Sunday, January 5, 2025

****మిమ్మల్ని మీరు పట్టుకోండి.

 మిమ్మల్ని మీరు పట్టుకోండి.  

మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు?  
ఆ ఆలోచనలే మిమ్మల్ని మేల్కొనకుండా చేస్తున్నాయి.
ఎప్పుడూ ఆలోచనలు వచ్చిన వాటిని గమనించండి. 
వాటిని పట్టుకోండి. 
ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటిని గుర్తించండి. 
మరియు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: 
"ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి?"  
అవి మంచి ఆలోచనలు కావచ్చు.  
అవి ఎలాంటి ఆలోచనలు అయినా ఎటువంటి తేడా లేదు.  

ఏమి చేయాలో తెలిసిన ఏదో ఒక 'గొప్ప శక్తి' మీలో ఉంది.  
మీ సహాయం లేకుండా మిమ్మల్ని ఎలా చూసుకోవాలో  మీ కంటే ఎక్కువగా తెలిసిన ఒక 'గొప్ప శక్తి' ఉంది.  

మీరు చేయాల్సిందల్లా దానికి లొంగిపోవడమే.  
మీ ఆలోచనలను, మీ మనస్సును, మీ అహాన్ని...
మార్గం తెలిసిన ఆ శక్తికి అప్పగించండి.  
ఇది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది.  
మీరు ఊహించిన దానికంటే ఇది మిమ్మల్ని బాగా చూసుకుంటుంది.

**** * కర్మ – విశ్రాంతి *

 * కర్మ – విశ్రాంతి *

చైనా తాత్వికుడయిన కన్‌ఫ్యూషియస్‌ దగ్గరకు ఒక వ్యక్తి వెళ్ళి నమస్కరించి ”అయ్యా! నేను జీవితంలో ఎంతో అలసిపోయాను. ఎన్నో పనులు చేసి విసిగిపోయాను. ఇప్పుడు విశ్రాంతి కోరుకుంటున్నాను. విశ్రాంతికి ఏదయినా మార్గముంటే తెలపండి. విశ్రాంతి ఉంటేనే నా జీవితానికి ఓదార్పు దొరుకుతుంది. మీలాంటి మహాపురుషులు మాత్రమే దానికి మార్గం చూపించగలరని నమ్ముతున్నాను” అన్నాడు.

కన్‌ఫ్యూషియస్‌ ఆ వ్యక్తి చెప్పినవన్నీ విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. లేచి ఆవ్యక్తిని తన వెంట రమ్మన్నాడు. ఇద్దరూ కొంత దూరం నడిచారు. నడిచేంతసేపూకూడా కన్‌ఫ్యూషియస్‌ ఏమీ మాట్లాడలేదు. వెంట నడుస్తున్న వ్యక్తికి అంతా అయోమయంగా ఉంది. ఏమీ మాట్లాడకుండా ఈ వ్యక్తి ఎక్కడకు తీసుకెళుతున్నాడా? అని ఆశ్చర్యపోయాడు. కొంత దూరం నడిచి వెళ్లాక కన్యూఫ్యూషియస్‌ ఆగాడు. ఎదురుగా ఉన్న శ్మశానాన్ని చూపించాడు. ఆ వ్యక్తికి ఏమీ అర్ధం కాలేదు. ”ఎందుకు నన్ను శ్మశానానికి తీసుకొచ్చారు. ఎందుకు దాన్ని చూపుతున్నారు?” అని అడిగాడు. కన్‌ఫ్యూషియస్‌ ”విశ్రాంతి అన్నది శ్మశానంలో మాత్రమే ఉంది. సమాధిలో మాత్రమే ఉంది. శాంతి కావాలన్నా, విశ్రాంతి కావాలన్నా చనిపోవాలి. అనుదిన జీవన మన్నది విశ్రాంతికి పూర్తిగా వ్యతిరేకమైంది. కర్మ,విశ్రాంతి ఒకదానికొకటి వ్యతిరేకమయినవి. కర్మ జీవికి విశ్రాంతి ఉండదు. జీవితానికి అర్ధం పని. జీవితానికి విశ్రాంతి అన్నది వ్యతిరేకమయింది. నీకు జీవితం కావాలా? మరణం కావాలా? తేల్చుకో. మరణంలోనే విశ్రాంతి ఉంది” అన్నాడు.ఆదిత్యయోగి.

ఆమాటలు విని ఆ వ్యక్తి బిత్తరపోయాడు. కన్‌ఫ్యూషియస్‌ చెప్పిందానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. జీవితానికి మరణమన్నది వ్యతిరేకం కాదు. మరణం జీవితానికి ఆఖరి మజిలీ. మృత్యువు విశ్రాంతి కాదు. బతుకులో ఉన్న అశాంతి మరణంలో కూడా వెంబడిస్తుంది. పీడిస్తుంది. మరణం జీవితానికి వ్యతిరేకం కాదు. అది జీవన సారాంశం. జీవితంలో కర్మ మాత్రమే ఉంటుందని, విశ్రాంతి ఉండదని అనడం సరికాదు. కర్మ అన్నది బాహ్య ప్రపంచానికి సంబంధించింది. శరీరానికి సంబంధించింది. బయటి ప్రపంచానికి సంబంధించినంత మేరకూ దేహికి సంబంధించినంతవరకు కర్మ అనివార్యం.

పని చేయడం తప్పనిసరి. కానీ మనిషి కేవలం శరీర మాత్రుడు కాదు. మనిషికి శరీరం ఒక్కటే లేదు. లోపల ఆత్మఉంది. అస్థిత్వ ముంది. చైతన్యముంది. అవి విశ్రాంతి కేంద్రాలు. తన బాహ్య కర్మను వ్యక్తి ఎప్పుడయితే సంపూర్ణంగా నిర్వహిస్తాడో అతడు అస్తిత్వపు కేంద్రాన్ని ఉపసంహరించుకుంటాడు. అక్కడ విశ్రాంతి పొందుతాడు. జీవితంలో ద్వంద్వాలు ఉన్నాయి. ప్రకృతిలో ఉన్నాయి. రాత్రి,పగలు, పగలు శ్రమిస్తాం. రాత్రి విశ్రాంతి తీసుకుంటాం. మనిషికి శరీరం ఉంది. ఆత్మ ఉంది. శరీరం కర్మను నిర్వహిస్తుంది. ఆత్మ విశ్రాంతినిస్తుంది..
.

*****మనస్సు... ఆలోచనలు.....*

 *మనస్సు... ఆలోచనలు.....*

*మనస్సుతో కుస్తీ పడకండి. మీ మనస్సు ఎక్కడికీ వెళ్ళదు. అది ఇక్కడే ఉండి దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. మీరు కేవలం మీ ఆలోచనల వల్ల అలా మోసగింపబడుతున్నారు. అది ఇక్కడే ఉంది. దేని గురించో ఊహించుకుంటోంది. అది ఎక్కడికీ వెళ్ళడం లేదు. మీరు దానితో ఎంతగా మమేకం అయిపోయారంటే మీరు మీ మనస్సు మరెక్కడో ఉంది అని అనుకుంటున్నారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీ మనస్సు మీరు నియంత్రణ చేయలేని విధంగా అంతులేని ఆలోచనలతో నిండి ఉంది. వీటితో మిమ్మల్ని మీరు గుర్తించు కుంటున్నారు. అంటే.. మీరు కాని విషయాలతో మిమ్మల్ని మీరు, గుర్తించుకుంటున్నారు. మీరు కాని వాటితో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నప్పుడు. మీ మనస్సు అన్నది నిరంతరం పని చేస్తూనే ఉంటుంది.*

*మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకుని మీ మనస్సుని ఆపాలని చూస్తున్నారు. మీరు ఒక లక్ష సంవత్సరాలు తీసుకున్నా సరే.. ఇది జరగదు. మీరు తప్పుడు గుర్తింపులన్నిటినీ విడిచి పెట్టన క్షణాన మీ మనస్సు ఒక అద్దంలా మారిపోతుంది. అప్పుడది ఏమీ చేయదు. అన్నిటినీ ప్రతిబింబిస్తూ ఉంటుంది. మీ మనస్సు ఒక యంత్రాంగం. దానిలో స్పష్టత ఉన్నప్పుడే అది బాగా పని చేస్తుంది.*ఆదిత్యయోగీ*

*కానీ.. ఇప్పుడు మీ మనస్సు ఒక పెద్ద గందరగోళం. ఎందుకంటే.. మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీరు మీ శరీరంతో.. మీరు వేసుకొన్న దుస్తులతో.. మీ జుట్టుతో.. ఎన్నో విషయాలతో.. మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు.*

*ఇప్పుడు మీ పొట్టలో గ్యాస్ చేరినప్పుడు, దానిని మీరు ఆపుకోలేరు కదా.. మీరు సరైన ఆహారం తినలేదు కాబట్టి, ఇది దానికి ప్రతి చర్య. అలానే.. మీరు ఎన్నో విషయాలతో గుర్తించుకున్నారు. ఇప్పుడు మీ మనస్సు అంతు లేనట్లుగా, అలా వెళ్లిపోతూనే ఉంటుంది. మీరు దానిని ఆపలేరు. మీరు ఇక్కడ కూర్చొని, ధ్యానం చెయ్యాలనుకుంటూ ఉన్నారు. మీరు ఏ బయటికి వెళ్ళడం గురించో, సినిమా గురించో, స్నేహితుడి గురించో, మరో దాని గురించో ఆలోచిస్తారు. మీకు అందరూ ఏమి చెప్పారంటే భగవంతుడి గురించి ఆలోచించండి, అన్నీ సరిగ్గానే ఉంటాయి. అని.*
 *గడిచిపోయిన విషయాలను పదే పదే స్పురణకు తెచ్చుకోవడము,ఫలితముగా బాధ అనుభవించడము మానవుని బలహీనతలలో  చెప్పుకోదగినది.ఒకసారి  చెప్పిన జోక్ కి పదిసార్లు నవ్వలేము కదా! నిన్న చదివిన వార్తాపత్రికను ఈ రోజు చదువము కదా! అలానే గడచిన విషయం ఎక్కడ జరిగిందో అక్కడే వదిలేయాలి.గతంను వెనుకకు తీసుకురాలేము.భవిష్యత్ అనేది మన చేతులలో లేదు.ఉన్న క్షణం ఒక్కటే మనది.ఈ బరువు బాధ్యతలు మనం మోయలేము.వీటిని భగవంతునికి అప్పజెప్పి మనకున్న క్షణంను మంచికోసం వినియోగించుకుందాం.ఏది జరగనివ్వండి, భగవంతుడే దిక్కు అన్న విశ్వాసంతో  ఉందాం.గ్యారంటీ లేని ఈ జీవితానికి ఇంతకంటే ఏం అవసరం??!*
 ::రావడం కుదరదు::

జ్ఞానం.. ధనం.. విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు. వాళ్లది చాలా గాఢమైన స్నేహం. అనుకోకుండా ఒకసారి వాళ్లు విడిపోవాల్సి వచ్చింది. తిరిగి ఎప్పుడు? ఎక్కడ కలుసుకోవాలి అనే ప్రశ్న వచ్చింది! ముగ్గురూ ఆలోచించసాగారు! ఇంతలో జ్ఞానం అంటుంది.. 'దేవాలయాలు.. విద్యాలయాల్లో నేను కలుస్తా' అని! ధనం.. 'నేను ధనవంతుల దగ్గర కలుస్తా' అన్నది! విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది! కారణమేంటని జ్ఞానం.. ధనం అడిగారు. అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది.. 'మీరిద్దరూ విడిపోయినా.. వెళ్లిపోయినా ఎక్కడో ఒకచోట కలు సుకునే వీలుంటుంది. కానీ నేను ఒక్కసారి వెళ్లిపోతే తిరిగి రావ డమనేది కుదరని పని. ఓంనమఃశివాయ ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు' అన్నది! విశ్వాసం మాటల్ని విని.. జ్ఞానం.. ధనం ఆశ్చర్యపోయాయి! స్నేహం పట్ల.. విడిపోవడం పట్ల విశ్వాసానికున్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి! నీతి: ధనం.. జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి. కానీ విశ్వాసం ఒకసాఁ పోతే మళ్లీ రాదు! 
 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

66. ద్వితీయాద్వై భయం భవతి

రెండవ దానివల్ల భయం కలుగుతుంది (బృహదారణ్యకం)

మన వేదాంతవిద్య 'ఏకత్వాన్ని' ప్రతిపాదిస్తోంది. 'ఏకమేవాద్వితీయం బ్రహ్మ','ఏకం సత్', 'ఏకో నారాయణః', 'ఏకో రుద్ర', 'అజాం ఏకాం' వంటి అసంఖ్యాక శ్రుతివాక్యాలు. 'ఏకం దైవతం', 'ఏకం పరాయణం' వంటి పురాణవాక్యాలు ఈ ఏకత్వజ్ఞానమే లక్ష్యంగా బోధిస్తున్నాయి.

ఈ 'ఏకత్వ' బోధను వేదాంతహృదయంగా గ్రహించి దీనిని 'అద్వైతం' అన్నారు.

( దేహంలో దీపించే చైతన్యం అఖండమైన బ్రహ్మమేనని తెలిస్తే
మాయావికారం వల్ల జీవి యందు ఆభాసించే పరిమిత భావం విడివడి
'బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి' అనే స్థితికి చేరతాడు. అతనికి అంతా ఈశ్వర
విలాసమే. అన్ని అలల ఆటలకీ ఆ సముద్రమే ఆధారం. అలలన్నిటినీ కలిపి ఏక సముద్ర దృష్టిగా చూసే వివేకి ప్రతి అలలోనూ ఆ సముద్రుని ప్రత్యేక శోభనే చూసి-'అంతా ఆ సముద్రమే'నని ఒప్పుకుంటాడు.)

ఇదీ ఉపనిషత్తు మాటే. 'ప్రపంచోపశమం శాంతం అద్వైతం' అని మండూక్యోపనిషద్వచనం. దీనిని వ్యాఖ్యానించి బోధించి అచ్చమైన వేదాంత సిద్ధాంతాన్ని స్పష్టపరచిన ఆదిశంకరుల బోధనను 'అద్వైతం' అని తరువాతి వారు వ్యవహరించారు.

శ్రుతిహృదయమే అద్వైత ప్రతిపాదన. మరి 'ఏకం' అనకుండా 'అద్వైతం' (రెండు కాదు) అనడం ఎందుకు? వ్యవహారంలో 'ద్వైతం' వలె గోచరిస్తున్నా, నిజానికి 'అది
రెండు కాదు-ఒక్కటే' అని చెప్పడం 'అద్వైతం' అనే మాటలోని అంతర్యం.

పరమార్థ దృష్టిలో ఇదే సత్యం. అసలు సత్యాన్నే పరమార్థం అంటారు. అందరిలోనూ దీపించే ఈశ్వర చైతన్యమొకటే. జీవుడు అవిద్య వల్ల భ్రమపడి ఈశ్వర చైతన్యాన్ని
భిన్నభిన్నములుగా దర్శిస్తాడు. దేశ కాల వస్తు పరిమితులలో మాత్రమే భావించగలిగే బుద్ధి చైతన్యానికి ఈ భిన్న దర్శనం తప్పదు.

తన కదలికలకు కూడా మూలమైన ఈశ్వరచైతన్యాన్ని గుర్తించి, తన పరిమిత అహాన్ని (మనస్సును) ఈశ్వరచైతన్యంలో లయం చెందించిన యోగిమాత్రమే అద్వైతానుభవాన్ని పొందగలడు. అంటే సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోగలడు. సాధకుడు ఆ సత్యాన్ని శాస్త్ర, గురూపదేశ మార్గాల ద్వారా మననం చేసుకుంటూ, మదిలో
స్థిరపరచుకుని జ్ఞానవైరాగ్య భక్తులతో యోగి కాగలడు-లక్ష్యాన్ని (సత్యాన్ని)
సాధించగలడు.

ఉపాధిగతమైన భేదాలే తప్ప అందరికీ మూలచైతన్యం ఒకటేనని విచారణలోతెలుసుకున్నవాడు-ఉపాధిగత మర్యాదలను పాటిస్తూనే ఆ పరబ్రహ్మను ఉపాసిస్తాడు.
క్రమంగా తానే బ్రహ్మానుభూతిలో తాదాత్మ్యం చెంది తాను వేరన్న స్థితిని
విడిచిపెడతాడు.

‘అవిభక్తం విభక్తేషు తతాజ్ఞానం విద్ధి సాత్వికమ్'
-
విడివిడిగా ఉన్న వాటియందు ఏకత్వాన్ని దర్శించడమే సాత్విక జ్ఞానం- అని గీతాచార్యుని వచనం. భిన్నదృష్టి రాజస, తామసాది వికృతులది. సాత్వికజ్ఞానమే
క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తుంది.

తాను కాని దానినుంచే తనకు భయం. వియోగ, సంయోగాలన్నీ తనకు భిన్నమైన ఉపాధుల నుండే కలుగుతుంటాయి. కానీ తన నుండి తనకు కలుగవు. ఇక్కడ 'తాను' అనేది స్థూల దేహ పరంగానో, లోపలి సూక్ష్మకారణ దేహాల పరంగానో
చెబుతున్నది కాదు. ఈ మూడు దేహాలలో మూడు అవస్థలలో (జాగ్రత్, స్వప్న, సుషుప్తులు) వ్యవహరించబడుతున్న 'నేను' అనే స్ఫురణ(అహం)తో ఏ త్రిపురాలకు
అతీతమైన చైతన్యం వల్ల కలుగుతుందో - ఆ సర్వ కారణ చైతన్యంలో 'నేను' అనే జీవభావం తాదాత్మ్యం చెందితే 'సర్వం బ్రహ్మమయం' అనే స్పృహ కలుగుతుంది.అప్పుడింక రెండవది ఏముంది? భక్తితో సైతం అంతా భగవన్మయమని చూసే వానికి భయమే లేదు. అందుకే భక్తుడు నిర్భీకుడు ప్రహ్లాదుని వలె.

సముద్రంలో అలలన్నీ సముద్రమే అని గ్రహించకుండా, అలలన్నింటినీ విడిగా చూడడం ఎలాంటిదో ఏకత్వదర్శనం లేకపోవడం కూడా అలాంటిదే. అలలన్నీ సముద్రంలోనివే - సముద్రంతో బంధంలేని అల లేదు. ప్రతి అలలోను సముద్ర శక్తి ఉంది. అన్ని భువనాలు పరబ్రహ్మలోనివేనని - ఆ పరబ్రహ్మను విశ్వ శరీరునిగా
దర్శిస్తాం మనం. మన ఇంద్రియాలలో వేటి లక్షణం, ధర్మం వాటికి ఉన్నా అన్నీ 'నేను' అనే చైతన్యంలోనివే కదా! అలా అన్ని జీవుల చైతన్యాలు పరమాత్మ యొక్క చైతన్య శక్తులే.

సర్వగతమైన సూర్యకాంతి ఇంటి కిటికీలోంచి పడుతుంటే కేవలం కిటికీ గుండా వెలుగును చూసేవాడు, ఆ వెలుగును కిటికీ పరిమాణంగానే భావిస్తాడు. గది దృష్టితో (వ్యవహారంలో) అది నిజమే. కానీ కిటికీ వద్దకు వెళ్లి ఆ వెలుగుకి
మూలస్థానమైన ఆకాశంలోని సూర్యుని చూస్తే- ఆ వెలుగు అపారమైనదని,అపరిమితమైనదనీ - పరిమితి కిటికీదే కానీ సూర్యకాంతిది కాదనీ తెలుస్తుంది.

దేహంలో దీపించే చైతన్యం అఖండమైన బ్రహ్మమేనని తెలిస్తే మాయావికారం వల్ల జీవి యందు ఆభాసించే పరిమిత భావం విడివడి 'బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి'
అనే స్థితికి చేరతాడు. అతనికి అంతా ఈశ్వర విలాసమే. అన్ని అలల ఆటలకీ ఆ సముద్రమే ఆధారం. అలలన్నిటినీ కలిపి ఏక సముద్ర దృష్టిగా చూసే వివేకి ప్రతి
అలలోనూ ఆ సముద్రుని ప్రత్యేకశోభనే చూసి-'అంతా ఆ సముద్రమే’నని ఒప్పుకుంటాడు.

'ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక' అని భాగవతం ఈ సత్యాన్నే ప్రతిపాదిస్తోంది. "హరియట హరుడట సురలట మునులట అఖిలాండకోటులట-అందరిలోను పరమాత్ముడు వెలిగే" అని త్యాగయ్య అద్భుతంగా కీర్తించారు.          
 కిం కర్తవ్యం?
***********
ముందు రక్తం పిండేసి 
తర్వాత అయ్యో పాపం 
అంటే ఎలా?

సమాజాన్ని దోచేస్తూ 
ఇది 'సేవ' అంటే ఎలా?

అన్నం లేకుండా చేసి 
అన్నదానాలంటే ఎలా?

జలాశ్రయాలను చెడగొట్టి 
నీళ్లువ్యాపరమంటే ఎలా?

అడుక్కునే వాళ్ళను 
తయారు చేసి 
దానధర్మాలంటే ఎలా?

మురికి కూపాలు 
తయారు చేసి 
రోగాలొచ్చాయంటే ఎలా?

రోగుల్ని తయారుచేసి 
'మందులబతుకు'అంటే ఎలా?

వెనకనుండి బొక్కలు పెట్టేసి 
ముందుకొచ్చి చిక్కుల్లో 
పడ్డామంటే ఎలా?

పేకముక్కల్ని మార్కెట్ చేసి 
పేకాడేవాళ్ళను పట్టుకుంటే 
ఎలా?

మద్యం విక్రయిస్తూ 
మద్యం తాగొద్దంటే ఎలా?

సిగరెట్లు అమ్మకం పెట్టి 
పొగతాగటం హానికరమంటే 
ఎలా?

విద్య వైద్యాలను వ్యాపారం 
చేసి -సేవలు కూడవ్యాపారం 
అంటే ఎలా?:

'పని' లేని సమాజాన్ని తయారు చేసి -పనికి 
ఆహారపధకం అంటే ఎలా?

జీతాలున్నా లంచాలు 
స్వీకరిస్తూ -లంచగొండి 
సమాజమంటే ఎలా?

ఎఫ్. డి. ఐ లకు రెడ్ కార్పెట్ 
పరచి -విదేశీ దోపిడి అంటే ఎలా?

దిక్కులేని వేశ్వా సమాజాన్ని 
సృష్టించి -వ్యభిచారం 
తప్పు అంటే ఎలా?

దిక్కులేని బాలలున్నప్పుడు 
బాల కార్మికులు ఉండ కూడదు అంటేఎలా?

ఇంట్లో పెళ్ళాన్ని హింసిస్తూ 
స్త్రీ గౌరవం గురించి వేదికలు 
ఎక్కితే ఎలా?

ఒకరి కులాన్ని ఒకరు 
ద్వేషిస్తూ -ప్రేమ గురించి 
మాట్లాడితే ఎలా?

మనం మనం తన్నుకుంటూ 
పక్కాడికి లోకువ అంటే ఎలా 

ఓటును క్రయ విక్రయం చేసి 
మనది ప్రజాస్వామ్యమంటే 
ఎలా?

వస్తువుల్ని సేవల్ని విలువల్ని 
వ్యాపారం చేసి -దేశం చెడి 
పోయిందంటే ఎలా?

పెద్దనోట్లు వద్దు అని 
ఇంక పెద్దనోట్లు తెస్తే ఎలా?

జైళ్ళనుంచి'రేప్'గాళ్ళను 
వదిలేసి -వాళ్లకు హారతులు 
పడితే ఎలా?

డేరా బాబాలను.. వదిలేసి 
దుష్ట బాబాలకు పట్టం 
గడితే ఎలా?

మందులమ్ముకునే బాబాలు 
ధ్యానకుసుమాలంటే ఎలా?

వీధిలో కృష్ణయ్యలంతా 
ఇంట్లో రామయ్యలంటే ఎలా?

సృష్టి తల్లిదండ్రులు చేస్తుంటే 
అది దేవుడిపని అంటే ఎలా?

ఎలక్షన్ బాండ్లు తీసుకొని 
దొంగరాజ్యం కాదంటే ఎలా?

మత మూర్ఖత్వానికి 
పాలకులు తోడైతే ఎలా?

పూజలు చేస్తే -ఇ. వి. యం 
లలో ప్రజాతీర్పు మారిపోతే 
ఎలా?c

చింత కాయలు రాలవని 
తెలిసినా -మంత్రాలు,
మహిమలు అంటే ఎలా?

నిజాలు తెలిసినా 
అబద్ధాలు చెపుతుంటే ఎలా?

మెంటల్ కేసుల్ని 
పార్లమెంట్ కు పంపితే ఎలా?

ఎక్కడ సరిచెయ్యాలో 
తెలిసి కూడా -దొంగనాట కాలు ఆడితేఎలా?

ఇలా విశ్లేషించు కున్నప్పుడు 
'కింకర్తవ్యం' అని ప్రశ్నించు 
కోక పోతే ఎలా?
            **********

Saturday, January 4, 2025

 *అమాయకపు మొగుడు - అతి తెలివి పెళ్ళాం* (జర్మన్ జానపద హాస్య కథ) 
డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూల్
*****************************
ఒక ఊరిలో ఒక అమాయకుడు ఉండేవాడు. వాడు అమాయకుడే కానీ చాలా నిజాయితీపరుడు. నోరు తెరిస్తే నిజాలే తప్ప చచ్చినా అబద్ధాలు చెప్పేటోడు కాదు. ఆ అమాయకునికి పక్కింట్లో ఒక అవ్వ ఉండేది. ఆమెకు నా అనేటోళ్లు ఎవరూ లేరు. మొగుడు ఒక సంవత్సరం కిందటే చచ్చిపోయాడు. కొడుకు చిన్నప్పుడే చెరువులో నీళ్లు తాగుతా... తాగుతా... పొరపాటున కాలుజారి అందులో పడిపోయాడు. ఆమెకు ఈ అమాయకున్ని చూస్తే అచ్చం చనిపోయిన తన కొడుకుని చూసినట్లే అనిపించేది. తన కొడుకు కూడా బ్రతికుంటే ఇంత వయసొచ్చి హాయిగా పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో కళ్ళముందే తిరుగుతా ఉండేవాడు కదా అనుకునేది.
ఆ అమాయకునికి కొంత కాలానికి పెళ్లయింది. కానీ పెళ్ళాం వీని లెక్క అమాయకురాలు కాదు. ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం. చానా తెలివైంది. ఎంత చిక్కు సమస్యనైనా సరే చిటికెలో విడదీసేది.
ఆ అవ్వకు కొంత కాలానికి జీవితం మీద విరక్తి వచ్చేసింది. దాంతో ఇంట్లో ఉన్నవన్నీ అందరికీ తలా ఒకటి ఇచ్చేసి, కాశీకి పోయి, దేవునికి సేవ చేసుకుంటూ అక్కడే బతకాలి అనుకుంది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీస్తూ ఉంటే బీరువా లోపల ఒక మూలకు జాగ్రత్తగా దాచిపెట్టిన చిన్న పెట్టె కనబడింది. ఏముందబ్బా దీంట్లో అని చూస్తే ఒక చిన్న చీటీ దొరికింది. అందులో "పెరటిలో చింత చెట్టు దగ్గర తవ్వి చూడు... నాలుగు తరాలు తిన్నా తరగని సంపద అక్కడ ఉంది" అని ఉంది. పోయి తవ్వి చూస్తే ఇంకేముంది ధగధగా మెరిసిపోతా వజ్రాల హారాలు, బంగారు గొలుసులు తళుక్కుమన్నాయి. కానీ అంత విలువైనవి దొరికినా అవ్వకు కొంచెం కూడా ఆశ పుట్టలేదు. వాటిని సంబరంగా వేసుకొని తిరగాలి అనిపించలేదు.
ఆ అవ్వకు అమాయకుడు గుర్తుకు వచ్చినాడు. వానిని పిలిచి "చూడు నాయనా నీవు అచ్చం నా కొడుకు లెక్కనే ఉంటావు. అందుకే ఈ బంగారు నగలున్న పెట్టె నీకు ఇస్తున్నా. కానీ ఇవి నీ వద్ద ఉన్నట్టు ఎవరికీ చెప్పొద్దు. ఈ ఊరి అధికారి అసలే మంచోడు కాదు. ఎవరి దగ్గరన్నా విలువైనవేమన్నా ఉన్నాయి అని తెలిస్తే చాలు అన్నీ నున్నగా నొక్కేసే దాకా నిద్రపోడు. ఈ రహస్యాన్ని నోరు జారకుండా నీలోనే దాచి పెట్టుకోగలవా" అని అడిగింది.
"ఓ దానికేముంది. నేనేమన్నా వసపిట్టనా... మాటల పుట్టానా... ఒక్క అక్షరం కూడా నా కడుపులోనుంచి సచ్చినా బయటికి రాదు" అన్నాడు. ఆ మాటలకు ముసలామె 'సరే' అని ఆ బంగారు నగల పెట్టె ఆ అమాయకునికి ఇచ్చింది. 
వాడు దాన్ని ఇంటికి తీసుకుపోయి పెళ్ళానికి ఇచ్చాడు. ఆమె వాటిని చూసి అదిరిపడి "ఎక్కడివి నీకు ఇవి... దొరికాయా లేక కొంపదీసి ఎక్కడైనా ఎత్తుకొచ్చావా" అని అడిగింది. దానికి వాడు "ఎత్తుకురావలసిన కర్మ నాకేమి పట్టింది. మన ఎదురింటి ముసలామె కాశీకి పోతూ పోతూ ఇవన్నీ నాకు ఇచ్చింది" అంటూ జరిగిందంతా చెప్పాడు. ఆ మాటలు విన్న వాని పెళ్ళాము "సరే పొరపాటున కూడా ఎక్కడా నోరు జారకుండా జాగ్రత్తగా అంతా కడుపులోనే పెట్టుకో. మన గ్రామాధికారి అసలే మంచోడు కాదు. భూమిలో ఎక్కడ ఏమి దొరికినా అంతా మాదే అనే రకం" అని చెప్పింది.
దానికి వాడు చిరునవ్వు నవ్వి "ఎందుకనవసరంగా భయపడతావు. నేనేమైనా వసపిట్టనా, మాటల పుట్టనా... ఒక్క అక్షరం కూడా నా నోటివెంట సచ్చినా బయటికి రాదు" అన్నాడు. ఆమె సంబరంగా అందులోనుంచి ఒక నగ తీసుకొని పోయి అమ్మి దాంతో ఇంటికి కావలసిన సరుకులన్నీ ఆరు నెలలకు సరిపోయేవి కొనుక్కొచ్చింది. వస్తా వస్తా మధ్యాహ్నం చెరువు దగ్గర నుంచి మంచి చేపలు తీసుకువచ్చింది. కూర వండుతా ఉంటే ఆ కమ్మని వాసన వీధి వీధంతా గుమ్మని ఆవరించింది. 
ఆ అమాయకుడు పోతావుంటే ఎదురింటిలోని స్నేహితుడు "ఏరా... ఈరోజు మీ ఇంటి నుంచి కమ్మని వాసన గుమ్మని కొడతావుంది. అదీగాక బండినిండా సరుకులు దిగినాయి. ఏంది సంగతి" అని అడిగాడు. అబద్దాలు చెప్పడం తెలియని ఆ అమాయకుడు జరిగిందంతా చెప్పి "ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. నీ కడుపులోనే దాచుకో. నమ్మకమైనవాడివి, మంచి స్నేహితుడివి కాబట్టి చెబుతా ఉన్నా" అన్నాడు.
దానికి ఎదురింటి స్నేహితుడు చిరునవ్వు నవ్వుతూ "నువ్వు భలే ఉన్నావే. నేనేమైనా వసపిట్టనా లేక మాటల పుట్టనా. ఇవతలి చెవితో విన్నది అవతలి చెవికి కూడా తెలియనివ్వను. మాటంటే మాటే" అన్నాడు.
అమాయకుడు వెళ్ళిపోగానే ఎదురింటి ఆయన పెళ్ళాం "ఏంది... ఎప్పుడూ లేనిది ఇద్దరూ ఒక మూలన కూర్చొని గుసగుసలాడుకుంటా ఉన్నారు. నాకు కూడా చెప్పకూడని రహస్యమా అది" అంది కోపంగా. దానికాయన జరిగిందంతా చెప్పి "ఆడవాళ్ళ నోట్లో ఏ విషయమూ దాగదు అంటారు పెద్దలు. జాగ్రత్త... అనవసరంగా నోరు విప్పకు, ఎవరికీ ఏమీ చెప్పకు" అన్నాడు.
దానికామె కోపంగా "ఎలా కనపడుతున్నా నీ కళ్ళకి. నేనేమైనా వసపిట్టనా లేక మాటల పుట్టనా... చచ్చినా ఒక్క అక్షరం కూడా గడప దాటి అవతలికి వెళ్ళదు. అంతే... మాటంటే మాటే" అంది.
ఆ తర్వాత ఆమె ఆ రహస్యం ఎవరికీ చెప్పొద్దు అంటూనే వాళ్ళ కోడలికి చెప్పింది. ఆ కోడలు పనిమనిషికి చెప్పింది. పనిమనిషి చుట్టుపక్కల తాను పనిచేసే ఇళ్ళవాళ్ళకు చెప్పింది. వాళ్లు వాళ్ళ స్నేహితురాళ్లకు చెప్పారు... అలా తర్వాత రోజుకంతా ఊరు ఊరంతా రహస్యం తెలిసిపోయి గ్రామాధికారిని చేరింది. గ్రామాధికారి ఆ అమాయకున్ని పిలుచుకొని రమ్మని సైనికులను పంపించాడు. వాళ్లని చూడగానే అమాయకుని పెళ్ళానికి విషయం అర్థమైంది. దాంతో "మా ఆయన లేడు. నేను వస్తా పద" అంటూ గ్రామాధికారి వద్దకు పోయింది.
గ్రామాధికారి ఆమెను చూస్తా "చూడమ్మా ఈ రాజ్యం మొత్తం రాజుది. ఇక్కడి భూమిలో ఎక్కడ ఏమి దొరికినా ఆ సంపదంతా రాజుకే చెందుతుంది. నీ మొగునికి బంగారు నగలున్న ఇనప్పెట్టె దొరికిందని ఊరు ఊరంతా సందు లేకుండా చెప్పుకుంటా ఉన్నారు. పో... పోయి... మీ ఆయన దాచిపెట్టిన పెట్టె తీసుకొని వచ్చి వెంటనే మా అధీనం చెయ్. లేకుంటే నీ మొగుణ్ణి లోపలేసి మెత్తగా ఉతకాల్సి వస్తాది చూడు" అన్నాడు బెదపడిస్తూ.
దానికామె చిరునవ్వు నవ్వి "ఇనప్పెట్టే లేదు... మట్టిగడ్డా లేదు. నా మొగుడు పెద్ద కోతలరాయుడు. నోరు తెరిస్తే సుల్లకూతలే తప్ప నిజాలు అస్సలు రావు. చీమను చంపి ఏనుగును చంపినానని మీసం మొలేసి తొడగొట్టి అల్లరల్లరి చేసే రకం. అట్లాంటి వదరుబోతు మాటలు పట్టుకొని నిజమనుకుంటే ఎట్లా... కొంచమైనా ముందూ వెనక ఆలోచించొద్దా" అనింది. దానికి ఆ గ్రామాధికారి తల గోక్కోని "సరే... వచ్చే ఆదివారం అందరి ముందు పంచాయతీ పెడతా. నువ్వు నీ మొగునితో రా. ఎవరు అబద్ధమాడతా ఉన్నారో చిటికెలో తెలిసిపోతుంది" అన్నాడు.
ఆమె సరేనని ఇంటికి బయలుదేరింది. ఇంట్లో అమాయకుడు లేడు. బయట పొలంలో ఉన్నాడు. వెంటనే ఆమె అంగడికి పోయి రెండు గంపల లడ్లు కొనుక్కొచ్చింది. వాటిని ఇంటి మీద, పెరట్లో అక్కడక్కడ చల్లింది.
మొగుడు పొలం నుంచి ఇంటికి వస్తా ఉంటే అతనికి కనపడేటట్లు గంప తీసుకొని లడ్లు ఏరడం మొదలుపెట్టింది. అది చూసి వాడు "ఇదేందే... ఇన్ని లడ్లున్నాయి ఇంటినిండా" అన్నాడు. దానికామె "ఇందాక మన వీధి వీధంతా లడ్ల వాన కురిసింది. జనాలు పన్నవి పన్నట్టు కడుపునిండా తిని గంపలకు ఎత్తుకొని దాచిపెట్టుకున్నారు. నేనుండేది ఒక్కదాన్నే కదా. ఇప్పటి వరకూ ఒక గంప ఏరినా... ఇంగ నా వల్ల కాదు. మిగతావి నువ్వు ఏరు" అంది.
వాడు సంబరంగా గబగబా అన్నీ ఏరాడు. గంప నిండిపోయింది. దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడు.
ఆమె మధ్యాహ్నం కడుపునిండా 'చాలు చాలంటున్నా వినకుండా 'ఇంకొకటి ఇంకొకటి' అంటూ కడుపు నిండిపోయేలా ఒకదాని మీద ఒకటి పెట్టింది. దాంతో వాడు బాగా తిని అలాగే హాయిగా నిద్రపోయాడు.
సాయంత్రం కాగానే ఆమె వాడిని గబగబా లేపి "పక్క రాజ్యం నుండి కొందరు సైనికులు మన ఊరి మీదకి దండెత్తి వచ్చినారంట. మొహానికి పెద్ద పెద్ద ఇనుప ముక్కులు తగిలించుకొని కనబడిన వాళ్లందర్నీ పొడిచి పొడిచి చంపుతున్నారంట. వాళ్లు వెళ్లిపోయేదాకా ఇద్దరమూ ఎక్కడన్నా దాచిపెట్టుకుందాం" అంటూ అటూ ఇటూ చూసింది. ఇంటి బయట పెద్ద గంగాళం ఒకటి కనపడింది. "నువ్వు పోయి దాంట్లో కూర్చో. ఏది ఏమైనా మళ్లీ నేను పిలిచే వరకు బయటకు రాకు. నేను అటక మీద ఎక్కి దాచి పెట్టుకుంటా" అంటూ ఆమె వానిని దాంట్లో కూర్చోబెట్టి పైన మూత మూసింది. కాసేపు ఉండి కొన్ని గింజలు తీసుకువచ్చి ఆ గంగాళం చుట్టూరా... దానిమీద చల్లి ఇంట్లో ఉన్న కోళ్లను తీసుకొచ్చి అక్కడ వదిలింది. 
ఆ కోళ్ళు గంగాళం మీద ఉన్న గింజలను ముక్కుతో పొడుచుకొని తింటా ఉంటే లోపల ఉన్న వీనికి టపీటపీమని పెద్దగా చప్పుడు వినపడసాగింది. సైనికులు ఇంటి దగ్గరికి వచ్చినట్టున్నారు. ఇల్లంతా వెతుకుతా ఇనుప ముక్కలతో పొడుస్తా ఉన్నారు" అనుకున్నాడు.
కాసేపటికి చప్పుడు ఆగిపోయింది. వాడు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.  
అరగంట గడిచాక వాని పెళ్ళాం వచ్చి మూత తెరిచింది "ఇందాకే సైనికులు వచ్చారు. నేను అటక మీద ఎవరికీ కనబడకుండా మూలన దాచిపెట్టుకున్నా కదా. కానీ వాళ్ళు అనుమానం తీరక ఇనుప ముక్కులతో అటకంతా టపీ టపీమని పొడిచి చూసినారు. అదృష్టం మూలన కూర్చోవడంతో నాకు వాళ్ళ ముక్కులు తగల్లేదు" అని చెప్పింది. 
దానికి వాడు "నిన్నే కాదు... నన్ను కూడా చంపాలని చూశారు. గంగాళం లోపల ఎవరన్నా ఉన్నారేమో అనే అనుమానంతో దాని మీద అంతా టపీ టపీ మని కొట్టినారు. నా పైప్రాణాలు పైన్నే పోయాయి. దొరికిపోతానేమోనని భయపడ్డా. కిక్కురుమనకుండా అట్లాగే దాచి పెట్టుకున్నా. ఒక పది నిమిషాలు చూసి వాళ్ళు వెళ్ళిపోయారు" అని చెప్పాడు. అట్లా ఆ మాటల్లోనే నెమ్మదిగా రెండు రోజులు గడిచిపోయాయి.
ఆదివారం పొద్దున్నే భటులొచ్చి ఇద్దరినీ గ్రామాధికారి వద్దకు తీసుకుపోయారు. చాలామంది గ్రామపెద్దలు అక్కడికి చేరుకున్నారు. గ్రామాధికారి ఆ అమాయకుని వంక చూసి "నిజం చెప్పు... నీకు ఒక ఇనుప పెట్టె నిండా బంగారు వరహాలు, ముత్యాలు హారాలు, నగలు దొరికినాయి అంట కదా... నిజమేనా" అని అడిగాడు.
ఆ అమాయకుడు అబద్ధం చెప్పడు కదా దాంతో "అవును నిజమే... మా పక్కింటి ముసలామె కాశీకి పోతా పోతా నాకు అవన్నీ కానుకగా ఇచ్చింది" అని చెప్పాడు. కానీ అంతలోనే వాని పెళ్ళాం "లేదు దొరా... మా ఆయన చెప్పేటివన్నీ ఉత్త అబద్ధాలే. నోరు తెరిస్తే చాలు అబద్ధాల మీద అబ్ద్ధాలు చెబుతాడు" అంది.
దానికి గ్రామాధికారి కోపంగా "నీ మొగుడు నిజమని ఒప్పుకుంటా ఉంటే నువ్వేమో అబద్ధం అంటా ఉన్నావ్. నిరూపించగలవా" అని అడిగాడు.
ఆమె తలూపుతా మొగుని వంక తిరిగి "బంగారు నగలు ఉన్న ఇనప్పెట్టె ఎప్పుడు తెచ్చావ్ ఇంటికి. నాకు అస్సలు గుర్తు లేదు" అనింది. దానికి వాడు "అప్పుడే మర్చిపోయావా... మన వీధిలో లడ్ల వాన కురిసింది కదా దానికి రెండు రోజుల ముందు" అన్నాడు. ఆ మాటలు వినేసరికి అందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు.
ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటా "లడ్ల వాన కురవడం ఏమిటి? వీనికి కొంచెం తిక్కగాని ఉందా" అని అనుకున్నారు. ఆమె అమాయకంగా మొగుని వంక చూస్తూ "లడ్లవాన కురిసిందా... ఎప్పుడు" అంది.
దానికి ఆ అమాయకుడు కోపంగా "అదేందే అప్పుడే అన్నీ మర్చిపోయావు. ఆ రోజు సాయంత్రం ఇనప ముక్కులు ఉన్న పక్క ఊరి సైనికులు మన ఊరి మీదికి దండయాత్ర చేసి అందర్నీ పొడిచి పొడిచి చంపారు కదా.. ఆ రోజు" అన్నాడు.
ఆ మాటలు వినేసరికి సభలో అందరూ నవ్వడం నవ్వడం కాదు. లడ్ల వానంట, ఇనుప ముక్కుల సైనికులంట. వీడు కాకమ్మ కథలు భలే చెబుతున్నాడే" అనుకున్నారు. గ్రామాధికారి నవ్వుతా ఆమె వంక చూస్తూ "మీ ఆయనకు కొంచెం పిచ్చి పట్టినట్లు ఉందమ్మా. ఎవరికన్నా వైద్యునికి చూపించు. అనవసరంగా ఈ తిక్కలోని మాటలు విని విలువైన సమయమంతా వ్యర్థం చేసుకున్నాం" అంటూ లేచిపోయాడు.
ఆపద తొలిగిపోయినందుకు ఆమె 'హమ్మయ్య' అనుకుంది. నగలపెట్టె మొగునికి గూడా తెలియకుండా దాచి పెట్టి, అప్పుడొక హారం, అప్పుడొక నగ అమ్ముకుంటా జీవితాంతం హాయిగా కాలుమీద కాలేసుకుని బతికింది.
*****************************
డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూల్
*****************************
కథ నచ్చితే *షేర్* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 *`ప్రపంచంలో జరిగే యుద్దాల గురించి అన్యాయాల గురించి ప్రతిరోజు ఆరా తీస్తూ మన పక్కనున్న మనుషుల్ని పట్టించుకోకుండా పక్కకు తప్పుకుంటున్నాం`*

*అమ్మ ను వంట గదిలో వదిలిపెట్టి అమ్మకైన గాయాలను ఖాతరు చేయకుండా*  
*ఏం కర్రీ చేసావంటూ పైపైకి నవ్వుతూ అడుగుతున్నాం.*

*నాన్నను డబ్బులు అడగడమే తప్పా*
*నాన్న మన కోసం చేస్తున్న అప్పులెన్నీ*
*కడుతున్న వడ్డీ లెన్నీ* 
*పడుతున్న పాట్లెన్నీ అడగడం మరిచిపోతున్నాం.* 

*మనకున్న ఎకరాలు ఎన్నో గుర్తుపెట్టుకొని* 
*నాన్న వాటిని కాపాడడానికి పడుతున్న కష్టాలను లోలోపల కార్చుతున్న కన్నీళ్లను గుర్తించలేకపోతున్నాం*
*బాధ్యతలు బరువులు మోసీ మోసీ*
*కుంగిపోయిన నాన్న వెన్ను ను* 
*బక్కచిక్కిన అమ్మను కనీసం దగ్గరికి తీసుకోలేకపోతున్నాం.*

*వీకెండ్ విందుల్లో విలాసాల్లో  మునిగితేలి* 
*ప్రపంచాన్ని మరిచిపోవడమే మన ప్రపంచం అనుకుంటున్నాం ఇక్కడ మందు బాటిళ్లు, చికెన్ ముక్కలు,*
*సిగరెట్ డబ్బాలే కాదు అంతకన్నా మత్తు నిచ్చే మనుషులు ఉన్నారని మరిచిపోతున్నాం.*

*క్లబ్బులు పబ్బులే కాదు మనల్ని తిరిగి మనుషుల్ని చేసే పుస్తకాలు ఉన్నాయని*
*మన స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం వాళ్ళ ప్రాణాలనే పణంగా పెట్టిన పోరాట యోధులు ఉన్నారని*
*మరిచిపోతున్నాం.*

*ఎప్పుడంటే అప్పుడు బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినే మనం* 
*కలుషిత ఆహారం తిని విగత జీవులైన విద్యార్థులు ఉన్నారని*
*తెలుసుకోవడమే మరిచిపోతున్నాం..*

 *అర్ధరాత్రి బెనిఫిట్ షోలకు వెళ్లి తిరిగి వచ్చే కొడుకు కోసం భర్త కోసం*
 *తెల్లవార్లు ఎదురుచూసే తలుపు గడియ తీసే ఉంచేమన అమ్మ , భార్య మన కోసం  ఉన్నారని*
*ఎదురుచూస్తుంటారని మరిచిపోతున్నాం.*
*`ఉన్నప్పుడు ప్రేమ చూపించండి వాళ్లు లేనప్పుడు మీరు ప్రేమ చూపించిన తీసుకోవడానికి వాళ్లకి అవకాశం ఉండదు.`*

ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి దైనందిన జీవితంలో ఆలోచించాల్సిన కథ

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి దైనందిన జీవితంలో ఆలోచించాల్సిన కథ*

ఇది చదివినట్లే వుంటుంది. కానీ కొత్త విషయాలు చాలా వున్నాయి…

         *బుద్ధి కర్మానుసారిణి!*
               ➖➖➖✍️

మానాన్న ఉన్నదాంట్లో పొదుపు తో జీవితం నడిపి సంసారం సాగించాడు.

ఆయన గారి హయాం అయిపోయింది. నా హయాం లో బండి  నడుస్తుంది. నేను నాకు తోచిన కొన్ని సూత్రాలు చెప్పేవాణ్ణి -ఆయన బాగా బ్రతకడానికి. ( అప్పటికి నేను B. Tech చేసి ఉద్యోగం చేస్తున్నాను).

*మానాన్న ఏ మన్నారో తెలుసా?
‘ఒరేయ్! నువ్వు చెప్పినట్లు చేస్తే నేను సుఖపడతాను. కానీ, నాబుద్ధి నన్ను విననివ్వదురా!"- అన్నారు.

*నాకు ఆశ్చర్యం వేసింది. ‘ఆయన బుద్ధి ఆయన అదుపులో ఉండదా?’  అని నాసందేహం. 
అప్పట్లో నాకది అర్థం గాక, ఆయన పెద్ద వాడవడం మూలంగా ఏమీ ప్రశ్నించలేక - ఆ విషయం వదిలే శాను.

*యిప్పటికి గానీ మానాన్న చెప్పింది నాకర్ధం గాలేదు.

*రామాయణం, మహాభారతం మనం ఏం చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో నిర్థిష్టంగా చెప్పాయి.      మనం నడువవలసింది రాముడి మార్గం లోననీ, రావణుడి మార్గం కాదనీ ; అలానే పాండవుల మార్గం శ్రేయోదాయకమనీ, కౌరవ మార్గం అనర్ధాలకు దారితీసి జీవితాన్ని నరక ప్రాయం చేస్తాయనీ - చక్కగా సవివరంగా, శుబోధకంగా చెప్పాయి. 

కానీ, మానవులు కలియుగం లో చేస్తున్నదేమిటి?

అంతా - భారత రామాయణాలకు విరుద్ధం గానే.    దీనికి కారణం ఏమిటి? మనసును ఎవ్వరూ అదుపులో ఉంచుకోరు. విచ్చల విడిగా పోనిస్తారు. అలా చేస్తే మంచి ఎలా జరుగుతుంది?.

నేను ఇంటర్మీడియట్  చదివేప్పుడు ఇంటికి దూరంగా వుంటూ, ఒక రూంలో ఉండి చదువుకున్నా.10 నెలల్లో ~200 సినిమాలు చూసి ఏరోజు ఏ హాల్లో ఏమి సినిమా చూసిందీ ఒక డైరీ లో వ్రాసేవాడ్ని. నేను లేనప్పుడు ఒక రోజు మానాన్న నా room కి వచ్చి, నా room mate నేను బయటకు వెళ్ళానంటే,  కూర్చుని నాపెట్టె తీసి నాడైరీ చదివాడు మానాన్న. నా room mate మానాన్న వెళ్లి పోయాక చెప్పాడు ఈ విషయం.

నేను ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను మందలించాడు ఈ విషయంలో.

నామీద నాకే అసహ్యం వేసింది. చదువుకోమని పంపితే విచ్చల విడిగా వుంటూ 300 రోజుల్లో 200 సినిమాలు చూడడం ఏమిటని. అంతే, తరువాత 5 ఏళ్ళ ఇంజనీరింగ్ లో   ఒక 10 సినిమాలు చూచి ఉంటా.

*సినిమా వాళ్లకు అది సంపాదన మార్గం. డబ్బులు కోసం వాళ్ళు - ఏడుపు రాక పోయినా ఏడ్చి, నవ్వు రాకపోయినా నవ్వి - నటించి డబ్బు సంపాయిస్తున్నారు. వెర్రివాళ్ళలా మనం ఆ సినిమాలు చూస్తున్నాం.

*తీస్తే మన జీవిత కథ సినిమా కాదా?.

*మరెందుకు అలా పిచ్చిగా సినిమాలు, సీరియళ్ళు - చూడడం?. 
అంటే, మనమీద మనకు అదుపు లేనట్టే! అది అనుసరణీయమా? ఆలోచించండి.

*దేవుడు మన వినోదం కోసం, ఉల్లాసం కోసం బలమైన ఇంద్రియాల్ని యిచ్చాడు. కానీ, అవి నీకు సేవకులు, వాటికి చెప్పి నీపనులు చేయించుకోమని మనకు బుద్ధి యిచ్చాడు దేవుడు. కానీ, మనం మన యజమాని పనులు మానేసి, మనమే వాటికి (ఇంద్రియాలకు) సర్వాధికారాలు యిచ్చేసి, మనం మన ఇంద్రియాలకు దాస్యం చేస్తున్నాం- బానిసల్లాగా . అంటే, పనిమనిషికి ఇల్లు అప్పగించి ఇల్లాలు క్లబ్బుల వెంటఁ తిరిగితే ఏమౌతుంది? 
కొంప కొల్లేరు ఔతుంది- అనుమానమా?

*నిజ జీవితంలో అదే జరుగుతోంది. డాబు, దర్పం - ఎక్కువైంది మనుషులకు. లేని అర్హతలు వున్నట్లు ఆపాదించుకుంటూ, సమాజంలో డబ్బులు యిచ్చి మరీ పొగిడించు కుంటున్నారు. మానవ జన్మ ఎత్తింది ఇందు కేనా? ఆలోచింతురుగాక!

*ఇక అసలు విషయానికి వద్దాం! ఓపిగ్గా చదవండి, సహనం కోల్పోవద్దు. Long post

 *బుద్ధి కర్మానుసారిణి!*

*అసలు కరోనా ఎందుకొస్తోంది?" అన్న ప్రశ్న ఎవరినడిగినా ఒకటే చెబుతారు.  
*'వైరస్' వల్ల వస్తున్నది'

*'మరి వైరస్ అందర్నీ కాటేయడం లేదేంటి?'
*'ఇంట్లో జాగ్రత్తగా ఉంటే రాదు'
 
*'మరి ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా చాలామందికి వస్తోంది కదా ?'
'గాలిలో వస్తోంది'

*అదే గాలిని అందరూ పీలుస్తున్నారు కదా? మరి అందరికీ రావడం లేదెందుకు?
*రోగ నిరోధక శక్తి లేనివాడికి వస్తోంది.

*'రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతోంది?
*'తెలియదు'

*ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం.

*'మా మామయ్య కూరగాయలకని మార్కెట్టుకి వెళ్ళొచ్చాడు. అక్కడ సోకింది'
*మరి అక్కడే ఉంటూ, రోజంతా కూరగాయలు అమ్ముతున్న వాడికి ఎందుకని రావడం లేదు?
*నో ఆన్సర్

*'మా బాబాయి పాలప్యాకెట్ కని బయటకెళ్ళి వైరస్ అంటించుకున్నాడు'
*మరి రోజంతా అదే షాపులో పాలప్యాకెట్లు అమ్ముతున్న వాడికి ఎందుకని రాలేదు?'
*మళ్ళీ నో ఆన్సర్

*'మా నాన్న వద్దంటున్నా వినకుండా బయటకెళ్ళి మామిడిపండ్లు కొన్నాడు. అక్కడ సోకి ఉంటుంది'
*'రోజంతా ఎండలో రోడ్డుపక్కన కూచుని మామిడి పండ్లు అమ్ముతున్న ఆమెకు ఎందుకని కరోనా సోకలేదు?'
*మళ్ళీ నో ఆన్సర్.

*చివరకు ఇలా జవాబు వస్తుంది.

*కాయకష్టం చేసేవాళ్లకు రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్లకు రాదు.

*ఏతావాతా తేలిందేమిటి? ఎవడికైతే రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటున్నదో వాడికి కరోనాయే కాదు. ఏ వైరసూ సోకదు. ఏ బాక్టీరియా సోకదు. ఏమీ కాదు!

*ఆయుర్వేద సృష్టికర్తలైన ఋషులు వేల ఏళ్ళనాడే ఏమేం చేస్తే, ఎలా బ్రతికితే, రోగనిరోధకశక్తి బాగుంటుందో చెప్పారు.

*వినేవారేరీ? వింటే, జనం పోగుచేసుకుంటున్న చెడుకర్మను ఎవడనుభవిస్తాడు? మంచి చెప్పినా ఎవడూ వినడు. విన్నట్టు విని వదిలేస్తాడు గాని ఆచరించలేడు.

*ఇప్పుడు విషయంలో కొద్దాం.

*నేనింతవరకూ ఓవెన్ ను కొనలేదు. ఎందుకో తెలుసా? దానివల్లనే అమెరికాలో పెద్దప్రేగు కాన్సర్ వస్తున్నదని తెలిసింది గనుక.

*నేనమెరికాలో ఉన్నపుడు ఒక విషయం గ్రహించాను. అమెరికాలో పొట్ట కేన్సర్లు చాలా ఎక్కువ.
*ఎందుకని?
*వినండి మరి.

*స్టోర్స్ లో ఉన్న మాంసం ఎన్నో రోజులనుంచీ డీప్ ఫ్రిజ్ లో ఉంటుంది. మైనస్ డిగ్రీలలో ఉంటుంది. దాన్ని తెచ్చి, ఓవెన్లో పడేసి ఒకేసారి 160 ఫారెన్ హీట్ దాకా వేడిచేసెసి తింటారు. ఒకేసారి అంత టెంపరేచర్ తేడా వస్తే ఆ మాంసంలో ఏమౌతుంది? పైగా, మంటపైన. అక్కడ ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది.  ఓవెన్ లో ఏ ఆక్సిజన్ ఉంటుంది?

*ఒక ఉదాహరణ చెప్తాను, వినడానికి అసహ్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం.

*చనిపోయిన దేహాన్ని మార్చురీలోని కోల్డ్ స్టోరేజిలో ఉంచడానికి, మాంసాన్ని, కూరగాయలను ఫ్రిజ్ లో ఉంచడానికి తేడా ఏంటి?

*ఈరోజుల్లో, ఏ పూటకాపూట, ఏ రోజు కూరగాయలను ఆరోజున వేడివేడిగా వండుకుని, ఏపూట అన్నం ఆపూట వేడిగా వండుకుని ఎవరు తింటున్నారు?

*చెప్పనా? రోజుకూలీలు తింటున్నారు. కాయకష్టం చేసుకునేవాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏ రోజుకు ఆ రోజున కూరగాయలు తెచ్చుకుంటారు. మంట మీద వండుకుని తింటారు. ఓవెన్ వాడరు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు.

*సుఖానికిపోయే సంపన్నులు, ఫ్రిజ్ లో వారాల తరబడి ఆహారాన్ని మురగబెట్టుకుని తినేవాళ్లు, ఓవెన్లు వాడేవాళ్లు రోగాల పాలౌతున్నారు.

*ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ వంట చెయ్యడానికి బద్ధకిస్తూ, పొద్దున్నే ఒకేసారి అన్నీ వండిపారేసి, వాటినే రాత్రికి పెట్టుకుని తినేవాళ్లు రోగాలపాలౌతున్నారు.

*జొమాటోలో ఆర్డర్ చేసి తెప్పించుకుని లొట్టలేసుకుంటూ మింగే తిండిలో ఏముంటుందో మీకు తెలుసా? అదెప్పటి ఆహారమో మీకు తెలుసా?

*ఈ రోజున మిగిలిపోయిన ఫుడ్ ని 
ఏ హోటలువాడూ పారెయ్యడు. రేపు, ఎల్లుండి, ఎంతవరకూ దానిని ఉంచగలిగితే అంతవరకూ ఫ్రిజ్ లో ఉంచి, ఓవెన్లో ఇన్ స్టంట్ గా వేడిచేసి మీకు పంపిస్తాడు.

*ఆ కుళ్లిపోయిన వేడివేడి ఆహారాన్ని లొట్టలేసుకుంటూ మీరు మింగుతారు. ఇక మీకు రోగాలు రాక ఏమౌతాయి మరి?

*ప్రతిరోజూ చెమటపట్టేలా వ్యాయామం ఎవరు చేస్తున్నారు?   ఏసీ జిమ్ముల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ ఎగరడం కాదు. చక్కటి ఎండలో, ఆరుబైట గాలిలో ఎవరు వ్యాయామాలు చేస్తున్నారు?

*ఆ చేసే వ్యాయామాలు మాత్రం ఏమిటి? కండలు పెంచే జిమ్మువ్యాయామాలు. అవి రోగనిరోదకశక్తిని పెంచగలవా? లేవు. ఏడాది పాటు పెంచిన కండలు, ఒక్క జ్వరంతో కరిగి వేలాడటం మొదలుపెడతాయి.

*మరెందుకవి? మనదైన యోగాభ్యాసాన్ని శుద్ధంగా చేస్తున్నవారెందరు?

*అసలు కనీస వ్యాయామమంటూ ఏదో ఒకదాన్ని ఏడుస్తున్నవారెందరు? ఎవరూ లేరు.

*పొద్దున్న పదింటికి నిద్ర లేవడం, ఆ సోఫాలోనో, బెడ్ మీదనో రోగిష్టిలాగా పడుకుని, టీవీనో, మొబైల్ నో చూస్తూ, ఫోన్లో సొల్లు వాగుతూ  ఉండటం.

*టైమైతే జొమాటో ఆర్డర్ పెట్టడం, తిని మళ్ళీ మొబైల్లోకి చూస్తూ పడుకోవడం.
*లేకపోతే ఆ ఫ్రిజ్ లో కుక్కిన పదిరోజులనాటి చెత్తను మింగడం. ఇది మన దినచర్య. ఇక రోగాలు రాక మరేమొస్తాయి?

*"ఏదో రోగం వచ్చినపుడు కూడా ప్రకృతిసిద్ధమైన మందులు వాడకుండా, సింథటిక్ ముందులు వాడటం.
*అక్కడకూడా డబ్బులు పారేసి పెద్దఆస్పత్రిలో చేరి దేహాన్ని వారికి అప్పజెప్పడం.
*అదృష్టం బాగుంటే ప్రాణంతో తిరిగి రావడం, లేదా శవంగా బయటకు రావడం.
*దహనం కూడా ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో. ఇదీ మన బ్రతుకు.

*వినడానికి అసహ్యంగా ఉంటుందని ముందే చెప్పాను.

*ఎప్పుడైనా చూశారా మీరు? మామూలుగా దహనం చేసిన  శవం బూడిద ఎలా ఉంటుందో? తెల్లగా ఉంటుంది. ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో వచ్చే బూడిదను ఎప్పుడైనా చూశారా? నల్లగా ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా పెనం మీద అట్టు మాడినట్లు శవం అందులో మాడిపోతుంది. అది అసహజ ప్రక్రియ.

*బ్రతికున్నపుడూ అసహజంగా బ్రతకడం, చావులో కూడా అసహజమే.

*సినిమాలు చూసి, ఫుడ్ కంపెనీల యాడ్స్ మాయలో పడి, మోడరన్ లైఫ్ ఉచ్చులో ఇరుక్కుని మనుషులు వారి ఆరోగ్యమును వారే నాశనం అవుతున్నారు.

*అసలు మన దేశంలో ఫ్రిజ్ ఎందుకు? అవసరమా?
*మనకు ఓవెన్లెందుకు? అవసరమా?
*మనకు జొమాటోలెందుకు? అవసరమా?
*రోజంతా కదలకుండా పందుల్లాగా పడుకుని టీవీలు, మొబైళ్ళు చూడటం మనకెందుకు? అవసరమా?*అర్ధరాత్రిళ్ళు, తెల్లవారు ఝామున నానాచెత్త తిండి తినడం అవసరమా?*

*ఏదీ అవసరం లేదు. ఇదేదీ సహజం కాదు. మరి ఇన్ని అసహజమైన, ప్రకృతి విరుద్ధమైన పనులు ప్రతిరోజూ చేస్తూ, మన రోగనిరోధకశక్తి గట్టిగా ఉండాలంటే ఎలా ఉంటుంది?

*పోనీ మనసన్నా శుద్ధంగా ఉంటున్నదా? ఓర్వలేనితనం, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, కోపాలు, అహంకారాలు, గర్వాలు, ధనమదం, కులగర్వం, ఆశ, నాటకాలు, వేషాలు, పొగరు, లెక్కలేనితనం, అన్నీ నాకే తెలుసన్న మదం ఇలా చెప్పుకుంటూ పోతే  ఎన్నో ఎన్నెన్నో మన మనస్సులో ఉన్న దయ్యాలు.

*ఒళ్ళూ కుళ్లిపోతూ, మనసూ కుళ్లిపోతూ, పైకిమాత్రం 'అంతా భలేబాగుంది' అనుకుంటూ   బ్రతుకుతున్న  ఇలాంటి స్థితిలో కరోనా ఎందుకు? గట్టిగా ఒక చిన్న గాలివీస్తే చాలు మనం నేలకూలిపోవడానికి.

*ఏవిధంగా మనం ఆరోగ్యవంతులం అసలు?
*మనల్ని చంపడానికి కరోనాయే అవసరం లేదు. చిన్న సూది గుచ్చుకుంటే కూడా, కుప్పకూలిపోయి, ప్రాణాలు పోయే రోజులున్నాయి.*

*బుద్ధి కర్మానుసారిణి. ఎవడాపగలడు? ఎవడెన్ని చెప్పినా, ఎంత మంచిని చెవిలో వినిపించినా, ఎవడూ వినడు. ఆచరించడు.

*ఏ ఒక్కటీ కాదనలేని వాస్తవం. ఈ మెసేజ్ వల్ల కొందరైనా, కొంతైనా మారాలని, కనీసం మారే ప్రయత్నం చెయ్యాలని ఆశిద్దాం.
నిజమే కదా….!
     *అతి సర్వత్ర వర్జయేత్✍️

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
 *`రక్తసంబంధాల గొప్పతనాన్ని తెలిపే అద్భుత సంఘటన తప్పకుండా చదవగలరు.`*

*ఒక భార్య ..భర్త ఎంతో అన్యోన్యంగా ఉండేవారు....వారి అన్యోన్యతకు గుర్తుగా*
*వారికి ఓ కుమార్తె పుట్టింది.......చాలా సంతోషంగా ఉన్నదాంట్లొనే*
*ఎంతో తృప్తిగా ఉండేవారు.......*

*పాపకు నాలుగు సంవత్సరాల వయస్సు. ఆ పాప తల్లి ఒకరోజు తన కూతురితో*

*"నీకు ఒక తమ్ముడు పుడతాడు కొద్దిరోజుల్లో....నీవు వాడిని బాగా చూసుకోవాలి*
*వాడితో గొడవపడకుండా బుద్ధిగా ఆడుకోవాలి . వాడికి ఏ లోటూ రాకుండా*
*చూసుకోవాలి " అని చెప్పింది.... అప్పటినుండి ఆ పాప రోజూ అమ్మ నాన్నలను*
*తమ్ముడు ఎప్పుడొస్తాడు అని అడుగుతూ ఉండేది........తన తమ్ముని మీద*
*ఎనలేని ప్రేమను అనురాగాన్ని పెంచుకోసాగింది........*

*నెలలు నిండి ఆ తల్లి నిజంగానే ఓ మగ శిశువును* *ప్రసవించింది.....కానీ.....*
*ఆ బిడ్డకు ఏదో తీవ్ర అనారోగ్యం వలన ఆ బిడ్డను ఇంటెంసివ్ కేర్లో ఉంచాల్సి*
*వచ్చింది....ఈ పాపకేమో తన తమ్ముడిని చూడాలని ఆశగా ఉంది...కానీ*
*ఆ గదిలోకి ఎవరినీ వెళ్ళనివ్వడంలేదు......అమ్మను అడిగింది.....వాళ్ళ*
*నాన్నను బ్రతిమలాడింది......పాప నాన్న ఆ పాపను ఎత్తుకుని*
*తమ్మునికి ఆరోగ్యం బాలేదు నువ్వుకూడా విసిగించకు అని మెల్లగా*
*చెప్పాడు........కానీ ఆ పాప అస్సలు వినడంలేదు......ఇలా అంది.*

*నాన్నా! ఒక్కసారి నాకు నా తమ్ముడిని* *చూపించండి..వాడిదగ్గరికి*
*నన్ను తీసుకెళ్ళండి .వాడికి ఏమీ కాదు....ప్లీజ్ ,,,,,,,వాడితో*
*నేను ఆడుకోవాలి. నా తమ్ముడి దగ్గరికి ఎందుకు నన్ను తీసుకెళ్ళడంలేదు*
*అని బిగ్గరగా ఏడ్చింది.......*

*ఆ పాప ఏడుపును ఆపకపోయేసరికి .........తండ్రి డాక్టరుదగ్గరికి వెళ్ళి*
*మా బాబు బ్రతికి ఉంటాడో లేదో మాకు భయంగా ఉంది కనీసం ఈ పాపనైనా*
*బ్రతికించుకోవాలి. బాబుని ఒక్కసారి పాపకు చూపించి తీసుకువస్తాను .దయచేసి*
*అనుమతిని ఇవ్వండి....అని అడిగాడు........*

*డాక్టర్లు కూడా ఆ పుట్టిన బిడ్డ పరిస్థితి సరిగ్గా లేదని..అసలు చలనమే లేదనీ*
*చెప్పి.........ఒక్కసారి ఆ పాపను తన తమ్ముని దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి*
*అనుమతినిచ్చారు......*

*పాప తన ఏడుపును ఆపి తన తమ్ముడిని చూడటానికి గదిలోకి వెళ్ళింది.......*

*" తమ్ముడూ! లెయ్యిరా! నేను నీ అక్కను..........అమ్మ నువ్వు వస్తావనీ*
*నేను నిన్ను బాగా చూసుకోవాలని,,,,,నీతో బాగా ఆడుకోవాలని చెప్పింది.*
*చాలా రోజులు ఎదురుచూశాను. ఇప్పుడు ఇలా పడుకుని ఉన్నావే!*
*లెయ్ .......మనం ఆడుకుందాం " అంటూ ఆ బాబు చేతివేళ్ళను మెత్తగా*
*తాకింది..."*

*ఆశ్చర్యంగా ఆ పసిబిడ్డ కళ్ళు తెరిచి అలా చూసి ఏడుపు మొదలెట్టాడు..*
*అంతవరకు చలనమే లేని ఆ పసిబిడ్డ అలా ఏడవగానే డాక్టర్లు పరుగున*
*ఆ గదిలోకి చేరుకుని ఇక ఆ బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు....*

*ఇది ఒక అద్భుతం .........ఒక పాప మనసులో తన తమ్ముడిపై పెంచుకున్న*
*ప్రేమ అనురాగాలు ఖచ్చితంగా ఆ బిడ్డను చేరాయి.....ఆ బిడ్డ ప్రాణాలతో*
*బయటపడ్డాడు.......వింతగా లేకపోయినా ఇందులో తెలుసుకోవలసిన*
*అంశం ఉంది......పసిపిల్లల ప్రేమ.........అనురాగం.......నిజంగా*
*ఆ దేవుడి ఆశీస్సులతో సమానం కదా...*
 *తగిన శాస్తి (సరదా నీతి కథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
       ఒక ఊరిలో ఒక పేద రైతు వుండేవాడు. అతను చానా మంచివాడు. బాగా కష్టపడేవాడు. అతనికి ఇంటిముందు కొంచం ఖాళీ స్థలం వుంది. అక్కడ చిన్న తోట వేసి ఆకుకూరలు కూరగాయలు పండించేవాడు. ఒకసారి అందులో ఒక గుమ్మడి తీగను నాటాడు.
కొన్ని రోజులకు ఆ గుమ్మడి తీగ పెరిగి పెద్దగయి నిండుగా పూలు పూసింది. దాంతో రైతు ఆ గుమ్మడి తీగకు ఎటువంటి పురుగులు పట్టకుండా  జాగ్రత్తగా చూసుకుంటూ బాగా ఎరువులు వేయసాగాడు. కొద్ది రోజులకు అది మంచి లావు లావు కాయలు కాయసాగింది. వాటిలో ఒక కాయేమో ఎవరూ ఊహించనట్లు రోజురోజుకూ పెరిగి పెద్దగవుతూ పదిమంది మోసేంత లావయింది. అది చూసి అందరూ
మా జన్మలో ఇంత లావు కాయను మేమెప్పుడూ చూడలేదు అంటూవుంటే...  చుట్టుపక్కల వూళ్ళవాళ్ళు బండ్లు కట్టుకోని వచ్చి మరీ చూసిపోసాగారు.
వానికి అంత లావు కాయను చూసి సంబరమైతే అయితావుంది కానీ దాన్ని యేమి చేయాలో తోచలేదు. అప్పుడు ఒక ముసలాయన రేయ్... ఈ లోకంలో ఇలాంటి వింతలు నూటికో కోటికో ఎప్పుడో ఒకసారి జరుగుతా ఉంటాయి. దీన్ని అలాంటిలాంటి అల్లాటప్పగాళ్ళ చేతిలో పెట్టొద్దు. సక్కగా తీసుకోనిపోయి మనూరిని పాలించే మహారాజుకు బహుమానంగా ఇయ్యి. ఆయనకు నచ్చిందంటే నీ తలరాతే మారిపోతాది. నచ్చలేదంటే నీ పని నీకు ఎలాగూ వుంది గదా. పో పోయి కొండకు తాడుగట్టి లాగుపో అన్నాడు.
ఆ రైతు సరేనని ఆ గుమ్మడికాయను ఒక బండిమీద వేసుకొని రాజు దగ్గరికి పోయాడు. రాజు ఆ గుమ్మడికాయను చూసి చానా సంబరపడ్డాడు. ఆ రోజు ఆయన పెళ్ళాం పుట్టినరోజు. ఆమెకు గుమ్మడికాయ కూరంటే చానా ఇష్టం. దాంతో రాజు సరిగ్గా సమయానికి తెచ్చావు అంటూ ఆ రైతును మెచ్చుకొని ఆ గుమ్మడికాయ ఎంత బరువుందో అంత బరువు బంగారం కానుకగా ఇచ్చి పంపిచ్చాడు. ఆ రైతు ఆ బంగారమంతా అమ్మి చెరువు కింద పదెకరాల పొలం కొనుక్కోని హాయిగా కాలుమీద కాలేసుకోని బదకసాగాడు.

అది చూసి వాని పక్కింటిలో వున్న ఒక ధనవంతునికి కన్ను కుట్టింది. ఎలాగైనా సరే ఆ పేద రైతుకన్నా పదింతల బంగారం బహుమానంగా సంపాదించాలి అనుకున్నాడు. వాని దగ్గర ఒక మంచి పొలం పని చేసే ఎద్దు వుంది. దానికి మూడుపూటలా తిండి పెడతా, చిన్న పనిగూడా చెప్పకుండా పందిని మేపినట్టు మేపసాగాడు. అది పనీపాటా లేక తినీ తినీ ఆరు నెలలు తిరిగేసరికి ఒక చిన్న ఏనుగు పిల్ల లెక్క బలిసింది. అంతలావు ఎద్దు చుట్టుపక్కల యెక్కడా లేదని జనాలంతా యెగబడి చూడసాగారు. దాంతో వాడు సంబరంగా ఆ ఎద్దును తీసుకొని రాజు దగ్గరకు పోయాడు.
రాజా... ఈ భూమ్మీద ఇంత లావు ఎద్దు ఎక్కడా లేదు. కాబట్టి దీనిని తీసుకొని దీని బరువు ఎంతుందో అంత బంగారం నాకు బహుమానంగా ఇవ్వండి అన్నాడు.
  రాజుకి వాని చెడు ఆలోచన అర్థం అయ్యింది. దాంతో కోపంగా వాన్ని చూస్తూ ... రేయ్... రైతు పని పంట పండించడం. ఎవరికీ రానంత దిగుబడి యెవడు సాధిస్తాడో వాడు గొప్పోడు అవుతాడు. అలాగే ఎద్దుపని దున్నడం. ఏదీ దున్ననంత వేగంగా, ఏది ఎక్కువ ఎకరాలు దున్నితే అది గొప్పదవుతుందిగానీ... ఇలా పోరంబోకు మాదిరి పనీపాటా లేకుండా తిని లావయితే ఎలా గొప్పదవుతుంది. ఈ మాత్రం పని నువ్వేకాదు డబ్బులున్న ఏ గొట్టంగాడయినా చేస్తాడు. అనవసరంగా ఒక మంచి ఎద్దును ఎందుకూ పనికి రాకుండా చేసినందుకు వీన్ని తీసుకుపోయి పది కొరడా దెబ్బలు కొట్టండి అని భటులను ఆదేశించాడు. అదిచూసి అందరూ వానికి తగిన శాస్తి జరిగిందని నవ్వుకున్నారు.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 *గమ్మతైన గడ్డి కోటు (జపాన్ దేశ జానపద కథ)*డా.ఎమ్.హరికిషన్-కర్నూలు-9441032212
***************************
ఒక ఊరిలో ఒక పిల్లవాడు వుండేవాడు. వాడు పెద్ద అల్లరోడు. చెట్ల చాటునా గుట్టల చాటునా దాచిపెట్టుకొని దారిన పోయేవాళ్లను చిన్నచిన్న రాళ్లతో కొట్టేవాడు. వాళ్లు రాయి ఎక్కడినుంచి వచ్చి పడిందో తెలియక దిక్కులు చూస్తా వుంటే పడీ పడీ నవ్వుకునే వాడు. ఇళ్ళ ముందు విడిచిన చెప్పులు ఎత్తుకుపోయి ఎవరికీ కనపడకుండా దాచిపెట్టేవాడు. చిన్న పిల్లల జడలు ఒకదానితో ఒకటి తెలియకుండా ముడి వేసేవాడు. ఇళ్లలో కట్టేసిన దూడల కట్లు విప్పేవాడు. అవి ఆవుల వద్దకు చేరి పాలన్నీ తాగేసేవి. తరువాత మరలా వాటిని ఎక్కడ ఎట్లున్నవి అట్లా కట్టేసేవాడు. సాయంకాలం ఇంటావిడ వచ్చి ఎంత పిండినా చుక్క పాలు కూడా వచ్చేవి కాదు. కొన్నిసార్లు ఆవులు కోపంతో వెనక కాలితో వాళ్లని ఒక్క తన్ను తన్నేవి. వాళ్ళ తిప్పలు చాటు నుంచి చూసి విరగబడి నవ్వుకునేటోడు.
ఆ పిల్లోడు అల్లరోడే గానీ చాలా తెలివైనోడు. ఎప్పుడూ ఏవేవో కొత్తవి తయారు చేసేటోడు. ఆకులతో పడవలు, కాగితాలతో విమానాలు, మట్టితో రకరకాల జంతువులు చేసేవాడు. ఇనుప ముక్కలన్నీ కలిపి రకరకాల కదిలే వస్తువులు చేసేవాడు. ఒకసారి వాడు పుస్తకంలో ఎంత దూరమైనా చూసే దుర్భిణి గురించి చదివాడు. దాంతో పాత ఇనుపసామాన్లు అమ్మే అంగడికి పోయి ఆ పనికిరాని వస్తువుల్లో తనకు పనికొచ్చేవన్నీ ఏరుకొని ఒక పెద్ద దుర్భిణి తయారు చేశాడు. దాంతో ఆకాశంలో నక్షత్రాలను గ్రహాలను చూడసాగాడు.
ఆ ఊరిలో ఒక ముసలి మంత్రగాడు ఉన్నాడు. అతను చానా మంచోడు. ఎవరికీ ఎటువంటి హాని చేసేవాడు కాదు. ఆయన దగ్గర రకరకాల వింత వింత వస్తువులు అనేకం వున్నాయి. అతనికి చాలా మాయ విద్యలు తెలుసు. ఆ మంత్రగాడు ఈ పిల్లోని చేతిలో వున్న దుర్భిణి చూసి “బాబూ... ఏమిటది. చాలా వింతగా వుంది. నేనెప్పుడూ చూడలేదే. దానితో ఏమి చేస్తారు" అని అడిగాడు. దానికి ఆ పిల్లోడు ఇది దుర్భిణి. దీనితో ఎంత దూరంగా వున్న వస్తువునైనా దగ్గరగా చూడవచ్చు. కొండ మీద నిలబడితే మన ఊరులోని వీధులన్నీ కనబడతాయి. ఆకాశం వంక చూస్తే చుక్కలు కళ్ళముందుకొస్తాయి" అన్నాడు.
ఆ మాటలకు మంత్రగాడు చాలా సంబరపడిపోయి “నాకు కదిలే మేఘాలన్నా, చల్లని కాంతులు వెదజల్లే చందమామన్నా, మబ్బులతో నిండి ఉన్న ఆకాశమన్నా, మిల మిల మెరిసే నక్షత్రాలన్నా... చాలా చాలా ఇష్టం. నా దగ్గర వింత వింత మాయా వస్తువులు ఎన్నో వున్నాయి. దీన్ని గనుక నాకిస్తే వాటిలో నీకిష్టమైనది నీకు ఇస్తా" అన్నాడు. దాంతో ఆ పిల్లోడు సరేనని దుర్భిణి ఆ మంత్రగానికి ఇచ్చి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు.
అక్కడ రకరకాల వింత వింత వస్తువులు వున్నాయి. రివ్వున ఎగిరే పావుకోళ్ళు, సర్రున దూసుకుపోయే మాయా తివాచి, మనుషులందరినీ జంతువులుగా మార్చే మంత్రదండం, కోరుకున్న ఆహారాన్ని చిటికలో ఇచ్చే అక్షయపాత్ర, మాటలు చెప్పే మరబొమ్మ, నాట్యం చేయించే నాదస్వరం, నువ్వు ఏమి కోరుకుంటే అది చూపే వింత అద్దం, నిమిషనిమిషానికి రంగులు మార్చే రత్నాల హారం... ఇలా ఒక్కొక్కటే చూస్తూ వెళుతుంటే ఒకచోట గోడకు తగిలించిన ఒక పెద్ద గడ్డి కోటు కనబడింది. దానిని ఆశ్చర్యంగా చూస్తూ “ఓ తాతా... ఇదేంది అందరూ మంచి ఊలుతోనో, ఉన్నితోనో కోటు అల్లించుకుంటే నువ్వు గడ్డితో అల్లించుకున్నావు. ఇదేమి చలినాపుతుందా... వాననాపుతుందా...” అని అడిగాడు. దానికి ఆ మాంత్రికుడు చిరునవ్వు నవ్వి “ఇది అలాంటిలాంటి అల్లాటప్ప కోటు కాదురా... మాయాకోటు. దీన్ని ఎవరైనా వేసుకుంటే చాలు మరుక్షణంలో మాయమైపోతారు. మరలా ఈ కోటు విప్పేంతవరకు ఎవరికీ కనబడరు" అని చెప్పాడు. 
ఆ పిల్లోనికి ఆ గమ్మత్తయిన గడ్డి కోటు బాగా నచ్చింది. వెంటనే "తాతా... అయితే నా దుర్భిణి బదులు ఈ గడ్డికోటు నాకివ్వు” అని అడిగాడు. మాంత్రికుడు సరేనని దానిని ఆ పిల్లవాని చేతిలో పెట్టాడు.
అసలే వాడు పెద్ద కోతి. దానికి తోడు ఆ మాయాకోటు దొరికింది. ఇంకేముంది దానిని వేసుకున్న మరుక్షణమే మాయమైపోయాడు. అందరి మధ్య పోతున్నాడు గానీ ఎవరూ వాన్ని గుర్తుపట్టడం లేదు. దాంతో కోతి చేష్టలు మొదలుపెట్టాడు. ఒకతను కూరకాయల గంప నెత్తిన పెట్టుకొని పోతుంటే వెనుక నుంచి ఒక్కసారిగా దొబ్బాడు. అతను కిందపడి తోసిందెవరో అర్థంకాక దిక్కులు చూస్తుంటే పకపకా నవ్వుకున్నాడు. ఒకని జుట్టు పీకితే, మరొకని చెంప పగలగొట్టాడు. ఒకని చేతిలోని ఆపిల్ పండు గుంజుకుంటే మరొకని గొడుగు లాగేసుకున్నాడు. కళ్ళముందే వస్తువులు గాలిలో ఎగిరిపోతుంటే, ఎవరో వెనుక నుంచి హఠాత్తుగా దొబ్బుతుంటే, తింటున్నవి చేతుల్లోంచి లాక్కుంటూ వుంటే, పంచ పట్టుకుని గుంజుతూ ఉంటే, అవన్నీ ఎవరు చేస్తున్నారో... ఎలా చేస్తున్నారో... తెలియక జనాలంతా బెదిరి పారిపోతావున్నారు. అది చూసి వాడు సంబరంగా గంతులు వేయసాగాడు. అలా కనపడిన వాళ్లందరినీ ఏడిపించి రాత్రి ఇంటికి చేరుకున్నాడు.
గడ్డికోటు తీసి ఇంట్లో ఒక చిలుక కొయ్యకు తగిలించి కమ్మగా కడుపునిండా తిని హాయిగా నిద్రపోయాడు. పొద్దున్నే వాళ్ల అమ్మ ఒక్కొక్క గదే కసువు వూడ్చుకుంటూ వాని గదిలోకి వచ్చింది. వాడు హాయిగా గురుకలు కొడతా నిద్రపోతా వున్నాడు. ఆమెకు చిలక కొయ్యకు తగిలించిన గడ్డికోటు కనబడింది. బాగా దుమ్ము కొట్టుకుపోయి చూడ్డానికి చాలా గలీజ్ గా వుంది. ఆమె దాన్ని చూసి "వీడు ఎక్కడెక్కడి పనికిరాని వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంట్లోనే పెడుతుంటాడు. ఇల్లు శుభ్రం చేయలేక చస్తా వున్నా” అనుకుంటా ఆ గడ్డి కోటును తీసుకుపోయి పొయ్యిలో పెట్టేసింది. అంతే... అది నెమ్మదిగా కాలి బూడిదైపోయింది.
వీడు పొద్దున్నే లేచి చూస్తే ఇంకేముంది... గడ్డి కోటు కనబడలేదు. అదిరిపడి ఎక్కడన్నా పడిపోయిందా అని గదంతా కిందికీ మీదికీ వెదికాడు. ఉంటే కదా కనబడ్డానికి. దాంతో వురుక్కుంటా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి "అమ్మా నిన్న రాత్రి ఒక గడ్డికోటు తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టా. నువ్వేమైనా చూశావా" అని అడిగాడు. దానికి ఆమె “ఆ చిలక కొయ్యకు తగిలిచ్చిందేనా... మాసిపోయి కంపు కొడతావుంటే తీసుకుపోయి పొయ్యిలో పెట్టేశా" అని చెప్పింది. వాడు అదిరిపడ్డాడు. "అయ్యో అమ్మా.. ఎంత పని చేశావు" అంటూ లబలబలబలాడుతూ పొయ్యి దగ్గరికి వురికాడు. చూస్తే ఇంకేముంది... బూడిద తప్ప ఒక్క గడ్డి పరక కూడా కనపడలేదు.
ఆ బూడిదలో ఏమన్నా మహత్యం వుందేమో చూద్దామని దానిని తీసుకొని చేతిమీద పూసుకున్నాడు. అంతే... చేయి మాయమైంది. కాలుమీద పూసుకుంటే కాలు మాయమైంది. "అరెరే... ఇదేదో బాగుందే" అని పొయ్యిలోని బూడిదంతా తీసుకొని సందు ఖాళీ లేకుండా వంటి మీదంతా పూసుకున్నాడు. అంతే... మరలా వాడు ఎవరికీ కనపడకుండా మాయమైపోయాడు. ఇంక వానికి సంబరం సంబరం కాదు. మరలా జనాలను ఏడిపించడానికి వురుక్కుంటా వీధుల్లోకి పోయాడు.
ఒక ఫలహారశాల దగ్గర జనం గుంపులు గుంపులుగా కనబడ్డారు. వాళ్లను తోసుకుంటూ, నెత్తిమీద కొట్టుకుంటూ, వీపుమీద గుద్దుతూ, పంచలు అంగీలు లాగుతూ, నెత్తిమీద టోపీలు విసిరి పడేస్తూ, జడలు గుంజుతూ, మీసాలు పీకుతూ... లోపలికి పోయాడు. ఎవరు తోస్తున్నారో... ఎవరు దొబ్బుతున్నారో... ఎవరు తంతున్నారో... అర్థంకాక జనాలు పిచ్చి వాళ్లలా దిక్కులు చూస్తున్నారు. వాడు సక్కగా వంట గదిలోకి పోయి లోపల వున్న కరకరలాడే కమ్మని దోసె ఒకటి అందుకున్నాడు. వాడు ఎవరికీ కనబడడు గదా... దాంతో దోసె ఒక్కటే పైకి లేచి గాల్లో తేలియాడసాగింది. అందరూ నోరు వెళ్ళబెట్టి చూడసాగారు. ఎవరో తింటున్నట్టు కొంచెం కొంచెం మాయం కాసాగింది. చివరికి కళ్ళముందే దోసె మాయం అయిపోయింది. చూస్తుండగానే పూరీలు, గులాబ్ జాములు, మైసూరు పాకులు... ఒక్కొక్కటి గాల్లో పైకి లేసి మాయం కాసాగాయి. జనాలంతా తినడం మానేసి ఆ విచిత్రాన్ని భయం భయంగా చూడసాగారు.
వాడు అన్నీ తినేసరికి బాగా దాహమైంది. తాగడానికి నీళ్ల చెంబు తీసుకున్నాడు. ఎత్తి గడగడగడ తాగుతూ వుంటే అందులోంచి కొన్ని నీటి చుక్కలు జారి వాని చేతి మీద పడ్డాయి. దాంతో అక్కడి బూడిద తొలగిపోయి చేయి ఒక్కటి బయటపడింది. జనాలు ఇదేదో వింతగా వుందే... చేయి ఒక్కటి కనపడుతుందే... మిగతా శరీరం ఎక్కడ వుంది." అనుకుంటూ దాని చుట్టూ గుమికూడారు.  
వానికి ఆ గుంపులో నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. కంగారులో వాని చేతిలోని నీళ్లచెంబు జారి వాని కాలు మీద పడింది. అంతే రెండు కాళ్ళ మీద బూడిద పక్కకు పోయి అవి కూడా బయటపడ్డాయి. పైన ఒక చేయి, కింద రెండు కాళ్లు అందరికీ కనపడసాగాయి. ఆ ఫలహారశాల యజమాని ఒక బిందె నిండా నీళ్లు తెచ్చి ఆ చేతి మీద గుమ్మరించాడు. అంతే... చేయి దగ్గరనుంచి నడుమూ, కాళ్లు చేతుల వరకు మొత్తం బయటపడ్డాయి. ఒక్క మొహం మాత్రమే కనబడడం లేదు. జనాలు వాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఒకడు చెంబుతో నీళ్లు తీసుకువచ్చి మొహం మీద పోశాడు.
అంతే బూడిదంతా పోయి వాని మొహం బయటపడింది. దాంతో దొంగ ఎవరో అందరికీ తెలిసిపోయింది.  
“ఒరేయ్ దొంగ వెధవా... నువ్వా అప్పటినుంచీ అందరినీ కొడుతూ, దొబ్బుతూ, మేము తింటున్నవన్నీ లాక్కొని అల్లరి చేసింది. వుండు నీ సంగతి చెబుతాం" అంటూ వానిని పట్టుకుని కిందామీదా ఏసి పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టసాగారు.
అప్పుడే అటువైపు వచ్చిన ఒక పెద్ద మనిషి... ముక్కు మొహం పగిలి ఒళ్లంతా హూనమైన వాన్ని చూసి అందరిని ఆపాడు. "ఏం జరిగింది... ఎందుకిలా వాన్ని కిందామీదా వేసి మెత్తగా తంతా వున్నారు" అని అడిగాడు. వాళ్ళు జరిగిందంతా చెప్పారు.
ఆ మాటలు విన్న ఆ పెద్దమనిషి "ఏరా ఆ మాంత్రికుని దగ్గర నేర్చుకోవడానికి ఎన్ని మంచి విద్యలు లేవు. వాటిని నేర్చుకొని నీ జీవితాన్ని బాగు చేసుకోక ఇలాంటి చెత్తపని చేసి అందరినీ ఇబ్బంది పెడతావా. మనకున్న తెలివితేటలతో పదిమందికి ఉపయోగపడాల గానీ అల్లరి పనులు చేసి అందరితో తిట్లు తినకూడదు" అంటూ బాగా బుద్ధి చెప్పి “చిన్న పిల్లోడు తెలియక చేసింటాడు. ఈసారికి వదిలేయమని” జనాలకు సర్ది చెప్పాడు. దాంతో వాళ్లు సరే అని వాన్ని వదిలేసి "ఇంకొకసారి ఇలాంటివి చెయ్యకు. చేస్తే గుండు కొట్టించి, సున్నం బొట్లు పెట్టించి, గాడిద మీదికి ఎక్కించి, ఊరు ఊరంతా ఊరేగిస్తాము జాగ్రత్త" అని హెచ్చరించారు.
“ఇంక జన్మలో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు" అనుకుంటా వాడు అక్కడి నుంచి ఇంటికి పరుగు తీశాడు.
***************************
డా.ఎo.హరికిషన్-కర్నూలు-9441032212
***************************
కథ నచ్చితే *షేర్* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 *అమ్మ నాన్నల ఇల్లు* 
  *(తల్లిదండ్రులు ఉండే ఇల్లు)*

*ప్రపంచములో ఆహ్వానం లేకుండా మనం ఎన్నిసార్లు అయిన వెళ్ళగలిగే ఇల్లు "అమ్మ నాన్నలు" ఉండే ఇల్లు* 

*ఈ ఒకే ఇల్లు ఒక్కటే స్వతంత్రముగా మనమే తాళం తీసికొని నేరుగా ఇంటిలోకి ప్రవేశించవచ్చు.*

*ఈ ఇల్లు ఒక్కటే  ప్రేమతో నిండిన కళ్లతో మీరు కనిపించే వరకు మీ కోసం తలుపు వైపు చూడటానికి సిద్ధంగా ఉంటుంది.*

*మీ చిన్ననాటి ప్రేమ, అప్యాయత, అనురాగము, అనందం మరియు స్థిరత్వం మరచి పోకుండా గుర్తు చేసే ఇల్లు.*

*ఈ ఇంట్లో మాత్రమే మీరు తల్లి, తండ్రుల ముఖాలను చూస్తూ ఉండటం ఒక పూజ అనుకుంటే మరియు వారితో మీరు మాట్లాడటం వెంటనే లభించే పూజ ఫలితం.*

*మీరు ఆ ఇంటికి వెళ్లకపోతే ఆ ఇంటి యజమానుల (అమ్మ నాన్నలు ) మనస్సులు కృశించి గుండెలు గూడలుగా మారతాయి మీరు నొప్పించినా వాళ్లు బాధపడతారు.*

*ఈ ఇల్లు ప్రపంచాన్ని చూడటానికి ఉన్నతముగా జీవించడానికి మరియు మీ జీవితాన్ని ఆనందంతో నింపడానికి దీపాలు వెలిగించి నిత్యం దైవాన్ని ప్రార్థించిన  ఇల్లు.*

*ఈ ఇంటిలో తినే భోజనం మీకు ఎంతో స్వచ్ఛమైనది మరియు ప్రపంచములో ఉన్న కపట వికారాలకు స్థలమే లేనిది.*

*ఇక్కడ మాత్రమే మీరు భోజన సమయానికి తినకపోతే ఆ ఇంటి యజమానుల గుండెలు విరగిపోతాయి మరియు బాధపడతాయి.*

*ఈ ఇంట్లోనే మీకు అన్ని పరిపూర్ణమైన నవ్వులు మరియు సంపూర్ణ ఆనందాలు దొరుకుతాయి.*

*కారణాలు ఏవయినా కావొచ్చు ఈ ఇళ్లకు దూరమవుతున్న పిల్లలారా ఈ అమ్మ నాన్నల ఇల్లు విలువ తెలుసుకోండి ఆలస్యం  కాకముందే.*

*తల్లిదండ్రులతో గడుపుతూ మరియు తరచూ ఆ దేవాలయం లాంటి ఆ ఇంటికి ఎప్పుడూ అందుబాటులో ఉండే*
*ఆవకాశం ఉన్నవారు* *అదృష్టవంతులు ధన్యులు...*
 *తోక లేని తిమ్మరాజు* 
🙊🙉🙈🐵

*నవ్వుల కథ*😊

తిమ్మన్న కోతిమూకలకు రాజు. అది ఒక ఊరి దగ్గిర మిట్టమీద వుంటూ వుండేది. అది చేసే దుండగాలు ఇన్నీ అన్నీకావు. పిల్లలేమిటి పెద్దలేమిటి దాని పేరుచెప్పితే భయపడనివాళ్లు లేరు.

తిమ్మన్న తన కోతి సమూహాన్ని వెంటేసుకుని ఆ చుట్టుపక్కల వున్న తోటల్లోపడి అందిన పళ్లూ, కాయలూ, తిన్నన్ని తిని, మిగతావి కొరికి కింద పారేసి చెట్లన్నీ ధ్వసం చేస్తుండేది.

ఒక రోజున తిమ్మన్న తిమ్మపల్లె వచ్చింది. వచ్చి అక్కడ ఒక పాడుబడిన గోడ మీద కూర్చుని, “ఈ వూళ్లో వాళ్లని ఏవిధంగా ఏడిపిద్దామా" అని తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంది. తిమ్మన్న పొడుగాటి తోక గోడ రెండో వైపున వేళ్లాడుతూ వుంది. అక్కడ నాగజెముడు కంప వున్న సంగతి పాపం తిమ్మన్నకి తెలియదు. ఇంతలో ఒక పిల్లవాడు ఆటుపోతూ చేతిలో వున్న జామకాయ విసిరివేశాడు. జామకాయ తీసుకోటానికి తిమ్మన్న ఎగిరి దూకి జామకాయ తీసుకుని తిందామని కూర్చుంది. ఇంకేం, అక్కడ ఒక రక్కిస ముల్లు ఉండి తోక మొదట్లో గుచ్చుకుంది. తిమ్మన్న కెవ్వున కేక వేసి ఎగిరి అవతలకి దూకింది. ఆ ముల్లు లాగాలని ఎన్నో తిప్పలుపడింది కాని అది రాలేదు.

తిమ్మన్న ఇలా అవస్థపడుతూండగా, ఆ వూరి మంగలి తిమ్మప్ప ఆ దారినే పోతూ తిమ్మన్నను చూచాడు. చూచి “అదేమిటోయ్ తిమ్మన్నా. ఏమిటిలా పీక్కుంటున్నావ్? ఏమిటి సంగతి ?” అని అడిగాడు.

"మంగలి మామా, పాడు ముల్లొకటి నా తోకలో గుచ్చుకుందోయ్,” అన్నది.

"ఓస్, ఇంతేగదా ! నే తీవేస్తారే వుండు" అన్నాడు మంగలి.

"బాబ్బాబు, నీకు పుణ్యం వుంటుంది. తీదూ" అని తొందరచేసింది తిమ్మన్న,

"తీస్తా, తొందరపడమాకు. నువ్వు కదలకుండా, మేదలకుండా కూర్చోవాలి సుమా ఆట్లాగైతేనే తీస్తా, లేకపోతే నా వల్ల కాదు” అన్నాడు మంగలి.

“ఓ ఇంతేకదా భాగ్యం! నువ్వు ఏం చెప్పితే అది చేస్తా. రాతిబండకిమల్లే కూర్చుంటా, సరేనా?” అంది తిమ్మన్న.

మంగలి పొదిలోంచి కత్తి తీసి నెమ్మదిగా ముల్లు గుచ్చుకున్న చోట బొచ్చును గొరగబోయినాడు. కత్తి తోకకి తగలగానే తిమ్మన్న ఒక్కమాటు ఎగిరిపడింది. ఇంకేం, తోక సర్రున తెగిపోయింది. వెంటనే తిమ్మన్న మంగలి చెయ్యి లంకించుకుని “ఓరి నీ చెయ్యి విరగ! తిమ్మన్న రాజు తోక తెగగొయ్యటానికి నీకు చేతులెల్లా వచ్చాయిరా! దుర్మార్గుడా మళ్ళీ నా తోక నాకు పెట్టనన్నా పెట్టు, లేకపోతే ఆ కత్తెనా ఇచ్చిపో" అని నిలవేసింది.

"తిమ్మన్నా, ఇందులో నా తప్పేముంది చెప్పు. నువ్వు కదిలావు. తోక తెగింది. నేనేం కావాలని తెగ్గోశానా ? నా బ్రతుకు ఈ కత్తితోనే వుందే, అది ఇస్తే నా గతేంకావాలి చెప్పు?” అని అన్నాడు మంగలి విచారంగా.

“నువ్వు బతికితేనాకేం చస్తే నాకేం, నా తోక కోసినందుకు నీ కిది శాస్తి” అంటూ తిమ్మన మంగలి చేతిలోని కత్తి లాక్కుని వుడాయించింది.

"తిమ్మన్న కొంత దూరంవచ్చి, అక్కడొక మర్రిచెట్టు నీడన కూర్చుని తెగిన మొండి తోక చూసుకుందామని ప్రయత్నించింది. కాని కనిపించలేదు.

ఇంతలో అక్కడికొక మామిడి పళ్లమ్మి పళ్ల తట్ట నెత్తిన బెట్టుకుని వచ్చి, చెట్టు నీడన కూర్చుని తట్టలోని పండు ఒకటి తీసుకుని తినటం మొదలెట్టింది. 

తిమ్మన్న ఆ అమ్మితో “అమ్మీ, అమ్మీ, అదేమిటీ ఆట్లా నోటితో కొరుక్కుని తింటావేం? చక్కగా కత్తితో తోలు తీసి, సన్నని ముక్కలు కోసుకుని తినరాదూ" అన్నది.

"తిమ్మన్నా! బీదముఁడని. నాకు చాకులూ కత్తులూ, ఎక్కడ్నుంచొస్తయ్" అన్నది పండ్లమ్మి.

"నాదగ్గిర ఒక మంచి కత్తి వుంది. కావాలంటే కాసిని కాయలు కోసుకుతిను. ఇంతలోకే యేం ఆరిగిపోతుంది గనకనా" అని తిమ్మన్న కత్తి ఇచ్చింది.

పండ్లమ్మి నాలుగైదుపళ్ళు కోసుకు తిన్నది. ఒక్క ముక్క కూడా తనకి పెట్టడంలేదే అని తిమ్మన్న చూస్తూంది. పండ్లమ్మి తిరిగి కత్తి తిమ్మన్నకిచ్చింది.

తిమ్మన్న కత్తివంక చూచి, "ఎంత నంగనాచివమ్మా, కత్తి అంతా మొండి
చేసి ఇస్తున్నావే నేనిచ్చినప్పుడు తళతళ మెరుస్తున్నదే, ఇప్పుడెట్లా వుందో చూడు. పదునంతా పోయింది. నా కక్కర్లేదు, పాడుకత్తి. నువ్వే వుంచుకో. కత్తికి బదులు ఆ పళ్ల తట్ట ఇచ్చివెళ్ళు” అన్నది తిమ్మన్న దర్జాగా. పాపం, పళ్లమ్మి తెల్ల బోయింది. 

"తిమ్మన్నా, నేనేం గొంతులో కొట్టుకోనా ఈ కత్తి తీసుకుని. ఏదో, ఈ పళ్లమ్ముకుని నాలుగు డబ్బులు సంపాయించుకుని పొట్టపోసుకోవాల్సినదాన్ని నేను. నా నోట్లో మట్టికొట్టకు” అన్నది పండ్లమ్మి.

"నువ్వు నీనోట్లో మట్టే కొట్టుకుంటావో, బంగారమే కొట్టుకుంటావో నాకెందుకూ? నా మామూలు కత్తి నా కిచ్చినా సరే లేకపోతే పండ్లతట్ట ఇచ్చి వెళ్లినా సరే” అన్నది తిమ్మన్న.

“ఇదేం తంటారా భగవంతుడా" అని పండ్లమ్మి విచారిస్తూండగా, తిమ్మన్న తట్ట లంకించుకుని అక్కణ్ణించి ఉడాయించింది.

పళ్ల తట్టతో తిమ్మన్న ఒక బీడు దగ్గిరికొచ్చింది. అక్కడొక 10 యేళ్ల పిల్ల ఒక ఎద్దుని మేపుతోంది. ఆ  పిల్ల చాలా నీరసంగా వుండటం చూచి "ఏం పిల్లా. అలా నీరసంగా వున్నా వేం? ఆకలవుతోందా?" అని అడిగింది.

"ఆవును తిమ్మన్నా. ప్రొద్దుట చద్ది బువ్వ కూడా తినకుండా వచ్చానివ్వాళ.. మాచెడ్డ ఆకలేస్తోంది" అన్నది పిల్ల.

"అలాగనా, పాపం. ఇవిగో నా దగ్గిర మంచి మామిడిపళ్లు తట్టెడున్నయ్యి. నీకు కావల్సినన్ని తీను,” అని పళ్లతట్ట పిల్లకిచ్చింది తిమ్మన్న.

పిల్ల ఆత్రంకొద్దీ, పళ్ళువరసబెట్టి తినటం మొదలెట్టింది. ఇంకా తట్టలో నాలుగైదు పళ్ళు వున్నయ్యనంగా, తిమ్మన్న గయ్, గయ్మంటూ లేచింది. "ఏంపిల్లా, పిట్ట కొంచెం, కూతఘనం అన్నట్లు, లొడితెడు లేవు బుట్టెడు పల్లెల్లా తిన్నావ్ ? ఏదో దయతలచి తినమన్నానుగ అని అన్నీ తిని కూచున్నావ్, భలేదానివిలే. నా పళ్ళు నాకు కక్కు. లేకపోతే ఆ ఎద్దును ఇచ్చెయ్యి” అన్నది తిమ్మన్న. 

పాపం పిల్ల బిక్కమొగం వేసింది. - "తమ్మన్నా. ఎందుకలా కోప్పడతావు. నువ్వు తినమంటేనేగా తిన్నాను. ఎద్దుని
తిరిగి ఇంటికి తీసుకెళ్లకపోతే మా అమ్మా నాన్నా నన్ను చితకదొడుస్తారు తిమ్మన్నా. నన్ను వొదిలిపెట్టు" అన్నది పాపము పిల్ల కన్నీళ్ళుకారుస్తూ.

కాని తిమ్మన్నకు జాలికలగలేదు, పిల్ల చేతులో వున్న తాడు లంకించుకుని ఎద్దుని లాక్కుపోయింది. పాపం పిల్ల, బోర్లపడి ఏడుస్తూ ఉండిపోయింది.

ఎద్దుని తీసుకుని వస్తుండగా తిమ్మన్నకు ఒక నూనెగానుగ కన్పించింది. గానుగకి ఒకటే ఎద్దుకట్టి వుంది. రెండో ఎద్దుకు బదులు తెలకవాడే గానుగ లాగుతున్నా డు. "ఏమండోయ్ తెలకల బావగారూ. ఈ ఉద్యోగం ఎప్పట్నించీ" అని అడిగింది తిమ్మన్న.

"ఏంచేసేది తిమ్మన్నా, రెండో ఎద్దు నిన్ననే చచ్చింది. గానుగ ఆడితేనేగా డొక్కాడేది. అందుకని నాకీ ఖర్మ" అన్నాడు తెలకవాడు.

"అలాగటోయ్! నా దగ్గిర ఇదుగో ఈ ఎద్దు వున్నది. కావలిస్తే ఇవ్వాల్టికి నీ గానుగ ఆడించుకో" అంది తిమ్మన్న.

"చాలా మంచివాడివి తిమ్మన్నా!  సాయంత్రం లోపల నీ ఎద్దుని నీకిస్తాలే” అన్నాడు తెలకవాడు.

తిమ్మన్న సాయంత్రం తెలకవాడి దగ్గిరికి వచ్చింది. తెలకవాడు ఎద్దును తిరిగి ఇచ్చేశాడు. తిమ్మన్న ఎద్దువంక ఎగాదిగా చూసి, “ఏమోయ్ తెలకలబావా ! డొక్కలు పీక్కుపోయేదాకా బాగా పని చేయించుకుని ఇస్తున్నావా నా ఎద్దును నాకు. చూడు, ఇప్పుడో ఇక కాసేపటికో చచ్చేటట్లుంది. నువ్వే వుంచుకో, నాకక్కర్లేదు. నా ఎద్దుకు బదులు నీవు ఆడించిన నువ్వుల నూనంతా నాకిచ్చెయ్యి" అన్నది.

తెలకలవాడు తెల్లబోయి "తిమ్మన్నా.
ఇలాగనటం నీకు న్యాయమేనా? నూనె ఇస్తానని నేను చాలామంది దగ్గిర డబ్బులు కూడా ముందుగా తీసుకున్నా నే. నూనె ఇవ్వకపోతే నన్ను వాళ్ళు బతకనిస్తారా. క్షమించు, నూనె ఇవ్వలేను” అన్నాడు.

“ఏమిటీ, ఇవ్వలేవూ? ఎలా ఇవ్వవో చూస్తా” ఆంటూ తిమ్మన్న నూనెచట్టి నెత్తిన బెట్టుకుని దౌడు తీసింది.

తిమ్మన్న నూనెచట్టి నెత్తిన బెట్టుకుని వస్తుండగా, దోవలో ఓ ముసలి అవ్వ అట్లు పోస్తున్నది. తిమ్మన్న అవ్వ పక్కకి పోయి కూర్చుని “అవ్వా, అవ్వా, నువ్వు దోసెలు కుప్పలు కుప్పలుగా పోస్తున్నా వేగాని, కమ్మని వాసనరాదేం. ఇలాంటివి ఎవరు కొంటారు నీ దగ్గిర మంచి పప్పు నూనెతో దోసెలు తయారు చేస్తే ఎంతో మంది వస్తారు కొనటానికి” అన్నది.

"తీమ్మన్నా, నువ్వు చెప్పేది నిజమే. కాని బీదముండని, మంచి పప్పు నూనె ఎక్కణ్ణుంచి తేను?" అన్నది అవ్వ.

"అవ్వా, నీకు నిజంగా కావల్సివుంటే ఇదుగో నా దగ్గర చట్టెడు మంచి నూనె వున్నది. నీకు కావాల్సినంత వాడుకో. నాకు మాత్రం ఒక్కటంటె ఒక్క దోసె పెట్టు, చాలు” అన్నది తిమ్మన్న.

ఆవ్వ సరేనని, నూనె తీసుకుని దోసెలు పొయ్యటం మొదలుపెట్టింది.

అవ్వ దగ్గిర వున్న పిండి అంతా ఆయి పోయింది. చట్టిలో నూనె కూడా సగానికి పైగా అయిపోయింది. అవ్వ చట్టి తిరిగి తిమ్మన్న కిచ్చేసింది. తిమ్మన్న చట్టి లోకి తొంగిచూసి "అవ్వా, ఏమో ననుకున్నా, భలేదానివే. ఈ కాస్త నూనెను నేనేం చేసుకోను నువ్వే వుంచుకో. నువ్వు  పోసిన ప్రతి దోసెలోనూ నా నూనే వున్నది. అందుకని దోసెలు నావీ, మిగిలిన నూనె నీది” అన్నది.

అవ్వకు ఏమీ తోచలా. పొయ్యి వూదే గొట్టంతో దేహశుద్ధి అయితేగాని తిమ్మన్న వదలడనుకొని, గొట్టం కోసం పొయ్యి వైపు తిరిగింది. ఇదే సందు గదా అని తిమ్మన్న, దోసెల దొంతర నెత్తిన బెట్టుకుని ఒక్క పరుగుతీసింది.

దోవలో తిమ్మన్నకి ఒక మనిషి రండోలు మోసుకొస్తూ కనిపించాడు. తిమ్మన్న “ఏం,రండో బావా! ఎక్కడికి ప్రయాణం ?” అని అడిగింది.

“ఇక్కడికేనోయ్ తిమ్మన్నా. పక్క వూరిలో పెళ్ళికి పిలిచారు" అన్నాడు రండోలు వాడు. సరేనని ఇద్దరూ కలిసి నడుస్తున్నారు.

ఇంతలోకే ఒక ఏరు దగ్గిరికి వచ్చారు. తిమ్మన్న రండోలువాడితో, "రండోలుబావా, చాలా దూరం వచ్చాం. కాళ్ళు లాగుతున్నయ్యి కదూ? కమ్మని దోసెలు కాసిని తిని, ఆ ఏట్లో నీళ్ళు కడుపునిండా తాగితే ఎంతో హాయిగా
ఉంటుందికదూ?" అన్నది.

"నిజమే, కాని ఈ నట్టడవిలో మనకి దోసెలేం ఆకాశాన్నించి రాల్తాయా?" అన్నాడు రండోలువాడు.

"ఆకాశాన్నించి రాలటమెందుకోయ్. మనదగ్గిర లేకపోతేగా ! ఇవిగో నాదగ్గిర బోలెడు కమ్మటి దోసెలున్నై. కాళ్లూ, చేతులూ కడుక్కురా, తిందాం” అన్నది తిమ్మన్న.

సరేనని రండోలువాడు కాళ్ళు చేతులు కడుక్కొనివచ్చి, దోసెలు తీసుకుని తినటం మొదలుపెట్టాడు. తిమ్మన్న మాత్రం పక్కన చూస్తూ కూర్చున్నది.

రండోలువాడు వంచిన తల యెత్తకుండా దోసె మీద దోసె గొంతు దాకా మెక్కాడు. తిమ్మన్న అది చూసి మండిపడుతూ - "చాల్లేవయ్యా భలే పెద్ద మనిషివి. ఏదో పుణ్యానికి కాసిని తినమంటే అన్నీ తింటావా? నా దోసెలన్నా నాకుతే. లేదా నీ డోలన్నా నాకివ్వు" అన్నది.

డోలువాడు గుడ్లు వప్పజెప్పి చూస్తూ కూచున్నాడు. గొంతువరకూ మెక్కటం చేత అతనికి నోటంట మాట కూడా రాలేదు. ఏంచెయ్యటఁరా భగవతుడా అని ఆలోచిస్తూండగా, తిమ్మన్న డోలు లంకించుకుని ఒక్క పరుగున తన కోతి సమూహు దగ్గరికొచ్చి చేరుకుంది.

కోతులన్నీ తిమ్మన్నరాజును చూడగానే లేచి నిల్చుని సలాంచేసినై. కోతుల  మంత్రి, "రాజా, ఈవేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులారా విని ఆనందిస్తాం” అన్నాడు.

“సరే, అంతా కూర్చోండి" అని తిమ్మన్న రాజు బావి మీదకి ఎక్కి డోలు మీద దరువేస్తూ ఇలా పాట పాడాడు :—

"తోకపోయి కత్తి వచ్చె ఢం, ఢం, ఢం కత్తిపోయి పళ్లు వచ్చె ఢం, ఢం, ఢం పళ్లుపోయి ఎద్దు వచ్చె ఢం, ఢం, ఢం ఎద్దుపోయి నూనె వచ్చె ఢం, ఢం, ఢం నూనెపోయి దోసెలొచ్చె ఢం, ఢం, ఢం దోసెలుపోయి డోలు వచ్చె ఢం, ఢం, ఢం ఢం, ఢం ఢం, ఢం, ఢం, ఢం. ఢం, ఢం, ఢం"

ఇది వినంగానే కోతులన్నీ సంతోషంతో ఎగిరిగంతులెయ్యటం మొదలుపెట్టినై. అడవి అంతా కోతులగోలతో మారుమోగి పోయింది.
🐒
*కధ కంచికి మనం ఇంటికి*
 *జై శ్రీరామ్* 🙏🏻🙏🙏🏼

*మన కుటుంబమే మన మొదటి భాద్యత*

చక్కని కథ👌🏻

ఒకప్పుడు, అత్యంత సద్గుణవంతుడైన పెద్దమనిషి తన కుటుంబంతో సహా తీర్థయాత్రకు బయలుదేరాడు.
అనేక మైళ్ల దూరం ప్రయాణించిన తరువాత, కుటుంబం మొత్తం దాహంతో పరితపించారు. అవి తీవ్రమైన వేసవి నెలలు కావడంతో నీరు ఎక్కడా కనిపించలేదు. వారు వెంట తెచ్చుకున్న నీరు కూడా అయిపోయింది. పిల్లలు దాహంతో అలమటిస్తున్నారు, అతని వద్ద ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేకపోయింది. చివరి ప్రత్యామ్నాయంగా దైవాన్ని ప్రార్థించే సమయం వచ్చింది, "ఓ ప్రభూ! దయచేసి ఈ పరిస్థితిని పరిష్కరించే భారం మీదే ", అని వేడుకున్నాడు.
వెంటనే, అతను కొంత దూరంలో ధ్యానంలో కూర్చోనిఉన్న ఒక ఋషి ని చూశాడు. ఆ వ్యక్తి ఋషి వద్దకు వెళ్లి తన సమస్యను వివరించాడు. ఆ ఋషి, ‘ఇక్కడ నుండి ఒక మైలు దూరంలో, ఉత్తరాన ఒక చిన్న నది ప్రవహిస్తుంది, మీరు అక్కడకు వెళ్లి మీ దాహం తీర్చుకోవచ్చు’, అని అతనికి తెలియజేశాడు.
ఇది విని ఆ వ్యక్తి చాలా సంతోషించి, ఋషికి కృతజ్ఞతలు తెలిపాడు. నడవలేని పరిస్థితిలోఉన్న తన భార్య , పిల్లలను అక్కడే ఉండమని చెప్పి, అతనే స్వయంగా నది వైపు నీరు తీసుకురావడానికి వెళ్లాడు.
అతను నీటితో తిరిగి వస్తుండగా, దారిలో విపరీతమైన దాహంతో ఉన్న ఐదుగురు వ్యక్తులు కనిపించారు, అతను చాలా ధర్మశీలుడైనందున, వారిని ఆ స్థితిలో చూడలేకపోయాడు, దాహంతో ఉన్న వారికి తన నీటిని ఇచ్చి, తిరిగి నదికి వెళ్లాడు. అతను తిరిగి వస్తున్నప్పుడు, మళ్లీ నీటి కోసం ఉక్కిరిబిక్కిరి అవుతున్న కొంతమంది వ్యక్తులను కలుసుకున్నాడు. మరోసారి, అతను తన నీటిని మొత్తం వారికి ఇచ్చాడు.
అతను మూడవసారి నీరు తీసుకుని కుటుంబాన్ని చేరే సమయానికి, వారందరూ తీవ్రమైన దాహార్తికి గురై, అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నారు. వారి ముఖాలపై నీరు చల్లి మేల్కొల్పడానికి చాలా ప్రయత్నించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అతను తీవ్రంగా ఏడ్చాడు, నిరాశతో ఋషి వద్దకు పరుగెత్తాడు. అతని పాదాలపై పడి దుఃఖిస్తూ, “మహర్షీ చెప్పండి, నా కుటుంబం ఈ స్థితిలో ఉండటానికి నేను ఏపాపం చేసాను? నేను ఆపదలోఉన్నవారికి సహాయం చేసి, ధర్మబద్ధమైన పని చేసాను. దయచేసి నా కుటుంబానికి సహాయం చేయండి స్వామి,” అని వేడుకున్నాడు.
దానికి ఋషి, "ఓ సజ్జనుడా! నీవు నది నుండి నీళ్లు తెచ్చుకుంటూ, దాహంతో ఉన్న బాటసారుల కోసం నీ పాత్రను ఖాళీ చేసుకున్నావు. దీనివల్ల నువ్వు ఏమి ప్రయోజనం పొందావు చెప్పు?" అని అడిగాడు.
ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు, "దాని నుండి నేను పొందే దాని గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు; ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా నేను ధర్మాన్ని పాటించానని భావించాను."
ఋషి ఇలా అన్నాడు, " మీ బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు, అలాంటి నీతి, ధర్మాల వలన ఉపయోగం ఏమిటి? నీ స్వంత పిల్లలను, కుటుంబాన్ని కాపాడుకోలేని పుణ్యం వల్ల ఏమిటి లాభం? మీరు మీ ధర్మాన్ని నేను చూపిన మార్గంలో కూడా నెరవేర్చి ఉండవచ్చు కదా!."
ఆ వ్యక్తి ఆసక్తిగా, "ఎలా మహానుభావా?" అని అడిగాడు.
దానికి ఋషి, "నీ కోసం నేను నీళ్లు ఇవ్వడానికి బదులుగా, నదికి వెళ్లే మార్గాన్ని నీకు చూపించాను. మీరు కూడా, ఆ దారిన వెళ్లే వారందరికీ మార్గం చూపించి, వారిని నదికి నడిపించాల్సింది. ఆ విధంగా, మీ స్వంత కుటుంబంతో సహా అందరి దాహం తీరిఉండేది. ఇతరుల కోసం ఎవరూ తమ స్వంత పాత్రను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు." అని ఋషి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు తన దీవెనలు ఇచ్చి, అదృశ్యమయ్యాడు.

ఆ వ్యక్తి తన గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. స్వంత బాధ్యతలను విస్మరించి, మంచి పనుల్లో పాల్గొనడం అంత ధర్మం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు.
మీరు ముందుగా మీ విధులను నిర్వర్తించాలి, తద్వారా ఇతరులకు ధర్మ మార్గాన్ని ప్రేరేపించాలి మార్గదర్శనం చేయాలి
ఎవరికైనా మంచి చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, భగవంతుని మార్గాన్ని, సత్య మార్గాన్ని చూపించటమే.
 *రహస్య గృహం* - అద్భుత కథ.
డా.ఎం.హరికిషన్-కర్నూల్-94410 32212
**************************
ఒక రాజు ఉండేవాడు. అతను చాలా క్రూరుడు. చుట్టుపక్కల ఉన్న అనేక రాజ్యాల మీద దాడిచేసి దొరికిందల్లా దోచుకునేవాడు. "అలా సంపాదించిన సొమ్ము ఎవరైనా దోచుకుపోతే ఎలా" అనే భయం మొదలైంది. దాంతో ఆ సొమ్మంతా పెట్టి అత్యంత ఖరీదైన కొన్ని వజ్రాలు కొన్నాడు. భూమి లోపల ఒక రహస్య గది నిర్మించి, దానికి దారి తనకు తప్ప ఎవరికీ తెలియకుండా ఏర్పాటు చేయించి, అందులో దాచాలి అనుకున్నాడు.
రాజ్యంలో భవనాలను అద్భుతంగా కట్టే ఒక శిల్పిని పిలిపించాడు. విషయం వివరించి "నాకు నాలుగు నెలల్లో అటువంటి అద్భుతమైన గదిని నిర్మించాలి. అంతవరకు నువ్వు ఈ రాజభవనం దాటిపోకూడదు. విషయం ఎవరికీ తెలియకూడదు. నీవు ఊహించనంత ధనం నీకు కానుకగా ఇస్తా. నువ్వు ఈ రోజు నుండి బైటికి పోవడానికి వీలు లేదు" అన్నాడు.
రాజు మాటకు ఎదురు చెబితే ఏమవుతుందో ఆ శిల్పికి బాగా తెలుసు. దాంతో ఏమీ చేయలేక 'సరే' అన్నాడు. తరువాత రోజు పక్క రాజ్యానికి చెందిన కొంతమంది కూలీలను కళ్ళకు గంతలు కట్టి తీసుకొని వచ్చి రాజభవనంలో వదిలారు. వాళ్లకు తాము ఎక్కడి నుంచి వచ్చామో, ఏమి చేస్తున్నామో, ఎవరి కోసం పని చేస్తున్నామో అస్సలు తెలియదు.
శిల్పి నాలుగు నెలల్లో రాజభవనం కింద ఎవరికి కనపడని విధంగా ఒక అద్భుతమైన గృహాన్ని నిర్మించాడు. దాని లోపలికి పోయే ద్వారాన్ని రాజు అంతఃపురంలో ఒక నిలువెత్తు అద్దం వెనుక ఏర్పాటు చేశాడు. మీట నొక్కగానే అద్దం పక్కకు జరిగి కిందికి వెళ్లడానికి మెట్లు కనపడేలా తయారుచేశాడు.
అదే సమయంలో శిల్పి ఇంకో ద్వారాన్ని కూడా తయారు చేశాడు. ఎవరైనా శత్రువులు దాడి చేసినప్పుడు పొరపాటున ఓడిపోయే పరిస్థితి వస్తే, లోపలి నుంచి వజ్రాలు తీసుకొని పారిపోయేలా ఆ ద్వారం పనికి వస్తుంది. ఒక ద్వారం రాజు అంతఃపురంలోనికి చేరితే ఇంకొక ద్వారం రాజభవనం వెనుక వున్న తోటలోనికి దారితీస్తుంది. మొదట మొదటి ద్వారం గురించి చెప్పి రాజు బహుమతిని అందించాక రెండో ద్వారం గురించి చెబితే రాజు  సంతోషించి మరింత బహుమతి ఇస్తాడని భావించాడు.
అనుకున్నట్టుగానే మొదట రాజుకు అంతఃపురం లోని ద్వారం చూపించాడు. రాజు దానిని చూసి చాలా సంతోషపడ్డాడు. తన దగ్గర ఉన్న వజ్రాలన్నీ భూగర్భంలోని రహస్య ప్రదేశానికి తరలించాడు. ఆ తరువాత వేరే రాజ్యాల నుండి పిలుచుకొని వచ్చిన కూలీలకంతా ధనాన్ని ఇచ్చి కళ్ళకు గంతలు కట్టి వారి వారి రాజ్యాలలో వదిలివేయమని పంపించాడు.  
"మహారాజా మీరు చెప్పినట్లే నాలుగు నెలల్లో ఈ రహస్య గృహాన్ని పూర్తి చేశాను. ఇక నాకు ఇవ్వవలసిన ధనాన్ని ఇస్తే మా ఇంటికి చేరుకుంటాను. పెళ్ళాం పిల్లల్ని చూడక చాలా రోజులైంది" అన్నాడు వినయంగా.
మహారాజు చిరునవ్వు నవ్వి "ఓ శిల్పీ! ఈ రహస్య గృహం గురించి నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. కాబట్టి నిన్ను చంపేస్తే ఈ రహస్యం నా ఒక్కనికి మాత్రమే తెలుస్తుంది. ఏమీ అనుకోకు ఇది తప్పదు" అంటూ కత్తి తీశాడు.
శిల్పి అదిరిపడ్డాడు. రాజు కాళ్ళ మీద పడి "మహారాజా... మీకోసం అడిగినవన్నీ చేశాను. కనీసం నాకు ఒక్క రోజైనా బతికే అవకాశం ఇవ్వండి. నాకిష్టమైన ఆహారం తిని, మనసారా దేవుని ప్రార్థించి, చివరిసారిగా నా పెళ్ళాం బిడ్డల్ని చూసుకొని చనిపోతాను" అన్నాడు దీనంగా కళ్ళనీళ్ళతో.
రాజు కాసేపు ఆలోచించి "సరే ఉదయమే నీకు ఉరి. అంతవరకు చెరసాలలో ఉండు. నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాను" అంటూ సైనికులను పిలిచి "కావలసిన ఆహారాన్నంతా తెప్పించండి. పెళ్ళాం బిడ్డలను పిలిపించి దూరం నుంచి చూపించండి. ఎవరితోనూ మాట్లాడనివ్వకండి" అని ఆజ్ఞాపించాడు.
సైనికులు 'సరే' అని తీసుకుపోయి కారాగారంలో వేశారు. ఆహార పదార్థాలు అన్నీ తెప్పించారు. పెళ్ళాం బిడ్డలను పిలిపించారు. దూరం నుంచే వాళ్ళను చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఒక సైనికున్ని పిలిచి "నేను చనిపోతే నా భార్యాపిల్లలు అనాథలవుతారు. ఇదిగో ఈ ఉంగరాన్ని వాళ్ళకి ఇవ్వు. ఇందులో చాలా ఖరీదైన వజ్రం ఉంది. దాన్ని అమ్ముకొని హాయిగా బ్రతకమను" అన్నాడు.
ఆ సైనికుడు కరిగిపోయి 'సరే' అని ఆ ఉంగరం తీసుకొని పోయి భార్యాపిల్లలకు అందించాడు.
కానీ అది మామూలు ఉంగరం కాదు. ఉంగరం పైన ఉన్న రాయిని కదిలిస్తే అందులో చిన్న అర ఉంటుంది. అందులో రహస్య గృహానికి రెండవ వైపు వున్న ద్వారం గురించి, చదివిన వెంటనే ఏం చేయాలో వివరంగా రాసిన చిన్న చీటీ ఉంది. ఆ ఉంగరం గురించి వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు.
తర్వాత రోజు ఉదయాన్నే రాజు వచ్చాడు. "మహారాజా... నన్ను చంపేముందు మీ రహస్య గృహంలో వజ్రాలు ఉన్నాయో లేదో ఒకసారి చూడండి. ఎందుకైనా మంచిది" అన్నాడు చిరునవ్వుతో శిల్పి.
ఆ నవ్వు చూసి రాజు అదిరిపడ్డాడు. అనుమానం పెరిగింది. వేగంగా పోయి చూస్తే ఇంకేముంది అంతా మాయం. రాజు అదిరిపడి కోపంగా పిచ్చివానిలా అరుచుకుంటూ వచ్చి కత్తి తీశాడు చంపడానికి.
"రాజా... తొందరపడి నన్ను చంపితే ఆ వజ్రాలు ఇక ఎప్పటికీ మీకు దొరకవు. నన్ను ప్రాణాలతో పక్కనే ఉన్న మీ శత్రురాజ్యంలో వదిలితే, ఆ సైనికునితో వజ్రాలు ఇచ్చి పంపుతాను. ఆ తరువాత మీ ఇష్టం" అన్నాడు.
"నువ్వు చెప్పేది నిజమే అని నమ్మేదెలా. మోసం చేస్తే" అన్నాడు మహారాజా.
"మోసం చేయడానికి నేను మీలా నమ్మకద్రోహిని కాదు. నిజాయితీగా సొంత సంపాదన మీద బ్రతికే శిల్పిని. నన్ను నమ్మడం తప్ప మీకు ఇంకో దారి లేదు" అన్నాడు.
రాజు ఏమీ చేయలేక ఆ శిల్పిని వదిలి వేశాడు. ఒక సైన్యాధికారిని తోడు ఇచ్చి పంపాడు. పక్క రాజ్యాన్ని చేరుకున్నాక పెళ్ళాం బిడ్డలను కలిశాడు.
శిల్పి కారాగారంలో పెళ్ళాం బిడ్డలు చూడడానికి వచ్చినప్పుడు ఒక ఉంగరం ఇచ్చి పంపాడు కదా... అందులో వున్న విషయం చదివిన వెంటనే కొడుకు రహస్యంగా రెండవ మార్గం నుంచి లోపలికి వచ్చి అక్కడున్న వజ్రాలన్నీ తీసుకొని వెంటనే ఊరు వదిలి పక్క రాజ్యానికి చేరుకున్నాడు.
శిల్పి ఆ సైన్యాధికారికి ఆ వజ్రాలతో పాటు ఇచ్చి ఒక చిన్న చీటీ ఇచ్చి రాజుకు అందజేయమన్నాడు. అందులో "రాజా... మీ సొమ్మంతా తిరిగి మీకు అందిస్తున్నాను. కానీ కష్టపడి ఆ భూ గృహాన్ని కట్టించినందుకు కూలీగా ఒక వజ్రాన్ని, మీరు నన్ను మోసం చేసినందుకు ప్రతిఫలంగా ఇంకొక వజ్రాన్ని తీసుకుంటున్నాను" అని ఉంది.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 *తెలివిలో నిన్ను కొట్టే వాడెవడు - ఇటలీ దేశ జానపద కథ*
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
ఒక ఊరిలో ఒక రాజు వుండేటోడు. ఆయన ఒకసారి మారువేషంలో దేశాటనకు బైలుదేరాడు. అక్కడక్కడ జనాలను పలుకరిస్తా, వింతలు విశేషాలు తెలుసుకుంటా, రాజ్యంలో ప్రజలు తన పాలన గురించి ఏమనుకుంటావున్నారో కనుక్కుంటా, తప్పొప్పులు బేరీజు వేసుకుంటా పోసాగాడు.
అట్లా పోతావుంటే ఒక రైతు పొలంలో దున్నుతా కనబన్నాడు. అతని మొహం చిరునవ్వుతో వెలిగి పోతావుంది. రాజు ఆ రైతును పలకరించి "ఏం నాయనా... పని చేసీ చేసీ అలసిపోయినట్టున్నావు. అయినా సంతృప్తిగా వున్నావు. నీవు చేసే పనికి, పెట్టిన పెట్టుబడికి, వస్తున్న రాబడికి గిట్టుబాటవుతుందా... ఎంత సంపాదిస్తావు రోజుకి" అని అడిగాడు.
దానికా రైతు చిరునవ్వుతో “మా మహారాజు ముందుచూపుతో ఇక్కడ పెద్ద చెరువు తవ్వించడంతో సుర్రున మండే ఎండాకాలంలో కూడా పచ్చని పంటలు పండుతా వున్నాయి. ఖర్చులు, పెట్టుబడులు అన్నీ పోను సగటున రోజుకి నాలుగు వరహాలు సంపాదిస్తాను" అని చెప్పాడు.
“శభాష్... మరి ఆ నాలుగు వరహాలు ఏం చేస్తావు" అన్నాడు రాజు.
దానికా రైతు నవ్వి “మీ మొహం చూస్తే బాగా చదువుకొన్నట్లే కనబడుతుంది. జవాబు పామరులకు చెప్పినట్లు చెప్పాల్నా. పండితులకి చెప్పినట్లు చెప్పాల్నా" అన్నాడు సరదాగా.
ఎన్నో విద్యలు తెలిసిన రాజు గంభీరంగా మొహం పెట్టి “పండితులకి చెప్పినట్లే చెప్పు" అన్నాడు. దానికా రైతు “ఏముంది స్వామీ... మొదటి వరహాతో సంతృప్తిగా అన్నం తింటాను. రెండవ వరహాను అప్పుగా ఇస్తాను. మూడవ వరహాతో అప్పు తీరుస్తాను. నాలుగవ వరహా బావిలో పాడేస్తాను" అన్నాడు.
రాజుకు ఎంత ఆలోచించినా ఒక్క ముక్కా అర్థం కాలేదు. దాంతో “మహానుభావా... నువ్వు పేరుకు రైతువైనా మహా మేధావిలా వున్నావు. ఈ చిక్కుముడిని విప్పే శక్తి నాకు లేదు. ఒక పండితునికి చెప్పినట్లు గాక పామరునికి చెప్పినట్లు అర్థమయ్యేలా వివరించు" అన్నాడు.
దానికి అతను చిరునవ్వు నవ్వి "మొదటి వరహాతో నేనూ, నా పెళ్ళాము కడుపునిండా అన్నం తింటాము. రెండవ వరహా నా పిల్లల కోసం ఉపయోగిస్తాను. వాళ్ళకు మంచి భోజనం, బట్టలు, చదువు ప్రేమగా అందిస్తాను. రేప్పొద్దున మేము ముసలివాళ్ళమయి, పనిచేసే శక్తి కోల్పోయాక వాళ్ళే కదా మాకు తిండి పెట్టి చూసుకునేది. ఇప్పుడు ఇచ్చిన అప్పు అప్పుడు తీరుతుంది. మూడవ వరహాను మా అమ్మానాన్నల కోసం ఖర్చు పెడతాను. నన్ను పెంచి పెద్దచేసి ప్రయోజకున్ని చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఖర్చు పెట్టారు. ఆ అప్పు ఇప్పుడు నేను తీరుస్తున్నాను. ఇక నాలుగవ వరహా దానధర్మాల కోసం ఖర్చు పెడతాను. దాని వల్ల ఈ జన్మలో ఎలాంటి ఫలితాన్ని ఆశించను. తిరిగి రావాలని కోరుకోను. భక్తితో భగవంతునికి సేవ చేసినట్లు భావిస్తాను. అందుకే నాలుగవ వరహా బావిలో పాడేస్తాను అని చెప్పాను" అన్నాడు.
రాజు ఆ జవాబు విని చాలా సంబరపడ్డాడు. మెడలోని విలువైన రత్నాల హారాన్ని తీసి అతనికి కానుకగా ఇచ్చి "నేను ఎవరో నీకింతవరకు చెప్పలేదు గదా... నేనీ దేశానికి రాజును. నువ్వు మరలా నా మొహాన్ని వందసార్లు చూసేంతవరకు ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పగూడదు. ఇది నా ఆజ్ఞ. చెబితే ఆ తరువాత రోజు నీ తల కోట గుమ్మానికి వేలాడబడుతుంది. జాగ్రత్త" అంటూ హెచ్చరించి వెళ్ళిపోయాడు.
తరువాత రోజు నగర ప్రముఖులతో సభ ఏర్పాటు చేశాడు. అనేకమంది పండితులను, తెలివైన వారిని, ప్రముఖులను, గురువులను పిలిపించాడు. నిండుసభలో అందరూ వింటా వుండగా “నిన్న నేను ఒక తెలివైన వ్యక్తిని కలిశాను. అతడు రోజుకి నాలుగు వరహాలు సంపాదిస్తాడు. అందులో మొదటి వరహాతో తాను తింటాడు. రెండవ వరహాను అప్పుగా ఇస్తాడు. మూడవ వరహాతో అప్పు తీరుస్తాడు. నాలుగవ వరహాను బావిలో పడేస్తాడు. ఈ మాటలకు సరియైన అర్థం ఎవరైతే వివరించగలుగుతారో వారికి వేయి బంగారు వరహాలు కానుకగా ఇస్తాను" అని ప్రకటించాడు. సభలోని వారందరూ కిందామీదాపడి తెగ ఆలోచించారు. తలలు బద్దలు కొట్టుకున్నారు. ఒకరితో ఒకరు శాస్త్ర చర్చలు చేశారు. కానీ ఎంత ఆలోచించినా ఎవరికీ ఒక్కముక్కా అర్థం కాలేదు. దాంతో అందరూ తెల్లమొహాలు వేసుకొని తల దించుకున్నారు. రాజు వాళ్ళకు వారం సమయం ఇచ్చి సభ ముగించాడు.
మంత్రి ఆలోచనలో పడ్డాడు. రాజు నగర సంచారానికి పోయినప్పుడు రాజుకు ఎటువంటి ఆపద జరగకుండా చూడడానికి పదిమంది వీరులైన గూఢచారులు రహస్యంగా అనుసరిస్తుంటారు. వారిని పిలిపించాడు. ముందురోజు రాజు ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అనే విషయాలన్నీ సేకరించాడు. రాజు ఒక రైతుతో మాట్లాడి రత్నాల హారాన్ని బహుమానంగా ఇవ్వడం కనుక్కున్నాడు. వెంటనే గుర్రమ్మీద ఆ రైతు ఇంటికి వెళ్ళి విషయాన్ని వివరించి జవాబు కావాలన్నాడు.
దానికి ఆ రైతు “అయ్యా... మహారాజు మొహాన్ని వందసార్లు చూసేంతవరకు నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పగూడదని రాజు ఆజ్ఞ వేశారు. మాట తప్పితే తల ఎగిరిపోతుంది" అన్నాడు. మంత్రి ఆలోచనలో పడ్డాడు. సమస్య నుంచి ఎలా బయట పడాలో తోచలేదు. ఉపాయం చెప్పమని ఆ రైతునే ప్రాధేయపడ్డాడు. రైతు కాసేపు ఆలోచించి మంత్రికి ఏం చేయాలో చెప్పాడు. వెంటనే మంత్రి రాజ్యంలో అందరికన్నా పేరున్న కంసాలిని పిలిపించాడు. నూరు బంగారు వరహాల మీద మహారాజు మొహాన్ని, కొంచంగూడా తేడా లేకుండా అచ్చు గుద్దినట్లు తయారు చేయమన్నాడు. అతడు అలాగే నాలుగు రోజుల్లో వంద వరహాలు రాజు బొమ్మతో తయారు చేసి ఇచ్చాడు. వాటిని తీసుకొని మంత్రి ఆ రైతు ఇంటికి వెళ్ళాడు. “ఇదిగో నీవు చెప్పినట్లే రాజు
మొహం ముద్రించిన వంద వరహాలు" అంటూ బంగారు నాణేలు కుప్ప పోశాడు. రైతు చిరునవ్వు నవ్వి వంద వరహాలు ఒకొక్కటే కళ్ళకు అద్దుకొని విషయం వివరించాడు.
తరువాత రోజు మంత్రి నిండు సభలో అందరిముందు "రైతు తనకు ఏదైతే చెప్పాడో... అవే మాటలు పొల్లుపోకుండా అప్పజెప్పాడు. అది విని సభలోని వారందరూ సంబరంగా చప్పట్ల మీద చప్పట్లు కొట్టారు. రాజు "శభాష్ మంత్రి... మొత్తానికి జవాబు కనుక్కున్నావ్. నీకు సమాధానం చెప్పింది ఆ రైతే గదా" అన్నాడు.
మంత్రి అవునంటూ తలూపాడు. రాజు కోపంగా సైనికాధికారికి సైగ చేశాడు. వెంటనే అతను పోయి ఆ రైతును పట్టుకొని వచ్చి రాజు ముందు నిలిపాడు.
రాజు ఎర్రబడిన కళ్ళతో కోపంగా ఆ రైతు వంక చూసి “రాజ్యాన్ని పాలించే రాజు మాటంటేనే నీకు లెక్క లేదా, లేక ప్రాణాల మీద ఆశ లేదా. ఇచ్చిన మాట తప్పితే ఏం జరుగుతుందో నీకు తెలుసు గదా" అన్నాడు.
రైతు వినయంగా రాజుకు నమస్కరించి “మహారాజా మన్నించాలి. నేను మాట తప్పలేదు. మీరు ఆజ్ఞాపించినట్లుగానే మీ మొహం నూరుసార్లు చూసింతరువాతనే నేను మహామంత్రికి రహస్యాన్ని వివరించాను" అంటూ రాజు బొమ్మ వున్న వంద వరహాలను తీసి రాజు ముందు వుంచాడు.
వాటిని చూసి రాజు ఆ రైతు తెలివికి ఆశ్చర్యపోయి “శభాష్... తెలివితేటల్లో నిన్ను కొట్టేవాడు ఈ లోకంలో ఎవడూ వుండడు. నీలాంటివాడు మా రాజ్యంలో వుండడం మా రాజ్యానికే గర్వకారణం" అంటూ మరో వంద వరహాలు కానుకగా ఇచ్చి పంపించాడు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 *✍🏼 నేటి కథ ✍🏼*


*నక్క రంగులు*

పులి దర్జా గా అడివిలో తిరుగుతూ వుంటే అన్ని జంతువులు ఈ పక్క, ఆ పక్కా భయంతో పారిపోతూ వుండేవి. అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది. అన్ని జంతువులు పులికి భయపడతాయి, దీనికి కారణం ఏమిటి అని ఆలొచిస్తే కారణం పులి చారలే అయి వుంటాయని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఓ కంసాలాడి దెగ్గిరికి వెళ్ళి అలా పులిలా చారలు పెట్టమని అడిగింది. అతను బాగా ఇనప కడ్డి కాల్చి వాత పెట్టాడు. ఒక వాత పెట్టే సరికే భరించలేక కేకలు పెట్టి, “చారలు కావాలికాని నొప్పి కాదు, ఇంకేదైన చేయి” అంది నక్క. “ఐతే రంగులు పులివించుకో” అన్నాడు కంసాలాడు.

రంగులు వేసే వాడి దగ్గిరకు వెళ్ళి రంగులు పులవమని అడిగింది. అతను నక్క అడిగినట్టే రంగులద్దాడు. ఆ రంగులు చూసుకుని మురిసిపోయింది నక్క. వెంటనే అడివిలోకి వెళ్ళి, పులి లాగ గాండ్రించబొయి, ఒక ఊళ్ళ పెట్టింది. ఆ ఊళ్ళ విని పారిపోబోతున్న జంతువులు కూడా దాని చుట్టూరా తిరుగుతూ ఆశ్చర్యంగా చూసాయి. ఇంతలో వాన పడి నక్క తనపై అద్దించుకున్న చారలన్ని నీళ్ళల్లో కలిసి చెరిగి పోయాయి. ఇది చూసి చిన్న చిన్న జంతువులు కూడ నక్కను వెక్కిరించడం మొదలెట్టాయి.

ఒకళ్ళని చూసి మన తీరు మార్చుకోకూడదని నక్కకు ఆ రోజు బాగా తెలిసొచ్చింది.

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
 *తండ్రి ప్రేమ (బాలల నీతి యుక్తి కథ)* 
డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212
**************************
కందనవోలులో ఒక ధనవంతుడు వుండేవాడు. చిన్నప్పుడు వాళ్ళు చాలా పేదవాళ్ళు. అతను చేయని పని లేదు. ఒకొక్క రూపాయే కూడబెట్టుకుంటూ పైకి ఎదిగాడు. బండిమీద సరుకులు పెట్టుకొని వీధుల్లో తిరుగుతూ అమ్మేవాడు. అతిగా ఆశ పడకుండా నిజాయితీగా తక్కువ లాభానికి మంచి సరుకు ఇచ్చేవాడు. దాంతో నెమ్మదిగా అతని పేరు ఊరంతా పాకిపోయింది. అతను వీధుల్లోకి రాకుండా అందరూ అతన్నే వెదుక్కుంటూ అతని వీధిలోకే సరుకుల కోసం పోవడం మొదలైంది. గుండుసూది నుంచి బంగారు నగల దాకా అన్నీ అతని వద్ద దొరికేవి. నెమ్మదిగా అతను ఆ ఊరిలో పెద్ద ధనవంతునిలా మారిపోయాడు.
అతనికి నలుగురు కొడుకులు. వాళ్ళు బాగా చదువుకొని పనులన్నీ చూసుకోవడం మొదలుపెట్టారు. నెమ్మదిగా ఆ ధనవంతునికి వయసు పైబడింది. చివరి రోజులు సమీపించాయి. ఒకరోజు నలుగురు కొడుకులను పిలిచి వాల్ల చేతిలో ఒక పెట్టె పెట్టి "ఆశ చెడ్డది. దాని వెంట పరుగెత్తకండి. ఒకరిని ముంచకుండా, మనం మునిగిపోకుండా బతకాల. కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. మీరు నలుగురూ ఎప్పటికీ విడిపోకండి. ఏదయినా ఊహించనిది జరిగి మీ ధనమంతా పోయి ఆపదల్లో పడితే అప్పుడు దీనిని తెరవండి. అలా ఏమీ జరగకపోతే మీ పిల్లలకు దీనిని అప్పగించండి" అని చెప్పాడు. ఆ తరువాత అతను కొద్ది రోజుల్లోనే మరణించాడు.
నలుగురు కొడుకులూ మంచివాళ్ళే కానీ ఉన్నదాంతో సంతోషపడే రకం కాదు. మా నాన్న సంపాదించిన దానికి పదింతలు మనం సంపాదించాలి. మన పేరు దేశదేశాలలో వెలిగి పోవాలి అనుకున్నారు. దాంతో వాళ్ళు చుట్టుపక్కల వున్న దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం మొదలుపెట్టారు. భారతదేశంలో దొరికే విలువైన సరుకులు ఓడల్లో నింపి అక్కడ అధిక ధరకు అమ్మేవాళ్ళు. అక్కడ చౌకగా లభించే సరుకులు తెచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు. కొద్దిరోజుల్లోనే వాళ్ళ సంపద అనుకున్నట్టుగానే మరింతగా పెరగడం మొదలుపెట్టింది.
ఒకసారి విదేశాలకు పెద్ద ఎత్తున సరుకులు పంపించవలసి వచ్చింది. దాంతో సంబరంగా వున్న సొమ్మంతా పెట్టి ఓడల్లో సరుకులు నింపారు. ఒకేసారి వరుసగా ఇరవై ఓడలు బైలు దేరాయి. అమ్మితే పదింతలు లాభం. వాళ్ళ కల తీరే రోజు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు గదా. భయంకరమైన తుఫాను విరుచుకుపడింది. ఓడలు తట్టుకోలేక పోయాయి. నీటితో నిండి ఒకొక్కటే మునిగిపోయాయి. దెబ్బకు అంతవరకు తాను సంపాదించినదంతా తుడిచిపెట్టుకు పోయింది. సరుకులు అప్పుగా ఇచ్చిన వాళ్ళకు తిరిగి చెల్లించడానికి విలువైనవన్నీ అమ్ముకోవలసి వచ్చింది.
ఇక ఆ ఊరిలో బతకలేక ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నారు. అంతలో వాళ్ళకు వాళ్ళ నాన్న ఇచ్చిన చిన్న చెక్కపెట్టె మతికి వచ్చింది. దేవుని గదిలోంచి తీసుకువచ్చి దాని మూత తెరిచారు. అందులో ఒక వెండి రేకు కనబడింది.
దానిమీద “మీరు ఆపదల్లో ఉన్నప్పుడు నలుగురినీ చేయి చాచి అడగకండి. పొట్టచేత బట్టుకొని నాలుగు దిక్కులకు వెళ్ళకండి. ఇంటిదేవుని వద్దకెళ్ళి ఉత్తరం దిక్కు తిరిగి దండం పెట్టండి. శివుని వాహనం మాయమైన చోటే బతుకు తెరువు దొరుకుతుంది. ఎంత సంపాదించినా అంతా చేరవలసింది మట్టిలోకే. మనిషికి కావలసింది ఆరడుగుల లోతు నేలనే. అది తెలుసుకుంటే మీ జీవితం మరలా సుఖవంతమవుతుంది" అని రాసి వుంది.
ఎంత ఆలోచించినా వాళ్ళకు నాన్న చెబుతున్న దేమిటో తెలియలేదు. చూడడానికి ఎవరో వేదాంతులు చెప్పిన మాటల్లాగా వున్నాయిగానీ ఇందులో తమకు తెలియని విషయం ఏదో దాగి వుంది అనిపించింది. ఆ ఊరిపెద్ద టక్కుపల్లి సుబ్బయ్య చాలా తెలివైన వాడు. ఎటువంటి చిక్కుముడినయినా సరే సులభంగా విప్పగలడు. నలుగురూ అయన వద్దకు వెళ్ళి విషయం చెప్పి ఆ వెండిరేకు అందించారు.
అతను దానిని బాగా చదివి "ఒక్కసారి మీ ఇళ్ళు పరిశీలించాలి" అన్నాడు. సరే అని వాళ్ళు తీసుకుపోయారు. ఇళ్ళు అంతా గమనించాడు. తరువాత చిరునవ్వుతో "మీ ఇంటి దేవుడు ఎవరు” అన్నాడు. “శివుడు” అని చెప్పారు. శివుని గది ఎక్కడుందో కనుక్కొని పూజగది దగ్గరికి పోయి ఉత్తరం వైపుకు తిరిగాడు. అక్కడొక గుమ్మం కనబడింది. పోయి ఆ గుమ్మం తెరిచాడు. ఇంటి వెనుక పెరడు కనిపించింది. దానిలోకి వచ్చి చుట్టూ చూశాడు. ఎక్కడా ఏమీ కనబడలేదు. ఇంటి పక్కన ఒక గుడి వుంది. ఆ గుడిని బాగా పరిశీలించి చూడసాగాడు. గోపురంపై నంది వుంది. నంది అంటే శివుని వాహనం. వెంటనే అతను "సమయం ఐదు అవుతూ వుంది. ఆ గోపురం మీది నంది నీడ ఇంటి పెరడులో పడుతూ వుంది. ఇంకో గంటలో చీకటి పడుతుంది. మౌనంగా ఆ నీడనే గమనించండి. శివుని వాహనం మాయమైన చోటే బతుకు తెరువు దొరుకుతుంది అని మీ నాన్న రాశాడు కాబట్టి ఆ నీడ మాయమైన చోటనే ఏదో వుండి వుండాలి" అన్నాడు. అందరూ మౌనంగా ఆ నీడనే గమనించసాగారు. ఆ నీడ కొద్దికొద్దిగా జరుగుతూ పెరటిలో వేపచెట్టు పక్కనున్న చిన్న అరుగుమీద పడి మాయమైంది.
వెంటనే టక్కుపల్లి సుబ్బయ్య ఆ నలుగురినీ అరుగు వద్దకు పిలిచి "మీ నాన్న ఎంత సంపాదించినా అంతా చేరేది మట్టిలోకె అన్నాడు గదా... అంటే ఈ అరుగు కింద మట్టిలోనే ఏదో దాచి పెట్టాడు. తవ్వి చూడండి" అన్నాడు.
వెంటనే వాళ్ళు పలుగూ పారా తెచ్చి అక్కడ తవ్వడం మొదలుపెట్టారు. నడుం లోతు తవ్వినా చెమటలు కారుతున్నాయి కానీ ఏమీ దొరకడం లేదు. నిరాశ పడ్డారు. టక్కుపల్లి సుబ్బయ్య కాసేపు ఆలోచించి "అంత సులభంగా నిధి పైపైన్నే పెడితే... ఎవరైనా ఏదైనా పని బడి తవ్వినప్పుడు సులభంగా దొరికి వాళ్ళ వశం అవుతుంది గదా... అందుకే మీ నాన్న చివరగా ఒక మాట రాశాడు. 'మనిషికి కావలసింది ఆరడుగుల లోతు నేలనే' అని. కాబట్టి ఆరడుగుల వరకు ఆగకుండా తవ్వండి" అన్నాడు. వాళ్ళు అలాగే తవ్వసాగారు. కాసేపటికి గునపానికి ఏదో ఖంగుమని తగిలింది. అందరి మొహాల్లోనూ చిరునవ్వులు వెలిగాయి. నెమ్మదిగా ఒక ఇనుప పెట్టెను తీశారు. దానిలో అనేక బంగారు ఆభరణాలు, విలువైన హారాలు వున్నాయి. వాటిని అమ్మి మరలా వారు జీవితాన్ని మొదలు పెట్టారు. 
**************************
డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212
*************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 *✍🏼 నేటి కథ ✍🏼*


*తోడేలు సాకు*

ఒక తోడేలు పారుతున్న సెలయేటి ఎగువన నీరు తాగుతుండగా దిగువన కాళ్ళు కడుక్కుంటున్న గొర్రె పిల్లను చూసింది.
తోడేలు ఆ గొర్రెపిల్లను ఎలాగైనా తినాలని భావించింది. అందుకోసం ఒక సాకు ఉంటే బావుంటుందని అనుకుంది.
గొర్రెపిల్లను చూస్తూ తోడేలు - "నేను ఈ సెలయేట్లో నీరు తాగుతుండగా నీటిని బురదమయం చేయడానికి నీకు ఎంత ధైర్యం?" అని అంది.

తోడేలుకు గొర్రెపిల్ల బదులిస్తూ "నీవు ఉన్నచోటి నుండే నీరు నా వద్దకు వస్తున్నాయి. అలాంటప్పుడు నీవు తాగే నీటిని నేను ఎలా బురదమయం చేయగలను?" అంది.
తోడేలు ఇంకా ఏదో సాకు దొరకబుచ్చుకోవాలని ప్రయత్నించింది. గొర్రెపిల్లపై అరుస్తూ, "నువ్వు నా గురించి సంవత్సరం క్రితం కూడా అలాగే మాట్లాడావు" అంది.
తోడేలు మాటలకు "నేనింకా అప్పటికి పుట్టనే లేదు", అని ప్రశాంతంగా బదులిచ్చింది గొర్రెపిల్ల.
"కావచ్చు. అప్పుడు నీ తండ్రి కావచ్చు. అని అరుస్తూ కోపంతో తోడేలు గొర్రెపిల్ల మీద పడి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నమిలేసింది. 

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
 *`వివాహబందం`*
*భర్త మనసు భార్యకు తెలిపే విలువైన వెలకట్టలేని అపురూప ఆభరణమే మూడుముళ్ళతో ముడివేసిన "మంగళసూత్రం"*

*ఏడడుగుల నడకతో ఏడేడు జన్మలకూ తోడుగా ఉంటానని ఒకరికొకరు చేసుకునే ప్రమాణమే " సప్తపది "*

*ఇరువురి జీవితాలు పండించుకోవడానికి శక్తినిచ్చే అరుణకిరణమే " సిందూరం "*

*ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.*
*ఒకరి మనసెరిగి ఒకరు ప్రవర్తిస్తూ.* 
*ఒకే మనసుగా...*
*ఒకే భావనగా...*
*ఒకే భాషగా...*
*ఒకే ఆశగా...*
*ఒకే ఆశయంగా...* 
*ఒకే ఆలోచనగా సాగించే ప్రయాణమే" సంసారం"*

*ఇరువురి ప్రేమను కలబోసి స్నేహ పూర్వకంగా మదిలో పొదువుకున్న బంధమే సంతానం*

 *వివాహబంధానికి అర్థం*

***ఫ్యూచర్ !* *అమ్మ*

 *ఫ్యూచర్ !*
*అమ్మ*
*పొద్దున్న 8 గంటలకి కాలింగ్ బెల్ మ్రోగింది. పరుగున వెళ్లి తలుపు తీశాడు వరుణ్. బయిట అమ్మ  నిలుచుని ఉంది.*
*"అమ్మా " అని సంతోషంగా ఆమెని లోనికి తీసుకుని వచ్చాడు. అతడికి వివాహం అయ్యాక అమ్మ ఇప్పుడే మొదటి సారి అతడింటికి రావడం. మళ్ళీ ఈ రాత్రికే తిరిగి వెళి పోతుంది. మరో అన్నయ్య ఇంటికి వెళ్ళాలి.*
*తల నిమిరి "ఎలా ఉన్నావు బాబూ* 
*అని పలకరించింది. అప్పుడే వంటింట్లోంచి వచ్చిన కోడలు* *విమల " రండి అత్తయ్యా బాగున్నారా " అని పలకరించింది. ఆమెని కౌగిలించుకుని " మా మనవడూ మనవరాలూ ఏరీ? " అని అడుగుతుండగానే లోపలినించి తొంగి చూసి వెంటనే లోపలికి పారిపోయారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. రమ్యకి అయిదేళ్ళు   రవికి మూడేళ్లు . మొదటి సారి* *బామ్మను చూస్తున్నారు కదా. సిగ్గు.* 
*విమల పిల్లల్ని పిలిచింది. " ఇలా రండి. బామ్మ వచ్చింది. చూడండి "*
*ఇద్దరూ భయంతో,  సిగ్గుతో బయిటకి వచ్చారు. బామ్మ తెలుసా అని విమల అడుగుతే పెద్దది " తెలుసు. డాడీ మొబైల్లో ఫోటో చూపించారుగా " అంది.*
*అమ్మ తను తెచ్చిన బొమ్మ లు , తినుబంఢారాలు పిల్లలకి ఇచ్చి ఇద్దరినీ ఒడిలో కూచో పెట్టుకుంది.*
*కాసేపట్లో లేచి " సమయం లేదు. నీకు నచ్చిన కూరలూ పప్పు అన్నీ వండాలి.  ఏమైనా స్పెషల్ కావాలంటే చెప్పు" అని వరుణ్ ని అడిగింది. " మీరు కూచోండత్తయ్యా నేను వంట చేస్తాను " అంది కోడలు.  "భలేదానివే.  వాడికి నచ్చినవి ఉన్న  ఒక్క రోజైనా నన్ను  చేయనీ. కావాలంటే వచ్చి కొంచెం సాయం చేయి" అంది అత్తగారు. ఇద్దరూ చేసి వడ్డించిన భోజనం బ్రహ్మాండంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత తృప్తిగా భోజనం చేసాడు వరుణ్. విమలకీ పిల్లలకీ కూడా ఆ వంట బాగా నచ్చింది.*
*పిల్లలిద్దరూ బామ్మ తో కలిసి పోయినందున కధలు చెప్తూ వాళ్ళతో సంతోషంగా సమయం గడిపింది బామ్మ. వరుణ్ ఒక చిన్న కునుకు తీసి లేచే సరికి ఇల్లంతా వాసన. జీడిపప్పు బర్ఫీ, వేడి వేడి పకోడీలు అతన్ని ఆహ్వానించాయి.*
*అందరూ ఇష్టంగా తినగా పిల్లలు " సూపర్ బామ్మా" అని పొగిడారు*
*7.45 కి అమ్మ మౌబైల్ లో మెసేజ్ వచ్చింది. చూసి " మీ అన్నయ్య.  కారు పంపించాడట.*
 *సరేనమ్మా మీరు బయిలు దేరండి" అన్నాడు వరుణ్. "ఇక్కడే ఉండి పో బామ్మా" అన్నారు పిల్లలు. " మీ నాన్న ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తానుగా. ఇప్పుడు వెళతాను. ఓకే నా " అంది బామ్మ తన సామాన్లు సర్దుకుంటూ.*
*"ఎంతైందమ్మా "అడిగాడు వరుణ్.*
*ఆమె చిరునవ్వుతో తన సంచీలలోనించి ఐ పాడ్లా టి ఒక మానిటర్ తీసి లెక్కలు చేసి మొత్తం 12 గంటలయింది. గంటకి 1500 చొప్పున 18000అయింది.*
 *GST ఎస్ట్రా నేను పిల్లలకి తెచ్చిన బొమ్మలు గట్రా ఈ పేకేజీలో వచ్చేసాయి. మా యాప్ మనీ ఉంటే 10%  కాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. జి పే , కార్డు పేమెంట్ మి ఇష్టం.*

*"మీకు తలిదండ్రులు పోయారా?*
*మీ తల్లిగా తండ్రిగా మీతో ఒకరు ప్రేమగా గడపాలా? వారి గురించి మీ కుటుంబ సభ్యుల గురించిన వివలాలు మా వెబ్సైటు కు పంపండి. మా దగ్గర ప్రశిక్షణ పొందిన వారిని మీరే ఎంపిక చేసుకోవచ్చు. వారిని మీ ఇంటీకి పంపుతాం. వారు మీ ఇంటీకి వచ్చి  మీకు తగిన విధంగా ప్రేమాభిమానాలు చూపి వెళతారు.* 
*మా " భంధుత్వం.కామ్ ని గాని మా యాప్ డౌన్లోడ్ చేసిగాని...*

*ఓ నెల కిందట చూసిన ఈ ప్రకటన, 9 సంవత్సరాల కిందట మరణించిన తల్లి ముఖం గుర్తుకు రాగా జి పే లో డబ్బులు పంపాడు వరుణ్.*

*చేయి ఊపుతూ తన నెక్స్ట్ అపాయింట్మెంట్ కి బయిలుదేరింది ఆ "అద్దె" అమ్మ....!*

*ఈ రోజు ఇది కధ.*
*రేపు ఇది వాస్తవం కావచ్చు* 
*మనం ఎటు వెళుతున్నామో తెలియడం లేదు.*
 *_డబ్బు వస్తే మన చుట్టూ చేరేవాళ్లు చాలామంది ఉంటారు... కానీ జబ్బు వస్తే చూసేవాళ్ళు చాలా తక్కువ..._* 

*_ఖర్చు పెట్టినంత సులువుగా డబ్బు సంపాదించలేము, అలానే వదులుకున్నంత సులువుగా ఆత్మీయులను సంపాదించలేము..._* 

*_సంపాదన ఉన్నప్పుడే డబ్బులు జాగర్త చేసుకోవాలి. అలానే ఆత్మీయులను కూడ నలుగురిని సంపా దించుకోవాలి._*

*_అందుబాటలో ఉన్నపుడు అశ్రద్ధ చేసి, కరిగిపోయిన తర్వాత  కాలం విలువ, తరిగిపోయిన తర్వాత డబ్బు విలువ_*

*_తెగిపోయిన తర్వాత బంధం విలువ, పొగుట్టుకున్న తర్వాత  ఆరోగ్యం విలువ తెల్సుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు._*

*_కథ కన్నా జీవితంలోనే ఎక్కువ నాటకం ఉంటుంది. అందుకే రచయిత తిప్పలేని మలుపుల్ని విధి మరింత అద్భుతంగా తిప్పుతుంది.☝️_*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🪷🪷🪷 🌹🙇‍♂️🌹 🪷🪷🪷
 *"కూతురి ప్రేమ"*

*పెద్ద శ్రీమంతుల ఇంట్లో ఇంటి యజమాని చనిపోయారు* 
*చాలా మంది బంధుమిత్రులు ఇంటికి చేరారు.*

*ఇంట్లో అందరూ శోక సాగరంలో మునిగిపోయారు,*
*భార్య,నలుగురు మగ పిల్లలు ఒక ఆడపిల్ల,భార్యను పిల్లలను కష్ట పడి జీవితంలో ఒక మంచి స్థాయికి.తెచ్చి న్యాయంగా సంపాదించినదానితోనే పిల్లలందరిని మంచి ఆస్తి చేసి ఇచ్చాడు. ఆడపిల్లకు మంచి సంబంధం మంచి ఇంటికి ఇచ్చి పెళ్ళి చేశాడు...*

*మృదు స్వభావం ఆయనది చాలామందికి సహాయం చేసేవాడు.నిజం చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి..*
*అన్ని పనులు పూర్తి అయ్యాక శవాన్ని ఎత్తుదాం అనుకునే లోపలే, ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చాడు,ఆగండి ఆగండీ నేను ఒక విషయం చెప్పాలి అని అడ్డు వేశాడు. ఇలాంటి టైం లో ఏంటి ఇది అని అడిగారు అంతలో ఒక పెద్దాయన ముందుకు వచ్చి ఏమైంది అని అడిగాడు...*

*ఆయన చెప్పిన మాటకు అందరూ ఆశ్చర్య పోయారు, నాకు "పదిహేను లక్షలు అప్పు ఉన్నాడు" అని చెప్పాడు.*
*అందరూ గుస గుస మాట్లాడుకున్నారు. తరువాత అందరూ అన్నారు ఈ కార్యక్రమం అయ్యాక మాట్లాడదాం అన్నారు.* *పెద్దవాళ్ళందరు,"లేదు లేదు"*
*ముందు డబ్బుల విషయంలో ఎవరో ఒకరు మాట ఇస్తేనే నేను శవాన్ని తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాను, అని పట్టు బట్టాడు. మగపిల్లల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి డబ్బులు ఇస్తాము అని ఆయనకు మాట ఇవ్వండి అని అడిగారు......*

*అయితే నలుగురు* *ఒప్పుకోలేదు.అందరికి*
*చాలా విచిత్రం అనిపించింది.* *ముందు ఈ పని ఎలా జరగాలి అని పెద్దలందరు  చర్చించుకుంటున్నారు,*
*అలా అలా విషయం లోపల ఉన్న ఆడవాళ్ళ దాకా వెళ్ళింది....*

*ఇది విన్న ఆ పెద్దాయన కూతురు ఎంతో దుఃఖంలో ఉన్నా కూతురు, ఏడుస్తూ బయటికి వచ్చింది. ఇవి నా తండ్రే నాకు ఇచ్చిన నగలు ఇవి తీసుకోండి అని ఆ పెద్దాయనకు ఇచ్చింది....*

*ముందు అంత్యక్రియలు జరగనియ్యండి నా తండ్రికి,  మానాన్న మర్యాదకు ఎలాంటి భంగం కలగకూడదు అని తన నగలు అన్నీ ఇచ్చేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళింది,*
*తరువాత అందరూ దహన సంస్కారాలు ముగించి వచ్చారు.....*

*నగలను తీసుకున్న ఆవ్యక్తి  లోపలికి వచ్చి ఒక మూటను చనిపోయిన ఆయన కూతురి ముందు పెట్టాడు,*
*"తీసుకో తల్లి నీ నగలు ఈ పదిహేను లక్షలు"*
*అని చెప్పాడు అందరూ అక్షర్యపోయారు,అప్పుడు ఆయన నవ్వి ఇలా అన్నాడు నిజానికి చెప్పాలంటే...*

*"ఆయన నా దగ్గర ఎలాంటి అప్పు చేయలేదు"*
 *నిజం చెప్పాలంటే నాకు చాలా అత్యవసర పరిస్థితిలో డబ్బు అవసరమైతే నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు అని ఇచ్చాడు.మళ్ళీ ఇద్దామని అనుకునే లోపే ఆయన చనిపోయారు అని తెలిసి పరుగున వచ్చాను,*
        
*అయితే ఎవరికి ఇవ్వాలి అని తోచలేదు ఇంతమందిలో ఎవరికి అర్హత ఉంది అని గుర్తించడం కష్టమనిపించింది.*
*అందుకే ఈ నాటకమాడాను.* *తీసుకో బేటా,అని చెప్పి వెళ్ళిపోయాడు,తల దించుకున్న నలుగురు కొడుకులు తల ఎత్తలేదు. తిథి కర్మలకు కూతురే డబ్బులు ఖర్చుపెట్టి మిగిలిన డబ్బులు అమ్మకు ఇచ్చి భర్త వెంట ఏడుస్తూ వెళ్ళిపోయింది భారమైన హృదయంతో.....*
*మగపిల్లలే కావాలి అని పరితపించేవారు* *తెలుసుకోవలసిన కథ ఇది......*
*ఇప్పటి కాలంలో అలా లేదు అందరూ సమానంగా ఉన్నారు....అమ్మాయిలు కూడా అమ్మానాన్నలని ప్రేమిస్తున్నారు వాళ్లకు ఇచ్చే గౌరవం వారికి ఇస్తున్నారు...*

****మనం_మారనంతవరకు_మనకు_మనుగడలేదు

 *`మనం_మారనంతవరకు_మనకు_మనుగడలేదు..!!`*

*ఒక అమ్మాయి పెట్టిన పోస్ట్ నాకు నచ్చి మీకు కూడా తెలియాలి అని పోస్ట్  చేస్తున్నా...!!*

*ఆడపిల్ల కి తల్లి గర్భంలో నే భయం..*
*భ్రూణ హత్యలతో చంపేస్తారనీ..!*

*పుట్టినప్పటి నుండి తల్లి దండ్రులతో భయం..*
*అనిగిమనిగి ఉండక పోతే ఏమవుతుందో అని..!*

*పెరుగుతున్న కొద్దీ అన్నదమ్ముల తో భయం..*
*వారికంటే ఎక్కువ ఎదుగుతామో అని..!*

*నడుస్తున్న సమాజంతో భయం..*
*మగవారి తో పాటు సమానత్వం లేక..!*

*అడుగడుగున ఆకతాయిలతో భయం..*
*శీల పరీక్ష కోసం అగ్నిలో దూకాలేమో అని..!*

*పెళ్లి పీటల మీద భయం..*
*మగాడి తో పాటు ఎక్కడ తల పైకి ఎత్తుతామోనని..!*

*మొగుడితో భయం..*
*మగాడితో భయం..!*

*అత్త మామలతో భయం..*
*ఆడపడుచులతో భయం..!*

*ఇంటిలో భయం..*
*ఇరుగపొరుగు తో భయం..!*

*రా_బంధువులతో భయం..*
*లేని బందాల్తో ముడిలేస్తారని భయం..!*

*ఇన్ని భయాల మధ్య నలిగి పోతూ కూడా*
*ముక్కు ముఖం తెలియని..*
*ఆడోమగో తెలియని..*
*ఎవరో ఏమిటో తెలియని..*
*జీవం లేని ఈ మాయా ప్రపంచంలో కూడా భయమే నా..?*

*మనసుకు నచ్చిన పోస్ట్ పెట్టాలంటే భయం..*
*ఫోటో మీద ఏమోజి తీయాలంటే భయం..*
*సరదాగ కామెంట్స్ చేయాలంటే భయం..*
*కొత్తవారి రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేయాలంటే భయం..*
*సరే.. ఇవన్నీ ఆడవారం కాబట్టి సమాజంలో గౌరవం కోసం.. తోటి వారితో డిగ్నిటీ కోసం సైలెంట్ గా ఉన్నామే అనుకో..?*

*మరి..*
*ఎవడో కామెంట్ చేస్తే భయమే..?*
*ఒక్కడు తేడాగా మెసేజ్ చేసిన భయమే..?*
*ఆడవార్ని కించపరిచే విధంగా పోస్ట్ లలో తప్పని చెప్పడానికి భయమే..?*

*ఇలా అన్నింటికీ భయపడుతూనే ఉంటే ఇక ఆ నిర్భయ చట్టాలు కూడా మనల్ని కాపాడ లేవు..!*

*కనీసం ఇక్కడ అయినా భయం వదిలి కళ్ళు నోరు తెరవండి కాస్త...*

*Inbox లో మెసేజ్ చేస్తే.. స్క్రీన్ షాట్ తీసి బయట పెట్టు.. దానికి భయం అయితే బ్లాక్ చేస్తే పోతుంది.. దానికెందుకు భయం..?*

*తేడాగా కామెంట్ చేస్తే అక్కడే ఓ చూపు చూడు.. దానికి భయం అయితే రిపోర్ట్ చెయ్.. అవకాశం ఉంటే delete చెయ్.. దానికెందుకూ భయం..?*

*ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తె నీకెందుకు భయం.. అలా పడి ఉండని నీకేమైనా బరువా... ఇష్టం లేకుంటే బ్లాక్ చెయ్ అంతేగా.. వీటికి కూడా భయం ఎందుకో..?*

*ఆడవారికి స్వేచ్చ లేదు అని మనమే అంటాం*
*కనీసం ఇక్కడ కూడా స్వేచ్చ గా ఉండేందుకు భయం..?*

*బాహ్య ప్రపంచంలో ఎలాగో మగాడి తోడు లేకుండా కాలు బయట పెట్టలేం..*
*కనీసం ఫేస్బుక్ లో అయినా మగాడి అవసరం లేకుండా నిర్భయంగా ఉందాం..!*

*వీధిలో ఎలాగో లేము..*
*కనీసం ఇక్కడ అయినా వీర వనితలం అవుదాం..!*

*(ఇది కవిత కాదు.. కొందరి మా మిత్రురాళ్ళ బాధ 😔)*

Sekarana

*****నిజాలు తెలుసుకోండి...* *మారండి....* *సినిమాలను సినిమాల్లాగానే చూడండి, మర్చిపోండి.....

 *2 గంటల 30 నిమిషాల కల్పిత కధను టికెట్ కొని చూసి దానిలో వున్న పాత్రలను నిజమైనవిగా  భ్రమపడి "హీరోలు" అంటున్న నేటి యువత వాస్తవాలను గ్రహించాలి....*

*రియల్ హీరోలు ఎవరు....?*
*నకిలీ హీరోలు ఎవరు.....??*

*జన్మనిచ్చిన అమ్మ రియల్ హీరో,*
*జీవితాన్నిచ్చిన నాన్న రియల్ హీరో...*

*రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించి ఆకలి తీరుస్తున్న రైతన్న హీరో,*

*భార్య బిడ్డలను వదిలి కొండ కొనల్లో ఉంటూ దేశానికి రక్షణ ఇచ్చే జవాన్ హీరో,*

*నిత్యం నేర్చుకుంటు పాఠాలు చెప్పే గురువు హీరో,*

*ఎన్ని కష్టాలు వచ్చిన భరిస్తూ కుటుంబ బాధ్యతలు మోసే కుటుంబ పెద్ద హీరో,*

*ధర్మం, న్యాయం కోసం* *ప్రలోభాలకు లొంగకుండా పోరాడే  వృత్తి నిపుణులు* 
*నిజమైన హీరోలు*

*ఎటువంటి ప్రతిఫలం* *ఆచించకుండా ప్రకృతి రక్షణ కోసం, సమాజం హితం కోసం పాటుపడే నిస్వార్థ సేవకులు నిజమైన హీరోలు* 

*నకిలీ, డూప్లికేట్, కల్పిత, తెర మీది హీరోల గురించి పరిశీలిద్దాం.......*

*తాత్కాలిక మేకప్ వేసుకొని,*
*డమ్మీ గన్నులు, పిస్తోళ్ళు పట్టుకొని*
*ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని*
*బిల్డప్లు ఇచ్చే సినిమా నటులు హీరోలు కాదు.....*
*వారు కేవలం జస్ట్ యాక్టర్స్ (నటులు) మాత్రమే....!!*

*మాటలు వాళ్ళవి కావు ,*
*ఫైట్ వాళ్ళది కాదు,*
*జుట్టు వారిది కాదు,*
*పాట వాళ్ళది కాదు,*
*కధ వాళ్ళది కాదు,*
*డైరెక్షన్ వాళ్ళది కాదు,*
*సినిమా ఖర్చు (నిర్మాత ) వాళ్ళది కాదు.....*

*జస్ట్ 2 గంటల30నిముషాలు తెర మీద కనిపించి*
*డబ్బులు తీసుకునే కొనే సాధారణ వ్యక్తులు సినిమా పాత్రాల్లోని నటులు......*

*కల్పిత, నట జీవితాలు కాబట్టే... వ్యక్తిగతంగా చిన్న సమస్యలు వచ్చినా పరిష్కారం చేసుకోలేని దుస్థితి సినిమా నటులది.......*

*అంతే కాదు..... క్రమశిక్షణ లేని జీవితాల కారణంగా.....*
*డ్రగ్స్ కేసుల్లో, చీటింగ్ కేసుల్లో, తీవ్ర అనారోగ్య సమస్యల్లో అనేక మంది నటులు చిక్కుకుని సతమతం అవుతున్నారు...* 

*వీళ్ళకోసమా....*
*విద్యార్థులు, యువకులు గుడ్డలు చింపుకొనేది..!?*
*వీళ్ళకోసమా కష్టపడి సంపాదించిన సొమ్మును ఖర్చుచేసేది...!?*
*వీళ్ళకోసమా తొక్కిసలాటల్లో కొట్టుకు చచ్చేది!?*
*వీళ్ళకోసమా ఫ్యాన్స్ పేరిట గొడవ పడి ప్రాణాలు తీసుకొనేది!?*

*దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలిస్తే*
*నిజమైన హీరోలు అంటారు!*

*సినిమా నటుల కోసం చస్తే* 
*జీరోలు అవుతాం....!!*

*నిజాలు తెలుసుకోండి...*
*మారండి....*
*సినిమాలను సినిమాల్లాగానే చూడండి, మర్చిపోండి.....*📽️