Tuesday, January 5, 2021

మంచి మాటలు...

ఆత్మీయ బంధుమిత్రులకు మార్గశిర మాస మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు ,మా ఇంటి దైవం శ్రీ గుంటి ఆంజనేయస్వామి వారు మరియు తిరుత్తుని సుబ్రహ్మణ్యం స్వామి వారి అనుగ్రహంతో మీకు మీ కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందం గా జీవించాలని కోరుకుంటూ .
మంగళవారం --: 05-01-2021 :-- ఈరోజు AVB మంచి మాట...లు

మనకు ఎన్ని పనులు ఉన్నా ఉదయాన్నే మనసుకు నచ్చిన వారిని పలకరించడంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం .

చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది వెంటనే మాయలో పడతాం లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది కానీ ! మంచి తొందరగా ఆకర్షించదు అందరిని ,నీకు నిదానంగా అర్థమైనా అర్థం చేసుకొని ఆచరిస్తే నిన్ను గొప్ప వాడిని చేస్తుంది .

మనం కంటితో చూడనివి , చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు ఎందుకంటే కొంతమంది చెప్పేమాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి . కుటుంబ బంధాలు తెగిపోతాయి అలాగే చచ్చిపోతాయి . ఇంకోసారి సరిచూసుకోండి తెగితే అతుక్కోవటం కష్టం ,ఒకవేళ అతుక్కున్న మనసులో ఉన్న అనుమానం ఎప్పటికి తీరదు ,మన మనసులో ఎప్పుడు అనుమానం ఉంటూనేవుంటుంది

మన సమస్యలకు పరిష్కారం కేవలం మన దగ్గరే ఉంటుంది ఎదుటి వాళ్ళవద్ద సూచనలు సలహాలు మాత్రమే ఉంటాయి గుర్తుంచుకో మిత్రమా ! .

పోయిన సంపదను కష్టపడి సంపాదించుకోవచ్చు మరచిపోయినా విషయాలను మళ్లీ చదువుకోని గుర్తు చేసుకోవచ్చు .చెడిపోయిన ఆరోగ్యాన్ని మందులు మరియు మీతాహారం ద్వారా బాగుచేసుకోవచ్చు కానీ వృధా అయి పోయిన సమయాన్ని తిరిగి పొందడం అసంభవం

సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment