Wednesday, January 29, 2020

🔴దానగుణం🔴

🔴దానగుణం🔴

ఒక బాటసారి సముద్రంతో ఇలా అన్నాడు. "నది ఎంత సన్నగా ఉన్నా దాని నీళ్ళ మాత్రం తియ్యగా
వుంటాయి. నీవు ఎంతో విశాలంగా ఉంటావు కానీ నీ నీళ్ళ మాత్రం చాలా ఉప్పగా వుంటాయి. దానికి కారణం ఏమిటి?" అని అడిగాడు.

అప్పుడు సముద్రం ఇలా అంది. "నది ఈ చేత్తో తీసుకొని ఆ చేత్తో ఇతరులకు దానం చేస్తుంది. అందుకే ఆ నదిలోని నీరు తియ్యగా ఉంటుంది. నేను మాత్రం తీసుకుంటానేగాని, ఎవరికీ ఇవ్వను. కాబట్టి నా నీరు ఉప్పగా వుంటుంది" అంది. అందుకే “ఆ చేత్తో తీసుకోని, ఈ చేత్తో ఇవ్వని వారు జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతారు" అని మన పెద్దలంటారు.🌹

No comments:

Post a Comment