Sunday, November 1, 2026

 🦚జ్ఞానప్రసూనాలు🚩

1) బయటనుంచి నీకు ప్రేరణ కలిగించేది ఏదీ లేదు.ఏ ప్రేరణ అయినా నీ నుంచి కలగవలసిందే.

2) నీ దేహామే అర్థనారీశ్వరం లోపలున్నది శివుడు వెలుపలున్నది పార్వతి.

3) కలకు నిద్ర ఆధారం.మెలకువకు మాయ ఆధారం.
మొదటిది చిన మాయ రెండవది పెను మాయ.

4) ఎఱుకలేని జీవుడు చేసే ప్రయాణమే జన్మపరంపరలు.
ఎఱుకతో ఉన్న జీవుడు (దేవుడు) చేసే ప్రయాణమే అవతారాలు.

5) పరికరం వలన ఆ పరికరానికి ఎట్టి ప్రయోజనమూ ఉండదు. పరికరాన్ని ఉపయోగించుకునే వాడికే ఆ ప్రయోజనం ఉండేది.భగవంతుని చేతిలో నీవొక పరికరం మాత్రమే.

No comments:

Post a Comment