* సబ్జాతో కూల్ కూల్....!
వేసవిలో చల్లచల్లటి ఫలూదా తాగుతుంటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే ఫలూదాలో సబ్జాగింజల్ని వాడతారు కనక. ఎండవేడిని తగ్గించడంలో ఈ గింజలు అద్భుతమైన ఫలితాన్ని అందిస్తాయి. అందుకే మీరు బయట మార్కెట్‌లో వీటిని కొనుక్కుని.. తరచూ వాడండి..
ఫలూదా, రూహప్జా, నింబు పానీ, పాన్ గుల్కండ్ మిల్క్‌షేక్, సా్ట్రబెర్రీ ఫలూదా, మ్యాంగో ఫలూదా, మ్యాంగో షర్బత్, రోజ్‌మిల్క్, ఐస్‌క్రీములు, కుల్ఫీ, షరబత్ వంటి వాటిలో నానబెట్టిన సబ్జాగింజలు జోడించినప్పుడే వాటికి రుచి ఎక్కువ. చక్కటి ప్రయోజనమూ కలుగుతుంది.
• బరువు తగ్గేందుకు...
సబ్జా గింజలు ఏదో ఒక రూపంలో తీసుకుంటే బరువు తగ్గుతారు. ఎందుకంటే వీటితో చేసిన పానీయాలు తాగితే.. అంత త్వరగా ఆకలి వేయదు. ఇందులోని అత్యధిక పీచుపదార్థం జీర్ణక్రియల్ని చురుగ్గా ఉంచుతుంది. వేసవిలో తగినంత పీచు తీసుకోవడం అవసరం.
• వేడిని తరిమేస్తుంది..!
వేసవిలో శరీరాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆ వేడి వెంటనే తగ్గాలంటే సబ్జాగింజలను వాడాలి. గింజల్ని రెండు మూడు గంటలు నీళ్లలో నానబెడితే కాస్త తెల్లగా ఉబ్బుతాయి. వీటిని ఒక గ్లాసులోకి పోసుకుని, నిమ్మరసం, పంచదార లేదంటే రకరకాల జ్యూస్‌లలో కలుపుకుని తాగేయొచ్చు.
• మధుమేహానికి
రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేసే గుణం వీటికి ఉంది. ముఖ్యంగా డయాబెటిక్ టైప్ 2 నియంత్రణకు చక్కగా పనిచేస్తుంది. నానబెట్టిన తరువాత ఉబ్బిన ఈ గింజలను పాలలో కలుపుకుని.. కాస్త వనీలా వేసుకుని తాగొచ్చు. సాధారణ పాలుతోనే కాదు, ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్‌లలోను మిక్స్ చేసుకుని తాగొచ్చు.
• మలబద్ధకాన్ని వదిలిస్తుంది
వేసవిలో పీడించే సమస్యల్లో మలబద్ధకం ఒకటి. వయసు మీరిన వాళ్లలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువ. నానిన సబ్జాగింజలను పాలలోకి కలుపుకుని రాత్రి పడుకునేముందు తాగితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
• గడబిడకు ఉపశమనం...!
వేసవిలో ఉన్నట్లుండి అజీర్తి వేధిస్తుంటుంది. వేడి తీవ్రంగా ఉన్నప్పుడు తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవ్వదు. కడుపులో గందరగోళం ఏర్పడుతుంది. ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎసిడిటీ కూడా పెరుగుతుంది. ఇలాంటి వారు గ్లాసుడు సబ్జా మిల్క్ తీసుకుంటే చక్కటి ఉపశమనం దొరుకుతుంది. ఈ సమయంలో కాఫీలు, టీలు బాగా తగ్గించాలి.
• చర్మానికి, జుట్టుకు...
మనం తినే తిండిలో విటమిన్ కె కలిగిన పదార్థాలను తక్కువ తింటుంటాం. అందుకని అప్పుడప్పుడైనా సబ్జాతో చేసిన ఫలూదా వంటి జ్యూస్‌లు తాగుతుండాలి. ఈ గింజల్లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. తద్వార చర్మ నిగారింపుతో పాటు జుట్టు నిగనిగలాడేందుకు ఉపయోగపడుతుంది. వీటితోపాటు ప్రొటీన్లు, ఇనుము కూడా లభిస్తాయి.
• గొంతునొప్పిని తగ్గిస్తుంది...!
కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు, కొత్త నీళ్లు తాగినప్పుడు.. చాలామందిలో గొంతునొప్పి లేదా ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. సీజన్ మారినప్పుడు ఇటువంటి సమస్య చుట్టుముడుతుంది. దీనికి విరుగుడు సబ్జాగింజలు. థ్రోట్ ఇన్‌ఫెక్షన్‌తో పాటు గురకను సైతం తగ్గిస్తాయివి.

No comments:
Post a Comment