Monday, January 11, 2021

గతాలు కష్టమైనవి, జ్ఞాపకాలు ఇష్టమైనవి, స్మృతులు మధురమైనవి.

గతాలు కష్టమైనవి, జ్ఞాపకాలు ఇష్టమైనవి, స్మృతులు మధురమైనవి.

కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం.
కొన్ని సందర్భాలలో చిరునవ్వే స్పందన.

ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు "నమ్మకం". సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం మాత్రమే పడుతుంది.

కొందరు మన ఇష్టంతోని పనిలేకుండా మన జీవితంలోకి వచ్చి మన ఇష్టాలను అర్థం చేసుకొని మన జీవితంలో భాగమైపోతారు.

మరికొందరు మనం చూపించే ఇష్టాన్ని చులకనగా చూసి మన మనసును అర్థం చేసుకోకుండా మన జీవితం నుండి దూరంగా వెళ్ళిపోతారు.

విచిత్రమేంటో... మన మనసు ఆనందానికి చలిస్తుంది, భాదకు కూడా చలిస్తుంది.

మనం చేసే మంచి చెడుల అనుగుణంగానే ఫలితం ఉంటుంది. అనుభవించే వాటికీ కారణాలు మనం చేసే కార్యాల్లోనే కనబడతాయి.

జీవితంలో ఇద్దరిని ఎప్పుడు మరిచిపో కూడదు.

భాదాకన్నీటి రూపంలో కనులనుండి బయటకు వచ్చేది నిజమైతే... లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్నా గొప్పతనం మరుగున పడిపోతుంది.

అంతులేని కోరికలు, అర్తంకాని మనుషులు, చెప్పలేని మాటలు, చెరిగిపోని రోజులు, కానరాని కష్టాలు, కరిగిపోయే కోపాలు, తీర్చలేని బాధలు, తెలియని సంతోషాలు, మోయలేని బరువులు, జవాబులేని ప్రశ్నలు నిత్యం వేధిస్తూనే ఉంటాయి.

దీపం మీదా కోపం వస్తే చీకటి అయ్యేది మనకే.
ఆకలి మీదా కోపం వస్తే కడుపు మాడేది మనకే.
ప్రేమించిన వారిపై కోపం వస్తే ఒంటరి అయ్యేది మనమే.

చేతి నిండ డబ్బు ఉన్నప్పుడు ప్రపంచాన్ని మరిచి పోయేవారు,ఆ రూపాయి చేతిలో లేనప్పుడు ఈ ప్రపంచం తనని మరిచి పోతుందని గ్రహించాలి.

కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే... కలిసి ఉండడానికి వీలుకాదు, ఒక వేళా కలిసుంటే కొన్ని జీవితాలు నరక ప్రాయంగా మారుతాయి.

గర్వం తలకెక్కినవాడు ఎదుటి వారిలో ఉన్నా గొప్పతనాన్ని, తనలోని లోపాలను ఎప్పటికి... ఎప్పటికి గుర్తించలేడు.

మిత్రమా... నిన్ను గెలిపించడం కోసం తనకు తాను పూర్తిగా ఓడిపోయినా నాన్నను, నీకు వచ్చిన ప్రతీ కష్టాన్ని భరించిన అమ్మను అపార్థం చేసుకోవడమంటే... అమృతాన్ని అనుమానించినంత పాపం.

ఆత్మీయ మిత్రులకు శుభోదయం🙏

✡సర్వేజనాః సుఖినోభవంతు._*🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment