Monday, February 8, 2021

సనాతన ఆరోగ్య సూత్రములు

🍁సనాతన ఆరోగ్య సూత్రములు🍁

భోజనాగ్రే సదా పధ్యం, లవణార్ద్రక భక్షణమ్, రోచనం దీపనం వహ్ని, జిహ్వాకంఠ విశోధనమ్.

తా: భోజనాత్పూర్వము అల్లము, సైంధవలవణము కలిపి నమిలి తినిన జీర్ణశక్తి వృద్ధిచెందుతుంది. గొంతు నాలుక పరిశుద్ధమై, రుచి కలుగుతుంది.

భుక్త్వా శతపదం గచ్ఛేత్, శనై స్తేన తు జాయతే, అన్నసంఘాత శైథిల్యం, గ్రీవాజానుకటీ సుఖమ్. భుక్తోప విశత స్తుందం, శయానస్య తు పుష్టతా, ఆయుశ్చం క్రమమాణస్య, మృత్యు ర్ధావతి ధావతః

తా: భోజనానంతరము నూరడుగులు నడచిన అన్నము యుక్తస్థానమున చేరి, మెడ, నడుము, మోకాళ్లు వీటియందు సుఖము కలుగును.భుజించిన తోడనే కదలక కూర్చున్నచో పొట్ట పెరుగును; పండుకొన్న వారికి కొవ్వు పెరుగును; మెల్లగా అటునిటు తిరిగిన ఆయుర్వృద్ధి కలుగును; పరుగెత్తినచో ఆయుఃక్షీణము.

భుక్త్వా శతపదం గచ్చేత్, తాంబూలం తదనంతరమ్, వామపార్శ్వేతు శయనం, ఔషధై: కిం ప్రయోజనమ్.

తా: భోజనానంతరము నూరడుగులు నడచి, తదనంతరము తాంబూలసేవనము చేసి, ఎడమవైపున శయనించుచో యిక ఔషధము లెందుకు? (ఆరోగ్యవంతుడై యుండునని భావము.)

అనాత్మవంతః పశువత్ భుంజతే యోఽప్రమాణతః, రోగానీకస్య తే మూలమ్, అజీర్ణం ప్రాప్నువంతిహి.

తా: ఎవరైతే మిత మనేది లేకుండా ఎల్లప్పుడూ ఎదో ఒకటి నములుతూ ఉంటారో వారు అజీర్ణవ్యాధికి గుఱి అవుతారు. అజీర్ణమే సర్వరోగములకును మూలము. (మానవులు ఆ యా వేళలయందే మితముగా భుజించవలెను.)

భుంజానో న బహు బ్రూయాత్, న నిందేదపి కంచన, జుగుప్సికధాం నైవ, శృణుయాదపి ఆ వతెత్.

తా: భోజనసమయమున అధికముగా మాట్లాడరాదు. పరనిందా ప్రసంగము అసలే కూడదు. కధాప్రసంగములు చేయరాదు, విననూ రాదు..

🌾సర్వేజనాఃశుఖినోభవంతు🙌🏼సమస్త సన్మంగళానిభవంతు🎋

Source - Whatsapp Message

No comments:

Post a Comment