🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘
👌ఈ ప్రపంచంలో పవర్ ఫుల్ వెపన్ ఏది అంటే అది మన "మనసు " అనే చెప్పాలి. ఎందుకంటే సాటి మనిషికి సహాయం చేయాలనే ధృడ సంకల్పం నీ మనసులో పుడితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నది సాధిస్తుంది నీ మనసు. కాకపోతే దానికి "ప్రేరణ " అనే ఒక బులెట్ కావాలి.👌
మన మనసనేది ఒక బలమైన ఆయుధం వంటిదని ఎందుకు అన్నానంటే, అది తలుచుకుంటే ఆరునూరైనా, నూరుఆరైనా సరే అది అనుకొన్నది అనుకొన్నట్లుగా చేసే తీరుతుంది. అయితే దానికి ముందుగా ఒక ప్రేరణ కావాలి. అది మంచి పనిదైనా సరే లేక చెడు పనిదైనా సరే. కానీ అనుకున్నది మాత్రం తప్పకుండా సాధిస్తుంది. అది ఎలాగో ఈ క్రింది కథనాన్ని చదివితే మీకే అర్థమవుతుంది..
రామాపురం అనే ఊరికి ముందుగా ఒక బస్టాప్ వుంది. ఆ బస్టాప్ లో బస్ దిగిన వారు ఒక కిలోమీటరు దూరమున్న ఊరిలోకి కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది. ఆరోజు గౌతమ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ నుండి వచ్చి అక్కడి బస్టాప్ వద్ద దిగి అటూఇటూ చూస్తుండగా ఆ బస్టాప్ స్తంభానికి ఒక బోర్డు కట్టి ఉండడం కనిపించింది. అదేమిటో చూద్దాం అని దగ్గరకు వెళ్లి ఆ బోర్డును చదివాడు. అందులో ఇలా రాసి ఉంది నేను ఒక కళ్ళు లేని అనాధ వృద్ధురాలిని నేను ఊళ్ళో కొచ్చే దారిలో నేను ఒక యాభై రూపాయల నోటును పోగోట్టుకొన్నాను. నేను గుడ్డిదానిని కాబట్టి దయచేసి ఆ దారిలో మీకు ఆ యాభై రూపాయల నోటు దొరికితే నాకు తెచ్చి ఇవ్వగలరు. ఇట్టు సుబ్బమ్మ అని వ్రాసి ఉంది. కింద అడ్రస్ కూడా వ్రాసి ఉంది..
అది చదివిన గౌతమ్ మనసు ఎందుకో కొంత కదిలి పోయింది. పాపం అనాధ వృద్ధురాలు అందులో కళ్ళు కనిపించవు. తన మనసుకు ఎందుకో ఆ ముసలావిడను ఒకసారి చూడాలి అని అనిపించింది. ఆ అడ్రస్ చదివి గుర్తుంచుకొని ఆ అవ్వ ఇంటిని వెతుక్కుంటూ వెళ్తూనే ఒక పక్క ఆ అవ్వ పోగోట్టుకొన్న యాభై రూపాయలు ఎక్కడైనా దొరుకుతుందేమో అని వెదుకుతూ వెళ్తున్నాడు.
అవ్వ ఇలైతే వచ్చింది కానీ యాభై రూపాయల నోటు మాత్రం దొరకలేదు. కానీ గౌతమ్ మనసు మాత్రం పాపం ఆ అవ్వకు నీ పర్సులోని ఒక యాభై రూపాయల నోటును తీసి, ఇదిగో నీనోటు నాకు దొరికింది అని ఆ నోటును ఆ అవ్వకు ఇవ్వమని బలంగా చెప్పింది. అవ్వ ఇంటి తలుపు తట్టగా ఒక ముదుసలి అవ్వ కర్రవూతంతో బయటకు వచ్చి ఎవరూ అని అడిగింది. గౌతమ్, అవ్వా ఇదిగో నీవు దారిలో పోగొట్టుకొన్న యాభై రూపాయల నోటు నాకు దొరికింది తీసుకో అవ్వా అంటూ ఇవ్వబోయాడు.
అందుకు ఆ అవ్వ కళ్ళనీళ్ళు పెట్టుకొంటూ చూడు నాయనా ! నీలాగే ఇప్పటికే ఒక వందమంది వచ్చి ఇదిగో నీ యాభై నోటు నాకు దొరికింది అంటూ ఇచ్చి పోతున్నారు. నిజానికి నేను చదువురాని ఒక అంధురాలిని అక్కడ పెట్టిన బోర్డును నేను రాయలేదు, కట్టలేదు. ఎవరు కట్టారోఏమో, చూడు నాయనా నీవైనా ఆ బోర్డును అక్కడినుండి తీసేయమని కోరింది. అందుకు గౌతమ్ సరే తీసేస్తాలే, ముందు ఈ యాభై నోటును కూడా తీసుకో అంటూ ఆమె చేతిలో యాభై నోటును పెట్టి వెనుదిరిగి వస్తున్నాడు.
ఇంతలో దారిలో ఒకతను ఒకచేత్తో యాభై నోటును, మరొక చేత్తో అడ్రస్ వ్రాసుకున్న పేపర్ ను పట్టుకొని గౌతమ్ కు ఎదురొచ్చి చూడు బ్రదర్ ఈ అడ్రస్ ఎక్కడో చెప్పగలరా అంటూ అడిగాడు. గౌతమ్ అవ్వ ఇంటివైపు వేలుతో చూపిస్తూ, మనసులో ఆ బోర్డును వ్రాసిన వ్యక్తిని, అతడి ఉత్తమ మైన ఆలోచనకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకొంటూ ఆ బోర్డు ఉన్నచోటికి బయలు దేరాడు. ఆ బోర్డును తీసేయ్యడానికి కాదండోయ్. అలా నడుస్తూ ఆలోచిస్తున్నాడు, ఆ అవ్వ తన వద్దకు వచ్చిన వంద మందితోనూ ఆ బోర్డును తీసేయమని చెప్పినా ఇప్పటి వరకు ఎవ్వరూ తీసేయలేదు.
బోర్డు వద్దకు చేరుకొన్న గౌతమ్ తన బ్యాగులో ఉన్న పరిమనెంట్ మార్కర్ పెన్నుతో ఆ బోర్డులో ఉన్న ప్రతి అక్షరాన్ని మరొకసారి బాగా పెద్దగా దిద్దాడు. ఎందుకంటే ఆ బోర్డులోని అక్షరాలను ఇంకొంతమంది చూసి ఆ అవ్వకు సాయం చేయడానికి వెళ్తారని ఆశిస్తూ, ఆ బోర్డును వ్రాసిన ఆ మహానుభావుడి తెలివికి, ఆ ఆలోచనను అతనికి కల్పించిన అతడి "మంచి మనసుకు" మరొకసారి తన మనసులోనే ధన్యవాదాలు తెలుపుకొంటూ, తన మనసునిండా ఆనందాన్ని నింపుకొని ఆనందంగా నవ్వుకొంటూ తన ఇంటివైపు అడుగులు వేస్తున్నాడు.
చూశారా మిత్రులారా ! ఇక్కడ మంచి మనసు యొక్క గొప్పతనాన్ని. నిజానికి ఇక్కడ అవ్వకు యాభై నోట్లను ఇచ్చిన వందమంది కన్నా, అలా ఇవ్వడానికి ఆ వందమంది మనసులను ప్రేరేపించగలిగిన ఆ బోర్డును వ్రాసిన వ్యక్తి యొక్క మనసు ఎంత గొప్పదో కదా. అందుకే అన్నాను "మన మనసు ఒక బలమైన ఆయుధం" అని. ఎందుకంటే అది "ఎంతో మంది మనసులను ప్రేరేపించగలిగిన పవర్ ఫుల్ వెపన్ " కాబట్టి. ఇది నిజమని నిరూపించాలంటే నా కథనాన్ని చదివిన మీ మనసు కూడా "సహాయం అవసరమైన వారికి సహాయాన్ని అందించగలదని" 💐🤝🕉🙏
🤘సర్వే జనా సుఖినోభవంతు🤘
👌ధర్మో రక్షతి రక్షతః 👌
For Every Action Equal &
Opposite Reaction_

No comments:
Post a Comment