైనా పని చూసుకోవలి” అని దీనంగా జవబిచ్చింది ఆ నక్క. పీతలన్ని కలిసి అలోచించాయి. “మన వల్లే దీనికీ కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి” అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కను తమకు కాపలాకి వుండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకుని కృతఙతలు తెలిపింది. రోజంతా పీతలతో వుండి వాటికి కథలు కబుర్లూ చెప్పి నవ్విస్తూనే వుంది.

రాత్రయి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంత వెన్నెలతో వెలిగిపోయింది.“ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైన విహరించారా? చాలా బగుంటుంది” అని నక్క పీతలని అడిగింది. భయంకొద్ది ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళ లేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీస్కుని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడ బయలుద్యారాయి.

కొంత దూరమెళ్ళాక నక్క మూలగడం మొదలు పెట్టింది. పీతలన్ని ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హటాత్తుగా అడివిలోంచి చాలా నక్కలు బయిటికి వచ్చి పీతల పైబడ్డాయి. పీతలు బెదిరిపోయి అటు ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి. కాని నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి.ఎలాగోలాగ ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతికష్టంగా వాటి కన్నాలను చేరుకుని టక్కుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకుని చాలా బాధ పడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్ధమయ్యింది.

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

బంధాలు అనుబంధాలు

 *బంధాలు అనుబంధాలు*
                          
కూతురు అమెరికాలో
అమ్మ అంబాజీపేటలో
కొడుకు ఇంగ్లండ్ లో
తండ్రి ఇరుకు సందులో
నువ్వు ఇన్ఫోసిస్
నాన్నకేమో క్రైసిస్
నువ్వు వీసాపై ఎక్కడో
అమ్మ అంపశయ్యపై 
నువ్వు రావు, రాలేనంటావు
నిజానికి రావాలని అనుకోవు
టికెట్ దొరకదంటావు
సెలవు లేదంటావు
వస్తే తిరిగి రావడం కష్టమంటావు
నువ్వు వచ్చేదాక
అమ్మ ప్రాణం పోనంటుంది..
నీ రాక కోసం ఆ కళ్ళు 
గుమ్మం వైపే రావని తెలిసినా 
నాన్న అమ్మకు ఆ కబురు చెప్పలేక, కక్కలేక, మింగలేక
మంచం చుట్టూ అటూ ఇటూ
అవతల ఆ తల్లి 
ఇంకాసేపట్లో అటో ఇటో
వయసు వచ్చినప్పటి నుంచి 
డాలర్ డ్రీమ్సే
పొద్దున లేస్తే ఆ ఊసే
నీ కలల వెనకే 
తల్లిదండ్రుల పరుగు
వారి ఆశలన్నీ నీ అమెరికా 
పయనంతోనే కరుగు
బ్రతుకుతెరువంటూ నువ్వక్కడ
గుండె బరువుతో వారిక్కడ
మొదట్లోరోజూ ఓవాట్సప్ కాలు
రెండ్రోజులకో వీడియో ఫోను
పోను పోను కొంత విరామం
ఏంట్రా అంటే వర్కులోడు
అప్పటికే  నిద్ర లేచి ఉంటాడు 
నీలో ఓ మాయలోడు
అక్కడ కొనుక్కున్న కొత్త కారుతో నీ ఫొటో పోజు
ఇక్కడ డొక్కు స్కూటర్ తో
తంటాలే నాన్నకి ప్రతిరోజు
ఈలోగా అన్నీ బాగుంటే 
పెద్దలు కుదిర్చిన పెళ్లి
లేదంటే అక్కడే 
ఓ భామతో మేరేజ్
ఆలికి కడుపో కాలో వస్తే
ఆయాగా అమ్మకి వీసా
నాన్నకి నేను డబ్బులు పంపుతాలే అని భరోసా
ఎంత అమ్మయినా
నీ పిల్లలకు నాన్నమ్మయినా
ఆమె నాన్నకు భార్య
అక్కడ పెద్దాయన 
రోజూ చెయ్యి కాల్చుకుంటున్నాడేమోనని
ఒకటే బెంగ
ఆ దంపతులను 
అలా వేరుగా ఉంచి 
మీ జంట మాత్రం
టింగురంగ
మొత్తానికి అలా అమ్మ అవసరం 
కొంత తీరాక
అప్పుడిక ఆమె ఉంటే బరువు
ఈలోగా ముగుస్తుంది 
ఆమె వీసా గడువు
ఆమె చేతిలో టికెట్
నాన్నకిమ్మంటూ 
ఓ గిఫ్టు పేకెట్
ఇటు నిన్ను వదలి వెళ్ళలేక
అటు భర్తని విడిచి ఉండలేక
చెమ్మగిల్లిన కళ్ళతో
విమానం ఎక్కిన అమ్మకి తెలియదు 
అదే చివరి చూపని
ఊరెళ్ళాక కమ్మేసిన జబ్బు
నీళ్లలా ఖర్చయ్యే డబ్బు
నువ్వు పంపుతావేమో
కాని ఆ వయసులో 
నాన్నకు శ్రమ
నువ్వు వస్తావని అమ్మకి భ్రమ
వచ్చే ప్రాణం పోయే ప్రాణం
చివరకు అనివార్యమయ్యే మరణం
వాడు వస్తున్నాడా ఏమంటున్నాడు
ఊపిరి వదిలే వరకు అదే ప్రశ్నతో అమ్మ
నిర్జీవమైన ఆ కళ్ళలో నీ బొమ్మ
కొరివి పెట్టాల్సిన 
నువ్వు సీమలో
నాన్న కర్మ చేస్తుంటే 
ఖర్మ కాలి చూసేస్తావు లైవ్ లో
అస్తికల నిమజ్జనం అంటూ 
నాన్న కాశీకి పయనం
అంత శ్రమ ఎందుకు
పక్కనే ఉంది కదా 
గోదారని నీ అనునయం 
ఇప్పుడిక నాన్న కథ
ఉన్న ఊరు
కట్టుకున్న ఇల్లు
ముఖ్యంగా ఆ ఇంట్లో 
అమ్మ జ్ఞాపకాలు 
వదిలి రాలేక
ఒంటరి బ్రతుకు ఈడ్వలేక
కష్టాలకు ఓర్వలేక
ఓ రోజున 
ఆయన కధా కంచికి
ఈసారి వస్తావు
కొరివి పెట్టి
ఊళ్ళో ఇల్లు అమ్మేసి
ఉన్న ఊరు, కన్న తల్లి
అన్నిటితో రుణం తెంచుకుని 
నేను ఎన్నారై
మిగిలినవన్నీ 
జాన్తా నై
అంటూ
పుట్టిన గడ్డను వదిలి
పెట్టిన గడ్డకు శాశ్వతంగా వలస
ఇదే కదా చాలామంది వరస.!!

బర్బరీకుడు..!

 🙏🙏🙏ఓం🙏🙏🏼🙏🏽

         *బర్బరీకుడు..!*
మహాభారతంలోని ఓ వింత పాత్ర…  మాయకే బలి..!! ఎన్నిరకాల కేరక్టర్లు, ఎన్ని రకాల తత్వాలు… మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక 
పాత్రలు దర్శనమిస్తాయి… కొన్ని ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి… 
కొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భ్రమలో పడేస్తాయి… దాదాపు అన్ని ఉద్వేగాలకూ మహాభారతమే… మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన కేరక్టర్ ఒకటి ఉంది… తన పేరు బర్బరీకుడు..!

బహుశా ప్రస్తావనపూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో… కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి…  బలిగొన్న మరో మహాభారత పాత్ర ఇది…
నిజానికి భాగవతం అంటేనే కృష్ణుడి చరిత్ర అనుకుంటాం గానీ, నిజానికి భారతం నిండా కూడా కృష్ణుడే… 
తను లేనిదే భారతం లేదు… భారతం లేనిదే కృష్ణుడూ లేడు… 

ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అంటారా..? తను ఘటోత్కచుడి కొడుకు… (ఘటోత్కచుడు ఎవరూ అని అడగకండి… మాయాబజార్ సినిమా చూడని తెలుగువాడు ఎవరున్నారని..?) లక్క ఇల్లు తగులబడ్డాక, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ వనవాసంలో… హిడింబి అనే ఓ రాక్షస యువతిని పెళ్లిచేసుకుంటాడు భీముడు… (ఆ 
కథ వేరు)… వాళ్ల కొడుకే ఘటోత్కచుడు… ఈ ఘటోత్కచుడు ఓ యాదవ రాజు 
మురు బిడ్డ మౌర్వి (అహిలావతి) ని పెళ్లాడతాడు… వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు… నిజానికి తను ఓ యక్షుడు… ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు…

రాజస్థాన్‌లో 
ఖటుశ్యామ్‌జీ పేరిట, గుజరాత్‌లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుడిని… అక్కడి జానపదులు  ఈ పాత్రను అంతగా జనంలోకి తీసుకెళ్లారు. అతను  చిన్నప్పటి  నుంచే తల్లి దగ్గర యుద్ధవిద్యలు నేర్చుకుంటాడు… దేవీ ఉపాసకుడు కూడా… దేవి ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాల్ని వరంగా ఇస్తుంది… ఆ మూడు బాణాల్నే బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు… అందుకే తనను ‘త్రిబాణధారి’ అంటారు… పాండవులు, కౌరవుల నడుమ యుద్ధం అనివార్యం అని తెలిశాక… భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకూ చేరుతున్న వేళ… బర్బరీకుడు ఆ యుద్ధాన్ని చూడాలని కోరుకుంటాడు… వెళ్లే ముందు తల్లికి ఓ మాటఇస్తాడు… ‘‘ఒకవేళ 
నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే మాత్రం… నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను… ఓడిపోయేవారిని గెలిపిస్తాను’’… ధనుస్సు, నీలి గుర్రం, తన మూడు బాణాలు తీసుకుని బయల్దేరతాడు…

యుద్ధం ప్రారంభం కావటానికి 
ముందు ప్రతి యోధుడినీ కృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు… ‘నీకే బాధ్యతలు ఇస్తే యుద్ధాన్ని ఎన్నిరోజులలో ముగించగలవు..?’ ఇదీ ప్రశ్న… 20 రోజులు చాలునని భీష్ముడు అంటే, 25 రోజులు కావాలని ద్రోణుడు చెబుతాడు… 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28 
రోజులు పడుతుందని అర్జునుడు… ఇలా తలాఓరకంగా చెబుతారు… దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు కృష్ణుడు… ఒంటరిగా తనను ఓ బ్రాహ్మణవేషంలో సమీపించి… ‘కృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా, నీకూ ఆ 
ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా..? అని అడుగుతాడు… నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు… కృష్ణుడు 
ఒక్కక్షణం దిగ్భ్రాంతికి గురై, అదెలా సాధ్యం అనడుగుతాడు… తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు… వాటి శక్తి వివరిస్తాడు…

నేను ఒక బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని, వాళ్లందరినీ గుర్తించి పెడుతుంది… (టార్గెట్స్‌ను ఐడెంటిఫై చేస్తుంది)… రెండో బాణాన్ని వేస్తే ఎవరెవరిని 
రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది… మూడో బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్లను విడిచిపెట్టి, మొదటి బాణం మార్క్ చేసిన ప్రతిదాన్నీ ధ్వంసం చేస్తుంది… ఆ బాణాలు మళ్లీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు… నేను నమ్మను, నేనే కాదు, ఈ సృష్టిలో ఎవడూ దీన్ని నమ్మడు… నమ్మలేడు అంటాడు కృష్ణుడు… బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది… ఏదీ, ఆ రావిచెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అంటాడు కృష్ణుడు… చాలా సులభం అంటాడు బర్బరీకుడు… చేసి 
చూపించు అంటాడు కృష్ణుడు…

బాణం వదిలేముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్లుమూసుకుంటాడు బర్బరీకుడు… ఈలోపు కృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద 
దాచిపెడతాడు… ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది… చివరకు కృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది… ఇదేమిటి అనడుగుతాడు అమాయకంగా కృష్ణుడు…
 
నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది… అందుకే అదక్కడకు వచ్చింది, నీ పాదం తీసివేయి, లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్లి మరీ ఆ ఆకును గుర్తిస్తుంది అది అంటాడు బర్బరీకుడు… తప్పనిసరై పాదం తీసేస్తాడు… మరో బాణం వెళ్లి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది… (రక్షింపబడాల్సినవి)… తరువాత బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి, ఒక్క దగ్గర మోపు కట్టేస్తుంది, ఆశ్చర్యంగా చూస్తాడు కృష్ణుడు… ఈ బాణాల శక్తి నుంచి ఎవరినీ దాచలేమనీ, కాపాడలేమనీ అర్థమవుతుంది… అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పుందని, గందరగోళం ఉందనీ గమనిస్తాడు… బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే, కౌరవపక్షాన చేరితే పాండవుల్నితాను కాపాడలేననీ గుర్తిస్తాడు… కలవరపడతాడు… ఒకవేళ భీముడి మనమడు కాబట్టి, 
పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది..? అందుకే దివ్యదృష్టిని సారించి, కొన్ని 
నిజాలు తెలుసుకుని, ఇలా ఓ లాజికల్ సంభాషణ ఆరంభిస్తాడు…
ఏమోయీ, నువ్వు ఎవరు..? నువ్వు కూడా యుద్ధం చేస్తావా..?
నేను ఘటోత్కచుడి కుమారుడిని, యుద్ధం చూడాలని వచ్చాను, చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన 
నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను…పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది… కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణులు… అంటే పాండవులే బలహీనులు కదా…అవును, అయితే నేను పాండవ పక్షాన నిలబడాల్సి ఉంటుంది…
అదే జరిగితే, వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు 
బలోపేతమవుతారు, కౌరవులు బలహీనులు అవుతారు కదా…
అవునవును, తిరిగి నేను 
కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది… కానీ దానివల్ల కౌరవులు బలోపేతులై తిరిగి 
పాండవులు బలహీనులు అవుతారు కదా… మరేం చేయుట..?

ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది… తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటూ స్థిరంగా నిలబడలేనని, అటూఇటూ మారితే చివరకు ఇరుపక్షాలూ సమూలంగా హతమారిపోయి, ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే అనీ, విజేత అంటూ ఎవరూ ఉండరు అని బోధపడుతుంది… కృష్ణుడి వైపు చూస్తూ ఎవరు మహాశయా మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా…

ముందు నాకు ఓ వాగ్దానం చేయి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అంటాడు కృష్ణుడు… అలాగే అని చేతిలో చేయి వేసి చెబుతాడు బర్బరీకుడు… అప్పుడు కృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు… తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు… సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు… ‘‘యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా… ఇంత భారీ జనహనన యుద్ధాన్ని ఓ అత్యంత సాహస వీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం, నిన్ను మించిన యోధుడు లేడిక్కడ, నిన్నెవరూ హతమార్చలేరు, అందుకే నువ్వే నీ తలను తీసి, నాకివ్వు…’ అంటాడు కృష్ణుడు… నన్నే ఎందుకు బలి ఇవ్వాలి, ఇంతమంది యోధులు ఉండగా.., పైగా వాళ్లంతా ప్రాణాలకు తెగించి వచ్చినవాళ్లు కదా అని ప్రశ్నిస్తాడు… అప్పుడు కృష్ణుడు ఇలా చెబుతాడు…

‘‘బర్బరీకా… నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి… భూమి మీద అధర్మం పెరిగిపోయింది, నువ్వే కాపాడాలి విష్ణూ అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు… దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో 
మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను… ఇదంతా వింటున్న నువ్వు ‘ఈమాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి..? నేనొక్కడిని చాలనా’ అని ఒకింత పొగరుగా మాట్లాడావు… దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు… 

‘ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు, మొట్టమొదట బలయ్యేది నువ్వే’ అని శపించాడు… అందుకే నీ బలి… అంతేకాదు, నీ శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు కృష్ణుడు… కానీ నాకు యుద్ధానికి చూడాలని 
ఉంది అంటాడు బర్బరీకుడు… ముందు నీ తలను ఇవ్వు అంటాడు కృష్ణుడు… అప్పుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు… కృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి, మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు…

యుద్ధం ముగిసింది... విజయగర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే 
కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు… వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు కృష్ణుడు… తన కథ చెబుతాడు… భీముడు విలపిస్తాడు…

తరువాత కృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు… ‘‘వత్సా, ఈ మొత్తం యుద్ధంలో ఏ క్షణమేం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే… నువ్వు చెప్పు, ఏం గమనించావో..?’’ స్వామీ, ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని చూశాను… మహాకాళి వేల నాలుకలతో పాపులను బలితీసుకోవటాన్ని చూశాను… ఆ మహాశక్తి, నువ్వు మాత్రమే యుద్ధ కారకులు, యుద్ధకర్తలు… మిగతావాళ్లంతా కేవలం పాత్రధారులు మాత్రమే… అని సమాధానమిచ్చి, తన శాపం ముగిసిపోయి, తిరిగి యక్షరూపాన్ని పొంది ఊర్ద్వలోకాలకు 
వెళ్లిపోతాడు… ఇదీ మహాభారతంలోని బర్బరీకుడి కథ.....!

సర్వేజనా సుఖినోభవంతు....
లోకా సమస్త సుఖినోభవంతు....

ఓం శాంతి శాంతి శాంతిః.....

స్వస్తి.....🙏

అభిమానమే బంధన

 *🕉️🙏మహాభారతంలోని ఓ కథ…🕉️🙏*

            *🕉️🙏అభిమానమే బంధన*🕉️🙏
                 

*ఈరోజు మనం - ఎన్నో పూజలు, భజనలు, సాధనలు, చేస్తుంటాము, అయినా సాధనలో ముందుకు వెళ్లలేకపోతాము, దీనికి కారణం ఏమిటి?*
*ప్రతివారి మనసులో ఉన్న ఒకే ఒక్క ఆలోచన..!*

*దానికి సంబంధించిన…మహాభారతం లోని ఒక చిన్న సంఘటన చూద్దాం..!*


*ఒకానొక సమయంలో రాధ తన చెలికత్తెలను తీసుకొని మధుర నుండి బృందావనానికి బయలుదేరి పడవలో వెళ్లాలని సంకల్పంతో...*
*తెల్లవారక మునుపే లేచారు,గుంపంతా పడవలో కూర్చున్నారు. వంతుల ప్రకారం ఒకరి తరువాత మరొకరు తెడ్లు వేసుకుంటూ నడుపుతూ ఉన్నారు...*

*చాలాసేపు చేసారు ఈ ప్రయాణం !   చేతులంతా నొప్పి వచ్చాయి, తెల్లవారింది, కాని, పడవ మధుర రేవులోనే ఉంది!*

*తెల్లవారింది కాబట్టి మధుర వాళ్ళంతా వచ్చి నీళ్ళు ముంచుకొని పోతున్నారు...*

*అది చూసి ... ఆశ్చర్యంగా ఏమిట్రా దీనికి కారణం? అని చూసుకుంటే,  ఆ పడవ ఒక కఱ్ఱకు కట్టివేయబడి ఉంది,*
*ఆ కఱ్ఱకు కట్టిన త్రాడును వీళ్ళు విప్పలేదు పాపం!*
*అది విప్పకుండా ఎంతసేపు తెడ్లు వేసినా పడవ ముందుకు కదులుతుందా? ఉన్న చోటే ఉంటుంది.*

*"అదేవిధంగా, మనం ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని జపతపాదులు చేసినా అభిమానంతో కట్టిన మనస్సును విప్పకపోతే చేరవలసిన స్థానమును చేరలేము"...*

*"ముందు అహంకార మమకారములనే త్రాడును విప్పాలి, త్యాగం చేయాలి, అన్నివిధాలా బంధవిముక్తి గావించుకున్నప్పుడే పూర్ణమనస్సు ఆవిర్భవిస్తుంది".*

*పూర్ణమనస్సునందు ఎలాంటి దోషములూ కనిపించవు, ఈనాడు మనం దుఃఖానికి గురి అవుతున్నామంటే - ఎవరో దీనికి కారకులు కాదు; మన భావములే కారణం.*

*మన దోషములే మనకు కష్టాల నందిస్తాయి, ఈ సత్యాన్ని గుర్తించాలి, సత్యము, ప్రేమ, సహనము ఇత్యాది సద్భావములను హృదయంలో నింపుకున్నప్పుడు జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది కాని, దుర్భావములతో నింపుకున్నప్పుడు జీవితము మలమూత్ర దుర్గంధములతో కూడిన "వైతరణీనది” గా ప్రవహిస్తుంది...*

*కనుక, ఎవరికి వారు గుర్తించుకోవచ్చు, “నేను సుందరమైన నందన వనమునా? లేక, వైతరణీ నదినా?" అని.*

*దీనిని పరులెవ్వరికీ గుర్తించడానికి వీలుకాదు, ఎవరిది వారికి మాత్రమే తెలుసు*. 
*ఎవరికి వారే సాక్షి, ఇంకొకరి సాక్ష్యం అక్కరలేదు. దీనినే "ఆత్మసాక్షి" అన్నారు. నీవు తప్పు చేసే ఒప్పు చేసినట్లుగా అభినయం చేయవచ్చు.* 

*మన అభినయం లోకానికి మంచిగా కనిపించవచ్చుకాని, లోపల దోషం మనలను ఎల్లప్పుడు హింసిస్తుంది...*🕉️🙏

.          *🕉️🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*🕉️🙏
                       

 *🕉️🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🕉️🙏*

సమస్యకు భయపడితే బంగారం లాంటి అవకాశం కోల్పోయినట్లే!..!!

 🎻🌹🙏 సమస్యకు భయపడితే బంగారం లాంటి అవకాశం కోల్పోయినట్లే!..!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఒకసారి ఒక రాజుగారు రాత్రి ... తెల్లవారు జామున మారువేషంలో వచ్చి రాజమార్గంపై ఎవ్వరికీ తెలియకుండా ఒక పెద్ద బండరాయిని పెట్టారు. తెల్లారేదాకా ఆగి, తరువాత దగ్గరలోని చెట్టుచాటున నక్కి ఏం జరుగుతుందో గమనిస్తున్నారు.

🌸బడాబడా వ్యాపారులు వచ్చారు. రాయిని పట్టించుకోలేదు. పక్కనుంచి వెళ్లిపోయారు.

🌿"రాజుగారి పరిపాలన అధ్వాన్నంగా ఉంది. లేకపోతే రోడ్డు మీద అడ్డంగా బండరాయి ఉండటం ఏమిటి? దాన్ని ఇంత వరకూ తీయించకపోవడం ఏమిటి?' అంటూ తిట్టుకున్నారు.

🌸ఉన్నతాధికారులు అదే దారిన వెళ్లారు. బండరాయిని చూసి "ఎవరక్కడ.... ఇదెవరు చేశారు? వాడెవడో పట్టి కారాగారంలో పడేయండి" అని హుకుం జారీ చేశారు.

🌿అందరూ వస్తున్నారు.... వెళ్తున్నారు. తోచిన నాలుగు మాటలు అంటూ వెళ్లిపోతున్నారు. చివరికి ఒక రైతన్న వచ్చాడు.

🌸అతను బండి దిగి, బండరాయి దగ్గరకు వచ్చాడు. ధోతీ పైకి ఎగకట్టి, శక్తినంతా ఉపయోగించి ఆ రాయిని రోడ్డు పక్కకి జరిపేశాడు.

🌿ఆ బండరాయి కింద ఒక బంగారు నాణాల మూట కనిపించింది. దానిని తీసుకుని రాజాస్థానానికి వెళ్ళి రాజుగారికి సమర్పించి, జరిగిన విషయం చెప్పాడు.

🌸 నిజానికి అది రాజుగారు దాచిందే. రాజుగారు మొదట ఆశ్చర్యపోయాడు. అతని పద్ధతికి, నిజాయితీకి ముగ్ధుడైపోయాడు. సభలో విషయమంతా వివరించాడు. 

🌿అతనిని ఘనంగా సత్కరించి, ఆ సంచిలోని బంగారు నాణేలకు మరికొన్ని కలిపి అతనికి బహూకరించాడు.
తిట్టుకోవడమో లేక ఇతరులకు పురమాయించడమో కాదు.

🌸 సవాలో లేక సమస్యో వచ్చినప్పుడు... భయపడిగానీ, నిర్లక్ష్యంతో గానీ వదిలేయకూడదు. దాని పరిష్కారానికి స్వయంగా పూనుకోవాలి.

🌿సమస్య అనే బండరాయి కింద అవకాశమనే బంగారు మూట ఉండొచ్చేమో!_💰💰..స్వస్తీ..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

మరు జన్మ అవసరమా, ఈ జన్మ చాలదా!

 *మరు జన్మ అవసరమా, ఈ జన్మ చాలదా!* 

ఎవరికీ ఏమీ ఇయ్యని కారణముగా మానవుడు దరిద్రుడై పుడతాడు. 

దరిద్రుడై పుట్టి జీవనము కొరకు చేయరాని పనులు చేస్తూ పాపమును ప్రోగు చేసుకుంటాడు. 

పాప ఫలితమున ఘోర నరకమున పడి భయంకర శిక్షలను అనుభవించి మరలా దరిద్రుడై పుట్టి మరలా పాపాలను చేస్తాడు. 

ఈ చక్రం అనంతముగా తిరుగుతూ ఉంటుంది. కనుక ఉన్నంతలో ఎంతో కొంత పేదలకు, దీనులకు పంచి పెట్టాలి. 

మన శక్తి మేరకు పరులకు సహాయ సహకారాలు అందించాలి. 

భగవంతుడు ఏ రూపము ధరించైనా మన సహాయాన్ని కోరి రావచ్చును. 

మనుష్య రూపం లేదా జంతువులు, పక్షులు ఇలా ఏ రూపంలోనైనా ఆయన మనలను పరీక్షించవచ్చును. అన్నింటికీ మనం సిద్ధపడి ఉండాలి. 

సహాయం చేయగలిగే స్తోమత ఉండి కూడా ఎవరికి కాదు, లేదు అనకూడదు. 

ఎవరికి ఏ సహాయం చేసినా అంతా భగవంతునికే చెందుతుంది అనే భావనతో చేయాలి. 

అదే నిజమైన దైవ సేవ, నిజమైన దైవ సేవ చేసినవాళ్లకు మరుజన్మ అంటూ ఎదీ ఉండదు!.

ఈ జన్మను సార్ధకం చేసుకుందాము.🕉️🚩🕉️

గృహలక్ష్మి ... ఐశ్వర్యమూ అంటే -

 🙏 గృహలక్ష్మి ...
ఐశ్వర్యమూ అంటే -
కేవలం ధన సంబంధిత సంపద మాత్రమే 
అని అనుకోకూడదు. లక్ష్మి మనల్ని విశేషముగా సత్కరించాలి అనుకుంటే ఆ తల్లి ఆడపిల్ల గా ఇంటికొస్తుంది. ఆడపిల్లా అంటే శ్రీ మహాలక్ష్మి 
అని అర్ధం. ఆడపిల్ల పెళ్లయి, అత్తవారింటికి వెళ్ళి 
తన సత్ప్రవర్తనతో, సత్శీలతతో ఇరు -
వంశీకులని తరింపచేస్తుంది. 

మగపిల్లాడికి ఆ అవకాశం లేదు. అసలు ఆడపిల్ల వచ్చిందీ అంటేనే లక్ష్మీదేవి వచ్చిందని. ఆడపిల్ల - అటు వెనక పదితరాలు, ఇటు ముందు పది తరాలను, తండ్రితో కలిపి 21 తరాల వారిని తరియింపచేస్తుంది. 

ఆడపిల్ల ఇంటికొచ్చిందంటే, లక్ష్మి దేవి వచ్చినట్టే. మగపిల్లాడికి పెళ్లయ్యాక ఆ ఐశ్వర్యం ఎవరిదీ అంటే అతనిది కాదు. ఆ ఇంటి ఇల్లాలిది. 

ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీ దేవిని స్తుతించినప్పుడు స్వయంగా తానే చెబుతుంది. తాను ఎక్కడెక్కడు నివాసమై వుండేది! . కైలాసం లో పార్వతీ దేవిగా వైకుంఠం లో లక్ష్మీ దేవి గా బ్రహ్మలోకం లో సరస్వతిగా మహారాజు దగ్గర రాజ్య లక్ష్మి గా ప్రతి ఇంటి ఇల్లాలిలో - గృహలక్ష్మి గా వుంటానని చెబుతుంది. 

'గృహము'  అంటే ఆ ఇంట్లో ఇల్లాలు వున్నప్పుడు మాత్రమే! ఇంటి యజమాని ఎంత అలసిపోనీండి ఇల్లాలి నవ్వుతో, మాటలతో, సేవలతో సేద తీరుతాడు. ఎంత ఐశ్వర్యం వుండనీండీ, 
ఎన్ని కోట్లు వుండనీండీ. ఆమె వెళ్ళిపోయాక 
ఆ ఇల్లు ఆయనకు మనశ్శాంతి ఇవ్వలేదు.

గృహము అంటే మేడ కాదు. భార్యయే గృహము. అందుకే గృహలక్ష్మీ గృహే గృహే అని అంటారు. 

లక్ష్మీ దేవి ని దర్శించడం ఎంత సులువైనదీ 
అంటే, నీ భార్య లో, సాటి వారి ఇల్లాలిలో, 
సోదరి లో చూడవచ్చు. ఈ భావన చాలు. 
లక్ష్మీ కటాక్షం పొందేందుకు ఈ ఒక్క భావన 
హేతువు గా నిలుస్తుంది. 

లక్ష్మీ ఎక్కడెక్కడ నెలవై వుంటుందీ 
అంటే 5 స్థానాలు అని చెప్పింది శాస్త్రం. 

1. గోవు యొక్క వెనకతట్టు:

రోజుకొక్క సారైనా గోవు వెనక తట్టు చూసిన వారు, ప్రదిక్షణ చేసిన వారూ లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంటిముందుకు వచ్చి నిలబడిన 
గో మాతకు చేతులారా పండూ, ఫలమూ, 
పరక ని తినిపించిన వాడు సాక్షాత్తు లక్ష్మీ దేవికి పాయసం తినిపించినంత ఫలాన్ని పొందుతాడు.

2. పద్మం: పద్మము లక్ష్మీ స్థానం. 

3. ఏనుగు యొక్క కుంభస్థలం. 

4. సువాసినీ యొక్క పాపిట ప్రారంభ స్థానం. 

5. మారేడు దళం. 

ఈ ఐదూ లక్ష్మీ నెలవుండే స్థానాలు. 

లక్ష్మీ లోకాన్నంతటినీ చూస్తుంది. 
లోకమంతా ఆమెని చూస్తుంది. 
ఆ తల్లి ఎక్కడ వుంటే అక్కడ సంతోషం వుంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే అర్ధం - సంతోషం గా వుంటమే. అన్నీ వున్నవాని విషాదం కన్నా, ఏమీ లేకపోయినా సంతోషంగా వున్న వాడి దే అసలైన లక్ష్మీకటాక్షం.🕉️🚩🕉️

ఎవరు సంతోషంగా ఉంటారు?

 *ఎవరు సంతోషంగా ఉంటారు?’* 

  తన భోజనాన్ని తాను వండుకునేవారు, అప్పులు లేనివారు, దూరతీరాలకు ప్రయాణించని వారు సంతోషంగా ఉంటారు.

మనిషి ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ ఉండటంలోని ఆనందం మరి దేనిలోనూ రాదు. 

పాశ్చాత్యులు అధికంగా సంపాదించడం ద్వారా తమ జీవిత సమస్యలకు పరిష్కారాలు వెదుకుతుంటే, భారతీయులు ఉన్నదానితో సంతృప్తిగా జీవించడంలోనే తమ జీవిత సమస్యలకు పరిష్కారం కనుగొంటున్నారు అంటారు స్వామి వివేకానంద.
 సహజంగా మనిషి ఆనందస్వరూపుడు. 

అతడికి గతంతోను, భవిష్యత్తుతోను సంబంధం ఉండదు. ఉన్నచోట, ఉన్నక్షణంలో సంపూర్ణంగా జీవించడమే ఆనందానికి మార్గమని గ్రహిస్తాడు. 
అతడు వర్తమానంలోని ప్రతి క్షణాన్నీ సంపూర్ణంగా ఆస్వాదిస్తాడు.
 ఆనందస్వరూపుడైన వ్యక్తి ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ ఏదో ప్రత్యేకత ఉందని తెలుసుకుంటాడు. 
అందుకే ప్రతి వస్తువుపట్లా సమభావం, సమదృష్టి కలిగి ఉంటాడు.
మానవ జన్మ లభించడమే ఒక వరం. అలాంటి జన్మను సార్థకం చేసుకోవడానికి మనిషి ప్రయత్నించాలి. 
మనిషి లోకోత్తర ధర్మాలైన దానం, పరోపకారం, సేవ వంటి దైవీ గుణాలు అలవరచుకుని ఆర్తులను ఆదుకున్నప్పుడే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాడు.
 మానవసేవ మధురమైన పరిమళం లాంటిది. ప్రతి మనిషీ ఇతరుల వెతలను దూరం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు లభించే సంతోషం వర్ణనాతీతం.
 ఆ సేవే మనిషికి మరిచిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఇస్తుంది. 
మనిషిని మహానుభావుడిని చేస్తుంది!

మంచి స్నేహితుడెవరు?

 *✍🏼 నేటి కథ ✍🏼*


*మంచి స్నేహితుడెవరు?*

చాలాకాలం క్రిందట మంచితెలివితేటలు, వివేకం ఉన్నఒకరాజు ఉండేవాడు. అతడి పేరుప్రతిష్టలు ఇతరరాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును, పారితోషికంపొందేదుకూతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమతెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు. తాను తయారుచేసిన మూడుబొమ్మలనుకూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆమూడు బొమ్మలనూ రాజు ముందు ఉంచుతూ "రాజా ఈ మూడుబొమ్మలనూ, , జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైనబొమ్మో, ఏది వికారమైనబొమ్మో, ఏది అందంగా కాక, వికారంగాకాక ఉన్నదో పరిశిలించి చెప్పండి." అని ప్రార్ధించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు ఆమూడు బొమ్మలనూ చేత్తో పట్టుకొని పరిశీలించాడు. ఆమూడుబొమ్మలూ ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులోకూడా సమంగా ఉండటం, అన్నింటిపోలికలూ ఒకేలాఉండటం రాజు గమనించాడు.
ఆ మూడుబొమ్మల్లో ఎల్లాంటివ్యత్యాసాన్ని అతడు. ఆమూడుబొమ్మలనూ జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒకబొమ్మ రెండుచెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒకసూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలొ ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరోచెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది. మరొబొమ్మచెవిలో మరియూ నోటిలో రంధ్రముండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడుదూరచినసూది నోటిగుండా బయటకు వచ్చినది. మూడవబొమ్మకు ఒక్కచెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చేడలేకపోయడు ఆచెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తానుచేసిన తెలుసుకొనిన చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి "మీరు చాలాతెలివిగలిగిన కళాకారులు" అని అభినందించాడు. ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈమూడు బొమ్మలద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఈ మూడుబొమ్మల మూడురకాల మిత్రులను గురించి చెబుతున్నాను. మనకష్టాలను సహనుభూతితో వింటూ, మనరహస్యాలను కాపాడుతూ, మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడను మనము ఆశించాలి.
ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డస్నేహితుడను గురించి చెబుతుంది. మీరు మీకష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటిని వింటున్నాట్టూ అభినయిస్తాడు. కానీ అతడు నిజంగా వినడు. అతడు ఏఒక్కరికీ ఎలాంటి సహాయం చేయడు. చెవిద్వారా విన్నది మరో చెవిద్వారా వదిలి వేస్తాడు. రెండవరకం స్నేహితుడికి ఈ రెండవరకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది. మీరహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు. కాని ఇతడు చాలా ప్రమాదకరమైనవ్యక్తి మీరహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడుతనలో మనరహస్యాలను దాచడు. ఈ మూడవబొమ్మే చాలా ఉత్తమమైనది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పేమాటలను అతడు చాలా ఓపికతో శ్రధతో వింటాడనీ మీరునమ్మకంగా నమ్మవచ్చును. మీరహస్యాలను అతడు తనలో భధ్రంగా తనలో దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు. రాజుగారి మాటలు, విశదీకరణ ఆ కళాకారుడికి బాగానచ్చినాయి. అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు.

*నీతి: మీస్నేహితుల రహస్యాలను బయటపెట్టకండి.*

*🎣సేకరణ:

భగవంతుడిని చూడగలుగుతాం..!

 *ఒకతనికి దేవుణ్ణి చూడాలన్న కోరిక కలిగింది.*

*అతను ఎన్నోతీర్థయాత్రలు చేశాడు.*

*ఎన్నో పురాణాలు, గ్రంధాలు చదివాడు.*

*కానీ అవి ఏవీ అతనికి తృప్తి ఇవ్వలేదు. అతని కోరిక తీరలేదు.*

*భగవంతుడిని వెతుకుతూ అతను ఒక చోటి నుండి మరొక చోటికి తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు.*

*ఒక చలికాలం సాయంత్రం వేళ అతను ఒక ముసలవ్వ పొయ్యిలో కర్రలు కదుపుతూ ఉండడం చూసాడు. అస్తమానూ ఆ బొగ్గులపైన బూడిద కప్పి వేస్తున్నది. ముసలవ్వ తన చేతిలోని చువ్వతో బొగ్గులను కదుపుతూ వాటిపైన బూడిదని రాల్చి వేస్తున్నది. ఆమె అలా చువ్వతో కట్టెలను కదుపుతూ, వాటిపైన బూడిదను నెట్టి వేస్తుండడం అతను శ్రద్ధగా గమనించాడు. ఆమె బూడిదని తీసినప్పుడల్లా మరింత ఎక్కువగా ఉండడం కూడా అతను చూస్తున్నాడు.*

*మర్నాడు అతను ఒక చెట్టు కింద కూర్చుని అలసట తీర్చుకుంటూ బాగా ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడిని చూశాడు.” ఓ సూర్యుడా ! నీవు ప్రపంచం అంతటినీ గమనిస్తూ ఉంటావు కదా. దేవుడు ఎక్కడ ఉంటాడో నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది. దేవుడు ఎక్కడ దాక్కున్నాడు ? అన్నిచోట్లా ఆయన కోసం వెతికాను కానీ నాకు ఎక్కడా కనిపించలేదు” అన్నాడు.*

*ఇంతలో ఒక మేఘం అలా వస్తూ సూర్యుడిని కప్పివేసి కనబడకుండా చేసింది. కొంతసేపటి తరువాత మబ్బు దాటిపోయింది. సూర్యుడు మళ్ళీ మరింత కాంతివంతంగా, ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించాడు.*

*ఆ మనిషి నిట్టూరుస్తూ ”ఎప్పటికైనా నేను దేవుడిని చూడగలనా ?” అని అడిగాడు.*

*నాచుతో పూర్తిగా నిండి ఉన్న ఒక చెరువు పక్కనే అతను నడుస్తూ వెళ్తున్నాడు.*

*కొంతమంది గ్రామస్థులు ఆ చెరువులోని నాచును తొలగించి చెరువును శుభ్రం చేసే పని చేస్తున్నారు. "ఈ మురికి నాచును చెరువులో ఎవరు వేశారు ?” అని ఆ వ్యక్తి గ్రామస్థులను అడిగాడు. “ఎవరూ వెయ్యలేదు. నీటిలో నుండే నాచు పుట్టి పెరుగుతుంది. ఎక్కువ కాలం నీరు ఒకచోట నిలవ ఉంటే ఆ నీటిలో నాచు పెరుగుతుంది.*

*ఇప్పుడు మేము ఆ నాచునంతా తొలగించి శుభ్రం చేస్తున్నాము కనుక త్వరలోనే చెరువు తేటగా, శుభ్రంగా తయారవుతుంది అన్నారు గ్రామస్తులు.*

*ఆ మనిషి ఇదంతా తలుచుకుని ఆలోచించసాగాడు.*

*నాచు నీటిలో నుండే వచ్చింది కాని అది ఎంత దట్టంగా పెరిగి నీటిని కప్పివేసిందంటే అదంతా తొలగిస్తేగాని నీరు శుభ్రపడి పైకి కనిపించలేదు.*

*అలాగే సూర్యుని వేడి వలన ఏర్పడే మేఘాలు ఆ సూర్యుడినే కప్పివేసి సూర్యప్రకాశాన్ని బయటకు కనిపించకుండా చేస్తున్నాయి. గట్టిగా గాలి వీచి మేఘాలు చెదిరిపోయినప్పుడు మళ్ళీ సూర్యుడు మనకి కనిపిస్తున్నాడు.*

*అదే విధంగా నిప్పు నుండే బూడిద ఏర్పడుతున్నది. కాని ఆ బూడిద నిప్పును కప్పివేసి ఇంచుమించు ఆరిపోయేలా చేస్తున్నది. బూడిదను తొలగించినప్పుడు మళ్ళీ నిప్పు రాజుకుని మంట కనిపిస్తున్నది.*

*పైన చెప్పిన ప్రతి ఉదాహరణలోనూ నీరు, నిప్పు, సూర్యుడు ఇంతకు ముందే ఉన్నాయి. కొత్తగా ఏర్పడలేదు, కాని అవి కనబడాలంటే మనం కూడా కొంత ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది.*

*స్పష్టంగా చూడడానికి అతను ప్రయత్నం చేసినప్పుడు అతనికి సత్యం బోధపడింది..!*

*ప్రపంచమనే దుప్పటిని కప్పుకోవడం వలన మనిషి తాను ఎక్కడ నుండి వచ్చాడో మరచిపోతున్నాడు.*

*ప్రపంచం అనే దుప్పటిని పక్కకి తొలగించి హృదయంలోకి తొంగి చూస్తే భగవంతుడిని చూడగలుగుతాం..!*

*సర్వే జనా సుఖినోభవంతు*
🙏🏼🙏🏽🙏🏼

రెండు శరీరాల కలయిక

 [5/27, 20:08] +91 92473 43585: 
రెండు శరీరాల కలయిక - సంయోగము
నీతో నీ కలయిక - యోగము

➡️ మొదటి కలయిక -  క్షణికానందము.
➡️ రెండవ కలయిక - అనంత బ్రహ్మానందము.


[5/30, 20:24] +91 92473 43585: సృష్టిలో ఒక్కొక్క దానిని పట్టి, దాని మూలాన్ని కనుగొంటానంటుంది - Science.

మొత్తం సృష్టికే మూలాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా చెబుతుంది - Spiritual Science.


[5/31, 19:41] +91 92473 43585: శిష్యుడు:- నా నిజరూపం ఏమి?
సద్గురు:- నేను ఫలానా అనుట - తొలికల్పన
 ఆ పైనివన్నీ - తదుపరి కల్పనలే.

 ఏ కల్పనకు తావీయక నీవు నీవుగా ఉండటమే నీ నిజరూపం.

కల్తీ కల్తీ

 కల్తీ కల్తీ

 కొంతకాలం క్రితం వరకు వివాహాలకి విందులకు వంటవారిని పిలిపించి ప్రత్యేకమైన వంటల్ని దగ్గరుండి మరీ చేయించేవారు. శాస్త్రీయమైన దేశవాళీ వంటకాలతో విందు అద్భుతంగా ఉండేది. అందరి దగ్గర ధనం పెరిగింది ప్రక్క వారి కంటే మనం ఘనంగా చేయాలని రెట్టింపు ఐటమ్స్ ఆకులో వడ్డించాలని తపన  పెరిగింది.. విచిత్రమైన పేరుతో కూరలు వచ్చి చేరిపోయాయి. నెమ్మదిగా వంటలు చేయించే ఓపికలు వడ్డించే ఓపికలు తగ్గిపోయి క్యాటరింగ్ సాంప్రదాయం చొచ్చుకుని వచ్చేసింది. పదులు దాటి వందలు దాటి వేల మీద ఈ బిజినెస్ లో బతికే వారు ఎక్కువ అయిపోయారు.
 క్యాటరింగ్ వ్యాపారం పోటీ బిజినెస్ గా తయారైన దగ్గర నుంచి "కొద్దిమంది వ్యాపారుల మినహా" మిగతా వారంతా  ఆహారాల్లో భారీ ఎత్తున కల్తీలు మొదలయ్యాయి. మనం వండే ఆహార పదార్థాలు మనుషులతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా తింటారని విజ్ఞానాన్ని, విచక్షణ కోల్పోయి  కేవలం రూపాయి మీద వ్యామోహానికి చేయని కల్తీ అనేది లేదు.
 ప్రస్తుతం క్యాటరింగ్ లోనూ అన్ని  హోటల్స్ లోనూ శాఖాహార మాంసాహార పదార్థాలు వంటకాల్లో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు
 1.ముందుగా పదార్థాలు రంగులు రావడానికి వివిధ రంగుల యశన్స్ వాటిలో కలుపుతున్నారు.
2.రుచి పెరగడం కోసం టేస్టింగ్ సాల్ట్ అనే కెమికల్ ని కలుపుతున్నారు. అసలు ఈ కెమికల్ అమ్మడానికి ఏ కిరాణా కొట్టుకి కూడా లైసెన్స్ లేదు.అత్యంత ప్రమాదకరమై రసాయన మిశ్రమం టెస్ట్ సాల్ట్. కిడ్నీలు పోవడానికి అవకాశం ఎక్కువ
3. పలావ్ వాసన రావడం కోసం వాసన వచ్చే ఎసెన్స్ ని వివిధ కంపెనీలు తయారు చేసేవి తెచ్చి అందులో పోస్తున్నారు.. ఒక డేసా పలవకు ఒక బాటిల్ ఎసెన్స్ కలిపినట్లయితే ఆ పలావ్ వాసన సుమారు ఐదు నుంచి పది మీటర్ల వరకు వ్యాపిస్తుంది. ఇది క్యాన్సర్ కారక మిశ్రమం.

4 వంటకు వాడే రిఫండ్ ఆయిల్  బ్రాండెడ్ డబ్బాలో ఉన్నప్పటికీ కేజీ 30 లేదా 40 రూపాయలకు వచ్చే ఆయిల్ ను వాడుతారు. ఇందులో కాటన్ ఆయిల్ ఒకటి ఉంటుంది
 అంటే ఇది గతంలో భారీ ఉష్ణోగ్రత దగ్గర వంటలు చేసి మిగిలిపోయిన ఆయిల్ సుమారు 3 గంటల నుంచి 4 గంటలు మరిగిన ఆయిల్ ని ఇతర పదార్థాలకు వాడకూడదని ఒక నిబంధన ఉంటుంది.. అలా వాడిన ఆయిల్ ని మళ్ళీ తిరిగి కొని వీరు వంటలకు వాడేస్తుంటారు. రెండవ రకం పశు వ్యర్ధాల నుంచి అనగా పశువుల చర్మాలు బాగా ఉడకబెట్టిన తర్వాత దాని నుంచి వచ్చే తెట్టు నుంచి ఆయిల్ తయారు చేసి అమ్ముతారు. ఈ రెండు రకాల ఆయిల్ కూడా కారుచవకగా  అందుతాయి. దాంతో కాంపిటీషన్ మార్కెట్లో తక్కువ చేయడం కోసం లాభాల కోసం ఇటువంటి వ్యర్ధాలను వాడుతారు.
5. ఇందులో రాత్రి పొద్దున మిగిలిపోయిన ఆహారపదార్థాలు క్యాటరింగ్ వెనక్కి పట్టుకు పోయే సిస్టమ్ ఉంటుంది. ఈ మిగిలిపోయిన పదార్థాలు మళ్ళీ ఫ్రెష్ అప్ చేసి మర్నాడు వాడుతారు. లేదా కర్రీ పాయింట్ లో పెట్టి అమ్మకాలు జరుగుతాయి.
6. పన్నీరు కూడా పూర్తిగా పాలతో కాకుండా విచిత్రమైన పదార్థాలతో కూడా తయారు చేస్తున్నారు పాలపొడి తో కూడా వాడుతున్నారు
 ఈ పైన చెప్పిన విధానాలన్నీ హోటల్లో,  ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, డాబాలు, స్ట్రీట్ ఫుడ్స్ చోట్ల  సాగిపోతుంది. అడ్డుకోవలసిన ప్రభుత్వ అధికారులు కనీసం కన్నెత్తి  అయినా చూడరు.ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు.
 దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి?
 ఈ కల్తీ రసాయనాల ఆహారాలు తినడం వల్ల మనిషికి  లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ  క్యాన్సర్ వ్యాధుల్లోకి దిగుతున్నారు. మరియు చిన్న పిల్లల మీద ఈ కల్తీ ఆహార పదార్థాల వల్ల  మెదడు మీద ప్రభావం చూపించి, విచిత్రమైన పరిస్థితుల్లో వారు ఉంటారు ఎవరు ఏమి చెప్పినా వినకపోవడం, అతిగా స్పందించడం, చేస్తున్న పని మీద శ్రద్ధ లేకపోవడం, శరీరంలో ఊబకాయ లక్షణాలు పెరగడం, మందకొడిగా ఉండడం లక్షణాలు పిల్లల్లో వస్తాయి. వారి విద్యా దశ పాడవుతుంది. సరే అధికారులకు చెప్పిన పట్టించుకోవటం లేదు కనీసం భగవంతుడికేనా చెబుదామని దేవాలయానికి వెళ్తే తిరిగి భగవంతుడు నాతో చెప్పిన మాట నేనెవరికీ చెప్పుకోను నాకు తెచ్చే పూజా సామాగ్రి తేనే, తెల్ల శుద్ధపొడం కి రంగులేసి  పసుపు కుంకుమ,విభూది, గంధం పొడిఅని,   గొడ్డుకొవ్వు ను పసుపు రంగు వేసి అవునేయ్య అంటూ నా మీద పోస్తున్నారు.. ఇంకా చెప్పాలంటే ఇచ్చే తీర్థంలో కూడా సుగంధ ద్రవ్యల  పౌడర్ కలిపి కల్తీ తీర్థం ఇస్తున్నారు. ఇచ్చిన అరటి పళ్ళు నిండా కెమికల్ రంగులు కొట్టి తింటే క్యాన్సర్ వచ్చేలా తయారుచేసిన పండ్లు నైవేద్యం పెడుతున్నారు అని భగవంతుని మాటలు వినేసరికి ఏం చేయాలో అర్థం కాక అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. . ఏ భగవంతుడు కూడా ఈ కల్తీ దుర్మార్గుల్ని అరికట్టలేకపోతున్నాడు
 పుట్టే బిడ్డలు బుద్ధి మాన్యంతో, లోపాలతో, బాల్యంలోనే క్యాన్సర్లతో మన బిడ్డలు సమస్యలను ఎదుర్కొంటున్నారు...
" సాధ్యమైనంత వరకు నయానా భయానా బిడ్డలకు బయట ఆహార పదార్థాలు తినకుండా చూసుకోవడమే  పరిష్కార మార్గం
అని అనిపిస్తోంది
కనీసం మీ దగ్గరేనా పరిష్కారం ఉంటే సూచించండి

Tuesday, May 30, 2023

లక్ష్మీ నివాసం

 ------------------------------------
          *లక్ష్మీ నివాసం*
-------------------------------------

 ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవి తో ఇలా  అంటాడు 

"ప్రజలలో ఎంత భక్తి పెరిగింది ...  అందరూ నా కరుణ కోసం "నారాయణ నారాయణ" అని నా నామం జపిస్తున్నారు
 
 ఈ మాటలు విని  లక్ష్మీదేవి
 " అది మీకోసం కాదు నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది.
 
అలా అయితే  జనులంతా లక్ష్మీ లక్ష్మీ అని ఎందుకు
జపించటం లేదు అని అంటాడు నారాయణుడు.
 
అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు అని అంటుంది లక్ష్మీదేవి.

సరే అని అంటాడు నారాయణుడు.
 
              **
 
నారాయణుడు ఒక  బ్రాహ్మణ రూపం ధరించి
ఒక గ్రామం లోని గ్రామాధికారి ఇంటి తలుపు తట్టుతాడు.

 గ్రామాధికారి తలుపు తెరిచి,  మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు?"  అని అడుగుతాడు.

నాపేరు లక్ష్మీపతి.
 నేను వైకుంఠం అనే వూరి వాడిని.
నేను మీ నగరంలో 
హరికథ చెప్పాలని అనికొంటున్నాను 
అని అంటాడు.
 
 దానికి గ్రామాధికారి అలాగా 
మా గ్రామ ప్రజల మహాభాగ్యం. హరికథ విని పుణ్యం సంపాదించు కొంటారు. మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు నా ఇంట్లో ఉండండి  అని 
అంటాడు.

 గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై అన్ని సన్నాహాలు చేస్తారు.
 
  మొదటి రోజు పది మంది  
వస్తారు.

  రెండవ మరియు మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోటానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ 
వుంటారు.
 
 ప్రజల అనన్య భక్తి చూసి 
నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు.
 
 ఇదంత గమనించిన 
  లక్ష్మీ మాత ఒక  వృద్ధురాలిగా మారి  ఆ గ్రామానికి వచ్చి అప్పడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళుతున్న 
ఒక స్త్రీతోని దాహం గా వుంది నాకు కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డా అని అడుగుతుంది.

 అమ్మా, సమయం  సాయంత్రం 5.00  అయింది నేను హరికథ వినెందుకు వెళుతున్నాను అని అంటుంది.
 
 "నాకు కొన్ని  మంచి నీరు ఇవ్వు తల్లీ   చాలా దాహం వేస్తుంది. నీకు అమితమైన పుణ్యం లభిస్తుందని వృద్దురాలి రూపం లో వున్న 
లక్ష్మీమాత దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది.

 లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబు గా మారుతుంది.
 
  అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి ఎంత మహిమగల తల్లివి నీవు.
నీకు ఆకలి వేస్తుందేమో వుండు కంచం లో  నీకూ అన్నం పెడతాను
అని అంటుంది. ఆ కంచం కూడ బంగారంది అవుతుంది అన్న ఆశతో.
 
  లేదు బిడ్డ నాకు ఆకలిగా లేదు. నీ హరికథకు  సమయం అవుతుంది అని
అక్కడనుంచి వెళ్లుతుంది.
 
 ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుపక్కల ఉన్న  మొత్తం ఆడవారికి  చెబుతుంది.
  అది వింటునే  హరికథ వింటున్న స్త్రీలందరు మధ్య లోనే  లేచి వెళ్లిపోతారు.

 మరుసటి రోజు నుండి హరికథ కు వచ్చేవారి సంఖ్య గణనయంగా తగ్గడం తో 
లక్ష్మీపతి  భక్తుల  సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు.
 
 అప్పుడు ఎవరో అంటారు 'ఒక మహిమ గల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైన వెళ్లి ఏ వస్తువులో ఏమి తాగిన, తినిన  ఆ వస్తువు బంగారంగా మారుతుంది. అందువలన  భక్తుల సంఖ్య తగ్గింది అని అంటాడు.
 ...
 లక్ష్మీదేవి వచ్చిదని నారాయణుడికి అర్థం అవుతుంది.

ఇది వింటునే ఆ గ్రామాధికారి 
కూడ అక్కడి నుండి మెల్లగా జారుకొని ఆ వృద్దురాలి దగ్గర కు పోయి
 "అమ్మా, నేను హరికథ  నిర్వహిస్తున్నాను అటవంటిది మీరు నా ఇంటిని  ఎందుకు విడిచిపెట్టారు అని అడుగుతాడు.

 అప్పుడు లక్ష్మీమాత ఇలా అంటుంది 
"మీ ఇంటికే  నేను మొదట వచ్చాను!   మీ ఇంట్లో హరికథ చెప్పేవారు  వుండటంతో నేను రాలేదు.  అతను వెళ్లిపోయాకనే నేను వస్తాను.

 ఓస్ ఇంతేనా తల్లీ నేనిప్పడే  వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడ నుండి
తన ఇంటికి వస్తాడు.
 
 ఆ రోజున  హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన    వెంటనే,  గ్రామాధికారి ఇలా అంటాడు
"మహారాజ్, మీరు మీ పెట్టేబేడ సర్దుకొండి.  ఇప్పటి నుండి  మీరు ధర్మశాలలో వుండండి. అక్కడ మీకూ ఏర్పాట్లు పూర్తయ్యాయి 
అని అంటాడు.

అప్పుడు లక్ష్మీపతి మాట్లాడుతూ,"హరికథ పూర్తి అయ్యెందుకూ   ఇంకా రెండు, మూడు రోజులు మిగిలి ఉన్నాయి.  ఇక్కడనే ఉంటాను అని అంటాడు.

 లేదు - లేదు, మీరు త్వరగా వెళ్లండి.  నేను వినను.  మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు
 
 ఇంతలో లక్ష్మీమాత  వచ్చి, గ్రామాధికారిని  మీరు కొంచెం బయటకు వెళ్లండి.  నేను వారితో మాట్లాడుతాను అని
అంటుంది.

  "ప్రభు నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నావా నీ భక్తులు నీకోసం కాదు నాకోసం మీనామం జపిస్తున్నారని
అని నవ్వుతూ అంటుంది.

 భగవంతుడు నారాయణుడు ఇలా అన్నాడు, "అవును ఇదంతా నీ ప్రభావం. కానీ నీవు కూడ   ఒక విషయాన్ని అంగీకరించాలి. నీవు నాకోసం వైకుంఠం విడిచి వచ్చావు.

 ఎక్కడ అయితే నాకథలు చెప్పుతారో, భజనలు చేస్తారో (లక్ష్మి) ఖచ్చితంగా అక్కడనే నీవూ వుంటావు అని అంటాడు నవ్వుతూ.

 ఇలా అని నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు.

నారాయణుడు బయలుదేరిన తర్వాత, మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు.  

ప్రతి ఒక్కరి ఇళ్లలోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు, కానీ ఇది ఏమిటి అని అంటారు.

 లక్ష్మీ మాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరికీ తో ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అని అనటంతో

 అందరూ ఒకేసారి 
అమ్మా, ఎందుకు అలా చేస్తున్నారు. మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు.

  నారాయణుడు ఎక్కడ వుంటే అక్కడనే నా నివాసం.మీరు నారాయణుడిని పంపించారు. అందుకే నేనుకూడ ఆయన దగ్గరకు 
పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది.


 దేవుని స్మరణ ఉన్నచోట.
 అక్కడ లక్ష్మి నివసిస్తుంది.
 లక్ష్మి వెంట పరిగెత్తే వారికి లక్ష్మీ నిలవదు మరియు లక్ష్మీపతి దొరకడు.
         జై శ్రీమన్నారాయణ🙏

Monday, May 29, 2023

ఆడ పిల్లలు మరియు వారి తల్లిదండ్రుల ఒక అభ్యర్థన (Small Request)

 ఆడ పిల్లలు మరియు వారి తల్లిదండ్రుల ఒక అభ్యర్థన (Small Request) ఈ కాలంలో చాలా మంది వారి పిల్లలకు దాదాపు చాలా సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లిళ్లు చేయడం లేదు కారణం ఆడపిల్లలు ఊద్యోగాలు చేయడం ఒకటి. రెండవది ఆడపిల్లల తల్లిదండ్రులకు కోరికలు పెరగడం ఒకడే అబ్బాయి వుండాలి అత్త మామలు వుండకూడదు Software జాబ్ ఉండాలి నెలకు లక్షలో జీతాలు రావాలి లేదా వాటాకు 5 నుండి 6 కోట్లు ఉండాలి. మరొకటి  తల్లితండ్రులు వాళ్ల ఫ్రెండ్స్ లేదా చుట్టాలు అమ్మాయికి Sowft ware అల్లుడు వచ్చాడు మాకు కూడా S.w అల్లుడు కావాలని ఏదురు చూడటం. Software job చేసే వాళ్లు కేవలం 100 లో 25% ఉంటే మిగతా 75% మంది వ్యాపారులు మరియు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారే ఏక్కువ. ఈ కోరికలు కారణం. ఆడపిల్లలును పై చదువులు చదివి jobs చేస్తున్నారు. ఇదీ తప్పుకాదు. కానీ మీరు చేసే పెద్ద  తప్పు ఎంటో మీకు తెలుసా? మీ పిల్లలు భవిష్యత్తు తారలును మీరే నాశనం చేయడం లేదా మీ పిల్లలు నాశనం చేసుకోవడం. అది ఏలాగు అంటారా? చాలా సంవత్సరాలు కూడా పెళ్ళి చేయకపోవడం దాని వలన సంతాన సమస్యలు  ఏదురు అవుతాయీ అప్పుడు దేవుడు గూళ్ళ డాక్టర్ చుట్టూ తిరుగుతారు. మనం చేసే తప్పులకు దేవుడని నిందిస్తున్నారు. ఇది ఎంత మార్కు రైట్. మరొకటి మీకు ఏదైనా వ్యాపారం వుంటే మీ  షాపులో పనిచేస్తున్న గుమస్తాకి 15000/- ఇస్తే వేరే గుమస్తా 10000/- లకి వస్తే మీరు ఏమి చేస్తారు? పాత వాడిని పొమ్మన్న లేక పోగాపెడతారు రేపుభవిష్యత్ లో S.W పరిస్థితి కూడా అంతే. ఇంకా సంతానం విషయంకి వస్తే (Next generation) తరువాత తారలు ఏర్పడే అవకాశం వుండదు. మరో 2 or 3 పిల్లలు వుండకూడా వారికి కూడా ఇదే సమస్య తలెత్తే అవకాశం వుంది. తాత అమ్మమ్మలకు 50 నుంచి 60 సంవత్సరాలు వస్తాయి. మీ మనమడు లేదా మనవరాళ్లు సాన్నం (నీళ్ళు) పోసే ఓపిక కూడా మీకు వుండదు. వారి functions & పెళ్ళిలు కూడా మీరూ చూసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదే ఆడ పిల్లలు మీకు 35 సంవత్సరాలకు సంతానం అందినది అనుకునం మీ పిల్లలు మీ చేతికి వచ్చే సమయం 25 సంవత్సరాలు. అంటే(35+25=60) సంవత్సరాలు మీరు కూడా ఏటువంటి శుభకార్యలు చేయలేరు. ఇలా చెప్పుకుంటూ వుంటే చాలా వున్నాయి. కావున మీ కోరికలు పక్కన పెట్టి అబ్బాయి మంచి వాడు ఐతే పెళ్ళి  చేయండి మీ వంశం భవిష్యత్తు వృద్ధి  చేయండి.

చాలా మంది ఆడపిల్లలు మరియు మగపిల్లలు బయోడేటా పెడుతున్నారు కానీ ఫోన్ నెంబర్ ఉన్న ఫోన్ చేసుకొనే పరిస్థితి లేదు యెందుకు కంటే అబ్బాయి వాలు  ఫోన్ చేస్తే అమ్మాయి  వారు ఆస్తుల & జీతాలు చాలాకా ఏక్కడా కాదంటారో అని భయం. అదే అమ్మాయి వారు అవసరం అయితే అబ్బాయి వారే చేస్తారు అనే దైర్యం. ఫోటోలు చూడటం తప్పా ఫోన్ చేసుకొనే పరిస్థితి లేదు. అమ్మాయిల మీరు ఒకసారి ఆలోచించి చూడండి. మీ వయస్సును బట్టీ మీ చిన్నప్పుడు స్కూల్ నుండి ఇప్పటి దాకా ఎంత మంది అబ్బాయిలు software చేశారు ? మీ స్కూల్ to కాలేజీ  ఫ్రెండ్స్ ఇతర caste వారు ఎంత మంది పెళ్లిళ్లు చేసుకోకుండా వున్నారు? మీ భవిష్యత్ మీరే నాశనం చేసుకుంటున్నారు. కావున ఇప్పుడేనా మీలో మార్పు వచ్చి మీ భవిష్యత్ బాగుండులని కోరుకుంటున్నాను 

 💐   మనకు మంచి *అనిపించింది* మాత్రమే చేయాలి..!! *కానీ* మంచి *అనిపించుకోవడం* కోసం చేయకూడదు నీ చుట్టూ ఉన్న వాళ్ళ *స్థానం,స్థాయి* మారితే నిన్ను *మర్చిపోతారేమో* అయినా కూడా నువ్వు *నీలానే* ఉండాలి *స్థానం* మారినా *స్థాయి* మారినా అదే *వ్యక్తిత్వం* అంటే.

    మన వల్ల *ఇబ్బంది* పడే వారికి మనం *దూరంగా* ఉండటం కూడా ఒక *రకంగా* వాళ్ళ *సంతోషానికి* మనం కారణం అవుతాం ఎందుకంటే *కలిసి* ఉండి ఇబ్బంది పెట్టడం కంటే *దూరంగా* ఉండి వాళ్ళని సంతోషము పెట్టడమే చాలా *మంచిది.*

   ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది *గౌరవమే* దాన్ని సంపాదించుకోవాలే తప్ప *పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో* కొనుక్కోలేము ! ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా *ఉంటుంది* కానీ మనుష్యుల *నిజ ప్రవర్తన* అర్ధమౌతున్న ప్రతిసారి *క్రొత్తగా* కనపడుతుంటుంది..!

    చెట్టును నరికేయడం చాలా *సులభం* కానీ  అదే చెట్టు *పెరిగి, పెద్దది* కావాలంటే *జీవితకాలం* పడుతుంది..!! అలాగే *కోపంతో* ఒక *మాట* అనేయడం చాలా *సులభం*. కానీ *క్షణ* కాలంలో *జారే* ఆ మాట ఒక *బంధాన్ని* తెంచేస్తుంది. 
🙏

మీ వ్యక్తిత్వాన్ని, అభివృద్ధి పరుచుకోవటానికి మానసిక శాస్త్రజ్ఞులు, మనో విశ్లేషకులు, రూపొందించబడిన "పుస్తక రాజములు" ప్రతి ఒక్కరూ కొని చదువుకోండి! వాటి వివరాలు మీ కొరకు:

 🙏🙏🙏🙏🙏🙏
👍👍👍👍👍👍"
   " మీ వ్యక్తిత్వాన్ని, అభివృద్ధి పరుచుకోవటానికి
మానసిక శాస్త్రజ్ఞులు, మనో విశ్లేషకులు, రూపొందించబడిన 
"పుస్తక రాజములు"
ప్రతి ఒక్కరూ కొని చదువుకోండి!  వాటి వివరాలు మీ కొరకు:
      🙏🙏🙏

🦜"సమర్పణ & సేకరణ:
MAZUMDAR BANGALORE Karnataka
87925-86125.
       👍👍👍
🇮🇳1)" స్ఫూర్తి "- మొత్తము పేజీల సంఖ్య:
రచన :"స్వామి వివేకానంద"
పుస్తకములు లభించు స్థలము:
శ్రీరామకృష్ణ మఠం
దోమలగూడ
హైదరాబాద్-29.

🇮🇳" 2)" వ్యక్తిత్వ వికాసము"
P: 117, స్వామి వివేకానంద,
రామకృష్ణ మఠం ప్రచురణలు.

🇮🇳"3)" యువశక్తి"
( యువతలో శక్తి ఉద్దీపన- మార్గదర్శకాలు)
పేజీలు: 85, "స్వామి చింత్యానంద"
రామకృష్ణ మఠం ప్రచురణ.

🇮🇳"4)" ధీర యువతకు"
"To the brave youth"
స్వామి వివేకానంద, 
పేజీలు: 333, రామకృష్ణ మఠం ప్రచురణ. ( కొటేషన్స్)
          🧤🧤🧤
" విశాలాంధ్ర ప్రచురణలు"

🧤" 5)" ఫస్ట్ క్లాస్ లో పాస్ అవటం ఎలా?
పేజీలు: 76.
జి .వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర

🧤"6)" జ్ఞాపక శక్తికి మార్గాలు" పేజీలు: 60
జి .వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర

🧤"ఆ) మానసిక సమస్యలు పరిష్కారాలు.
అట్లూరి , రచన, పేజీలు:


🧤"7)" వైజ్ఞానిక హిప్నాటిజం" ,పెజీ:184
 B.V.పట్టాభిరామ్,
విశాలాంధ్ర,

🧤" 8)" నిత్యజీవితంలో సైకాలజీ" పేజీలు:
అట్లూరి వెంకటేశ్వర్లు, 
విశాలాంధ్ర

🧤"9)" నిత్య జీవితంలో ఒత్తిడి -నివారణ" పేజీలు: 91, PV Krishna Rao.
విశాలాంధ్ర ప్రచురణ.
      🔥🔥🔥

"మోహన్ పబ్లికేషన్స్, ప్రచురణలు"
www. Mohan publications.com.
కోట గుమ్మం, అజంతా హోటల్ ఎదురుగా,
రాజమండ్రి-1.

🔥"10)" బాడీ లాంగ్వేజ్-
  శరీర భాష" పేజీలు: 80

🔥"11" కలిసి జీవిద్దాం"
( వ్యక్తిత్వ వికాస విజయ మాల) పేజీలు: 50.
రచన: మైత్రేయ,
94402-05180
98851-38117.
మోహన్ పబ్లికేషన్స్

🔥12)" విజయం మీది"
మైత్రేయ, పేజీలు: 42
(వ్యక్తిత్వ వికాస విజయాలు) 2012 లో
మోహన్ పబ్లికేషన్స్,RJY ప్రచురణలు

🚩" నవ సాహితీ" బుక్ హౌస్ ప్రచురణ, 
విజయవాడ.

🚩"13" స్వీయ భావన వికాసము" పేజీలు: 103
( Psychology of self concept) P.V .Krishna Rao. నవ సాహితీ బుక్ హౌస్.

🚩"14)" మిమ్మల్ని మీరు గెలవగలరు." పేజీలు: 161, యండమూరి వీరేంద్రనాథ్ రాసిన
నవ సాహితీ బుక్ హౌస్.

🙏"15)" మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే" పేజీలు: 112, "యండమూరి" రచన, 

🙏"16)"మీరు మారాలనుకుంటున్నారా?
బి.వి పట్టాభిరామ్, పేజీలు:.     ," ఎమెస్కో ప్రచురణ,"

🙏17)" మనస్తత్వశాస్త్రము"
   ముక్తినూతులపాటి 
గోపాలకృష్ణ శాస్త్రి, పేజీలు: 700.

🙏18)" బాడీ సైకాలజీ"
     కంఠనేని రాధాకృష్ణమూర్తి, పేజీలు: 240.

🙏19)" మానసిక శక్తులు"
   పేజీలు: 120, దేశ సేవ ప్రచురణ, ఇందిరా నగర్ హైదరాబాద్-590,1985 లో ప్రచురణ.

🙏20)" విజయ పథం"
పేజీలు: 56, నిత్య పారాయణ గ్రంథం.
రచన :సాగర సింధూరి
MSR publications
Arundelpet, VZA-2
93953- 66240.

🙏"21)" నీలో ఇద్దరూ"
( మహోన్నత వ్యక్తిత్వ వికాస గ్రంథము)
రచన :సాగర సింధూరి
78931- 34545.

🙏'22)" మాట- మన్నన"
పేజీలు: 71, గొర్రెపాటి వెంకటసుబ్బయ్య.
దేశీయ ప్రచురణ, 1959లో

🙏" 23)" ప్రచారం పొందటం ఎలా"?
పేజీలు: 189, గోవిందరాజు చక్రధర్,
Media home publications.

🙏"24)" పిల్లల శిక్షణా సమస్యలు". పేజీలు: 224, శ్రీ. కె వేదాంత చారి
M.A( Lon) M.ed( Osmania)

🙏25)" ఎలా చదవాలి?"
పేజీలు: 50, మన్నన గిరిధర్ రావు,. యువ భారతి ఎడ్యుకేషనల్ సొసైటీ, కృష్ణ నగర్, గుంటూరు-6


🙏"26)" నవీన విద్య"
  పేజీలు: 187, దశక సూర్య ప్రకాశరావు,
సర్వోదయ గాంధీ సాహిత్య ప్రకాశన్ సమితి.
హైదరాబాద్.

🙏"27)" విశ్వనాథ నవలలు" ( మనస్తత్వ చిత్రణ) పేజీలు: 262,
డాక్టర్ మాముదాల వెంకటేశ్వరరావు,
ప్రేమతత్వంపై 2001 లో
డాక్టరేట్ పొందినది.

🙏"28)" పాటల ద్వారా ప్రేరణ" పేజీలు: 23 ,
మంచి పాటలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి.

🙏"(29)" మనోవిజ్ఞాన శాస్త్రము- పరీక్ష" పేజీలు: 170.

🙏30)" రిలాక్స్- రిలాక్స్" 
   ( వ్యక్తిత్వ వికాసము)
పేజీలు: 129, కంఠం నేని రాధాకృష్ణమూర్తి,  
నిహాల్ పబ్లికేషన్స్, హైదరాబాదు.

🙏(32)" విద్యా- మనోవిజ్ఞాన శాస్త్రము"
పేజీలు: 332,  Dr. A.S. Ramakrishna,
N.E.P.  New yara publications, Guntur-6.

🙏"33)" wonder memory techniques.
Pages:( లక్షలాదిమందిని మెమరీ జీనియస్సులుగా మార్చుతున్న పుస్తకం/) పేజీలు: 42, సాగర్ సింధూర, కార్తికేయ పబ్లికేషన్స్, అరండల్ పేట, విజయవాడ.

🙏34) " నీ గమ్యం తెలుసుకో" పేజీలు: 81,
( మీ గుండెల్లో నిండి ఉన్న అద్భుత శక్తిని మేల్కొల్పి మిమ్ములను లక్ష్యం వైపు నడిపించే ప్రేరణ)
M.A Satish Yodha,
91-789 313 4545.
Vidyasagar , svs@ gmail.com.

🙏35)" మీరు" శ్రీ "లు,
( సక్సెస్ సాధనకు 30 సూత్రాలు) పేజీలు: 217
అద్దంకి శ్రీధర్ బాబు,I.A.S
ప్రస్తుతం గుంటూరు కలెక్టర్.

🙏"36)" మేదో వికాసము" పేజీలు: 105
( ప్రత్యామ్నాయ దృక్పథం)
D. పాపారావు, కృష్ణా పబ్లికేషన్స్, హైదరాబాదు.

🙏37)" మనసు శరీరాలపై పరిసరాల ప్రభావం" పేజీలు: 125
1918, ప్రచురణ,
పరానంది జగన్నాథ స్వామి గారు,M.A,L.T
రాజయ్య కాలేజీ పర్లాకిమిడి.

మరికొన్ని
38)" సమగ్ర జీవితానికి సరికొత్త సూత్రాలు"

39)" పనిలో ప్రతిభకు సూత్రాలు.

40)" ప్రేమ సూత్రాలు"

41)" సిరిసంపదలకు సువర్ణ సూత్రాలు"

42)" నిర్వహణ సామర్థ్యానికి నిర్వచన సూత్రాలు.
B.S.C. publishers and distributors.

43)" జీనియస్"-- బీ.వీ పట్టాభిరామ్"

44)" ఈ పాపం ఎవరిది?"
   పాలపర్తి జ్యోతిష్పతి ( ఆరుగురు స్త్రీల వాదనలు)

45)" పుస్తకం కష్టపడి చదవకూడదు ఇష్టంగా చదవాలి"( బి .వి. పట్టాభిరామ్.)

46)" రహస్యం" ప్రముఖ విదేశీ నవలకు తెలుగు అనువాదం. రూ.352/-
"రోండా చైర్న"

47)" నేను సహితం"
(బి.వి. పట్టాభిరామ్)

48)" ఇక మీ జీవితం మీ చేతుల్లో ఉంది. ( అరవింద రెడ్డి, K house publications.)

49)"భారతీయ వ్యక్తిత్వ వికాసం" (మురళీకృష్ణ కస్తూరి,)

50)" మంచి వక్తలు కావటం ఎలా?"
డాక్టర్ బ్రహ్మానందరెడ్డి.

51)" unposted letter,
( పోస్ట్ చేయని ఉత్తరం)
Mahitra Rao.

52)" Think and grow Rich"( ఆలోచించండి- ఐశ్వర్యవంతులు కండి) నెపోలియన్.హిల్ --132/-రూ.

53)" విశ్వంలోని నగ్నసత్యాలు" ఇ.వి నాగేంద్రప్రసాద్.

54)" నిర్వహణ సామర్థ్యానికి నవీన సూత్రాలు" రిచర్డ్  టెంప్లర్"
Rs.225/- పేజీలు: 221,

55)" సమగ్ర జీవితానికి సరికొత్త సూత్రాలు.

56)" పనిలో ప్రతిభకు సూత్రాలు"

57)" సిరిసంపదలకు సువర్ణ సూత్రాలు'

58)" మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందడం !
పేజీలు: 80,  రూ.30/-
బి.వి. పట్టాభిరామ్

59)" కమ్యూనికేషన్స్ మీ విజయానికి పునాది"
పేజీలు :80, రూ.30/-

60)" ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడం ఎలా? పేజీలు: 62,
ఎర్రమిల్లి బుచ్చిబాబు,
M.A ( Lit) ,M.A socialogy, P.G.D.P.R

61)" 21 వ శతాబ్ది వ్యాపారం," రాబర్ట్
టీ. కియీసాకి. పేజీలు: 159, రూ.225/-

62)" మ్యాథ్ మ్యాజిక్"
పేజీలు: 72, ఎమ్మెసో ప్రచురణ

63)"ఆందోళన చెందకు ఆనందంగా జీవించు"
డేల్ కార్నే గీ, పేజీలు: 319, Rs.225/-

64)" సంపద సృష్టించే రహస్యం" - వాల్లాస్. డి.లాటిల్స్"- 174/-

65)" హౌ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. & ఇన్ఫ్లుయెన్స్ పీపుల్  బై పబ్లిక్ స్పీకింగ్.  -- డెల్ కా ర్నేగీ-- రూ.147/-
( ధైర్యము ,ఆత్మవిశ్వాసం పెంచుకోవడం ఎలా)

66)" సంపదలు మీ హక్కు" ( డా!! జోసెఫ్ మర్ఫీ) రూ.89/-

67)" ది  ప్రాఫిట్" ( ఖలీల్ జిబ్రాన్) రూ.99/-

68)"సుప్త చేతనాత్మక మనసు కున్న శక్తి" ( జోసఫ్ బర్ఫీ).     రూ.157/-

69)" గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు."
( డేవిడ్ షార్ట్స్, పీ.హెచ్డీ)

70)" ప్రశ్న లే సమాధానాలు" ( విలన్ ఫీజ్) రూ. 166/-
( నెట్వర్క్ మార్కెటింగ్ లో
ఉన్నత స్థాయి కి)

71)" మీ ఉప చేతన మనసు యొక్క శక్తి" 149/-రూ.

72)" బోలీవియా  డైరీ"
     ( చేగువేరా) ప్రజాశక్తి బుక్ హౌస్, రూ.190/-

73)" బాబిలోన్ లోని అత్యంత సంపన్నుడు"
(జార్జి. ఎస్. క్లాసన్)
రూ.149/-

74)" మీ జీవితాన్ని- మీ వృత్తి ని ఆనందంగా ఎలా అనుభవించాలి" 
( డెల్ కార్నిగి) రూ.149/-

75)" మిలియన్ మైండ్- ధనవంతుల ఆలోచనలు రహస్యాలు" ( టి . హార్వే ఎకర్) రూ.212/-

76)" మీపై నమ్మకం ఉంచండి."( డాక్టర్ జోసెఫ్ మర్ఫీ) రూ.145/-

77)" మీరు విజయాన్ని సాధించగలరు." ( శివ కేరా) రూ.279/-

78)" ది. 5. A. M. క్లబ్
( రాబిన్ శర్మ) రూ.255/-

79)" అటామిక్ హ్యాబిట్స్"
( ఆ కెళ్ల శివప్రసాద్) 
జీన్స్ క్లియర్ పుస్తకమునకు తెలుగు అనువాదం. రూ.279/-

80)" చురుకుగా తయారవ్వండి" ( బ్రియంట్రేసి) రూ.170/-
( ప్రతి రంగంలోనూ అత్యంత విజయవంతమైన అధిక వేతనం పొందే వ్యక్తులు ఆలోచించుతారు,  ప్రవర్తిస్తారు)

సదరు పుస్తకాలు, అమెజాన్ లో, దొరుకుతాయి. లేదా హైదరాబాద్" కోఠి" నందు
పుస్తక విక్రయశాలలో సంప్రదించండి.  సైకాలజీ బుక్స్ అని అడగండి. 
మా సభ్యులను ఉన్నతంగా తీర్చుటకు గాను, ప్రత్యేక శ్రద్ధతో,
సమాజములోని యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వగలవు. ప్రభుత్వ ఉచితాల కొరకు
ఎదురు చూడకండి! ఉన్నతంగా జీవించండి! తల ఎత్తుకొని బతకండి.


బీ.వీ పట్టాభిరామ్, యండమూరి నవలలు, వ్యక్తులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతాయి.  
 వాయిదా వేయకుండా పుస్తకాలు కొనండి.   అంతే శ్రద్ధతో వాయిదాలు వేయకుండా చదవండి.
మీ ఆలోచన సరళి, భాషా చాతుర్యము, మీ ప్రజ్ఞ పాటవాలు, పెంచుకోండి!
తెలుగు చదవడం రానీ
విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, ఇంగ్లీషులో
లభించు ప్రముఖ పుస్తకాలు, మానసిక నిపుణులు, దేశ విదేశాలలోని వారి, రచనలు మరొకసారి ముచ్చటించుకుందాం!

" ఇంకా తెలుగులో "అద్భుతమైన పుస్తకాలు"
ఉన్నవి.  పై పుస్తకాలను, శ్రమకోర్చి సంపాదించండి!
డబ్బుని ఎవరైనా దోచుకుని పోతారు.
కానీ ఈ "విజ్ఞాన గని" మీ మెదడులో సురక్షితంగా ఉంటుంది.   సమాజానికి, స్వార్థం విడిచిపెట్టి "సేవా దృక్పథం" తో కూడి, మీయొక్క విజ్ఞాన సంపదను పంచగలిగిన వారు
 మాత్రమే! విజేతలు కాగలరు.  మీ కలలు సకారం చేసుకోవాలని,
కోరిక ,పట్టుదల, తపన ఉన్నవారికి ఉద్దేశించి,
పై పుస్తకాలు, జాబితా ఇవ్వబడినది.  నా చిన్నతనములో నవలా సాహిత్యంలో, డిటెక్టివ్ పుస్తకాలు ఉండేవి.
ఇలాంటి ఉత్తమమైన పుస్తకాలు చదివిన వారికి మాత్రమే మెదడు పదులు పెట్టి, సంస్కారవంతమైన,
హుందాగా, జీవితాన్ని గడపగలరు.   జీవితంలో వచ్చిన వైఫల్యాలను, ఎదుర్కోవటం ఎలా?
"ఆత్మ నున్యతా" భావంతో, ఆత్మహత్యలు చేసుకునే వారికి, ఈ పై పుస్తకాలు, దిక్సూచి లా ఉపయోగపడతాయి.
మనిషిని ఉన్నత స్థాయికి,
జేరాలనుకునే వారు మాత్రమే చదవండి!
మిగతా వారికి ఇవి రుచించవు.  
    సదా మీ సేవలో,
మజుందార్,
 బెంగళూరు.87925-86125.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Friday, May 26, 2023

 దేహం - అణువుల సముదాయం.

మనస్సు - ఆలోచనల సముదాయం.

బుద్ధి - అవగాహనల సముదాయం.

ఆత్మ - అనుభవాల సముదాయం.


--------------------------------------

శుకుడు జనకుని ప్రార్ధించి తనకు పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించమని కోరారు. "అయితే గురుదక్షిణను ముందుగానే నాకు ఇచ్చి వేయాలి" అన్నారు జనకులు. శుకుడు ఆశ్చర్యపోయాడు.

'బ్రహ్మ జ్ఞానం కలిగిన తర్వాత నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వలేవు'. ఎందుకంటే ఆ స్థితిలో గురు శిష్యుల బేధం తొలగిపోతుంది అన్నారు జనకులు. 
ఏకాత్మతత్వం అంటే ఇదే.

---------------------------------------

ఆకాశంలో విహరించే ఒకానొక "మేఘం" కిందకి దిగివచ్చి ఒకానొక "చెరువు"లా మారినప్పుడు...
 అక్కడ మేఘంలోనూ, ఇక్కడ చెరువులోనూ నీరే ఉన్నట్లు.,

దైవత్వంతో నిండిన మనం పైలోకాలలో ఉన్నప్పుడూ మనమే, భూలోకంలోనూ ఉన్నప్పుడు మనమే.

ఇంటికి పెద్ద దిక్కు ఉండాలి. .....కావున పెద్దలు ఓ తప్పు జరిగిన చోట వుంటే ఆ పాపం వారి ఖాతాలో కూడా వేస్తారు.

 *🌹ఇంటికి పెద్ద దిక్కు ఉండాలి🌹*

ఇంటికి పెద్దదిక్కు వుండాలి అంటారు.. ఎందుకంటే *నాలుగు మంచి మాటలు చెప్పడానికి మరియు ఎవరైనా తప్పు చేస్తే ఖండించడానికి* మాకు పెద్ద దిక్కే వద్దు, మంచి చెప్పే వాళ్లు వద్దు అని అంటే ఆ కుటుంబం ఎటు పోతుంది..  కళ్లు గానక ఊభిలోనికి కూరుకుపోతారు..

*ఇదే దుర్యోధనుని విషయంలో జరిగింది.*    దుర్యోధనునికి తల్లిదండ్రులు ప్రేమ వలన చెప్పలేక పోయారు. విదురుడు మంత్రిత్వం వలన చెప్పలేక పోయాడు. భీష్ముడు పాపం తాత గారు, చనువు ఎక్కువ అయినా ఎన్నో సార్లు చెప్పి చూశాడు కానీ ఆయన్నీ లెక్క చేయలేదు.. చివరికి సర్వం నాశనం!    రాజ్యమే కూలిపోయింది..

*🍁పెద్దలు లేని సంసారం, కుటుంబం ఏమవుతుందో తెలుసుకోవాలి🍁..* 

నూరుగురు కౌరవులు ఏమయినారో మనం గుర్తుంచుకోవాలి. 

*ధర్మాన్ని చెప్పేవాడు* *ఓక్కడైనా వుండాలి  అదే* *ధృతరాష్ట్రుని*
*గొప్పతనం*...
*ధృతరాష్ట్రుడు విదురుడ్ని ప్రక్కన బెట్టుకొన్నాడు*, *అందుకనే ఆయనకు శ్రీకృష్ణ విశ్వరూప దర్శనం లభించింది*. 

అదే శకుడ్ని దగ్గర పెట్టుకొన్న దుర్యోధనడు యొక్క స్థితి మనకు తెలుసు..

*దుర్మార్గుడైనా సరే ఓ మహాత్ముడ్ని, మంచి వాడ్ని చెంత పెట్టు కోవాలి.. దీనిని మనం బాగా పట్టుకోవాలి.
అదే ధర్మరాజు విషయంలో చూడండి.. అందరి మాట విన్నాడు, ఆయన మాట ఆయన తమ్ముళ్లు విన్నారు. ధర్మ ప్రవర్తనతో బ్రతికారు.

*దుర్యోధనుడు ఎవ్వరి మాట వినలేదు. తల్లిదండ్రుల మాట వినలేదు. గురువుల మాట వినలేదు. పెద్దల మాట వినలేదు. శ్రేయోభిలాషుల మాట వినలేదు. భగవంతుడి మాట కూడా వినలేదు చివరికి ఏమైయాడు*?

మంచి చెప్పే వాళ్లను బ్రతిమలాడికో నైనా తెచ్చు కోవాలి. *"అయ్యా మీరు మార్గ నిర్ధేశకులుగా ఉండండి, అధ్యక్షులుగా వుండండి, పెద్దలుగా వుండండి మాకు!"*  అని ప్రాధేయపడి వుంచుకోవాలి. *పెద్దవాళ్లను వుంచు కున్నందు వలన కుటుంబాలకు, సంస్థలకు, సభలకు గౌరవం లభిస్తుంది.*

*చెడ్డవాళ్లను డబ్బులు ఇచ్చి అయినా వదిలించు కోవాలి అంటారు*.. రాజు చెడ్డవాడు అయినా మహా మంత్రి మంచివాడుగా, ధర్మం చెప్పేవాడుగా వుండాలి.. అప్పుడే ఆ రాజు, ప్రజలు పది కాలాలు పాటు చల్లగా వుంటారు.. 

*ధర్మం చెప్పే పెద్దలు లేనందువలన లేదా చెప్పినా వినక పోవడం వలన సమాజం దెబ్బతింటుంది*.

ఎవడికి వాడు నేనే పెద్ద అంటే ఎలాగా? అలాంటి జ్ఞానవంతులు వుంటేనే ఓక్కోసారి పొరబాట్లు, తప్పులు జరిగిపోతూ వుంటాయి..

*అయ్యా శ్రీకృష్ణా! నేను ఏమి తప్పుజేసానని? అని భీష్ముడు శ్రీకృష్ణుల వారిని అడుగుతాడు*.

*ఓ తప్పు జరిగేచోట పెద్దలు వుండటమే తప్పు* అని అంటాడు. 

*ఓ తప్పును చూస్తూ ఖండించకుండా, అక్కడ నుంచి వెళ్లిపోకుండా మౌనం వహించి చూస్తూ వుండటమే భీష్ముడు చేసిన తప్పు*.

*ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు ఏమీ చేయలేక అక్కడే వుండిపోయాడు*
*అదే విదురుడు చూడకుండా వెళ్లి పోయినాడు*.

కావున పెద్దలు ఓ తప్పు జరిగిన చోట వుంటే ఆ పాపం వారి ఖాతాలో కూడా వేస్తారు. 

*అందువలన చెప్పిన మాట విననప్పుడు పెద్దలు ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు*.

*🙏ఇది విజ్ఞులు చేసే పని.🙏*

🌺🍀🌺🍀🌺

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అది పరాశక్తి కథ...!!

 🎻🌹🙏బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అది పరాశక్తి కథ...!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿 శివుడు జననమరణాలుకు అతీతుడు....
కాలతీతుడు అనగ కాలమునకు వశము కానివాడు.. అందుకే సదాశివుడు అంటాము...

🌸 అంతయు శివుడే అందుకే ఆందరు దేవతలు శివారదకులే.విష్ణువు, బ్రహ్మ మరియు ఇతర దేవతలు సదా శివలింగారధన చేస్తుం టారు.....

🌿 పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభ వం....అది విష్ణువు, బ్రహ్మ లకు కూడా అసంభవం....
అందుకే పరమశివుడు అంటారు 

🌸 మరొక ఇతిహాసములో.. "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చింది. అది
పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీదేవి. అప్పుడు రాజరా జేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది.... 

🌿అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడ వలసిందిగా కోరింది....మొదట ముగ్గురూ
 నిరాక రించారు 

🌸 ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తన ని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు..

🌿.అది, తనను ఆది పరాశక్తిని వివాహమాడి న అనంత రం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి.... అందుకు 
ఆ అది శక్తి అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రము ను ఇచ్చింది. 

🌸అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి, 
ఆ భస్మరాశిని మూడు భాగలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడు

🌿అప్పుడు సరస్వతి ని బ్రహ్మ , విష్ణవు లక్ష్మిని ,శివుడు పార్వతి ని వివాహం ఆడి ఎవరి సృష్టి పాలన వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు.. స్వస్తీ..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

ప్ర : మంత్రాన్ని బయటకు కాకుండా, మనసులో జపించడం శ్రేష్ఠమంటారు. మరి లలితా సహస్రనామస్తోత్రం కూడా మనసులోనే చదవాలా?

 *ప్ర :  మంత్రాన్ని బయటకు కాకుండా, మనసులో జపించడం శ్రేష్ఠమంటారు. మరి లలితా సహస్రనామస్తోత్రం కూడా మనసులోనే చదవాలా?*
జ : మంత్ర జపం బాహ్యం, ఉపాంశువు, మానసికం, సగర్భం - అని నాలుగు విధాలు. బయటకు జపించడం అధమం. అయితే హోమం, అర్చన సమయాల్లో మంత్రాన్ని బయటకు పఠిస్తారు. జపంలోనే బాహ్యం పనికిరాదు. పెదవి కదుపుతూ జపించడం ఉపాంశువు. ఇది మంచిదే. దీనిని మధ్యమం అంటారు. క్రమంగా మానసికంగా మంత్ర జపం చేయగలగాలి. ఇది ఉత్తమం. అదేవిధంగా సగర్భ జపం కూడా ఉత్తమమైనదే. ఉచ్ఛ్వాస  నిశ్వాసలతో కలిపి, మౌనంగా మంత్రాన్ని జపించడాన్ని  'సగర్భం' అంటారు. ఇది మహాసిద్ధిని చేకూర్చుతుంది.లలితా సహస్రనామస్తోత్రం బయటకు చదివినా తప్పులేదు. నామం, స్తోత్రం  - వీటిని ఎలా చదివితే మనకు తృప్తి కలుగుతుందో అలా చదువుకోవచ్చు. అది బాహ్యమైనా, మానసికమైనా కావచ్చు.

🌷🌷🌷🌷🌷

మానవజన్మకు సదుపయోగమంటే ఏమిటి?

 *మానవజన్మకు సదుపయోగమంటే ఏమిటి?*

మన జీవితాలను ఆహార, నిద్రలకు పరిమితం చేసుకుంటే మనకు ఇతర ప్రాణులకు తేడా ఏమీ ఉండదు. వజ్రాన్ని బెల్లం కొట్టే రాయిగా, ఉప్పును పొడిగా నూరే రాయిగా వాడుకున్నట్లు అవుతుంది తప్ప వాటి విలువ గ్రహించలేము. అందువలన ఈ మానవజన్మ ఆహారం తీసుకుని నిద్రపోవడానికి మాత్రమే లభించలేదని మనం గ్రహించాలి.
అందువలన మనకు లభించిన ఈ జన్మలో ఒక విషయాన్ని సాధించాలి. ఈ మానవజన్మ లక్ష్యం అది కావాలి. అయితే ఏమి సాధించాలి. ధనం సంపాదించాలా? అధికారాన్ని సంపాదించాలా? అవి కావలసినవే. ధనం, అధికారం, సంపద, విద్య, బలం అన్నీ కావలసినవే. అవి మనకు ప్రధాన లక్ష్యం కాదు. మన ప్రధాన లక్ష్యం వేరే ఉన్నది. ప్రధాన లక్ష్యాన్ని సాధించటానికి ఇవి తోడ్పడితే మంచిదే. 
ఉదాహరణకు ఒకాయన యజ్ఞం చేయాలనుకుంటాడు. దానికోసం ధనం, మనుష్యులు, యాగవేదిక మొదలగునవి కావాలి. వాటిని మనం సంపాదించాలి. అయితే అతని లక్ష్యం మాత్రం వాటిని సంపాదించటం కాదు. యజ్ఞం చేయటం అతని లక్ష్యం. ఈ వస్తువులను సమకూర్చుకుని యజ్ఞం చేయాలి. ఈ జీవితంలో ధర్మాచరణకు కట్టుబడి ఉండాలి. మానవ జన్మను ధర్మాచరణకు ఉపయోగించాలి. అలా ధర్మాచరణకు ఉపయోగించకపోతే మానవ జన్మవృథా.
ఇతర ప్రాణులుగా జన్మిస్తే ధర్మాచరణ కుదరదు. ఏమి చేయగలం? ఇతర ప్రాణులు ధర్మాన్ని అనుసరించలేవు. అలా జన్మిస్తే దేవుని పూజించగలమా? యజ్ఞయాగాలు చేయగలమా? పేదలకు అన్నదానం చేయగలమా? పాఠశాలలను ప్రారంభించగలమా? వేదాధ్యయనం చేయగలమా? ఏమీ చేయలేం. మానవజన్మలో మాత్రమే ధర్మాచరణ సాధ్యమవుతుంది, ఇతరులకు సహాయం చేయటం సాధ్యపడుతుంది. మానవ శరీరం, వివిధ అవయవాలు, సద్బుద్ధి ఇతర ప్రాణులకు లేవు. అది పరమేశ్వరుని సృష్టి, ఉదాహరణకు మనకు నాలుక ఉన్నది. దాని కారణంగా మనం మాట్లాడగలం. ఎంతసైపైనా మాట్లాడగలం. పశువులు అలా మాట్లాడగలవా? లేదు. మనకు కరములున్నాయి. కమలాక్షుని అర్చించగలం. పశువులు అర్చించగలవా? అలా మన శరీరం, అవయవాలు, ఇంద్రియాలు, ధర్మాచరణకు వీలుగా సృష్టించబడ్డాయి. ఈ విధమైన శక్తి ఇతర ప్రాణులకు లేదు. మానవశరీరం మాత్రమే ధర్మాచరణకు వీలుగా సృష్టించబడినట్లు, మానవ జన్మ మాత్రమే ధర్మాచరణకు తగినది. 
ఇప్పుడు మనం ధర్మాచరణలో గడపకపోతే, మరో జన్మ కూడ మనకు మానవజన్మే లభిస్తుందని నమ్మకమేమిటి? మనకు మానవ జన్మ లభించినా ఈ శరీరం శాశ్వతం కాదు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు. అంతే. ఆ తరువాత ఈ శరీరాన్ని వదలిపెట్టవలసిందే. దాని గురించి మనం ఏమీ చేయలేం. అందువలన ఎంతో కష్టంతో లభించిన ఈ మానవ శరీరం నుండి నిష్క్రమించే ముందు, లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఏదో ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించటం తెలివిగల వ్యక్తి కర్తవ్యం. దీనికి చక్కటి ఉదాహరణను చెప్పారు. ఒక నదిని దాటటానికి ఒక పడవ కావాలనుకున్నాడొకాయన. కాని పడవ అంత సులభంగా దొరకనందున దానిని తానే కొనాలనుకున్నాడు. ఎంత డబ్బు ఖర్చయినా పరవాలేదనుకున్నాడు. చివరికి పడవను కొన్నాడు. పడవను కొన్న తరువాత నదిని దాటాలి కదా! కాని నదిని దాటటానికై కొన్న పడవకు చాల ఖర్చు పెట్టినందున తన లక్ష్యాన్ని మరచిపోయి, నదిపై విహారం చేయసాగాడు. కొద్ది రోజులకు ఆ పడవకు రంధ్రమేర్పడింది. అప్పుడు పడవలో నదిని దాటటం కష్టం కదా. చిన్న రంధ్రమున్నా పడవలో నీళ్ళు ప్రవేశిస్తాయి. పడవ మునిగిపోయింది. అందువలన తెలివి ఉన్నవాడు కొన్న పడవలో సాధ్యమైనంత త్వరగా నదిని దాటుతాడు.
అలాగే ఈ మానవ శరీరాన్ని కూడ జీవించియున్నంత కాలం సక్రమంగా ఉపయోగించాలి. ధర్మశాస్త్రాలలో చెప్పిన విధముగా సాధ్యమైనంతవరకు ధర్మాచరణ చేస్తూ, ఇతరులకు సహాయపడుతూ మానవ జీవితాన్ని ఉపయోగించుకోవాలి.

हर नमः पार्वती पतये हरहर महादेव 

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు

ఎవరితో , ఎలా మసులుకోవాలి ....?

 https://chat.whatsapp.com/K9DI6jBkFqc6nH7pSwRTSL

      ఎవరితో , ఎలా మసులుకోవాలి ....?
______________________________________

మనం పుట్టినప్పుడు మొదట మనం ఎవరు చూశారో మనకు తెలియదు,
 మనల్ని ఎవరు తాకారో,
 ఎవరు ఎత్తుకున్నారో కూడా మనకు తెలియదు.

 అలాగే మనం చనిపోయినప్పుడు మనల్ని చివరిసారి ఎవరు చూశారో మనకు తెలియదు,
 మనల్ని ఎవరు మోసారో తెలియదు,
 ఆఖరికి మనల్ని ఎవరు కాల్చారో కూడా మనకు తెలియదు.

 కానీ బ్రతికుండగా మనం ఎవరితో ఉన్నాం,
 మనతో ఎవరున్నారు,  మనమందరితో ఎలా మసులుకున్నాం 
 అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది .

కాబట్టి ఆ ఉన్నంతకాలం చేసే స్నేహాలు , బంధాలు నిస్వార్ధంగా,
 ఎదుటివారి మంచిని కోరేవిగా ఉండాలి .
అప్పుడే ఈ మానవ జీవితానికి కొంతైనా అర్థం పరమార్థం లభిస్తుంది 

*శుభోదయం*🙏🌺🙏

ధనం - ధర్మం ఏది గొప్పది?

 https://chat.whatsapp.com/K9DI6jBkFqc6nH7pSwRTSL


*💸ధనం - ధర్మం ఏది గొప్పది?💰*
              

💸 *అర్థం పురుషార్థాల్లో ఉత్తమమైందని పంచతంత్ర వాక్యం. ధర్మమార్గంలో కలిగిన అర్థమే పురుషార్థంగా గ్రహింపదగింది. ఒక్కొక్క నీటిబొట్టు పడుతుంటే క్రమంగా కుండ నిండిపోతుంది. అలాగే ధనం కూడా క్షణం క్షణం కణకణం సాధించుకోవాలి. ఆత్రంగా నీటితో నింపబోతే కుండవిచ్చిపోవచ్చు. నీరు నేలపాలు కావచ్చు. ధనార్జన విషయంలో ఒక క్రమపద్ధతి అవలంబించాలని విజ్ఞులు చెబుతారు.* 

 💰 *డబ్బుంటే చాలు కానిదేదీలేదన్న ఆలోచన నేడు చాలామందిలో ప్రబలంగా ఉంది. సంపాదనకు అధర్మమార్గం తొక్కడమూ సాధారణమైంది. ద్రవ్యం ధర్మార్జితం కావాలన్నారు పెద్దలు. అధర్మ మార్గాల్లో సంపాదించి విశేషంగా దానాలు చేస్తున్న ఎందరినో లోకం కొనియాడుతుంటుంది. వారు ఏ రకంగా ఆర్జించారన్నది పట్టించుకోదు. దానం చేసే ధనం న్యాయమార్గంలో సంపాదించినదై ఉండాలి.* 

💸 *ఒక ఊళ్లో పేద పండితుడు యాచకవృత్తిలో ఉంటూ ఓ ఇంటికి భోజనానికి వెళ్లాడు. ఉత్తమురాలైన ఇల్లాలు భోజనం పెట్టింది, చేతులు కడుక్కోవటానికి వెండి చెంబుతో నీళ్లిచ్చింది. పండితుడు ఇంటికి వచ్చేటప్పుడు గృహిణి ఇచ్చిన వస్తువులతో పాటు వెండిచెంబు కూడా సంచిలో చేరింది. ఆమె గమనించలేదు. ఇంటికి వచ్చాక సంచి తెరిచి చూసి అతడు ఖిన్నుడయ్యాడు. తనవల్ల ఎప్పుడూ ఇలాంటి తప్పు జరగలేదు. ఎంత ఆలోచించినా అలాంటి దుర్బుద్ధి ఎలా కలిగిందో అర్థంకాలేదు. తానెలా వెండిచెంబు సంగ్రహించాడో తెలియలేదు. ఆతిథ్యం ఇచ్చిన ఇంటికి వెళ్ళి, సిగ్గుపడుతూ- తన అపరాధం మన్నించమని వేడుకున్నాడు. తిరిగి వెళ్లిపోతూ 'తల్లీ... నీ భర్త ఏం చేస్తుంటారు?' అని అడిగాడు. ఆ గృహిణి దుఃఖిస్తూ. తన భర్త దారి దోపిడులు చేసి సంపాదిస్తున్నాడని ఇదంతా పాపమని చెప్పినా వినడం లేదని, ఆ పాపం పోవడంకోసం తాను దాన ధర్మాలవంటి సత్కార్యాలు చేస్తున్నానని పలికింది.* 

💰 *అప్పుడా పండితుడు… అన్యాయార్జితమైన విత్తంతో చేసిన దానధర్మాలుగాని, అన్నప్రసాదనంగాని స్వీకరించరాదని శాస్త్రాలు చెబుతున్నవనే విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు. సంపాదించిన ధనం అన్యాయార్జితమైతే సత్ఫలితాలను ఇవ్వదు సరికదా, తప్పుడు ఆలోచనలు కలిగిస్తుంది.* 

💸 *1. తాను సంపాదించిన సొమ్ము ఉత్తమమైంది.*

💰*2. తండ్రినుంచి సంక్రమించిన సొమ్ము మధ్యమం.* 

💸 *3. సోదరుడినుంచి వచ్చినది అధమం.* 

💰 *4. ఇక, స్త్రీవల్ల పొందినది అధమాధమమని శాస్త్రవచనం.* 

💸 *5.విజ్ఞులు పరుల సొమ్ముకు ఆశ పడకూడదు.* 

💰*6.సంపాదించేటప్పుడు మేరు పర్వతమంత సంపాదించాలి. దానం చేసేటప్పుడు ఆ ధనాన్ని గడ్డిపరకగా చూడాలని పెద్దలు చెబుతారు.* 

💸 *7.ధనానికి దానం, భోగం, నాశనం అనే మూడు గతులు ఉన్నాయి.* 

💰 *8. తాను అనుభవించక, ఒకరికి పెట్టక పోగుపెట్టే ధనానికి నాశనం తప్పదు.* 

💸 *9. ధర్మం, అగ్ని, రాజు, దొంగ- ఈ నలుగురూ ధనానికి దాయాదులు.* 

💰*10. వీరిలో జ్యేష్ఠుని అంటే ధర్మాన్ని అవమానిస్తే మిగిలిన ముగ్గురూ కోపిస్తారు. అంటే- ధర్మంలేనివాడి ధనం అగ్నిపాలో, రాజుపాలో, దొంగలపాలో అవుతుందని భావం.*.

క్రెడిటంతా మనదేననుకుంటాము. కాని, ఆ పుణ్యఫలం

 చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.

ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన ⛈ కుండపోత వర్షం ప్రారంభమైంది.

ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక  ⚡పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.

కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.

ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో ⚡పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.

ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో కొట్టింది.ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.

అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.

నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి,
అదిగో!ఎదురుగా ఉన్న ఆ 🌳చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి.
మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు.
మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!
ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.

చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.
మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.
అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు….

ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.
చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.

చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతోచూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికినిరాకరించాడు.

కాని, బస్సులోని ప్రయాణికులందరు”నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదంటూ  బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.

చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి పడింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.కాని పిడుగు వచ్చి పడింది  ఆ చివరి వ్యక్తిపై కాదు!

బస్సుపై…అవును.. 🚌 బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.

నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది.

ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదేననుకుంటాము.

కాని, ఆ పుణ్యఫలం
🔸మన తల్లిదండ్రులది కావచ్చు!
🔸అన్నదమ్ములది కావచ్చు!
🔸అక్కాచెల్లెళ్ళది కావచ్చు!
🔸జీవిత భాగస్వామిది కావచ్చు!
🔸పిల్లలది కావచ్చు !
🔸మన దగ్గర పని చేసే వారిది కావచ్చు! 
🔸మన మంచిని కోరే స్నేహితులది కావచ్చు!     
🔸మన శ్రేయస్సు కాంక్షించే బంధువులది కావచ్చు!

మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు.
ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.

ఒక సినిమాలో చెప్పినట్లు…”బాగుండడం” అంటే బాగా ఉండడం కాదు. అందరితో కలిసి ఆనందంగా ఉండడం.

ఒక్కరుగా మనసులోనే నవ్వుకోగలము.
కాని, అందరితో మనస్పూర్తిగా ఆ నవ్వును పంచుకోగలము – పెంచుకోగలము🌹🙏🌹
 🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

     *మనందరిలోనూ* చెడు *తలంపులు* ఉంటాయి... *కానీ* మనలో *కొందరే* చెడు *చేసే* వారు *ఉంటారు*.. అలాగే *మనందరం* మంచి *చేయగలం*.. కానీ *మనలో* కొందరే *మంచి* పనులు *చేసేవారు* ఉంటారు..
     *గెలవాలన్న* తపన, *గెలవగలను* నమ్మకం, *నిరంతర* సాధన, *ఈ* మూడే *నిన్ను* గెలుపుకు *దగ్గర* చేసే *సాధనాలు*..
     *కడుపు* నిండిన *వాడికి* పెట్టిన *అన్నం*.. *సముద్రం* లో *కురిసిన* వర్షం.. *ధనవంతుడు* ఇచ్చిన *బహుమానం*.. *పగలు* వెలుగుతున్న *దీపం*.. *బందనాలు* లేని *బంధం*.. *అసమర్థులు* తో *వ్యాపారం*.. *హద్దుల్లేని* స్నేహం... *నిజాయితీ* లేని *ప్రేమ* .. *వ్యర్థం వ్యర్థం వ్యర్థం*..
     *ప్రేమగా* పలకరించే *పిలుపులో* వెలకట్టలేని *సంతోషాలు* దాగి *ఉంటాయి*..
     *ప్రతి* ప్రయాణానికి *గమ్యం* ఉంటుంది, *ప్రతి* పరిచయానికి *ఒక* కారణం *ఉంటుంది*..
     *జ్ఞానమనేది* సంపాదిస్తే *వచ్చేది* కాదు... *మనలో* ఉన్న *అజ్ఞానాన్ని* విడిచిపెడితే *వచ్చేది*..!!

        *విద్య మరియు వైద్యం ఉచితం చేయండి చాలు..!  ఇంకే ఉచితాలు అక్కర్లేదు*..!!🖊️✍️
🙏😷 *శుభ శుభోదయం* 😷🙏


సంతోష‌క‌ర‌మైన జీవితానికి గౌత‌మ బుద్ధుడు చెప్పిన 25 సూత్రాలు..!

 *సంతోష‌క‌ర‌మైన జీవితానికి గౌత‌మ బుద్ధుడు చెప్పిన 25 సూత్రాలు..!*

స‌మాజంలో పేద‌లు, ధ‌నికులు ఉంటారు. అంద‌రినీ స‌మానంగా చూడు. 
ఒక‌రు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ అన్న భావం మ‌న‌స్సులోకి రాకుండా చూసుకోవాలి...

సుమారుగా 2500 ఏళ్ల కింద‌ట గౌతమ బుద్ధుడు మాన‌వ జాతి మ‌నుగ‌డ‌కు, స‌రైన జీవ‌న విధానానికి కొన్ని సూచ‌న‌లు చేశాడు...
*కొన్ని నియ‌మాల‌ను పాటించాల‌ని చెప్పాడు.*
కానీ వాటిని మ‌న నిత్య జీవితంలోకి అన్వ‌యించుకుని వాటిని పాటిస్తూ..

సుఖ‌వంత‌మైన, సంతోష‌క‌ర‌మైన జీవ‌నాన్ని గ‌డ‌ప‌వ‌చ్చు.
 మ‌రి మ‌న జీవ‌నం కోసం గౌతమ బుద్ధుడు చెప్పిన ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. మితిమీరిన కోపం ప‌నికిరాదు. కోపం నిన్ను శ‌త్రువును చేసి నిన్ను నాశ‌నం చేస్తుంది. నీ ప‌త‌నానికి నీ కోప‌మే కార‌ణ‌మ‌వుతుంది, క‌నుక కోపం ప‌నికిరాదు, శాంతంగా ఉండాలి.

2. జీవిత ప్ర‌యాణం సాఫీగా సాగుతుంద‌నుకున్న‌ప్పుడు నువ్వు స్వ‌త‌హాగా ఆకాశం కేసి చూసి న‌వ్వుకుంటావు.

3. ప్ర‌పంచంలోని మ‌నుషులంద‌రిలాగే నువ్వు కూడా ఇత‌రుల నుంచి ప్రేమ‌, అనురాగం పొందేందుకు అర్హుడివి.

4. నిజం ఎన్న‌టికీ దాగ‌దు. సూర్య‌, చంద్రులు ప్ర‌కాశించకుండా ఉండ‌లేరు.

5. మ‌న‌స్సులో ఎలాంటి క‌కావిక‌ల‌మైన ఆలోచ‌న‌లు లేకుండా నిర్మ‌లంగా ఉన్న‌వారే శాంత‌మూర్తులు అవుతారు.

6. త‌ప్పు చేసిన వారిని క్ష‌మించండి. వారిని అర్థం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.

7. ఎవ‌రి జీవితంలో అయినా అతి పెద్ద ఓట‌మి అంటే.. నిన్ను న‌మ్మిన వారికి నిజం చెప్ప‌క‌పోవ‌డ‌మే.

8. ఎలాంటి దారి లేనిచోట నువ్వు న‌డిచే తోవ‌నే దారి అవుతుంది.

9. మంచి మాట‌లు ఎన్ని చెప్పినా, ఎన్ని చ‌దివినా.. వాటిని ఆచ‌ర‌ణలో పెట్ట‌క‌పోతే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌దు.

10. శ‌త్రువుల‌ను చూస్తే చ‌క్క‌గా మొరిగే కుక్క‌నే మంచి కుక్క అవుతుంది. అలాగే ఒక మ‌నిషి మంచిగా మాట్లాడితేనే మంచి మ‌నిషి అవుతాడు.

11. మ‌న‌స్సుంటే మార్గ‌ముంటుంది. 

12. స‌మాజంలో పేద‌లు, ధ‌నికులు ఉంటారు. అంద‌రినీ స‌మానంగా చూడు. ఒక‌రు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ అన్న భావం మ‌న‌స్సులోకి రాకుండా చూసుకోవాలి.

13. మంచి మాట‌తీరు, జాలి గుణం, సేవా త‌త్ప‌ర‌త అనేవి మాన‌వ‌త్వానికి ప్ర‌తీక‌లు.

14. ఎట్టి ప‌రిస్థితిలోనూ భ‌య‌ప‌డ‌కూడ‌దు. నీలో ఉండే భ‌యాన్నిఎప్పుడూ పార‌ద్రోలాలి. నువ్వు ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌కూడ‌దు. నువ్వు చ‌క్క‌గా ఉంటే ఇత‌రుల నుంచి స‌హాయం అర్థించ‌కూడ‌దు. అదే నీ స్వేచ్ఛ‌కు చిహ్నం.

15. ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా.. మ‌న‌కు వ‌చ్చే క‌ష్టాన్ని, స‌మ‌స్య‌ల‌ను మ‌న‌మే ప‌రిష్క‌రించుకోవాలి. ఎవ‌రో వ‌స్తార‌ని, ఏదో చేస్తార‌ని వేచి చూడ‌కూడదు.

16. ఏ ప‌ని చేసినా అంకిత భావంతో, మ‌న‌స్సులో ఎలాంటి చెడు భావాలు లేకుండా చేయాలి.

17. స‌మ‌స్య‌ల‌ను నీకై నువ్వు ప‌రిష్కరించుకో. ఇత‌రుల‌పై ఆధార ప‌డ‌కు.

18. మ‌నం ఏదైతే ఆలోచిస్తామో.. అదే ఆచ‌ర‌ణ‌లో చేస్తాం. క‌నుక ఆలోచ‌న‌లు స‌క్రమంగా ఉండాలి. స‌క్ర‌మ‌మైన ప‌నులు చేస్తాం.

19. నిన్ను న‌వ్వు జ‌యించు. ఆ తరువాత ఇత‌రుల‌ను జ‌యించ‌డం సాధ్య‌మ‌వుతుంది.

20. గొడ‌వ‌లు సృష్టించే 1000 ప‌దాల క‌న్నా శాంతిని తెచ్చే ఒకే ఒక్క ప‌దం మాట్లాడ‌డం ఉత్త‌మం.

21. ఇత‌రుల‌ను ప్రేమించ‌లేని వారు వారి క‌ష్టాల‌ను, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేరు.

22. మానసికంగా దృఢంగా ఉంటేనే శారీర‌కంగా ఆరోగ్యం బాగుంటుంది.

23. మ‌నిషి త‌న‌కు వ‌చ్చే రోగాల‌కు తానే బాధ్య‌త వ‌హించాలి.

24. ఒక కొవ్వొత్తితో 1000 కొవ్వుత్తుల‌ను వెలిగించ‌వ‌చ్చు , అలాగే సంతోషాన్ని  ఎంత మందికి పంచినా త‌ర‌గ‌దు.

25. గ‌తం గురించి ఆలోచిస్తూ విచారించ‌కు. భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందోన‌ని ఆందోళ‌న చెంద‌కు. వ‌ర్త‌మానంలో జీవించు.

మిత్రమా...వదిలెయ్....

 .
మిత్రమా...వదిలెయ్                        
ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా అర్థం కాకపోతే, అవతలి వ్యక్తికి వివరించండం* 
        _*👉వదిలెయ్*_

పిల్లలు ఎదిగాక, వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు, 
వారి వెనుకాల పడక 
        _*👉వదిలెయ్*_

కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి.  ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే, 
అటువంటి వాళ్లను
        _*👉వదిలెయ్*_

ఒక వయస్సు తర్వాత, ఎవరూ మిమ్మల్ని పట్టించుకోక పోయినా, లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, దానిని మనసులో పెట్టుకోకుండా 
        _*👉వదిలెయ్*_                                   

మనచేతుల్లో ఏమీ లేదు... మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం
        _*👉వదిలెయ్*_

మనలోని కోరికకు, మన సామర్థ్యానికి మధ్య చాలా తేడా ఉంటే, ఆ కోరికను 
         _*👉వదిలెయ్*_

ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తితో మరో వ్యక్తిని సరిపోల్చుకోకుండా
        _*👉వదిలెయ్*_

నేను మంచి స్నేహితుడిగా నీకనిపిస్తే సరేసరి, లేదంటే 
_*👉వదిలెయ్*_

వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించండి, రోజువారీ పేరుకు పోయిన ఖర్చుల గురించి చింతించక
        _*👉వదిలెయ్*_

ఈ సందేశం మీకు నచ్చితే సరి. లేకుంటే లైట్ 😄 తీసుకో 
        *_👉శ్రీవారి నామ స్మరణ మాత్రం ప్రతి క్షణం మననం మాత్రం వదలకు_* ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

https://kutumbapp.page.link/?isi=1598954409

Thursday, May 25, 2023

మన ఈ జన్మలో కర్మ ఎలా పనిచేస్తుందో ప్రతి ఒక్కరూ చదవాల్సిన జీవిత సత్యం.

 మన ఈ జన్మలో కర్మ ఎలా పనిచేస్తుందో ప్రతి ఒక్కరూ చదవాల్సిన జీవిత సత్యం.
                                               
                      
1891లో ఓ వర్షం రాత్రి ఒంటిగంటకి అమెరికాలో ఫిలడెల్ఫియలోని బ్రాడ్ స్ట్రీట్లో ఉన్న డిలియన్ హోటల్లోకి విలియం, తన భార్యతో వెళ్ళి ఓ గది కావాలని అడిగాడు.

"సారీ! మా హోటల్లోని ఇరవై నాలుగు గదులు ఫిలప్ అయిపోయాయి. మీరు ముందే రిజర్వేషన్ చేసుకోవాల్సింది." జవాబు చెప్పాడు హోటల్ మేనేజర్ జార్జ్ సి బోల్ట్.

ఆ దంపతులు ఇద్దరూ కాసేపు తమలో తాము ఏం చెయ్యాలని చర్చించుకుని తలుపు వైపు వెళ్తుంటే జార్జ్ వాళ్ళతో చెప్పాడు.

"వర్షంలో ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారు? మీరు నా గదిలో ఈ రాత్రికి

విశ్రమించి రేపు వేరే హోటల్ చూసుకోండి."

వారిద్దరూ కౌంటర్ వెనక ఉన్న అతని చిన్న గదిలోని మంచం మీద ఆ రాత్రి నిద్రపోతే, జార్జ్ రిసెప్షన్ హాల్లోని సోఫాలో నిద్రపోయారు. మర్నాడు ఉదయం అతనికి ఆ దంపతులు తమ కృతజ్ఞతలని తెలియచేసి వెళ్తుండగా భర్త చెప్పాడు."ఓ పెద్ద హోటల్ని నడిపే సామర్ధ్యం గల వ్యక్తివి నువ్వు, నీకోసం ఓ హోటల్ని కట్టి నిన్ను దానికి మేనేజర్ని చేస్తాను."

అది జోక్ అన్నట్లుగా ముగ్గురూ నవ్వు కున్నారు. రెండేళ్ళ తర్వాత పోస్టులో జార్జికి వచ్చిన ఓ ఉత్తరంలో, ఆ వర్షం రాత్రి అతను తమ మీద చూపించిన దయని గుర్తు చేస్తూ, తన మాట ప్రకారం ఓ హోటల్ని కట్టానని, ఓసారి. న్యూయార్కి రమ్మని ఆహ్వానిస్తూ విలియం రాసిన ఉత్తరం ఉంది. దానికి ఫిలడెల్ఫియా నించి న్యూయార్కి రిటర్న్ టిక్కెట్ కూడా జత చేసి ఉంది. జార్జ్ అది ప్రాక్టికల్ జోక్ అనుకున్నాడు కాని, టిక్కెట్ ఉండటంతో వెళ్ళిరావడంలో తప్పు లేదనుకుని వెళ్ళి విలియంని కలిసాడు. విలియం అతన్ని న్యూయార్క్ ఫిఫ్త్ అవెన్యూ, తర్టీ ఫోర్త్ స్ట్రీట్లో ఉన్న ఎర్ర రాయితో కట్టిన ఓ పెద్ద భవంతిని చూపించి చెప్పాడు.

"జార్జ్  నీ కోసం కట్టిన హోటల్ ఇదే. నిన్ను దీనికి మేనేజర్ని చేస్తున్నాను."

అది హోటల్ వాల్డ్రోఫ్ . అదే నేటి న్యూయార్క్ లోని నాలుగు వందల గదులు, వెయ్యి మంది ఉద్యోగస్థులు గల ఫైవ్ స్టార్ హోటల్ వాల్ డ్రోఫ్ ఆస్టర్ హోటల్. ఓ చిన్న హోటల్లో మేనేజర్ గా పని చేసిన జార్జ్ ఓ వర్షం రాత్రి చేసిన ఓ నిస్వార్ధ సేవ ఫలితం తర్వాతి జన్మలకి వాయిదా పడకుండా ఈ జన్మలోనే దాని ఫలితాన్ని చూపించింది. అనువైన వాతావరణం ఉంటే కర్మ ఎప్పుడూ వాయిదా పడదు.

త్వరలోనో లేదా కొద్ది కాలం తర్వాత మనం పాతిన విత్తనం నించి వచ్చిన పైరుని మనం తప్పక కోసుకుంటాం అని,  ప్రేమని నాటితే ప్రేమని, మంచితనాన్ని నాటితే మంచితనాన్ని, ద్వేషాన్ని నాటితే ద్వేషాన్ని, సహాయాన్ని నాటితే సహాయాన్ని కోసుకుంటాం అని ఆనాటి ఈ రెండు సంఘటనలు ఋజువు చేస్తున్నాయి. అవునో కాదో ఆలోచించండి మిత్రులారా!

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏