కాకి చేసిన సూచన:
మాకు ఆరో తరగతిలో అప్పల స్వామి గారనే టీచరు
ఉండేవారు. ఆయన లెక్కలు చెప్పేవారు. అప్పుడప్పుడు సరదాగా కధలూ చెప్పేవారు ఆయన చెప్పిన కధే ఈ కాకి చేసిన సూచన.
ఓ ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టు మీద
మొవ్వులో కాకి గూడు పెట్టింది.కాకి దాని పిల్ల కావు కావు మంటూ సందడిగా ఉండేవి.
ఆ ఇంట్లో బయట డాబా మీద కొబ్బరికాయ ముక్కలు ఎండ బెట్టారు.పిల్లకాకికి ఆ ముక్కలు తెచ్చుకొని తినాలని పించి తల్లి కాకిని అడిగింది పోయి తినొస్తా పోనా వద్దా అని.
తల్లి కాకి నవ్వి అలాగే పోదువుగాని
ఆముక్కలకి కాపలా ఎవరున్నారో చెప్పు అంది.పిల్లకాకి చూసొచ్చి అమ్మా ఓ ముసలిది కాపలా ఉంది
అని చెప్పింది. ఇప్పుడు వద్దు రేపు చూసి చెప్పని తను బజారులో తెచ్చిన పకోడి ముక్కలు దాని నోట్లో కుక్కింది.
తెల్లవారింది మధ్యాహ్నం ముక్కలు ఎండబెట్టారు ఇపుడు ముసలిదాని మనవరాలు పద్దెనిమిదేళ్ళది కాపలా ఉంది అంది.పోయి నీ క్కావలసిన ముక్కలు తెచ్చుకో అంది.
ముక్కలు తెచ్చుకున్న పిల్లకాకి తల్లి ని అడిగింది ఎందుకమ్మా? ముసలది వుంటే వద్దని పడుచు పిల్ల ఉంటే పోయి రమ్మన్నావు అని తల్లికాకి నవ్వు తూ చెప్పింది.
ముసలామెకు వేరే పనేమీ ఉండదు ఒకే పని దీక్ష గా కాపలా కాయడం.
కుర్రదాని మనసు రకరకాలు గా తిరుగుతూ ఉంటుంది పనిమీద కన్నా పనికి రాని వాటి మీదే ధ్యాస అందుకే నీ పని సులువుగా అవుతుందని కుర్రది కాపలా ఉన్నప్పుడు పొమ్మన్నా అని చెప్పింది.
ఈ కధ ఎప్పటికీ నూతనమే ఈ నాటి యువత కి సినిమా లు పబ్బులు అభిమాన సంఘాలు. సీనియర్ సిటిజన్ కి తప్పని బరువు బాధ్యతలు.
Source - Whatsapp Message

No comments:
Post a Comment