Thursday, January 14, 2021

"స్వీయ పరిమితులు" (Self imposed limitations)

🟢 పితామహ పత్రీజీ 14-01-2021 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 "కొటాల", "కలికిరి"🔹

"స్వీయ పరిమితులు"
(Self imposed limitations)

Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.

▪️" ఇచ్ఛ అనేది స్వతంత్రమైనది కాదు, ఇది స్వతంత్రంగా ఉండజాలదు ; ఇది అన్ని సమయాలలో చాలా షరతులతో కూడుకుని ఉంటుంది."

▪️"ప్రతి కోరిక ఒక ఇచ్ఛ లేదా సంకల్పం, కానీ ఏ కోరికైతే ప్రతికూలమైన కోరికను నియంత్రిస్తుందో దానిని ఇచ్చ అని పిలువవచ్చు. అయితే ఇచ్ఛగా పిలువబడే ఒకానొక కోరిక ఎల్లవేళలా ఇతర కోరికలను నియంత్రిస్తుంది అని చెప్పలేము."

▪️"చర్యలు, కోరికలు మరియు ఆలోచనలు చేయడానికి శారీరక అవరోధాలు లేనప్పటికీ, ఏ సమయంలోనూ మానవునికి సంకల్ప స్వేచ్ఛ లేదు. మానవునికి పరిమితమైన సంకల్ప స్వేచ్ఛ ఉంది. అతడే పరిమితులను నిర్ణయించాడు. అతని బంధాలు, అడ్డంకులు లేదా పరిమితులన్నీ అతను స్వయంగా కల్పించుకున్నవే కాని అతను కనుక సంకల్పిస్తే వాటిని తొలగించుకోవడంలో అతను సర్వస్వతంత్రుడు. అతను ఆ స్వేచ్ఛను ఉపయోగించనంత కాలం అవి అలాగే ఉంటాయి మరియు అవి అతనిని పరిమితం చేస్తాయి."

▪️"గత ఆలోచనలు భౌతిక శరీరంలో బాహ్యీకరణ చెందుతాయి మరియు శరీర పరిమితులకు ఆనవాలుగా నిలుస్తాయి, ఇవే పరిమితులు ఇచ్ఛకు కూడా వర్తిస్తాయి. ఈ భౌతిక పరిమితులు జీవిత ప్రారంభ సమయం నుంచి మొదలవుతాయి. జాతి, దేశం మరియు జాతీయత, ఎటువంటి కుటుంబంలో ఈ శరీరం జన్మ తీసుకుంటుంది, స్త్రీ లేదా పురుష లింగం, ఎటువంటి శరీరం, శారీరక వంశపారంపర్యత, ప్రధాన ప్రాపంచిక వృత్తులు, కొన్ని ప్రత్యేకమైన వ్యాధులు, కొన్ని ప్రమాదాలు, జీవితంలో క్లిష్టమైన సంఘటనలు, ఎటువంటి మరణం మరియు మరణ సమయం వరకు కొనసాగుతాయి. ఒక వ్యక్తి, తన అతీంద్రియ స్వభావం లో భాగమైనటువంటి అతని స్వభావం, ప్రవృత్తి, మనోభావాలు, అభిరుచులు, అంతర్ దృష్టి, గ్రహణశక్తి, తార్కిక సామర్థ్యం మరియు మానసిక లక్షణములు కలిగి ఉండడం లేదా అవి లోపించి ఉండడం."

▪️"పరిమితులనేవి స్పష్టంగా ఉంటాయి, ప్రధానంగా శారీరక పరిమితులు చాలా స్పష్టంగా ఉంటాయి, ప్రజలు దీనినే విధి అని వ్యవహరిస్తుంటారు."

▪️"మానవుడు, తన అతీంద్రియ, మానసిక పరిస్థితులతో సహా, అతను ఉన్న పరిస్థితులను అంగీకరించడానికి లేదా అభ్యంతరం చెప్పడానికి ఎల్లప్పుడూ స్వేచ్ఛ కలిగి ఉంటాడు."

▪️"మానవుడికున్న అనేక కోరికలలో ఒక కోరిక అతనిని ఒక చర్య చేపట్టడానికి ఒత్తిడి తీసుకువచ్చినా అతను దానిని అంగీకరించవచ్చు లేదా అభ్యంతరం తెలపడానికి స్వేచ్ఛ కలిగి ఉంటాడు; ఇది మరొక కోరిక అభిమతం కావచ్చు. ఇటువంటి స్వేచ్ఛ పట్ల స్వేచ్ఛాగత మానసం కేంద్రీకృతమై ఉంటుంది. ఇదే అతనికున్న ఏకైక స్వేచ్ఛ."

▪️"ఈ స్వేచ్ఛను, అతని ఇచ్ఛానుసారం అనుసరిస్తాడు. ఈ కోరిక అతీంద్రియ సంబంధమైనది. ప్రతి మానవుడికి అటువంటి స్వేచ్ఛ ఉంటుంది మరియు ఆలోచించడం ద్వారా స్వేచ్ఛాగత మానసానికి దానిని విస్తరింపజేసుకోవచ్చు."

💖 ఎస్.పత్రి 💖

తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment