Wednesday, May 21, 2025

 #ప్రశ్న : ఒక పురుషుడు పెళ్ళి చేసుకున్న తరువాత భార్యని వదిలి మరో స్త్రీతో శారీరకంగా గాని, మానసికంగా గాని లేదా రెండు విధాల సంబంధం ఏర్పరచుకున్నాక తిరిగి కొంత కాలానికి భార్య వద్దకు చేరుకునే అవకాశం ఉందా?
#జవాబు : నో #ప్రశ్న : ఒకవేళ ఆ ఏర్పరచుకున్న అమ్మాయితో ఇబ్బందయి ఆమెకు దూరం కావలసి వస్తే? #జవాబు : లేదు. అటువంటి సందర్భాలలో కూడా భర్త తిరిగి భార్యతో స్వచ్ఛమైన బంధాన్ని ఏర్పరచుకో లేడు. మహా అయితే ఆమెను వదిలి వేరే స్త్రీతో బంధాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంది. ఒక వేళ తిరిగి భార్య వద్దకు వస్తే ఆర్థిక, సామాజిక, న్యాయ పరమైన అంశాల వలన రావాలి తప్ప మానసికంగా తిరిగి రాడు. ఈ విషయంలో స్త్రీ కూడా అదే విధమైన ప్రవర్తన చూపిస్తుంది. మానసిక బంధాలు గడిచిన కాలం వంటివి. జీవితంలో ఒక వ్యక్తితో కేవలం ఒక సారి మాత్రమే ఏర్పడతాయి. ఒకసారి అక్కడ నుంచి మరో వ్యక్తి మీదకు జరిగాక తిరిగి రావడం జరగదు. తిరిగి అక్కడి నుండి మరో నూతన వ్యక్తి మీదకు జరగడం గాని, లేదా ఒంటరిగా మిగిలిపోవడం గాని జరుగుతుంది.


No comments:

Post a Comment