Tuesday, December 28, 2021

ఈ కథ చిన్నదైనా...* *ఇచ్చే సందేశం పెద్దది

🍁ఈ కథ చిన్నదైనా...
ఇచ్చే సందేశం పెద్దది
🍀🌹🌀🌻💥🦚

ఒకసారి "నవ్వుకు" "ఏడుపుకు"గొడవ అయ్యింది.
అప్పుడు "నవ్వు" చెప్పింది ఏడుపుకు....నీవంటే ఎవరు ఇష్టపడరు నీవు ఉంటే అందరికి బాధ .దేవుణ్ణి కూడా నిందిస్తారు అని....

దానికి సమాధానంగా "ఏడుపు"చెప్పింది... నీవు అతి అయితే జనానికి చాలా కష్టం అని.

నాయొక్క విలువ నీకు తెలియదు నా దగ్గర ఎన్నెన్నో భావాలు పంచుకొని ఒక్కసారి ఏడిస్తే మనసుకు సమాధానం అవుతుంది.

మనుషుల విలువ ఏమిటి అన్నది తెలియడానికే దేవుడు నన్ను సృష్టించాడు.

మనిషి చచ్చినప్పుడు ఎంతమంది ఏడుస్తారో దానిలోనే మనిషి యొక్క వ్యక్తిత్వం అర్థం అవుతుంది...

అందుకు "నవ్వు"...చెప్పింది నేనే శ్రేష్టం నా కంటే అందమైన అనుభవమే లేదు...

ఏడుపు... లేదు నేనే శ్రేష్టం నేను ఉంటే మనిషి భావనలకు విలువ...

ఇదంతా చూసిన దేవుడు నవ్వుకుని.... నవ్వు,ఏడుపు దగ్గరకు వచ్చాడు.మనిషి జీవితంలో మీరిద్దరూ ముఖ్యమే. అది ఎలానో చెబుతాను రండి.

అని ఒక గుడిసె దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్న ఒక వాస్తవాన్ని చూపించాడు.

ఒక బీద తల్లి తనకు మిగుల్చుకున్న అన్నాన్ని బిడ్డకు తినిపించి ఎంతో ఆనందం పొందుతుంటుంది.

అదే టైం లో అమ్మ తనకు పెట్టబోయే ముద్దను బిడ్డ తిరిగి అమ్మ నోటికే అందిస్తూ అమ్మా నీవూ తిను. నీకు కూడా ఆకలి అయ్యుంటుంది అన్నది.అప్పుడు ఆ తల్లి ఆనందంతో ఏడుపు వస్తుంటే నవ్వుతూ కళ్ళు తుడుచుకుంది....

కాబట్టి ఈ "నవ్వు"
"ఏడుపుల" కలయిక మనిషి జీవితంలో మరిచిపోలేని క్షణం....

మీరిద్దరూ చేరిన ఈ క్షణం చాలా అపురూపం....

నవ్వు ఏడుపు రెండు చేరితే మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుంది...

కాబట్టి మనిషి జీవితంలో మీ ఇద్దరు ముఖ్యమే...*

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment