జ్ఞాన జ్యోతి
మాయ అంటే లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేయడం.
మైండ్ గేమ్
చీకట్లో త్రాడు తొక్కి పాము అని భ్రమపడి భయపడతాం. తీరా దీపపు కాంతిలో చూస్తే అది త్రాడు.
ఇప్పుడు మనల్ని భయపెట్టింది?
తాడా లేక పామా?
పాముని సృష్టించింది ఎవరు? అది త్రాడు లాగ బ్రమింప చేసింది ఎవరు .?
అది ఎందుకు భయపెట్టింది?
ఇందులో త్రాడు తప్పు లేదు. పాము తప్పు అంతకంటే లేదు.
పాముని సృష్టించింది మనస్సు.
భయపడింది మనస్సే. లేనిదానిని ఉన్నట్లుగా కల్పించుకుని భయపడింది. ఒక్కసారి కాంతి రాగానే పాము మరణించింది.
అంటే మాయమైంది.
త్రాడు మాత్రమే మిగిలింది. అంటే అక్కడ పాము సృష్టి జరగలేదు.
కానీ మనస్సు సంకల్పించి సృష్టించి భయమనే భావనకి లోనైంది.
సృష్టే జరగకుండా సృష్టి జరిగినట్లు కనబడటమే మాయ..
దీనినే అజ్ఞానం అంటారు. అజ్ఞానం తోలగాలి అంటే, జ్ఞానమనే దీపం వెలిగించాలి. అప్పుడు సృష్టి అబద్దం అని తెలుస్తుంది.
ఇది తెలిస్తే నీకు అసలు జన్మే లేదు. నువ్వు జన్మించనూ లేదని అర్థమవుతుంది.
ఈ జ్ఞానం రానంతవరకు పునరపి జననం
పునరపి మరణం.. కష్టసుఖాలను ద్వంద్వాలను అనుభవించాల్సిందే .
జ్ఞాన దీపం వెలిగిన రోజు ద్వంద్వాలు కష్టసుఖాలు అనేవి వుండవు..
అంతా అద్వైతమే..
అహం బ్రహ్మాస్మి..
నేనే ఆది అంతం.
సాధనతోనే ఈ స్థితి అనుభవానికి వస్తుంది..
అంటే ఎప్పుడైతే మీరు నామరూపక్రియలను వదిలేసి ఆకాశంతో ఏకమౌతారో, అప్పుడు జ్ఞాన జ్యోతి వెలుగుతుంది.
ఆ జ్ఞాన జ్యోతి కోసమే మన సాధన.
No comments:
Post a Comment