"యోగ" అంటే "కలయక". ఎక్కడ నుంచి మనం విడిపోయి వచ్చామో, తిరిగి ఆ అనంత శక్తి తో లయం అవటమే "యోగ " . మన స్వస్తానం ఏమిటో తెలుసుకోవటమే "యోగ " .
మానవ జీవితం అంతా ద్వందాల సమ్మిశ్రమం --- కష్టం -సుఖం, విచారం - సంతోషం, భాద - ఓదార్పు
ఇలా ప్రతి అనుభవం ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ప్రతి మనిషి అంతులేని ఆనందాన్ని కోరుకొంటాడు. కానీ అతను ఆనందాన్ని పొందే ప్రతి సంఘటన కి అవధి ఉంటుంది, కాల పరిమితి ఉంటుంది, ఆ తరవాత మళ్లా కొత్త ఆనందాన్ని వెతుక్కోవాలి.
"అవధి " లేని ఆనందమే పరమాత్మ/ అనంత చైతన్య శక్తి -- దాన్ని తెలుసుకోవటం - దాన్లో "లయం" కావటం - అవధి లేని ఆనందాన్ని పొందగలగటమే "యోగ".
శాస్త్రీయమైన "యోగాబ్యాస " పద్ధతుల ఆచరణతో తన ఆత్మని - పరమాత్మతో / లేదా / తనలోని చైతన్యశక్తిని -విశ్వచైతన్యశక్తి తో కలపగలగటమే "యోగ " .
ప్రతి వ్యక్తీ అన్ని సంసారిక ధర్మాలని పాటిస్తూ / లేదా / అన్నీ పరిత్యజించి కూడా "యోగి " కాగలడు.
ఈ "యోగ " సాధన ఎన్నో శాస్త్రీయ పద్ధతుల మిళితం. ఆసనాలు - హథం - అస్టాంగయోగం - ప్రాణాయామం - కుండలిని శక్తి - ధ్యాన సాధన - ఇవన్ని యోగం పేరు తోనే పిలవబడుతున్నాయి.
వీటిలో చాలా వరకు మన ఈ స్తూల శరీరాన్ని వశం చేసుకోనేవే ఎక్కువ. ఎందుకంటే శరీరానికి కావలసిన నిద్ర -ఆహారము-నివాసము, ఇంద్రియ నిగ్రహము ఇలాంటి విషయాలలో శిక్షణ నివ్వకపోతే శరీరం సహకరించదు. దీనికోసం " ఆసనాలు - ప్రాణాయామము " మొదలైన యోగ క్రియలు చెప్పబడ్డాయి. ఇవి ఎంతవరకు మనం నేర్చుకోవాలన్నది మనకి మనం గా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే " ఏదైనా పాత్రని శుభ్ర పరిస్తేనే కాని పాలు విరిగిపోవటాన్ని అరికట్టలేము. కావలసిన పాలు (జ్ఞానం ) కోసం ఈ పాత్రని ఎంత శుభ్రం చెయ్యాలో అంత యోగ (body yoga ) నేర్చుకోండి చాలు.
కాని నిజమైన "యోగి" భక్తి -జ్ఞాన -వైరాగ్య ఆచరణ తో ఏకాగ్రతతో చేసే "యోగ ధ్యానం" వల్ల ఏ ప్రయత్న లేకుండానే ప్రాణాయామం - కుండలిని శక్తియొక్కఊర్ధగతి తమంతతామే తెలుసుకోగలుగుతారు. దేహ భ్రాంతి కూడా నశిస్తుంది.
గీతాచార్యుడైన శ్రీకృష్ణభగవానుడు ఎంతో విపులంగా ధ్యానం ఎలా చెయ్యాలో, ఎలా మనస్సుని వశం చేసుకొని ఏకాగ్రత నిలపాలో తన ప్రియ భక్తుడికి అర్జునిడికి చెప్పారు. వెంటనే అర్జునుడు నువ్వు చెప్పేది బాగుంది, కాని మనస్సు చంచలం అది నిలబడదు అని థపీమని చెప్పేసాడు. అర్జునుడు లాంటి మహానుభావుడే సాధ్యం కాదన్నాడు మనం ఎంత చెప్పండి. కానీ భగవానుడు వదిలేయలేదు అర్ధం అయ్యే వరకు చెప్పారు . అన్నీ నాకోదిలేసి నువ్వు ప్రయతం చేస్తూ ఉండమన్నారు .
ప్రతి యుగం లోను మానవులు ఈ " ధ్యాన యోగం " ద్వార పరమాత్మని/ విశ్వశక్తిని తెలుసుకొంటూనే ఉన్నారు. యుగధర్మాల్ని బట్టి విధానాల్లో మార్పులు ఉంటాయి . "సత్యయుగం" లో లక్షల సంవత్సరాలు జీవించేవారు కాబట్టి వేల సంవత్సరాలు తపస్సు చేసారు . "త్రేతాయుగం " లో యజ్ఞ యాగాది క్రతువులు చేసారు. "ద్వాపరయుగం " లో ఆరాధన, భక్తి తో పొందారు. ఇది "కలియుగం" క్షీణ యుగం - ఈ యుగం లో మనస్సుని నిలపగలిగితే చాలు .
మన ప్రస్తుత కాలం లో ఎందరో "యోగులు"(మాస్టర్స్) ఎంతో సరళ మైన పద్ధతులలో ఈ "ధ్యాన యోగం" అందరి చేతా అబ్యాసం చేయిస్తున్నారు.
మనలోని " చైతన్య శక్తి ని విశ్వచైతన్య శక్తి తో ముడివేసేదే శ్వాస " ప్రాణాయామం కావచ్చు, కుండలిని కావచ్చు ఏదైనా ప్రాణశక్తి ని నియంత్రించి అనంత శక్తిని జయంచటమే "యోగ".
ఏది ఏమయినా ప్రతిమనిషి కి "ఆరోగ్యం, ఆనందం " ఈ రెండు కావలి. చక్కటి "ఆరోగ్యానికి - ఆయుర్ధాయానికి" , " అవధి లేని ఆనందానికి " మార్గం " ధ్యాన యోగం" ఒక్కటే.

No comments:
Post a Comment