💥తెనాలి రామకృష్ణుడు
🕉️🌞🌎🏵️🌼🚩
ఒక నాడు కృష్ణదేవరాయలు మారు వేషములో నగరములో సంచరించు చుండగా ఒక గుడిసె మీదికి గుమ్మడి తీగ పాకి కాయలు కాచి యుండెను. అంతలో ఒక కాకి గుమ్మడి తొడిమను కొరికింది. కాయ తెగి జర జర జారి డుబుక్కు మని శబ్దము చేయుచు క్రిందకు జారి క్రింద నున్న మేక పై పడి తే అది మే మే అని అరిచింది. మరుదినం సభలో అయన " పుటుక్కు జర జర డుబుక్కు మే" దీని భావమెవరైనా చెప్పగలరా?
అని అడిగాడట. రామకృష్ణుడు లేచి
గుడిసె మీది గుమ్మడి కాయ
తొడిమపుటుక్కున కాకి కొరక జర జర జారి డుబుక్కున కింది మేక పై
బడ మేక మే మే అని యరిచెరాయలు రామకృష్ణుని మెచ్చుకొన్నాడు.(పాత పెద్దబాల శిక్ష నుండి)
మన తెలుగు లో ఒక సామెత వుంది ఎవరి నోట్లో నైనా మాట దాగ కుంటే వాడికి చెప్పకు చెప్తే 'గుఱ్ఱం మూతికి బట్ట గట్టినట్లే' అంటారు. ఇది ఏ గుఱ్ఱం సంగతో తెలుసు కుందాం
ఒకానొక రోజు రాయల వారు తన ముద్దుల భార్య చిన్నాదేవి మందిరానికి వెళ్ళారు. ఆమెను ముద్దు పెట్టుకుందామని ముందుకు వంగారు అప్పుడు ఆవిడ పెద్దగా తుమ్మిందట. శకునం బాగా లేదని రాయలవారు వెళ్లిపోయారట. ఈ విషయం దాసీలు పసి గట్టారు. విషయం బయటికి పొక్కగూడదని రాణీ గారు దాసీలను ఆజ్ఞాపించారు. అయితే ఒక దాసీ మాత్రం ఆపుకోలేక తన కూతురికి చెప్పిందట. ఆ దాసీ కూతురు రామకృష్ణుని ఇంట్లో పని చేస్తుందట. అది పని చేసుకుంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వుంటే రామకృష్ణుడికి అనుమానం వచ్చి విషయమేమిటని గద్దించి అడిగే సరికి అది నిజం చెప్పేసింది. రామకృష్ణుడు అంతటితో ఆగక తన గుఱ్ఱం నోటికి బట్ట గట్టి విజయనగర వీధుల్లో తిప్పుతున్నాడు. చూసిన వారంతా దాని మూతికి బట్ట ఎందుకు కట్టావని అడుగు తుంటే ఏం
చెప్పమంటారు?నిన్న రాత్రి అంతఃపురం లో రాజుగారు చిన్నాదేవి గారిని ముద్దు పెట్టుకోబోతే రాణీ గారు తుమ్మారు,రాజుగారు శకునం బాగా లేదని వెళ్లిపోయారట అది ఈ గుఱ్ఱం చూసింది.. దీని నోట మాట దాగదు అందుకని దీని మూతికి బట్ట కట్టి పెట్టాను. అని అందరితోనూ చెప్పాడు. ఈ విషయం రాయలకు తెలిసి కోపంగా నాకు నీ ముఖం చూపించకు అని ఆజ్ఞా పించారు. తర్వాత ఏదో చమత్కారం చేసి రాయల అనుగ్రహం పొందాడు.రామకృష్ణుడు. అది వేరే కథ. అప్పటినుండీ 'గుఱ్ఱం మూతికి బట్ట గట్టినట్లు' అనే జాతీయం వచ్చింది.
సేకరణ. మానస సరోవరం 👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment