Tuesday, January 5, 2021

"ఆహారం" (Food) "కాంతి వెనుకకు తిరిగి వచ్చుట (The Return Of Light)"

🟢 పితామహ పత్రీజీ 05-01-2021 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 హుబ్బళ్ళి🔹

Harold W పర్సివాల్రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు

"ఆహారం" (Food) "కాంతి వెనుకకు తిరిగి వచ్చుట (The Return Of Light)"

▪️"మానవుడు పంపిన లేదా ప్రకృతిలోకి వెళ్లడానికి అనుమతించిన కాంతి తిరిగి మానవుని దగ్గరికి వస్తుంది ".

▪️"ఇది మళ్లీ బయటకు వెళ్లి మళ్లీ వెనుకకు తిరిగి వస్తుంది".

▪️"అనేకమైనటు వంటి మిశ్రమ విషయాలు మరియు బంధముల నుండి కాంతిని వెనుకకు తిరిగి రమ్మని కోరేంత వరకు మరియు వాటి నుంచి కాంతికి విడుదల లభించేంత వరకు అది బయటకు వెళ్లడం మరలా వెనుకకు తిరిగి రావడం అనేది కొనసాగుతూనే ఉంటుంది తరువాత ,ఇక అది బయటకు వెళ్ళదు".

▪️"కాంతి స్వయంగా లేదా ఇంద్రియనిగ్రహం ద్వారా మానవుని ప్రజ్ఞ ఆవరణకు తిరిగి చేరుకుంటుంది".

▪️" ప్రకృతిలోకి వెళ్ళి న కాంతి ఆహారం ద్వారా స్వయంగా వెనుకకు తిరిగి వస్తుంది.ప్రకృతిలో వ్యాపించి ఉన్న ప్రత్యేకమైన కాంతి యొక్క భాగాలను ఆహారంలోకి ఆహ్వానించడం జరుగుతుంది,తరువాత దానిని తిరిగి పొందడానికి అ సారాన్ని గ్రహించడం జరుగుతుంది".

▪️" ఆహారం ద్వారా తీసుకునే కాంతి అంతా కూడా ఆ ఆహారాన్ని తీసుకునేవానిది కాదు.ఇతర కర్తల నుంచి వచ్చిన కాంతి కూడా అందులో ఉంటుంది మరియు ఆ ఆహారం తీసుకున్న వారిని అది ప్రభావితం చేస్తుంది".

▪️" ఆహారాన్ని చూస్తూ మరియు తింటుండగా,దాని వాసన ,రుచి మరియు ఆ సమయంలో మాట్లాడే మాటలు ,వినే మాటలు అన్నీ కూడా జీర్ణక్రియ పై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి .ఈ సమయంలో లాలజల గ్రంధులు వాటి సారాలను ,పొట్టలో ఉరే గ్యాస్ట్రిక్ రసాలను కడుపు, కాలేయం పిత్తాన్ని ,క్లోమం దాని ద్రవాలను మరియు పేగులు వాటి యొక్క స్రావాలను అందించటం జరుగుతుంది. నాలుగు ఇంద్రియాలు ,ఈ స్రావాల యొక్క మరియు వాటి లోని ఆమ్లాల యెుక్క చర్యలకు కారణమవుతాయి. ఆ విధంగా ఆహారంలో సరైన మార్పులు చేయబడతాయి.కాంతి ప్రజ్ఞ పరమైన ఆవరణకు స్వయంగా తిరిగి వస్తుంది .మానవునికి తెలియకుండా ,అతని ప్రమేయం లేకుండానే ఇది జరుగుతుంది కాని త్రాగుడు మాదకద్రవ్యాలు తీసుకోవడం లేదా అధికంగా లైంగిక విషయాలపట్ల ఆసక్తి లాంటి అలవాట్లు కాంతి స్వయంగా వెనుకకు తిరిగి రావడాన్ని ఆటంకపరచవచ్చు".

▪️" ప్రకృతి నుంచి కాంతి మానవునిలోకి తిరిగి రావడం అనేది కొనసాగుతూనే ఉంటుంది .ఈ కాంతి స్వయంగా వెనుకకు తిరిగి రాకుంటే కర్త కొంత వ్యవధిలోనే సమస్తాన్ని పోగొట్టుకొని నష్టపోతాడు".

💖 ఎస్.పత్రి 💖

అనువాదం: అనురాధ మేడం(Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment