Friday, December 31, 2021

శ్రీ రమణ మహర్షి బోధ🧘‍♀️* 🕉️🌞🌏🌙🌟🚩 *మరణం అంటే ఏమిటి.?*

🧘‍♂️శ్రీ రమణ మహర్షి బోధ🧘‍♀️
🕉️🌞🌏🌙🌟🚩

మరణం అంటే ఏమిటి.?


రెండు జన్మల మధ్య విరామమే మరణం...


చావు పుట్టుకలు, బాధ, సంతోషం, ప్రపంచం, అహం ఇవన్నీ మనసులోనే వున్నాయి.


మనసు నశిస్తే ఇవన్నీ నశించిపోతాయి.


మనసు నాశనమవవలసిందే కాని తాత్కాలిక ప్రశాంతత కాదు.


నిద్రలో మనసు శాంతిగా వుండి ఏమి తెలుసుకోలేదు. నిద్ర లేచిన తర్వాత నీవు పూర్వములాగానే వుంటావు. బాధకు అంతేమి వుండదు. మనసు నశిస్తేనే దుఃఖం అంతమైపోతుంది.


ఏదైతే ఉన్నదో అది ఉండనేవున్నది. లేనిది ఎపుడూ లేదు. పుట్టేది ఏది, చనిపోయేది ఏది. మేల్కోవడమే జననం, నిద్ర మరణం.


ఒక వ్యక్తి చనిపోయినా, జీవించినా ఎందుకు వారి గురించి ఆలోచించాలి. వారి గురించి ఎందుకు బాధపడాలి. వారికి బంధాలన్ని పోయినవి కదా. నీ అహంను నాశనం చేయాలి. అహం నశిస్తే ఇక బాధ ఏముంది. జీవించి వున్నపుడే అహం నశించిపోతే ఇక అంతా శాంతియే. అహం నశించకపోతే బ్రతికినంత కాలం చావు గురించి భయపడాలి.


గాఢనిద్రలో ఎందుకు హాయిగా వున్నామంటే దేహభావన లేదు కాబట్టి. జ్ఞాని కూడా విదేహముక్తిని గురించే మాట్లాడుతాడు. శరీరం ఎపుడు వదిలేద్దామా అని జ్ఞాని కూడా ఎదురు చూస్తూంటాడు.


కూలివాడు తన తలమీద మూటను గమ్యస్థానమును చేర్చిన తర్వాత మూటదించుకుని ఎలాగా బంధవిముక్తుడగునో అలాగే జ్ఞాని కూడా శరీరాన్ని ఎపుడెపుడు విడిచిపెట్టి సుఖంగా ఉందామా అని ఎదురుచూస్తూంటాడు.


బాహ్య దృష్టిని వదలి ఆత్మగానే వుండిపోతే ఏ బాధ వుండదు.


శోకించడం నిజమైన ప్రేమకు చిహ్నం కాదు. నిజమైన ప్రేమ ఆత్మగా ఉండడమే. అలాంటి బాధకరమైన సందర్భాలలో జ్ఞానులతో సాహచర్యం వలన బాధ ఉపశమిస్తుంది.

🕉️🌞🌏🌙🌟🚩

🙏🙏🌹🌹🌻🌹🌹🙏🙏

సేకరణ

తొందరపాటు

🌻 తొందరపాటు 🌻

మనిషి తన దైనందిన కృత్యాల్లోను, వివిధ కార్యక్రమ ప్రణాళికా రచనలోను రెండు సూత్రాలను ప్రధానంగా గుర్తుకు తెచ్చుకుంటాడు. "ఆలస్యం అమృతం విషం" అని, "నిదానమే ప్రధానం" అని... నిజానికి ఈ రెండు సూత్రాలూ కార్యసాఫల్యానికి అవసరమైనవే. ఆయా సందర్భాలు, సన్నివేశాలు, పరిస్థితులను బట్టి ఈ సూత్రాలను ఆచరణలోకి తేవాల్సి ఉంటుంది.

ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తన బుద్ధితోనే గాక, తన హితం కోరేవారు, ఆత్మీయుల బుద్ధిని కూడా ఉపయోగించుకోవడం పురోగతి కోరుకునేవాడి లక్షణం. తనకు తోచిందే సరైనదని వెనకా ముందూ ఆలోచించకుండా అనుకున్న వెంటనే పని మొదలెట్టడం వైఫల్యానికి, అవమానానికి కారణభూతమవుతుంది. విపరీత ఫలితాలు ఎదుర్కొన్నాక పశ్చాత్తాపం చెందడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. ఈ తొందరపాటు ప్రతి మనిషి జీవితంలోనూ కనిపిస్తుంది. అదే శోక కారణమవుతుంది. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను విని విశ్లేషించుకుని అహంకరించక, వివేకంతో ముందడుగేసేవాడు కచ్చితంగా కార్యసాధకుడు కాగలడు.

తొందరపాటు వల్ల జీవితంలో దిద్దుకోలేని అగచాట్లు ఎదురవుతాయి. నిరంతరం దుఃఖం అనుభవించే సంఘటనలు జరుగుతుంటాయి.

ప్రధానంగా కామ క్రోధ లోభ మోహాది అరిషడ్వర్గాల వల్ల, మానసిక ఒత్తిళ్ల వల్ల, భావోద్వేగాలకు బానిస కావడం వల్ల తొందరపాటుతో తప్పులు దొర్లుతుంటాయి. ఈ బలహీనతలను అధిగమించి, వివేకంతో సంయమనంతో సమయజ్ఞతతో వ్యవహరించే వాడెప్పుడూ విజేతే అవుతాడు. ఏ పని ముందు, ఏ పని తరవాత అని ప్రశ్నించుకుంటూ ప్రవర్తించడమే రాజనీతి లక్షణమని వాల్మీకి మహర్షి ఓ సందర్భంలో ప్రబోధించాడు. కైక తొందరపడి అనాలోచితంగా, అసందర్భంగా దశరథుణ్ని కోరిన రెండు వరాల వల్ల ఎంత అపఖ్యాతి పొందిందో తెలిసిందే. శకుని పన్నాగాలకు ప్రభావితుడై దుర్యోధనుడు అనేక తొందరపాటు చర్యల వల్ల ఎంతగా ఎన్నిసార్లు భంగపడ్డాడో తెలియనిదెవరికి?

ధర్మరాజు రాజసూయ యాగం ప్రారంభించిన సందర్భంలో అగ్రపూజకు వాసుదేవుణ్ని ఆహ్వానించినప్పుడు శిశుపాలుడు ఆవేశంతో, అహంకారంతో, పరమాత్మను దుర్భాషలాడి చావును కొనితెచ్చుకున్నాడు. తార చెప్పిన హిత వాక్యాలను పెడచెవిన పెట్టి వాలి అహంకారంతో సుగ్రీవుడితో యుద్ధానికి తలపడి ధర్మమూర్తి శ్రీరామచంద్రుడి చేతిలో హతుడయ్యాడు. అనాలోచితంగా, భవిష్యత్తును గురించి ఆలోచించకుండా వేసే ఏ అడుగైనా తొందరపాటు చర్యే అవుతుంది.

చిన్న చిన్న కారణాలకే దంపతులు విడాకులు తీసుకోవడం, యువత ఆత్మహత్యలకు పాల్పడటం తొందరపాటు వల్లనే. కొన్ని క్షణాలు ఆలోచించి ‘ఇలా చేయడం అవసరమా?’ అని మనసులో నిదానంగా విశ్లేషించుకుంటే ఇటువంటి అనర్థాలే జరగవు. ప్రతిదానికీ విపరీతమైన స్పందన, అసందర్భమైన ఉద్రేకం మనిషిని వివేకహీనుణ్ని చేసి దుశ్చర్యలకు ప్రేరేపిస్తాయి. ఆధ్యాత్మిక శక్తిగల సాధకుడు తొందరపడి అనుచిత నిర్ణయాలు తీసుకోడు. ‘ఉరకకు, ఉరకకు మనసా, ఉరికితే దొరకదు హంస’ అన్నారు బుధులు. ఆలోచన లేని ఆచరణ జీను లేని గుర్రం లాంటిది. ప్రణాళిక లేని కార్యం మొదలుపెట్టడమంటే లోతు తెలియని నీళ్లలో దూకడం లాంటిది. కొద్దిపాటి తొందరపాటే కొండంత సమస్యకు దారితీస్తుంది. మనిషి వినడంలో తొందరపడవచ్చు. అవగాహన చేసుకోవడంలో తొందరపడకూడదు. తొందరపాటు శత్రువుకంటే ప్రమాదకరం!

🙏🙏🌹🌹❤‍🔥🌹🌹🙏🙏

సేకరణ

అవేర్నెస్*🌟 ✍️ *రచన: ఓషో*

🌸🌿🍎🌺🍃🍏🌹☘️🍓

🌟📚 అవేర్నెస్🌟

✍️ రచన: ఓషో

భాగం-36

✨ ఏ సమస్య క్లిష్టమైనది కాదని మీరు చెప్పిన తక్షణమే ఆ సమస్య 99% నిర్జీవమైపోయినట్లే. ఆ సమస్య గురించి మీ యొక్క పూర్తి దృష్టి మారిపోతుంది. ఆ సమస్యలో మీరు తాదాత్మ్యం చెందుతున్నారు కాబట్టి, సమస్య ఉన్నట్లు కనిపిస్తోంది; అనిపిస్తుంది. ఆ సమస్యకి గతంతో సంబంధం లేదు. చరిత్రతో సంబంధం లేదు. మీరు ఆ సమస్యతో తాదాత్మ్యం చెందారు. అదీ యదార్థమైన విషయం ఆ తాదాత్మ్యం లేకుండా ఉండటమే సమస్యల్ని పరిష్కరించడానికి అసలైన కిటుకు.
✨ ఉదాహరణకి మీరొక కోపిష్టి మనిషి అనుకోండి. ఒకవేళ మీరు మానసిక పరిశోధకుని దగ్గరకు వెళితే అతడు అంటాడు"గతంలోకి వెళ్ళు. ఆ కోపం ఎలా వచ్చింది?ఏ పరిస్థితులలో అది ఇంకా ఎక్కువ ఎక్కువ నిబంధనలకు, షరతులకు లోబడి, నీ మనస్సులోకి అచ్చులా నాటుకుపోయింది? మనం ఆ ముద్రలన్ని అలా కడిగిపారేయాలి. మనం అన్నింటినీ తుడిచి పెట్టేయాలి మనం ఆ గతాన్ని పూర్తిగా శుభ్రంగా తీసివేసెయాలి."
✨ ఒకవేళ మీరు తూర్పు మార్మికుడైన జ్ఞానోదయం పొందిన వ్యక్తి దగ్గరికి వెళ్తే, అతడు అంటాడు "నువ్వే కోపం" అని నువ్వు ఆలోచిస్తే, నువ్వు ఆ కోపంతో తాదాత్మ్యత చెందితే అక్కడే విషయాలు తప్పుదారి పట్టినట్లు. ఇంకోసారి కోపం వస్తే, మీరొక గమనించేవారిలా, సాక్షిలా ఉండండి. ఆ కోపంతో తాదాత్మ్యం చెందకండి. "నేనే కోపాన్ని"అని అనకండి. నేను కోపంగా ఉన్నాను అని అనకండి. ఆ కోపాన్ని కేవలం టీ.వీ. తెరపై జరిగే విషయంలా చూడండి. మిమ్మల్ని మీరు వేరే వ్యక్తి వైపు ఎలా చూస్తారో అలా చూడండి. ✨మీరు శుద్ధమైన, నిర్మలమైన చైతన్యం. కోపం అనే మబ్బు మీ చుట్టూ కమ్మినప్పుడు, దాన్ని కేవలం అలా పరిశీలించండి. దానితో తాదాత్మ్యత చెందకుండా జాగ్రత్తగా ఉండండి. సమస్యతో ఎలా తాదాత్మ్యత చెందకుండా ఉండాలో అదే మొత్తం విషయమంతానూ. దాన్ని ఒకసారి మీరు నేర్చుకుంటే అప్పుడింకచాలా సమస్యలు ఉన్నాయి అన్న ప్రశ్నే లేదు. ఎందుకంటే ఆ ఉపాయమే, ఆ తాళం చెవియే అన్ని తాళం కప్పుల్ని తెరుస్తుంది. కోపంతోనూ, దురాశతోనూ, కామంతోనూ, అన్నింటికీ - తాదాత్మ్యత చెందకుండా ఉండటమే ఒక కిటుకు. ఒక మనస్సు చేయగలిగే ప్రతి విషయానికి ఇదే ఉపాయం.
(సశేషం)
💠💠💠💠💠💠💠💠

సేకరణ

మంచి మాటలు(quotes)

◆ నీలో ఉన్న అతీతశక్తిని గుర్తించు. ముక్తిని పొందు.
◆ ఎన్ని బలాలు ఉన్నా, నీ ఆత్మబలం ముందు తక్కువే అని ఎరుగు.
◆ ఆహారం నిద్రా ఆలోచన ఈ మూడింటిని నీ ఆధీనంలో ఉంచిననాడు ఉచ్ఛస్థితిని చేరుకోగలవు ఇదే సత్యం.
◆ కుటుంబాన్ని ప్రేమించు, అందరిని ఆదరించు.
◆ నిజాయితీయే నిజమైన సంపద
◆ నిజమైన జ్ఞానం నిన్ను ఏనాటికి ఒంటరిని చేయదు.
◆ ఏది సరిఅయినది , ఏది తప్పు ? ఎవరికి సరియైనది ఎవరికి తప్పైనది ... Irrespective of anyone తప్పు ఎవరు చేసినా తప్పే, రైట్ ఎవరు చేసినా రైట్ ఏ . ఇదే ధర్మం. ధర్మానికి అనుకూలమైనది సత్యం , అదే సరియైనది
◆ సంతోషం సగం బలం, ఆనందమే పూర్ణ బలం
◆ వ్యక్తి పూజ వద్దు. Be a leader , don't create a leader. (From genius movie)
◆ సంతోషము క్షణికము , ఆనందమే శాశ్వతం.. క్షణం ఆలోచించి క్షణికానికి లోనవక , శాశ్వత్వానికి పరుగులు పెడదాం!!
◆ అందరిని గౌరవించు ఎవరు తక్కువ కాదని తెలుసుకున్ననాడు నీవు విజయాన్ని సాధించినవాడివి అవుతావు
◆ గొప్పగా అనిపించుకోవడానికి చేసేపనుల కన్నా, చేసే పనిని గొప్పగా చెయ్యు. ధీరతతో చెయ్యు. బుద్ధి యుక్తమైన పని చెయ్యు.
◆ గొప్పగా అనిపించుకోడానికి చేసే పనులు , పనులే కావు.
◆ మన కర్తవ్యాన్ని పాటించడమే ధర్మ సాధన
◆ మనము మంచి మార్గం లో ఉన్నప్పుడు ఎవరికి ఏమి చేసే అవసరం లేదు separate గా. good will take care of everything.
మంచి అంటే మనస్సు ద్వారా, మన మాటలద్వారా, కర్మలద్వారా ఏ ప్రాణికి హాని కలగకుండా నిస్వార్థంతో ఉండటం.
◆ నాతో ఏది కాదని కాక, నాలోనే సర్వం, నాతోనే అన్ని , నాదే కర్తవ్యం అని ఎరిగి జీవించు.
◆ నీ నవ్వు విశ్వాసాన్ని పెంచి విశ్వాన్ని సృజించేలా(ఏలేలా) ఉండాలి.(మంచివైపు)
◆ బోధకులు చెప్పే విషయములో పరిణతి చెంది ఉండాలి. (From bible)
◆ ఏ జంతువు కి లేని వాక్కు , బుద్ధి , తెలివితేటలు, చిరునవ్వు ఒక్క మనిషి కి మాత్రమే ఉన్నాయి. వీటిని సరైన విధంగా వినియోగించితేనే మానవుడు.
◆ చదువు అనేది సంపాదించటానికే కాదు. చదువుతో సంస్కారం అనే పూలబాటని నిర్మించుకోడానికి.
◆ భగవంతుని ధ్యాన్నిస్తూ జ్ఞానశక్తులు ఆపాదించి క్రియారూపం చేయడమే జీవితం
◆ meditate god, earn knowledge through prayer with that do accordingly this is what the life is.
◆ Tracking is an educational process that opens the door to our life.
◆ తప్పు అవడం సహజం, దానిని సరిచేసుకొనువాడే మానవుడు.
◆ ఆత్మ విశ్వాసమే విజయానికి ప్రథమ సోపానం ( తొలిమెట్టు)..
◆ అజ్ఞానం కన్నా , నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది.
◆అన్ని అపార్థాలకి కారణం వినకపోవడమే means not paying attention
◆ పరుగులు ప్రగతికి ప్రతీక.
◆ Be good do good always in all ways.
◆ బాగుండు బాగా చెయ్యు అన్నింటిలో ఎప్పటికి /ఎల్లప్పుడూ
◆ Implant eternal beauty in children. Today's kids are tomorrow's citizens.
◆ అందరిలోనూ ఆత్మ ఒక్కటే కనుక ప్రేమ భావంతో కలిసి మెలిసి జీవించడం అత్యుత్తమం.
◆ Never get frustrated by the circumstances, be yourself and be glad for the situation that is making you strong.
◆ Inner silence is the key to success in all the situations.
◆ power of silence holds the key to success.
◆ 3 jewels for happy life : Thoughts , words, and actions should be wise and same.
◆ Oneness is inner silence. Which empowers the mind.
◆ Deep silence has it's own melody. When you are in deep silence you feel the light within you.
◆ smile often
◆ జ్ఞాన సాధనే యోగ సాధన

◆ Your smile should be the messenger of goodwill to the world.
◆ ధర్మ కార్యసిద్ధికై ప్రతినిత్యం సిద్ధుడవై సదా జీవించు..
◆ చేసే ప్రతి పని చిత్తశుద్ధితో, ధర్మయుక్తి తో చెయ్యు. సఫలతే నిను చేరేలా...
◆ ఒకప్పుడు సరదాగా ఒకరిని గేలి చేసి నవ్వేదాన్ని, అప్పుడు అలా ఎలా చేసానా అని నాపై జాలి/బాధ వేస్తుంది. ఇదే ఇప్పటి మార్పుకు కారణం.
◆ మార్పు అనేది సమాజానికి వన్నె తెచ్చేదిలా నీకు ఆత్మ గౌరవం గా ఉండాలి.
◆ మార్పు అనేది నీఆత్మాభివృద్ధికై , నీఆధ్యాత్మికాభివృద్ధికై , నీఆత్మగౌరవానికై , ధర్మానికై, సమాజ శ్రేయస్సుకై ఉండాలి. ఇది నీకు నీవు కొంత సమయం ఇవ్వడం , ఏకాంతం వల్లే సాధ్యం.
◆ విద్యా తపస్సుల(ధ్యానము) చేత ఆత్మ శుద్ధి అవుతుంది.

◆ Respect everyone.. when you know, no one is less(diminutive), on that day you will become the successful person
◆ ప్రేమ శాంతి అంగీకారం విశ్వాసం నమ్మకం మరియు అందము వీటిని మన జీవితంలోకి ఆహ్వానిస్తే , మనలని క్షేమంగా ఉంచుతుంది. సంతోషంగా ప్రేమమయ జీవనం గడపడానికి ఆస్కారం అవుతుంది.
అందము అనగా : సత్య భాషణం కంఠానికి అందం, దానం హస్థానికి అందం, శాస్త్రాల వినికిడి శ్రోత్రానికి అందం
◆ నాలో నాణ్యతమైన సుగుణాలు ఉంటే అదే నా ఆభరణం.
◆ ఎవ్వరిని ఏవిధంగానైనా తప్పుగా ఆలోచించకు. వారిని క్షుణ్ణంగా తెలుసుకోనంత వరకు.
◆ ఆత్మని(తనని తాను) తెలుసుకోగలిగిన వారికి పరమాత్మని తెలుసుకోవడం సులభం.
◆ సేవలు అవసరం లేదు . చేసేపని కర్తవ్యంతో , బాధ్యతతో చెయ్యు.
◆ ప్రయత్నమే విజయం

◆ ఆ క్షణం క్రియలేే ఈ క్షణం ఫలితాలు. అందుకే క్రియలు ఉత్తమమై ఉండాలి.

◆ kindness looks amazing on you
◆ whrn you show kindness, jewels/ confetti of kindness showers on you back.
◆ Focus on what you are doing right now... to get the best results.
◆ our life is in our hands. We creat the world. So it's all what we choose and how we choose and how we spread.
◆ జీవితం మన చేతిలోనే ఉంది. భగవంతుడు మనలని సృష్టిస్తాడు అంతే. మనమే కొని తెచ్చుకుంటాము మనకర్మ ఫలాలని.
◆ మంచి అనేది మనము ఎన్నో విధాలుగా చేయొచ్చు. అందులో ఒకటి ధ్వని ద్వారా అనగా మాట్లాడే విధానం ఏది అవసరం , ఏ మాట వల్ల అంతా శాంతి ప్రేమ మాత్రమే ఉంటుందో...ఏ మాట వల్ల మొట్టమొదట మన మొహంలో ఆనందం(ఆత్మ తో మిలితమైన/ ఆత్మానందం) వస్తుందో, ఆ ధ్వనినే exhale చేయాలి.

◆ ధర్మం అనేది ఒక ఉత్తమమైన జీవన విధానం. ఇది మన డ్యూటీ ధర్మమయమైన జీవనం జీవించడం.


◆ సంబరం లో ఉండటం కాదు.....నువ్వే ఒక సంబరమ్ అవ్వు బాగుంటుంది.
◆నువ్వు ఇలా చెయ్యి అనే కన్నా , నేను ఇలా చేస్తాను అనే భావన అలవర్చుకోవడం అత్యుత్తమం.
◆సీతాకోక చిలుక పరివర్తన చెంది ఎలా అందంగా ఉంటుందో అలాగే మన జీవితంలో పరివర్తన వచ్చిన జీవనం అందంగా ఉంటుంది.
◆మీరు కేవలం మేల్కొన్న అనుకున్న వెంటనే సీతాకోకచిలుకగా మారరు .. దానికి కొంత అభ్యాసం మరియు సహనం ఉండాలి
◆కలం చేతిలో ఉంటే కాలాన్నే కదిలించగలవా..
మంచిమాట మది నుండి వస్తే జీవచ్చవాన్నే దివ్య దీప్తి, జ్ఞాన జ్యోతిగా మార్చేవా!!!.. ఓహో వీర నీలో ఎన్ని శక్తులో....మరి

◆వ్యక్తుల స్వభావం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, విలాసాలు మారుతాయి. కానీ నిజమైన విద్య ఎన్నటికీ మారదు నిను వీడదు. అందుకే అంతం లేని అపార శాశ్వత విద్యను స్నేహం చేసుకో.
◆Sometimes those we seek to encourage, are actually the ones who inspire and encourage us.

◆ఒకటి కావాలి అది మనకి అందుబాటులో ఉంది ..దానికోసం పరుగులు పెట్టడంలో ఆనందం . పరుగులు ప్రగతికి ప్రతీక.
◆పరిసర ప్రభావం వల్ల నీ అత్యున్నతమైన వ్యక్తిత్వాన్ని మార్చుకోకు..
◆పవిత్ర హృదయం మరియు స్పష్టత కలిగిన మనస్సు జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది.
◆ఆధ్యాత్మికత అనేది మనలని సరళముగ, సహజముగ శిశుశువువలే అమాయకముగా ఉండేట్లు తీర్చిదిద్దుతుంది.
నమ్మకమే మన నడక , ప్రవర్తన.
◆ఒకరు సంగ్రహ కర్త ,మరి ఒకరు స్వీయకర్త , నేను వీక్షించే శ్రోత కృత కార్య గ్రాహిని.
◆శాంతి కి మించిన విజయం లేదు
సంతృప్తికి మించిన ఆనందం లేదు
దురాశకి మించిన వ్యాధి లేదు
కరుణకి మించిన ధర్మం లేదు
సత్యానికి మించిన భూషణం లేదు
విశ్వాసానికి మించిన ఆయుధం లేదు

◆ఒకరిని గెలిపించడమే విజయం. (దానికోసమే ఎదురు చూడాల్సిన పనిలేదు. ) Note: అనగా సత్యపరంగా , నీతిగా , నిజాయితీగా ఉన్నవాళ్లను మాత్రమే
◆పోటీపడటమే (ఇతరులతో) ఓటమి
నిన్ను నీవు జయించడమే విజయం
◆నమ్మకమే నీ నడక , ప్రవర్తన.
◆బాగుండు ,మంచి చెయ్యు. అన్నింటిలోనూ, అన్నిసందర్భములలోను.
◆ చేసే పనిని శ్రద్ద విధేయత తో చేస్తే విజయం వెతుక్కుంటూ వస్తుంది నీ చెంతకి.
◆ ఎవ్వరిని చిన్న చూపుగా చూడకు. చూడాలే అనుకుంటే నీవు చిన్నవై వారిని పైకి ఎత్తేలా ఉంటే మాత్రమే నీకు ఆ హక్కు ఉంది.
◆ మనకి ఎంత తెలుసు అని కాక , ఎంత మనము తెలిసిన వాటిలో జీవిస్తున్నాము అన్నది ముఖ్యం కదండీ...
◆ చేసేపని లో శ్రద్ధ , బాధ్యత తోడై ; విశాల హృదయంతో, అపారమైన ప్రేమతో , ఎవరికి బాధ, నష్టం కలగని పనులు చేస్తే... సేవలు(విడిగా దానాలు) చేసే అవసరం రాదు. ఎవరు దీన పరిస్థితుల్లో ఉండరు. -शुभचिंतक
◆ ఏ పని చేసినా ఎవరో చూస్తారాని , ఎవరో చేస్తారని కాక నాకోసం నేను చేస్తాను, మనకోసం చేస్తాను అనే భావన ఎప్పుడైతే నీలో దృఢంగా నాటుకొని ఉంటుందో అప్పుడు నిత్యసంతోషివి అవుతావు.

◆చేదు అనుభవాలే నేర్చుకునే జీవిత పాఠాలు
మంచి అనుభూతులే తీయని జ్ఞాపకాలు పాఠనీయాలు
◆ జీవంతో ఉన్నవాటిని ప్రేమించడమే కరుణ
◆ మనము ఇతరులకి సహాయం నిజంగా చేయాలి అనుకుంటే , తప్పకుండా ఇది పాటించాలి. మాటే మంత్రము మాటలు చాలా ఆలోచించి బయటకి రానివ్వాలి check before speak. మాటలు ఎంత పవిత్రంగా ఉంటే , అంత పవిత్రంగా ఉంటుంది మన జీవితం. అదే ఒక అద్భుతమైన, సరిరాని సహాయం. actually ఈ మధ్య స్పీకులు ఎక్కడున్నాయని అంతా సోషల్ మీడియా యుగం ఫింగర్ టిప్స్ కె పనంత. అక్కడ కూడా సరిగా రాసే ప్రయత్నం చేద్దాం.
◆ మాటల ద్వారా వాతావరణ కాలుష్యం అవ్వకుండా చూసుకోవడమే ఒక పెద్ద మొదటి కాలుష్య నివారణ . ఇది అందరికి సాధ్యము అయిన పనే ఒక్కసారి యోచన చేద్దాం మరి మన మాటలు బయటకి పంపే ముందు.
◆ సత్యం:: ఏది సత్యం?? సత్యం అంటే ఏమిటి??
◆చేసేపనిని శ్రధ్ధ విధేయతతో చేస్తే విజయం మనసొంతం అవుతుంది.
◆ పెద్దవారు ..ఎవరు పెద్దవారు ? జ్ఞానవంతులా, విజ్ఞానవంతులా, మనకన్నా వయస్సులో పెద్దవారా, బుద్ధిలో మనకన్నా ఎక్కువ తెలిసినవారా, అనుభవజ్ఞులా , మనకన్నా పెద్దవారై అన్నీ తెలిసి తప్పులు చేసేవారా, లేక మనకన్నా చిన్నవాళ్ళు వారికి తెలిసిన ఒక్క విషయాన్నే తూచా తప్పకుండా పాటించేవాళ్ళా??? మంచి సత్ప్రవర్తన కలిగినవాళ్ళా??? ఆలోచించండి!!!! ఎవరికి సేవలు చేసి , ఎవరినుండి మనము దీవెనలు, ఆశీస్సులు, శుభకామనలు పొంది మన ఆయువు, విద్యా, కీర్తి, బలమును పొందగలమో ...
◆ మనతో మనము ఉన్నప్పుడు వచ్చే ఆనందము అనిర్వచనీయం. సొంత అనుభూతి కావాల్సిందే/ పొందాల్సిందే.
◆ మనపై మనకి మంచి అభిప్రాయం ఎప్పుడొస్తుందండీ????
"నినిసఆప్రే" ని దరిచేసుకున్నప్పుడు...అవును...అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏమిలేదండీ ...మనలో నిర్మలమైన మనస్సు, నిజాయితీ, సత్ప్రవర్తన, ఆచరణ , ప్రేమగుణం, ఉన్నప్పుడే కదండీ...మరి వాటిని అలవర్చుకుందాం, అక్కున చేర్చుకుందాం, వాటితో జీవిద్దాం. మనము భూమిమీదకి వచ్చిందే వాటితో..కానీ మన unconscious తో ఇలా అయ్యాము. మార్పు అనేది కష్టమే కానీ, కానిది కాదు
◆ మనకి మంచి ఆలోచనలు ఎలా వస్తాయండి??
మొట్టమొదట వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు కదా...మనచుట్టు పరిసరాలు ధ్వని నిర్ఘాంతము అయినప్పుడు (స్తంభించినప్పుడు) కదా..అందుకే (వనాలల్లో ), నదీ తీరమందు, పర్వత శిఖరం పై ఇలా వెళ్లి మనస్సుని ప్రశాంత పరుచుకుంటారు కదా మునులు, ఋషులు, దేవతలు(దివ్యగుణాలు కలిగినవారు)... అలాంటి వాతావరణమే మనము ఉండే చోటే కలిపించుకుంటే ???

◆ నిరంతర కృషియే ప్రయత్నం
◆ కృషి లేనిదే సఫలీకృతం అయ్యేదెలా????
◆ అమ్మ అయినా అడగనిదే అన్నం పెట్టదు కదండీ...ఎందుకంటే అక్కడినుండే మనకి నేర్పిస్తుంది ప్రపంచంలో నీకు నీవుగా జీవించాలంటే అడిగి( ప్రశ్నించి/ మాట్లాడి/శ్రమించి) ఫలితం పొందు అని. Calm గా ఉంటే ఏది నీ దరికి రాదు అని . ఎంత గొప్ప విషయం మనకి చిన్నప్పుడే నేర్పింది కదండీ..
◆ ఎవరో ఒకరు వచ్చి నీకు నేనున్నాను అనే భరోసా ఇచ్చినప్పుడు ఫుల్ ఖుషి అవుతము. ఇంతకు ముందు ఏం జరిగిందో ఆలోచించము. Already మనకి భరోసా ఇచ్చి అన్ని విధాలా సదుపాయాలు ఇచ్చిన భగవంతుణ్ణి మరుస్తాం. మనకి ఒక సామెత ఉందికదా ముందు వచ్చిన చెవుల కన్న వెనుక వచ్చిన కొమ్ములు వాడివి అని . అలా కాక బీజం మొదటిదశని మరువక , ముందుకు సాగాలి.
◆ సంఘటితం అయినప్పుడే ఐక్యత రూపం దాల్చుతుంది.
◆ ఒక వ్యక్తే ఒక శక్తి
◆ ఓ ఉజ్వల ప్రజ్వల వనిత
నీవే శక్తి కి నిదర్శనం
నీవే ప్రేమకి చిహ్నం
నీవే విజ్ఞానానికి చిరునామా
నీవే సహనానికి మారుపేరు
నీవే ఔదార్యానికి ప్రతిరూపం
నీవే ధైర్య నిలయం
వందనం వందనం ఓ వీరనారీ 🙏
◆ आर्यमान भव
శ్రేష్ఠుడవు కమ్ము, ఆలోచనలో, గుణములలో, వ్యవహారంలో, జ్ఞానములో, అన్నింటిలోనూ..
◆ time alleviates everything.
◆ పుండు మానిన గాయం మానదు. కానీ మరోసారి అవ్వకుండా జాగ్రత్త పడగలము.
◆ చెప్పాలి అనుకుంటే నిజమే చెప్పు , కానీ ఒకరికి బాధని కలిగించే నిజం కన్నా ఏమీ చెప్పకపోవడమే, calm గా ఉండటమే ఉత్తమం. ఉదాహరణకి అంగవైకల్యం ఉన్న వారిని నీకు ఆ వైకల్యం ఉంది అని, అది నిజమే కావచ్చు కానీ వారికి బాధ కలుగుతుంది. మన మాటలు తూటాల్లా కాక, తుల్యంగా(చక్కగా ఆనందపరిచేలా) ఉండాలి.
◆ మనము ఇతరులకి సహాయం నిజంగా చేయాలి అనుకుంటే , తప్పకుండా ఇది పాటించాలి. మాటే మంత్రము మాటలు చాలా ఆలోచించి బయటకి రానివ్వాలి check before speak. మాటలు ఎంత పవిత్రంగా ఉంటే , అంత పవిత్రంగా ఉంటుంది మన జీవితం. అదే ఒక అద్భుతమైన, సరిరాని సహాయం. మాటే కూల్చేస్తుంది, మాటే నాయకున్ని చేస్తుంది.
Note::ఇదంతా మనము unconscious లో ఉన్నప్పుడు మాట మనమాట వినదు. స్థితప్రజ్ఞతతో ఉంటే ఈ సమస్యే రాదు. యోగ సాధన వల్లే స్థితప్రజ్ఞత సాధ్యం.
◆ లక్ష్యం ఆశయం : లక్ష్య సిద్ధి ఉన్నవారికి ఆశయ సిద్ధి సాధ్యం. కానీ కఠోరశ్రమ , పట్టు వీడని పట్టుదల, ఇవి ఉంటే ఆశయాన్ని నెరవేర్చుకోగలం.
◆ aim and ambition.
◆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ...
ఆ గురికి గమ్యం కనపడాలి.
గమ్యానికి శ్రమ తోడైఉండాలి.
ఆ శ్రమ లో ఎన్ని ఎదురుదెబ్బలు
ఎన్ని ఆటంకాలు ఎదురైన
పట్టుదలతో ముందుకు సాగాలి.
అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరగలం.
◆ మన ఆలోచనే మన బలం
మన ఆలోచనే మన బలహీనత
మరి ఏ ఆలోచన
మనకి
సుఖదాయకమో
అదే చేద్దామా??
లేక
ఏడుద్దామా
అలా అయ్యింది ఇలా అయ్యింది అంటూ
జాలి చూపేవారే లేకపోతే ఏడ్చేవాళ్ళే ఉండరు.
అని ఒక మహానుభావుని మాట
◆ నీ యుక్తే నీ శక్తి , నీ శక్తే నీ బలం
◆ our thought is our energy.. our energy is our strength ..our strength is our life
◆ మనలో శక్తి ఎప్పుడు వస్తుంది??
నిజాయితీగా ఉన్నప్పుడు, సత్య పథంలో ఉన్నప్పుడు కదండీ!?!??!!
◆ ఆలోచనే బలం
బలమే శక్తి
ఆ బలమే ముందుకు నడిపించు సాధనం
◆ ఆలోచనలు ఎంత పవిత్రమైతే అంత పవిత్రమైన( దృఢ) శక్తులు మనసొంతమవుతాయి.
◆ చేసేపనుల్లో పొరపాటు జరిగితే సరిచేసుకోగలం కానీ ఆలోచనలో పొరపాటు అయితే జీవితమే కోల్పోతం / పోయినట్టు/నష్టం!!
◆ ఆలోచనే ఆలయ శిఖరం చేరేది, అధోగతి పాలయ్యేది. అంటే ఒక ఆలోచన మనలని భగవంతునితో ఉండేలా/నడిచేలా చేస్తే, మరో ఆలోచన జీవచ్ఛవంలా చేస్తుంది.
◆ మనతో మనం ఉంటూ భగవంతునితో ఉన్నప్పుడు ఏ దుష్ట శక్తులు మనలని ఓడించలేవు.
◆ ఎదుటి వారి responding actions are our reflections.
◆ నేను ఒక చోట చూసాను you can control the future అని మరి ప్రతిఒక్కరు you you అంటే చేసేది ఎవ్వరు మరి??? నువ్వు అని కాక I can control the future అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే సాధన మొదలుపెడతాము.
◆ others responses are our reflections
◆ ఒక్కోరంగు ఒక్కో విలువలని తెలియచేస్తుంది. మన జీవితం కూడా అలా రంగుల మయం అవ్వాలి.
◆ I'm a lotus i surround with many people but no one can deviate my path of sense, behavior and attitude.
◆ you learn something new everyday knowingly or unknowingly., but when you focus you can improve/ implement.
◆ ఏమి చేయాలన్నా భావన మొదట వ్యక్తపరచాలి కదా...అందుకే భావన భావ్యం అయి అర్థవంతమై ఉండాలి.
◆ మనము ఎప్పుడైతే అన్ని విషయాల్లో బాధ్యతాయుతంగా ఉంటామో అప్పుడే బాధ్యత కలిగిన నాయకున్ని ఎన్నుకోగల సామర్త్యులం అవుతాము. అప్పుడు అసలు నాయకుడే అవసరం లేదు. అందరం నాయకులమే అవుతాము.
◆ బాధ్యత అంటే సమయం వచ్చినప్పుడే చేసేది చూసేది కాదు. నిరంతర కృషి చేస్తూ నిరంతర పరిశీలన ఉండటం
◆ ప్రతీక్షణం భగవంతున్ని ధ్యానించే వ్యక్తి వలయం దృఢమై ఛేదించజాలక రక్షణ కవచంగా ఉంటుంది.
◆ ఒక తాడు అనేది చీకటిలో ఒకొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది. అది అందరికి సరిగా తెలిసిందే చిన్నదే తెలియని వాళ్ళు ఉండరు కానీ మన మనస్సు ఉన్నది చూడండి ఆ క్షణంలో భయభీతులకి లోనయ్యి ఎదోలా కనిపించడం జరుగుతుంది. దీనికి కారణం సరిగా తెలియకపోవడమ్ కాదు. గమనించకపోవడం, మనస్సు స్థిరంగా ఉండకపోవడం. అది ఎలా మరి ఒక గాజు పాత్ర తీసుకొని అందులో మట్టి వేసి నీళ్లు పోసి షేక్ చేస్తే అంతా పైకి తేలుతుంది చిందర వందరగా వెళ్తుంది. అదే కాసేపు అలా ఉంచితే మెల్లి మెల్లిగా మట్టి చివరకు చేరుతుంది నీళ్లు మాత్రమే క్లీన్గా కనిపిస్తాయి. అలాగే మనస్సు కూడా చంచలమైనది. దాన్ని స్థిరంగా ఉంచితే ఎన్నో సవ్యంగా క్లియర్గా చూడగలం.
◆ everything happens for a reason and you are the one behind that reason.
◆ pure heart and polite words gives strength and confidence to lead happy life when you are true to yourself , with pure heart and polite words brings out inner beauty

◆ మనము ఎలా మాట్లాడితే అలాగే ఎదుటివారి నుండి సమాధానం వస్తుంది కదండి..మరి ఎలా మాట్లాడితే బాగుంటుందో చూసుకొని మాట్లాడుదామా 😊😊
◆ we people are like magnets and imitators. Majority of people respond in a way how the other persons responses are . But some do oppositely but still connect like magnet. So that's why it is so imp to speak and act in a way no one gets hurt and we want sweet responses back too. 😊😊 Don't we??
◆The way of speech changes/ impacts on our way of life.
◆ If you really want to pass something to the generation, just pass the good actually not good, best choices , best thoughtz , one and most influential word is TALK ఒకరిని humiliate చేసుకుంటూ నవ్వితే దాన్ని జోక్ అంటారా???₹ జోక్ అంటే ప్రతి ఒక్కరు నవ్వగలగాలి. ఎవ్వరికీ బాధ , నొప్పి లు కలగకూడదు.
◆ మాటే మంత్రము మంగళ వాద్యము అని ఒక పాట కూడ ఉంది. మంత్రము అంటే ఏదో కాదండీ . మంచి ఆలోచన మాట నే మంత్రం ద్వారా చెప్పబడింది. కొన్ని పదాలతో క్లుప్తంగా చెప్పబడిన సందేశమే మంత్రము. ఒక rhythmic గా ఉచ్చరించడమే మంత్రము. అంటే మొదట ఏమి చేయాలన్న వాక్కు భావన ద్వారానే వ్యక్తపరుస్తాము కాబట్టీ వాక్కు భావన పవిత్రమైనదిగా ఉండాలని. మంత్రాన్ని ఉచ్చరించాలన్నా వాక్కు లేదా భావన/ఆలోచన/చింతన/యోచన/తలంపు/మననం/ఆత్మభాషా ద్వారే సాధ్యం.
◆ మాటల్లో రకాలు . మనస్సులో మొలిచే మాట అదే thinking, ఆత్మమాట మౌనం అదే thoughtless , బయట ప్రపంచంతో మాట్లాడే మాట అదే voice speech, సైగలతో మాట్లాడే మాట అదే signing. ఇవన్నిటిలో మొదటిది seed ఏమిటి అంటే thinking . అది బాగుంటే fruits గురించి చింతించే అవసరం లేదు కదండీ. Automatic గా బాగుంటుంది కదా!!! మరి ఆలోచనలు సరి చేసుకుందామా??
◆ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారుకదండీ పెద్దలు
◆ శరీరం లేక ఆత్మకి ఉనికి ఎలాగైతే లేదో, అలాగే జ్ఞానం లేక బుద్ధి వికసించదు. సత్యం లేక మనస్సు ప్రశాంతతను సంతరించదు.
◆ సరి అయిన విషయాలను ఎవ్వరు (పగవారు) చెప్పినా స్వీకరించాలి. పగవారు అంటూ ఎవరు ఉండరండి ఈ లోకంలో. అన్ని మన ఆలోచనలే, మన వైఖరినే. మనకి నచ్చని వాళ్ళకి దూరంగా ఉండటమే ఉత్తమం. అప్పుడు ఎవరు పగవారు ఉండరు.
◆ ఎవరితో ఉన్నా ఏ మట్టి అంటనివాడే మనుః /ధ్యాతృ
//◆ no matter whomever you are with, won't get that dirt is wise person / rich human
◆ మనము ఏ పౌష్టిక ఆహారం తీసుకున్నా , ఏ మందులు తీసుకున్నా ఏ రోగము పోదు ఇది సత్యం. విపరీత రోగాలు రావటం తథ్యం. మన మది లు అగాధాలు(chasm/separate/భిన్నత/ఏకీభవించకపోవడం/పోట్లాటలు/ప్రశాంత కోల్పోవడం) అవ్వటం మారదు. నేల, ఆకాశం (సారవంతమవ్వనంతవరకి). స్వచ్ఛత రూపొందేంతవరకు. దివి భువి లు రూపాంతరం చెందేవరకి

పౌష్టిక ఆహారం ఎలా వస్తుంది?
పౌష్టికమైన నేల , పౌష్టికమైన నీళ్లు ఇవి ప్రధానం ప్రాథమికం కదండీ. వీటిని సరిచేసుకుంటే అన్ని సరిఅవుతాయి కదా..!!!
దీనికి ఒకే ఒక్క మార్గం అగ్ని ద్వారే, అదే హోమం/హవనము/యజ్ఞము/అగ్నిహోత్రం
◆ సర్వేషాణాం రోగానం వాయుః కారణం
అందుకే గాలి లో మంచిని పెంచాలి. మీలో ప్రశ్న ఉద్భవించవచ్చు నాలో నేనె మంచిని పెంచుకోలేక పోతున్న ..గాలిలో ఎలా సాధ్యం అని. Yes. వచ్చారు అక్కడికే . చెత్త దుర్గంధం ఉన్నచోట మీరు ఉండగలరా? లేదు కదా. కొంచం మంచిగా ఉన్న చోటికి వెళ్తారు . మంచి చేసేవాడే లేడు. చెత్త తీసేవాళ్లే లేరు. అప్పుడు ఏం చేస్తారు?? మీరే ఆ దుర్గంద్దాన్ని తీసేస్తారు కదా. అలా రండి గాలిని శుభ్రం చేయడానికి, గాలి లో మంచిని పెంచడానికి.
◆ one small good thought gives tremendous strength if practiced/implemented each day.
◆ chanting god's strengths produces eternal energy and electrifies our body.
◆ morning thoughts mezmerises mind
◆ ఆత్మ మేలుకొలుపే ఈ జీవాత్మ మేలుకొలుపు
◆ ఆత్మకి నీవు ఎంత దగ్గరైతే అంత సుఖం
◆ అద్భుతాలన్ని ఆత్మలోనే నిక్షిప్తమై ఉన్నాయి. చేరుకో అద్భుత స్వర్గాన్ని.
◆ ఆత్మకి అంతం లేదు , శరీరానికి శరణం లేదు.
◆ శరీరాన్ని విస్మరిస్తే ఆత్మని రక్షింపజాలము. సాధనం(శరీరము) ద్వారే సాధన(practice) సంభవము(నిశ్చయము).
◆ ఒక వ్యక్తిని మరో శక్తిగా మార్చడం ఒక్క మానవునికే సంభవము.
◆ శరీరమే మొదటి సాధనం. సర్వ కార్య విధులకి నిధులకి
◆ శరీరాన్ని విస్మరించక మరియు/అలాగే శరీరమే ముఖ్యం అనుకొని అందమనే అలంకారానికి దగ్గరవ్వక సమయం వృధాచేయక శరణాగతిని చేరుకొమ్ము.
◆ శరీరాన్ని విస్మరించక శరణాగతిని చేరుకొమ్ము
◆ శరీరం ఒక సోర్స్ ఆత్మని తెలుసుకోడానికి. నీవు ఎవరో తెలుసుకోడానికి నీ పురోగతి కొరకు.
◆ ప్రపంచ means the elaboration of pancha bhōthās.
Pancha bhōthās are air Earth water sky
◆ తెలియదు అనుకునే /అనే వాళ్ళకి ఎప్పుడూ తెలియదు. జిజ్ఞాసులకి తెలియకపోవడం అనేది ఉండదు.
◆ పంచభూతాలు పాఠం నేర్పుతూనే ఉంటాయి. తెలిసుకునే వారికి తెలుసుకునేంత. మనము వాటికి దగ్గరైతే వాటితో మాట్లాడితే అంటే కాలం గడిపితే తెలుస్తుంది
◆ ప్రకృతి పాఠం నిత్య పాఠం సెలవు అనేది తీసుకోదు. మననుండి ఏమి ఆశించని గురువు. ఈ గురువు ని కాపాడుకునే బాధ్యత మనదే కదండీ.
◆ గోల వినేవాళ్ళు ఉంటే గోల పెట్టేవాళ్లూ ఉంటారు. 😊😊
◆ అక్షజ జ్ఞాని కళ్ళతో చూచును. ఆంతరంగిక జ్ఞాని అంతరంగముతో చూచును
◆ కళ్ళతో చూసేవారు అక్షజ జ్ఞాని, అంతరంగముతో చూసేవారు ఆంతరంగిక జ్ఞాని

సేకరణ

Wednesday, December 29, 2021

💐రతన్ టాటా గారి జన్మదినోత్సవం సందర్భంగా💐

🔥వ్యక్తిత్వంలో వజ్రం -మన💎 జాతికి దొరికిన రత్నం.....🌟
🕉️🌞🌎🏵️🌼🚩

💐రతన్ టాటా గారి జన్మదినోత్సవం సందర్భంగా💐

రతన్ టాటా,స్వామి వివేకానంద.... ఇద్దరూ బ్రహ్మచారులే. మొదటి వ్యక్తి '' ధ్యానంతో '' దేశాన్ని మార్చాడు, రెండవ వ్యక్తి '' ధనంతో '' దేశాన్ని సేవిస్తున్నాడు.

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా యువతకు ఆదర్శప్రాయుడు. వ్యాపార విలువలు, మంచితనం, సింప్లిసిటీతో ఆయన ముందుకుసాగుతున్నారు.
దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేతల్లో రతన్ టాటా ఒకరు. మంచి మనసు, వినూత్న ఆలోచనలు, సింప్లిసిటీతో ఆయన ప్రజల మనసుల్లో అత్యున్నతంగా ఉన్నారు. పాజిటివ్ థింకింగ్​ ఆయనను ప్రస్తుతం ఈ స్థాయికి చేర్పించింది.


డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు డిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ వ్యక్తి గుర్తుకొచ్చాడు , అపుడు ఆ ముగ్గురూ ఆయన వంక చూసి ఆశ్ఛర్యపోయారు. ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ పైకి అనుకొని , టై ను భుజం వెనక్కి వేసుకొని , జాకీ , స్పానర్ తీసుకొని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఈ ముగ్గురూ అవాక్కయ్యారు.
కారణం ఆ నాల్గవ వ్యక్తి రతన_టాటా. '' సార్ , మీరు ? '' '' అవును , మనం మీటింగ్ కు వెళ్ళాలి , టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 ని. సమయం పడుతుంది , కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లో అతను ఆ పని పూర్తీచేస్తాడు. మనకు 7 ని౹౹ కలిసొస్తాయి కదా ? '' అన్నారు రతన్ టాటా. [ Respect to Time is Respect to Life ]

టాటా గ్రూప్ ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది !
బాల్యంలో ఆయన తల్లి తండ్రులు విడిపోయారు , అవ్వ పెంచిపెద్ద చేసింది.
యవ్వనంలో ఆయన గర్ల్ ప్రెండ్ మోసం చేసింది.

ఆతరువాత కంపెనీ కి విపరీతమైన నష్టాలు , సవాళ్ళు ఎదురయ్యాయి.
కానీ ఆయన తన మంచితనాన్ని , దయను , లక్ష్యాన్ని , నిజాయితీని , సమయపాలనను , క్రమశిక్షణను , కఠోర పరిశ్రమను మరచిపోలేదు. సంస్థను ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చారో క్రింద వివరాలు చదివితే తెలుస్తుంది :

టాటా సంస్థ అయిన TCS యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం.

భారతదేశపు GDP కి టాటా సంస్థ ఒక్కటే 4 % కాంట్రిబ్యూట్ చేస్తుంది.

ప్రతి ఏటా అస్సాం , ఒడిషా , హిమాచల్ ప్రదేశ్ , గోవా లు కలిపి ఎంత tax కడతాయో అంత tax ను ఒక్క టాటాసంస్థనే దేశానికి చెల్లిస్తుంది.

నవంబరు 26 , 2008 లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని టాటా సంస్థ యొక్క TajHotel మీద ఆత్మాహుతి దాడి చేసి వందలమందిని చంపిన సంఘటనలో, చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ఒక్కొక్కరికీ 25 నుండీ 50 లక్షల దాకా సహాయం అందించారు రతన్ టాటా ; ఆ సమయం లో తమ హోటల్ లో డ్యూటీలో వుండి మరణించిన , గాయపడిన ప్రతి పోలీసు , ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబం లో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు , వాళ్ళ పిల్లల చదువు , పెళ్ళిళ్ళ బాధ్యత ను తానే తీసుకొన్నాడు ; అంతకంటే ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్ కు వచ్చివుంటుంది , ఆమెను గది బయటపెట్టి ఆమె తండ్రి , మామయ్య టాయిలెట్ లోకి వెళ్ళివుంటారు , అప్పుడే ఆ దాడి జరిగింది , వాళ్ళిద్దరూ మరణించారు. ఆ చిన్న పాప బ్రతికింది , తరువాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు , స్త్రీలు , వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందలమందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను గుర్తుపట్టింది ఆ చిన్న పాపనే. ఆ చిన్న పాపను ఆసుపత్రిలో చేర్పించి , కోలుకొనేలా చేసి , ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి , ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి , ఆమె పెళ్ళి బాధ్యతను కూడా కూడా రతన్ టాటా నే తీసుకొన్నారు. మరో ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళుతున్న , అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు [చేపలు పట్టడం , పావ్ బాజీ , పానీపూరి , భేల్ పూరి , పాన్ బీడా , చాయ్ దుకాణాల ] నడుపుకొనేవారికెవ్వరికీ టాటా సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా , వారందరికీ నష్టపరిహారం అందించారు రతన్ టాటా. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యమేమంటే ఈ అన్ని పనులనూ రతన్ టాటా దాడి జరిగిన తరువాత కేవలం 20 రోజుల్లో పూర్తీచేసేసారు. అందుకే ఆయన గురించి ఒక స్నేహితుడు ఇలా వ్రాసాడు : Don't mess with him ; if you give him Deep Insults , he will transform them into Deep Results.

రతన్ టాటా,స్వామి వివేకానంద.... ఇద్దరూ బ్రహ్మచారులే. మొదటి వ్యక్తి '' ధ్యానంతో '' దేశాన్ని మార్చాడు, రెండవ వ్యక్తి '' ధనంతో '' దేశాన్ని సేవిస్తున్నాడు.

#దేశ సంపద#

రతన్ టాటా గారు చెప్పినది:*

" ఒక సారి మేము జర్మనీ వెళ్ళాము . అది ధనిక దేశం . ఒక రోజు మేము ఒక హోటల్ కి వెళ్ళాము .
చాలా టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి . ఆశర్యపోయాము అక్కడ అందరూ ఒకటో రెండో డిష్ లు తెప్పించుకుని పూర్తిగా తిని వెళ్తున్నారు .
ఒక మూలన టేబుల్ దగ్గర కొందరు వృద్ధులు ఒకే డిష్ తెప్పించుకుని అందరూ కలిసి పంచుకుని తింటున్నారు .
ఇంత ధనిక దేశం లో ఇలా తింటున్నారేమిటి అనిపించింది మాకు
మేము మా స్టేటస్ కి తగినట్టు రకరకాల డిషెస్ తెప్పించుకుని తిన్నాం . కొన్ని నచ్చలేదనో ఎక్కువయ్యయనో వదిలేశారు మా వాళ్ళు . తెప్పించుకున్న దాంట్లో మూడోవంతు వదిలేశారు మా వాళ్ళు
మేము లేచి వెళ్లి పోతుంటే అక్కడ ఉన్న ఒక వృద్ధ మహిళ మా దగ్గరకి వచ్చి అలా వేస్ట్ చెయ్యకూడదు అంది
మా ఫుడ్ . మా ఇష్టం అని మా వాళ్ళు కొంచెం రూడ్ గా మాట్లాడారు . అందుకు ఆ గ్రూప్ అందరికీ కోపం వచ్చింది . వెంటనే ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది .
పోలీసులు వచ్చారు . జరిగినది విన్నారు .50 యూరోలు ఫైన్ వేశారు మాకు .
చెల్లించి వచ్చాము .
వాళ్ళు అన్నది
" డబ్బులు నీవి . కానీ ఇక్కడి రిసోర్స్ నీవి కావు . అందరివీ . ఇంకొకడు తినవలసినది నువ్వు పాడు చేశావు . ఆరకంగా నువ్వు ఈ దేశ సంపదకు నష్టం చేకూర్చావు . దేశ సంపదకు నష్టం చేసే హక్కు నీకు లేదు "
.
మనం పెళ్ళిళ్ళలో ఎంత దుబారా చేస్తాం ? ఇది మనకు ఒక గుణ పాఠం కాదూ ?
మనం దీని నుండి నేర్చుకోవాలసిన అవసరం ఉంది.

🙏🙏💐💐🙏🙏
Collected by
A.Srinivasa Reddy

🍀🌹🌻🍁🦜💦💥

సేకరణ

🔥ప్రతికూల పరిస్థితుల్లో సానుకూలంగా ఉండటానికి 5 మార్గాలు.....!!!!!

🔥ప్రతికూల పరిస్థితుల్లో సానుకూలంగా ఉండటానికి 5 మార్గాలు.....!!!!!🌀🎊
🍀🌸💦🌹🌻🌈

  1) మన జీవితంలో ఏదైనా పరిస్థితి ప్రతికూల ఫలితాన్ని లేదా ఫలితాన్ని కలిగిస్తుంది.కానీ చాలా తరచుగా మేము ప్రతికూల ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము మరియు అది జరగడానికి ముందే భయపడ తాము. వివేకంతో నిండిన బుద్ధి మరియు సానుకూలతతో నిండిన మనస్సు విజయాన్ని అనుభవించడానికి ఏ పరిస్థితిలోనైనా సాను కూల ఫలితాలను మరియు ఫలితాలను పదే పదే దృశ్యమానం చేస్తుంది.

  2) లా ఆఫ్ అట్రాక్షన్ చెబుతుంది చింతించడం అనేది మనం విశ్వానికి పంపే ప్రతికూల శక్తి అని,ఇది ఆరోగ్యం,సంబంధాలు,పాత్రలు మరి యు సంపద యొక్క ప్రతికూల విధిని ఆకర్షిస్తుంది. సానుకూల జ్ఞానం మరియు బలం తో కూడిన ధృవీకరణలను అభ్యసించడం విశ్వానికి సానుకూల శక్తిని పంపుతుంది,ఇది సానుకూల విధిని సృష్టించడంలో సహాయపడు తుంది, విజయంతో నిండి ఉంటుంది.

 3) ప్రతి ప్రతికూల పరిస్థితి మొదట పెద్దదిగా కనిపిస్తుంది,కానీ మనం ముందుకు సాగుతున్న ప్పుడు,మన స్వంత సానుకూలత,దేవుని శక్తి మరియు సహాయం మరియు పరిశుభ్రమైన తెలివితేటలను ఉపయోగించి త్వరలో పరిష్కా రాన్ని పొందాలి.కొంత సమయం తరువాత, పరిస్థితులు చిన్నవిగా అనిపిస్తాయని ప్రాక్టికల్ అనుభవం చెబుతుంది.కాబట్టి,అవి మీ జీవితం లో మొదటిసారి వచ్చినప్పుడు ఎప్పుడూ ప్రతి కూలంగా ఆలోచించండి,కానీ వాటిని పరిష్క రించడానికి చూడండి.

 4) జ్ఞానం యొక్క చాలా శక్తివంతమైన బోధ ఏమిటంటే,ప్రతి పరిస్థితి దాటిపోతుంది.ఏ పరిస్థితి శాశ్వతం కాదు.స్థిరంగా మరియు బలం గా ఉండటమే విజయానికి కీలకం.అలాగే, పరిస్థితులు త్వరగా లేదా తరువాత ఎలా పోతాయో మన జీవితాలు మనకు చాలా అనుభవాన్ని అందించాయి.వారు అక్కడ ఉన్నప్పుడు మనం దృఢ నిశ్చయంతో మరియు ఓపికగా ఉండాలి మరియు గందరగోళం లేకుండా ఉండాలి.

*5)ప్రతి పరిస్థితిలో మనకు ఎప్పుడూ ఏదో ఒక ప్రయోజనం దాగి ఉంటుందని కూడా మనం చాలా లోతుగా గ్రహించాలి.ప్రతికూల పరిస్థితు లు మనల్ని మరింత శక్తివంతంగా మరియు జ్ఞానవంతులుగా చేయడమే కాకుండా,అవి మనల్ని విభిన్నంగా ఆలోచించేలా చేస్తాయి, ఇది మన జీవితంలో కొత్త వాస్తవాలను సృష్టి స్తుంది మరియు పరిస్థితి జరగకపోతే మనం ఎన్నడూ వెళ్ళని విజయాల కొత్త మార్గాల్లోకి తీసుకువెళుతుంది.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

సంప్రదాయ దుస్తుల వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?

🌼🌺సంప్రదాయ దుస్తుల వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?🌺🌼

https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl

ముందు శరీర నిర్మాణం గురించి ఓ విషయం తెలియాలి. మగవారి శరీరనిర్మాణంలో వృషణాలు (టెస్టిస్) ముఖ్యమైన భాగాలు. అవే సంతానోత్పత్తికి, ఓజస్సు శక్తికి కారణమైన వీర్యాన్ని ఉత్పత్తి చేసి, తమలో దాచుకుంటాయి. వాటి ఉష్ణోగ్రత శరీరసాధారణ ఉష్ణోగ్రతకన్న 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అవి తక్కువ ఉష్ణోగ్రతలో మాత్రమే వీర్యకణాలను ఉత్పత్తి చేయగలుగుతాయి. ఉష్ణోగ్రత పెరిగితే ఉత్పత్తిపై ప్రభావం చూపి, వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది. ఉష్ణోగ్రత మరీ పెరిగితే ఉత్పత్తి పూర్తిగా నిలిచిపొయే ప్రమాదం ఉంది. నపుంసకత్వం వస్తుంది. ఒకవేళ ఉత్పత్తి జరిగినా ఫర్టిలిటి అతి తక్కువగా ఉంటుంది.

బిగుతగా (టైట్ గా) ఉండే బట్టలు వేసుకోవడం చేత శరీర ఉష్ణొగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా లోదుస్తులు (Inner wear) బిగుతుగా ఉంటుంది కనుక వృషణాల ఉష్ణోగ్రత అసాధారణంగా పెరుగుతుంది. ఫలితంగా వీర్యకణాలసంఖ్య తగ్గిపోతుంది. మనం వేసుకునే జీన్స్ ప్యాంట్స్ బాగా దళసరిగా ఉంటాయి. గాలిని వాటిలోనుండి శరీరానికి తగలడం ఆసాధ్యం. వేసవిలో ఇది అనుభవమే. అందువల్ల వృషణాల ఉష్ణొగ్రత మరింత పెరుగుతుంది. ఫలితం మరింత వీర్యోత్పత్తి తగ్గిపోవడం, సంతానసామర్ద్యం దెబ్బతింటుంది.

అక్కడితో ఆగదు. ఈ కారణంగా జన్యువుల్లో (genes) లోపం ఏర్పడుతుంది. అది తరువాతి తరలవారిలో కూడా కోనసాగుతుంది. వారి వంశం మొత్తం ఆ లోపంతో బాధపడుతుంది. గత కొంతకాలంగా జరిగిన పరిశోధనలో తేలిందేంటంటే అంటే గత 20 సంవత్సరాలుగా వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందట.     

ఈ విషయం తెలిసిన మన మహర్షులు, వాటి ఉష్ణోగ్రత పెరగకుండా ఉండటానికి పంచె మాత్రమే సరైనదని పరిశోధించి, దానినే మాత్రమే కట్టుకోమన్నారు. పంచె బిగుతుగా ఉండదు, వదులుగా ఉంటుంది. అందునా నూలు (కాటన్) పంచె వల్ల శరీర మరియు వృషణాల ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుందని, అది తెల్లది ధరించడంవల్ల వేడిని తిప్పికొట్టి శరీరాన్ని కాపాడుతుందని, చల్లగా ఉంచుటానికి దోహదపడుతుందని కేవలం పంచె మాత్రమే కట్టుకోవాలని శాసనం చేశారు.

ఇక స్త్రీల విషయంలో కూడా ఇంతే. బిగుతగా ఉండేవి, దళసరివి (జీన్స్ లాంటివి) కట్టుకోవడం చేత అండ విడుదల సమయంలో సమస్యలు వస్తాయి, సంతాన సమస్యలు విపరీతంగా వేదిస్తాయి. లెగిన్స్ లాంటివి ధరించడంచేత తొడల్లో రక్తప్రసరణ సక్రమంగా సాగదని తాజాగా జరిపిన పరిశోధనలో తేలింది. అంతేకాదు స్త్రీలకు సంబంధించి నెలసరి వంటి అనేకానేక సమస్యలకు మూలకారణం ఈ ఫ్యాషన్ దుస్తులేనట.. ఇంకా చెప్పలాంటే గర్భంధరిచే అవకాశాలు పూర్తిగా కోల్పోయినా ఆశ్చర్య పోనవసరంలేదు అని వైద్యులు అంటున్నారు..

ఇది కూడా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే తెలిసిన మహర్షులు చీర మాత్రమే కట్టుకోవాలని నియమం పెట్టారు. అందుకే ఆ కాలంలో సంతానసాఫల్య కేంద్రాలు లేవు. ఫ్యాషన్ పేరుతోనో, స్వేచ్చ అని చెప్తూనో, నాగరికం అని మనం ఈ విదేశిదుస్తులను ధరిస్తున్నాం. మన పిల్లలకు చిన్న వయసునుండే ఈ వస్త్రాలు వేసి వారికి తీరని ద్రోహం చేస్తున్నాం.

అలాగే వేదం ఒక్కసారి ఒక బట్ట కట్టుకుంటే దాన్ని ఉతకకుండా మళ్ళి కట్టుకోరాదని చెప్పింది.ఎందుకంటే మన శరీరం ద్వారా వచ్చిన చెమటలో సూక్ష్మక్రిములు మన ధరించిన వస్త్రాలకు అంటుకుంటాయి. స్నానం తరువాత విప్పిన బట్టలే మళ్ళీ ధరిస్తే రోగాలు వస్తాయని ఆయుర్వేదంతో పాటు నేటి ఆధునిక పరిశోధనులు తెలుపుతున్నాయి.

వేదం ఏమి చెప్పిన నిజమే చెప్తుంది. కఠినంగా అనిపించినా అనేకానేక కారణాలు వేద వచనం వెనుక

https://www.facebook.com/groups/638078683192004

సేకరణ

Tuesday, December 28, 2021

మీ మనస్సుని వాక్కు ని అదుపు లో పెట్టడం నేర్చుకుంటే కర్మలని జయించ వచ్చును.

కర్మలని జయించడం ఎలా ? ప్రారబ్ధం లో లేని కర్మలు.. ఏవి ? శరీరం మనస్సు వేరు కర్మ ఫలాలు అనుభవిస్తాయా ?
మన జీవితం లో మనకి బాధ కలిగించే ప్రతి కర్మ ఫలాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటాము.
పొద్దున లేచినప్పటినుండీ, శరీరం అనుభవించే బాధల వలన , పనులు సకాలం లో జరగక పోతే మనకి చిరాకు కలిగి, దానికి కారణం అని అనుకుంటున్న వాళ్ళని నిందిస్తుంటాము
. మనకి గౌరవ మర్యాదలు తగ్గాయని అహంకారం తో ఇతరులపై చిందులు వేయడం.
మన మనస్సుకి హాయిగా ఆహ్లాదం కలిగిలా ఇతరులు మాట్లాడక పోవడం చేత వచ్చే కోపం. మనకి ఇష్టమైన వారిని ఒకరు విమర్శిస్తే, వారిని తక్షణమే. దూరం చేసుకోవడం. కూడా ఒక చిత్రమైన కర్మ.. దీని వల్ల ఎంతో ప్రియమైన వారైనా, మనల్ని ఎంత ప్రేమించిన వారే అని తెలిసినా, ఒక చిత్రమైన వేదన తో దూరం చేసుకుంటాము
. ఇతరులు మనకి నచ్చిన వాళ్ళని తిట్టడం ,మనకి నచ్చని వాళ్ళని పొగడటం చేస్తే మనం క్రోధాన్ని అదుపులో పెట్టుకోలేక పోవడం వలన వచ్చే పోట్లాటలు. ఇవన్నీ మనం వర్తమాన కాలం లో చేస్తున్న అనవసరమైన కొత్త కర్మలు.
మనం ఇలా ప్రారబ్ధం లో లేని కొత్త కర్మలు చేస్తూ , వీటికి తగిన ఫలాలు అనుభవిస్తూ , “ఇదంతా నా ముఖాన రాశి ఉంది”. “నా ప్రారబ్ధం ఇది “ అని అనుకుంటున్నాము.
కష్టాలు మీ ప్రారబ్ధం కావచ్చు. ఆ కష్టాలని ఎదుర్కోవడం లో పడే మానసిక వేదన చిరాకు కోపం ఆందోళన ఇతరులని తిట్టడం మీ ప్రారబ్ధం లో లేవు.
ఈ సమయం లో మనం మనస్సు ని మాటని అదుపులో పెట్టుకోలేక పోవడం వలన దేనికి తగిన దుష్కర్మ ఫలం వెంటనే అనుభవిస్తాము.
మనస్సు వాక్కు అదుపులో లేక పోతే ఫలాలు తక్షణం వస్తాయి.. మనస్సుని మాటని అదుపులో పెట్టుకోగలిగితే, ఈ బాధలు వేదనలు ఏవీ రావు మనం అనుభవించనక్కర లేదు. శరీరం ఇంద్రియాల ద్వారా అనుభవించేది బాధ., సంతోషం:
మానవుడు మనస్సు ద్వారా అనుభవించేది వేదన , ఆనందం . మీ ఆనందం మీ చేతి లోనే ఉన్నది అనే విషయం అర్ధం అవుతున్నది కదా.
ఎదుటి వాడు మన గత జనం లో మనం వాక్కు ని దుర్వినియోగం చేస్తే , ఇప్పుడు దానికి ప్రతిగా ఎవడో వచ్చి నానా మాటలు అని వెళతాడు.
వాక్కు కనుక దుర్వినియోగం ఐతే దానికి ఫలితం వాక్కు అనుభవించవలసి వస్తుంది. అదే వాక్కు శిక్షించబడుతుంది. పదిమంది చేత నిందలు పడటం ద్వారాకాని, కొన్ని సార్లు అసాధారణ పరిస్థితుల్లో వాక్కు దూరం ఐనా ఆశ్చర్యం లేదు.
ఈ కర్మ సిద్ధాంత ధర్మసూక్ష్మం తెలిసి చిరునవ్వు నవ్వ గలిగితే , మీరు ఆ కర్మ జయించారు, కొత్త కర్మ కూడా చేయలేదు. కర్మలని జయించే పద్ధతి ఇదే
శరీరం బాధ పడుతుంటే మనస్సు బాధ పడక్కర్లేదు.” అయ్యో శరీరం బాధ పడుతోందే “ అని మీ మనస్సు కూడా వేదన పొందితే, మీరు లేని కష్టం అనుభవిస్తున్నారు అని అర్ధం.
అలాగే మన మనసు వేదన పొందితే , దానిని అదుపులో పెట్టుకోలేక పోతే వెంటనే శరీరం తీవ్రం గా ప్రవితం అవుతుంది అప్పుడు వివిధ వ్యాధులు రావచ్చు.
ప్రారబ్ధం ప్రకారం గతం లో ఎవరి మనస్సునో బాధించిన కారణంగా మీ మనస్సు మాత్రమే ఇప్పుడు కొద్ది కాలం వేదన పొందాలి మనస్సు అదుపు తప్పడం వలనా ఆ ప్రభావం శరీరం మీద పది ఏ హార్ట్ ఎటాక్ వచ్చినా ఆశ్చర్యం లేదు.
ఇది ప్రారబ్ధ కర్మ లో లేదు. కేవలం మనస్సు అదుపు లో లేనందువల్ల శరీరం అనవసరం గా అనుభవించే కొత్త కర్మ కొత్త వ్యాధి.
ఇది ఏ జాతకం లో కనిపించక పోవచ్చును. మనం తెలివితక్కువగా కొని తెచ్చుకునే కర్మలు వ్యాధులు జాతకమ్మ్ లో కనబడవు దీనికోసం జ్యోతిష పండితులని నిందించకండి .
మీ మనస్సుని వాక్కు ని అదుపు లో పెట్టడం నేర్చుకుంటే కర్మలని జయించ వచ్చును.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

నేటి జీవిత సత్యం. డ‌బ్బు నేటి ప్ర‌పంచాన్ని శాసిస్తుంది.

నేటి జీవిత సత్యం.

డ‌బ్బు నేటి ప్ర‌పంచాన్ని శాసిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాని అది ఉన్న ప్ర‌తిఒక్క‌రూ ప్ర‌శాంతంగా జీవిస్తున్నారా అంటే.. అయ్యుండొచ్చు అనిపిస్తుంది.
కౌటిల్యుడు(చాణక్యుడు) త‌న అర్థ శాస్త్రంలో ధ‌నం మూలం ఇదం జ‌గ‌త్ అనే మాట‌ను వినియోగించారు. కాని దాని అర్థం నేడు మ‌నం ఉప‌యోగిస్తున్న ప్రామిస‌రీనోట్లు(డబ్బు) కాదు.
ఒక‌ప్పుడు ధ‌నం అంటే బంగారం, వెండి, వ‌జ్రవైఢూర్యాలు. నేటికి స్టాక్ మార్కెట్లో వాటిదే రాజ్యం. ఎందుకంటే అవి శాశ్వతంగా నిలిచి ఉండేవి.
కానీ ప్రామిసరీ నోట్లు కాలిస్తే బూడిదవుతాయి. తడిస్తే ముద్ద అవుతాయి. ఏదో ఒకరోజు కనుమరుగు అవుతాయి.
కౌటిల్యుడి ఉద్దేశం ప్రపంచమంతటా వ్యవస్థ నడవడానికి ధనం కావాలి. ఆ ధనమే బంగారం. ఏ దేశంలో ఎంత ఎక్కువ బంగారం ఉంటే ఆ దేశం అంత ధనిక దేశం.
బంగారానికి అనుగుణంగా ప్రామిసరీ నోట్లను ప్రచురిస్తారు. ఇది ఆర్థికవేత్తలు చెప్పే మాట. సాధారణ ప్రజలకు అవగాహన తక్కువే ఉంటుంది.
బంగారం విలువ ఎన్నటికీ తరగనిది. పెరగడమే తప్ప తగ్గడం తెలియదు.
అలా అని మనం బంగారం తినలేము. వ్యవసాయమే ఆధారం. ఆ వ్యవసాయం వ్యాపారం అయ్యిందనేది బాధాకరమైన విషయం.
కానీ ఆ బంగారం కారణంగా మన దగ్గర ప్రామీసరి నోట్లు(డబ్బు) నేడు వ్యవసాయాన్ని శాసిస్తున్నాయి. ఆహార పంటల నుంచి వాణిజ్య పంటల వరకు డబ్బే అవసరమవుతుంది.
అంటే డబ్బు అవసరంగా మారింది. అది కాదనలేని విషయం. డబ్బు కావాలి. ఎలాంటి డబ్బు కావాలి అనే దానికి కూడా మన పెద్దలు స్పష్టమైన సూచనలు చేశారు.
మనం చూస్తూనే ఉన్నాం అన్యాయంగా ఎంత సంపాదించినా హాస్పిటళ్లకు తిరిగేవారు ఎక్కువ. న్యాయంగా నాలుగు రాళ్లు వెనకేసుకున్నవాడు ఆరోగ్యంగా ఉంటున్నాడు.
ఒక్కసారి డబ్బును సంపాదిస్తే డబ్బే డబ్బును సంపాదిస్తుందనే మాటలు ఏదో సినిమాలో చెప్పారు. కానీ మనం అన్యాయంగా సంపాదించే డబ్బు మనకు ప్రశాంతతను దూరం చేస్తుందని మరువద్దు.
భారతీయులు ఎంత సంపాదించినా దానధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ చింతనకే వినియోగిస్తారు. అందుకే మన పూర్వీకులు ఆనందంగా ఉండేవారు.
కానీ ధనం మూలం ఇదం జగత్ అనే మాటను మనలో చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. డబ్బుంటేనే అన్ని అనే విధంగా భావిస్తున్నారు.
డబ్బు అవసరం నుంచి వ్యసనంగా మారుతోంది. బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, స్నేహం, కుటుంబం అన్ని డబ్బు ఆధారంగానే సాగుతున్నాయి.
ప్రజల్లో స్వార్థం వెర్రి తలలు వేస్తోంది. అది సమాజ విచ్ఛిన్నం, వినాశనం వైపు వడివడిగా తీసుకెళ్తోంది.
వ్యక్తిత్వానికి, నైతికతకు, నిజాయితీకి, ఆత్మగౌరవానికి కాలం కాకుండా అవుతుంది.
అనైతిక విధానాల్లో సంపాదన కారణంగా.. అర్థాంతరంగా లేదా అనారోగ్యంతో ముగుస్తున్న జీవితాలు ఎక్కువ అవుతున్నాయి.
దారి తప్పిన సంపాదన విధానం డబ్బుతో పాటు కొత్త సమస్యలను తీసుకొస్తుంది.
కాబట్టి డబ్బు సంపాదించాలి.. కానీ ధర్మబద్ధంగా సంపాదించాలి.
సమాజం నుంచి మనం పొందిన దానిలో కొంత అదే సమాజహితానికి కేటాయించాలి.
మన పూర్వీకుల బాటలో మనం కూడా నడవాలి. న్యాయంగా సంపాదించిన సొమ్ము ద్వారా చేసే సేవ ఇతరులకు కూడా మేలు చేస్తుందని గుర్తుంచుకోవాలి.
కష్టే ఫలి అని చెప్పిన పెద్దల మాటలను నెమరువేసుకుంటూ డబ్బు అనే అవసరాన్ని నిజాయితీగా తీర్చుకోవాలి. శ్రమయేవ జయతే అనుకుంటూ ధనాన్ని పోగు చేసుకోవాలి.
ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని ఆనందంగా గడపాలి.

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

క్షమించడం హ్రదయానికి,
సంబంధించిన విషయం
మరిచిపోవడం మనసుకు
సంబంధించిన విషయం.
బంధం బలంగా ఉండాలంటే,
ఒక్కోసారి రెండు చేయడం మంచిది.

జీవితమూ పుస్తకమూ ఒక్కటే.
ఇంకా చదవని పేజీలలోనేఎన్నో ఆసక్తికరమైన అంశాలు దాగి ఉన్నాయి.అందుకే ఈరోజుని క్షుణ్ణంగా చదివెయ్యాలి.రేపనేది విధి గుప్పెట్లోదవడంవల్ల.

అవగాహన ఉంటే
అక్కడ అహంకారముండదు.

అవగాహన ఉంటే
అక్కడ గర్వముండదు.

అవగాహనంటూ ఉంటే
అక్కడ నువ్వే నేనా అనే
కుతంత్రాలుండవు.

అవగాహన ఉంటే
అక్కడ ప్రేమ నిలకడగా ఉంటుంది.

అవగాహన ఉంటే
అక్కడ దూరమైపోవడాలుండవు.

శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

📚మనిషిని చదవాలి!📝

📚మనిషిని చదవాలి!📝
మనం ఎన్నో విధాలైన పుస్తకాలు చదువుతాం. ఎంతో నేర్చుకుంటాం. తెలిసిన జ్ఞానం పది మందికీ పంచుతాం. మనం మనిషిని సరిగ్గా చదవడం లేదు. మనిషిని చదవడం అంటే ఎదుటి మనిషి స్వభావాన్ని, మాట తీరును, ప్రవర్తనను, మంచి-చెడులను అర్థం చేసుకోవడం. మనిషి సంఘజీవి. అన్ని విషయాల్లోనూ సామాజిక అవసరాలు తీర్చుకోవడానికి సాటివారి మీద ఆధారపడక తప్పదు. పంట ఒకడు పండిస్తున్నాడు. ఇల్లు వేరొకడు కడుతున్నాడు. గుడ్డ మరొకడు నేస్తున్నాడు. వేర్వేరు వస్తువులను వేర్వేరు వ్యక్తులు తయారు చేస్తున్నారు. మన దగ్గర డబ్బే ఉంది. ఆ డబ్బు ఖర్చుచేసి, అన్నీ కొని తెచ్చుకుంటున్నాం. అందుచేత చాలా మందితో మనకు అనుబంధం ఉంటుంది. సంబంధం ఉంటుంది. ఈ సంబంధాలను, అనుబంధాలను ఎంత వరకు కొనసాగించాలి? ఎంత వరకు పెంచుకోవాలి? ఎంతకాలం పటిష్ఠంగా ఉంచుకోవాలి? ఎవడు తన అవసరం కోసం మనల్ని పొగుడుతున్నాడు? ఎవడు చిత్తశుద్ధితో మనల్ని అభినందిస్తున్నాడు? ఇది గ్రహించడమే మనిషిని చదవడం అనిపించుకుంటుంది. మన జీవన యానానికి, భవిష్యసాధ నిర్మాణానికి ఇది చాలా అవసరం.
మనిషిని చదివే చదువు గ్రంథాలు, ప్రబంధాలు అధ్యయనం చేసినంత మాత్రాన వచ్చేది కాదు. అయితే వాటి అధ్యయనం కొంత వరకు తోడ్పడవచ్చు. కాని ఎదుటి మనిషి సంభాషణ, నడత, వృత్తి, ప్రవృత్తి, పరిశీలించి పరిచయాన్ని గాని, స్నేహాన్ని గాని పెంచుకోవడం మనిషికి శ్రేయోదాయకం. కొందరు పరిచయం కాగానే చనువు పెంచుకుని అతిగా స్నేహం చేస్తారు. అది మంచికి దారి తీయవచ్చు. కీడే కలిగించవచ్చు. ఏదయినా ‘అతి’ అనర్థదాయకమే! కొందరు ప్రతి మనిషిని, మాటను అనుమానిస్తారు. వాళ్ల మీద వాళ్లకే నమ్మకం ఉండదు. దీనివల్ల శత్రువులు పెరుగుతారు.

ఎదుటి మనిషిలోని నిజాయతీని గ్రహించగలగడానికి కూడా స్వతంత్రాలోచనశక్తి ఉండాలి. సానుకూల దృక్పథం అలవరచుకోవాలి. సహనశీలత పెంచుకోవాలి. నిందలను సహించేవారు వందనీయులే. శ్రీకృష్ణుడు నీలాపనిందకు గురైనా సత్యజిత్తును దూషించలేదు. ఆ నిందను తొలగించుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. సాత్వికగుణం సాటివాణ్ని అర్థం చేసుకునేందుకు సహకరిస్తుంది. రకరకాల విమర్శలకు గురవుతాం.

అంతటితో కుంగిపోనక్కర్లేదు. అది సద్విమర్శయితే అంతర్‌ విశ్లేషణ చేసుకుంటాం. అసూయతో చేసిన కువిమర్శయితే నిర్లిప్తంగా వదిలేస్తాం.
రామాయణ, భారత, భాగవతాల్లో అనేక సందర్భాల్లో

ఈ విషయానికి సంబంధించిన పాత్రలెన్నో కనిపిస్తాయి. ధర్మ పక్షపాతులైన పాండవుల శక్తిని గ్రహించక, అహంకరించి దుర్యోధనుడు అనుజులతో సహా పతనమైపోయాడు.

ధర్మస్వరూపుడు శ్రీరాముడి శక్తిని గ్రహించలేని మూర్ఖుడు దశకంఠుడు నిహతుడైపోయాడు. గోపికల మనసులను చదివిన కృష్ణ పరమాత్మ వారికి తోడునీడై ఆదుకున్నాడు.
మనిషిని చూడ్డానికి కళ్లు చాలు, కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి. ఇతరులను అర్థం చేసుకోలేనివాడు సమాజంలో జీవించలేడు. మనకు ఆపదలు వచ్చినప్పుడే అసలైన బంధువులు, మిత్రులు, హితైషులు ఎవరో తెలుస్తుంది. విశ్వసనీయుడని సాటి మనిషిని గ్రహించగలిగితే, ఆనందం మనకు నీడలా వెన్నంటే ఉంటుంది. మనతో కలిసి నవ్విన మనిషిని మరిచిపోవచ్చు, కానీ కష్టకాలంలో మనతో కలిసి దుఃఖించే మనిషిని మాత్రం మరచిపోకూడదు.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

*💥ఎన్నో జన్మల✨* *పుణ్యం 🌀🌈*

💥ఎన్నో జన్మల✨
పుణ్యం 🌀🌈


రాత్రి మట్టిలో నాటిన విత్తనం మూడోరోజు మొలకగా కనిపిస్తుంది. నల్లటి కారుమబ్బు వద్దన్నా జలజలా చినుకులు రాలుస్తుంది. ప్రకృతిలో ప్రతీది సహజంగా జరిగిపోయే ఏర్పాటు ఉంది.

జీవితమూ అంతే. అది జీవించడానికే. జీవించడమే గొప్ప సాధన. సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. గొప్పగా జీవిస్తే దివ్యత్వం కనిపిస్తుంది.

అష్టాంగ యోగ మార్గాలు, అష్టాదశ పురాణాల్లో మంచి విషయాలు దివ్యంగా జీవించే నరుడి ముందుకొచ్చి దర్శనం ఇస్తాయి

అందుకే యమ-నియమాలు ముందుగా చెప్పి తరవాత సాధనక్రమం అంతా చెబుతారు. మంచితనం లేనివాళ్లకు యోగం అబ్బదు. చెడ్డవాళ్లకు ఆలోచనలు అడ్డగించడం వల్ల ధ్యానం కుదరదు. పరిశుభ్రత లేనివారికి, ఆరోగ్యదాయకమైన యోగా అనుకూలపడదు. భక్తి లేనివారికి జ్ఞానం ఒంటపట్టదు.

జీవించడంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి. జీవితం ఈశ్వర ప్రసాదం. భక్తిగా రెండు చేతులు పైకెత్తి దివ్యజీవనాన్ని ఆహ్వానించాలి. ఆటుపోట్లతో, హెచ్చుతగ్గులతో, సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా తలవంచుకుని అనుభవించాలి. నిజమైన సాధన ఇదే.

ఊపిరి ఆపడం, భూమిలోకి దిగబడిపోవడం, ముళ్లమీద పడుకోవడం అభ్యాసం వల్ల వస్తాయి. నేల విడిచి సాము చేసినట్లు జీవితాన్ని గాలికి వదిలెయ్యకూడదు.

జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధన శిఖరాలకు చేరినట్లే. ఒక దీపం మరోదీపం వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో కాంతిని నింపాలి. అంతకంటే మనిషికి సార్థకత లేదు. సాధన చేసి సత్యం తెలుసుకున్న మానవుడు చివరికి ఇలాంటి పనులకే పూనుకొంటాడు. పూనుకోవాలి.

ఆధ్యాత్మిక జీవితం అనేటప్పటికి సాధనలమయం అనే భావన ఉంది. పుట్టుక నుంచి మరణం వరకు జరిగేది సాధనే. ఏం చేస్తున్నామో ఎరుకతో చేస్తే అంతా అద్భుతమైన సాధన. లేకపోతే బతుకే అయోమయం.

పురుగు, పక్షి, పాము, చెట్టు... అన్నీ జీవిస్తున్నాయి. మరి మనమెందుకలా నేను అనేది లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం? బుద్ధి కలిగిఉండటం మనిషికి వరం, శాపం కూడా. నేను లేకుండా చేసుకుంటే బుద్ధి వరం. నేనును మేరుపర్వతమంత పెంచుకుంటే బుద్ధి శాపం.

చిన్న ‘నేను’ నుంచి పెద్ద ‘నేను’ వరకు సాగే అతిపెద్ద జీవనమే అత్యంత అద్భుతమైన సాధన. చిన్న నేను అర్జునుడు. పెద్ద నేను శ్రీకృష్ణుడు. అతి పెద్ద జీవనం కురుక్షేత్ర యుద్ధం. అత్యంత అద్భుతమైన సాధన భగవద్గీత.

శ్రీరాముడు జీవించాడు. మనిషిగా తన కర్తవ్యం నిర్వహించి, దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు. జీవితం అవకాశం ఇస్తుంది. అంతే. దాన్ని సద్వినియోగపరుచుకోవాలి.
కారణజన్ముడికైనా, అకారణ జన్ముడికైనా- బాధలు, కష్టాలు ఒకటే. విధిరాత మారదు. జీవితాన్ని భయపెట్టేవాడికి జీవితమే భయపడుతుంది. మనలో ఉండే అద్భుతమైన, అసాధారణమైన, అసామాన్యమైన గుణగణాలు చూసి లోకం మోకరిల్లుతుంది.

పుట్టుకతోనే నోట్లో బంగారు చెంచాతో పుట్టినవాడినైనా జీవితం తడిగుడ్డ పిండినట్లు పిండక మానదు. ఇంతకంటే మహాసాధన ఉండదు.

మానవుడిగా పుట్టడం, ప్రకృతితో కలిసి జీవించడం, సత్యానుభవం కోసం తహతహలాడటం... ఎన్నో జన్మల పుణ్యం. ఏ ఉపనిషత్తూ ఈ విషయాన్ని కాదనలేదు.

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

✍️...నేటి చిట్టికథ

✍️...నేటి చిట్టికథ

గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషి కి ఒక సందేహం వచ్చింది!

వెంటనే గంగానదినే అడిగాడట!

అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు? తల్లీ! అని.

అందుకా తల్లి "నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను" అని బదులిచ్చిందట.

అయ్యో అన్ని పుణ్య నదులు ఇంతేకదా! పాపా లన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో?అనుకొని!

సముద్రాన్నే అడిగాడు!

ఎలా మోస్తున్నావు? ఈ పాపభారాన్ని!?! అని!

దానికా సముద్రుడు!

నేనెక్కడ భరిస్తున్నాను?! ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను' అని బదులిచ్చాడట.

అరే!!! ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది! అని అనుకుంటూ!

ఓ మేఘ మాలికల్లారా ఎలా భరిస్తున్నారు? ఈ పాప భారాన్ని! అని అడగగా!!!

అవి పకపకా నవ్వి! మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటి కప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'! అని బదులివ్వగా...

ఓహో!!!
ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నా మన్నమాట!

అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా! ఎవరూ కూడా! కర్మ ఫలితాలు వదిలించు కోలేమని!!!! గ్రహించాడు అక్కడ స్నాన మాచరిస్తున్న ఋషి!

ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే.

పరమశివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన శ్లోకమిది!.

ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును! ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగును!
అని... తీర్ధ స్నానమునకై పరుగు లెత్తెడు మానవులు "భ్రమకు లోబడిన వారు"!

ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నాన మాచరించని వారికి మోక్ష మెటుల కలుగును?!? అని ఈ శ్లోకం అర్థం.

కర్మ కర్మణా నశ్యతి కర్మ!

అంటే ..
కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

ఈ కథ చిన్నదైనా...* *ఇచ్చే సందేశం పెద్దది

🍁ఈ కథ చిన్నదైనా...
ఇచ్చే సందేశం పెద్దది
🍀🌹🌀🌻💥🦚

ఒకసారి "నవ్వుకు" "ఏడుపుకు"గొడవ అయ్యింది.
అప్పుడు "నవ్వు" చెప్పింది ఏడుపుకు....నీవంటే ఎవరు ఇష్టపడరు నీవు ఉంటే అందరికి బాధ .దేవుణ్ణి కూడా నిందిస్తారు అని....

దానికి సమాధానంగా "ఏడుపు"చెప్పింది... నీవు అతి అయితే జనానికి చాలా కష్టం అని.

నాయొక్క విలువ నీకు తెలియదు నా దగ్గర ఎన్నెన్నో భావాలు పంచుకొని ఒక్కసారి ఏడిస్తే మనసుకు సమాధానం అవుతుంది.

మనుషుల విలువ ఏమిటి అన్నది తెలియడానికే దేవుడు నన్ను సృష్టించాడు.

మనిషి చచ్చినప్పుడు ఎంతమంది ఏడుస్తారో దానిలోనే మనిషి యొక్క వ్యక్తిత్వం అర్థం అవుతుంది...

అందుకు "నవ్వు"...చెప్పింది నేనే శ్రేష్టం నా కంటే అందమైన అనుభవమే లేదు...

ఏడుపు... లేదు నేనే శ్రేష్టం నేను ఉంటే మనిషి భావనలకు విలువ...

ఇదంతా చూసిన దేవుడు నవ్వుకుని.... నవ్వు,ఏడుపు దగ్గరకు వచ్చాడు.మనిషి జీవితంలో మీరిద్దరూ ముఖ్యమే. అది ఎలానో చెబుతాను రండి.

అని ఒక గుడిసె దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్న ఒక వాస్తవాన్ని చూపించాడు.

ఒక బీద తల్లి తనకు మిగుల్చుకున్న అన్నాన్ని బిడ్డకు తినిపించి ఎంతో ఆనందం పొందుతుంటుంది.

అదే టైం లో అమ్మ తనకు పెట్టబోయే ముద్దను బిడ్డ తిరిగి అమ్మ నోటికే అందిస్తూ అమ్మా నీవూ తిను. నీకు కూడా ఆకలి అయ్యుంటుంది అన్నది.అప్పుడు ఆ తల్లి ఆనందంతో ఏడుపు వస్తుంటే నవ్వుతూ కళ్ళు తుడుచుకుంది....

కాబట్టి ఈ "నవ్వు"
"ఏడుపుల" కలయిక మనిషి జీవితంలో మరిచిపోలేని క్షణం....

మీరిద్దరూ చేరిన ఈ క్షణం చాలా అపురూపం....

నవ్వు ఏడుపు రెండు చేరితే మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుంది...

కాబట్టి మనిషి జీవితంలో మీ ఇద్దరు ముఖ్యమే...*

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

నేటి చక్కని కథ.

నేటి చక్కని కథ.

ఒకసారి ఒక గ్రామపంచాయతీలో బహిరంగన్యాయస్థానంలో ఒక సమస్యను పరిష్కరించడానికి పెద్దలు సమావేశమైయ్యారు. కొంత దూరంలో, ఒక సాధువు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పెద్దల న్యాయస్థానం ఏ నిర్ణయానికి రాలేకపోవడం వలన, తమ సమస్య పరిష్కారం కోసం సాధువును సంప్రదించమని ఎవరో సూచించారు.
వారంతా సాధువు దగ్గరకు వెళ్లారు. అంతమందిని చూసి సాధువు వాళ్ళని ఏం కావాలని అడిగాడు.
" మహాత్మా, గ్రామంలో ఒకే ఒక బావి ఉంది. మేము ఆ బావిలో నీరు త్రాగలేము." అని గ్రామస్థులు సమాధానమిచ్చారు.
సాధువు, " ఎందుకు, ఏమి జరిగింది? మీరు దాని నుండి నీరు ఎందుకు త్రాగలేరు?" అని అడిగాడు.
" మూడు కుక్కలు ఒకదానితో ఒకటి కొట్టుకుని బావిలో పడ్డాయి. అవి బయటకు రాలేక అందులో మునిగి చనిపోయాయి. ఇప్పుడు నీరు బాగా దుర్వాసన వస్తోంది, ఆ నీరు ఎలా తాగాలి?" అని గ్రామస్తులు అన్నారు.
సాధువు "ఒక పని చేయండి, పవిత్రమైన గంగానది జలాన్నిఆ బావిలో పోయండి" అని చెప్పాడు. అలా ఎనిమిది నుంచి పది బకెట్ల గంగాజలం బావిలో పోసినా సమస్య అలాగే ఉండిపోయింది.
ప్రజలు మళ్లీ సాధువు వద్దకు వెళ్లారు.
సాధువు, "సరే, మీరందరూ సమావేశమై భగవంతుని నామాన్ని జపిస్తూ, ప్రార్ధన చేయండి ," అన్నాడు.
ప్రజలు అలాగే అని, సాధువు సూచించినట్లు చేసారు, అయినప్పటికీ సమస్య అలాగే ఉంది.
ప్రజలు మళ్లీ సాధువు వద్దకు వెళ్లారు. ఈసారి సాధువు "బావిలో కొన్ని సువాసన వచ్చే పదార్ధాలు వేయండి" అన్నాడు. అది కూడా జరిగింది, కానీ సమస్య ఇంకా కొనసాగింది.
ఇప్పుడు ఇంక సాధువు స్వయంగా బావి వద్దకు వచ్చాడు.
ప్రజలు, "చూడండి స్వామీ, పరిస్థితి అలాగే ఉంది, మేం ప్రతిదీ ప్రయత్నించి చూసాం, పవిత్ర గంగాజలం పోశాం, ప్రార్థనలు, కీర్తనలు చేసాం, ప్రసాదం పంచాము, బావిలో సువాసనగల పువ్వులు, పదార్ధాలు వేసాం - ఇవన్నీ!"
సాధువు అయోమయంగా చూస్తూ అడిగాడు, "అన్నీ చేసారు, కానీ ఈ బావిలో పడి, చనిపోయిన మూడు కుక్కలను తొలగించారా?"
గ్రామస్తులు, "అదేంటి, మీరు అలా చేయమని మాకు చెప్పలేదు కదా, మేం వాటిని బయటకు తీయలేదు, మిగిలినవన్నీ చేసాం, కానీ కుక్కలు ఇప్పటికీ బావిలోనే ఉన్నాయి" అన్నారు.
సాధువు మొదట దిగ్భ్రాంతి చెందాడు, కాని ప్రశాంతంగా గ్రామస్తులకు ఇలా వివరించాడు, "నీటిలో పడి ఉన్న మూడు మృతదేహాలను బయటకు తీసే వరకు, ఎటువంటి బాహ్య చర్యలు ఎటువంటి ప్రభావం చూపవు, ముందుగా మీరు నీటి నుండి ఆ మురికిని బయటకు తీయాలి."
మన జీవిత కథ కూడా అలాంటిదే. పల్లెటూరి వంటి మన దేహంలో కామం, క్రోధం, లోభం, అసూయ అనే అనేక జంతువులు పోట్లాడుకుని, మనస్సాక్షి అనే బావిలో చెదపురుగుల్లా చిక్కుకుపోయాయి. అవి మెల్లగా మన మనస్సాక్షిని లోపలి నుండి తినేస్తున్నాయి.
ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే... ఈ తెగులు నుంచి బయటపడేందుకు మనం ఏం చేస్తున్నాం?
మన జీవితాలను మెరుగుపరచుకోవడానికి బయటి నుండి చాలా కొత్త విషయాలను లోపలికి తీసుకుంటున్నాం, అయితే లోపల ఇప్పటికే కుళ్ళిపోయిన లేదా పేరుకుపోయిన వాటిని తొలగించడానికి మనం ఏమి చేస్తున్నాం? దీని గురించి ఒకసారి ఆలోచించండి.

నీతి.
మనం మనస్సాక్షిని శుభ్రంగా ఉంచుకుంటే, బయట కూడా ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది, మన అంతరంగాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే, బయట ప్రతిదీ కూడా అందంగా అవుతుంది.

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

నేటి జీవిత సత్యం. *💎సుగుణ భూషణం💥*

నేటి జీవిత సత్యం. 💎సుగుణ భూషణం💥

భౌతిక సంపదలకన్నా సుగుణ సంపద గొప్పది. ధన ధాన్య రాశులు ఎన్ని ఉన్నా పాప భీతి నశించిన భోగానుభవం ప్రమాదకరం.

రావణాసురుడు స్వర్ణ లంకను పరిపాలించాడు. కుబేరుణ్ని జయించి అంతులేని సంపదలు సమకూర్చుకున్నాడు. వేదాల్లో పాండిత్యం సంపాదించాడు. శాస్త్రజ్ఞానాన్ని ఎరుకపరచుకొని పంచభూతాలను తన నియంత్రణలోకి తెచ్చుకొన్నాడు. ఆయుర్వేదంలో ప్రజ్ఞ కలిగి రావణ సంహిత రచించాడు. గొప్ప శివ భక్తుడు. అయినా... ఒకే ఒక తప్పు... సీతాపహరణకు పాల్పడి- మానవుడి చేతిలో మరణించాడు.

సౌశీల్యం లోపించిన పుస్తక జ్ఞానం, మానవత్వాన్ని మరచిన శాస్త్ర విజ్ఞానం, సిద్ధాంతాలను విస్మరించిన పాలన మూలాన- సుగుణాల కారణంగా లభించే ఘన కీర్తిని ఎవరూ ఆస్వాదించలేరు. వినమ్రతను మించిన తపః సాధన లేదంటారు. సద్గుణాల కారణంగా లభించిన గౌరవానికి మించిన ఉత్కృష్టత లేదు. దయను మించిన సుగుణం ఉండదు.

మనకు శారీరక బలం ఉన్నప్పుడు ఎదుటివాడిని ఓడించడం సులువే. కానీ అతణ్ని గెలవడమే కష్టం. సుగుణశీలురు ఎన్నడూ ఇతరులను, శత్రువునైనా సరే- అణగదొక్కాలని అనుకోరు. పైకి తేవాలనే ప్రయత్నిస్తారు.

వశిష్ఠుడు విశ్వామిత్రుణ్ని బ్రహ్మర్షిని చేశాడు. మొదట్లో తనతో యుద్ధం చేసిన విశ్వామిత్రుడి వెంట యాగ రక్షణ కోసం రామ లక్ష్మణులను పంపడంలో వశిష్ఠుడు కీలకపాత్ర వహించాడు.

సుగుణాలు గలవారికి అసూయా ద్వేషాలు ఉండవు. గుణవంతుల్లో ఇతరులకు సహాయం చేయడమే గొప్ప లక్షణం. లోకంలో ఇదే అత్యుత్తమ సన్మార్గం. గుణ హీనులు పక్కదోవ పట్టిస్తారు. సుగుణాల్లో అద్భుత దైవత్వం ఉంటుంది. అందుకే సామాన్యులు ఆ దైవత్వాన్ని వెతికి పట్టుకోవాలి. అందుకోసం గుణవంతులతో స్నేహం చేయాలి. విభజించి పాలించడం ఒక పరిపాలనా సూత్రం అయితే కావచ్చు.... కానీ అది గుణహీనుల సూత్రం. సద్గుణాలు గలవాడు ఒక్కడే అయినా నలుగురితో కలిసిమెలసి ముందుకు నడిపిస్తాడు. గాంధీజీ చేసింది ఇదే. అందుకే ఆ సుగుణం అంత మంచి ఫలితాలను ఇచ్చింది. జాతి భవితనే మార్చింది.

మంచి నడత, క్షమ, ధైర్యం, కృతజ్ఞత అనేవి సుగుణ రాశులు. ఇందులో కృతజ్ఞత విచిత్రమైంది. కృతజ్ఞతను చూపకపోవడం, కృతజ్ఞతను చూపమని అడగడం... రెండూ పొరపాటే. మనం ఏదైనా పొందినప్పుడు కృతజ్ఞత వ్యక్తం చేస్తాం. కానీ ఇంతకంటే ఉన్నతమైన కృతజ్ఞత ఉంది. మనం ఏదైనా ఇచ్చేటప్పుడు చూపాల్సిన కృతజ్ఞత. మనం చేసేది సహాయం కాదు, సేవ అనే అనుభూతి కలిగినప్పుడు ఆ కృతజ్ఞత మనకు అలవడుతుంది.

సుగుణాలను సాధన చేయాలి. సుగుణ భూషణుడనిపించుకునేందుకు తహతహలాడాలి.

దుర్గుణాలు మనిషిని నీచస్థితికి దిగజారుస్తాయి. కామం లాంటి అగ్ని మరొకటి లేదు. ద్వేషంలాంటి భయానక స్థితి మరొకటి లేదు. మూర్ఖత్వం లాంటి బంధం ఇంకొకటి లేదు. దురాశ లోతు తెలియని వరద లాంటిది. అందుకే వీటికి దూరంగా ఉంటూ సుగుణాలన్నింటినీ పట్టుదలతో సాధన చేయాలి.

కోపం, అసహనం... మన పైనే మనం ప్రయోగించుకోవాలని బుద్ధుడు చెబుతాడు. ఎందుకంటే అవి గొప్ప సుగుణాలే అవుతాయి. సుగుణభూషణుడు తాను పొందిన కష్టాలను నీటిపై రాసుకోవాలి. తాను పొందిన కరుణను రాయిపై రాసుకొంటాడు.

దైవం మనకు ప్రసాదించిన వాటిపట్ల మనం కృతజ్ఞత చూపితే దైవం మనకు మరింతగా ప్రసాదిస్తాడు. ఎందుకంటే సుగుణభూషణుల పట్ల అంతర్యామి సదా అనురాగ హృదయుడై ఉంటాడు!

(ఈనాడు అంతర్యామి)

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

Monday, December 27, 2021

బాల్యం

బాల్యం

జారే అరుగుల ధ్యాసే లేదు
పిర్ర పై చిరుగుల ఊసేలేదు
అమ్మ చేతి మురుకులు లేవు
అలసట లేని పరుగులు లేవు
ఎత్తరుగులు మొత్తం పోయే
రచ్చబండలూ మచ్చుకు లేవు
వీధిలో పిల్లల అల్లరి లేదు
తాతలు ఇచ్చే చిల్లర లేదు
ఏడు పెంకులు ఏమైపోయే
ఎద్దు రంకెలు యాడకి పోయె
ఎక్కడా వెదురు తడికెలు లేవు
ఏ తడికకీ భోగి పిడకలు లేవు
కూరలమ్మే సంతలు లేవు
పెరుగులమ్మే ముంతలు లేవు
బువ్వా లాటల విందే లేదు
గవ్వలాటలు ముందే లేదు
కుప్పిగంతులు లేనే లేవు
కళ్ళ గంతలు కానే రావు
డ్రింకు మూతల గోలే లేదు
బచ్చాలాడే ఇచ్చా లేదు
కోతి కొమ్మచ్చి ఏమైపోయే
అవ్వా అప్పచ్చి ముందే పాయె
గూటీ బిళ్ళా గూటికి పోయే
తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె
గచ్చకాయలు మచ్చుకు లేవు
చింత పిక్కలు లెక్కకూ లేవు
ధారగా కారే ముక్కులు లేవు
జోరుగా జారే లాగులు లేవు
కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు
కొండముచ్చుని కెలుకుడు లేదు
బట్టన మురికి అంటక పోయె
మనసుకి మురికి జంటగ చేరె
కాకి ఎంగిలి కరువై పోయే
భుజాన చేతులు బరువై పోయె
అన్ని రంగులూ ఏడకో పోయె
ఉన్న రంగులూ మాసికలాయె
దానికితోడు కరోనా వచ్చె
బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె
బడిగంటల ఊసే లేదు
బడికి పోయే ధ్యాసే లేదు
మూతులన్నీ మాస్కుల పాలు
చేతులన్నీ సబ్బుల పాలు
ఆన్ లైన్ లో పాఠాలాయె
అర్థం కాని చదువులాయె
ప్రశ్నలకు జవాబులుండవు
కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు
ప్రస్తుత బాల్యం వెలవెల పోయె
దానికి మూల్యం ప్రస్తుత మాయే
రేపటి సంగతి దేవుడి కెరుక
నేటి బాలలకు తప్పని చురక
బాలానందం లేని జీవితం
మానవాళికే మాయని మరక.
మేమేఅదృష్టవంతులమ్!
1950-70 లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు.
ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము. లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము.
పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత
గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న
సామాజిక -ఆర్థిక పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి.
దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు.
ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది... అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.
పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.
పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన
ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.
దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!
ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.
ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.
మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు.
మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో. అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.
మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట
రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం
ఈ నాటికీ దాదాపు అందరం 48-65సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!
అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.
ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?
ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది

సేకరణ

మనిషి హృదయం

మనిషి హృదయం
🕉️🌞🌎🏵️🌼🚩

చెట్టును చెట్టుగానే చూస్తాడు. చెట్టులో ఏమీ అందం కనిపించదు. పుట్టను మట్టిగా చూస్తాడు. పుట్టలో చీమలు ఉన్నాయా, పాముందా అనేవి అతడికి అనవసరం. మంద్ర స్థాయిలో వీచినా, తీవ్రంగా వీచినా... గాలి గాలే. అందులో ప్రాణవాయువు ఉంటుంది. మనం బతుకుతున్నాం. అది కలుషితం కావడం వల్ల రోగాల పాలవుతున్నాం.
మనిషి గలగల పారే నదిని చూస్తాడు. అందులో నాచు, క్రిమి, కీటకాలు ఉంటాయి. ఆ నీళ్లు నేరుగా వాడకూడదు అంటాడు. సూర్యుడు వస్తాడు. వెళతాడు. అది ఆయన పని. చంద్రుడు సూర్యుడి మీద ఆధారపడి బతుకుతాడు. స్వయం ప్రకాశం లేదు. గ్రహాలంటారా? అవి సౌర వ్యవస్థలో ఒక భాగం. అలా తిరుగుతూనే ఉంటాయి. పని లేనివాళ్లు తిరుగుతున్నట్లు... ఇదీ వరస. ఇలా ఉంటాయి ఆ వ్యక్తి ఆలోచనలు... ప్రకృతిలో కలిసి బతుకుతాడు. ప్రకృతితో ఏం సంబంధం లేనట్లే ఉంటాడు. ప్రకృతిని ఒక యాంత్రిక వ్యవస్థగా చూస్తాడు.
సంఘంలో అందరితో కలిసి ఉన్నట్లు కనిపిస్తాడు. కాని అన్నీ వ్యావహారిక వ్యాపార సంబంధాలే నెరపుతుంటాడు. డబ్బు లేకపోతే గౌరవం ఎక్కడ ఉంది? అసలు గౌరవం ఎక్కడ ఉంది? అన్నీ ఇచ్చి పుచ్చుకోవడాలే కదా. కనుక వ్యాపారం లేకపోతే బతుకే లేదంటాడు.
భావాలు, స్పందనలు, సౌందర్య ఆరాధన, లాలిత్యం, సౌకుమార్యం, జీవనం మీద నమ్మకం... అతడిలో మచ్చుకైనా కానరావు.
పుట్టాం. బతుకుతున్నాం. చావాలి. దానికోసం ఎదురు చూడాలి. అంతా భౌతికమే. కనిపిస్తున్నవాడే మనల్ని రక్షించడం లేదు. కనపడనివాడు ఏం రక్షిస్తాడు? అదంతా పెద్ద భ్రమ. మాయ. కొంత మంది మనుషులు కూడగట్టుకొని చేస్తున్న గారడి అని తలపోస్తాడు.
ఇలాంటి భావాలతో కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్లనెవరూ కాదనలేరు. వాళ్లు ప్రపంచాన్ని చూసే విధానం భిన్నంగా ఉంటుంది.
మనిషి మనిషిలా ఉండాలి. సహజ మానవ స్పందనలను నిగ్రహించుకుని హృదయాన్ని కోల్పోకూడదు. హృదయం లేకపోతే ప్రేమ ఉండదు. ప్రేమ లేకపోతే విశ్వ సౌందర్యం తెలియదు. ఈ జగత్తును ఇంత అద్భుతంగా సృష్టించడం వెనక విధాత ఉద్దేశాన్ని ఎప్పటికీ గ్రహించలేం.
ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం సృష్టి సూత్రం. అంతా ఒక గొప్ప సంగీత వాయిద్యం మీద పలికించే దివ్య రాగాల ఝరి.
నిమిత్తమాత్రంగా ఉండటం మంచిదే. అది జ్ఞానోదయమై సత్య రహస్యం తెలుసుకున్నప్పుడు ఏర్పడిన దివ్య వైరాగ్య స్థితి. అజ్ఞానంతో తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకుని హృదయానికి, మనసుకు ఉన్న లంకెను తెంచుకుని తామరాకు మీద నీటిబొట్టులా బతుకుతున్నానని చెప్పుకోవడం సరి కాదు.
సత్యం శివం సుందరం ఏమిటో బోధపడాలంటే మనసులోని యాంత్రికతను తొలగించుకుని, తర్క వితర్కాలతో కూడిన మనసును జీవన తత్వంలో ఉన్న ప్రేమతో అనుసంధానం చేసుకోవాలి. నమ్మకం, అపనమ్మకం మధ్యలో సత్యం నివసిస్తుంది. గొప్ప ఆలోచనలు దాన్ని చూపిస్తాయి.
మనిషి మట్టి మనిషే. అతడి హృదయం మాత్రం మట్టి కాదు. ప్రపంచం ఎలా ఉందో అలా చూడాలంటే లోపలికి చూడటం ఒక్కటే మార్గం. అక్కడ మట్టి మీద మొలిచిన మహా సౌందర్యలోకాలు ఎన్నో ఉన్నాయని అంతస్సౌందర్య వీక్షకులైన జ్ఞానులు చెబుతారు!*

- ఆనందసాయి స్వామి

🕉️🌞🌎🏵️🌼🚩

సేకరణ

మరణం అంటే ఏమిటి?

🔥మరణం అంటే ఏమిటి🔥💦


'ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది' అన్నది యక్షుడి ప్రశ్న. 'నిత్యం అనేకమంది తన కళ్ళముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవినని అనుకుంటూంటాడు మనిషి. ఇంతకన్న ఆశ్చర్యం ఇంకేముంటుంది' అంటూ బదులిస్తాడు యుధిష్ఠిరుడు.

ప్రతి మనిషికీ మరణం తప్పదు. అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే మరణం గురించి తెలుసుకోవటానికి మనిషికి క్షణం కూడా తీరికలేదు.
మనిషికి తన పుట్టుక గురించి తెలుసు. కాని, మరణం గురించి బొత్తిగా తెలియదు. దాన్నించి తప్పించుకోవటం అసంభవమనీ తలంచడు. చనిపోయాక ఏమవుతుంది, మరణం తరవాత మనిషి ఎక్కడికి వెడతాడు, అసలు మానవ జన్మకు ప్రయోజనమేమిటి, ఆత్మ అన్నది ఉన్నదా, శరీరాన్ని వదిలేశాక ఆత్మ ఎక్కడికి వెడుతుంది....

జీవితం మీద జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషికీ ఎదురయ్యే ప్రశ్నలివి. జీవించటంలో మునిగిపోయి ఈ ప్రశ్నలకు జవాబుల గురించి అన్వేషించడు. చివరికి ప్రాణాంతకమైన జబ్బుచేసినా, ఆఖరి క్షణాలు ఆసన్నమవుతున్నా- ఇంకా జీవితాన్ని ఎలా పొడిగించాలా అన్న ఆలోచనే తప్ప, జన్మాంతర జీవితం గురించి తలంచడు.

వాస్తవంగా తల్లి గర్భంలో పడినప్పటినుంచి మరణంవైపు మనిషి ప్రయాణం ఒక్కొక్క అడుగే సాగుతూంటుంది. ఓ క్షణం ముందుకు నడుస్తోందంటే ఆయుష్షులో ఓ క్షణం తరిగిపోతున్నట్టే కదా! బ్రహ్మ జ్ఞానులకు ఇది అసంబద్ధమనిపించదు. ఎందుకంటే, మరణానంతర జీవితం గురించి మన వేదాలు ఘోషిస్తున్నాయి కనుక. ఈ జీవితం ఎంత ముఖ్యమో, ఆ జీవితమూ అంతే అవసరం !

కొన్ని మతాలు మరణానంతర జీవితం గురించి భయపెడుతుంటాయి. జీవితం ఎంత స్వేచ్ఛాసుఖాలతో అనుభవించవచ్చో మరణం కూడా అంత స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో ముగించవచ్చని మన వేదాలు చెబుతున్నాయి.

కొందరు మతస్తులు మనిషికి ఒకే జన్మ ఉంటుందని, మానవ జన్మ తక్కువ సమయంలో ముగిసిపోతుంది కనుక వస్తు రూపేణా దొరికే సుఖాలన్నీ ఈ జన్మలోనే తనివి తీరా అనుభవించేయాలని బోధిస్తారు. మనిషికొకే జన్మ అని అనుకోవటంలో ప్రమాదమే అది. రేపో, ఎల్లుండో ఎలాగా పోతాం కనుక త్వరత్వరగా అన్నీ అనుభవించేయాలని పిచ్చి పరుగులు పెడుతుంటారు వాళ్ళు.

వేద పరిజ్ఞానమున్నవారిని మరణం భయపెట్టదు. వస్తురూపంగా చవిచూసే గుణాలకన్న మానసికంగా దొరికే ఆనందమే వారికి ముఖ్యం. జీవితం దారి జీవితానిదే! మరణం దారి మరణానిదే! మరణం జీవితానికి ఆఖరిమెట్టు. ఆత్మ జీవితం అనంత వాహిని. ఒక జన్మ ఆత్మ వేసుకునే వస్త్రం మాత్రమే! ఆత్మకు చావులేదు .

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 'అర్జునా! ప్రతి దేహంలో నివసించే దేహి లేక ఆత్మ నిత్యుడు. అవధ్యుడు. మరణమనగా దేహంనుంచి దేహి బయటికి వెళ్ళడం. దేహం ధరించే వస్త్రం లాంటిది. ఈ రెండింటి సంయోగం క్షణికమే! పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరించటం వంటిదే! ఆత్మ తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ఆశ్రయిస్తుంది' అని స్పష్టంగా చెప్పాడు.

ఏదో క్షణంలో ఈ జీవితం ముగిసిపోవచ్చు. ఈ ప్రశ్నలకు జవాబులు దొరక్కుండానే సమయం అంతం అయిపోవచ్చు. అందుకే, వస్తువుల ద్వారా దొరికే సుఖసౌఖ్యాలన్నీ కేవలం తాత్కాలికమేనని, శాశ్వతంగా లభించే ఆనందం వేరే ఉందని మనసులో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి. అప్పుడే ఈ మానవ జన్మకు ముక్తిమార్గం లభ్యమవుతుంది. దివ్యజ్ఞానం దక్కుతుంది. ఈ ఆత్మ పరమాత్మకెంతో దగ్గరని అర్థమవుతుంది.* 🤘

సేకరణ

ధర్మసూక్ష్మం అంటే ఏమిటి ?

☝ధర్మసూక్ష్మం అంటే ఏమిటి ?

📚✍️మురళీమోహన్

‘🙏ధర్మో రక్షతి రక్షితః’ అను సూక్తి అందరికీ తెలిసినదే. మనం ధర్మాన్ని రక్షిస్తే... ఆ ధర్మం మనలను రక్షిస్తుంది... అని దాని అర్థం. రక్షించడం అంటే.. కత్తి, కర్ర పట్టుకుని దానికి కాపలా కాయడం కాదు. ఆచరించదగినది ధర్మం. అయితే ఈ ధర్మం ఆచరించే విషయంలో మనకు ఎన్నో సందేహాలు కలుగుతాయి.

‘సత్యమునే పలుకుము...అసత్యము పలుకరాదు’ అనే సూక్తి మనకు తెలిసిందే.
ఈ సూక్తికి కట్టుబడి ఎన్నో త్యాగాలు చేసి పురాణపురుషులుగా ప్రసిద్ధికెక్కిన మహనీయులు మనకు ఎందరో ఉన్నారు.

అయితే...‘ప్రాణ, విత్త, మానభంగమందు బొంకవచ్చు’ అని శుక్రాచార్యునిచేత బలిచక్రవర్తికి చెప్పించాడు పోతనామాత్యుడు. అసలు ఏ మానవుడైనా ఈ మూడు సందర్భాలలోనే అబద్ధం చెప్పడానికి సిద్ధపడతాడు. మరి ఈ సంగతి తెలియకనేనా పోతనంతటివాడు, వ్యాసభగవానుని బాటలో నడిచి అలా పలికాడు?

‘ఆలస్యం అమృతం విషం’ అనే సూక్తితో పాటు ‘నిదానమే ప్రధానం’ అనే మరొక సూక్తి కూడా ఉంది. ఇలాంటి పరస్పర విరుద్ధమైన ధర్మాలు మనకు ఎన్నో ఉన్నాయి. వీటిని ఎలా ఆచరించాలి అనే విషయంలోనే సందేహాలు కలుగుతాయి. అప్పుడే ఆ ధర్మాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి. ఇందుకు నిదర్శనంగా ఒక కథ చెప్తాను.

దండకారణ్యంలో ఓ ఋషి ఆశ్రమం కట్టుకుని శిష్యులకు విద్యాదానం చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ ఋషి ధర్మనిష్ఠాగరిష్ఠుడు...సత్యవాది. అతని ఆశ్రమానికి రెండు ప్రక్కల అరుగులు ఉన్నాయి. ఒకరోజు ఆ ఋషి కుడివైపు అరుగు మీద కూర్చుని శిష్యులకు విద్యాబోధన చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఆవు ప్రాణ భయంతో ఆర్తనాదం చేస్తూ ఆ ఆశ్రమం ముందునుంచి పరుగెత్తుకుని వెళ్లింది. అది చూసాడు ఆ ఋషి. ఓ వేటగాడు ఆ ఆవును తరుముతున్నాడని గ్రహించాడు. వేటగాడు వచ్చి ‘ఇలా ఆవు వెళ్ళిందా’ అని అడిగితే ‘అబద్ధం ఆడరాదు’ అనే దర్మానికి కట్టుబడి ‘వెళ్ళింది’ అని చెప్పాలి. అలా చెబితే తాను గోహత్యకు కారణభూతుడవుతాడు. ఒక్క క్షణం ఆలోచించి తన శిష్యులతో సహా ఆ అరుగు మీదనుంచి లేచి, ఎడమవైపు అరుగుమీద కూర్చుని, శిష్యులను మౌనంగా ఉండమని చెప్పి విద్యాబోదన చేస్తున్నాడు. కొంతసేపటికి ఓ వేటగాడు అక్కడకు వచ్చి ‘అయ్యా...ఇలా ఏదైనా ఆవు పరుగెత్తుకుని వెళ్లిందా?’ అని ఆ ఋషిని అడిగాడు. గురువుగారు ఏం చెప్తారా అని శిష్యులు ఆత్రంగా చూస్తున్నారు. ఆ ఋషి వేటగాని వంకచూసి ‘నాయనా.. ఈ అరుగు మీద కూర్చుని నా శిష్యులకు పాఠం చెప్తున్నప్పటినుంచి ఏ ఆవు ఇలా వెళ్ళలేదు’ అని బదులిచ్చాడు. వేటగాడు సంతృప్తిచెంది వచ్చిన దారినే వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఋషి కుడివైపు అరుగు మీద కూర్చుననప్పుడు ఆవు వెళ్లింది సత్యం. అందుకే ఋషి అరుగు మారి కూర్చున్నాడు. అప్పుడు ఏ ఆవు అటు వెళ్లలేదు. అదీ సత్యమే. అదే చెప్పాడు ఆఋషి. ఋషి అసత్యము ఆడలేదు. ఆవు రక్షించబడింది. ఇదీ కథ.

మంచి పని చేసే విషయంలో ఆలస్యం పనికిరాదు. అప్పుడు ‘ఆలస్యం అమృతం విషం’ అనే సూక్తితని పాటించాలి. చెడు పని చేసే విషయంలో ‘నిదానమే ప్రదానం’ అనే సూక్తిని పాటించాలి. అదే దర్మసూక్ష్మం. ఈ సూక్ష్మాన్ని గ్రహించగలిగినవాడే ధర్మాన్ని రక్షిస్తాడు. ధర్మం చేత రక్షింపబడతాడు.🙏

సేకరణ

కాథలిక్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన "మార్టీన" అనే ఆవిడ హిందూధర్మం పై... వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ప్రతి హిందువు తెలుసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది.

కాథలిక్ క్రిస్టియన్
కుటుంబంలో జన్మించిన
"మార్టీన" అనే ఆవిడ
హిందూధర్మం పై...
వెలిబుచ్చిన
అభిప్రాయాన్ని

ప్రతి హిందువు
తెలుసుకుని
ఆలోచించాల్సిన
అవసరం ఉంది.

నేను
ఒక కాథలిక్ క్రిస్టియన్
కుటుంబంలో జన్మించాను .

నాకు చిన్నప్పటినుండి
మా చర్చి ఫాస్టర్..

యేసు ఒక్కడే దేవుడు
అని చెప్తుండే వాడు.

ఐతే
నాకు అంతగా
అతని మాటలు
నమ్మబుద్ధి కాలేదు.

నేను
పాత,
కొత్త నిబంధనలు చదివి...
మా పాస్టర్ ని అడిగాను.

భూమి ఆకారం గురించి
బైబిల్
ఎందుకు
తప్పుగా చెప్పింది?

తండ్రితో
కూతురు కామాలీలల్లో
పాల్గోవచ్చు అని ఉంది ...

ఇంతకు
బైబిల్ ముఖ్య ఉద్దేశం
ఏమిటి?

ఒక గ్రంధంలో
ఇలాంటి వాటికి
ఎలా స్థానం కల్పించారు?...

అని ప్రశ్నించేసరికి...

ఆ చర్చి సభ్యులు
నన్ను ఇంకోసారి
చర్చికి రావొద్దు!
అని నన్ను
అక్కడ నుండి తరిమేసారు.

అప్పుడు వయస్సు
13 ఏళ్ళు.

ఆ తరువాత
నాకు ముస్లిం స్నేహితులతో
పరిచయం అయింది.

ఒకసారి
మసీద్ కు వెళ్ళగా...
అక్కడ నాకు
చేదు అనుభవం
ఎదురయ్యింది.

నేను ముందు
హిజాబ్ వేసుకోవాలని
ఆర్డర్ ఇచ్చారు.

హిజాబ్ వేసుకొని
ఇంటికి వెళ్లి
అక్కడే
నమాజ్ చేయాలనీ...

"ఓ అల్లాహ్ నేను పాపిని,
నేను
ఏ జన్మలోనో
ఎంతో పాపం చేశాను...

అందుకు
నన్ను మహిళగా
సృష్టించావు" అంటూ
వేడుకోవాలని చెప్పారు.

ఆమాట విని
నాకు కన్నీళ్ళు ఆగలేదు.

అల్లాహ్ ఎవ్వరు?
అని ...నేను అడిగాను

అల్లాహ్
దైవం అని...
అల్లాహ్ కి
రూపం లేదు అని ...
వాళ్ళు చెప్పారు .

రూపం లేని దైవానికి
మగాడు
అనే ఎలా ముద్ర వేసారు?
అని అని అడిగాను.

"మొహమద్ ప్రవక్త
చెప్పారు"
అని మాత్రమే వాళ్ళు
బదులిచ్చారు.

అప్పుడే అర్ధం అయ్యింది.

ఇస్లాంలో
మహిళలకు
చాలా తీవ్రమైన
ఇబ్బందులు
ఉన్నాయి అని...

ఇస్లాంలో
మహిళలను
కేవలం కామావాంఛ
తీర్చుకోడానికి
ఒక బొమ్మగా
ఉపయోగిస్తారు అని...

మహిళలకు
మసీద్ లోపలికి
ప్రవేశం కూడా ఉండదు
అని తెలిసింది.

మహిళను
ఎంత అపవిత్రంగా
చూస్తున్నారో తెలుసుకొని...
నాలో నేను
కుమిలిపోయాను.

అలా కుమిలిపోతూ
ఏడుస్తున్న తరుణంలో...
ఒక వృద్ద మహిళ
నా చెంతకు వచ్చి ...

పవిత్రమైన భావాలకు
ఆధ్యాత్మికతకు నిలయం
"భారతదేశం" అనీ....
కొన్ని ఆధారాలతో
నాకు మొత్తం
వివరించి చెప్పారు .

ఐతే
నేను ఆమె మాటకు
అంత ప్రాముఖ్యత
ఇవ్వలేదు .

ఎందుకంటే
ఇంతకుముందు వెళ్ళిన
మతాలలో
మహిళలకు విలువ లేదు
అని తెలుసుకున్నాను.

భారతదేశంలో
మహిళల పరిస్దితి ఇంకా
దారుణంగా ఉంటుంది
అని పాస్టర్ చెప్పిన
వాఖ్యలు గుర్తొచ్చి ...

ఇంక హిందుత్వం వైపు
వెళ్ళకూడదని
నిశ్చయించుకున్నాను.

ఒక రోజు
నా స్నేహితురాలు
భారతదేశం నుండి
తీసుకు వచ్చిన
గంగ నీళ్ళు ఇచ్చి
నన్ను త్రాగామని చెప్పింది.

ఎందుకో కొంచెం
అయిష్టంగానే తాగాను.

నేను
నా స్నేహితురాలిని అడిగా
"గంగ ఎవ్వరు?
ఏమిటి ఈ కధ?" అని.

"గంగ అంటే నీరు...

భారతీయులు
మంచి నీటిలో
దైవాన్ని చూస్తారు.

గంగానదిని
'గంగాదేవి' అని
దేవతగా పూజిస్తారు
అని ఆమె చెప్పింది.

" నేను
ఆశ్చర్యంగా అడిగా
"గంగ మహిళ కదా,
మరి మహిళ మీద
అక్కడ వివక్ష చూపరా?"
అని అడిగాను.

అప్పుడు ఆమె చెప్పింది...

"వాస్తవానికి
భారతీయులు
ఆరాధించేది...
భూమాత,
వేదమాత,
గోమాత,
ధన మాత,
ధాన్యమత,
గంగామాత " అని...

ఇలా భారతీయులు
ప్రతి
మంచి విషయాలలో కూడా
మహిళలకే
ప్రథమస్థానం ఇస్తారు.

ప్రతి ప్రాణిలోనూ
మంచిని చూస్తారు.

మనం
అక్కడికి వెళితే తప్ప...

మనకు
భారతీయత యొక్క
పవిత్రత తెలియదు
అని ఆమె చెబుతుంటే
ఆశ్ఛర్యపోయాను.

అప్పుడు
నేను అడిగా ...

"మరి
అంత మంచి
హిందుత్వం కదా,
మరి నేడు ప్రపంచంలో
అత్యధిక శాతం
క్రిస్టియన్ మతం,
ఇస్లాం మతం
ఎందుకు
తీసుకుంటున్నారు?

ఆమె
దానికి చాల చక్కగా
జవాబు ఇచ్చారు

"స్వర్గం చాల చిన్నది...

నరకం చాల పెద్దది.

నరకం వైపు వెళ్ళడానికి
అన్ని తలుపులు
తెరిచి ఉంటాయి.

కానీ
స్వర్గం వైపు
పయనించాలంటే ....

ఒక చిన్న ఇరుకు సందులో
నుండి ప్రయాణించాలి"

అనే సమాధానం
నా గుండె
అంతర్భాగానికి తాకింది .

ఆ మరుసటి నెలలో
నేను భారతదేశానికి
ఎలాగైనా వెళ్లి
అక్కడ వాస్తవ రూపం
తెలుసుకోవాలి
అని అనుకున్నాను.

ఇప్పుడు
ఇక్కడికి వచ్చిన తరువాత
తెలుసుకున్నాను...
"ప్రపంచానికి
తల్లీ,తండ్రి లాంటిది
ఈ వేద భూమి
భారతదేశం .

ఇక్కడ ఉన్న ప్రేమ
ప్రపంచం మొత్తం
ఎక్కడ వెతికినా దొరకదు.

నాకు
ఇంకో జన్మంటూ ఉంటే ...
ఈ వేద భూమిలో
ఒక మహిళగా
పుట్టాలని ఉంది" అంటూ...

స్థానికి ఛానల్ కి
ఇచ్చిన ఇంటర్వ్యూ లో
మార్టీన చెప్పింది. -
(Hindu Jwala నుండి)

హిందూధర్మం
సనాతన ధర్మము...
పునాది చాలా బలమైంది.

మధ్యలో
కొన్ని లో


ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

https://kutumbapp.page.link/6496bNDVnYcHKiNo9

సేకరణ

🍁ఐశ్వర్యము🍁

🍁ఐశ్వర్యము🍁

📚✍️మురళీమోహన్

💰 ఐశ్వర్యం అంటే అందరు ఏమనుకుంటారంటే ధనము ,సంపదలు ,ఆస్తులు ,అంతస్తులు అని అనుకుంటారు .కాని నిజమయిన ఐశ్వర్యము అంటే ...

ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి
సంపూర్ణమైన ఆరోగ్యముతో జీవిస్తూ ఉంటాడో ,

ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి
సంపూర్ణమైన ఆనందముతో జీవిస్తూ ఉంటాడో ,

ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి
సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటాడో

అతడే ఐశ్వర్య వంతుడు .దీనినే సంపూర్ణ ఐశ్వర్యం అంటారు .
అంతే గాని చనిపోయేంతవరకు సంపాదిస్తూ పోతూ ,సంపాదించిందంతా వైద్యాలయానికి పోయడం కాదు ఐశ్వర్యమంటే ,

చనిపోయేంతవరకు ఇంటిలో గాని ,వీధిలోగాని ఘర్షణలతో జీవించడం కాదు ఐశ్వర్యమంటే ,

చనిపోయేంతవరకు సంపాదించిన ధనము వల్ల శత్రువులను , ఈర్షపరులను , ఎవరు నాకు హాని తలపెడతారు అని భయముతో జీవించడము కాదు ఐశ్వర్యమంటే ,

చనిపోయేంతవరకు నీ నిజస్వరూపాన్ని తెలుసుకొకుండా భగవంతునికోసం గుడి గోపురం తిరగడం ,తీర్ధయాత్రలు చేయడం కాదు ఐశ్వర్యమంటే ,

వీటినన్న్నిటిని జయించినవాడే ఐశ్వర్య వంతుడు .
శరీరము ఎవరైనా విడిచిపెట్టవలసినదే ఎవరైనా సరే ......

పుట్టినవాడు మరణించక తప్పదు ,మరణించినవారు మరలా పుట్టక మానరు .

ఆత్మ అవినాశి ఆత్మకు చావులేదు ,పుట్టుకాలేదు .కాని వున్నదంతా ఈ శరీరానికే .

అది తెలియక నేను ,నేను అంటూ వ్యామోహానికి గురై బాధపడుతున్నారు అందరు .
ఈ జీవితంలో ఏవిదంగా ఆరోగ్యవంతునిగా జీవించాలో ,
ఏ విదంగా ఆనందంగా జీవించాలో ,
ఏవిదంగా ఐశ్వర్యవంతునిగా జీవించాలో ,
ఏవిదంగా ఆధ్యాత్మికంగా జ్ఞానంతో జీవించాలో తెలియజేసేదే యోగ సాధన.

ఎవరు శరీరంతో వున్నంతవరకు ఏవిధంగానూ లోటుతో శరీరాన్ని వదలరాదు.👍

సేకరణ

Sunday, December 19, 2021

️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో, ఆత్మగౌరవంపై దృష్టి పెట్టే బదులు, ఇతరులకు గౌరవం ఇవ్వడం గురించి ఆలోచించాలి.

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో

♥️ కథ-46 ♥️

అనుభూతి : నా జీవితంలోని ప్రతీ ప్రేమపూరిత సంబంధానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను.

సంబంధాలలో పరివర్తన

ఉదయం నుంచి మా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనిఉంది. మా అత్తగారి మొహంలో మెరుపుకు, వంటింట్లోంచి వస్తున్న వంటకాల సువాసనకు - రెంటికీ ఒకటే కారణం. ఆమె స్నేహితురాలు ఈరోజు భోజనానికి ఇంటికి వస్తున్నారు. ఇల్లంతా అలంకరించబడుతోంది.
నిన్న సాయంత్రం మాట్లాడుకుంటున్నప్పుడు, ఆమె తన స్నేహితురాలు ఈ రోజు వస్తున్నట్లు చెప్పారు.అందుకని ఆవిడకి బహుమతి కొనడానికి మేం మార్కెట్‌కి వెళ్ళాం, అత్తయ్యగారు, తన స్నేహితురాలికి ఒక మంచి, ఖరీదైన చీరను కొన్నారు.
ఈ రోజు ఆమె మరొక స్థాయిలో ఉన్నట్లుగా అనిపిస్తున్నారు! అత్తయ్యగారు ఉదయాన్నే ఉత్సాహంగా లేచి, నా కంటే ముందే వంటగదిలోకి ప్రవేశించి, చాలా ప్రేమగా,ప్రయాసతో తాను ముందే అనుకున్నవంటకాలను ఒకదాని తర్వాత ఒకటి సిద్ధం చేయడం ప్రారంభించారు.
ఆమె నిజంగా సంతోషంగా కనపడుతున్నారు, కానీ నేను.... నా ముఖం మీద నకిలీ చిరునవ్వుతో, బరువెక్కిన హృదయంతో ఆమెకు సహాయం చేస్తున్నాను.ఈరోజు మా అమ్మగారి పుట్టినరోజు. నా పెళ్లయ్యాక, మా అమ్మకి ఇది మొదటి పుట్టినరోజు. నేనేమో ఇక్కడ ఉన్నాను, నాన్నగారు ఆఫీస్ టూర్‌లో ఉన్నారు, మా సోదరుడు విదేశాలలో ఉన్నాడు, ఆమెతో ఎవరూ ఉండరు.
నేను నా మనస్సును బలపరుచుకుని, ఎలాగైనా అమ్మ దగ్గరికి వెళ్లాలని నిన్న నిర్ణయించుకున్నాను. అదే నేను మా అత్తగారితో మాట్లాడబోయాను, కానీ నేను ఏమీ అనకముందే ఆమె తన స్నేహితురాలి గురించి చెప్తూ - మధ్యాహ్నం భోజనం, సాయంత్రం, అందరం ఆమెతో కలిసి ఫన్ సిటీకి వెళ్తామని చెప్పారు.
అప్పుడు ఇంక నేను ఏం అనగలను? నేను మౌనంగా ఉండి పనిలో పడ్డాను. ఆసక్తి లేకుండా, నేను ఇంటిని అలంకరించడం ప్రారంభించాను, నేను కూడా తయారయ్యి, సిద్ధంగా ఉన్నాను. కాసేపటికి, డోర్‌బెల్ మోగింది, అత్తయ్యగారు తన స్నేహితురాలిని స్వాగతించమని నన్ను పంపారు.
నేను తలుపు తెరిచేసరికి, పెద్ద పుష్పగుచ్ఛం వెనుక దాగిఉన్న ముఖం చూసేసరికి, నా కళ్ళు పెద్దవి చేసి, తెల్లబోయాను!
అక్కడ నా ఎదురుగా మా అమ్మ నిలబడి ఉంది. అమ్మ నాకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి, ఆశ్చర్యపరుస్తూ నన్ను పలకరించింది.
నేను ఆశ్చర్యంగా, ఆనందంగా అమ్మ వైపు చూస్తూ నిలబడిపోయాను. "నా స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పవా?" అని మా అత్తగారు వెనుక నుండి అన్నారు.
" అమ్మా....మీ స్నేహితురాలా?" ఆశ్చర్యంతో అడిగాను.
"అరే, నేనేమీ అబద్ధం చెప్పలేదు! మేం స్నేహితులుగా ఉండకూడదని ఎవరు చెప్పారు?" అన్నారు అత్తయ్యగారు. "తప్పకుండా ఉండగలం! ఇది తన కోడలిని కూడా కూతురిలా ప్రేమించే వారికి మాత్రమే సాధ్యం." అంటూ ఆవిడ వెళ్లి అమ్మని కౌగిలించుకుంది.
ఆనందంతో నాకు నోట మాటరాలేదు, నా కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. నేను అత్తయ్యగారి చేతులను నా చేతుల్లోకి తీసుకుని,వాటిని కళ్ళకద్దుకున్నాను,అరచేతులను ముద్దుపెట్టుకొని, ఆమెను కౌగిలించుకున్నాను.
మా అమ్మ మమ్మల్ని చూస్తూ చెమ్మగిల్లిన కళ్లతో నవ్వింది.
బాంధవ్యాల పండుగను ఎంతో ప్రేమగా జరుపుకుంటూ,
ఒకవైపు మా అమ్మ - నాకు సంబంధాల ప్రాముఖ్యతను నేర్పితే,
మరోవైపు, మా అత్తయ్యగారు - హృదయపూర్వకంగా వాటిని ఎలా కొనసాగించాలో నేర్పించారు.
వాళ్ళిద్దరూ నన్ను చూసి నవ్వుతూ నిలబడ్డారు, నాకు కలిగిన అదృష్టానికి గర్వంతో ఇద్దరి మధ్య నిలబడి ఉన్నాను - నా కళ్లలో నీళ్లతో, ముఖంపై చిరునవ్వుతో.

♾️

" ఆత్మగౌరవంపై దృష్టి పెట్టే బదులు, ఇతరులకు గౌరవం ఇవ్వడం గురించి ఆలోచించాలి." 🌼
దాజి


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

అనువాదబృందం ఆంధ్రప్రదేశ్

సేకరణ

నేటి మంచిమాట. డబ్బు

నేటి మంచిమాట. డబ్బుకు ప్రాణం విలువ తెలియదు,డబ్బుకు బంధం విలువ తెలియదు,
డబ్బుకు జాలి,కనికరం,దయ,
మానవత్వం తెలియదు,
కానీధన దాహం ఉన్న మనుష్యులకు వీటి విలువ తెలియదు.చాలా బాధాకరం..

ప్రతి ఉదయం వెంట తెస్తుంది
ఒక వైవిధ్యాన్ని. నూతన అవకాశాన్ని..

సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి.. అలాగే జీవితంలో కష్టలూ..సుఖాలు కూడా అంతే... ఏదీ శాశ్వతంగా ఉండదు.. నీటి బొట్టు వంటి జీవితంలో.. ఎన్ని విడ్డూరాలో కదా.. ఆశ ఉంటే జీవితం శాసిస్తుంది..లేకపోతే స్తబ్దతగా ఉంటుంది... జీవితం అంతే.

అందరూ కాకపోయినా చాలామంది (Majority People) జీవితంలో.. జీవితం ఇద్దరిని పరిచయం చేస్తుంది..1)ఎం చేసిన భరించే వాళ్ళని.. 2)ఎంత ప్రేమించిన బాధ పెట్టె వాళ్ళని..

స్వచ్ఛమైన శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

నేటి మంచి కథ. *మనలో అహంకారం*

నేటి మంచి కథ.

మనలో అహంకారం నశించినప్పుడు భగవంతుడు మనవాడు అవుతాడు. నేను, నాది, నా అనే అర్థాలకు వాడు, వాడిది, వాడే అనే భావాన్ని జోప్పించాలి. భగవంతుడు తప్ప అన్యం ఏదీ లేదు అనే సత్యానికి మనం దగ్గర కావాలి. ‘సత్య నిష్ఠయే ఈ కలియుగానికి తరుణోపాయం’ అని శ్రీరామకృష్ణులు శెలవిచ్చారు. సత్యం అన్నది సత్ కు సంబంధించినటువంటిది. సత్ పరబ్రహ్మ వస్తువు. సత్ యే ఆనందం. ఆనందమే బ్రహ్మం.
ఒక వ్యక్తి తన స్వగ్రామం నుంచి కాలి బాటలో మరొక గ్రామానికి పని నిమిత్తం వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో చీకటి పడిన కారణంగా దారి తప్పి దురదృష్టవశాత్తూ ఒక పాడుబడిన బావిలో పడ్డాడు. అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ అతని చేతికి చెట్టుకొమ్మ ఒకటి దొరికింది. ఆ చెట్టుకొమ్మను పట్టుకు వ్రేలాడుతూ పైకి రావడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడక అలాగే వ్రేలాడుతూ ఉండిపోయాడు. ఉదయం వెలుతురు వచ్చిన వెంటనే బావిలో సగం లోతులో వ్రేలాడుతున్న అతను క్రిందకు చూసినప్పుడు పెద్ద పెద్ద బండ రాళ్ళు కనపడ్డాయి. వాటిని చూసి, ‘ఆహా! ఏమి నా అదృష్టం ఈ కొమ్మ దొరికి ఉండకపోతే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాణ్ణి’ అని అనుకోని భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఆపదనుండి బయట పడడానికి ఇంకొకరి సహాయం కోసం ఎంత అరిచినా ఎవరూ రాలేదు. అరిచి అరిచి సొమ్మసిల్లిన అతను వీళ్ళనూ వాళ్ళనూ పిలిచి ప్రయోజనం ఏమిటి భగవంతుణ్ణే పిలుస్తాను అని అనుకొని పిలవడం మొదలెట్టాడు, అంతలో ఒక వ్యక్తి వచ్చి నేను భగవంతుణ్ణి నీవు పిలిచావు కాబట్టి వచ్చాను’ అన్నాడు.
‘అవును, నువ్వు నిజంగా భగవంతుడివే! ఆలస్యం చేయక నన్ను పైకి లాగి కాపాడు’ అని బావిలోకి వ్యక్తి వేడుకున్నాడు. ‘నిన్ను కాపాడడానికి వచ్చాను. అయితే దానికి ముందు నేను వేసే కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది’ అన్నాడు. ‘ అడగవలసింది ఏమిటో త్వరగా అడుగు’ అన్నాడు లోపలి వ్యక్తి.
నన్ను నిజంగా భగవంతుణ్ణి అని నీవు విశ్వసిస్తున్నావా?’
దానికి బదులుగా బావిలోని వ్యక్తి, ‘విశ్వసిస్తున్నాను, నీవు నిజంగా భగవంతుడివే’ అన్నాడు.
‘నిన్ను కాపాడడం నా వల్ల సాధ్యమవుతుందని నీవు నిజంగా నమ్ముతున్నావా?”
‘నమ్ముతున్నాను’ అన్నాడు.
‘నేను ఏది చెప్పినా చేస్తావా?”
‘కచ్చితంగా చేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను’ అన్నాడు.
‘అలా అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. నువ్వు ఏ కొమ్మనైతే పట్టుకొని ఉన్నావో, దాన్ని వదిలేయి. నేను నిన్ను కాపాడతాను’ అన్నాడు భగవంతుడు
బావి లోపలి వ్యక్తి బయటి వ్యక్తిని చూసి, ఆయన చేతిలో ఏవిధమైన తాడు కానీ, నిచ్చిన కానీ, మరే విధమైన పరికరం కానీ లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డాడు. కొమ్మను వదిలితే భగవంతుడు రక్షించడం మాట అటుంచి, ముందు కిందనున్న బండరాళ్ళ మీద పది, తల పగిలి చస్తానని అనుకున్నాడు.
‘ఇది చాలా కఠినమైన షరతు. కొమ్మను వదలడం తప్ప, నువ్వు ఏం చెప్పినా చేస్తాను’ అన్నాడు బావిలోని వ్యక్తి.
‘నువ్వు ఏమీ చేయనక్కరలేదు. కొమ్మను వదిలితే చాలు’ అన్నాడు భగవంతుడు.
సరిగ్గా ఇదే రీతిగా మనం కూడా అహంకారమనే కొమ్మను పట్టుకొని వ్రేలాడుతున్నాం. ఎప్పుడైతే మనం ఆ అహంకారాన్ని వదులుకుంటామో అప్పుడు భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడతాడు. కాబట్టి, మనమందరం అహంకార శూన్యులుగా మారాలి.....*

సేకరణ. మానస సరోవరం

సేకరణ