Thursday, February 17, 2022

ఎలాంటి పనులకు - ఎలాంటి ఫలితములు!!! మహాభారతం లో భీష్మ - ధర్మజులకు జరిగిన సంభాషణ...

నేటి మాట

ఎలాంటి పనులకు - ఎలాంటి ఫలితములు!!!
మహాభారతం లో భీష్మ - ధర్మజులకు జరిగిన సంభాషణ ద్వారా పరిశీలిద్దాం!!

ఒక రోజు ధర్మరాజు...

" పితామహా.. మంచి పనులకు మంచి ఫలితాలు ఉంటాయి " అంటారు కదా...
" ఏ మంచి పనికి ఎలాంటి ఫలితము ఉంటుంది " అని అడిగాడు...

భీష్ముడు...

ధర్మనందనా.. ఒక్కో పనికి ఒక్కో ప్రత్యేక ఫలితం ఉంటుంది... ఆకలితో ఉన్న బాటసారికి అన్నం పెడితే వచ్చే ఫలితం అంతా ఇంత కాదు...
రోజూ చేసే అగ్ని ఉపాసన మన పనులను విజయవంతం చేయడానికి తోడ్పడుతుంది...

మనం మంచి వస్తువులు ఇతరులకు దానం చేస్తే మనకు అవసరమైన సమయాలలో ఆ వస్తువులు అయాచితంగా లభిస్తాయి...

మౌనం పాటిస్తే మన జ్ఞానం వృద్ధి చెందుతుంది...
తపస్సు చేస్తే అధిక భోగములు చేకూరుతాయి...
ఉపవాసం చేస్తే మనస్సు నిర్మలంగా ఉంటుంది...
అహింసా వ్రతము ఆచరిస్తే రూపము, బలము, ఐశ్వర్యము చేకూరుతాయి...
ఉపవాసం చేస్తే మనస్సు నిర్మలంగా ఉంటుంది, కేవలం ఫలములు, నీరు త్రాగి జీవించిన వాడికి రాజ్యప్రాప్తి కలుగుతుంది...
వేదములు చదివితే సుఖాలు ప్రాప్తిస్తాయి...
వేదార్ధము గ్రహిస్తే పరలోకసుఖము ప్రాప్తిస్తుంది...
సత్య వ్రతము పాటిస్తే మోక్ష ప్రాప్తి కలుగు తుంది...

ధర్మనందనా.. మంచి పనులకు మంచి ఫలితము కలిగినట్లే చెడుపనులకు కూడా చెడు ఫలితాలు కలుగుతాయి...

ఏ విత్తు వేస్తే ఆ చెట్టు మొలుస్తుంది అన్నట్టుగా మానవుడికి ముసలితనము వచ్చి పళ్ళు ఊడిపోయి, వెంట్రులకు రాలిపోయి, చెవులు వినపడక, కళ్ళు కనపడక పోయినా అతడిలో కోరికలు మాత్రము చావవు... ప్రాణములు పోయినా కోరికలు విడువవు...
ఇది మామూలు మనుషులకే కాదు పండితులకు కూడా ఈ బానిసత్వము తప్పదు...
ఆఖరిదశ వరకు ఈ కోరికల మీద మోహము విడిచి పెడదాము అన్న ఆలోచన కూడా రానివ్వరు...
వెలుపలి ప్రపంచంలో విహరించే వారికి పుణ్యకర్మలు సుఖాన్ని పాపకర్మలు దుఃఖాన్ని కలుగచేస్తాయి...
అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు...

దీనినిబట్టి - మనము ఎలాంటి పనులు చేయాలో - మనమే నిర్ణయించుకోవాలి!!🙏

🍂శుభమస్తు🍂
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

సేకరణ

No comments:

Post a Comment