Friday, March 12, 2021

జయమ్ము నిశ్చయంబురా

✌️జయమ్ము నిశ్చయంబురా🚩
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

నొప్పిలేని నిమిషమేది
జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున
నీరసించి నిలిచిపోతె
నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
దీక్షకన్న సారెదెవరురా
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది నీకె నువ్వు బాసటయ్యితే

నింగి ఎంత గొప్పదైన
రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైన
ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా
పిడుగువంటి పిడికిలెత్తి ఉరుము వల్లె హుంకరిస్తె
దిక్కులన్ని పిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదనుతొక్కి
అవధులన్ని అధిగమించరా
విధిత్తమాపరాక్రమించరా విశాల విశ్వమాక్రమించరా
జలధిసైతం ఆపలేని జ్వాలవోలె ప్రజ్వలించరా

పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య
ఒక్కనాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గి ఉండ సాగరాన నిదుకుంటు
తూరుపింట తేలుతుందిరా
నిశావిలాసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేనురా

🎊💦🌹🦚🌈

Source - Whatsapp Message

No comments:

Post a Comment