Sunday, July 12, 2020

గురు పౌర్ణమి

గురు పౌర్ణమి

🙏ఈ ప్రపంచమంతటికీ వేదం ఆధారమైనది.అలాంటి వేదం మొత్తం ఒక రాశిలాగా ఉంటే, శ్రీమన్నారాయణుడే వ్యాసమహర్షిగా అవతరించి, వేదమును నాలుగు భాగములుగా (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదములుగా) విభజించి, లోకానికి ఎంతో ఉపకారం చేశారు. వ్యాస మహర్షి అవతరించిన ఆషాఢ పూర్ణిమ రోజును వ్యాస పూర్ణిమ, గురుపూర్ణిమ అని అంటారు.

వేదవ్యాస మహర్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము

1. వ్యాస మహర్షి తల్లిదండ్రుల పేర్లు సత్యవతి, పరాశరమహర్షి.
2. వేదాలను విభజించడం వలన వీరిని వేదవ్యాస మహర్షి అంటారు.
3. పరాశర మహర్షి యొక్క పుత్రుడు కాబట్టి పారాశరుడు అని వీరికి పేరు.
4. యమునా ద్వీపంలో జన్మించడం వలన కృష్ణ ద్వైపాయనుడు అని పిలిచేవారు.
5. బదరికాశ్రమంలో ఉండడం వలన బాదరాయణుడు అనే పేరు వచ్చింది.
6. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్న కాలాన్ని చాతుర్మాస్యం అంటాము.
7. వేదవ్యాస మహర్షి చాతుర్మాస్య కాలమందు బదరికాశ్రమంలో ఉండి బ్రహ్మసూత్రాలు, అష్టాదశ పురాణాలు, మహాభారతం మొదలైనవి రచించారు.
8. వేదవ్యాసుడు తన శిష్యులైన పైల, వైశంపాయన, జైమిని, సుమంత మహర్షులకు వేద,పురాణ, ఇతిహాసములను ఉపదేశించారు.
9. వేదవ్యాసుని మూలంగానే సనాతనమైన వైదిక ధర్మం ప్రకాశించింది.
10. వేదవ్యాస మహర్షి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమేనని మత్స్యపురాణం, విష్ణు పురాణం, మహాభారతం మొదలైనవి తెలియజేశాయి.
11. మనమంతా వేద వ్యాస భగవానుని పూజించి, వారి అనుగ్రహాన్ని పొందుదాం.
🙏
మిత్రులందరికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు*🙏

Source - whatsapp message

No comments:

Post a Comment