Saturday, March 6, 2021

కాబట్టి, మనం వదిలించుకోవడం నేర్చుకోవాలి, నేర్పాలి.

వెతుక్కోవడం, పట్టుకోవడం, ఎదగడము, వదలడం

జీవితం లో ఎదగాలంటే, భౌతికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, మనం మన లక్ష సాధనకు వెతుక్కోవడం, పట్టుకివడం, ఎదగడము, వదలడము అన్నవి తెలుసుకోవాలి.

ముందుగా మన గమ్యం తెలుసుకోవాలి.

ఆ గమ్యానికి చేరడానికి కావలసింది వెతుక్కోవాలి.

ఉదాహరణకు మనః శాంతి కోసం తగిన సాధన తెలిపే వారిని వెతుక్కోవాలి.
వారిని ప్రసన్నం చేసుకొని వారిని గమ్యం చేరేంతవరకు పట్టుకోవాలి.
వారు మనని వదిలించుకోవడానికి ప్రయత్నం చేసినా మనం వారిని వదలకుండా పట్టుకోవాలి.
వారు చూపిన సాధన చేస్తూ వారి కనుసన్నలలో ఎదగాలి.

గమ్యం చేరాక నిర్మొహమాటంగా వారిని వదిలేయాలి. లేక పోతే వారు మనకు ఆటంకం అయి మన బంధరాహిత స్థితికి అడ్డు వస్తారు.

కాబట్టి వెతుక్కోవడం, పట్టుకోవడం, ఎదగడము వదలడం వీటిలో మొదటి మూడు వల్ల వృద్ధి ఉంటుంది, కానీ వదలకపోవడం వల్ల, మన అభివృద్ధి కుంటుపడి పోతుంది.

మనం వదలలేనటువంటి వారు ఒక నిచ్చేన లేదా ఒక నదిలో నావ లాంటి వారు,

అవసరం తీరగానే వారిని నిర్మొహమాటంగా వదిలేయాలి.

ఇలా వదలడం చేతకాక ఇందరో ఇంకా బంధ స్థితిలో ఉన్నారు,

ఎంత జ్ఞానం సంపాదించినా, అనుభవము గాడించివారిలో కూడా ఈ "వదలడం" సాధ్యము కాక ఇబ్బంది పడుతున్నారు.

కాబట్టి, మనం వదిలించుకోవడం నేర్చుకోవాలి, నేర్పాలి.

సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment