Wednesday, April 9, 2025

 *_మనిషి వేరు - మనస్తత్వం వేరు_*
🌹 🙏 🌹 🙏 🌹 🙏 🌹 
-----------------------
*ఈ మధ్య ఒక స్కూల్ కి వెళ్ళాను.. నా దగ్గర చదివి డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయి లోయర్ క్లాస్ టీచర్ గా చేస్తోంది. క్లాసులో పిల్లలు తను చెప్పేది వినడం లేదని కోపంతో గట్టిగా అరుస్తోంది!* 

*ముందు నేను అయోమయంగా చూశాను. ఆపై నవ్వుకుంటూ వచ్చేశాను.. బోధన చేయాలన్నా, పిల్లలతో కొంతసేపు గడపాలన్నా... ఛైల్డ్ సైకాలజీ తెలియాలి.. సైకాలజీ అంటే మనస్తత్వ శాస్త్రం....*

*మనసనేది ఒక అద్భుతం.. పైకి కనిపించే మనిషి వేరు, అతని అంతరంగం, మనస్తత్వం వేరు....*   

*నువ్వు మౌనంగా ఉన్నావనుకో... అదిచూసి అందరూ నువ్వు కోపంగా ఉన్నావనుకుంటారు...* 

*గాఢంగా నిద్రపోవాలి అనే కోరిక.. నీతో నువ్వు ఒంటరిగా ఉండాలి అనే విషయానికి సంకేతం...* 

*నువ్వు బాగా ప్రేమించిన వ్యక్తిని మరచిపోవడం అంత తేలికైన విషయం కాదు.. కనీసం 15 నెలలు పడుతుంది...*  

*ఒక వ్యక్తి బిగ్గరగా నవ్వుతున్నాడంటే, అతని హృదయం అంతగా ముక్కలైపోయిందన్న మాట...* 

*ఒక వ్యక్తి అందరిలో ఎక్కువగా మాట్లాడుతున్నాడంటే, అతను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడన్న మాట.. ఇవన్నీ  సైకాలజీ చెప్పిన నిజాలు.* 

*అందంగా వేసిన అట్టను చూసి పుస్తకం గురించి మాట్లాడడం, కటౌట్ చూసి సినిమా గురించి చెప్పడం ఎంత అమాయకత్వమో... ఎంత మూర్ఖత్వమో తెలిసిపోతుంది కదా...!!!*  

*వీలైతే మనిషి మనసులోకి చూడండి. అప్పుడు మాట్లాడండి..*
 
_Good morning.._ 
*ఇట్లు........ మీ* _Venkateswarlu Somavajhala...🙏_
_(Rtd. HM, తూగోజిల్లా...)_ 
------------------------
*_{అంటూ ఈరోజు.. 08-04-2024, సోమవారం.. సుప్రభాత సమయాన  శ్రీ సోమావఝల వేంటేశ్వర్లు గారు ఒక మంచి సందేశాన్ని తన అనుభవంతో రంగరించి అందించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను... అలాగే నా అభిప్రాయం కూడా చెప్పాలనిపిస్తోంది. అది ఏమిటంటే... 1)భావోద్వేగాలను  సంయమనం చేసుకోవడం,(ఎషనల్ బ్యాలెన్స్), 2)భావోద్వేగాలను సరైన రీతిలో అదుపు చేసుకోవడం... (ఎమోషన్స్ కంట్రోల్...), 3)భావోద్వేగాలను ఉపయోగకరమైన రీతిలో వినియోగించడం (ప్రాపర్ యుటిలైజేషన్ ఆఫ్ ఎమోషన్స్).... ఇవి తెలిసినప్పుడే, పిల్లల పెంపకంలోనూ, బోధనలోనూ మనం ఖచ్చితంగా మంచి ఫలితాలను చూడగలుగుతాము. అంతేనా...?: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*

No comments:

Post a Comment