Saturday, January 2, 2021

*"క్రొత్త శరీరం యొక్క నిర్మాణం"* (Building of a new physical body)

🟢 పితామహ పత్రీజీ 27-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 27-09-2020🔸

Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.

"క్రొత్త శరీరం యొక్క నిర్మాణం"
(Building of a new physical body)

"ఒకరి శరీర ఆకృతి యొక్క విధి, పుట్టుకకు పూర్వస్థితి (pre natal state) లోనే, ఏ శరీరంలో అయితే ఉందో అందులోనే మొదలవుతుంది మరియు అది జీవితపర్యంతం, ఇంకా మరణానంతరం స్వర్గంలో కాలం గడపటం పూర్తయ్యేంత వరకు ఉంటుంది."

"గతజన్మ అంతిమ దశలోనే, ఈ జన్మలో, ఈ శరీరం ఏ జాతిలో పుట్టాలనేది నిర్ణయించబడుతుంది."

"ఏ జాతికి చెందిన కుటుంబంలో ఈ శరీర నిర్మాణం జరుగనుందో, శరీర- నేను యొక్క విధిని అనుసరించి, దాని అవసరాలను పరిగణలోనికి తీసుకుని, ఆ కుటుంబాన్ని ఎన్నుకోవటం జరుగుతుంది."

"కుటుంబాన్ని మరియు శరీర నిర్మాణాన్ని చేపట్టవలసిన సమయాన్ని ఎన్నుకోవటంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. శరీర- నేను యొక్క భౌతిక విధి ఇతరుల జీవితాలలోని అనేకానేకమైన పరిస్థితులు మరియు ప్రజా వ్యవహారాలకు సరిపడినట్లుగా ఉండాలి. సమయం, ప్రదేశం, పరిస్థితులు అన్నీ కూడా ముఖ్యమైన అంశాలు. నిర్థేశ సమయానికి ముందుగాని, వెనుకగాని పుట్టటమంటే అర్థం, వారు సామాజిక క్రమానికి అనుగుణంగా లేరని. ఎప్పుడయితే ఎంపిక జరుగుతుందో, జనన సమయంలో, శ్వాస- రూపం తల్లిదండ్రుల ఆవరణలోకి ప్రవేశిస్తుంది."

" శ్వాస- రూపం యొక్క రూపం తాలూకు ఉనికి కారణంగానే పుట్టుక సంభవిస్తుంది. స్త్రీ శరీరంలో, వారిద్దరి సూక్ష్మక్రిములను కలపడం ద్వారా కాంతి పదార్థంలో వాటిని విలీనం చేస్తుంది మరియు కేంద్రస్థానంలో క్రొత్త శరీర నిర్మాణం మొదలుపెట్టిన సార్వత్రిక శక్తులను కూడా వీటితో ఏకీకృతం చేస్తుంది."

"ఈ కాంతి పదార్థం, చిన్న సూక్ష్మశరీరం లేక కాంతి- పదార్థ శరీరంగా అభివృద్ధి చెంది, ఈ రూపం నుంచి గురుతుల (impression)ను తీసుకుంటుంది."

"విలీనమైన కణాలలో, కాంతి- పదార్థ శరీరం యొక్క విస్తరణ, భౌతిక కణాల విభజనకు దారితీస్తుంది మరియు కాంతి - పదార్థ శరీరంలో రూపం తీసుకోగల శక్తి, కణ విభజన మరి వాటి వృద్ధి క్రమంగా పిండంగా పెరిగే వరకు జరుగుతూనే ఉంటుంది."

"మూడింటి ఏకీకృతమే వాటి బంధం మరియు అవి గంట మోత వలె, ఆదేశం వలె లేక బాకా ఊదినట్లుగా ఉంటుంది. ధాతు సంబంధమైనవి ఏవైతే నేరుగా నిర్మాణంతో సంబంధం కలిగి ఉన్నాయో, వాటి క్రమంలో అవి పనిచేసేందుకు, ఆదేశాలు జారీ చేయటం జరుగుతుంది, ఇవి భౌతికమైన చెవులకు వినపడవు."

"ప్రపంచంలో, ప్రతి నిముషం, వందల కొద్దీ గంటల మోతలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. కాని ప్రతి పిలుపు, ఆ నిర్థిష్టమైన శరీర నిర్మాణానికి సంబంధించిన ధాతువులు మాత్రమే ఆ పిలుపుకు స్పందిస్తాయి. ఏ ధాతువులైతే ఈ నిర్థిష్ట శరీరం, క్రొత్త శరీరం తాలూకు యజమాని యొక్క పూర్వ శరీరంతో ఒక నిర్థిష్ట విధానంలో సంబంధం కలిగి ఉన్నాయో, వారే ఈ శరీర నిర్మాణం చేపడతారు."

"ఎప్పుడయితే వారికి ఆదేశాలు అందుతాయో, కొన్ని ధాతువులు స్వేచ్ఛగా ఉంటాయి, కొన్ని మొక్కలకు బంధింపబడి మరి కొన్ని జంతువులకు బంధింపబడి ఉంటాయి. ఏవైతే స్వేచ్ఛగా ఉన్నాయో, అవి తక్షణమే వెళతాయి, మరి మొక్కలలో ఉన్నవి విడుదల చేయబడతాయి. జంతు శరీరాలలో ఉన్నవి వాటి సహజ మరణానంతరం కాని జంతువులను విధ్వంసం చేసినప్పుడు కాని విడుదల అవుతాయి. ఈ విధంగా, మానవ శరీర భాగాలలో నిర్వహణ చేపట్టిన ధాతు సంబంధమైనవి (elementals) తల్లి యొక్క భౌతిక ఆవరణలో ఒక దగ్గరకు వచ్చి, ఆమె దేహంలోనికి కాంతి, శ్వాస, నీరు మరియు ఆహారం ద్వారా ప్రవేశిస్తాయి."

"నాలుగు రకాల ధాతువులతో పుట్టుకకు పూర్వస్థితిలో భౌతిక శరీర నిర్మాణం జరుగుతుంది. ఏ రకం ధాతువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందో దానిననుసరించి మనిషి కొన్ని సామర్థ్యాలు కలిగి ఉండటం లేక వైకల్యాలు కలిగి ఉండటం, యవ్వనదశలో కాని లేక తరువాత జీవితకాలంలో కాని సంభవిస్తుంది."

"ఏ ధాతువు యొక్క ప్రభావం ఎక్కువగా లేక తక్కువగా ఉందో అవి దానిననుసరించి, ఒకరు వారి వృత్తిని ఎన్నుకోవటం జరుగుతుంది; దీని కారణంగానే కొన్ని పరిస్థితులను ఎదురుకోవలసి వస్తుంది."

"పుట్టుకకు పూర్వస్థితిలో, ధాతు సంబంధమైన వాటితో కలిసి పనిచేస్తూ భౌతిక పదార్థంలోని శ్వాసా- రూపం పై పూర్వ ఆలోచనాక్రమం మరియు ఆలోచన యొక్క గురుతులు/గీతలు (lines) ఆధారంగా శరీర నిర్మాణం జరుగుతుంది."

💖 ఎస్. పత్రి 💖

తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment