Wednesday, April 9, 2025

 శుభ శుభోదయం  మిత్రులకు
Sreedevi 

*నాలాంటి కాఫీ ప్రియుల కోసం ఈ కథ
☕😋

 శుక్లామ్బరధరం వర్సెస్ కాఫీ*
🤔🤔

కాంచి మహా పెరియవర్ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి మంచి హాస్య ప్రియులు. 

 ఒకరోజు తన శిష్యుని పిలిచి, *సంధ్యా వందనం అయిందా? శుక్లాం బరధరం అయిందా?* అనిఅడిగారు.వెంటనే ఆ శిష్యుడు అయిందని
               తల ఆడించాడు.

 దానికి మహా పెరియవర్ అతనితో  *శుక్లాం బరధరం చెప్పావా అని అడగలేదు. అయిందా అని అడిగాను* అన్నారు. 

శిష్యుని కి ఏమీ అర్థం కాలేదు. పెరియవర్ ఏమని అడిగారు? ఈ పదాలకు వున్న  భేదాలేవీ బోధపడక పరితపించాడు. అతనికి సందేహంగాను వుంది. 
కొన్ని నిమిషాలు మౌనంగా గడిచిన తరువాత, 
మహా పెరియవర్  అతనితో *శుక్లాం బరధరం*చెప్పు చూద్దాం అన్నారు. పెరియవర్ చెప్పమన్న వెంటనే,

*శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే*అని శిష్యుడు చెప్పాడు.

శిష్యుడు చెప్పింది విన్న మహాపెరియవర్ *దీనికి అర్థం తెలుసా?* అని అడిగారు. *తెలుసు* అని బదులు చెప్పిన శిష్యుడు, తెల్లని మనసు, యేనుగులా నల్లని రంగు, నాలుగు చేతులు,ప్రకాశమయిన ముఖం, అందరూ తలచి చూసేలా చేయు ఆకారం వున్న వినాయకుని స్మరిస్తే ఏవిధమైన ఆటంకాలు, బాధలూ వుండవని చెప్పాడు. .....

*అరే !సరిగ్గా చెప్పావే,దానికి ఇంకో అర్థం వుంది, అది నీకు తెలుసా? అని చెప్పి, నవ్వారు*

*శుక్లాం అంటే తెల్లనిది. అంటే పాలు*
*విష్ణుం అంటే నలుపు అది డికాషన్*
*శశి వర్ణం అంటే నలుపు తెలుపు కలిసినది. 
       అంటే   కాఫీ*
*చతుర్బుజం అంటే నాలుగు చేతులు. అంటే, భార్యవి రెండు చేతులు, కాఫీ ఇవ్వగానే అందుకునే భర్తవి రెండు చేతులు కలిసి నాలుగు చేతులు*

*ధ్యాయేత్ అంటే తలిచే తలపులు. అంటే అలాకాఫీ ఇవ్వడాన్ని మనసులో తలవగానే ప్రసన్న వదనం ముఖం వికసిస్తుంది*

ఆసమయంలో. *సర్వ విఘ్నోప శాంతయే* అంటే అన్ని వేదనలూ పోగొట్టేది. అనగా కాఫీ  త్రాగితే వేదనలుతీరి, మనసు శాంతమవుతుందని అర్థం. ....

*శుక్లాం బరధరం అయిందా *అన్న ప్రశ్నలో , కాఫీ త్రాగటం అయ్యిందా? అన్న అర్ధం దానిలో ఇమిడి వుంది. అని తెలుసుకున్న శిష్యులు మైమరచి నవ్వనారంభించారు.  

*కంచి పెరియవర్ చిరునవ్వులు చిలకరించారు*🙏
😋☕😋☕😋☕😋☕😋☕😋☕😋☕😋
       జయ జయ శంకర హర హర శంకర..
    👏👏👏👏👏👏👏👏👏👏👏👏

🥰🌿మెమోరీ పోస్ట్

No comments:

Post a Comment