👌 ఒక గృహస్థుడు రోజూ బుద్ధునికి భిక్ష పెట్టేవాడట. ఆ సమయంలో, "స్వామీ! నాకు ఉపదేశం ఇవ్వండి! దీక్ష ఇవ్వండి" అంటూ గౌతమబుద్ధుని ప్రార్ధించేవాడు. బుద్ధుడు ఒకరోజు భిక్షా పాత్రలో దుమ్ము, ధూళి పెట్టుకొని భిక్షకు వచ్చాడు. ఆ గృహస్థుడు బిక్ష వేసేందుకు వచ్చి పాత్రను చూచాడు. "అయ్యా! పాత్రను శుద్ధి చేయకుండా భిక్ష భిక్ష అంటావేమయ్యా! ఆ మురికి పాత్రలో భిక్ష వేస్తే వ్యర్ధమై పోదా?" అన్నాడట.
అప్పుడు బుద్ధుడు "అయ్యా! నా పాత్ర సంగతి అలా ఉండనీ, నీ అంతఃకరణమనే పాత్ర సంగతి ఏమిటి? నీ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోకుండా ఉపదేశం అంటే ఎలా? కల్మషమైన అంతఃకరణంలో చేసిన ఉపదేశం వ్యర్ధమే కదా! " అన్నాడట.
ఆసురీ సంపద పరమాత్మప్రాప్తికి ప్రతి బంధకం. దైవీసంపద కలిగి ఉంటేనే పరమాత్మ ప్రాప్తి. రాష్ట్రపతికో, ప్రధానమంత్రికో, గవర్నరుకో, ముఖ్యమంత్రికో, మంత్రికో, ప్రజాప్రతినిధికో స్వాగతం ఇవ్వాలంటే ఎంత హంగామా చేస్తాం? రోడ్లన్నీ ఊడ్పించి, కాలువల్లో మందు చల్లించి, మురికి కూపాలను శుభ్రం చేయించి, స్వాగత ద్వారాలను కట్టించి, రంగురంగుల తోరణాలతో, పూల దండలతో అలంకారాలు చేసి - అబ్బో ఎంతో హడావుడి చేస్తాం? ఎంత ఖర్చయినా వెనుకాడం. మరి బ్రహ్మాండాధిపతిని నీ హృదయంలోకి ఆహ్వానించాలంటే ఆయన స్వాగతానికి ఏం సన్నాహాలు చేస్తున్నావు? ఏం త్యాగం చేస్తున్నావు? ఆయన కూర్చొనే నీ హృదయ సింహాసనాన్ని శుభ్రం చేయ వద్దా? దాని మీద ఉన్న ఈ లౌకిక ధూళిని దులిపి వేయవద్దా? నీలోని ఆసురీగుణాలను దూరం చేసుకోవద్దా? దైవీగుణాలకు స్వాగతం పలకవద్దా? అలా చేస్తేనే భగవంతుడు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. నీ హృదయ సింహాసనంపై ఆశీనుడౌతాడు
నరుణ్ణి, నారాయణునిగా చేసేది దైవీసంపద.
నరుణ్ణి వానరుడిగా చేసేది ఆసురీసంపద.
మనిషిలో దైవంశా ఉన్నది, రాక్షసాంశా ఉన్నది.
తన కర్మలతో తాను దేవుడూ కావచ్చు. రాక్షసుడూ కావచ్చు.
"యధేచ్చసి తథాకురు" - నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో - అంటూ భగవంతుడు మనకు కర్మ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాడు.
నా కర్మ! నా గ్రహచారం! అంటూ ఏడుస్తూ కూర్చోవాల్సిన పని లేదు. 'క్లైబ్యం మాస్మ గమః' - పిరికి పందవు కావద్దు! - అని హెచ్చరిక. మరి ఏం చేయాలి? 'ఉద్ధరేదాత్మనాత్మానం' - నిన్ను నీవు ఉద్ధరించుకో! పురుషార్ధం చెయ్యి - అని ప్రోత్సహిస్తున్నాడు.
తన వెంట వచ్చే సంపద (పుణ్యం, పాపం, జ్ఞానం) గురించి ఆలోచించడు మానవుడు. విడిచి పెట్టిపోయే సంపదల (డబ్బు, ఇల్లు, పొలం, స్థలం, నగలు .....) కోసం జీవితం చివరి రక్తపు బొట్టు వరకు - చివరి శ్వాసవరకు తపించి పోతూనే ఉంటాడు. అన్నీ ఉన్నప్పుడు అహంకారం. అంతా ఉడిగిపోయిన తరువాత శ్రద్ధ. శ్వాసలున్నంత వరకు ఎవరన్నా లెక్కలేదు. శ్వాస ఎగిరిపోయే సమయంలో డాక్టర్ల కాళ్ళ మీద పడతాం. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర మందు ఉంటుందే గాని ఆయుష్షు ఉండదు గదా! రోగానికి మందు ఉంటుంది గాని రోగికి మందు ఉండదు. కనుక ఓ మానవుడా! నీ గడియ గడియా అయిపోతున్నదని గడియారం టకటకా గంటలు కొట్టి హెచ్చరికలు చేసున్నది. ఖబడ్దార్ మేలుకో! మేలుకొని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. నీలో జరిగే ఈ ఆసురీసంపదకు దైవీసంపదకు మధ్య పోరాటాన్ని గమనించు. నీ బలం దైవీసంపదకు ఇవ్వు. ఆసురీసంపదను పారద్రోలు. అప్పుడే నీ లక్ష్యం నెరవేరుతుంది.🙏

No comments:
Post a Comment