భారత దేశం - ఉపఖండం - ఇండియా - ఇండస్ - హిదుష్ - ఇండికే - యిండోయి - హింద్ - ఫైవ్ ఇండీస్ - సింద్ - ఇండియా ది గ్రేటర్ - ఇండియా ది మైనర్ - మిడిల్ ఇండియా - ఇండియా మైనర్ . ఇవి కామన్ ఎరా కి పూర్వం నుండి ఆధినిక చరిత్ర వరకు భారతదేశాన్ని ఇతర ప్రాంతాల వాళ్ళు పిలిచిన పేర్లు.
మొహానికి రంగులు వేసుకొని బ్రతికే బఫూన్ నటుల దగ్గర నుండి చారిత్రకారులుగా చెప్పుకొని బ్రతికే పరాన్న భుక్కుల వరకు మన చరిత్రని వక్రీకరించి ప్రజలని మోసం చేస్తూ వచ్చారు కానీ ఏ ప్రభుత్వం కూడా ఇవి పాఠశాలలో పిల్లలకి తెలియచేసే ప్రయత్నం మాత్రం చేయలేదు ఇంతవరకు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పాఠ్య ప్రణాళికలో సగానికి పైగా NCERT నుండి తీసుకొని ముద్రించినవే. అలాగే ఆయా రాష్ట్రప్రభుత్వాల చరిత్ర పుస్తకాలలో 75% అన్నీ అబద్ధాలే ఉన్నాయి. ఢిల్లీ లోని కుతుబ్ మీనార్ గురుంచి RTI ద్వారా రిఫెరెన్స్ అడిగితే అలాంటి రిఫరెన్స్ ఏదీ లేదని జవాబు ఇచ్చింది NCERT ! మరి కుతుబ్ మీనార్ ని ఎవరు ఎప్పుడు కట్టారు ? మరి పిల్లలకి కుత్బుద్దీన్ ఐబక్ కట్టాడని ఎందుకు చెప్తున్నారు ? రిఫరెన్స్ లేకుండా కేవలం ఊహాజనిత ఆధారాల మీద చరిత్ర చెపుతారా విద్యార్ధులకి ?
సైఫ్ అలీ ఖాన్ ఇండియా అనేది బ్రిటీష్ వాళ్ళు వచ్చిన తరువాత ప్రపంచానికి ఆ పేరు తెలిసింది అని వాగాడు. మరి వీడు చదివింది BA. వీడికి ఉన్న మాదరస్సా పరిజ్ఞానం తో ఇండియా పేరు బ్రిటీష్ వాళ్ళు వచ్చిన తరువాతే తెలిసింది అంటాడు దానికీ లెఫ్ట్,కాంగీ అనుచరులు వంత పాడారు. ఒకసారి ఈ సైఫ్ అలీ ఖాన్ గాడికి ఈ పోస్ట్ లో ఉన్న విషయం చేరాలని ఆశిస్తున్నాను. ఏ ఏ సమయాల్లో భారత్ ని ఎవరు ఎలా పిలిచారో ఒక సారి క్రింది వివరాలు చదవండి.
1. c. 486 bc --- హిందూష్ [Hindush]--- రిఫరెన్స్ : నక్ష్ - ఇ - రుస్తమ్ [ Naqsh-e Rostam-Fars Province, Iran].
2. c. 440 bc -- ఇండియా [India] -- రిఫరెన్స్ : హేరోడోటుశ్ [Herodotus] ఎక్కడ ? Thurii, Italy, ఇతనిని ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటాయి పాశ్చత్య దేశాలు.
3. c. 300 bc -- ఇండియా /ఇండికే [India /Indike ] రిఫరెన్స్ : మెగస్తనీస్ [Megasthenes] గ్రీకు చరిత్ర కారుడు. ఇతను వ్రాసిన పుస్తకం కేవలం భారత దేశం గురుంచి : Indika, a book on ancient India.
4. c. 140 ad . ---ఇండోయ్ / ఇండో [Indoi /Indou ] రిఫరెన్స్ ; ఆర్రిన్ [ Arrian] Athens, Greece. ఇతను Alexander మీద పుస్తకం వ్రాశాడు.
5. c. 590 ad. -- హింద్ [Hind ]. రిఫరెన్స్: ఇష్టాఖ్రీ [Ishtakhri ] [Abu Ishaq Ibrahim ibn Muhammad al-Farisi al-Istakhri] Iran.
6. c. 650 ad . -- ఫైవ్ ఇండీస్ [Five Indees ] రిఫరెన్స్ : XuanZang, చైనా .
7. c. 944 ad -- హింద్ - సింద్ [Hind - Sindh ] రిఫరెన్స్ : మసుదీ [Al-Masudi ] బాగ్దాద్ , ఇరాక్.
8. 1020 ad -- హింద్ [Hind ] రిఫరెన్స్ : అల్ - బిరుని [ Abu Rayhan al-Biruni] ఇరాన్.
9. 1205 ad -- హింద్ [Hind ] రిఫరెన్స్ : హాసన్ నిజామీ [Hasan Nizami] కవి,చరిత్ర కారుడు, ఇరాన్.
10. 1298 ad -- ఇండియా ది గ్రేటర్ , ఇండియా ది మైనర్ , మిడిల్ ఇండియా [ India The Greater - India the Minor - Middle India ] రిఫరెన్స్ : మార్కో పోలో [ Marco Polo ].
11. c. 1328 ad -- ఇండియా [India ] . రిఫరెన్స్ : ఫ్లయిర్ జోర్డానుస్ [Flair Jordanus ] క్రైస్తవ మత ప్రచారకుడు.
12. 1404 ad -- ఇండియా మైనర్ [ India Minor ] . రిఫరెన్స్ : క్లావిజో [ Ruy González de Clavijo ] మాడ్రిడ్,స్పెయిన్ .
సింధు నదిని హిందూ నది అని పిలిచారు నోరు తిరగక. అసలు హిందు అనే పదమే లేదు పూర్వం. ముస్లిమ్స్ సింధు నది దగ్గరగా ఉన్న ప్రజలని చూసి వాళ్ళ విగ్రహారాధన చూసి తమ ఎడారి మతంలో విగ్రహారాధన లేదు కాబట్టి వీళ్ళు కాఫీర్లు - హిందు అని పిలవడం మొదలుపెట్టారు వాళ్ళ భాషలో హిందు అంటే కాఫిర్ అని అర్ధం. అసలు సనాతన ధర్మం ని ఎవరు ఎప్పుడు స్థాపించారో ఎవరికి తెలియదు ఎందుకంటే మతం అనేది ఎవరన్నా ఒక సిద్ధాంత ప్రాతిపదికన స్థాపించిన దానిని అంటారు కానీ సనాతన ధర్మం ని హిందు మతం కింద మార్చేశారు శుంఠలు. సింధు నదిని గ్రీకులు ఇండస్ అని పిలిచేవారు అప్పట్లో దానిని కాస్తా హిందు నది అని ఆ సింధు నది దగ్గరగా ఉన్న ప్రజలని హిందువులు అని పిలిచారు తప్పితే అసలు హిందు అనే పదమే లేదు. ఇండస్ నది పేరు మీద ఇండియా పదం పుట్టించారు కానీ అంతకుముందు భరతుడు ఏలిన దేశం కాబట్టి భారత దేశం అన్నారు. భారత్ - ఇండియా అనేవి బ్రిటీషర్ల కంటే శతాబ్దాల ముందు నుండి విదేశీయుల నోట్లో ఉన్నాయి. ఈ సైఫ్ అలీ ఖాన్ గాడికి వాడికి వత్తాసు పలికే వాళ్ళకి ఎవరన్నా చెప్పాలి ! ఇలాంటి వార్తలని వ్రాసే జర్నలిస్టులకి కూడా ఈ విషయం తెలియాలి.
ఇంతకీ కుతుబ్ మీనార్ ఎవరు కట్టారో ఆధారాలు లేనప్పుడు ఎందుకు ఆ పేరు ఇంకా కొనసాగిస్తున్నారు? మార్చాల్సినవి చాలానే ఉన్నాయి. చాలా పకడ్బందీగా మన చరిత్రని మార్చేశారు మన చవటలు. నిజం చెపితే ఏడుస్తారు. ఇంకా చెప్పాల్సినవి , మార్చాల్సినవి చాలా ఉన్నాయి. మరో పోస్టులో ఇంకొన్ని నిజాలు చారిత్రకి చెందినవి తెలుసుకుందాం !
'జంబూ ద్వీపే,భరత వర్షే , భరత ఖండే ' అంటూ శుభకార్యాలలో మనం చెప్పుకునే సంకల్పం వేల సంవత్సరాలనుండి అమలులో ఉంది అన్నది సత్యం.
జైహింద్ !
పార్థసారథి
No comments:
Post a Comment