Sunday, May 24, 2020

వలపుతో పిలుపు, పిలుపుతో తలపు, తలపుతో జీవిత మలుపు మారుతుంది.

వలపుతో పిలుపు, పిలుపుతో తలపు, తలపుతో జీవిత మలుపు మారుతుంది.

ఇప్పటి కరోన లాగే పూర్వం కలరా అనే ఒక మహమ్మారి వ్యాధి వ్యాపించి కుటుంబంల కు కుటుంబంలే మరణిస్తున్న సమయం అది.

ఒక నడి వయసు వున్ను వ్యక్తి తప్ప ఒక కుటుంబంలో అందరూ మరణించారు. ఆ బాధ తో అతనికి జీవితం మీద విరక్తి కలిగింది.

జనన, మరణాలు అంటే ఏమిటి మరణించిన వారు ఎక్కడికి వెళ్తున్నారు?.

దేవుడి దగ్గరికి అంటున్నారు కదా! అందరూ ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? చూడాలి అని అన్నింటినీ వదులుకొని ఓక రోజు తెల్లవారుఝామున అడవి మార్గం గుండా బయలుదేరాడు.

మసక మసక చీకటి లో అలా కొంత దూరం ప్రయాణించే సరికి మార్గం మద్యలో ఎవరో ఒక చిన్న పాప గుక్క బట్టి ఏడుస్తు
కనిపించింది దగ్గరికి వెళ్లి చూస్తే
ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరూ మరణించి ఉన్నారు.

ఆ ప్రక్కనే ఒక చిన్న డబ్బు సంచి కూడా ఉన్నది. హృదయవిదారకమైన ఆ చిన్న తల్లి ఏడుపు అతని కదిలించివేసింది. చేసేది ఏమీ లేక ఆ పాపను ఒక చేతి తో డబ్బు సంచిని మరొక చేతితో తీసుకొని తన ప్రయాణాన్ని
మళ్లీ ప్రారంభించాడు.

తన మనసులో ఇలా అనుకుంటున్నాడు ఈ పాప ఏడుపు ఆపడం లేదు, ఎవరైనా మహనీయులు
కొన్ని పాలు పోస్తే బాగుండు, ఈ పాపకు ఆకలి తీరుతుంది అనుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు.

అలా మరికొంత దూరం
ప్రయాణించే సరికి
ఒక యవ్వనస్తురాలు
కోని ఆవులను మేపుకుంటు దిగులుగా కనిపించినది.

ఇదిగో అమ్మాయి నీ దగ్గర కొన్ని పాలు ఉంటే పోస్తావా ఈ పాప ఏడుస్తూ ఉన్నది అని అడిగాడు.

ఆ రండి అంటూ తన దగ్గర ఉన్న పాత్రలోకి కొన్ని పాలను
పిండి ఆయనకు ఇచ్చింది.

ఆ పాలను సంతోషంగా తీసుకుని ఆ చిన్నారికి తాగిస్తూ ఆ అమ్మాయితో ఇలా అంటున్నాడు ఈ అడవిలో నీవు ఒక్కదానివే ఏం చేస్తున్నావ్ అమ్మ ఇక్కడ, నీ వారు ఏవరు లేరా?

కలరా భయంతో మా ఊరు వదిలి వేరే ఊరికి వెళుతున్నాం. మార్గమధ్యంలో నాతో వచ్చిన బంధువులు అందరూ చనిపోయారు.

ఏం చేయాలో, ఏక్కడి వేళ్ల లో తెలియడం లేదు అంటూ బోరున ఏడవసాగింది.
ఆ అమ్మాయిని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదు.

గట్టి గా ఊపిరి పీల్చుకొని
గుండె ను రాయి చేసుకుని
సరే ఈ అడవి మార్గమధ్యంలో ఆడపిల్లవు ఓక్కదానివి వుండటం అంత మంచిది కాదు.

తనతో రమ్మని ఆ అమ్మాయిని పిలవడం జరిగింది. అందుకు ఆ అమ్మాయి అంగీకరిస్తూ అతని వెంట ప్రయాణనికి సిద్ధ పడినది.

ఆవుల తోలుకుంటూ,
ఆ చిన్నారిని ఎత్తుకుని,
ఈ అమ్మాయిని వెంటబెట్టుకుని ప్రయాణం సాగిస్తూ వీరి ఇరువురి కి ఎవరైనా ఒకరు పెద్ద దిక్కు దొరికితే బాగుంటుంది అనుకుంటూ
నడకసాగిస్తున్నడు.

అలా ఇంకా కొంత దూరం
పోయేసరికి ఒక వృద్ధురాలు
బంగారు నగలు వున్న మూటను పట్టుకొని అయిన వారందర్నీ పోగొట్టుకొని ఏడుస్తూ కనిపించింది ఆవిడను కూడా ఓదారుస్తూ
తన వెంట ఆ వృద్ధురాలిని కూడా తిసుకొని బయల్దేరాడు.

భారం దింపు కుందామని బయలుదేరితే దారిపొడవునా బాధ్యతలు పెరుగుతూ వస్తున్నాయి ముందు ముందు ఇంకా ఏం చూడాల్సి వస్తుందో!

ఈ బంధనాలు అన్నింటికీ
ముగింపు పలికే ఆధారం ఏదైనా దొరికితే చాలా బాగుంటుంది అనుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాడు.

అలా ఇంకొంచెం ముందుకు సాగే సరికి, ఒక యువకుడు తన కుటుంబాన్ని అంతటినీ పోగొట్టుకుని విరక్తితో కొండ మీద నుంచి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలి అని ప్రయత్నిస్తూ కనిపించాడు.

వెంటనే వెళ్లి వాడిని పట్టుకుని
అక్కడి నుంచి కిందకు దింపి
పిచ్చివాడా నువ్వు ఒక్కడివే బాధలో ఉన్నాను, అనుకుంటున్నావా ఇటు చూడు ఇక్కడ ఉన్న వారందరి పరిస్థితి అంతే అని వాడికి నచ్చ చెప్పి, వాడిని కూడా వారి తో పాటు తీసుకొని ఇంకొంచెం ముందుకు కొనసాగారు.

వారికి ఓక దేవాలయం కనిపించినది, అక్కడ మంచి సారవంతమైన నెల ఒకటి కనిపించింది, ఆ పక్కనే
ఒక సెలయేరు ప్రవహిస్తున్నది
తన బంధనాల ను,తెంపుకోవడానికి,ఇదే మంచి స్థలమును భావించి, ఆ యువతీ యువకులకు ఇద్దరికీ వివాహం జరిపించి, చిన్న పాపని ఆ వృద్ధురాలిని వారికి అప్పగించి, జాగ్రత్తగా వారిని సంరక్షించే అని, ఈ గుడి లో తల దాచుకుంటు, ఆ ఆవులతో ఇక్కడ వ్యవసాయం చేసుకోండి.

ఆ బంగారం ఈ డబ్బుతో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని
సుఖంగా సంతోషంగా ఉండండి అని చెప్పి, వారు ఎంత ప్రాధేయ పడుతున్నా వారి మాట వినకుండా తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

అలా ఇంకా కొంత దూరం పోయిన తర్వాత అతనికి కూడా కలరా సోకి మరణించడం జరిగినది.

కొన్ని రోజుల తర్వాత ఆ శరీరం పూర్తిగా కుళ్లిపోయి, ఎముకలు అన్ని దేనికి అవి విడిపోవవి, కేవలం తల ఒకటి మాత్రం
వాగు కు దగ్గరలో పడి ఉన్నది...

నారదుడు భూలోక ప్రయాణాన్ని ముగించుకొని దేవలోకమునకు బయలుదేరుతూ
సంధ్యా సమయం కావడం వల్లన, సంధ్యావందనం కొరకై స్నానం ఆచరించాలని ఆ వాగు లోనికి ప్రవేశిస్తూ ఉండగా కాలికి ఆ పుర్రె తగిలినది.

దాని వైపు చూస్తే ఈతల
ముల్లోకాలు దర్శి స్తుందని వ్రాసి ఉంది. ఏమిటి ఈ పొరపాటు చనిపోయి పడిపోయాన ఈ పుర్రె ముల్లోకాలను ఏలా దర్శి స్తుంది అని సందేహంతో, సంధ్యావందనము ముగించుకుని ఆ పుర్రె ను తీసుకుని, వైకుంఠం నాకు బయలుదేరడం జరిగింది.

వైకుంఠం చేరుకొని విష్ణు దేవునితో బ్రహ్మదేవుడు
వీడు ముల్లోకాలు దర్శిస్తాడని వ్రాసాడు, మరి వీడేమో చనిపోయే భూలోకంలో పడి ఉంటే పుర్రె ను నేను తీసుకు వచ్చాను ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు?

విష్ణువు చిరునవ్వు నవ్వి నారద, వ్రాత ల గురించి నాకు తెలియవు కేవలం నేను జీవులకు పోషణ బాధ్యతలు మాత్రమే చూస్తాను.

ఈ విషయాన్ని పరమేశ్వరుని అడగడం మంచిది అని సమాధానం ఇచ్చాడు. ఆ పుర్రె ను తీసుకుని నారదుడు కైలాసం లో ఉన్న
శివుని దగ్గరకు వెళ్ళాడు పరమేశ్వరుడు, ఆయువు తీరిను వారి ప్రాణాలు తీయడమే నా పని, ఇది రాసిన బ్రహ్మ ను అడగడము సమంజసం గా వుంటుంది
అని సలహా ఇచ్చాడు.

ఆ పుర్రెను తీసుకొని బ్రహ్మలోకం బయలుదేరి వెళ్ళాడు నారదుడు, వెళ్లి బ్రాహ్మ ను ప్రశ్నించగా?

ఏం నారద విధాత రాసిన రాత నే ప్రశ్నించేటి అంతటి వాడవయ్యావా? అయినా అడుగుతున్నావు కాబట్టి
నీ సందేహాలు తీర్చడం నా ధర్మం అని, నారద
ఈ పుర్రెను తీసుకుని
మొదటి ఎక్కడికి ప్రవేశించావు?
వైకుంఠం అని నారదుడు సమాధానమిచ్చాడు.

రెండవ మారు ఎక్కడి కి తీసుకుని వెళ్ళువు కైలాసం అని మళ్లీ సమాధానమిచ్చాడు నారదుడు.

మరి చివరగా ఎక్కడికి తీసుకోవచ్చు బ్రహ్మ లోకం అని సమాధానమిస్తూ... ఆశ్చర్యకరంగా తన ముఖకవళికలను మార్చుకొన్నాడు.

ఏం నారద ఇప్పుడు చెప్పు
నేను వ్రాసిన వ్రాత లో ఏదైనా దోషం ఉన్నదా?

నారదుడు తన తప్పును క్షమించమని ఆ పుర్రెను వదిలేశాడు అదే భూమిపై పడి
పగిలిపోయినది ఆ జీవికి కపాల మోక్షం లభించింది,
జీవి దేవి లో ఐక్యమైపోయింది.


ఇదంతా చూస్తున్నాను
నారదుడికి తల తిరిగినట్లు అయింది.

బ్రహ్మదేవుడు పైన జరిగిన కథ అంత యు వివరంగా చెప్పి,
ఇతడు పూర్వం ఒక మహర్షి పరిపక్వత చందని కారణంచేత ఇతడికి ఆ జన్మలో మోక్షం లభించలేదు.


ఈ జన్మలో తనకు లభించిన
డబ్బుకు కానీ, బంగారానికి కానీ, రూపవతి అయిన
యవ్వనవతి కానీ,
వ్యామోహపరుడు కాక
అన్నింటిని తున ప్రాయంగా తెజీంజి మోక్ష లోకలను పొందగలిగాడు.

ఈ కథలో నీతి ఏమిటంటే నువ్వు ఏది కోరుకుంటే నీకు ప్రాప్తిస్తుంది. నిష్కల్మషమైన
సాధన నీ వంతు ఫలితం ఇవ్వడము నా వంతు.
నువ్వు వదిలేయడం అలవాటు చేసుకుంటే, నీకు కావలసిన అన్ని నీ వద్దకు చేర్చే బాధ్యతను భగవంతుడు తీసుకుంటాడు.ప్రతి మనిషి లోను జ్ఞానమనే దివ్య జ్యోతి పాము వలె నిద్ర అనుగుణంగా ఉంటుంది
దానిని సాధన చేత
నిద్రలేపి నట్లయితే
షడ్ చక్రాలను చేదించడం
సులభమవుతుంది, దీనిని కుండలినీ యోగం అని అంటారు. ఇది మోక్షము అనే ద్వారాన్ని తెరవడానికి, తాళంచెవి వలె పనికి వస్తుంది.

No comments:

Post a Comment