Tuesday, February 2, 2021

మంచి మాటలు

గొంగళి పురుగు అని అసహ్యించుకున్నవారు

సీతాకోకచిలుకలా మారిన తరువాత

వర్ణించడానికి మాటలు వెతుకుతుంటారు.....

మనిషి జీవితం కూడా అంతే...

కష్టపడుతున్నప్పుడు రాని ఎవరూ...

నువ్వు సుఖపడుతున్నప్పుడు
వెతుక్కొని మరీ వస్తారు.

మనం చేసే ప్రతి పనిని ధర్మం
కనిపెడుతూనే ఉంటుంది.

అన్ని దేవుడు చూస్తూనే ఉంటాడు.

అంతరాత్మ పరిశీలిస్తూనే ఉంటుంది.

ఇక పగలు..రాత్రి.. సూర్యుడు.. చంద్రుడు
ఉండనే ఉన్నాయి......

ఇన్నిటి ఎదుట మనం ఏదైనా

తప్పు చేస్తున్నామంటే.....
అది ఆత్మవంచనే అవుతుంది.....!!


నీ విజయాలను నీకన్నా
చిన్నవారితో పంచుకో..
స్ఫూర్తితో వారు నిన్ను అనుసరిస్తారు

నీ ఓటములను నీకన్నా
పెద్దవారితో పంచుకో
అనుభవంతో వారు నీకు బోధిస్తారు.


ఎకర ఎకరాలుగా భూమిని
కొంటున్న మనిషిని చూసి

స్మశానం నవ్వింది.....
"నిన్ను కొనబోయేది నేనేనని...

నీకు ఇవ్వబోయేది ఆరడుగులేనని..."


ఆశ ఉన్నవారు....
ఆనందంలో మాత్రమే బ్రతకగలరు

ఆశయం ఉన్నవారు...
బాధలో కూడా ఆనందంగా బ్రతకగలరు.


తెలివికి నిదర్శనం తప్పులు వెదకడం కాదు..

పరిష్కారాలను సూచించగలగడం......


విలైతే నలుగురు కి సాయం చేయి

గొప్పలు చెప్పకు ,

ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకు

నిజాలు మాట్లాడు ,

అబద్ధాలతో అందమైన జీవితం ఊహించుకోకు.

ఇంకొకరి తో పోల్చుకొని, మనశ్శాంతి కోల్పోకు

👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment