Thursday, February 29, 2024

మనసు మనుగడకు ఇరుసు

 .    *మనసు మనుగడకు ఇరుసు*
    ****************************

     ఆలోచనకు అనువు మనసు. 
    మనిషి బ్రతుకు తెరువు కిరుసు.
         మనిషి జన్మ శ్రేష్ఠమిలలొ. 
         చెడు తలపకు కలలొనైన. 

     ఎవరు ఎవరి కిలలొ మనము ?! 
       చెలిమి వలనె ఒకరి కొకరం ! 
        కలసి ఉంటె కలదు సుఖం ! 
     అందుకు సద్గుణమె సుముఖం ! 

       దేవుడు కలడందురు కొందరు. 
          లేడందురు మరికొందరు. 
             దేవుడున్న లేకున్నా
           గౌరవ భావనలె  మేలు. 

      అపుడె సుగతి ప్రగతి మనకు. 
        దుర్గుణ జీవనము వలదు. 
           సద్గుణ సోపానమ్ములె
         ఆత్మీయత నలవరచును. 

       ఆత్మీయత వలనె మనము
       ఒకటను భావన కలుగును. 
          కలిసి ఉన్న కాపురాలు
           స్వర్గ దుర్గ గోపురాలు. 

      మణి మాణిక్యాలెందుకు ? 
  అయొ మంచి మవసు లేక ఉంటె. 
      పగ సెగ తగవులె ఎపుడు
     ఒకరి కొకరు కాని యపుడు.

   తగవుల మయమవ కూడదు
      మన జీవన ప్రయాణము. 
      కలిసుండెడి జీవనముననె
      సుఖమనుభవ సోపానము. 

        సంతృప్తికర జీవనమున
        శుభకామన సోపానము. 
            సత్కీర్తి ప్రతిష్ఠ తిష్ట
         అలరారెడి శుభసదనము. 

                  అందరమిల
                   చక్కగుంటె
               మన బ్రతుకులు
                  బాగుండవ !! 

               ***************
రచన :---- రుద్ర మాణిక్యం (✍️కవి రత్న) 
     రిటైర్డ్ టీచర్.    జగిత్యాల (జిల్లా). 

*************************************

మనసు

 .                *మనసు*
.               *********

      విమానమ్మది విమానమ్మని
 మురిసి పోదుము గగనమున గని ! 
   విమానమ్మును మించు వడి గల
     విమానము ఒకటున్నదీ యిల ! 

   ఏది యా నిజమగు విమానము ? 
      ఎక్కడున్నది ఆ విమానము ? 
   ఇలలొ కనబడునది విమానమ ?! 
   కలలొ కనబడునది విమానమ ?! 

     ఆధునిక నూతన విమానమ ! 
      యక్ష గంధర్వుల విమానమ ! 
       దేవతల పుష్పక విమానమ ! 
     కాదు కాదు మరే విమానము ?! 

       ఇక్కడే మనలోనె ఉన్నది ! 
    విశ్వమంతడుగిడుతు ఉన్నది ! 
      కంటికగుపడకుండ ఉన్నది ! 
     స్పర్శ కైనను తెలియ కున్నది ! 

      తలచు రీతిగ తలచినంతట
      తలచు లోపలె విశ్వమంతట
      తిరిగి తిరిగిటు వచ్చుచున్నది. 
      తృప్తిగా మననుంచు చున్నది. 

   ఏది యా నిజమగు విమానము ?!
   మనలోని మనసే ఆ విమానము ! 
     అడ్డు లేనిది !  అదుపు లేనిది ! 
      అంత యింతని చెప్ప రానిది ! 

       చూడవలె ననుకున్న దానిని
       తక్షణమె చూపించు దర్శిని ! 
       దర్శినీ ! ఇది సుదూర దర్శిని ! 
         సాటి లేని అదృశ్య దర్శిని ! 
               అదృశ్య దర్శిని !! 

         **********************
రచన :---- రుద్ర మాణిక్యం. (✍️కవి రత్న) 
   రిటైర్డ్ టీచర్.   జగిత్యాల (జిల్లా) 

*************************************

Sunday, February 25, 2024

తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం

 ♨️⚜️♨️⚜️♨️⚜️♨️⚜️♨️⚜️♨️

👉 ఆయువు,

👉 విత్తము,

👉 ఇంటిగుట్టు,

👉 మంత్రం,

👉 ఔషధం,

👉 సంగమం,

👉 దానం,

👉 మానము,

👉 అవమానం

 అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి.

🙏 భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి మాత్రమే ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.

🙏 రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు.

💰 ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు.
 ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు 
బంగారంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే.
 ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం.

 అయినా మన దగ్గర ఉన్న విషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగు తుంది.

🌻 ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.

👉 సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.

💥 ‘మననం చేసేది మంత్రం’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.

ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరిస్తే ఎవ్వరంటేవారు తయారుచేస్తారు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.

🙏 సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.

🙏 దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.

🙏 మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.

🙏 అలాగే తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవ మానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగు తుంది. దాంతో పగ.. ప్రతీకారాలు.. ఇక వాటికి అంతనేది ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మనం చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం కదా.

👉 *ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధను మనం తప్పక ఆచరించాలి*🙏

హిందూ ధర్మం అంటే శాస్త్రీయ మైన విజ్ఞానం

 *హిందూ ధర్మం అంటే శాస్త్రీయ మైన విజ్ఞానం*
~~👇~~~~
ఇది దేవుడు లేని, భక్తి ఉన్న దేశం. ఒక విధంగా దేవుడి గురించి ఏ విధమైన నిర్దిష్ట ఆలోచనా లేని దేశం. మానవులకు వారి దేవుళ్ళను ఎంచుకొనే స్వేచ్ఛ అందించిన ఏకైక సంస్కృతి ఇది. అంతేకాదు, మీకు మీరు అన్వయించుకోగల దేవుణ్ణి మీరే సృష్టించుకోవచ్చు.
హిందూ ధర్మం ఒక మతం’ అనే భావన ఈ మధ్య కాలంలో మాత్రమే మొదలయింది. ఇంతకుముందు ఆ భావన లేదు. ‘హిందూ’ అనే మాట ‘సింధు’ అనే పదం నుంచి వచ్చింది. సింధూ నది గడ్డ మీద పుట్టిన వారందరూ హిందువులే. ఇది సంస్కృతితో, భౌగోళిక ప్రదేశంతో ముడిపడిన విషయం. ఇది ‘నేను ఇండియన్‌ని’ అని చెప్పడం లాంటిదే. కానీ ‘ఇండియన్‌’ అనే దానికన్నా ఇది చాలా ప్రాచీనమైన గుర్తింపు. ‘ఇండియన్‌’ అనే గుర్తింపు కేవలం డెబ్భై సంవత్సరాల నుంచే ఉంది. కానీ ‘హిందూ’ అనేది మనకు ఎప్పటి నుంచో ఉన్న గుర్తింపు. హిందువుగా ఉండడం అంటే ఏదైనా నిర్దిష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం కాదు. ప్రాథమికంగా ఈ సంస్కృతి అంతా మనిషి పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకొనే దిశలో ఉండేది. ఈ సంస్కృతిలో మీరు ఏది చేసినా... మీరు హిందువే. ‘హిందూ జీవన విధానం ఇదే’ అని చెప్పగలిగే ప్రత్యేకమైన దేవుడు లేదా సిద్ధాంతం అంటూ ఏదీ లేదు. మీరు దేవుణ్ణి పూజిస్తున్నా, దేవతను పూజిస్తున్నా, ఆవును పూజిస్తున్నా, చెట్టును పూజిస్తున్నా హిందువుగా ఉండవచ్చు. దేన్నీ ఆరాధించకపోయినా హిందువుగా ఉండవచ్చు.
ప్రపంచంలో తలెత్తే సంఘర్షణలను ఎప్పుడూ మంచికీ, చెడుకూ మధ్య జరిగేవిగా చిత్రీకరిస్తూ ఉంటారు. వాస్తవానికి వ్యక్తుల నమ్మకాల మధ్య ఉన్న తేడాల కారణంగానే సంఘర్షణలు జరుగుతాయి. ఇప్పటికన్నా గతంలో ప్రజలు మతానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. అయినప్పటికీ ఈ సంస్కృతిలో మతాలకు ప్రాతినిధ్యం వహించే రాజులు లేరు. మత ప్రాతిపదికన పాలించే రాజ్యాలు ఉండేవి కావు. పాలకుడు తన మతాన్ని అనుసరించేవాడు. ప్రజలకు వారి మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉండేది. ప్రజలు మతాన్ని ఒక నిర్దిష్టమైన ప్రక్రియగా పరిగణించకపోవడం వల్ల ఎటువంటి సంఘర్షణలూ ఉండేవి కావు. మిగిలిన ప్రపంచంలోని ప్రతి చోటా... అప్పట్లో అక్కడ ఆచరించే నిర్దిష్టమైన మతానికి లోబడి కాకుండా వేరేగా ఎవరైనా మాట్లాడితే... ప్రజలు ‘‘వారిని చంపాలి’’ అనేవారు. యూరప్‌లో వేల మంది మహిళలను మంత్రగత్తెలుగా ముద్రవేసి కాల్చి చంపారు. చిత్రహింసలు ఎప్పుడూ ఉంటూనే ఉండేవి. ఇలాంటి చిత్ర హింసలకు గురైన వారిలో ఏసు క్రీస్తు, మన్సూర్‌, సోక్రటీస్‌ లాంటి మనకు తెలిసిన మహనీయులు కూడా ఉన్నారు. అసాధారణమైనవిగా పరిగణించే ఇతర సామర్థ్యాలను కలిగి ఉండడం వల్లే వారు హింసకు గురయ్యారు. కాబట్టి ఇతర పాశ్చాత్య దేశాలలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు రహస్యంగా జరిగేవి. కానీ మన సంస్కృతిలో ఆధ్యాత్మికపరులైన వ్యక్తులను హింసించడం ఎప్పుడూ జరగలేదు. మహా అయితే చర్చకు పిలిచి, ప్రశ్నలు అడిగేవారు. సత్యం కోసం చేసే శోధన కాబట్టి... తమకు తెలిసినది నిజమా? అవతల వ్యక్తి చెప్పేది నిజమా? అని తేల్చుకోవడానికి వాదించేవారు. ఆ వ్యక్తి సత్యమని నమ్మేది వీరు చెబుతున్న దానికన్నా శక్తిమంతమైనదైతే... అతనితో ఏకీభవించేవారు. వీరి సత్యం శక్తిమంతమనదైతే... అతను వీరితో ఏకీభవించేవాడు. ఇది చాలా భిన్నమైన శోధన. సత్యాన్ని తెలుసుకోవాలనే తపనతో ప్రజలు శోధించేవారు. కేవలం నమ్మకాలు ఏర్పరచుకొని, అవే సరైనవని నిరూపించే ప్రయత్నాలు చేయలేదు. హిందూ జీవన విధానంలో... ఒకరు దేవుణ్ణి నమ్ముతారు. మరొకరు నమ్మరు. ప్రతి ఒక్కరికీ తమదైన సొంత ఆరాధనా విధానం, ముక్తి మార్గం ఉండవచ్చు. మీ కుటుంబంలో అయిదుగురు వ్యక్తులు ఉంటే... ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన దేవుణ్ణి పూజించవచ్చు. లేదా ఎవరినీ పూజించకుండానే మంచి హిందువుగా ఉండవచ్చు. కాబట్టి మీరు దేన్ని నమ్మినా, దేన్నీ నమ్మకపోయినా హిందువులే. అదే సమయంలో.. వీటన్నిటిలో అంతర్లీనంగా ఒకే ఒక అంశం ఉంది. ఈ సంస్కృతిలో... మానవ జీవనానికి ఏకైక లక్ష్యం మోక్షం లేదా ముక్తి. అంటే జీవన ప్రక్రియ నుంచి, మీకు పరిమితులు విధించేవిగా గుర్తించిన అన్నిటి నుంచీ ముక్తి పొంది, వాటన్నిటికీ అతీతంగా వెళ్ళడం. ఇక్కడ దేవుణ్ణి పరమోన్నతుడిగా పరిగణించరు.
మోక్షాన్ని చేరుకొనే దిశలో దేవుణ్ణి ఒక సోపానంగా భావిస్తారు. ఇది దేవుడు లేని, భక్తి ఉన్న దేశం. ఒక విధంగా దేవుడి గురించి ఏ విధమైన నిర్దిష్ట ఆలోచనా లేని దేశం. ‘దేవుడు లేని దేశం’ అని నేను ఎందుకు అంటున్నానంటే... మానవులకు వారి దేవుళ్ళను ఎంచుకొనే స్వేచ్ఛ అందించిన ఏకైక సంస్కృతి ఇది. అంతేకాదు, మీకు మీరు అన్వయించుకోగల దేవుణ్ణి మీరే సృష్టించుకోవచ్చు. మీరు ఒక బండను, ఆవును, లేదా మీ తల్లిని పూజించవచ్చు. మీకు ఏది నచ్చితే దాన్ని ఆరాధించవచ్చు. ఎందుకంటే ‘దేవుడు మన సృష్టి’ అని తెలిసిన సంస్కృతి ఇది. మిగిలిన ప్రపంచమంతా ‘దేవుడు మనల్ని సృష్టించాడు’ అని నమ్ముతారు. ఇక్కడ మనమే దేవుణ్ణి సృష్టించామని మనకు తెలుసు. కాబట్టి ఏ దేవుణ్ణి మనతో అన్వయించుకోగలమో... ఆ దేవుణ్ణి మనం పూర్తి స్వేచ్ఛతో సృష్టించుకోవచ్చు.పూర్వం ప్రజలు దేన్ని బాగా అన్వయించుకోగలరో దాన్ని ఆరాధించేవారు. అందులో ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు.
ఈ మధ్యకాలంలో మాత్రమే... బయటి పరిస్థితుల ప్రభావాల కారణంగా మన ప్రాంతీయమైన, సాంస్కృతికమైన గుర్తింపును ఒక మతపరమైన గుర్తింపుగా మార్చే ప్రయత్నం జరిగింది. ‘హిందు’ అనేది ఎప్పుడూ మతం కాదు. దాన్ని మతంగా మార్చడానికి చేసిన ఏ ప్రయత్నం ఇప్పటివరకూ విజయవంతం కాలేదు. ఎందుకంటే సనాతన ధర్మంగా లేదా సార్వత్రిక ధర్మంగా పేర్కొనే హిందూ జీవన విధానం అన్నిటినీ అక్కున చేర్చుకుంటుంది తప్ప దేన్నీ తిరస్కరించదు. హిందూ జీవన విధానం కొన్ని నమ్మకాలతో ఏర్పడిన వ్యవస్థ కాదు. అది మోక్షానికి సంబంధించిన ఒక శాస్త్రీయమైన విజ్ఞానం. 🙏

Saturday, February 24, 2024

సప్త సంతానం అంటే..!

 *🍁సప్త సంతానం అంటే..! 🍁*
📚✍️ మురళీ మోహన్


_⚜️కూపస్తటాక ముద్యానం !_
_మండపం చ ప్రపా తథా !_
_జలదానమన్నదానం !_
_అశ్వత్థారోపణం తథా !_
_పుత్రశ్చేతి చ సంతానం !_
_సప్త వేదవిదో విదు !_

_స్కాంద పురాణంలోని పైన చెప్పిన శ్లోకంలో సప్తసంతానం అంటే ఏమిటో వివరంగా ఉంది.._

[ఈ ఏడుగురు కొడుకులూ సమృద్ధిగా ఊళ్ళో ఉంటే ఏ వూరైనా రాజధానికన్నా గొప్పదే !]-_

_*1. కూపం :* ప్రతి ఊరికీ ఊరుమ్మడి బావి ఉండాలి. అవి తాగునీటి అవసరాన్ని తీరుస్తాయి. ఆ బావిలో నీటిని వాడుకునే హక్కు అందరికీ సమానంగా ఉండాలి. కాబట్టి బావి మొదటి సంతానం !_

_*2. తటాకం :* ప్రతి ఊళ్ళోనూ చెరువు ఉండాలి. అవి కేవలం పశుపక్ష్యాదుల అవసరాలకోసం, అలాగే సాగు కోసం ఉపయోగపడేవిగా ఉండాలి. చెరువుని రెండో సంతానం అన్నారందుకే !_

_*3. ఉద్యానం :* ప్రతి ఊళ్ళొనూ కనీసం ఒకటైనా పార్కు ఉండాలి. వాహ్యాళి కోసం మాత్రమే కాదు, పచ్చదనం కోసం కూడా ఉద్యానం కావాలి. దానిని మూడో సంతానంగా చెప్పారు._ 

_*4. మండపం :* ప్రతి ఊరికీ ఒక మండపం ఉండాలి. అంటే టౌన్ హాలు లాంటిదన్నమాట. పెళ్ళిళ్ల నుండి తద్దినాలవరకూ ఊళ్ళో మండపం అవసరం ఉంది. ఊరుమ్మడి అంశాల చర్చలక్కూడా ఒక సభామండపం కావాలి కదా ! అందుకని మండపాన్ని నాలుగో సంతానంగా చెప్పారు._

_*5. జలదాన మన్నదానం :* చలివేంద్రాల్లో దాహార్తితో పాటు మజ్జిగ కలిసిన రాగి జావ గానీ, అంబకళం అంటే మజ్జిగ కలిసిన జొన్న జావ గానీ కుండలో పోసి ఉంచాలి. అన్నార్తిని కూడా అవి తీర్చేవిగా ఉండాలి. అలాంటి చలివేంద్రాన్ని ఐదో సంతానం అన్నారు._
 
_*6. అశ్వత్థారోపణం :* అంటే రావి చెట్టును మొలకెత్తించటం, ప్రతి ఊళ్ళొనూ ఒకటైనా రావి, తెల్లమద్ది, మర్రి, వేప, చింత లాంటి మహా వృక్షం ఊళ్ళో ఉండాలి. చెట్టుని ఆరవ పుత్రుడు అంటుందీ శ్లోకం._  

_*7. పుత్రుడు :* ఏడవ సంతానంగా పుత్రుణ్ణి పేర్కొందీ శ్లోకం. నిజమైన పుత్రుడు ఆఖర్న వచ్చాడు. నుయ్యి, చెరువు మొక్క వగైరా నిజపుత్రుడికన్నా ఎక్కువ పుత్రసమానం అని దీని భావం !_

_ఏడుగురు కొడుకులూ సమృద్ధిగా ఊళ్ళో ఉంటే ఏ వూరైనా రాజధానికన్నా గొప్పదే !_

_చెరువులు పూడ్చి, మొక్కలు నరికి, పార్కులు ఆక్రమించి, చలివేంద్రాలను బూటకంచేసి, ఊరుమ్మడి సభామందిరాలను కూలగొట్టి, ఖరీదైన భవనాలు కట్టే విధంగా ఎవరు పాలించినా ఏడుగురు బిడ్డల తండ్రి కాలేడని దీని భావం._

*_రాజు సంతాన వంతుడు కావాలి, ఎంత సంతాన వంతుడైతే అంత గొప్పగా పాలించినట్టు... అని అర్ధం చేసుకోవాలి._*

మనసా...వాచా...కర్మణా... అంటే!!!

 [24/02, 8:18 am] pasupula Pullarao: 0602b-4.2102c-6.230224-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


      *Manasa...Wacha...Karmana!*
                ➖➖➖✍️

*Manasa...Wacha...Karma... means!!!*

*Once Sri Adi Shankaracharya visited the Kashi Visvesvara temple with his disciples...*

*Take a bath in the river Ganga, go inside the temple for darshan, in front of Vishveshar...*
 *"I have committed 3 doshas/sins, please forgive me"...*

* On hearing this, the disciples asked, "Teachers, what sins are you atoning for?" thought that.*

*A disciple asked the teachers that I should know what is wrong.*

*Sri Adi Shankaracharya gave this answer...*

*1. "I praised the Lord with the words Sarvantyami, Sarvayapi, I came to the city of Kashi to see that Visvesvara who is full of all creation..."*

*That is Manasa Vacha Karmana I could not practice the truth I believed in in eternal life, that was my first mistake, he replied.*

*2. In the Taittriya Upanishad "Yato wacho nivartante, arapya manasa sah" God is incomprehensible to our mind" I wrote Sri Kashivishwanadha Ashtakam even knowing this. ”This is my second mistake!*

*3. In the Nirvana Century*
*I wrote “No virtue, no sin, no comfort, no sorrow, no mantra, no veda, no yajna, ego food, no food, no bhokta chidanandarupam, shivoham, shivoham”*

*Meaning:*
* I have no sinful virtues, pleasures or sorrows. There are no mantra chants, Tirthasevas, Vedic Yagnas. Food, Food, Bhokta (Eater) I am not! I am Chidananda Swarupa, Shiva, Shiva!*

*Even after writing so much, I am doing pilgrimages... that means I am not following what I have written and said. Hence this third mistake I made...!*

*I ask God to forgive me for these mistakes. Said...*

*ethics:*
*Sri Adi Shankaracharya's conversation informs us that our thought, manner and speech should be the same...*

*The outside world only sees the way we work, but God sees the will and intention behind our work.*

*“Manas Ekam, Vachas Ekam, Karmanya Ekam!”*
*This sukti is the true path shown to us by many Mahatmas like Sri Adisankaracharya, who have practiced the trinity in their lives...*✍️
*Sarvam Shrikrishnarpanamastu*
                       🌷🙏🌷

 🙏Loka Samasta Sukhinobhavantu!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*Teach tomorrow's generation about survival and security as well as Indianness.*
                     ➖▪️➖
For such good things…
*Send a WhatsApp message to the following number to be included in the "God Matters Group"...944065 2774.
We will send the link.
Please do not make phone calls
[24/02, 8:19 am] pasupula Pullarao: 0602बी-4.2102सी-6.230224-4।
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


      *मनसा...वाचा...कर्मणा!*
                ➖➖➖✍️

*मनसा...वाचा...कर्म...अर्थ!!!*

*एक बार श्री आदि शंकराचार्य अपने शिष्यों के साथ काशी विश्वेश्वर मंदिर गए...*

*गंगा नदी में स्नान करें, दर्शन के लिए मंदिर के अंदर जाएं, विश्वेशर के सामने...*
 *"मैंने तीन दोष/पाप किये हैं, कृपया मुझे क्षमा करें"...*

* यह सुनकर शिष्यों ने पूछा, "गुरुजनों, आप किस पाप का प्रायश्चित कर रहे हैं?" सोचा कि।*

*एक शिष्य ने गुरुजनों से पूछा कि मुझे पता होना चाहिए कि क्या गलत है।*

*श्री आदि शंकराचार्य ने दिया यह उत्तर...*

*1. "मैंने सर्वन्तयामि, सर्वयापि शब्दों से भगवान की स्तुति की, मैं उस विश्वेश्वर को देखने के लिए काशी शहर में आया जो सारी सृष्टि से परिपूर्ण है..."*

*वह मनसा वाचा कर्मणा है, मैं उस सत्य का अभ्यास नहीं कर सका जिस पर मैं शाश्वत जीवन में विश्वास करता था, यह मेरी पहली गलती थी, उन्होंने उत्तर दिया।*

*2. तैत्तिरीय उपनिषद में "यतो वाचो निवर्तन्ते, अराप्य मनसा सः" भगवान हमारे मन के लिए समझ से परे हैं" यह जानते हुए भी मैंने श्री काशीविश्वनाधा अष्टकम लिखा। "यह मेरी दूसरी गलती है!*

*3. निर्वाण शताब्दी में*
*मैंने लिखा "न पुण्य, न पाप, न आराम, न दुःख, न मंत्र, न वेद, न यज्ञ, अहंकार भोजन, न भोजन, न भोक्ता चिदानन्दरूपम, शिवोहम, शिवोहम"*

*अर्थ:*
*मुझमें कोई पाप-पुण्य, सुख-दुःख नहीं है। वहाँ कोई मन्त्र जाप, तीर्थसेवा, वैदिक यज्ञ नहीं होते। अन्न, अन्न, भोक्ता (भक्षक) मैं नहीं हूँ! मैं चिदानन्द स्वरूप, शिव, शिव हूँ!*

*इतना लिखने के बाद भी मैं तीर्थयात्रा कर रहा हूं... इसका मतलब है कि मैंने जो लिखा और कहा है उस पर अमल नहीं कर रहा हूं। इसलिए मुझसे यह तीसरी गलती हो गई...!*

*मैं भगवान से प्रार्थना करता हूं कि वह मुझे इन गलतियों के लिए माफ कर दें। कहा...*

*नीति:*
*श्री आदि शंकराचार्य जी का वार्तालाप हमें बताता है कि हमारा विचार, आचरण और वाणी एक जैसी होनी चाहिए...*

*बाहरी दुनिया केवल हमारे काम करने के तरीके को देखती है, लेकिन भगवान हमारे काम के पीछे की इच्छा और इरादे को देखते हैं।*

*"मानस एकम, वाचस एकम, कर्मण्य एकम!"*
*यह सूक्ति श्री आदिशंकराचार्य जैसे कई महात्माओं द्वारा हमें दिखाया गया सच्चा मार्ग है, जिन्होंने अपने जीवन में त्रिमूर्ति का अभ्यास किया है...*✍️
*सर्वं श्रीकृष्णार्पणमस्तु*
                       🌷🙏🌷

 🙏लोक समस्ता सुखिनोभवंतु!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*कल की पीढ़ी को अस्तित्व और सुरक्षा के साथ-साथ भारतीयता के बारे में भी सिखाएं।*
                     ➖▪️➖
ऐसी अच्छी चीजों के लिए...
*"गॉड मैटर्स ग्रुप" में शामिल होने के लिए निम्नलिखित नंबर पर व्हाट्सएप संदेश भेजें...944065 2774।
हम लिंक भेज देंगे.
कृपया फ़ोन न करें
[24/02, 8:19 am] pasupula Pullarao: 0602B-4.2102C-6.230224-4.



      *சிந்தனை...சொல்...செயல்!*
                

*மனசா...வச்சா...கர்மா...அர்த்த!!!*

*ஒருமுறை ஸ்ரீ ஆதி சங்கராச்சாரியார் தனது சீடர்களுடன் காசி விஸ்வேஷ்வர் கோயிலுக்குச் சென்றார்...*

*கங்கை நதியில் குளித்து, கோயிலுக்குள் சென்று தரிசனம் செய்து, விஸ்வேஷ்வர் முன்...*
 *"நான் மூன்று தவறுகள்/பாவங்கள் செய்துவிட்டேன், என்னை மன்னியுங்கள்"...*

* இதைக் கேட்ட சீடர்கள், "ஆசிரியர்களே, என்ன பாவத்திற்குப் பரிகாரம் செய்கிறீர்கள்?" என்று கேட்டார்கள். என்று நினைத்தேன்.*

*ஒரு சீடன் ஆசிரியர்களிடம் என்ன தவறு என்று தெரிந்து கொள்ள வேண்டும் என்று கேட்டார்.*

*ஸ்ரீ ஆதி சங்கராச்சாரியார் இந்த பதிலை அளித்தார்...*

*1. "சர்வாந்தயாமி, சர்வலோகம் என்ற வார்த்தைகளால் இறைவனைப் போற்றினேன், முழுப் படைப்பிலும் நிறைந்திருக்கும் அந்த விஸ்வேசுவரைக் காண காசி நகருக்கு வந்தேன்..."*

*அந்த மனசா வாச்சா கர்மனா என்பது, நான் நம்பிய சத்தியத்தை நித்திய வாழ்வுக்காக என்னால் கடைப்பிடிக்க முடியவில்லை, அதுதான் என் முதல் தவறு என்று பதிலளித்தார்.

*2. “யதோ வச்சோ நிவர்தந்தே, ஆரப்ய மனஸா ச” தைத்திரீய உபநிஷத்தில் “கடவுள் நம் மனதிற்குப் புரியாதவர்” இதைத் தெரிந்திருந்தும் ஸ்ரீ காசிவிஸ்வநாத அஷ்டகம் எழுதினேன்.“இது என்னுடைய இரண்டாவது தவறு!*

*3. நிர்வாண நூற்றாண்டில்*
*"புண்ணியமோ, பாவமோ, சுகமோ, துக்கமோ, மந்திரமோ, வேதமோ, யக்ஞமோ, ஈகோ உணவோ, உணவோ, அனுபவிப்பவர் சிதானந்தரூபமோ, ஷிவோஹமோ, சிவோஹமோ" என்று எழுதினேன்.

*பொருள்:*
*என்னில் பாவமோ, புண்ணியமோ, சுகமோ, துக்கமோ இல்லை. மந்திரம் உச்சரித்தல், யாத்திரை சேவை அல்லது வேத யாகம் எதுவும் இல்லை. உணவு, உணவு, உண்பவன் (உண்பவன்) நான் இல்லை! நான் சித்தானந்த ஸ்வரூப், சிவன், சிவன்!*

*இவ்வளவு எழுதியும் இன்னும் யாத்திரை செல்கிறேன்...நான் எழுதியதையும் சொன்னதையும் செயல்படுத்தவில்லை என்று அர்த்தம். அதனால் தான் இந்த மூன்றாவது தவறை செய்தேன்...!*

*இந்த தவறுகளை மன்னிக்க இறைவனை பிரார்த்திக்கிறேன். கூறினார்...*

*கொள்கை:*
*நமது எண்ணங்களும், நடத்தைகளும், பேச்சும் ஒரே மாதிரியாக இருக்க வேண்டும் என்பதை ஸ்ரீ ஆதி சங்கராச்சாரியார் அவர்களின் உரையாடல் சொல்கிறது...*

*வெளியுலகம் நாம் வேலை செய்யும் விதத்தை மட்டுமே பார்க்கிறது, ஆனால் கடவுள் நம் வேலையின் பின்னால் உள்ள விருப்பத்தையும் நோக்கத்தையும் பார்க்கிறார்.*

*"மனஸ் ஏகம், வச்சஸ் ஏகம், கர்மண்ய ஏகம்!"*
*திருமூர்த்திகளை தங்கள் வாழ்வில் கடைப்பிடித்த ஸ்ரீஆதிசங்கராச்சாரியார் போன்ற பல மகாத்மாக்கள் நமக்கு காட்டிய உண்மையான பாதை இந்த பழமொழியே...*✍️
*சர்வம் ஸ்ரீ கிருஷ்ணர்பன்மஸ்து*
                       

 🙏லோக் சமஸ்தா சுகினோபவந்து!🙏


*நாளைய சந்ததியினருக்கு வாழ்வு மற்றும் பாதுகாப்போடு இந்தியத்தன்மையையும் கற்றுக்கொடுங்கள்.*
                     
இது போன்ற நல்ல விஷயங்களுக்கு...
*"God Matters Group" இல் சேர பின்வரும் எண்ணிற்கு WhatsApp செய்தி அனுப்பவும்...944065 2774.
இணைப்பை அனுப்புவோம்.
தயவுசெய்து அழைக்க வேண்டாம்
[24/02, 8:21 am] pasupula Pullarao: 0602b-4.2102c-6.230224-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


      *మనసా...వాచా...కర్మణా!*
                ➖➖➖✍️

*మనసా...వాచా...కర్మణా... అంటే!!!* 

*ఒకసారి శ్రీ ఆది శంకరాచార్యుల వారు, శిష్యులతో కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు...*

*గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట...*
 *" నేను 3 దోషములు/పాపములను చేశాను, నన్ను క్షమించండి ” అని ప్రాధేయ పడ్డారు...*

*ఇది విన్న శిష్యులు “ఆచార్యులవారు, ఏమి పాపములు చేశారో ప్రాయశ్చిత్త పడుతున్నారు?” అని అనుకున్నారు.*

*ఒక శిష్యుడు, ఏమిటి ఆపాపము నేను తెలుసుకోవాలి అని, ఆచార్యుల వారిని అడిగాడు.*

*దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు...*

*1. “నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను, సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడడానికి మటుకు కాశీ నగరానికి వచ్చాను..."*

*అంటే  మనసా వాచా కర్మణా  నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను, అది నా నేను చేసిన మొదటి దోషము అని సమాధానమిచ్చారు.*

*2. తైత్త్రియ ఉపనిషద్ లో “యతో వాచో నివర్తన్తే , అప్రాప్య మనసా సః ” భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా   శ్రీ కాశీవిశ్వనాధ అష్టకం వ్రాశాను.   ”ఇది నేను చేసిన  రెండవ తప్పు!*

*3. నిర్వాణ శతకం లో*
*“న పుణ్యం న పాపం, న సౌఖ్యం                    న దుఖం    న మంత్రో   న తీర్తం,                           న వేదా  న యజ్ఞః అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త చిదానందరూపం శివోహం శివోహం“ అని వ్రాశాను*

*అర్థము :*
*నాకు పాప పుణ్యములు     సుఖ దుఖములు లేవు. మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము , భోజనము , భోక్త (భుజించేవాడు) నేను కాదు!  నేను చిదానంద స్వరూపుడను, శివుడను, శివుడను!*

*ఇంత వ్రాసికూడా నేను తీర్ద యాత్రలు చేస్తున్నాను...   అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ మూడవ తప్పు...!*

*ఈ తప్పులని మన్నించమని , ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను.” అన్నారు...*

*నీతి :*
*మన ఆలోచన, తీరు, మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి సంభాషణ మనకి తెలియజేస్తోంది...*

*బయట ప్రపంచం మన పని తీరుని మట్టుకే చూస్తుంది, భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తారు.*

*“మనస్ ఏకం, వచస్ ఏకం , కర్మణ్యేకం!”*
*ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధితో ,ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము...*✍️
           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

మౌనం అంటే ఏమిటి?

 [20/02, 7:48 pm] pasupula Pullarao: హరిఓం     ,                               -                                           -            *మౌనం అంటే ఏమిటి*

మౌనం ఒక మానసిక నిశ్శబ్దం
మాట ఓ భౌతిక శబ్దం
మౌనం ఓ సమస్యకు పరిష్కారం
మాట ఒక సమస్యకు కారణం
మాట హద్దులు దాటితే యుద్ధం
మౌనం హద్దులు దాటితే ఆత్మ జ్ఞానం
కొన్నిటికి సమాధానం మౌనం
కొన్నిటికి సమాధానం మాట
మాట మౌనం రెండు అవసరం
వాటిని వాడే విధానం తెలుసుకోవాలి
అది తెలిసిన వారు ప్రతిక్షణం ఆనందంగా ఉండగలరు.

సనాతన భాషా స్రవంతి.మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు.నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు. విజ్రుంభణను ఆపడం.

మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం.ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం.

మౌనమంటే -నిరంతర భాషణ.చింత, చింతన లేని తపస్సు.అఖండ ఆనందపు ఆత్మస్థితి.విషయ శూన్యావస్థ.

యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ శంకరులు.

మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం.అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది.పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదు శాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి.అహం వృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు.

ఈ మౌనం మూడు రకాలు.

1. వాజ్మౌనం :-🙏

వాక్కుని నిరోదించడం.ఈ రకమైన మౌనం వలన కఠువుగా మాట్లాడుట, అసత్యమాడుట,పరనింద చేయుట,చాడీలు చెప్పుట,అసందర్భ వ్యర్ధ ప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి.

2. అక్షమౌనం :-🙏

కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక ఏకాగ్రనిష్టలో ఉండుట.ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యాన వైరాగ్యాలు బాగా అలవడుతాయి.

3. కాష్ఠ మౌనం :-🙏

దీనిని మానసిక మౌనమంటారు.మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠ మౌనమంటారు.ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.

'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది.మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.

మౌనం ...

దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.

గురువు మౌనం జ్ఞానానుగ్రహం.

జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.

భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.

ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం.
ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది.

మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది,అంతర్యామిని దర్శింపజేస్తుంది,మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధ సంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష.అనేక సంవత్సరములు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు.

మాటలకు ఆటుపోట్లు ఉంటాయి కానీ మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞాన స్రవంతి.

మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనలేయని మహాత్ములు పేర్కొంటారు.

'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది.

భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం.
దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం.

మౌనం మాత్రమే శబ్ధ ప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది.

మౌనమే సత్యం, శివం, సుందరం.
ఇదే అఖండానందం, ఎన్నో సమస్యలకు పరిష్కారం
ఇదే ఆత్మసాక్షాత్కారం,ఇదే మోక్షం............                                                 మౌనంతో ఉండవలసింది అంతరంగంలో మాత్రమే... సరైన సాధన ద్వారా మాత్రమే అది సాధ్యం...
నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరే ధ్యానం
[21/02, 1:01 am] pasupula Pullarao: [20/02, 7:44 pm] pasupula Pullarao: Humans suffering from various problems due to bad karmas of births and births, suffering from dark problems, light the lamp of spiritual knowledge through proper practice, the darkness of all problems disappears... Mantra is the only mantra to get whatever you want wherever you want through universal lights... Your energies are connected as part of the cosmic plan for cosmic welfare... Only through such spiritual meditative soldiers can the wise become enlightened... By the rule of the wise angels, these miracles happen... here also in the material world some opposite events happen... the words of the strong are followed and followed by the weak. .
[20/02, 7:48 pm] pasupula Pullarao: Hariom , - - *what is silence*

Silence is mental stillness
Speech is physical sound
Silence is the solution to a problem
Word causes a problem
If words cross the line, it is war
Silence is the knowledge of the soul
For some the answer is silence
The answer to some is word
Both speech and silence are necessary
Know how to use them
Those who know that can always be happy.

Sanatana Bhasha Sravani. Silence is not not speaking, it is not being dumb and expressing our feelings through gestures or writings.It is not thinking silently, it is not talking with the mind by restraining the speech, silence is the inner body (the inner body which consists of mind, intellect, chitta and egos is called inner body. Stopping vijrumbhana.

Silence is seeing ourselves clearly without thoughts, feelings, anger, illusions, desires and wordsSilence is complete concentration of the soul.

Maunamante - continuous speech. Penance without worry or worry. Attitude of immense joy. Vishaya Shunyavastha.

Sri Shankara said that Vajnirodhah is the first step in yoga.

Silence is the gateway to divine vision. That is the source of everything. That is Maharnavam. Everything starts from it and is absorbed back into it. Silence is one of the five sanctities (fasting, chanting, silence, repentance, peace) prescribed for the expiation of sins. Silence is the state in which ego activity does not arise at all.

This silence is of three types.

1. Vajmaunam :-🙏

Prohibition of speech.This type of silence removes the evils of speaking harshly, lying, backbiting, backbiting, unnecessary rants, etc.

2. Akshamaunam :-🙏

Karacharanadi is concentrating without making any gesture with the eye organs. Due to this silence, through the control of the senses, the meditative Vairagya becomes well accustomed.

3. Kastha silence :-🙏

This is called mental silence. The mind that travels in many ways in silence is called Kashtha silence, which gradually comes to a state of perfect silence by keeping the mind in contemplation of God and self-realization. This silence becomes self-realization.

"When the throat is silent, the mind speaksThe heart speaks when the mind is silent. When the heart is silent the inner soul feels'.

Silence...

Dakshinamurti's silence is satyabodha.

Guru's silence is wisdom.

The silence of the wise is silent speech.

A devotee's silence is a prayer without words.

Silence is the habit of spiritual practice. Mind should be suppressed in Sadhana. Internal purification should take place. Only then, that's where the 'silence' begins. It is from this silence that wisdom arises. Silence is the real perfect knowledge.
It is this knowledge that bestows liberation.

Silence preaches inwardness, introverted journey, reveals inwardness, reveals our inner self in front of us, becomes self-realization. Silence is a silent conversation without the barriers of words, says Sri Ramanu. Silence is the most powerful languageWhat many years cannot know by actions can be known by silence.

Words have an ebb and flow but silence is a clear slow steady stream of wisdom.

The Mahatmas say that those who master the morals of speech and speak with truth, peace, spirit, moderation, compassion, and soulfulness are always Mahamaunaleya.

'Maunavakhya Prakatita Parabrahmatvam' The divinity that is beyond the reach of the mind is declared through silence.

God is not a person, not a form. God means a philosophy, a truth.
It can be memorized and realized through silence.

Only silence is more beautiful, meaningful, superior, wonderful than the world of noise.

Silence is truth, Shiva, beauty.
This is absolute joy and the solution to many problems
This is self-realization, this is moksha.... silence is to be had only within... it is possible only through proper practice...
Silence in the mouth and emptiness in the mind is called meditation
[21/02, 1:02 am] pasupula Pullarao: [20/02, 7:44 अपराह्न] पसुपुला पुल्लाराव: जन्म-जन्मांतर के बुरे कर्मों के कारण विभिन्न समस्याओं से पीड़ित, अंधकारमय समस्याओं से पीड़ित मनुष्य, उचित अभ्यास के माध्यम से आध्यात्मिक ज्ञान का दीपक जलाएं, सभी समस्याओं का अंधेरा दूर हो जाता है। आप जो कुछ भी चाहते हैं, जहां भी आप चाहते हैं, उसे सार्वभौमिक रोशनी के माध्यम से प्राप्त करने के लिए मंत्र ही एकमात्र मंत्र है... आपकी ऊर्जाएं ब्रह्मांडीय कल्याण के लिए ब्रह्मांडीय योजना के हिस्से के रूप में जुड़ी हुई हैं... केवल ऐसे आध्यात्मिक ध्यान सैनिकों के माध्यम से ही बुद्धिमान प्रबुद्ध हो सकते हैं... द्वारा बुद्धिमान स्वर्गदूतों के शासन में, ये चमत्कार होते हैं... यहाँ भौतिक संसार में भी कुछ विपरीत घटनाएँ घटती हैं... ताकतवरों के शब्दों का पालन किया जाता है और कमजोरों द्वारा उनका अनुसरण किया जाता है। .
[20/02, 7:48 अपराह्न] पसुपुला पुल्लाराव: हरिओम , - - *मौन क्या है*

मौन मानसिक शांति है
वाणी भौतिक ध्वनि है
मौन ही समस्या का समाधान है
शब्द समस्या उत्पन्न करता है
यदि शब्द सीमा पार करते हैं, तो यह युद्ध है
मौन आत्मा का ज्ञान है
कुछ के लिए उत्तर मौन है
कुछ का उत्तर शब्द है
वाणी और मौन दोनों आवश्यक हैं
जानिए इनका उपयोग कैसे करना है
जो लोग यह जानते हैं वे हमेशा खुश रह सकते हैं।

सनातन भाषा श्रावणी. मौन बोलना नहीं है, यह गूंगा होना नहीं है और इशारों या लेखन के माध्यम से अपनी भावनाओं को व्यक्त करना है। यह चुपचाप सोचना नहीं है, यह वाणी को रोककर मन से बात करना नहीं है, मौन आंतरिक शरीर है (आंतरिक शरीर जिसमें शामिल है) मन, बुद्धि, चित्त और अहंकार को आंतरिक शरीर कहा जाता है। विज्रंभना को रोकना।

मौन स्वयं को विचारों, भावनाओं, क्रोध, भ्रम, इच्छाओं और शब्दों के बिना स्पष्ट रूप से देखना है। मौन आत्मा की पूर्ण एकाग्रता है।

मौनामंते - निरंतर भाषण। बिना किसी चिन्ता या चिन्ता के तप करो। अत्यंत आनंद की मनोवृत्ति. विषय शून्यावस्था।

श्री शंकर ने कहा कि वज्निरोधः योग का पहला चरण है।

मौन दिव्य दृष्टि का प्रवेश द्वार है। वही हर चीज़ का स्रोत है. वह महर्णवम् है। हर चीज़ उसी से शुरू होती है और वापस उसी में समाहित हो जाती है। मौन पापों के प्रायश्चित के लिए निर्धारित पांच पवित्रताओं (उपवास, जप, मौन, पश्चाताप, शांति) में से एक है। मौन वह अवस्था है जिसमें अहं की सक्रियता उत्पन्न ही नहीं होती।

यह मौन तीन प्रकार का होता है।

1. वज्मौणं :-🙏

वाणी का निषेध इस प्रकार के मौन से कठोर बोलना, झूठ बोलना, चुगली करना, चुगली करना, अनावश्यक प्रलाप आदि बुराइयाँ दूर हो जाती हैं।

2.अक्षमुनम्:-🙏

कराचरणनाडी नेत्र अंगों से कोई इशारा किए बिना ध्यान केंद्रित कर रही है। इस मौन के कारण, इंद्रियों पर नियंत्रण के माध्यम से, ध्यान करने वाला वैराग्य अच्छी तरह से अभ्यस्त हो जाता है।

3. कष्ट मौन :-🙏

इसे मानसिक मौन कहा जाता है। मौन में अनेक प्रकार से भ्रमण करने वाले मन को काष्ठ मौन कहा जाता है, जो मन को ईश्वर के चिंतन और आत्म-साक्षात्कार में लगाकर धीरे-धीरे पूर्ण मौन की स्थिति में आ जाता है। यह मौन आत्मबोध बन जाता है।

"जब गला शांत होता है तो मन बोलता है। जब मन शांत होता है तो हृदय बोलता है। जब हृदय शांत होता है तो अंतरात्मा महसूस करती है।"

मौन...

दक्षिणामूर्ति का मौन सत्यबोध है।

गुरु का मौन ही ज्ञान है.

बुद्धिमान का मौन मौन वाणी है।

एक भक्त का मौन शब्दों के बिना प्रार्थना है।

मौन साधना की आदत है. साधना में मन को दबाना चाहिए। आंतरिक शुद्धि होनी चाहिए। तभी, यहीं से 'मौन' शुरू होता है। इसी मौन से ज्ञान उत्पन्न होता है। मौन ही वास्तविक पूर्ण ज्ञान है।
यह ज्ञान ही मुक्ति प्रदान करता है।

मौन आंतरिकता का उपदेश देता है, अंतर्मुखी यात्रा करता है, आंतरिकता को उजागर करता है, हमारे भीतर के स्वत्व को हमारे सामने प्रकट करता है, आत्मबोध कराता है। श्री रामानु कहते हैं, मौन शब्दों की बाधाओं के बिना एक मूक बातचीत है। मौन सबसे शक्तिशाली भाषा है जो कई वर्षों तक कार्यों द्वारा नहीं जाना जा सकता वह मौन द्वारा जाना जा सकता है।

शब्दों में उतार-चढ़ाव होता है लेकिन मौन ज्ञान की एक स्पष्ट धीमी स्थिर धारा है।

महात्मा कहते हैं कि जो वाणी की नैतिकता में पारंगत होते हैं और सत्य, शांति, भावना, संयम, करुणा और आत्मीयता के साथ बोलते हैं वे हमेशा महामौनलेय होते हैं।

'मौनवख्य प्रकटिता परब्रह्मत्वम्' जो दिव्यता मन की पहुंच से परे है, उसे मौन के माध्यम से घोषित किया जाता है।

ईश्वर कोई व्यक्ति नहीं है, कोई रूप नहीं है। ईश्वर का अर्थ है एक दर्शन, एक सत्य।
इसे मौन के माध्यम से याद और महसूस किया जा सकता है।

केवल मौन ही शोर की दुनिया से अधिक सुंदर, सार्थक, श्रेष्ठ, अद्भुत है।

मौन ही सत्य है, शिव है, सौंदर्य है।
यह परम आनंद है और कई समस्याओं का समाधान है
यही आत्म-साक्षात्कार है, यही मोक्ष है.... मौन केवल भीतर ही होना चाहिए... यह केवल उचित अभ्यास से ही संभव है...
मुख में मौन और मन में शून्यता को ही ध्यान कहते हैं
[21/02, 1:02 am] pasupula Pullarao: [20/02, 7:44 PM] Pasupula Pullarao: இருண்ட பிரச்சனைகளால் அவதிப்படும் மனிதர்கள், பிறப்பு முதல் பிறவி கெட்ட கர்மாவினால் பல்வேறு பிரச்சனைகளால் அவதிப்பட்டு, முறையான பயிற்சியின் மூலம் ஆன்மிக ஞான தீபம் ஏற்றினால், அனைத்து பிரச்சனைகளின் இருள் விலகும். . யுனிவர்சல் லைட் மூலம் நீங்கள் எங்கு வேண்டுமானாலும் எதை வேண்டுமானாலும் அடைய மந்திரம் மட்டுமே மந்திரம்... உங்கள் ஆற்றல்கள் உலகளாவிய நல்வாழ்வுக்கான காஸ்மிக் திட்டத்தின் ஒரு பகுதியாக இணைக்கப்பட்டுள்ளன... அத்தகைய ஆன்மீக தியான வீரர்களால் மட்டுமே ஞானிகளால் முடியும். ஞானம் பெறுங்கள்... ஞான தேவதைகளின் ஆட்சியால், இந்த அற்புதங்கள் நடக்கின்றன... இங்கே பௌதிக உலகிலும் சில பாதகமான நிகழ்வுகள் நிகழ்கின்றன. ,
[20/02, 7:48 PM] Pasupula Pullarao: Hariom, - - *மௌனம் என்றால் என்ன*

மௌனம் மன அமைதி
பேச்சு என்பது உடல் ஒலி
மௌனமே பிரச்சினைக்கு தீர்வு
வார்த்தைகள் பிரச்சனைகளை ஏற்படுத்தும்
வார்த்தைகள் எல்லை மீறினால் அது போர்
அமைதி என்பது ஆன்மாவின் அறிவு
சிலருக்கு மௌனம்தான் பதில்
சிலவற்றிற்கு பதில் வார்த்தை
பேச்சு, மௌனம் இரண்டும் அவசியம்
அவற்றை எவ்வாறு பயன்படுத்துவது என்பது தெரியும்
இதை அறிந்தவர்கள் எப்போதும் மகிழ்ச்சியாக இருக்கலாம்.

சனாதன் மொழி ஷ்ரவணி. மௌனம் என்பது பேசுவது அல்ல, ஊமையாக இருப்பது அல்ல, சைகைகள் அல்லது எழுத்து மூலம் உங்கள் உணர்வுகளை வெளிப்படுத்துவது. மௌனமாகச் சிந்திப்பது இல்லை, பேச்சை நிறுத்தி மனதுடன் பேசாமல் இருப்பது, மௌனம் என்பது உள் உடல் (உள்ளடங்கும் உள்ளுடல்) மனம், புத்தி, சித்தம், அகங்காரம் ஆகியவையே உள் உடல் எனப்படும். விக்ரம்பனை நிறுத்துதல்.

மௌனம் என்பது எண்ணங்கள், உணர்ச்சிகள், கோபம், குழப்பம், ஆசைகள் மற்றும் வார்த்தைகள் இல்லாமல் உங்களைத் தெளிவாகப் பார்ப்பது. அமைதி என்பது ஆன்மாவின் முழுமையான செறிவு.

மௌனமந்தே - தொடர் பேச்சு. எந்த கவலையும் கவலையும் இல்லாமல் தவம் செய்யுங்கள். அதீத மகிழ்ச்சியின் அணுகுமுறை. பொருள் வெற்றிட நிலை.

வஜ்னிரோத் யோகாவின் முதல் நிலை என்று ஸ்ரீ ஷங்கர் கூறினார்.

மௌனம் தெய்வீக தரிசனத்திற்கான நுழைவாயில். அவனே எல்லாவற்றுக்கும் ஆதாரம். அதுவே மஹர்ணவம். அனைத்தும் அவனிடமிருந்தே தொடங்கி அவனுள் மீண்டும் இணைகிறது. மௌனம் என்பது பாவ நிவர்த்திக்காக விதிக்கப்பட்ட ஐந்து புனிதங்களில் (விரதம், மந்திரம், மௌனம், தவம், அமைதி) ஒன்றாகும். அமைதி என்பது ஈகோ செயல்பாடு எழாத நிலை.

இந்த மௌனத்தில் மூன்று வகை உண்டு.

1. வாழ்மௌனம் :-🙏

பேச்சுத் தடை: இந்த வகையான மௌனம், கடுமையான பேச்சு, பொய், புறம் பேசுதல், பழிவாங்குதல், தேவையில்லாத வதந்தி போன்ற தீமைகளை நீக்குகிறது.

2.அக்ஷ்முனம்:-🙏

கண் உறுப்புகளிலிருந்து எந்த சமிக்ஞையும் இல்லாமல் கராச்சரநதி குவிகிறது. இந்த மௌனத்தின் காரணமாக, புலன்களைக் கட்டுப்படுத்துவதன் மூலம், தியானம் செய்பவர் துறவறத்தில் நன்கு ஒத்துப்போகிறார்.

3. துன்பம் அமைதியானது :-🙏

இது மன அமைதி என்று அழைக்கப்படுகிறது. பலவாறாக மௌனத்தில் அலைந்து திரியும் மனதைக் காஷ்ட மௌன் எனப்படும், அது படிப்படியாக மனதை இறை சிந்தனையிலும், சுயஉணர்தலிலும் ஈடுபடுத்தி முழுமையான அமைதி நிலைக்கு வரும். இந்த மௌனம் தன்னை உணர்தல் ஆகிவிடும்.

"தொண்டை அமைதியாக இருக்கும்போது மனம் பேசுகிறது. மனம் அமைதியாக இருக்கும்போது இதயம் பேசுகிறது. இதயம் அமைதியாக இருக்கும்போது மனசாட்சி உணர்கிறது."

மௌனம்...

தட்சிணாமூர்த்தியின் மௌனமே உண்மை.

குருவின் மௌனமே அறிவு.

ஞானியின் மௌனம் மௌனம்.

ஒரு பக்தனின் மௌனம் வார்த்தைகளற்ற பிரார்த்தனை.

மௌனம் தியானத்தின் ஒரு பழக்கம். தியானத்தில் மனதை அடக்க வேண்டும். உள் சுத்திகரிப்பு இருக்க வேண்டும். பின்னர், இங்கிருந்து 'மௌனம்' தொடங்குகிறது. இந்த மௌனத்திலிருந்து அறிவு உருவாகிறது. மௌனமே உண்மையான முழுமையான அறிவு.
இந்த அறிவுதான் விடுதலையை அளிக்கிறது.

மௌனம் உள்நோக்கத்தைப் போதிக்கும், உள்முகப் பயணம், அகத்தை அம்பலப்படுத்துகிறது, நம் உள்ளத்தை நமக்கு வெளிப்படுத்துகிறது, சுயஉணர்வைத் தருகிறது. ஸ்ரீ ராமானு கூறுகிறார், மௌனம் என்பது வார்த்தைகளின் தடைகள் இல்லாத அமைதியான உரையாடல். மௌனம் மிகவும் சக்தி வாய்ந்த மொழி.பல ஆண்டுகளாக செயல்களால் அறிய முடியாததை மௌனத்தால் அறிய முடியும்.

வார்த்தைகள் மாறுகின்றன ஆனால் மௌனம் என்பது தெளிவான மெதுவான நிலையான அறிவின் நீரோடை.

பேச்சின் நெறிமுறையில் வல்லவர்களும், உண்மை, அமைதி, உணர்ச்சி, கட்டுப்பாடு, கருணை மற்றும் நெருக்கம் ஆகியவற்றுடன் பேசுபவர்கள் எப்போதும் மகாமௌன்லேயர்கள் என்று மகாத்மா கூறுகிறார்.

'மௌனவாக்கிய ப்ரபத்தித பரப்ரஹ்மத்வம்' மனதிற்கு எட்டாத தெய்வீகம் மௌனத்தின் மூலம் அறிவிக்கப்படுகிறது.

கடவுள் ஒரு நபர் அல்ல, எந்த வடிவமும் இல்லை. கடவுள் என்றால் ஒரு பார்வை, ஒரே உண்மை.
அதை மௌனத்தின் மூலம் நினைவில் வைத்து உணர முடியும்.

இரைச்சல் உலகத்தை விட மௌனம் மட்டுமே அழகானது, அர்த்தமுள்ளது, உயர்ந்தது, அற்புதமானது.

மௌனமே உண்மை, சிவம், அழகு.
இது இறுதி பேரின்பம் மற்றும் பல பிரச்சனைகளுக்கு தீர்வு
இதுவே சுயஉணர்தல், இதுவே முக்தி...மௌனம் உள்ளத்தில் மட்டுமே இருக்க வேண்டும்...சரியான பயிற்சியால் மட்டுமே சாத்தியம்...
வாயில் மௌனமும் மனதில் வெறுமையும் தியானம் எனப்படும்.

Friday, February 23, 2024

గర్భరక్షాంబిక కథ

 🌹🙏గర్భరక్షాంబిక మంత్రాలను పఠించండి🙏🌹

గర్భరక్షాంబిక అంటే పుట్టబోయే బిడ్డను రక్షించే తల్లి అని అర్థం. తమిళనాడు రాష్ట్రంలో పాపనాశనం అనేచోట ఈ గుడి ఉన్నది.

తిరుకవుగార్ అనే చిన్న తాలూకాలో ఈ ఆలయం ఉన్నది. శివపార్వతులు ఈ గుడిలో గర్భరక్షాంబికై, ముల్లివన నాథార్ అవతారాలలో దర్శనమిస్తారు.

తమిళనాడులోని అమ్మవారి రూపాలలో గర్భరక్షాంబికై ప్రాముఖ్యమైనది. అమ్మవారు పుట్టబోయే బిడ్డను కాపాడుతుందని నమ్ముతారు. పిల్లల్లేని వారు కూడా ఈ అమ్మవారిని కొలుస్తారు.

గర్భరక్షాంబిక కథ

అనగనగా ఒకప్పుడు నిధృవ అనే మహర్షి ఉండేవారు. ఆయన తన భార్య వేదికతో ఆశ్రమంలో నివసించేవారు. పిల్లల్లేని వారికి ఎన్నో పూజల తర్వాత, పార్వతీదేవి ఆశీస్సులతో వేదిక గర్భం దాలుస్తుంది. నెలలు నిండేవరకు ఆమె ఆరోగ్యంగానే ఉన్నది.

ఆఖరి నెలలలో ఉండగా, నిధృవ మహర్షి వరుణదేవుడ్ని కలవడానికి వెళ్తాడు. అతని భార్య ఆశ్రమంలో ఒంటరిగా ఉంటుంది. ఆమె పనులతో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది.
ఆ సమయంలో, ఊర్ధవపాద అనే మహర్షి ఆశ్రమానికి వస్తారు. వేదిక గర్భవతని తెలీక, ఆమె అతనికి అతిథి సత్కారాలు చేయలేదని ఆగ్రహిస్తాడు. ఆయన వేదికను రాయత్చు అనే అరుదైన వ్యాధికి గురవుతుందని శపిస్తాడు.

ఈ వ్యాధి వేదికను మాత్రమే కాక ఆమె బిడ్డపై కూడా ప్రభావం చూపిస్తుంది. వేదిక పార్వతి అమ్మవారిని శరణుకోరుతుంది. పార్వతీదేవి దర్శనమిచ్చి పుట్టబోయే బిడ్డను పుట్టేవరకూ కలశంలో భద్రపరుస్తుంది.

బిడ్డ పుట్టాక అతని పేరు నైధృవన్ అని పెడతారు. వాడికి పార్వతీపరమేశ్వరుల ఆశీస్సులు వుంటాయి. కామధేనువు అతనికి పాలిస్తుంది. నిధృవ మహర్షి ఈ కరుణకి పొంగిపోయి పార్వతీపరమేశ్వరులను అక్కడే ఉండిపొమ్మని కోరతాడు.

ఈ విధంగా వారు వేదికను రక్షించిన విధంగా తిరుకవుగార్ లో గర్భరక్షంబికై, ముల్లైవన నాథార్ రూపాలలో భక్తులను కాపాడుతున్నారు. ప్రతి స్త్రీ ఈ అమ్మవారిని రక్షకోసం ప్రార్థించవచ్చు.
గర్భరక్షాంబికై గాయత్రి మంత్ర

"ఓం గర్భరక్షాంబిగాయై చ విద్మహే

మంగళ దేవదాయై చ ధీమహీ

ధన్నో దేవి ప్రచోదయాత్"

గర్భరక్షాంబికై స్తోత్రం

ఈ స్తోత్రం బిడ్డ పుట్టేవరకూ చదవండి.

శ్లోకం-1
ఏహ్యహి భగవాన్ బ్రహ్మన్, ప్రజా- కర్తాహ ప్రజాపతే ।
ప్రగ్రిహ్నీష్వ బలిం స-ఇమాం సాపత్యం రక్ష గర్భీణం ॥

అర్థం ; ఓ బ్రహ్మా, సృష్టికర్తా, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించు.

శ్లోకం -2
అశ్వినౌ దేవ దేవేశౌ, ప్రగ్రుహ్నీధన్ బలిం ద్విమాం ।
సాపత్యం గర్భిణీం స-ఇమాం స రక్షతం పూజయానయా ॥

అర్థం ; ఓ అశ్వినీ దేవతలారా, దైవ వైద్యులారా, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించు.

శ్లోకం -3
రుద్రాక్ష ఏకాదంశ బ్రోక్త, ప్రగ్రహనంతు బలిం ద్విమాం । యక్షమాగం ప్రీతయే వృతం, నిత్యం రక్షంధు గర్భిణీం ॥

ఓ పదొకొండు రుద్రులారా, మీకు నచ్చిన ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించండి.

శ్లోకం -4
ఆదిత్యా ద్వాదశ బ్రోక్తహ, ప్రగ్రిమ్నీత్వం బలిం త్విమం । యశ్మాకం తేజసం వృధ్య, నిత్యం రక్షత గర్భిణీం ॥

ఓ పన్నెండు సూర్యదేవతలారా, మీ కాంతిని మాపై ప్రసరించి, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించండి.

శ్లోకం -5
వినాయక గణాధ్యక్ష, శివపుత్ర మహాబల ।
ప్రగ్రిహ్నీశ్వ బలిం స- ఇమం, సాపత్యం రక్ష గర్భిణీం ॥

అర్థం ; ఓ వినాయక, ఓ గణేషా, ఓ పరమశివ పుత్రా, శక్తికి ప్రతిరూపమా, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించండి.

శ్లోకం -6
స్కంధ షణ్ముగ దేవేశ పుత్ర ప్రీతి వివర్ధన ।
ప్రగ్రిహ్నీస్వ బలిం స-ఇమం, సాపత్యం రక్ష గర్భిణీం ॥

అర్థం ; ఓ స్కందా, ఆరుతలల దేవా, దేవతలకే అధిపతి, మా బిడ్డలపై ప్రేమను పెంచే దేవతలారా, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించండి

శ్లోకం -7

ప్రభాసహ ప్రభవస్యమహా ప్రత్యోషౌ మారుథోఎనాలహ ।
ద్రువోధర ధరసైవ, వాసవోఎస్తో ప్రకీర్తితహ ।
ప్రగృహ్నీత్వం బలిం స-ఇమం, నిత్యం రక్షతహ గర్భిణీం ॥

అర్థం ; ఓ ప్రభాసా, ఓ ప్రభవా, ఓ శ్యామా, ఓ ప్రత్యూషా, ఓ మారుత, ఓ అనలా, ఓ ధృవా, ఓ ధురధురా, ఎనిమిది వసువులారా, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించండి.

శ్లోకం -8
పితుర్దేవి పిధుశ్రేష్టే, బహు పుత్రీ మహా బలే ।
భూధ శ్రేష్టే నిశ వాసే , నిర్విర్తే షౌనగప్రియే ।
ప్రగ్రిహ్నీస్వ బలిం స -ఇమం, సాపత్యం రక్ష గర్భిణీం ॥

అర్థం; అందరు స్త్రీలనూ కూతుళ్ళుగా పొందిన అమ్మా, శక్తిరూపిణి, అందరికన్నా గొప్పదైన తల్లీ, చీకటిలో మమ్మల్ని కాపాడే అమ్మ, అందానికి ప్రతిరూపమా, శౌనకునిచే పూజింపబడ్డ తల్లి, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించండి.

శ్లోకం -9
రక్ష రక్ష మహదేవ, భక్త - అనుగ్రహ కరగ ।
పక్షి వాహన గోవింద, సాపత్యం రక్ష గర్భిణీం ॥

అర్థం ; గొప్పవాడైన స్వామి, మమ్మల్ని కరుణతో కాపాడి రక్షించు, వరాలిచ్చే గోవిందుడా, పక్షివాహనాన్ని అలంకరించిన స్వామీ, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించండి.

🌹శ్రీ మాత్రే నమః 🌹

Tuesday, February 20, 2024

హిందూ మెజారిటీ దేశంలో ఇదంతా ఎలా జరిగింది???? ఎవరి ప్రయోజనం కొరకు జరిగింది. ఆలోచించండి.

 🌹🌺🌹✍️✍️✍️✍️✍️✍️✍️నానక్ కు ముందు సిక్కులు లేరు!

యేసుకు ముందు క్రైస్తవుడు లేడు!

మహమ్మద్‌కు ముందు ముస్లిం లేడు!

రిషభదేవునికి ముందు జైనుడు లేడు!

బుద్ధుడికి ముందు బౌద్ధుడు లేడు!

కార్ల్ మార్క్స్ ముందు వామపక్షవాది లేడు!

కానీ :--
కృష్ణుడి కంటే ముందు రాముడు...

రామునికి ముందు జమదగ్ని...

జమదగ్నికి ముందు అత్రి..

అత్రికి ముందు అగస్త్యుడు...

అగస్త్యుడికి ముందు పతంజలి...

పతంజలికి ముందు కనద్....

కనదకు ముందు యాజ్ఞవల్క్యుడు....

యాజ్ఞవలక్యుడు ముందు.……

"సనాతన వేదాలు అన్నీ ధర్మబద్ధమైనవే..!

 *"రాజకీయ చదరంగం"లో ఈ -"12 ఎత్తుగడలు", జాగ్రత్తగా -"చూడండి మరియు అర్థం చేసుకోండి"....?*

01. "మొఘలులు" "భారతీయులు" అయ్యారు...?
మరి, "భారతీయుడు.," "కాఫిర్".. ..?

02. "గియాసుద్దీన్ ఖాన్" :-
మోతీలాల్, జవహర్‌లాల్ "నెహ్రూ"
-ఇందిర, రాజీవ్, -మినో, "గాంధీ" అయ్యారా..?
మరియు.., "భారతీయుడు", "మూర్ఖుడు"....?*

03. "మోమిన్" "కాశ్మీరీ" అయింది... ?
మరి, "కాశ్మీరీ పండితులు", "శరణార్థులు"....?

04. "బంగ్లాదేశీ" "బెంగాలీ" అయింది...?
మరి, "బెంగాలీ", "హిందూ వెలుపల".....?

05. "సైనికుల కిల్లర్స్" మరియు "స్టోన్ పెల్టర్స్"....,"ఉద్యమం" అయింది.....? మరియు "సైన్యం",
"మానవ హక్కుల ఉల్లంఘన"....?*

06. "తుక్డే-తుక్డే గ్యాంగ్" "దేశభక్తుడు" అయింది...?
మరియు, "దేశభక్తులు",
"బ్రాండెడ్ హార్డ్ కోర్ తీవ్రవాది......?*

07. "పైర్ కలప",
"పర్యావరణ ఆందోళన" మారింది...
మరియు, "ఖననం"లో, "భూమిని వృధా చేయాలి",
"జన్మహక్కు" అయింది...?

08. "రాఖీ"లో ఉపయోగించబడింది
- "ఉన్ని" నుండి, అది "గొర్రెలబాధ" అయ్యింది..?,
మరియు,
"బక్రీద్"లో - "వేలాది మేకల వధ",
"మత స్వాతంత్ర్యం" అయింది...?

09.
"బుజ్జగింపు" "సెక్యులర్" అయింది.....?
అయితే, "సారూప్యత" "కమ్యూనల్" అయింది....?

10.
"ఆర్‌ఎస్‌ఎస్" "ఉగ్రవాదిగా" మారింది...?
మరియు, "ఒసామా జీ"..., "హఫీజ్ సాహెబ్"..., మరియు -"హురియత్",
"శాంతి శిఖరం"......

11. "భారతమాతా చిరకాలం జీవించు", "కమ్యూనల్" అయింది...? మరియు,
"భారత్ తేరే తుక్డే హోంగే"
"వ్యక్తీకరణ స్వేచ్ఛ? అయింది!

12. “విభజించు మరియు పాలించు” అనేది “నియమం”….?మరియు..,
“సబ్కా సాథ్ సబ్కా వికాస్” “జుమ్లా”..?

కొంచెం ఆలోచించండి...? మరియు "అర్థం చేసుకోండి"... అది :-
హిందూ మెజారిటీ దేశంలో ఇదంతా ఎలా జరిగింది???? ఎవరి ప్రయోజనం కొరకు జరిగింది.

ఆలోచించండి.

"మజ్బూర్ హిందువు" అయినందున, నేను మిమ్మల్ని "అభ్యర్థిస్తున్నాను" - - కనీసం "10 మందికి", లేదా - తప్పనిసరిగా "సమూహం"కి పంపండి.
🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹

Monday, February 19, 2024

ఆత్మ సత్య తత్వములు

 .        *ఆత్మ సత్య తత్వములు*
.       ************************

   ఓ మనిషీ ! నీవెందుకొ స్వార్థానికి బానిస ! 
       అదను చూచి నిను హరించ
              పొంచి ఉంది మృత్యు నిషా ! 
       ఈ తనువూ చితికెనా ! 
              వినూత్న తనువు కావలెనా !   
వెంటనె నీ వెంట ఉన్న మృత్యువును వరించుమా ! 
                ధన్యుడిగ తరించుమా ! 

    ప్రతి జన్మకు జననము మరణములు
                                       ఆది అంతములు.
కానీ నిజముగ ఆత్మకు లేవు ఆది అంతములు. 
     చెడి తడబడు ఈ తనువును
                      విసర్జించుటే మరణము. 
  సరికొత్త వినూత్న తనువు ధారణయే జననము. 

       జనమునకు మరణమునకు 
                    నడుమ ఉండు జీవనము
        ఆత్మకు తాత్కాలికమౌ 
                   స్వప్న తుల్య భావనము.
ఎక్కడ ఎపుడెటులున్నను ఇంతె గాద మనము ! 
                                        ఇంతేగా దమనము ! 
ఏనాడూ ఎటులుండునొ పరిస్థితుల తోరణము !? 
                                     పరిస్థితులతో రణము !? 

          దేవుడు కలడని కొందరు ! 
                దేవుడు లేడని కొందరు ! 
   దేవుడు కలడో లేడో తెలిసిన వారెందరు ?! 
          అగ్ని అగ్నిలోన కలిసి
                 విడిపోతూ కలియు రీతి
         పరమాత్మలొ ఆత్మ కలిసి
                 విడిపోవుటె అనుభూతి. 

      ఈ మున్నాళ్ళా ముచ్చటకే
              ఎందుకు తలబిరుసు మనకు ?! 
       సుగుణ సత్ప్రవర్తనమున
                కలుగు ముక్తి ప్రగతి మనకు ! 
    ఇది గ్రహించి నడుచుకొనిన
             ఉండవు సుఖ దుఃఖమ్ములు.
      సుఖ దుఃఖములకు అతీత -
                మాత్మ సత్య తత్వమ్ములు.

              ********************
  రచన :---- రుద్ర మాణిక్యం (✍️కవి రత్న) 
   రిటైర్డ్ టీచర్.  జగిత్యాల (జిల్లా) 

*************************************

Friday, February 16, 2024

****Indian Yoga.. Secret...* Why did our sages survive all these years? That secret...

 [10/02, 7:28 pm] pasupula Pullarao: *Indian Yoga.. Secret...*

Why did our sages survive all these years?
That secret...

*breathe*
-------------
Man breathes "15 times" per minute...100 to 120 yrs..lives.Turtle breathes "3 times" per minute...500 yrs. s will survive.

But how does reduction of 'breathing' through pranayama increase lifespan....?

This is an 'article' that explains this scientifically...
Then we will know what is the power and greatness of Pranayama.

Our body is made up of billions of cells. One gram of human flesh contains billions of cells. These are called "cells". Each of these cells has a special cell system called 'mitochondria' (green cell).

These mitochondria - when we breathe, take in the 'oxygen' in the air and burn it.
By this "heat" is born.
This heat is the "life force" we need to survive.
In this way heat is generated in every cell of the body from the toe nail to the end of the head hair.

Each cell generates heat 15 times per minute.
Because we breathe "15 times" per minute...
A cell like this works continuously for 3 days and then loses its ability to generate heat and dies...
Such dead cells leave the body in the form of impurities.
Whenever a dead cell is shed, a new cell is created in its place by the food we eat.

For example - 1000 dead cells are formed in our heart, so...
All those cells go out through excretion i.e. sweat, spit, urine and only when a space is created in the heart...
New cells are formed in that place.

Just empty the old ones...
New ones will come.
That is why our daily bowel movements are very important.

Whoever defecate properly...
Their body is full of these "dead cells (toxins)".
Heat is not generated properly.
Get seriously ill...

So these toxins
"Detoxification" that sends out
(Excretion)"
Very important.

If a cell generates heat 15 times...it lives for 3 days.

If the same cell produces 14 times the heat...

Lives for 5 days

If 13 times the heat is produced...

Lives for 7 days

In this way we.. reduce the number of 'breaths'...
The lifespan of our cells increases.

But if a machine does more work, it will do it faster.
Also these cells are…

Indian Yogis...
The life span of a cell...
3 to 21 days
Penchi...was able to live for 2100 years.

As we breathe more and more…

Every cell in the body is under intense pressure...
The cell is quickly destroyed.

If by practicing prana yama the number of "breaths"* can be reduced and the working days of the cells can be increased......
Every organ in our body will work harder for a few days...

Because...

Organs are...
A collection of cells.

Like every organ in us...
If the life span increases...

*Our life expectancy has also increased.!!*

*If we can reduce one "breath"...*
*20 years life expectancy*
*may increase...*

*Yogis...*
*By counting the number of these breaths...*
*They... will die one day...*
* Will be told before 🙏🙏.
[10/02, 7:28 pm] pasupula Pullarao: *भारतीय योग..रहस्य...*

हमारे ऋषि-मुनि इतने वर्षों तक जीवित क्यों रहे?
वह रहस्य...

*साँस लेना*
-----------------
मनुष्य प्रति मिनट "15 बार" सांस लेता है...100 से 120 साल...जीवित रहता है। कछुआ प्रति मिनट "3 बार" सांस लेता है...500 साल। जीवित रहेगा.

लेकिन प्राणायाम से 'श्वास' कम करने से कैसे बढ़ती है उम्र....?

यह एक 'लेख' है जो इसे वैज्ञानिक रूप से समझाता है...
तब हमें पता चलेगा कि प्राणायाम की शक्ति और महिमा क्या है।

हमारा शरीर अरबों कोशिकाओं से बना है। मानव मांस के एक ग्राम में अरबों कोशिकाएँ होती हैं। इन्हें "कोशिकाएँ" कहा जाता है। इनमें से प्रत्येक कोशिका में एक विशेष कोशिका प्रणाली होती है जिसे 'माइटोकॉन्ड्रिया' (हरित कोशिका) कहा जाता है।

ये माइटोकॉन्ड्रिया - जब हम सांस लेते हैं, तो हवा में 'ऑक्सीजन' लेते हैं और उसे जलाते हैं।
इससे ''गर्मी'' पैदा होती है।
यह ऊष्मा वह "जीवन शक्ति" है जिसकी हमें जीवित रहने के लिए आवश्यकता है।
इस प्रकार पैर के अंगूठे के नाखून से लेकर सिर के बालों के सिरे तक शरीर की प्रत्येक कोशिका में गर्मी उत्पन्न होती है।

प्रत्येक कोशिका प्रति मिनट 15 बार ऊष्मा उत्पन्न करती है।
क्योंकि हम प्रति मिनट "15 बार" सांस लेते हैं...
इस तरह की एक कोशिका 3 दिनों तक लगातार काम करती है और फिर गर्मी पैदा करने की क्षमता खो देती है और मर जाती है...
ऐसी मृत कोशिकाएं अशुद्धियों के रूप में शरीर से बाहर निकल जाती हैं।
जब भी कोई मृत कोशिका निकलती है तो हमारे द्वारा खाए गए भोजन से उसकी जगह एक नई कोशिका बन जाती है।

उदाहरण के लिए - हमारे हृदय में 1000 मृत कोशिकाएँ बनती हैं, इसलिए...
वे सभी कोशिकाएँ उत्सर्जन के माध्यम से बाहर निकल जाती हैं। पसीना, थूक, पेशाब और तभी जब दिल में जगह बन जाये...
उस स्थान पर नई कोशिकाएँ बनती हैं।

बस पुराने खाली कर दो...
नए आएंगे.
इसीलिए हमारा दैनिक मल त्याग बहुत महत्वपूर्ण है।

जो भी ठीक से शौच करता है...
उनका शरीर इन "मृत कोशिकाओं (विषाक्त पदार्थों)" से भरा हुआ है।
गर्मी ठीक से उत्पन्न नहीं होती है।
गंभीर रूप से बीमार हो जाओ...

तो ये विषाक्त पदार्थ
"विषहरण" जो बाहर भेजता है
(उत्सर्जन)"
बहुत ज़रूरी।

यदि कोई कोशिका 15 बार ऊष्मा उत्पन्न करती है...तो वह 3 दिन तक जीवित रहती है।

यदि एक ही सेल 14 गुना अधिक गर्मी पैदा करता है...

5 दिन तक जीवित रहता है

यदि 13 गुना ऊष्मा उत्पन्न हो...

7 दिन तक जीवित रहता है

इस तरह हम.. 'सांसों' की संख्या कम कर देते हैं...
हमारी कोशिकाओं का जीवनकाल बढ़ जाता है।

लेकिन यदि कोई मशीन अधिक काम करेगी तो वह उसे तेजी से करेगी।
साथ ही ये कोशिकाएँ हैं...

भारतीय योगी...
कोशिका का जीवन काल...
3 से 21 दिन
पेंची...2100 साल तक जीवित रहने में सक्षम था।

जैसे-जैसे हम अधिक से अधिक सांस लेते हैं...

शरीर की प्रत्येक कोशिका तीव्र दबाव में है...
कोशिका शीघ्र नष्ट हो जाती है।

यदि प्राण यम का अभ्यास करके "सांसों"* की संख्या को कम किया जा सकता है और कोशिकाओं के कार्य दिवसों को बढ़ाया जा सकता है...
हमारे शरीर का हर अंग कुछ दिनों तक अधिक मेहनत करेगा...

क्योंकि...

अंग हैं...
कोशिकाओं का संग्रह.

हमारे हर अंग की तरह...
यदि जीवन काल बढ़ जाए...

*हमारी जीवन प्रत्याशा भी बढ़ी है.!!*

*अगर हम एक "सांस" कम कर सकें...*
*20 वर्ष जीवन प्रत्याशा*
*बढ़ सकता है...*

*योगी...*
*इन साँसों की गिनती गिनकर...*
*वे...एक दिन मर जायेंगे...*
*पहले बताया जाएगा 🙏🙏.
[10/02, 7:30 pm] pasupula Pullarao: *భారతీయ యోగ.. రహస్యం...*

మన ఋషులు ఎందుకు అన్ని ఏళ్లు బ్రతికారో 
ఆ రహస్యం ...

*శ్వాస*
-------------
మనిషి నిమిషానికి "15 సార్లు" శ్వాస తీస్తాడు...100 నుండి 120 సం.. బ్రతుకు తాడు.తాబేలు నిమిషానికి "3 సార్లు" శ్వాస తీస్తుంది...500 సం. లు బ్రతుకు తుంది.

ఐతే ప్రాణాయామం ద్వారా 'శ్వాస' లు తగ్గించడం వలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది....?

దీనిని సశాస్త్రీయం గా వివరించే 'వ్యాసం' ఇది...
అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి,గొప్ప దనం ఏమిటో మనకు తెలుస్తుంది.

మన శరీరం  కోట్ల కణాల  కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసం లో కోటాను కోట్ల కణాలు ఉంటాయి. వీటినే " సెల్స్" అంటాం. ఈ ప్రతి కణంలోనూ 'మైటోకాండ్రియా (హరిత రేణువు) అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది.

ఈ మైటోకాండ్రియా- మనం శ్వాస తీసు కున్నప్పుడు,గాలి లోని 'ఆక్సిజన్' ను తీసుకుని మండిస్తుంది. 
దీని ద్వారా "ఉష్ణం" జనిస్తుంది.
ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన " ప్రాణశక్తి".
ఇలా శరీరంలోని కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది...

ఇలా ఒక్కొక్క కణం నిమిషానికి,15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.
ఎందుకంటే, మనం నిమిషానికి "15 సార్లు" శ్వాస తీసుకుంటాం కాబట్టి...
ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటి గా పని చేసి, తరువాత ఉష్ణాన్ని పుట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది...
ఇలాంటి మృత కణాలు మలినాల రూపం లో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి.
ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో,ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవు తుంది......

ఉదాహరణకు - మన  గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి,అను కుంటే...
ఆ కణాలన్నీ విసర్జన అనగా చెమట,ఉమ్మి,మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి, గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే...
ఆ స్థలంలో కొత్తకణాలు తయారవు తాయి.

పాత వాటిని ఖాళీ చేస్తేనే...
కొత్తవి రాగల్గుతాయి.
అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్యమైనది.

ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో... 
వారి శరీరం నిండా ఈ "మృత కణాలు(toxins)" నిండిపోయి,
సరిగా ఉష్ణం జనించక......
తీవ్ర రోగాల బారిన పడతారు...

కనుక ఈ టాక్సిన్ లను
బయటికి పంపే "డిటాక్సీఫీకేషన్
(విసర్జన)"
చాలా ముఖ్యం.

ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...3 రోజులు జీవిస్తుంది.

అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...

5 రోజులు జీవిస్తుంది......

13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...

7 రోజులు జీవిస్తుంది......

ఈ విధంగా మనం.. 'శ్వాస' ల సంఖ్యను తగ్గించే కొద్దీ...
మన కణాలు పని చేసే కాలం పెరుగు తుంది.

ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే...త్వరగా చేస్తుందో......
అలాగే ఈ కణాలు కూడా......

భారతీయ యోగులు ...
కణం యొక్క జీవిత కాలాన్ని...
3 నుండి 21 రోజుల వరకూ
పెంచి...2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.

మనం శ్వాసను ఎక్కువ తీసుకునే కొద్దీ...

శరీరంలోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి...
ఆ కణం త్వరగా పాడై పోతుంది.

*ప్రాణ యామ సాధన ద్వారా "శ్వాస"* ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే......
మన శరీరంలోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది...

ఎందుకంటే......

అవయవాలు అంటే...
కణాల సముదాయమే.

ఇలా మనలోని ప్రతీ అవయవం యొక్క...
ఆయుష్షు పెరిగితే...

*మన ఆయుష్షు కూడా పెరిగినట్టే కదా.!!*

*మనం ఒక్క "శ్వాస"ను తగ్గించ గల్గితే...*
*20 సంవత్సరాల ఆయుష్షును*
*పెంచు కోవచ్చు...*

*యోగులు...*
*ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే...*
*తాము... ఏ రోజు...మరణించేదీ...*
*ముందే చెబుతారు 🙏🙏.

దేహాభిమానం లేకపోతే ఇదంతా కూడా సర్వనాశనమైపోతుంది♪. ఎవరూ ఉండరు♪.

 దేహాభిమానం లేకపోతే ఇదంతా కూడా సర్వనాశనమైపోతుంది♪. ఎవరూ ఉండరు♪.

🪷 “దేహాభిమానం చెడ్డది కదా♪!" అని ఎవరైనా అడుగవచ్చు♪. జ్ఞానానికీ, మోక్షానికీ వెళ్ళే దారిలో దానిని వదిలిపెట్టమన్నారు గానీ, అది లేకుండా జీవితంలో సంచరించడమే సాధ్యంకాదు♪. అది లేకుండా సంచరిస్తే, మనుష్యుడు - త్రాగినవాడు, పిచ్చివాడివలె - తనను ఏ స్తంభానికో వేసి కొట్టుకుంటాడు♪. దేంట్లోనో పడి చచ్చిపోతాడు♪. అలా ఉంటుంది దేహసంరక్షణ♪! “ఈ దేహం నాది. దీనిని సంరక్షించి ఉంచుకుంటాను” అనేటటువంటి వివేకం ఒకటి జీవలక్షణంలో సహజంగా ఉండాలి♪. అట్టి జీవలక్షణము అయిన భావానికి అధిపతి గణపతి♪. వారి దయలేకుండా మనం ఇలా ఉండనే ఉండము♪.

🪷 అప్పుడు ఆ గణపతిని బ్రహ్మదేవుడు తన ముందర ఆవాహన చేసుకున్నాడు♪. ఆ గణపతి బ్రహ్మదేవునికంటే పూర్వుడు♪. _*'బ్రహ్మణాం బ్రహ్మణస్పతి'*_ అని మంత్రం చదువుతాం మనం♪. ఆయన ఎంతటి పూర్వుడంటే... సృష్టి ప్రారంభానికి ముందు ఒకప్పుడు, రాక్షసులతో అమ్మవారు యుద్ధం చేస్తున్నది♪. ఇంకా మనుష్యులే పుట్టకముందుమాట♪. అమ్మవారు పరమేశ్వరుణ్ణి తలచుకొన్నది♪. ఆయన అక్కడ ఉన్నారు♪. వారి ఇద్దరి చూపులు కలసినవి♪. ఆ చూపుల కలయికలో నుండి విఘ్నేశ్వరుడు పుట్టాడు♪. ఆయన పేరు మహాగణపతి♪. అంతటి పూర్వుడాయన♪. ఆ గణపతి యొక్క అవతారాలనే ఇప్పుడు మనం ప్రతి కల్పం లోనూ పూజిస్తున్నాం♪.

🪷 బ్రహ్మదేవుడు, ఆ మహాగణపతిని తలచుకున్న తర్వాత ఆయన ప్రత్యక్షమై, _*“మూలాధారమనే చక్రాన్ని సృష్టించు, అక్కడినుండి సహస్రార కమలందాకా నిర్మాణం చెయ్యి. ఆ మూలాధార చక్రంలో నేను అధిష్ఠాన దైవంగా ఉండి నీవు సృష్టించే జీవులకు దేహాత్మ భావనను ప్రసాదించి, వాళ్ళ ఆత్మసంరక్షణోపాయంలో వాళ్ళు ఉండేటట్లు, అన్నవస్త్రాలను సంపాదించుకుని బ్రతకాలనే కోరిక వాళ్ళలో కలిగేటట్లుగా చేసి, ఆ కోరికలో నుండి సంతానమందు వాళ్ళకు ఇచ్ఛ కలుగజేసి సృష్టిని కలుగజేస్తాను. నీవు సృష్టించు, నేను ఈ పనిని చేస్తాను”*_ అన్నాడు♪. 

🪷 కాబట్టి, ఆ మహాగణపతి జీవులలోకి ప్రవేశించగానే, ఆయన అనుగ్రహంచేత వాళ్ళకు దేహాత్మభావన కలిగింది♪. దేహాభిమానం కూడా కలిగింది♪. అటువంటి గణపతి అనుగ్రహం చేత, తరువాత సృష్టి సక్రమంగా జరిగింది♪.

🪷 ఈ సృష్టిరహస్యము యావత్తు, సమస్త జీవకోటియొక్క జీవలక్షణమూ అంతా సంపూర్ణంగా అర్థంచేసుకుని, “బ్రహ్మ ఎవరు? ఆత్మ ఎక్కడ? పదార్థం అంటే ఏమిటి? పంచభూతములు ఎలా వచ్చాయి? ఈశ్వరుడు అంటే ఎవరు? ఆయన యొక్క స్వరూపస్వభావాలు ఎలా ఉన్నాయి?" - ఇన్ని విషయాలూ తెలిసి, ఈ జగత్తు యొక్క భవిష్యత్తు తెలిసి, జీవులకు ఏది క్షేమకరమో అది తెలిసినవారు మహర్షులు♪. ఆద్యంతమూ సృష్టికథ అంతా తెలిసి, వాళ్ళ కర్తవ్యమే గాక, మన కర్తవ్యము, భవిష్యత్తులో పుట్టబోయే వారియొక్క యోగక్షేమాలూ కూడా ఆలోచించ గలిగినవారు మహర్షులు♪. అట్లాంటి మహర్షులు అనేకమంది ఆర్య సంస్కృతిని రక్షించి జీవకోటిని ఉద్ధరించారు♪. వారిని గూర్చి తెలుసుకోవడం మనకు ప్రధాన కర్తవ్యం♪.

       ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ*
꧁☆•┉┅━•••❀🕉️❀•••━┅┉•☆꧂

క్రిస్టియనిజం లో కులాలు, ఇస్లాం లో కూడా

క్రిస్టియనిజం లో కులాలు, ఇస్లాం లో కూడా 

క్రిస్టియానిటీ

1. క్రిస్టియానిటీ .....ఒకే క్రీస్తు----ఒకే గ్రంథం బైబిల్...........ఒకే దేవుడు యహోవా
మీకు తెలుసా
లాటిన్ క్యాథలిక్కులు సిరియన్ క్యాథలిక్కులు చర్చిలలోకి ప్రవేశించరు.
పైవారిద్దరూ మార్థోమా వారి చర్చిలలోకి ప్రవేశించరు
పైవారు ముగ్గురూ పెంతెకోస్తు చర్చిలలోకి ప్రవేశించరు
వైవారు నలుగురూ సాల్వేషన్ ఆర్మీ చర్చిలలోకి ప్రవేశించరు.
వై ఐదుగురూ సెవన్త్ డే అడ్వాన్టిస్ చర్చిలలోకి ప్రవేశించరు
పై ఆరుగురూ ఆర్థోడాక్స్ చర్చిలలోకి ప్రవేశించరు
పై ఏడుగురూ జాకోబైట్ చర్చిలలోకి ప్రవేశించరు
ఇలా క్రిస్టియన్లలో 146 రకాల క్రీస్తు సంఘాలు (తెగలు లేదా కులాలు) ఒక్క కేరళా రాష్ట్రంలోనే ఉన్నాయి.
వీరెవరూ ఒకరి చర్చిలకు ఒకరు వెళ్ళరు. ఇలా ప్రంపచంలో ఇంకెన్ని క్రీస్తు కులాలు ఉన్నాయో ఆలోచించండి.
అద్భుతం క్రిస్టియానిటీ .....ఒకే క్రీస్తు----ఒకే గ్రంథం బైబిల్...........ఒకే దేవుడు యహోవా ఇది క్రిస్టియానిటీలో ఉండే ఏకత్వం.

ఇక ముస్లీముల పరిస్థితి చూద్దాం
2. మసల్మానులు .... ఒకే ప్రవర్తకుడు మొహమ్మద్......ఒకే గ్రంథం ఖురాన్.....ఒకే దేవుడు అల్లాహ్
మహమ్మదీయుల్లో ప్రథానంగా షియాలు సున్నీలు. అన్ని ముస్లీం దేశాల్లో షియాలు – సున్నీలు ఒకరిని ఒకరు నరుక్కుంటారు.
ముస్లీం దేశాల్లో మత పరమైన తగాదాలన్నీ ఈ రెండు తెగల మద్యనే.
షియాలు సన్నీల మసీదులలోకి వెళ్ళరు
వీరిద్దరూ అహమదీయ మసీదులలోకి వెళ్ళరు
వీరు ముగ్గురూ సూఫీ మసీదులలోకి వెళ్ళరు.
వీరు నలుగురూ ముజాహిద్ధీన్ మసీదులలోకి వెళ్ళరు.
ఈ రకంగా వీరిలో 13 రకాల మహమ్మద్ సంఘాలు (తెగలు లేదా కులాలు) ఉన్నాయి.
చంపుకోవడాలు, నరుక్కోవడాలు, దోచుకోవడాలు, బాంబులు వేసుకోవడాలు వీరి మద్య సర్వసాధారణం.
మహమ్మదీయులందరూ టెర్రరిస్టులుకాదు కానీ టెర్రరిస్టులందరూ ముస్లీములే. 60 శాతం ముస్లీం టెర్రరిస్ట్ బాధితులు ముస్లీములు, ముస్లీం దేశాలే
చిన్న పిల్లలను, స్త్రీలను, ముసలివారిని, తన పర బేధం లేకుండా చంపగలిగిన మౌఢ్యం వారిది.

ఇక హిందువుల సంగతి చూద్దాం

3. 1280 ధర్మ గ్రంథాలు. 10 వేలకు పైన వాటి పై భాష్యాలు. లక్షకుపైగా భాష్యాలపై మరలా భాష్యాలు. ముక్కోటి దేవతలు. లెక్కకు మిక్కిలి ఆచార్యులు, వేలకొద్ది ఋషులు, వందలకొద్ది భాషలు అయినా ప్రతి ఒక్కరూ అన్ని ఆలయాలకు వెళతారు. ఏకత్వం అనేది హిందువులలో ఉందా ఇతర మతాలలో ఉందో ఆలోచించండి.
గత 10 వేల సంవత్సరాలలో హిందువులు ఎవరిపైకీ దాడివెడలి ఎరుగరు. మీరు ఈ దేవుడినే పూజించాలని ఎవరి నెత్తినా రుద్దలేదు. మతం పేర రక్తపుటేరులు పారించలేదు. అత్యంత శాంతిమయ దేశం భారత దేశం. ఈ దేశం మీదికి దండెత్తి వచ్చిన శకులు, హూణులు, బర్బరులు అందరూ ఈ జాతి జీవనంలో కలసిపోయారు. క్రైస్తవులు, మహమ్మదీయులు మాత్రమే ఈ దేశంలో ఈ సంస్కృతిలో కలవక ఈ సంస్కృతికి హానికలిగించే ప్రయత్నాలు చేయడం, మత మార్పిడులకు పాల్పడడం శోచనీయం.
     సమస్తా లోకా సర్వేజనో సుఖినోభవంతు అనేది నా హిందుత్వం మాత్రమే 
     సేకరణ 
జై శ్రీ రామ్ 🙏🙏

బంధమునకు మరియు మోక్షమునకు కారణము మనస్సే

 120224-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1024.
నేటి…

            *ఆచార్య సద్బోధన:*
                 ➖➖➖✍️

*”మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః” -*

అనగా "బంధమునకు మరియు మోక్షమునకు కారణము మనస్సే". 
```
ఆధ్యాత్మిక సాధనలో మనస్సు యొక్క ఉద్దేశ్యమే(అభిమతం) ప్రధానమైంది తప్ప బాహ్యమైన క్రియలు కావు. 

ఒక వ్యక్తి పవిత్ర బృందావన ధామములో నివసిస్తున్నా అతని మనస్సు బొంబాయిలో రసగుల్లాలు తినటం కోసం ఆలోచన చేస్తే అతను బొంబాయిలో ఉన్నట్టే లెక్క. 

దీనికి విరుద్ధంగా ఒకడు బొంబాయి నగర హడావిడి మధ్య నివసిస్తున్నా, బృందావనంలోని భగవంతునిపైనే మనస్సు నిమగ్నం చేస్తే, అతనికి 
ఆ బృందావనంలో నివసించే ఫలితం దక్కుతుంది. 

అనగా మన మానసిక స్థితిని బట్టే మన ఆత్మ ఉద్ధరణ స్థాయి ఉంటుంది తప్ప బాహ్యాచారాలు వలన కాదు అనేది స్పష్టమవుతుంది. 

ఈ విషయము చక్కగా గ్రహించి నడుచుకోవాలి!✍️```
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

మొదటిది కావాలో... రెండవది కావాలో ఆలోచన మనదే ... ఆచరణా మనదే ...

 మాట మీద నిలబడటం వేరు
నిలబడే మాట పలకడం వేరు
                       మొదటిది నిజాయతీ
                       రెండవది దార్శనికత
చెప్పింది చేయడం వేరు
చేసేది చెప్పడం వేరు
                        మొదటిది నిబద్దత
                        రెండవది పారదర్శకత
ఇతరుల మీద గెలవడం వేరు
ఇతరుల మదిలో నిలవడం వేరు
                       మొదటిది తంత్రం
                       రెండవది తత్వం
ఎంత దూరమైనా వెళ్ళడం వేరు
ఎంత దూరం వెళ్ళాలో తెలియడం వేరు
                       మొదటిది సాహసం
                       రెండవది వివేకం
ఎలాగైనా చేయడం వేరు
ఎలా చేయాలో తెలిసుండటం వేరు
                       మొదటిది చొరవ
                       రెండవది నేర్పు

ఇతరులపై చూపుడు వేలు ఎత్తడం వేరు
ఇతరుల కోసం పిడికిలి బిగించడం వేరు
                       మొదటిది నింద నీడన అస్తిత్వం 
                       రెండవది నీడ వీడిన చైతన్యం
గెలవడం వేరు
గెలిపించడం వేరు
                       మొదటిది నేను 
                       రెండవది మేము
సంఘం కట్టడం వేరు
సంఘటితం అవ్వడం వేరు
                       మొదటిది వ్యూహం 
                       రెండవది చైతన్యం
మొదటిది కావాలో...
రెండవది కావాలో ఆలోచన మనదే ...
ఆచరణా మనదే ...

Wednesday, February 14, 2024

వద్దు వద్దు మహిళపై చులకన వద్దు

 జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ......

మహిళ లంటేనే
మనుగడ ఇస్తూ
అందరి అభివృద్ధి కోసం
అనునిత్యం తపనపడుతు
ఆరాటపదే మహిళ

అలుపు లేకుండా
అందరి ఆకలి కోసం
వైభవంగా పనిచేస్తూ
వంటలు చేస్తుంది మహిళ

గరిట పట్టిన కరంతోనే
హలం కలం గన్ను బెత్తెం 
స్టీరింగ్ పెట్రోల్ డీజిల్ సర్వీస్ చేస్తూ
అందరికి ఆదర్శంగా నిలిచె

నాటి కాలం నుండి
నేటి కాలంలో కూడా
అణచి వేసేందుకు
అందరి ప్రయత్నం చేయు చుండె

నేడు వారు లేని వ్యవస్థ
వారు చేయూత లేకుండా
జరగడం లేదు అన్ని పనులు
జగమంత మహిళల మయమే

సృష్టి కర్త
సృష్టి నిర్మాతలు 
కనికరం ఉన్నవారు
కడు ప్రేమతో చూడువారు మహిళలు సుమా

వారు అభివృద్ధికి
వారు మంచి చెడులు చూసి
వాటి వృద్ధికి దోహదం చేద్దాం
వద్దు వద్దు మహిళపై చులకన వద్దు

యం.చంద్రశేఖర్

కష్టమంటే?

 🔱 అంతర్యామి 🔱

# కష్టమంటే?

🍁అందరూ అతి సులభంగా పలికే మాట- కష్టం. కష్టమంటే ఏమిటో సరైన నిర్వచనం చాలామందికి తెలియక అలా అనేస్తారు. నిజమైన కష్టం ఏదో తెలిసేవరకు ప్రపంచంలో ప్రతి పనీ కష్టమైనదిగానే అనిపిస్తుంది. అందరూ కష్టాలు అనుభవిస్తున్నామనే భావిస్తారు. కష్టం అనేది ఒక మానసిక భావన. ఒక అనుభూతి. ఒక అనుభవం. వ్యక్తి, వయసు, ఆలోచనా సరళిని బట్టి కష్టం స్థాయి మారుతూ. ఉంటుంది.

🍁ఇష్టం లేకుండా చేసే ఏ పనైనా కష్టంగా అనిపిస్తుందని- మానసిక శాస్త్రవేత్తల నిర్వచనం. మనసు పెట్టి ఇష్టపూర్వకంగా పనిచేస్తే కష్టం ప్రసక్తే ఉండదు. వయసు, స్థాయి, ఆలోచనా విధానాల్లో మార్పులు వచ్చేకొద్దీ కష్టం తాలూకు నిర్వచనం, లక్షణం, రూపం మారిపోతూ ఉంటాయి. అప్పులు, యాచనల్లాంటివి చేయవలసి రావడం, రోగాలు చుట్టుముట్టడం, దొంగల పాలుకావడం, ఏ పనీ కలిసిరాకపోవడం, వృద్ధాప్యంలో బాధలు అనుభవించడం, సరైన తోడు కాని సలహాలను ఇచ్చేవారు కాని లేకపోవడం, పేదరికం అనుభవించడం... ఇలాంటి ఎన్నింటినో కష్టాలుగా పేర్కొంటారు.

🍁భగవంతుణ్ని ఎపుడూ స్మరించక పోవడమే మహా పాపం అని, ఆ పాపమే కష్టాలకు కారణమని భాగవతంలో పోతన చెప్పాడు. అంటే, భగవంతుడి స్మరణ వల్ల కష్టాలు నశిస్తాయని విశ్వాసం కలిగి ఉండాలని అంతరార్థం. గత జన్మలో చేసిన పాపాలు సైతం కష్టాలుగా పరిణమిస్తాయని పౌరాణికులు చెప్పేమాట. పరిశీలిస్తే జీవితంలో ప్రతిపనీ కష్టంతో ముడివడి ఉన్నదే. లక్ష్యసాధన కోసం చేసే ప్రయత్నాలు, విషయ సేకరణ, వస్తు- ధన సంపాదన, వాటిని నిలబెట్టుకోవడం, భద్ర పరచడం ఇలా ప్రతిపనీ కష్టమే.

🍁కష్టపడితేనే లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందనేది సత్యం. కష్టం చేయనిదే ఫలితం ఉండదు. కాబట్టి కష్టేఫలీ అనే నానుడి గుర్తు పెట్టుకోవాలి. నువ్వు దేన్నీ అందుకోవడానికి కష్టపడకపోతే నీకు ఏదీ అందుబాటులోకి రాదు. అవసరమైనవాటిని అందుబాటులోకి తెచ్చుకోవాలంటే కృషి, కష్టం ప్రధానం అంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.

🍁మనిషి గొప్పతనాన్ని, విలువను అంచనా
వెయ్యాలంటే సుఖసంతోషాలతో గడుపుతున్నప్పుడు. కాదు. కష్టాలు కలిగినప్పుడే అది సాధ్యం. ఎందుకంటే అలాంటప్పుడే ఆ వ్యక్తి సమర్థత పూర్తిగా తెలిసి సరైన అంచనాకు దొరుకుతాడు. అతడి మనసు అసలు రూపు బయటపడేది అలాంటప్పుడే. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అలాంటి ఫలితాలను పొందినవారికే జీవితంలో విలువ ఉంటుంది. మన జీవితం కూడా మంచి, చెడు విషయాల సమతుల్యతతో జరుగుతుంది. నువ్వెంత కష్టపడి పని చేస్తున్నావో చెప్పవద్దు. ఎంత పని పూర్తి అయ్యిందో చెప్పు. జీవితంలో ఒక కష్టం వచ్చిన తరవాత నువ్వు అనుభవించే ఆనందంతో పోటీపడే అనుభూతి ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. కాబట్టి కష్టాలను ఇష్టంగా ఆహ్వానించు అంటాడొక కవి.

🍁కష్టం విలువ ఒకరు చెబితే తెలిసేది కాదు. 
🍁అనుభూతి చెందితేనే తెలుస్తుంది. 
🍁నిజానికి ఎదుటివారు పడే కష్టం ఇతరులకు తేలికగా, చులకనగా అనిపిస్తుంది. 
🍁ఎదుటివారి సానుభూతి, లేదా సహాయం వస్తుందేమోననే ఆలోచనతో ఎదురు చూడటం మంచిది కాదు.
🍁 దాని బదులు మీ దృష్టిని లక్ష్యం మీదే ఉంచి దాన్ని సాధించే నిరంతర ప్రయత్నం సాగాలి. 
🍁అలా చేసిననాడు ఆత్మవిశ్వాసంతో కష్టాలను అధిగమించిన తరవాత వచ్చే ఆనందపు రుచిని అనుభవిస్తారు. 
🍁ఆ రుచి వర్ణనాతీతం.🙏

-✍️ కె. వి. ఎస్. ఎస్. శారద

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మన లెక్కల, ఫిజిక్స్ పంతుళ్ళ పని కొంచెం తేలిక చేశారు

 *రాసిందెవరో కానీ . . .*

*మన లెక్కల, ఫిజిక్స్ పంతుళ్ళ పని కొంచెం తేలిక చేశారు . . .😊*

అమ్మ చేసిన రొట్టె *వృత్తము*

సగానికి మడిచిన దోసె *అర్ధ వృత్తము*

మనం కూర్చునే స్టూల్ *చతురస్త్రం*

పడుకునే మంచం *దీర్ఘ చతురస్త్రం*

మనకిష్టమైన లడ్డూఒక  *గోళము*

సగం మన మిత్రునికిస్తే *అర్ధ గోళము*

మన తరగతి గది ఒక *ఘనం*

మనం కూర్చునే బెంచీ ఒక *దీర్ఘ ఘనం*

మన జెండా కర్ర ఒక *స్థూపం*

కొడవలి మలుపు ఒక *చాపం*

ధాన్యపు రాశి ఒక *శంఖువు*

రూపాయి రూపాయి కలిపితే *కూడిక*

కొనడానికి కొంత తీస్తే *తీసివేత*

తలా పది పంచితే *భాగహారం*

హెచ్చిస్తే *గుణకారం*

కూర్చుంటే *జడత్వం*

కదిలితే *చలనం*

పరిగెత్తితే *వేగం*

ఆగి ఆగి పరుగు తీస్తే *త్వరణం*

పడిపోతే *ఆకర్షణ*

విడిపోతే *వికర్షణ*

తన చుట్టూ తాను తిరిగితే *భ్రమణం*

గుడి చుట్టూ తిరిగితే *పరిభ్రమణం*

మాట్లాడడానికి *శక్తి*

పనిచేయడానికి *బలం*

గంటకు ఎంతపని చేస్తావో అది *సామర్థ్యం*

వింటున్నా మంటే *శబ్దం*

చూస్తున్నామంటే *వెలుగు*

రంగులన్ని *వర్ణ పటం*

ఆహారం అరగడం *జీవక్రియ*

అరిగిన ఆహారం శక్తిగా మారడం *రసాయన క్రియ*

ఉచ్వాస నిశ్వాసాలు *శ్వాస క్రియ*

నేను చూశాను *భూతకాలం*

నేను చూస్తున్నా *వర్ధమాన కాలం*

నేను చూడ బోతున్నా *భవిష్యత్ కాలం*

నాకు తొంభై తొమ్మిది ఏళ్ళు ... ఇక *పోయే కాలం*

బతుకుల్లో లేనిది ఏముంది శాస్త్రాల్లో ..

సరిగా అర్థం చేసుకుంటే మన బతుకే ఒక శాస్త్రం...
మనిషిని, ఇతర ప్రాణుల్ని , ప్రకృతిని గురించి తెలుసుకోవడం తప్ప.
భయమెందుకు నీకు ...
నీకంటే ప్రపంచంలో ఎవరు గొప్ప...
తెలుసుకో పదిలంగా
నేర్చుకో సులభంగా...!   

*అదే మన తెలుగు భాష గొప్పదనం*.  

భలే ఉంది కదా ...

సర్యేజనః సుఖినోభవంతు.
----------------------------
 *🍁మనం ప్రపంచాన్ని పరిశీలించినంతగా మనల్ని మనం పరిశీలించుకోం...అసలు సమస్య ఇదే...అందరూ మనల్ని గౌరవించాలని ఆశిస్తాం తప్ప, మనం కూడా అందర్నీ గౌరవించాలనుకోం...మనకున్న కొద్దిపాటి ప్రత్యేకతలకు మనమే మురిసిపోతూ అహంకరిస్తుంటాం...ప్రపంచంలో మనకు మించిన ఘనులు ఎందరో ఉంటారనే స్పృహఉంటే, పొరపాటునైనా మనలోకి అహం రాదు...అద్దంలో శరీరాన్ని పరిశీలించుకున్నట్లే, ఆత్మ పరిశీలనతో మనసు, బుద్ధి సక్రమంగా ఉండేలా చూసుకోవాలి, మనల్ని మనం సంస్కరించుకోవాలి..🍁*

     మీ
మురళీ మోహన్

Tuesday, February 13, 2024

 రైల్వే స్టేషన్ లో వెయింగ్ మిషన్ ఎక్కడానికి 10 పైసల బిళ్ల కోసం మారాం చేసిన జెనరేషన్ మాది.
ఇంటి ముందు కొచ్చే పాల ఐసు 10 పైసలూ, ఫ్రూట్ ఐసు 5 పైసలూ నూ. 
యస్సెల్సీ పాసవగానే టైప్ ఇన్ స్టిట్యూట్ కి పేపర్లు గుండ్రంగా చుట్టుకుని వెళ్లిన తరం వాళ్లం.
అద్దెకి బుక్స్ ఇచ్చే షాప్ దగ్గర్లో వుందా, ఆస్పత్రి వుందా అని అద్దె ఇళ్లు చూసుకున్న బంగారు రోజులవి.
సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కుని బట్టీలు పట్టే కాలం అది.
గెజిటెడ్ ఆఫీసర్లు అయినా సైకిళ్లు  తొక్కేవాళ్లు ఆ రోజుల్లో.
డ్రాయింగ్ రూమ్ లలో జిమ్ములలో తొక్కే అవసరం పడేది కాదు.
చేబదుళ్లకి కాదేదీ అనర్హం.
పిన్నిగారింట్లోంచి గ్లాస్ తో కాఫీ పొడైనా, బాబాయ్ గారి రేలీ సైకిల్ అయినా, పక్కింటి అన్నయ్య జామెంట్రీ బాక్సూ , స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలూ. 

అప్పు పుట్టని పచారీ షాపులూ బట్టల కొట్టులూ వుండేవే కావు.
రేషన్ షాపుల్లో పంచదార కోసం, కిరసనాయిల్ కోసం నిలబడి, డ్యూయెట్లూ.
పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడినప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ లు జరిగేవి.
మధ్యతరగతి మందహాసం కాదు. పగలబడి నవ్వేది.
ఇంటి ముందుకు
కోతులాడించేవాడు, పాములాడించేవాడు, గంగిరెద్దులాడించేవాడు,ఎలుగు బంటిని తెచ్చేవాడు, చిలక జోస్యం చెప్పేవాడు, వానల్లు పడాలి వాన దేవుడా అని కప్పలకి పెళ్లిళ్లు చేసే వాళ్లు కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించే వాళ్లు.
మేకప్పులు అంటే మాకు తెలీని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులేసుకునొచ్చి, ఇళ్ల ముందు సినిమా పాటలకి డాన్స్ లాడే వారు.
గారడీల వాళ్లు బాలన్సింగ్ ఎలాగో పైన తాడు మీద చిన్న పిల్లలని నడిపిస్తూ చూపించే వాళ్లు.
మూలికలూ, పసర్లూ అమ్మేవాళ్లు తాము నయం చెయ్యలేని రోగం లేదనే వాళ్లు.
స్టేషన్ దగ్గర చెవి గులిమిలు తీస్తామనే పెట్టెలతో తిరిగే వాళ్లూ.
ఇళ్లముందు కొచ్చి సవరాలు కడతాం అనే వాళ్లూ.
వాళ్ల కోసం టిన్నుల్లో జుట్టు వూడితే దాచుకున్న వాళ్లూ వుండేవారు.
మధ్యాహ్నాలు భోజనాలయి వంటింటి గుమ్మం మీద తల పెట్టి కునుకు తీస్తుంటే.
 "దువ్వెన్నలు, బొట్లు, కాటుక పెట్లు, ఇయర్ పిన్లు, లబ్బర్ గాజులు, రిబ్బన్లహో". అంటూ పెట్టె నెత్తిన పెట్టుకొచ్చే వాళ్ల దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువుండేది కాదు. వాళ్లు వెళ్లగానే "పాత బట్టలకి స్టీల్ సామాన్లిస్తాం". అన్న వాళ్లు వచ్చి ఎన్నేసినా, చూపించినా గంగాళం కాకుండా, ఆఖర్న ఉగ్గు గిన్నె ఇచ్చి పోయేవాళ్లు. గోతాముడు పాత బట్టలొదిలిపోయేవి. కత్తికి సాన పెడ్తాం, నవార్లు నేస్తాం. పరుపులేకుతాం. గిన్నెలకి సొట్టలు తీస్తాం. బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాం. అరువు మీద  చీరలిస్తాం అంటూ ఇంటి ఇల్లాళ్లని ఊపిరి తీసుకోనిచ్చే వాళ్లు కారు. ఇంక ముగ్గు అమ్మే వాళ్లూ, ఉప్పు అమ్మేవాళ్లూ, కూరలూ పండ్లూ అమ్మే వాళ్లూ సరేసరి. మాదా కబళం వాళ్లు "అన్నం వుంటే పెట్టమ్మా నీ కొడుకులు, బిడ్డలు, మనవలు సల్లంగుండ" అంటూ టైముల వారీగా వచ్చే వాళ్లు...సాయంత్రం 8 గంటల బిచ్చగాడొచ్చి వెళితే మా నానమ్మ మాత్రలేసుకునేది..
రేడియోలో బినాకా గీత్ మాలా ఊహల రెక్కలు విప్పేది. భూలే భిస్రే గీత్ అమర లోకాల్లో విహరింప చేసేది. రహస్య ప్రేమలు, అచ్చట్లు, ముచ్చట్లు... "ఏమిటో" అనుకోవడాలు ప్రొద్దుట సంస్కృత వార్తలు 'ఇతి బలదేవానంద సాగరహా 'తో ప్రారంభం అయితే ఈ మాసం పాటలూ కార్మికుల కార్యక్రమాలూ సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలూ..వివిధ భారతి మీరుకోరిన పాటలూ..పండితులచే నిర్మించబడ్డ నాటకాలూ..వావ్ రేడియో స్వర్ణ యుగం అది!
అప్పట్లో పేపరు చదువుతూ కాఫీ తాగని మనుషులు అరుదు..ఇంగ్లీష్ పేపర్ చదువుతే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే ,దూర్దర్శన్ లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం..తాతయ్యలకీ దూరపు చుట్టాలకీ ఉత్తరాలు రాస్తూ లెటర్ రైటింగులు నేర్చుకున్నాం....ఉభయకుశలోపరి ఎక్కడ పెట్టాలో, గంగాభాగీరధీ సమానురాలైన ఎప్పుడు వాడాలో తెలుసు!!
ఎన్నని చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలు.... *ఇప్పటికి ఎప్పటికి మా గుండెల్లో నిలిచిపోయి మా గుండెలు అగిపోయేవరకు మాతో వెన్నుండి మమ్మల్ని నడిపిస్తున్న. ఏమో. మాటలు రావట్లేదు.
అమ్మ చేతి మురుకులు లేవు
అలసట లేని పరుగులు లేవు
ఎత్తరుగులు మొత్తం పోయే
రచ్చబండలూ మచ్చుకు లేవు
వీధిలో పిల్లల అల్లరి లేదు
తాతలు ఇచ్చే చిల్లర లేదు
ఏడు పెంకులు ఏమైపోయే
ఎద్దు రంకెలు యాడకి పోయె
ఎక్కడా వెదురు తడికెలు లేవు
ఏ తడికకీ భోగి పిడకలు లేవు
కూరలమ్మే సంతలు లేవు 
పెరుగులమ్మే ముంతలు లేవు
బువ్వా లాటల విందే లేదు
గవ్వలాటలు ముందే లేదు
కుప్పిగంతులు లేనే లేవు 
కళ్ళ గంతలు కానే రావు
డ్రింకు మూతల గోలే లేదు 
బచ్చాలాడే ఇచ్చా లేదు
కోతి కొమ్మచ్చి ఏమైపోయే
అవ్వా అప్పచ్చి ముందే పాయె
గూటీ బిళ్ళా గూటికి పోయే
తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె
గచ్చకాయలు మచ్చుకు లేవు
చింత పిక్కలు లెక్కకూ లేవు
ధారగా కారే ముక్కులు లేవు 
జోరుగా జారే లాగులు లేవు
కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు
కొండముచ్చుని కెలుకుడు లేదు
బట్టన మురికి అంటక పోయె
మనసుకి మురికి జంటగ చేరె
కాకి ఎంగిలి కరువై పోయే
భుజాన చేతులు బరువై పోయె
అన్ని రంగులూ ఏడకో పోయె
ఉన్న రంగులూ మాసికలాయె
దానికితోడు కరోనా వచ్చె
బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె
బడిగంటల ఊసే లేదు
బడికి పోయే ధ్యాసే లేదు
మూతులన్నీ మాస్కుల పాలు
చేతులన్నీ సబ్బుల పాలు
ఆన్ లైన్ లో పాఠాలాయె
అర్థం కాని చదువులాయె
ప్రశ్నలకు జవాబులుండవు
కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు
ప్రస్తుత బాల్యం వెలవెల పోయె
దానికి మూల్యం ప్రస్తుత మాయే
రేపటి సంగతి దేవుడి కెరుక
నేటి బాలలకు తప్పని చురక
బాలానందం లేని జీవితం
మానవాళికే మాయని మరక.
మేమేఅదృష్టవంతులమ్*!           
1960-80 లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. 
ఆంగ్ల  మాధ్యమంలో  చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము.  లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. 
పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత 
గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. 
దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.
*పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.* 
పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.* 
దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!  
ఆ రోజుల్లో  చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.  
ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.
మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్  ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.
మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట
రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం
ఈ నాటికీ దాదాపు అందరం 48-65సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!
అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.   
*ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?*
ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది.
సేకరణ