Sunday, March 7, 2021

సమభావం బహు ముఖ్యం

🌞సమభావం బహు ముఖ్యం 🌞

🍁ఒకోసారి కొన్ని పిచ్చి భావాలు ఏర్పడతాయి.

"నేనే అందరికంటే గొప్పఅన్న భావం.
మనకు తరుచుగా వస్తూ ఉంటుంది.
"నేనే గొప్ప"
"నాకన్నా గొప్పవారు లేరు" అంటూ,
ఇదే భావాన్ని మాటిమాటికీ జపిస్తూ మనలో అహంకారంని పెంచి పోషిస్తూ ఉంటాము.

అందరూ తనని గుర్తించాలి అని,
తనని మాత్రమే పొగడాలనే దుగ్ధ ఎక్కువ అవుతుంది. పొగడ్తలు వెతుక్కుంటుది.
పొగిడేవాళ్ళని దగ్గరకు చేర్చుతుంది.
ఇలా ఉంటుంది సోత్కర్ష ( "స్వగొప్ప తనం").
తనని తాను అందరికన్నా బిన్నుడనే భావమే అహంకారం.
ఇలా ప్రత్యేకత ఏర్పర్చుకొని,
తనకి తాను గిరి గీసు కొని
కూర్చోవడం మనకి బాగా అలవాటు అయిపోయింది.

ఇది పెరిగి పెరిగి ,
నా సాంప్రదాయము,
నా కులం,
నా మతం,
ఇవే గొప్ప అని,
మిగిలినవి పనికి రావని విభేదించడం అలవాటైపోయింది.
ఇక ఇది మనం కొలిచే దైవానికి కూడా చేరిపోయింది. మన వ్యక్తిగత దైవము మాత్రమే దైవము అని అంతకు మించి వెరే దైవం లేదని ఇతరులతో
స్పర్ధలు పెంచుకున్నాం.

ఇలా మనని మనం గొప్ప గా ఊహిస్తూ,
మన సాంప్రదాయము,
మన కులం,
మన మతం అంటూ కాలక్షేపం చేస్తున్నాం,
మన అంతరంగాన్ని స్పర్ధ లతో నింపేశాము.

ఇదా మనకు జ్ఞానం నేర్పింది?
జ్ఞానం అంటే ఇలా విభేదాలకు పెంచు కుంటూ పోవడమా?
అసలు జ్ఞానం అంటె ఏమిటి?
జ్ఞానం మన అజ్ఞానాన్ని తొలగించాలి.
జ్ఞానం ఒక వెలుగు లాంటిది
చీకటిని తొలగించాలి.
సత్య ఆవిష్కరణ జరగాలి.
అంతవరకు ఉన్న అజ్ఞాన భావాలు పారి పోవాలి.

మరి ఏమిటా జ్ఞానం?

చాలా సింపుల్ గా చెప్పాలి అంటే
"అబేధ దర్శనం జ్ఞానము" అంటుంది ఒక ఉపనిషత్తు. ఇందులో ఎంతో విషయం ఉంది.

"అబేధము" అంటే "సమభావం" ఉండడము.

భౌతికము లో అన్ని రెండుగా కనిపిస్తాయి.
శరీర ధారణ జరగగానే
"నేను - శరీరం" అన్న ధ్వందము, ఏర్పడింది.
ఈ ధ్వందం "నేను నాది"
అన్న దానిలో స్థిర పడింది.
"నేను నా వాళ్ళు",
"నేను నా ఇల్లు",
"నేను నా కులం",
"నేను నా మతం",
"నేను నా దైవం".
ఇలా నా కన్నా భిన్నమైనది
ఇంకొకటి ఉంది,
అది నాది అన్న భావం ఏర్పడింది.
నేను ఇతరులకన్న గొప్ప,
నేను ఉన్నది,
నేను భావిస్తున్నది,
అది
కులం కానీ,
మతం కానీ
దైవం కానీ
నాది మాత్రమే గొప్ప,
నా దగ్గర ఉన్నది వేరేవారి దగ్గర ఉండడానికి వీలు లేదు.
ఇలా ధ్వందం లో కొట్టుకు పోతున్నాము.

మరి జ్ఞానం ఏమంటోంది
సమ భావము ఉంచుకో అంటోంది.
భాహ్యనికి అన్ని రెండుగా కనిపించవచ్చు కాని,
అన్ని ఒకటే అన్న భావం ఉంచుకో అంటోంది.

నువ్వు నేను అంటున్నది పరిమితం చేసుకోకు దానిని విస్తరించు అంటోంది జ్ఞానం.
నీకు కనబడే దానిలో,
నువ్వు చూసే వ్యక్తులలో,
ఈ నేను నీ విస్తరించుకో అంటోంది.

కులం అన్నది వృత్తి బట్టి ఏర్పడింది, అని అసలు వృత్తులు వేరు
అవి అందరిలో సమంగా ఉన్నాయి అంటోంది జ్ఞానం.

ఉదాహరణకి నిద్ర ఒక వృత్తి,
ఇంద్రియముల ద్వారా జ్ఞానం గ్రహించడం ఇంకొక వృత్తి.
ఇలా వృత్తులు అందరికి ఒకటే.

మతం అంటే దైవం పట్ల ఒక నిశ్చిత అభిప్రాయం. నిరాకార, నిర్గుణ నామ రహిత పరమాత్మ పై ఒకే అభిప్రాయం ఉంటుంది
కానీ వేరే వేరే అభిప్రాయాలు ఉండడానికి వీలు లేదు.

ఇలా సమ భావం పెంచుకుంటూ పోవాలి.
మన భావలలో సమభావము రావాలి.
ప్రకృతి లో జరిగే మార్పుల పై సమభావం ఉండాలి, కర్మ ఫలాలపైన సమభావం ఉండాలి.
ఇక్కడ సమభావము ఆ కర్మలో జయం అపజయం పై (success or failure పై).

ఇలా సమభావాని పెంచుకుంటూ పోతే మన.అజ్ఞానం తొలిగి జ్ఞానంలో ఉంటాము.
🍁🌞🍁🌞🍁🌞సేకరణ. మానస సరోవరం
.

Source - Whatsapp Message

No comments:

Post a Comment