రామాయణం లో పిడకలవేట అని మనవాళ్ళు తరుచూ వాడుతూ వుంటారు.రామాయణానికీ
పిడకల వేట కో సంబంధమేమిటి?అని సందేహం కలుగుతుంది.అది పిడకల వేట కాదు
పితకాల వేట.అని చెప్తారు.అది ప్రజల నోళ్ళలో పడి పిడకలవేటగా మారిందని అంటారు.
ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా అప్రస్తుత ప్రసంగం చేస్తే
"ఏమిటీ రామాయణం లో పిడకల వేట" అంటూ విసుక్కుంటారు.'పానకం లో పుడక' అని కూడా అంటూ వుంటారు.
అసలు విషయానికి వస్తే లంకా నగరి లో రామునిచే చంపబడిన కాష్టం యిప్పటికీ ఆరిపోకుండా రగులు తూనే వున్నదని మన జానపద కథల్లో ప్రస్తావిస్తూనే వుంటారు.
దానికి సంబంధించిన ఆధారాన్ని కూడా వాళ్ళు కళ్ళకు కట్టినట్లు చెబుతారు.
రావణుని భార్య మండోదరి,మయుని కుమార్తె.ఆయన తన కుమార్తెకు నీవు నిత్య సుమంగళి గా ఉంటావని వరం యిచ్చాడు.రావణ సంహారం జరిగిన తర్వాత మండోదరి
తండ్రి చెంతకు వెళ్లి కన్నీటితో 'నీవు యిచ్చిన వరం సంగతి ఏమయింది?అని అడిగింది.
అప్పుడు మయుడు ఆలోచించి "నీ భర్త చితి కాలి చల్లారిపోకుండా రెండు పూటలా పిడకలు తీసుకొని వచ్చి చితిమీద వేస్తూ వుండు.అది ఆరిపోననంత కాలం నీకు వైధవ్యం
ప్రాప్తించదు"అని చెప్పాడు.అప్పటినుండీ మండోదరి తన పతి చితి ఆరిపోకుండా పిడకల వేట ప్రారంభించిందనీ అందుకనే పిడకలు ఏరుకొని వచ్చి వేస్తూనే ఉందనీ అందుకే అది యింకా వెలుగుతూనే వుందనీఅంటారు.ఇది వాస్తవం కానప్పటికీ నిజమేనేమో నని భ్రాంతి కలిగిస్తుంది.
ఇప్పటికీ జానపదులు ఆమె పిడకలు యేరుతూనే వుంది.యింకా రావణ కాష్టం మండుతూనే వున్నదని.అంటూ వుంటారు.
ఏవైనా పగలు,ద్వేషాలు చాలా కాలం అలాగే వుంటే కూడా వాళ్ళ పగలు,ద్వేషాలూ 'రావణకాష్టం' లా యింకా రగులుతూనే వున్నాయి' అని అంటూ వుంటారు.
మా వూర్లో మా యింటి దగ్గర మీనాక్షమ్మ అనే ఒక ధనికురాలైన విధవ వుండేది.ఆవిడ
తనకున్న పెద్ద స్థలం లో చిన్న చిన్న ఇల్లు పది దాకా కట్టించింది.దానికి "మీనాక్షమ్మ
కాలనీ"అని పేరు పెట్టింది.ఆవిడ చనిపోయి చాలా కాలం అయింది దాదాపు(50 ఏళ్ళు
అయి వుంటుంది)తర్వాత అక్కడ వుండేవాళ్ళు మీనాక్షమ్మ కాలనీ మీనాక్షమ్మ కాలనీ లో ఉంటున్నాము అనే వాళ్ళు దానికి అక్కడ అద్దెకుండే దేశాయి శ్రీనివాసరావు అనే ఆయన మీనాక్షమ్మ కాలనీ మీనాక్షమ్మ కాలనీ,కాలనీ అంటే యింకా ఎన్నాళ్ళు కాలుతుందిరా?కాలి ఎప్పుడో బూడిదై పోయింటే .అదేమైనా రావణ కాష్టమా?యింకా కాలడానికి అని నవ్వించేవారు. (ఈ వ్యాసం ఆంధ్రభూమి పత్రికలో చాలాకాలం క్రితం వచ్చింది) ఇది కాక వేరేవేరే కథలువుండొచ్చు.
సేకరణ. మానస సరోవరం 👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment