Tuesday, April 8, 2025

 


*డొక్కా సీతమ్మ గారి గురించి ఈనాడు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఆంధ్రుల అన్నపూర్ణమ్మగా ఖ్యాతి గడించిన సీతమ్మగారి బయోగ్రఫీ తెరకెక్కబోతుంది. నిజంగా శ్లాఘనీయం.* 

*ఈ తల్లి గురించి ప్రపంచమంతా తెలిసేలా చేసిన మహానుభావుడు మన గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు. సీతమ్మగారి జీవితం సినిమాగా రావడం నిజంగా చాగంటి గారి ప్రవచనాల చలవే. ఈ ఖ్యాతి చాగంటి గారిదే. సీతమ్మగా నటి ఆమని నటించబోతున్నారు.*

*దర్శకుడు టీ.వీ. నారాయణ్ గారికి, నిర్మాత వల్లూరి రాంబాబు గారికి అభినందనలు. అయితే మాదొక మనవి. సీతమ్మ గారి జీవిత గాథను యథా తథంగా తీయండి కానీ ఎలాంటి కల్పితాలు జోడించకండి.*

*మీ చిత్రం ద్వారా సీతమ్మ గారి జీవితానికి కించిత్ మచ్చ రానీయకండి.*

No comments:

Post a Comment