Thursday, January 7, 2021

గుణాలు మనసుపై చూపే ప్రభావాల నుండి బయటపడేదెలా?

🌸"గుణాలు మనసుపై చూపే ప్రభావాల నుండి బయటపడేదెలా "🌸

మనకి నిద్రలో ఏభావాలు, గుణాలు ఏర్పడటం లేదు.
మనం ఏదో ఒక పనిలో ఉన్నప్పుడే అవి కలుగుతున్నాయి.
ఎవరైనా మనకు ఇష్టం లేని పని చేస్తే కోపం వస్తుంది, మనకిష్టమైన పదార్థం చూస్తే తినాలని కోరిక కలుగుతుంది.
ఏదైనా ప్రమాదం జరిగితే భయం వేస్తుంది, మనం అనుకున్నది దక్కితే సంతోషం వస్తుంది, మనం కోరుకున్నది మరొకరికి దక్కితే అసూయ వస్తుంది.
మనం పరిశీలిస్తే ఇలా ప్రతి పని ద్వారా మనస్సులో ఏర్పడే గుణాలు మనకు తెలుస్తుంటాయి.
అలా ఏర్పడిన గుణాలను తెలుసుకోగలిగితే వాటి నుండి బయట పడగలుగుతాము.

భయం, సంతోషం, దుఃఖం, ఆందోళనలలో ఇలా ఒక్కొక్క గుణంలో మనసు ఒక్కొక్కరకంగా ఉందని మనం అనుకుంటాం.
కానీ అది నిజం కాదు, మనసు ఎప్పటి లాగానే ఉంది. దానిలోకి అనేక గుణాలు వచ్చి చేరుతున్నాయి.
అన్ని గుణాల మధ్యలో ఉన్న ఆ మనసును గుర్తించాలంటే నిరంతర విచారణతోనే అది సాధ్యమవుతుంది !

"గుణాలు లేని మనసు ఎలా ఉంటుంది "
మనం ఏదైనా పదార్ధాన్ని రుచిచూసి అందులో ఏది ఎక్కువ అయ్యిందో, ఏది తక్కువ అయ్యిందో చెప్పాలంటే దాని అసలు రుచిఏదో ముందు మనకి తెలిసివుండాలి.
మన మనసు విషయంలో కూడా మనం ఆశక్తిని సంపాదించాలి, మనసుకు వచ్చే అనేక గుణాలు తెలుస్తుంటాయి.
కానీ దాని అసలు రూపం మనకు తెలియడంలేదు, మనసు స్వరూపాన్ని కనుక్కోవటం కోసమే 'నేను ఎవరు ?' అనే విషయాన్ని తెలిపే ఆత్మసాధన.
ఇప్పుడు కూడా మన ఉనికి మనకి తెలుస్తుంది. ప్రపంచంలోని అనేక విషయాలలో మమేకమైన ఉనికి మాత్రమే తెలుస్తుంది.
విషయాలతో ఉన్నప్పుడు కోపం, భయం, దుఃఖం, సంతోషం వంటి అనేక గుణాలతో ఉంటాం.
మన మనసును మనం గమనించటం అలవాటైతే ప్రతి క్రియలోనూ మనసును ఆవరించే గుణాలు తెలుస్తాయి...
అప్పుడు గుణాలులేని నేను ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది !

🌷🌷🕉🌷🌷🕉🌷🌷🕉🌷🌷🕉

Source - Whatsapp Message

No comments:

Post a Comment