Monday, January 11, 2021

పురోహితుల బాధ్యత.....

పురోహితుల బాధ్యత......

అసలు మనతెలుగులో ఎన్ని పండగలున్నాయో మీకు తెలుసా.......
భోగి,సంక్రాంతి,కనుమ,నరకచదుర్దశి ,దీపావళి,ఉగాది .....
ఇలా ఎన్నోవున్నాయ్ కదా.....
అసలు వాటికి అలాంటి పేర్లు ఎందుకుపెట్టారు,వాటి విలువలేంటి వాటిద్వారా మనం తెలుసుకో గలిగిందేంటి అనే విషయాలు చర్చించుకుందామామరి...
మనతెలుగు భాష గొప్ప ఔన్నత్యం గలది.
గొప్పసంస్కారం నేర్పుతుంది.
అసలుమన ఒక సంవత్సరంలో,ఆయనాలు,నెలలు, పక్షాలు, వారాలు, తిధులు,.....పరిశీలిస్తే.....
ఇందులో మన ముక్కోటి దేవతలు,ఆచారాలు,సంప్రదాయాలు,కనిపిస్తాయి.
అంతేకాదు సంగీతం,సాహిత్యం,చిత్రలేఖనం,గానం......వంటి అరవై నాలుగుకళలే కాకుండా
గణితం,ఆయుర్వేదం,తర్కం,వ్యాకరణం..వంటి అనేక శాస్త్రాలు బయటపడతాయ్.
అందుకే మన పూర్వులు ఒక్కో పండగకు ఒక్కో విశిష్టత పెట్టారు.అవన్నీ ఒక సంవత్సరంలో అనుభవించేటట్టు చేసి ఆచరించమన్నారు.
ఇలా అన్నిటిగురించి వీలు వెంబడి విశ్లేషించుకుందాం.
ముందు రేపు రాబోయే భోగి,సంక్రాంతి కనుమ పండగ ల గురించి తెలుసుకుందాం
సాధారణంగా పండగలన్నిటిలో పట్నవాసులకంటే పల్లెల లోనే ఎక్కువ ఆనందం కనిపిస్తుంది.
ఇక్కడ ఒక చిన్న విశ్లేషణ ఇవ్వాలి.
మన పూర్వులలోఎనభై తొంభై ఏళ్ళు బ్రతికే వృధ్ధులు మనకు తారసపడతారు.
అలాంటి వారి దగ్గర చాలా అనుభవాలుంటాయి.
వారు ముఖ్యంగా నిన్నటి చేదు అనుభవాలు వెంటనే మరిచిపోతారు. రేపటి రోజున అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలిఅని భావిస్తారు .ప్రస్తుత కాలానికి విలువనిఛ్చి చాలావరకుఅనందంగా గడుపుతారు.అంటే మనకున్న భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో వర్తమానానికే పెద్ద ప్రధాన్యత నిచ్చిగడిపేవారు.అసంతోషానికే ఒక పండగరోజు అనిపేరుపెట్టుకునేవారు.అలాంటివి మళ్లీమళ్లీ రావాలని అభిలషించేవారు.భావితరాలకు కూడా వాటిమధురిమలు పంచె ప్రయత్నం తోనే వాటిని ఒకతెలుగు సంవత్సర కాలంలో పొదిగి పెట్టుకునిఆస్వాదించేవారు.
అదే ఇప్పటి జన జీవనంలో లోపించింది.
గతాన్ని ద్వేషిస్తూ భవిష్యత్ కు అర్రులు చాస్తూ
వర్తమానంలో అందుకు తగిన ప్రణాళికలు లేక నిర్లిప్తంగా నిస్తేజంగా భారంగా గడిపి తన జీవితంలో ఏ అనుభూతి మిగుల్చుకోకుండా గడిపేస్తున్నారు.
తత్ ద్వారా అనారోగ్యపు అలవాట్లతో జీవితం అర్ధాంతరంగా అర్ధం లేకుండాముగించుకుంటున్నారు.
ఇంకా అసలు విషయానికి వస్తే పండగ అంటే చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ ఒకచోటకలిసి కలిగిన కాడికి పిండివంట లతో సామూహిక భోజనాలుచేసి వినోదించడమే.అనే అర్థం వాళ్ళలోజీర్ణించుకుపోయివుండేది.
ఇలా ఊరి జనాలందరు ఆరోగ్య కరంగా ఉండాలనే ఉద్దేశంతో భోగి పండగకు ముందు అన్ని వీధులు శుభ్రపరిచే క్రమంలో పేరుకుపోయిన చెత్తను గ్రామపొలిమేరలో కుప్పపెట్టి నిప్పంటించేవారు అందులో కొన్నిగంధపు చెక్కలుకూడా వేసే అలవాటు కొందరికుండేది.ఆతరువాత శరీర శుద్ది కి వేపచిగుర్లు,ఆముదం తాగేవారు.
అందుకే పండగరోజున ఎన్నిపిండివంటలు తిన్నా ఏవిధమైన అనారోగ్యం వుండేది కాదు. అంతే కాకుండా భోగికి లక్ష్మీ పూజ సంక్రాంతికి పితృదేవతారాధన,కనుమకు పశుసంరక్షణ ,పూజ,జరుపుకుంటాం .
దీన్నిబట్టి మనకు అర్ధమయిం దేంటంటే.....
పండగలన్నింటిలోను ఏదో ఒక సాంఘికప్రయోజనం,వ్యక్తిగత స్వేఛ్చా ఆనందం ఉండేలా ఒక ప్రణాళిక వుందనికదా...
అలాగే మనకున్న అన్నీపండ గలలోగొప్పగొప్ప ప్రధాన్యత లున్నాయి.
మన తెలుగులో చాలాగొప్ప పండితులున్నారు.వారంతా గొప్పగొప్ప సారాంశాన్ని పొందుపరిచి భావితరాలకు గ్రంథస్తం చేసి అందించారు.
ఉదాహరణకు
ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు .
పన్నెండు పౌర్ణములుకు మనకున్న 27 నక్షత్రాలలో చిత్తకు చైత్రం,విశాఖకు,వైశాఖం జ్యేష్ఠకు,జ్యేష్టం, పూర్వాషాడకు ఆషాడం, శ్రవణానికి, శ్రావణ మ్.పూర్వాభాద్రకు బాధ్రపదం, ఉత్తరాబాద్రకు ఆశ్వయుజం,కృత్తికకు,కార్తీకం,మృగశిరకు మార్గశిరం,పుష్యమికిపుష్యం,మఖకు మాఘం,ఉత్తరఫల్గుణికి,పాల్గుణం......12 నక్షత్రాలకు 12 పౌర్ణమిలు ఏర్పడతాయి.
15 తిధులు. ఒకరోజు తిధిలో నక్షత్రం తెలుకోవాలంటే
అప్పటివరకు గడిచిన నెలను 2 గా భావించి దాన్ని 2చేగుణించి అప్పటి తిధి సంఖ్యలో కలిపితే ఆ మొత్తంలో ఆరోజు నక్షత్రం లభిస్తుంది.
ఉదాహరణకు.కార్తీక శుద్ధ ద్వాదశి రోజున నక్షత్రం కావాలంటే చైత్రం నుండి ఆశ్వయుజం వరకు లెక్కిస్తే 7నెలలు దాన్ని2చేత గుణిస్తే 14 దానికి ద్వాదశి 12వ తిధిగనుక ఆ 12ఈ 14 కలిపితే 26 అవుతుంది .నక్షత్రాలు 27 గనుక 26 వ నక్షత్రం.ఉత్తరాభద్ర అవుతుంది .అదే బహుళ ద్వాదశి అనుకుంటే మరో15 జాతచేస్తే41 అవుతుంది.అందులో 27 తొలిగిస్తే 14 వ నక్షత్రం చిత్తగా గుర్తించవచ్చు. ఇదే క్రమంలో అన్ని తెలుసుకోవచ్చుఁ
ఇందులో గణితం కనిపించినట్టే ఆలోచిస్తే ఇప్పటి మనపండగలలో మిగతా శాస్త్రాలు కూడా అలాగే కనిపిస్తాయి.
ఇలాంటి వేదగణితాలు లెఖ్ఖకు మించి ఉన్నాయి. ఇలాచెప్పుకుంటూపోతే మనవేదాలలో అద్భుత సారాంశం కనిపిస్తుంది.
ఇప్పటి తరం యువ పురోహితులు తప్పనిసరిగా వేదాధ్యయనం అర్థవంతంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే మన సంస్కృతి సాంప్రదాయాలు చాదస్తాలని,మూఢ నమ్మకాలని ప్రజలకు మభ్యపెట్టి,భయపెట్టి బ్రాహ్మణులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి పబ్బం గడుపుకుంటున్నారనే అప ప్రద తీవ్రస్థాయిలో ఉంది.
వాటికి సరైన సమాధానం చెప్పేవిధంగా ఇప్పటి యువతరం తయారుకావాలి.పోటీకి దిగాలి.
అలా మాట్లాడేవారి కళ్ళుతెరిపించాలి.
శాస్త్రాలు, మంత్రాలు ,సంప్రదాయపు పోకడలు వాటివల్ల కలిగే ప్రయోజనాలు అందరికి అర్థవంతంగా చెప్పే శక్తిని కలిగివుండేలా యువ వైదికులు తయారుకావాలి.మనతర్వాత తరానికి మార్గ దర్శకులుగా నిలబడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడే మన సాంప్రదాయాలను ఇలాంటి పండగలు పబ్బాల ద్వారా వెలుగులోకి తెఛ్చి మళ్ళీ పూర్వపు వైభవాన్ని నిలబెట్టేలా కృషి చేయాలి అందుకు అందరం సంఘటితం కావాలి.ఐకమత్యంతో ఉండాలి.
ఇక్కడ మరొక విషయం.
పురజనుల హితం కోరుకున్నవాడు పురోహితుడుగా పిలువ బడుతున్నాడు.అపురోహితుడు మరో పురోహితునికలుపుకునే ప్రయత్నం మామూలే కానీ పురాజనులకోసమ్ తనున్నాడు కాబట్టి అపురోహితుని పురజనులే ఎక్కువగా కాపాడే బాధ్యత తీసుకోవాలి.అప్పుడేకొన్ని ధర్మాలు సంప్రదాయాలు నాలుగు కాలలపాటు పచ్చ గా ఉంటాయ.
పురోహితుడు ఒంటరి వాడుకాదు.
పురోహితుడు సత్ సాంప్రదాయమార్గదర్శి. ప్రజా హితుడు. ప్రజలమధ్య ప్రత్యేకత కలిగిన ఒక సంస్కర్త.
పురోహితునికో వెసులుబాటు ఉంది.
బహుగా పాండిత్యం తో బ్రతకనూ గలడు-
ఏ పాండిత్యo లేకపోతే తన పై మీది తుండుగుడ్డతో గౌరవంగా స్వయం పాకం పేరుతో యాచించనూ గలడు.
అది ఇతర వృత్తులలో కనిపించదు.
సంస్కృతం కఠిన భాష కాదు.అమృత తుల్యమైన అర్ధవంత మైన సాక్షాత్ ఆ భగవంతునే
తనవద్దకు రప్పించుకునే గొప్పభాష.
అర్ధం మీకు కొరుకుడు పడక ఇతరులకు చెప్పే దైర్యంలేక ఆశీర్వచనం పేరుతో వేద మంత్రాలతో ఇతరుల తలపైవేసే అక్షింతలు అవతలి వ్యక్తికి శిరోభారం తప్ప ఏ ప్రయోజనం ఉండదు.
అందులో అర్ధం మీకు తెల్సి ఇతరులకు విషాదీకరించగలిగితే ఆయన మీకాళ్ల పై పడి వందనం చేసితరిస్తాడు.మీరులేనిది జన్మకు సాఫల్యత కలగదని గ్రహించి మీ మీ వెనకే వుండి మిమ్మల్ని కాపాడు కుంటాడు.
ఆ స్తితికి మీరు చేరే వరకు మీరు ముందు వేదాలను అర్థవంతంగా నేర్చుకోండి.మీ సత్తా చాటండి.

Source - Whatsapp Message

No comments:

Post a Comment