నా వ్యక్తిత్వంలో నేను శిఖరాన్ని అనేట్లుగా
నీకు నువ్వుగా కనబడాలి అనుకుంటే -
నిన్ను నమ్మినవారికి,
నువ్విచ్చిన మాటకు నువ్వు నిలబడు.
సమాజం దృష్డిలో
విలువైన వాడిగా కనబడాలి అనుకుంటే
ఇన్నాళ్ళూ నీకు నువ్వుగా పోగేసుకున్న
నీదైన వ్యక్తిత్వాన్ని చంపేసుకో!
అని ఎవరైనా నాతో అంటే
సమాజం నన్ను వెలివేస్తానన్నా సరే -
నన్ను నమ్మినవారి చెయ్యి వదలను,
నేనిచ్చిన మాటకు కట్టుబడి ఉండటం మానను!!
ఎందుకంటే -
నేనిచ్చిన మాటకు నేనే కట్టుబడి ఉండలేనినాడు
నామీద నాకే గౌరవం ఉండదు.
ఆ పరిస్థితే నాకు ఎదురైతే ఇక ఇతరుల దగ్గర
నేను పొందాలనుకొనే గౌరవానికి అర్ధమే లేదు.
*🌹శుభరాత్రి 🌹*
Sekarana
No comments:
Post a Comment