Thursday, October 9, 2025

 *ఆచార్య సద్బోధన*
                  ➖➖➖

*ఈ సంసార సాగరంలో - కృష్ణ నామస్మరణ అనే పడవలో - మన ప్రయాణం ఎలా సాగించాలి?*```

*ఈరోజుల్లో మనకున్న కొద్దిపాటి సమయంలో - అందరి మాట ఒక్కటే! ‘భగవంతుని కోసం సమయం కేటాయించడానికి మేము సంసార విషయాలలో తీరిక లేకుండా ఉన్నాము’ అని,   ‘ఎంత ప్రయత్నించినా సమయం కుదరడం లేదు’ అంటుంటారు చాలా మంది...

*ఇది కేవలము మనలోపలి బద్దకం అనే అనుకోవాలి!

*గంగా నదిలో స్నానం చేసేటపుడు నదీ వేగము ఎక్కువగా ఉంటుంది...
ఏమరుపాటుగా ఉంటే ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం కూడా లేకపోలేదు!
అలా జరగకుండా నది ఒడ్డున ఇనుప స్తంభాలు పాతి గొలుసులు వేలాడదీస్తారు...

*మనం ఆ గొలుసును పట్టుకొని ఎంతసేపైనా నదిలో స్నానం చేయవచ్చు, ఏమీ కాదు...

*అలాగే మనం దైనందిన జీవితంలో    ఏ పని చేస్తున్నా - అంటే ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వృత్తి, విద్య, ఏ పని చేస్తున్నా సరే మన మనసును, అంతఃకరణమును మాత్రం కృష్ణ నామము  అనే గొలుసుతో లగ్నం చేసి ...(అంటే పట్టుకొని ఉండాలి) అప్పుడు ఈ సంసారంలో మనం ఇష్టం వచ్చినట్టు విహరించవచ్చు ...

*కానీ కృష్ణ నామాన్ని(గొలుసు) మాత్రం వదలకూడదు, ఒకవేళ వదిలితిమా ఈ సంసారము అనే నదీ ప్రవాహంలో  పడి కొట్టుకుపోక తప్పదు...
*అపుడు మనలను ఉద్ధరించే నాథుడే లేడు, భగవంతుడు కూడా ఏమి చేయలేడు...
*ఈ సంసార సాగరం - భవసాగరం దాటాలంటే - మన ప్రయాణం కేవలం నిత్య కృష్ణ నామస్మరణతో మాత్రమే సాధ్యం...``

No comments:

Post a Comment