Wednesday, April 9, 2025

 *మనసే మూలం…!*
 🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻                 

*మనిషి మనుగడకు మూలం ‘మనస్సు’! మనిషి జీవితం మనసు ఆడే ఒక వింత ఆట..!*

*ఈ మనసులో నిరంతరం.. సంకల్ప, వికల్పాలు(willing& doubting) నడుస్తుంటాయి..!*

*మనసులో రోజు మొత్తంలో కొన్ని వేల ఆలోచనలు  పుడుతూ ఉంటాయి..! మన ఆలోచనలు ఎంత అధికంగా ఉంటే మనసు అంత చంచలమై, అలజడికి, అశాంతికి గురి అవుతాము చేసే పనిపై ఏకాగ్రత కుదరక, పనిలో సమర్ధత కోల్పోయి, పరాజయానికి గురి అవుతూ ఉంటాము..!!*

*ఈ మనసులో ఆలోచనలు తగ్గించేందుకు అనేక ధ్యాన విధానాలను అనుసరించినా..,*
*తాత్కాలిక ఉపశమనం లభించిందే కానీ, శాశ్వత పరిష్కారాన్ని పొందలేకపోయాము..!!*

*ఈ అత్యంత శక్తివంతమైన మనసును జయించే ఏకైక మార్గం ‘రాజయోగం’!!*

*నీ దుఃఖానికి కారణం నీ కర్మలు..,               ఆ కర్మలకు కారణం నీ ఆలోచనలు..,               ఆ ఆలోచనలకు కారణం నీ మనస్సు..!! ఆ మనస్సు ఇప్పుడు పంచ వికారీ రూపీ రావణునికి వశమై ఉంది..!! ఆ మనస్సుని నా వశం చేయడం ద్వారానే.. నీకు పరమశాంతితో కూడిన నిర్మల  మనస్సు లభిస్తుంది..!! తద్వారా ఆలోచనల్లో శ్రేష్ఠత చేకూరి, కర్మలలో ప్రావీణ్యత పెరిగి, సత్ఫలితాలను పొంది, సుఖవంతమైన జీవితాన్ని అనుభవించగలవు.." అని నిర్దేశనం ఇస్తూ, అందుకు రాజయోగమే తరుణోపాయం అని సూచిస్తున్నారు పరమాత్మ...!!!*

*"కనుక అత్యంత శక్తివంతమైన ఈ మనసును శక్తితో కాక యుక్తిగా..         ప్రేమతో జయించాలి!   ప్రతి పనీ చేస్తూ..మనసుతో ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి! మనసులో వచ్చే ప్రతి ఆలోచనను అణచివేయక(control), సరిదిద్దితూ(పరివర్తన చేస్తూ) ఉండాలి..!!          ఉద్వేగాలు కలుగకుండా.. సాత్విక గుణాలను మననం చేస్తూ, అనుభవం చేయిస్తూ ఉండాలి.!*

*ఎటువంటి అభ్యాసం చేయాలి అన్నా.. మనసు సహకరించాలి*
*అందుకు నిరంతరం ఈమనస్సులో ప్రేమతో పరమాత్ముని స్మృతి చేయాలి.* 

*రాముడు(Good/God)ఉన్న చోట రావణుడు(Bad/Devil) నిలవలేడు..!!"*

*"రాముడైన పరమాత్మతో సాంగత్యం(స్మృతి) చేయాలి అంటే అందుకు అర్హత.., మనసులో స్వయం పట్ల, సర్వులు పట్ల శుభభావన, శుభకామనలు కలిగి ఉండాలి, అందుకు త్రికరణ శుద్ధిగా సహయోగం(సేవ) చేయాలి..!!                        బాహ్యం నుండి శుద్ధమైన విషయాలను గ్రహించాలి అనే పత్యం ఉండాలి..!!"*

*ఈవిధమైన అభ్యాస వైరాగ్యాల ద్వారా మనసుని మంచి మిత్రునిగా చేసుకుంటే జీవితమే నందనవనం అవుతుంది..!!*

*సర్వులు తమలోనే ఉన్న మంచి మిత్రుని(మనసుని)కి, పరమాత్ముని స్మృతి అనే శ్రేష్ఠ బహుమానం ఇచ్చి అవధులు లేని ఆనందాన్ని దానికి అనుభవం చేయించాలని ఆశిస్తూ..*
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻                              

No comments:

Post a Comment