Saturday, December 31, 2022

దత్తాత్రేయుని 24 గురువులు🍁* _*23. ఇరవై మూడవ గురువు -🕷️ సాలెపురుగు*,,. 24. ఇరవైనాలుగవ గురువు - 🐛 గొంగళి పురుగు

 *🍁దత్తాత్రేయుని 24 గురువులు🍁*

_*23. ఇరవై మూడవ గురువు -🕷️ సాలెపురుగు*_

📚✍️ మురళీ మోహన్ 

*👉సాలెపురుగు తన సాలీడు ఎంతో అందంగా మరియు ఎంతో నైపుణ్యంతో నిర్మిస్తుంది. దాన్ని కట్టడానికి ఎంతగానో శ్రమిస్తుంది. అలా నిర్మించాక ఆ సాలీడులో చాలా కాలం నివసించి తరువాత అవే సాలెపురుగులు తమ సాలీడును తామే తినేస్తాయి.*

*భగవంతుడు కూడా అంతే, ఈ మాయా సృష్టిని తానే నిర్మించి, ఆ సృష్టితో ఆటలాడి కొంత కాలం తరువాత మళ్ళీ తనలోనే లయం చేసుకుంటాడు. కానీ మనం మాత్రం ఈ సృష్టే నిజమనుకుని భ్రమిస్తూంటాం. కాని ఇదంతా అసత్యమే కేవలం సచ్చిదానంద బ్రహ్మము మాత్రమే సత్యమంటాడు దత్తాత్రేయుడు.*


_*24. ఇరవైనాలుగవ గురువు - 🐛 గొంగళి పురుగు*_

*గొంగళి పురుగు చిన్నగా ఉన్నప్పుడు దానిని పట్టుకున్న కందిరీగ దానిని తన గూటిలో దాచుకుని దానిని బంధించి దాన్ని కుడుతుంది. ఆ తరువాత దాని చుట్టే తిరుగుతూ  ఉంటుంది. అలా ఎందుకు తిరుగుతుందో అర్థం కాక భయపడిన గొంగళి పురుగు కాసేపటికి తనను తాను కందిరీగగా భావించుకుంటుంది. ఆ గొంగళి పురుగు కూడా తరువాత క్రమంగా అలా అలా తను కూడా కందిరీగగా మారిపోతుంది.*

*ఎవరైనా పదే పదే ఒకరి గురించి ఆలోచిస్తూ, ఎప్పుడు వారి గుర్తులే మనసులో ఉంచుకొని పదే పదే వారిని స్మరిస్తుంటారో అలాంటి వారు కొన్నాళ్ళకి వారు ఎవరినైతే ఊహించుకుంటారో, తాము వారు ఒకటేనని భావిస్తారు. ఇలాంటి సంఘటనలు మనం చూసేవుంటాం. అలాగే సాధకుడు కూడా ఎప్పుడూ పరమాత్మను గురించి ఆలోచిస్తే తన పరమాత్మలో లీనమౌతాడు. అందుకే మనిషనే వాడు మోక్ష ప్రాప్తికై ప్రయత్నించాలంటాడు దత్తాత్రేయుడు.🤘*

*🙏ధన్యవాదములు🙏*

🛕శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం🛕 📖కాల జ్ఞానము -26

 🛕శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం🛕 

         📖కాల జ్ఞానము -26

శ్రీ బ్రహ్మేంద్ర స్వామి చెప్పినవి_జరిగినవి....
బావిస్తున్నవి....‌

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంధాలలో రచించి భద్రపరచారు. వీటినే *కాలజ్ఞాన తత్వాలు* అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన ముందే చెప్పారు..

ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్నవి:

💥. నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు (విద్యుత్ శక్తి) (నీటితో జనరేటరు)

💥. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. (యంత్ర వాహనాలు)

💥. కాశీ పట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది.

💥. ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంధీ)

💥. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (ఎన్.టి.ఆర్, జయలలిత, ఎంజిఆర్ తదితరులు. చలన చిత్రాలు)

💥. రాచరికాలు,రాజుల పాలనా నశిస్తాయి. (ప్రజా ప్రభుత్వాలు)

💥. ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. (విమాన ప్రమాదాలు)

💥. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది.

💥. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి.

💥. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.

💥. రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి.(శ్రీలంకలోని తీవ్రవాద పణామాలు)

💥. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు.(లాల్ బహుద్దూర్ శాస్త్రి)

💥. కపట యోగులు విపరీతంగా పెరిగి పోతారు. వీరివలన ప్రజలంతా మోసపోతారు.

💥. దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి.

✒️సేకరణ 
💞విప్పోజు శ్రీనివాస ఆచార్య విశ్వకర్మ💕

Friday, December 30, 2022

 అజ్ఞానానికి మూలం నేను అనే మూల తలంపు. ఆ తలంపు మనసుతో బాటు నాశనమయితే మిగిలేది పరిపూర్ణమైన ఆత్మ. 

 నిత్యమూ గాఢ నిద్ర నుంచి మేల్కొలిపేది నేను అనే అహం కాదు. నేనుకు అతీతమైన ఆత్మ చైతన్యమని తెలుసుకోవాలి.

 దేహం ఒక ఉపాధి మాత్రమే అని గ్రహించాలి. ఇది నశించిపోయేది. నేను అనేది అహం నుంచి వెలువడితే అదే ఆత్మ. స్వరూపం. అపుడు నేనుగా భాసించేది ఆత్మ చైతన్యం.

దేహాత్మ భావన వల్ల పరమాత్మ, జీవాత్మలు వేరు అనే భేదం ఉత్పన్నమవుతోంది. అజ్ఞానం పొర తొలగినపుడు అంతటా వ్యాపించి ఉన్నది పరమాత్మేనని అవగతమవుతుంది.

భేద భావంతో కలిగిన ఆత్మ ఆజ్ఞానం తొలగినపుడు స్వాత్మానుభవం కలుగుతుంది. అదియే 'తత్త్వమసి'.

 ఆత్మ ద్వైతం కాదు. అద్వైతమనే తలంపు కలిగిన వెంటనే నేను ఆత్మయందు స్థితి కలిగి నిలిచిపోవును. అజ్ఞానం వల్ల ఏర్పడిన నేను అనే తలంపును ఆత్మ చైతన్యమని తెలుసుకున్న తరువాత వేరొక జ్ఞానం అవసరం లేదు.

 ఆత్మ వ్యయరహితం, జనన మరణాలు లేనిది, అనంతమైన సచ్చిదానందాన్ని కలిగి ఉన్నది.

 బంధ మోక్షాలకు అతీతమైనది ఆత్మ. నేను ఆత్మగా వెలుగొందుతుంది.

 నేను అనేది లేకుండా తనకు తానుగా విచారిస్తే సర్వ

సందేహాలు తొలగి ఆత్మతత్త్వము బోధపడుతుంది. అదే తపస్సు.  శాశ్వతానంద తత్త్వము. ఫలాపేక్షరహిత కర్మయోగం. అదియే పూర్ణత్వమని రమణ మహర్షి మానవాళికి తెలిపారు. ఇదియే ఆయన అనుభవ సారము.

రమణ మహర్షి జయంతి

 *రమణ మహర్షి జయంతి*

*డిసెంబర్ 30 శుక్రవారం రమణ మహర్షి జయంతి*

యోగి పుంగవులు, అవధూతలు, జ్ఞానులు వంటి ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు మన వేద భూమి. అటువంటి వారిలో దేహాత్మ భావనను జయించిన వారి కోవకు చెందిన వారు రమణ మహర్షి. అరుణాలచలం పేరు వినగానే తన జన్మకు విడిది అదేనని పులకించి, భవ బంధములు తెంచుకుని వెంటనే అరుణాచలేశ్వరుని సన్నిధికి చేరిన మహనీయుడు. ఈ సమస్తమూ ఆత్మ స్వరూపమని తెలుసుకున్నారు. అందువల్లనే రమణాశ్రమంలోని జీవులన్నీ ఆయన తో ఎంతో స్నేహంగా సంభాషించేవి. ఆయన పాదస్పర్శతో ఆ దివ్య క్షేత్రం ప్రకాశం మరింత పెరిగింది. పదకొండు సంవత్సరాల మౌన దీఓతో ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన మహర్షిని నదీనాం సాగరో గతిః అన్నట్టు మరొక పండితుడైన శ్రీకావ్యకంఠ గణపతి ముని వెతుక్కుంటూ వచ్చారు. ఆంధ్రప్రాంతం నుంచి అరుణాచలం వచ్చి వేంకటరామన్ అనే పూర్వ నామధేయుణ్ణి ఆయన మొట్టమొదట 'రమణ మహర్షి' అని సంబోధించారు. మౌన దీక్షను వీడి మొదట కావ్య కంఠ గణపతి మునితో సంభాషించేరు రమణ మహర్షి. సాధనతో పూర్ణత్వం సిద్దించదని, 'నేను' అనే దానిని తెలుసుకుంటే పూర్ణత్వంతో పనిలేదని ఉద్బోధించారు.

మానవుని అంతిమ లక్ష్యం ఆనందంగా ఉండడం. అలాగే జీవరాశులన్నీ ఆనందంగా బతకాలని తపన పడతాయి. పక్షులు తమ అనురాగాన్ని పంచుకుంటాయి. శునకాలు తమ చెలగాటాలతో ఆనందాన్ని పంచుకుంటాయి. క్రిమికీటకాలు కూడా పరస్పరం తమ సుఖమయజీవన లాలిత్యాన్ని రుచి చూస్తాయి. కాని మానవుని కున్న గొప్ప వరం చింతన. శాశ్వతమైన నిత్యానందాన్ని పొందడానికి నిరంతరం చింతన చేయాలి.

సకర్మలు కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు. అప్పుడే పుట్టిన శిశువు తన యదార్థ స్థితిలో నుంచి నిత్యానందంలో రమిస్తుంది. ఆకలి వేసినపుడు రోదిస్తుంది. తల్లిపాలతో ఆకలి తీరగానే తిరిగి ఆనంతలోకంలో విహరిస్తుం ది. కానీ అన్నం రుచి చూసిన తక్షణం అజ్ఞానపు పొర ఆవహించి భ్రమలో బతకడం ప్రారంభిస్తుంది. షడ్వికారములతో యాత్ర చేసిన జీవుడు తుదకు మరొక యోని కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి. జనన మరణ చక్రం అనివార్యం. దీనికి కారణం అజ్ఞానం. దీనినిఛేదించే మార్గం ఆత్మతత్త్వ విచారణ. ఇది కర్మల వల్ల సాధించలేమని రమణ మహర్షి తమ ఉపదేశసారంలో ఉద్ఘాటించారు.

కలియుగంలో ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసే జ్ఞాని అరుదు. ‘కర్మలు చేయడం వరకే నీ వంతు, ఫలితం నా చేతుల్లో ఉంది' అన్న గీతాచార్యుని శాసనం అజ్ఞానంలో ఉన్నవారు గ్రహించడం కష్టం. ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించి ఎవరూ మనుగడ సాగించలేరు. జనన మరణ చక్రాన్ని పరమాత్మ తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు అనేది భ్రమ. ఆత్మజ్ఞానం పొందలేక కర్మలతో ఫలితాలను ఆశించి తిరిగి ఆ చక్రంలో పడేది జీవుడు మాత్రమే!

మానవ దేహంలోని అంతర్గత అవయవాలు వాటంతట ఆవే పనిచేస్తున్నాయి. కాని అవి నా వల్లనే పనిచేస్తున్నాయి అనే అహమే 'నేను'. ఈ నేనును కర్తగా భావించి ఎన్నో సకర్మలు, అకర్మలు చేయబడుతున్నాయి. మనం నివసించే ఆ భూగోళం గంటకు వెయ్యి మైళ్ల వేగంతో పరిభ్రమిస్తూ, సూర్యుని చుట్టూ తిరుగుతోంది. కాని మనం ఈ భూమి మీద ఎంతో స్థిరంగా ఉన్నట్టు భ్రమిస్తున్నాము. ఇదే నేను అనే అహం, అజ్ఞానం.

ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయడం అల్ప మానవునికి సాధ్యం కాదు. మరి కర్మలను త్యాగం చేసి, సోమరిగా ఉండవచ్చా? ఉండకూడదని శ్రుతి గట్టిగా చెబుతోంది. తమ విధ్యుక్త ధర్మాలను, విధులను ఒక్క క్షణమైనా విడువకూడదని హెచ్చరిస్తోంది మన సనా తనం. ఇటువంటి క్లిష్టమైన సందేహాలకు చక్కటి పరిష్కారాలు తెలియజేశారు రమణులు. అవి:

సకర్మలు చేస్తూ చిత్తశుద్ధితో ఫలితాలను ఈశ్వరునికి అర్పించాలి.

 నిత్యం మనో వాక్కాయ కర్మలతో పరమాత్మను ధ్యానం చేయుట ఉత్తమ మార్గం.

 మౌనమే తపస్సుగా మనసుతో చేసే జప ధ్యానం ఉత్తమమైనది.

 అన్నిటా ఏకాగ్రత చాలా ముఖ్యమైనది. ధ్యానంలో ఎటువంటి ఇతర ఆలోచనలు పనికిరావు. నీవు చేసే నామ చింతన ఒక్కటే ధ్యాతవ్యం కావాలి.

 ఆడంబర పూజ కంటె మౌన జప ధ్యానమే శ్రేష్ఠమైనది. 

 అణువు నుంచి బ్రహ్మాండం వరకు నిండి ఉన్న ఆ పరమాత్మను ఆత్మతో మౌన ధ్యానం చేయటం ఉత్తమోత్తమం.

 అద్వైత భావనతో ‘అహం బ్రహ్మాస్మి'గా ధ్యానం చేయటం సరైనది.

 ధ్యానం శూన్యభావనతో చేయడం కంటె ఆ పరమాత్మయే 'నేను'గా భావించుట సరైన ధ్యాన మార్గం.

నేను' అనేది ఆత్మ చైతన్యం. ఆది దేహం కాదు.

 ఈ చైతన్యం పొందేందుకు ప్రాణాయామం ఒక మార్గం. ఇది గురు ముఖతః మాత్రమే సాధన చేయాలి.

ప్రాణాయామం కూడ కర్మే. కాని దీని మూలములైన చిత్తము,
ప్రాణము ఒకే మూల శక్తి నుంచి ఉద్భవించాయి.

 లయము చెందిన మనసు తిరిగి కర్మను కోరదు.

 ప్రాణాయామం తాత్కాలిక ఉపశమనం. అద్వైత ఆత్మ చింతనలో మనసనేది నాశనమవుతుంది.

 మనసు నశించిన వాడే ఉత్కృష్టమైన యోగి. అటువంటి యోగికి ఫలితాన్ని ఆశించి చేసే కర్మ అసలు ఏదీ ఉండదు.

 మనస్సును దృశ్యాదృశ్యముల నుంచి మరలిసే ఆత్మచైతన్యానుభూతి కలుగుతుంది. నేను అని తలచే మూలమే మనస్సు. ఆ నేను ఆత్మలో లీనమవడమే ఆత్మ సాక్షాత్కారం 

 నేను అనే అహంకారం నుంచే అనేక తలంపులు పుడుతున్నాయి. అవే మనో వికల్పములు. ఆ నేను అనే అహం ఎక్కడ జనిస్తుందో, ఎక్కడ పడిపోతుందో గమనించేదే ఆత్మ.

****::: ధ్యాన స్థితి లో ఎప్పుడు వుండాలి:::

::: ధ్యాన స్థితి లో ఎప్పుడు వుండాలి:::::::
క్రింది సమయాల్లో ధ్యాన స్థితి లో తప్పక వుండాలి.
1) మాట్లాడేటప్పుడు మనం ఇతరులతో సంభాషించేటప్పుడు వారి మనస్సు గాయం పడకుండా ధ్యాన స్థితి లో మాట్లాడాలి
.2) వాసన,రుచి, స్పర్శ చేసేటప్పుడు చూచే,వినేటప్పుడు
మనం ఇంద్రియాలు ఆయా పనులు చేసేటప్పుడు వచ్చే సుఖాలకు, ఆకర్షణకు, ఇష్టాఇష్టలకు గురి కాకుండా ధ్యాన స్థితి లో వుండాలి
3) ఇతరులతో సంబంధంలో వున్నప్పుడు ఇచ్చట మనం స్వార్థం తో వుండే అవకాశం లేకుండా ధ్యాన స్థితి లో వుండాలి
4) ఒంటరిగా వున్నప్పుడు ఒంటరిగా వున్నప్పుడు ఆలోచనలు చుట్టు ముట్టకుండా ధ్యానం లో వుండాలి
5) పనిలో వుండగా పని చేసేటప్పుడు మనస్సు పనిమీద వుండే లాగా ధ్యాన స్థితి లో వుండాలి.
6) మెలుకువగా వున్నప్పుడు చాలా అప్రమత్తంగా, సావధానంగా, ఎరుకగా, స్వేచ్చగా, వుంచే ధ్యాన స్థితి లో వుండాలి.
షణ్ముఖానంద 98666 99772

రమణ బోధ

 రమణ బోధ

🍁🍁🍁🍁

‘నీలోనికి నువ్వు ప్రవహించు. నిర్విరామంగా ఆలోచనల్ని అల్లే మనసు మూలాన్ని అన్వేషించు. ఎగసిపడే ప్రతికూల భావాల్ని తిరస్కరించు. అన్నింటికీ ఆద్యమైన మనోబలాన్ని విశ్వసించు. హృదయాన్ని శాంతిధామంగా నిర్మించు. ఆ అనంత మౌనంలో విశ్రమించు. ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించు’ అని భగవాన్‌ రమణ మహర్షి ఆత్మసాక్షాత్కారానికి దిశానిర్దేశం చేశారు.

‘నిన్ను నువ్వు తెలుసుకో’- ఆధ్యాత్మిక చింతనకు ఇదే ప్రథమ సోపానం. అంతర్వీక్షణ లేనిదే ఆత్మోద్ధరణ సాధ్యం కాదు. అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ‘నేను’ అనే అహంకారాన్ని విడనాడాలి. శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూప సంబంధిత అంశాలతో మనసు అనుసంధానం కావాలి. అప్పుడు జ్యోతిర్మయంగా మనో మందిరం వెలుగుతుంది.’ అంటూ రమణులు ప్రబోధించారు. 

అద్వైత యోగాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించిన మహాయోగి భగవాన్‌ రమణ మహర్షి. భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగాలలోని మార్మికతను, అంతర్లీన భావగరిమను రమణలు ఏకోన్ముఖంగా అందించారు.

‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అనేది ఉపనిషద్వాక్యం. ప్రజ్ఞ ద్వారా అన్నింటినీ తెలుసుకునే నేర్పు అలవడుతుంది.

 ‘నాకు జ్ఞానోదయం కావాలి స్వామీ! నేను అజ్ఞానిని’ అని ఓ భక్తుడు రమణుల్ని ఆశ్రయించాడు. ‘నువ్వు అజ్ఞానివా, ఆ విషయం నీకు నిజంగా తెలుసా?’ అని రమణులు అతణ్ని ప్రశ్నించారు. ‘తెలుసు స్వామీ! నేను పరమ అజ్ఞానిని’ అన్నాడు భక్తుడు. ‘నీ గురించి నీకు తెలిసింది కదా! నువ్వు జ్ఞానివే. ఇక నీకు నాతో పని లేదు’ అన్నారు మహర్షి. 

‘ఆత్మ విచారం ద్వారా ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. జీవన్ముక్తి అంటే జీవితం నుంచి ముక్తులు అని కాదు. 

ఈ జీవితంలోనే ముక్తిని పొందాలి. ముక్తి అంటే మరణానంతరం పొందేది కాదు. పరంజ్యోతి గుండె గూటిలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగులో నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి. నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకోవాలి’ అని రమణులు సూచించారు.

అరుణాచలేశ్వరుని దివ్య అనుగ్రహంతో రమణులు అతులితమైన యోగశక్తిని అందుకున్నారు.

 అరుణాచలాన్ని తన ఆశ్రమంగా మార్చుకుని, అరుణగిరిపై జ్ఞాన భాస్కరుడై వెలుగొందారు. నమశ్శివాయ అనేది మహా యోగ పంచాక్షరీ మంత్రమైతే, ‘అరుణాచల’ అనేది దివ్యజీవన జ్ఞాన పంచాక్షరీ మంత్రంగా రమణులు అభివర్ణించారు. భగవంతుని సాన్నిధ్యానికి, ఆత్మ సామీప్యానికి ఏది తీసుకుని వెళ్తుందో అదే ఉపదేశం. దక్షిణామూర్తిగా రుషులకు బోధించిన జ్ఞానోపదేశాన్ని, తత్త్వమార్గాల్ని, యోగసూత్రాల్ని ‘ఉపదేశసారం’గా రమణులు ఆవిష్కరించారు.

‘ఆనందమే నా స్వరూపం’ అనే నవ్యమైన స్థితికి చేరుకోవడానికి ఆధ్యాత్మికత ఉపకరిస్తుంది. ‘నేను దీనుణ్ని, నాకు ఆనందం లేదు. నా జీవితం నిస్సారం. నాకు ఉన్నతి లేదు’ అని భావించేవారికి ఆధ్యాత్మిక అనురక్తి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. ప్రతికూల భావాలనే చీకట్ల నుంచి సానుకూల భావాలే ఆయుధాలుగా విజయ సోపానాల్ని అధిరోహించడానికి ఆధ్యాత్మిక శక్తి కరదీపికగా నిలుస్తుంది.

 ‘ఒక్క ఆధ్యాత్మిక దీపశిఖ నీలో వెలుగుతుంటే చాలు- నువ్వు అఖండ తేజోపుంజమై వెలుగు పువ్వుల్ని వెదజల్లుతావు’ అని రమణులు పేర్కొన్నారు.

 ‘భగవంతుడనే సంపూర్ణ, సమున్నత స్థితికి, మనకు ఉన్న దూరం ‘నేను’ అనే అంశం ఉన్నంత వరకే! నేను, నాది, నాకు అనే వ్యక్తిగతమైన అహాల్ని నిర్మూలించుకుంటే పరమ పూజ్యుడైన పరమాత్మ రూపం మనలోనే సాకారమవుతుంది అని రమణులు నిర్దేశించారు. పరబ్రహ్మ  తత్త్వానికి మౌనమే భాష్యం. మౌనం మహా శక్తిమంతమైన ఆయుధం.

 శబ్దంలోంచి నిశ్శబ్దంలోకి ప్రయాణం చేయడమే నేనందించే ప్రబోధ సారాంశం- అని ప్రవచించిన రమణుల సందేశ వైభవం... స్ఫూర్తిమంతం... స్ఫూర్తి మంత్రం!

🍁🍁🍁🍁

Thursday, December 29, 2022

నేటి మంచి మాట.

 నేటి మంచి మాట.

నీ కారణంగా, నీ జీవిత కాలం మొత్తంలో, కనీసం ఒక్కరి జీవితమైనా మారితే నీ జన్మ ధన్యమైనట్టే కదూ?! 

అది నీ మాటల వలన కావచ్చు, నీ ధన సహాయం వలన కావచ్చు, నీవు చేసే పని వలన కావచ్చు, నీవందించే సేవలవలన కావచ్చు, నీతో భాగస్వామ్యం వలన కావచ్చు, లేదా కొన్నిసార్లు నీతో జరిగిన సంఘర్షణలవలన కూడా కావచ్చు. అంటే, నీ ఉనికి, నీ కదలిక, నీ ఆలోచన,  నీ మాట లేదా నువ్వు చేసే పని, ఏదైనా ఏదో ఒక విధంగా ఇతరులను ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావం నీకు కొన్ని సార్లు తెలియచ్చు, తెలియకపోవచ్చు. అందుకే ఆ ప్రభావం సరైనదిగా ఉండాలంటే నువ్వు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.

 శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానససరోవరం👏

ఇవన్నీ లక్ష్యానికి చేరువగా తీసుకువెళ్ళే గొప్ప గుణాలు!-

 సరైన ప్రయత్నం ద్వారా సాధ్యంకాని వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎవరైనా ఆశించిన వస్తువును అందుకునేందుకు ప్రయత్నిస్తే వారు తప్పక దాన్ని సాధిస్తారు. చేపట్టిన పనిని మాత్రం దృఢచిత్తంతో కొనసాగించాలి’ అని బోధించింది సుప్రసిద్ధ తాత్వికగ్రంథం యోగవాసిష్ఠం.

స్వప్రయత్నం ద్వారా జీవనాధారం సాధించి మానవ జన్మను సార్థకం చేసుకొమ్మని మన సంస్కృతి హితవు పలుకుతోంది. శ్రమపడకుండా ఫలం లభించాలని కోరుకోవద్దని వేదం చెబుతోంది. ప్రతి వ్యక్తీ ఇతరుల తోడ్పాటు కోసం ఎదురుచూడక ప్రయత్నశీలుడు కావాలి.

కార్యసాధనకు కావలసినవి ముఖ్యంగా రెండు. ఒకటి స్వప్రయత్నం. రెండోది దైవానుగ్రహం. పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం ఎప్పుడూ లభిస్తుంది. దైవకృప, పురుష ప్రయత్నం రెండూ అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. మనం చేపట్టిన పని చిన్నదైనా పెద్దదైనా కావచ్చు. దాన్ని మనసుపెట్టి చేయడానికి ప్రయత్నించాలి. ఎంత గొప్పవాళ్లకైనా ప్రయత్నం వల్లే కార్యసిద్ధి లభిస్తుంది.

దేవేంద్రుడైనా ప్రయత్నంచేస్తే తప్ప అమృతాన్ని సాధించలేకపోయాడు. ఇంద్ర పదవిని చేపట్టడానికి అసుర సంహారం చేయడం అంత సులభమైన పని కాదు. ప్రయత్నం చేస్తేనే తప్ప ఇంద్రుడు ఆ దశకు చేరుకోలేకపోయాడు. అంటే నిరంతర ప్రయత్నంవల్లే ఎవరైనా విజయాన్ని సాధిస్తారు.
చీమ చిన్నదైనప్పటికీ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెయ్యి యోజనాల దూరం సైతం చేరుకోగలుగుతుంది. కదలకుండా, ప్రయత్నం చేయకుండా ఒక్కచోటే కూర్చుని ఉంటే గరుత్మంతుడు అంతటివాడూ ముందుకు వెళ్లలేడు. అందుకే ఆరొంతులు మన ప్రయత్నం ఏడోవంతు దైవకృప అన్నారు పెద్దలు. సాధన చేయకుండా, నిరంతర పరిశ్రమ లేకుండా ఉన్నత పథం చేరుకున్నవారెవరూ లేరు.

మన ప్రగతికి మనమే శిల్పులు కావాలనుకుంటే సింహావలోకనం చేయాలి. అరణ్యంలో సంచరించే సింహం ఒక్కోమారు తన ముఖాన్ని వెనక్కి తిప్పి తాను నడిచివచ్చిన దారిని చూస్తుంది. దీన్నే సింహావలోకనం అంటారు. ఆ విధంగానే మనమూ మన మనసును శోధించాలి. ఆత్మ విమర్శ చేసుకోవాలి. లక్ష్యం చేరడానికి శ్రద్ధాభక్తులతో పనిచేయాలి. కార్యసిద్ధి కోసం నిరంతర సాధనచేస్తూ ప్రతి అవకాశాన్నీ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.

ఏ మనిషైనా ప్రయత్నం సిద్ధిస్తే అది తన విజయంగా భావిస్తాడు. విఫలమైతే దాన్ని ఇతరుల పైకి నెడతాడు. జయాపజయాలు రెండింటినీ సమభావంతో స్వీకరిస్తేనే మనిషి ఎలాంటి కార్యాన్నయినా సాధించగలడు.
=======

శివుడి ఆజ్ఞలేనిదే పూచిక పుల్లయినా కదలదని కొందరంటారు. మనిషి పరిస్థితులకు దాసుడని కొందరి అభిప్రాయం. తలరాత, గ్రహగతులు, కర్మఫలం ఇవన్నీ ఉన్నప్పటికీ మానవ ప్రయత్నం సరైన దిశలో సాగితే దేవుడు సైతం జీవన గతులను మార్చగలడు భర్త ప్రాణం కోసం సావిత్రీ యముడి వద్ద చేసిన ప్రయత్నం వలన విధి రాత మార్చి భర్తను పునర్జీవిగా చేసుకొని మాంగళ్యాన్ని కాపాడుకొని ఆదర్శంగా నిలిచిన కథ తెలిసిందేగా...
మనిషి ఓటమిపాలైనప్పుడు ఓదార్పు కోసం చెప్పే మాటలను వాటి ఆంతర్యాన్ని గ్రహించకుండా గుడ్డిగా పాటిస్తూ, సోమరిగా జీవితం గడిపే వ్యక్తులు ఏ కార్యాలనూ సాధించలేరు. అటువంటి మనస్తత్వం, వ్యక్తులను పిరికివాళ్లుగా మారుస్తుంది. అందుకే మనిషి స్వప్రయత్నాన్నే నమ్ముకోవాలి.

ధైర్యశాలురు, సాహసవీరులు, జ్ఞానులు అదృష్టం కోసం వేచి ఉండరు. స్వప్రయత్నంతో, సాహసంతో ముందంజ వేస్తారు. ప్రతిబంధకాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో తమ లక్ష్యాలను సాధించుకుంటారు. ప్రతి మనిషీ విభిన్నంగా ఆలోచించాలి. కొత్తదారుల్లో ప్రయాణించే ధైర్యం కలిగి ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనస్ఫూర్తిగా పనిచేయాలి. ఇవన్నీ లక్ష్యానికి చేరువగా తీసుకువెళ్ళే గొప్ప గుణాలు!-

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం

స్ఫూర్తి మంత్ర.... భారత ముద్దు బిడ్డ… ప్రతాప్!

 


291222g0741.  301222-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
 స్ఫూర్తి మంత్ర....

           భారత ముద్దు బిడ్డ…
                       ప్రతాప్!
                  ➖➖➖✍️

 DRDO(Defence Research and Development Organisation) లో ఉద్యోగం దొరికిన ఈ బాలుడు ఎవరో తెలుసా...? 


 ఇతని పేరు "ప్రతాప్,"  వయస్సు కేవలం 21 ఏళ్ళు.. 

 కర్ణాటక, మైసూరు సమీపంలోని కాడైకుడి స్వంత గ్రామం.. 

 తండ్రి ఒక సాధారణ రైతు కూలీ.. 
 రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.  
 ఇతను చిన్నప్పటి నుంచి క్లాసులో ఫస్ట్, కానీ పూట గడవని పరిస్థితి.. 

స్కూలు సెలవు రోజుల్లో చిన్న చిన్న కూలి పనులకు వెళ్ళి వచ్చిన 100-150/- డబ్బులతో సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్ళి ISRO, NASA, BOEING, ROLLSROYCE, HOWITZER Etc గురించి సోధించేవాడు, అక్కడి సైంటిస్టులకు ఈ-మెయిళ్ళు పంపేవాడు... 
రిప్లై మాత్రం వచ్చేది కాదు, అయినా నిరాశ చెందక ప్రయత్నం విరమించలేదు. ఎలక్ట్రానిక్స్ అంటే అతనికి ఎనలేని ప్రేమ, 'ఇంజనీరింగ్ - ఇన్ - ఎలక్ట్రానిక్స్' చేయాలని అతని కల, కానీ పేదరికం కారణంగా B.Sc (Physics) కోర్సులో చేరవలసివచ్చింది. అయినా నిరాశపడలేదు. హాస్టల్ ఫీజు చెల్లించలేక పోవడంతో, బయటకు తోసేశారు. బస్టాపుల్లో ఉండి, పబ్లిక్ టాయిలెట్లలో పనిచేసి, ఒక మిత్రుడు కొద్దిగా ధన సహాయం చేయడంతో C++, Java, Python వగైరా నేర్చుకున్నాడు...
 
మిత్రుల నుంచి మరియు ఆఫీసుల నుంచి e-waste రూపంలో కీ బోర్డులు, మౌస్‌లూ తదితర కంప్యూటర్ సామాన్లు సేకరించి వాటిపై పరిశోధన చేసేవాడు. మైసూరులోని ఎలక్ట్రానిక్ కంపెనీల వద్దకు వెళ్ళి e-waste రూపంలో వస్తువులను సేకరించి ఒక డ్రోన్ తయారుచేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు... పగలు చదువు మరియు పనులు, రాత్రిపూట ఆవిధంగా ప్రయోగాలు చేస్తుండేవాడు.
 
ఈవిధంగా సుమారు ఓ 80 ప్రయత్నాల తరువాత అతను తయారు చేసిన డ్రోన్ గాల్లోకి ఎగిరింది..   ఈ సందర్భంలో అతను ఓ గంటసేపు ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చాడట... డ్రోన్ సక్సెస్ విషయం తెలియడంతో అతను మిత్రుల మధ్య హీరో అయిపోయాడు. 

అతని వద్ద ఇంకా చాలా డ్రోన్ మోడల్ ప్లాన్‌లు ఉన్నాయి... ఇంతలో ఢిల్లీలో డ్రోన్ కాంపిటీషన్స్ జరుగబోతున్నాయన్న వార్త తెలిసింది... 
దానితో కూలి పనులకు వెళ్ళి ఓ ₹2000/- కూడబెట్టుకుని ఢిల్లీకి జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం కట్టాడు... ఆ కాంపిటిషన్‌లో 2nd ప్రైజ్ వచ్చింది. అంతేకాకుండా జపాన్ వెళ్ళి ప్రపంచ డ్రోన్ కాంపిటిషన్‌లో పాల్గొనే అవకాశం లభించింది. ఆ ఆనందంతో మళ్ళీ                     ఓ గంట వెక్కి వెక్కి ఏడ్చాడు... 

"జపాన్‌కు" పోవడం లక్షలతో కూడుకున్న వ్యవహారం...! అంతేకాకుండా ఎవరో ఒకరి రెఫరెన్స్ తప్పనిసరి..!  చైన్నైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజి ప్రొఫెసర్ రెఫరెన్స్ ఇచ్చేలా ఒక మిత్రుడు సహాయం చేశాడు. విమాన టికెట్లకు మైసూరు లోని ఒక దాత ముందుకు వచ్చాడు... 
ఇతర ఖర్చుల కోసం తన తల్లిగారు తన మంగళసూత్రాన్ని మరియు కమ్మలు అమ్మగా 60,000/- ఇచ్చింది... బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కి టోక్యోలో దిగాడు... 
’బుల్లెట్ ట్రైన్’   ఎక్కే స్తోమత లేదు, సాధారణ రైల్లో 16 స్టేషన్లలో రైళ్ళు మారి చివరి స్టేషన్లో దిగాడు... అక్కడి నుంచి మరో 8 కి.మీ లగేజీ మోసుకుంటూ నడిచివెళ్ళి చివరకు గమ్యం చేరాడు... 

అక్కడ మొత్తం హైఫై పీపుల్ ఉన్నారు... అత్యంత సోఫెస్టికేటెడ్ డ్రోన్స్ వచ్చి ఉన్నాయి... కాంపిటిషన్‌లో పార్టిసిపేషన్ చేసేవాళ్ళు బెంజ్, రోల్స్‌రాయిస్ కార్లలో వచ్చి ఉన్నారు.

మహాభారతం లో అర్జునునికి చెట్టు కనపడలేదు, పక్షి కనపడలేదు, కేవలం పక్షికన్ను మాత్రమే కనపడింది. అలాగే మన ప్రతాప్‌కు కూడా తన మనస్సు తన డ్రోన్ మోడల్‌పైనే ఉంది. తన మోడల్స్ వారికి సమర్పించి, డ్రోన్ పనితీరు చూపించాడు... 
వారు రిజల్ట్స్ ఫేజ్డ్ మ్యానర్‌లో అనౌన్స్ చేయడానికి సమయం పడుతుంది వెయిట్ చేయమన్నారు... 

మొత్తం 127 దేశాల నుంచి ప్రతినిధులు ఆ కాంపిటిషన్‌లో పాల్గొన్నారు... రిజల్ట్స్ డిక్లేర్ చేయడం ప్రారంభించారు... ప్రతాప్ పేరు ఏ రౌండ్లోనూ వినపడలేదు... 

నిరాశకు గురయ్యాడు, తన మోడల్ అసలు క్వాలిఫై కాలేదేమోనని బాధపడుతూ అశ్రునయనాలతో మెల్లగా లేచి వచ్చేస్తున్నాడు... ఇంతలోనే 3వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది ఫ్రాన్స్‌కు వెళ్ళింది... తరువాత 2వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది అమెరికాకు వెళ్ళింది.. అప్పటికి మన ప్రతాప్ నిరాశతో తిరిగి వచ్చేస్తూ ఆ ప్రాంగణం గేటు దగ్గరకు చేరుకున్నాడు... 

ఇంతలో చివరి అనౌన్స్‌మెంట్ వినిపించింది:  "Please Welcome "Mr. Pratap," First Prize, From INDIA.."

అంతే…! 
లగేజీ అక్కడే వదిలేశాడు, కింద పడిపోయాడు, బిగ్గరగా ఏడ్చేశాడు, తన 'తల్లిదండ్రులు,' 'గురువులు,' 'మిత్రులు,' ధన సహాయం చేసిన 'దాతల' పేర్లను ఉచ్చరిస్తూ పోడియం వద్దకు చేరుకున్నాడు. 

రెండవ స్థానంలో ఉన్న అమెరికా జెండా దిగిపోతూ, మొదటి స్థానం సంపాదించిన భారత్ జెండా పైకి పోతూ ఉన్నది. 
ఇటు కాళ్ళూ చేతులూ వణికిపోతూ చెమటలు పట్టిన ప్రతాప్ స్టేజ్ పైకి చేరుకున్నాడు...

మొదటి ప్రైజ్ తోపాటు 10,000 డాలర్లు అతనికి బహుమతిగా అందాయి.(సుమారు 7 లక్షల రూపాయలు)

3వ బహుమతి వచ్చిన ఫ్రాన్స్ వాళ్ళు అక్కడే అతనిని సంప్రదించారు... "నీకు నెలకు 16 లక్షల జీతం ఇస్తాం, ప్యారిస్‌లో ప్లాటు మరియు 2.5 కోట్ల విలువైన కారు ఇస్తాం. ఇటు నుంచి ఇటే మా దేశానికి వచ్చేయ్.." అన్నారు. దానికి అతను వెంటనే... "నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు, నా మాతృభూమికి సేవచేయడమే నా సంకల్పం.." అని వారికి కృతజ్ఞతలు తెలిపి స్వదేశం చేరుకున్నాడు..

ఇప్పుడు అతను DRDO లో డ్రోన్ విభాగంలో సైంటిస్టుగా నియమితులయ్యారు.. నెలకు 28 రోజులు విదేశాలు తిరుగుతూ DRDO కు డ్రోన్ సరఫరా ఆర్డర్లు తీసుకువస్తున్నాడు....!!

 "ఎవ్వరూ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు." Innate గా Brain లో spark ఉన్నవారిని ఎవ్వరూ నిలువరించలేరు. అలాంటి వారికి ఆకాశమే హద్దు. 

Hats off to you Mr. Pratap! All the best in all your endeavours. Sky is the limit to you.👍
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

సాధనకు సమయం?

 Xxi. Xi. 1-9.  301222-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


           *సాధనకు సమయం?*
                   ➖➖➖✍️

పడకగదిలో తన మంచంపై పడుకుని ఉన్న రాధాకృష్ణ ఏదో అలికిడి కావడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు. అతని ఎదురుగా ఒక దివ్యకాంతి ప్రకాశిస్తూ కనబడింది. చూస్తూండగా ఆ కాంతి ఒక స్త్రీ రూపాన్ని దాల్చింది.     దేదీప్యమైన కాంతులను వెదజల్లుతున్న ఆ స్త్రీమూర్తి సాక్షాత్తు ఆ జగన్మాతేనని గ్రహించిన రాధాకృష్ణ, "అమ్మా!" అంటూ ఆ తల్లి పాదాలపై పడాలని అనుకున్నాడు. కాని, మంచంపై అతనిని ఎవరో కట్టేసినట్లు అనిపించడంతో ఒక్క అంగుళం కూడా కదలలేకపోయాడు. 'ఏమైంది నాకు?' అనుకుంటూ రాధాకృష్ణ తన వంక తాను ఒకసారి చూసుకుని ఆశ్చర్యపోయాడు. అతని శరీరం బక్కచిక్కిపోయి, చర్మం ముడతలు పడిపోయి ఉంది. లేచేందుకు ఏమాత్రం ఓపిక తనలో మిగలలేదని, తన అంత్యకాలం సమీపించిందని అర్థం చేసుకున్న రాధాకృష్ణ ఆ పరమేశ్వరి వంక చూస్తూ, "తల్లీ! నన్ను నువ్వే కాపాడాలి... నాకు నీ వద్దకు రావాలని ఉంది!" అన్నాడు.

“అవును, కుమారా! నాకూ నిన్ను నాతో తీసుకెళ్లాలని ఉంది కానీ, నీవు ఈ జన్మలో చేసిన పుణ్యం అందుకు సరిపోయేటట్టు లేదు. అదే నా బాధ", అంది జగన్మాత విచారంగా.  

"అమ్మా! నేను ఇప్పటివరకూ ఎవ్వరికీ కష్టం కలిగించకుండా ఉన్నానే... అది సరిపోదా?" అడిగాడు రాధాకృష్ణ. 

“సరిపోదు, నాయనా! నువ్వు నాతో రాగలిగేందుకు కావలసిన అర్హతను పొందాలంటే నీకు లభించిన మానవ జన్మను భగవత్సేవకు అంకితం చెయ్యాలి. నేను నీకిచ్చిన ఈ తొంబై అయిదు సంవత్సరాలలో నువ్వు ఏనాడూ నా సన్నిధిలో దీపం కూడా వెలిగించినట్టు లేవు" అంది పరమేశ్వరి. 

"నిజమేనమ్మా! నువ్విచ్చిన సుఖాలను అనుభవించానే తప్ప ఇన్నాళ్లు నిన్నెలా సేవించాలో నేనసలు ఆలోచించలేదు. నన్ను మన్నించమ్మా... నాకు ముక్తిని ప్రసాదించు తల్లీ," అని అమ్మను వేడుకున్నాడు రాధాకృష్ణ.

"సరే నాయనా! నా బిడ్డవు కాబట్టి నీకొక చివరి అవకాశం... నీకు కచ్చితంగా పది నిమిషాల వ్యవధి ఇస్తున్నాను. ఈ పది నిమిషాలలో నీకు తోచిన విధంగా నన్ను సేవించి, నాతో వచ్చేందుకు అర్హతను సంపాదించు, నాయనా!" అంది పరమేశ్వరి. 

“ఆహా... అమ్మా! నువ్వు కరుణామయివి. నేను ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాను" అని అమ్మను ఎలా సేవించాలా అని, ఆలోచనలో పడ్డాడు రాధాకృష్ణ. 
'పత్రం, పుష్పం, ఫలం, తోయం' అన్నారు కాబట్టి పెరటిలో ఉన్న నాలుగు పుష్పాలు కోసుకుని వచ్చి అమ్మ పాదాలపై వేద్దామనుకున్నాడు రాధాకృష్ణ. లేచే ప్రయత్నం చేసినప్పుడు కానీ రాధాకృష్ణకి అతడు లేవలేని స్థితిలో ఉన్నానని గుర్తుకు రాలేదు. చేతులు జోడించి అమ్మనుగూర్చి ప్రార్థన చేద్దామని రాధాకృష్ణ తన రెండు చేతులను ఒక దగ్గరకు అతికష్టం మీద తీసుకుని వచ్చాడు. నరాల బలహీనతవల్ల చేతులు వణికిపోయాయి. రెండు నిమిషాలన్నా నమస్కార ముద్రను నిలపలేకపోయాడు రాధాకృష్ణ. 
తనకు తెలిసిన పాటను సంగీత సేవగా భావిస్తూ శ్రావ్యంగా పాడదామని రాధాకృష్ణ అనుకున్నాడు. కానీ, వృద్ధాప్యం వల్ల గొంతులో కఫం అడ్డుపడి పాడలేకపోయాడు.

'ఇక నావల్ల కాదమ్మా! నువ్వే దారి చూపించు' అని అమ్మవంక దీనంగా చూశాడు రాధాకృష్ణ. 

"అయ్యో నాయనా! నువ్వు పడుతున్న అవస్థను చూడలేకపోతున్నాను. పోనీ నీకు వచ్చిన స్తోత్రంతో నన్ను స్తుతించు." అడిగింది జగజ్జనని.

 "అలాగేనమ్మా!" అంటూ రాధాకృష్ణ తను చిన్నప్పటినుండీ విన్న శ్లోకం ఒకటి టకాటకా చెప్పేశాడు కానీ అతని పళ్ళన్నీ ఊడిపోవడంవల్ల ఆ శ్లోకంలో చాలా పదాలు స్పష్టంగా పలకలేకపోయాడు. అందువల్ల కొన్ని పదాల అర్థాలు కూడా మారిపోయాయి.

 "పోనీలే నాయనా! నన్ను చూసి నా రూపాన్ని వర్ణించు... తృప్తి చెందుతాను" అంది ఆ తల్లి. 

రాధాకృష్ణకు వయసు వల్ల చూపు బాగా మందగించింది. తన కళ్ళను ఎంత చిట్లించి చూసినా అమ్మ రూపు స్పష్టంగా కనబడలేదు. 

"నాయనా! నా చుట్టూ ఉన్న తరంగాలు నా బీజాక్షరాన్ని నిరంతరం ప్రతిధ్వనించేలా చేస్తాయి. జాగ్రత్తగా విను" అంది జగన్మాత. 
రాధాకృష్ణ తన డెబ్భైయ్యవ ఏటనే వినికిడి శక్తిని కోల్పోవడంతో చెవులు రిక్కించి విన్నప్పటికీ తనకు ఎటువంటి శబ్దమూ వినబడలేదు. 

'అమ్మా! ఇప్పుడేం చెయ్యనూ?' అన్నట్టు అమ్మవంక చూశాడు రాధాకృష్ణ.

"ఇక ఆఖరి ప్రయత్నంగా నీ మనసు ఒక రెండు నిమిషాలపాటు నాపై లగ్నం చెయ్!" అంది తల్లి. 

రెండు నిమిషాలు ప్రయత్నించిన తర్వాత, "మహానీయులకు సైతం మనసును ఏకాగ్రచిత్తముతో నీపై నిలపడం సులభం కాదు. నావంటి అల్పునికి అదెలా సాధ్యపడుతుంది అమ్మా? నావల్ల కాదు" అని అన్నాడు రాధాకృష్ణ దీనంగా. 

జగన్మాత రాధాకృష్ణకు ఇచ్చిన పది నిమిషాల గడువు ముగిసింది. 

"అమ్మా నిన్ను ఏ విధంగానూ సేవించలేకపోయాను" అని  కడు దుఃఖంతో అన్నాడు రాధాకృష్ణ. పశ్చాత్తాపంతో అతని కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. 

"ఇదంతా నీ స్వయంకృతం, నాయనా! నువ్వు తరించడానికే నికీ మానవజన్మ లభించిందన్న విషయం నువ్వు విస్మరించావు. నీ పేరు చెప్పినప్పుడల్లా నా నామాన్ని స్మరించావు కనుకనే ఈ విధంగానైనా నీకు నా దర్శన భాగ్యం కలిగింది. భగవద్విషయాలను జీవిత చరమాంకంలో తెలుసుకోవచ్చులే అని అనుకోవడం అవివేకం. నీకు మానవజన్మ లభించిన దగ్గరినుండి ప్రతి నిమిషం అమూల్యమే, నాయనా! భగవద్భక్తికి బాల్యంలోనే బీజం పడాలి. జీవితం చివర్లో సత్యాన్ని గ్రహించినా, చేసేందుకు శరీరం సహకరించకపోయే ప్రమాదం ఉంది. సమయం విలువను తెలుసుకో... ఇకనైనా మేలుకో అని చెప్పి ఆ దివ్యకాంతి అంతర్థానమయ్యింది. 

"అమ్మా... అమ్మా! నాకు నువ్వు కావాలి" అని ఏడుస్తూ నేలపై పడ్డాడు రాధాకృష్ణ.

అంతలో, "నాయనా రాధా! నేనురా నీ అమ్మను. కలేమైనా కన్నావా? లే నాయనా లే" అంటూ, నిద్రపోతూ మంచంపై నుండి కిందపడ్డ రాధాకృష్ణను అతని తల్లి లేవదీసింది.

రాధాకృష్ణ కళ్ళు నులుముకుంటూ తనకొచ్చినది కల అని తెలిసి ఆశ్చర్యపోయాడు. కలలో జగన్మాత చేసిన బోధను గుర్తుచేసుకుంటే రాధాకృష్ణకు తను చేస్తున్న తప్పులన్నీ తెలియవచ్చాయి. తనకు పాతకాలం నాటి పేరు పెట్టినందుకు పెద్దలను నిందించిన సందర్భాలూ గుర్తుకు వచ్చాయి. 

రోజూ ఇంట్లోని పెద్దవాళ్ళు వెంటపడితే కానీ స్నానం చెయ్యని రాధాకృష్ణ ఆ రోజు పూర్తిగా తెల్లవారకమునుపే స్నానం ముగించి, ఇంట్లోని దేవుని మందిరం దగ్గరకు వెళ్లి, భగవంతునికి భక్తిగా నమస్కరించి, ఆ తర్వాత తన బామ్మవద్దకు వెళ్లి, "బామ్మా! ప్రతిరోజూ నీతో గుడికి రమ్మని నన్ను అడుగుతూ ఉంటావుగా... ఇవాళ నువ్వు గుడికెళ్లేటప్పుడు చెప్పు నేను కూడా వస్తాను" అని అన్నాడు రాధాకృష్ణ. 

ఎప్పుడూ - నేనింకా చిన్నవాడిని! నాకప్పుడే గుళ్ళూ, గోపురాలూ, భగవంతుడూ, భక్తి ఎందుకే బామ్మా?" అంటూ చిరాకుపడే తన పన్నెండేళ్ల మనవడు రాధాకృష్ణలో అకస్మాత్తుగా వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతూ, 'అమ్మా పరమేశ్వరీ! ఇన్నాళ్ల నా ప్రార్థనను విన్నావా తల్లీ' అని అనుకుంటూ ఆనందపడిపోయింది రాధాకృష్ణ బామ్మ.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

చాలా విషయాలను.. మనం వదిలేయాలి !

 291222i1257.   301222-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

చాలా విషయాలను..
        మనం వదిలేయాలి ! 
                   ➖➖➖✍️

వయసు పెరిగితే మనకేమీ కొమ్ములు పొడుచుకుని రావు. చాలా విషయాలను మనం వదిలేయాలి.

”చలం” (గుడిపాటి వెంకటాచలం), గాయని వాణీ జయరామ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గార్లను ఆదర్శంగా పెట్టుకోవాలి.

చలంగారు తానూ, తన స్నేహితుడూ ముచ్చటించుకుంటూ ఉండగా పిల్లలు వాళ్ళ ఇంట్లోని వంటపాత్రలతో ఆడుకుంటూ ధ్వనులు చేస్తుండగా స్నేహితుడా పిల్లలను వారించాడు.

అప్పడు చలం…  “మనకు మన ముచ్చట్లు ఎంత ముఖ్యమో, ఆ పిల్లలకు వాళ్ల ఆటా అంతే ముఖ్యం. వయసులో పెద్దవాళ్లమైనంత మాత్రాన వాళ్ల ఆటలను ఆపెయ్యమనడానికి మనకు హక్కెక్కడిదీ?” అన్నారు.     ఇలాంటి ఉన్నతాలోచనా పథాన్ని అలవరచుకునే ప్రయత్నంలో  కొంత విజయం సాధించాలి.

వాణీ జయరామ్ గారు చిన్న పిల్లలను సైతం “మీరు” అనే సంబోధిస్తారు. ప్రయత్నించినా ఆ తత్త్వం మనకు అబ్బడంలేదు.

ఎస్పీ బాలు గారు శబరిమలకు డోలీలో వెళ్ళిన సందర్భంలో డోలీ మోసినవాళ్ళ కాళ్ళకు మోకరిల్లారు. అది వాళ్ళ వృత్తికావచ్చుగాక. వాళ్ళు ఆ పనిచేసినందుకు డబ్బులిస్తుండ వచ్చు గాక. వాళ్ళే లేకపోతే మనవద్ద డబ్బులుండీ లాభమేమిటి ?

మనమెలాగూ ఎస్పీలాగా పాదాభివందనం చేసేంత గొప్పవాళ్లం కాలేం. కనీసం “థాంక్స్” చెప్పొచ్చు కదా.

కాగా ఒక సందర్భంలో “మన శరీరంలో తగినంత శక్తి ఉండగా   ఇతరులకు డబ్బులిచ్చే అయినా బ్యాగులు మోయించొద్దు” అనీ “ఎవరిచేతనైతే నీ లగేజీని మోయిస్తావో వాళ్ళ పదింతల లగేజీని వచ్చే జన్మలో నీవు మోయకతప్పదు” అన్నారు….            శ్రీకంచి కామకోటి పీఠాధిపతి స్వామి గారు. చాలామటుకు దీనికీ కట్టుబడి ఉండే ప్రయత్నము చేయాలి.

మనం చాలా విషయాలను పట్టుకోవటం కష్టం కానీ వదిలేయడంలో బాధ ఏమిటీ ?


ఏం వదిలివేయాలో చూద్దాం :

”అమ్మాయీ గ్యాసు కట్టేసావా !!
గీజర్ ఆఫ్ చేసావా ??
ఏ.సి ఆన్ లో ఉన్నట్లుంది..
పాలు ఫ్రిజ్ లో పెట్టావా ??
...లాంటి ఎంక్వయిరీలు వదిలేద్దాం.

”మా కొడుకూ, కోడలూ పట్టించుకోరు" అంటూ తామేదో పర్వతాలను మోస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ తమ పరువు తామే తీసుకుంటున్న తలిదండ్రులున్నారు.
వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం..
కష్టనష్టాలు కూడా వాళ్ళవే !!

ఎవరితో ఏపనీ చేయించుకోకుండా, ‘ప్రతీపనీ’ “మన పనే” అనుకుంటే ఎంత ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండగలమో కదా !

”నా అభిప్రాయం ఏమిటంటే…  అని అనటం తగ్గించి.. నీ ఇష్టం, నువ్వు చెప్పు" అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిస్తే గృహమే ఔతుంది కదా స్వర్గసీమ.

’నాకూ తెలుసు'తో పాటు “నాకు మాత్రమే తెలుసు” అనే ఆలోచనను తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ  ‘నాకంటే ఎక్కువ తెలుసు' కదా అనే నిజాన్ని ఒప్పేసుకుంటే చాలు.

మన పిల్లలకోసం వచ్చేవారితో మనం మితంగా మాట్లాడాలి. “వాళ్ళు మనకోసం రాలేదు” అని గుర్తుంచుకుని కాసేపు కర్టెసీకి మాట్లాడి లేచి మన గదిలోకి మనం వెళ్ళిపోగలగాలి.

పెద్దవారిని పలకరించే మర్యాదతో ఎవరైనా సహజంగా అడుగుతారు “ఆరోగ్యం బాగుంది కదా" అని. దయచేసి వెంటనే అతిగా స్పందించవద్దు. మన బి.పి, ~షుగర్.., కీళ్ళనొప్పులు, ~నిద్ర పట్టకపోవటం.., నీరసం అంత రసవత్తరమైన విషయాలుకావు కదా. “బాబోయ్ ! ఎందుకు అడిగామా" అనే పశ్చాత్తాపం వారికి కలిగించవద్దు.

కాలం మారింది, మారుతున్నది శరవేగంగా.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది. విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సులో సీటెలా పట్టుకోవాలో మనం చెబితే ఏం ప్రయోజనం ??

పెద్దతనంలో మన పరువును కాపాడుకోవటం పూర్తిగా... పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఘంటాపథంగా చెప్పగలను.

అనవసరవిషయాల్లో జోక్యం చేసుకోకుండా మితభాషిగావుంటూ మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ‘జిహ్వచాపల్యం’  తగ్గించుకుని.. అన్నింటికంటే ముఖ్యమైన విషయం "నన్ను ఎవరూ గౌరవించటంలేదు" అనే ఆత్మన్యూనతాభావం దరికి చేరకుండా జాగ్రత్తపడాలి...

భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము..    కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం.

ప్రతీ విషయాన్నీ పాజిటివ్ గా చూడాలి. ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు. మొత్తం సంసారాన్ని లాగే బాధ్యతా లేదు. పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది.

హాయిగా పూజలు చేసుకోవచ్చు. భగవద్గీత, భాగవతం చదువుకోవచ్చు. పుణ్యమూ, పురుషార్థమూ కూడా సిధ్ధిస్తాయి.

రోజూ అనుకుందాం ఇలా :~
"I love my self..
I respect my self "
~మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంత్రాలివి. చివరగా… మనం దిగవలసిన స్టేషన్ దగ్గరౌతూనే వుంది. సమయం దగ్గర పడుతూనే ఉంది.

మన బోగీలో ఉన్న మన తోటి ప్రయాణీకులతో తగువులు, మనస్పర్థలు, ఎత్తిపొడుపు మాటలు అవసరమా ?

మనం దిగుతుంటే వారి ముఖాల్లో 'హమ్మయ్య' అనే  భావం కనిపించాలో లేక 'అయ్యో అప్పుడే వీళ్ల స్టేషన్ వచ్చేసిందా' అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది..

పెద్దతనం మనకో వరం. అది మన 'అహం' తగ్గించి మనకి జీవితం అంటే ఏమిటో, మన నిజమైన విలువ ఏమిటో సరియైన అవగాహన కల్పిస్తుంది.

నస అనిపించుకునే కంటే నైస్ అనిపించుకోవడం మంచిది కదా ! “సర్వకాల సర్వావస్తేషు”…ఘంటాపథంగా చెప్పగలను. మన గౌరవం మన చేతుల్లోనే ఉంది.

మనం చేయగలిగినంత చేయాలి. కానీ ఇతరులను… కొడుకూ కోడళ్లనైనా, కూతురూ అల్లుళ్లనైనా సరే “చేయలేదు,” “చేయడంలేదు” అనవద్దు. అంటే విలువ తగ్గడం ఖాయం.

విలువను పెంచుకోవడమైనా, ఉంచుకోవడమైనా, తుంచుకోవడమైనా మన చేతుల్లోనే ఉన్నదనేది మాత్రం నిష్ఠురసత్యం !!✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

ఉద్యోగంలో విజయానికి... భగవద్గీత చెప్పే 7 పాఠాలు !

 XxI. X. 1-9.  291222-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
ఉద్యోగంలో విజయానికి...
       భగవద్గీత చెప్పే 7 పాఠాలు !
                  ➖➖➖✍️


భగవద్గీత! ఐదు వేల సంవత్సరాల నుంచి లోకాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ప్రపంచం ఎంతగా మారినా, మనిషి జీవితం ఎంత మారినా... భగవద్గీత ఇప్పటికీ మనకి దారి చూపిస్తూనే ఉంది. పుట్టుక దగ్గర నుంచీ చావు దాకా, నాయకత్వం దగ్గర నుంచీ యుద్ధం దాకా ప్రతి రంగానికీ ఉపయోగపడుతోంది. అలాంటి భగవద్గీత మన రోజువారీ ఉద్యోగాలలో ఏమన్నా ఉపయోగపడు తోందా అంటే లేకేం...

అర్జునుడు తన ఆయుధాలన్నింటినీ పడేయడంతో భగవద్గీత మొదలవు తుంది. యుద్ధంలో ఎటుచూసినా తనవారే కనిపిస్తున్నారనీ, వారితో తను యుద్ధం చేయలేననీ అర్జునుడు బాధపడతాడు. అప్పుడు కృష్ణుడు అనవసరమైన విషయాల గురించి బాధపడి, పిరికితనానికి లోనుకావద్దని మందలిస్తాడు. ఒక రాజుగా తన కర్తవ్యాన్ని పాలించడమే ధర్మమని బోధిస్తాడు. ఈ సూత్రం ఉద్యోగానికి కూడా ఉపయోగపడుతుంది. తనచుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో, వాళ్లకి ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచనలతో భయంభయంగా ప్రవర్తించకూడదు. ఒక ఉద్యోగిగా మన బాధ్యతలని నూటికి నూరుపాళ్లూ నిర్వర్తించాలి. ఎలాంటి భయమూ, మొహమాటమూ లేకుండా ధర్మాన్ని పాటించాలి. ఆ నిక్కచ్చితనం లేకపోతే ఉద్యోగికీ, సంస్థకీ కూడా నష్టం తప్పదు.

మన బాధ్యతని పాటిస్తాం సరే! మరి ఆ పనికి తగ్గ ఫలితం రాకపోతే ఎలా? అన్న బాధ ఎవరికైనా తప్పదు. ‘పనిని సక్రమంగా చేయడం వరకే మన బాధ్యత, ఫలితం మన చేతుల్లో ఉండదు’ అన్నది గీతలో ప్రముఖంగా వినిపించే మాట. ఫలితం ఒకోసారి వెంటనే వస్తుంది, ఒకోసారి చాలా... చాలా ఆలస్యంగా పలకరిస్తుంది. మనవైపు నుంచీ ఎలాంటి లోపమూ లేకుండా, నూటికి నూరుపాళ్లూ ప్రయత్నిస్తే... ఎప్పటికైనా విజయం తప్పదు.

ఆఫీసులో రకరకాల మనుషులు ఉంటారు. కొంతమంది పని చేసే తీరు చూస్తే కోపం వస్తుంది, కొంతమంది ప్రవర్తన చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఆఫీసులో అందరి ప్రవర్తననీ గమనిస్తూ ఉండాల్సిందే! కానీ అది మన ఆలోచనాతీరుని ప్రభావితం చేయకూడదన్నది గీత చెబుతున్న మాట. భగవద్గీత రెండో అధ్యాయంలోనే కృష్ణుడు కోపం వల్లా, ద్వేషం వల్లా సరైన నిర్ణయాలు తీసుకోలేమని చెప్పుకొస్తాడు.

భగవద్గీతలోని ప్రతి అధ్యాయంలోనూ ‘శరీరం శాశ్వతం కాదు, ఆత్మ ఒకటే శాశ్వతం’ అన్న మాట వినిపిస్తుంది. ఈ మాట నుంచి రెండు విషయాలు నేర్చుకోవాలంటున్నారు. డబ్బు, హోదాలాంటి తాత్కాలికమైన ప్రలోభాలకి లొంగిపోకూడదన్నది మొదటి విషయం. ఎలాంటి మార్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నది రెండో విషయం.

భగవద్గీతలో జ్ఞానానికి చాలా ప్రాధాన్యత కనిపిస్తుంది. అది మనం పెంచుకునేదైనా కావచ్చు. ఇతరుల నుంచి నేర్చుకునేదైనా కావచ్చు. చదువుతో, పరిశీలనతో, గురువులని కలవడంతో వీలైనంత జ్ఞానాన్ని పొందాలని చెబుతాడు కృష్ణుడు. ఉద్యోగంలోనూ అంతే! చేసే పని గురించి అవగాహన సాధిస్తే, ఎలాంటి లక్ష్యాన్నయినా చేరుకోగలం.

Attachment with detachment అనే సూత్రం భగవద్గీతలో స్పష్టంగా కనిపిస్తుంది. నూటికి నూరు శాతం మనసు పెట్టి పని చేయాలి. కానీ పని పూర్తయిన తర్వాత ఇక దాని గురించి ఆలోచించకూడదు. ఆఫీసులో ఇంటి గురించి ఆలోచిస్తూ, ఇంట్లో ఆఫీసు పని గురించి కంగారుపడుతూ ఉండేవారికి ఇదో పాఠం. నిన్న చేసిన పని గురించే ఆలోచిస్తూ కూర్చునేవారికిదో గుణపాఠం.

చివరగా ఒక్క మాట! ఒకరు చెడిపోవడానికైనా, బాగుపడటానికైనా అతని ఆలోచనలే కారణం. మన ఆలోచనలు గొప్పగా ఉంటే, మనకి బెస్ట్‌ ఫ్రెండ్‌ మనమే! అదే మన ఆలోచనలు సవ్యంగా లేకపోతే మన బద్ధ శత్రువు కూడా మనమే అని చెబుతోంది భగవద్గీత.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

విశ్వాసం!* ➖➖➖✍️ ---చాగంటి వారి ప్రవచనం నుండి.

 1811.  1-8.  291222-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                    *విశ్వాసం!*
                  ➖➖➖✍️
      ---చాగంటి వారి ప్రవచనం నుండి.

*విశ్వాసం గురించి రామకృష్ణ పరమహంస ఒక కథ చెపుతారు...*

*వెనుకటికి దక్షిణ సముద్రం దగ్గర ఒక భక్తుడు నిలబడి ‘ఈ సముద్రమును దాటి భారత దేశమునకు వెళ్ళాలి.’*

*’ఓడ వెళ్ళిపోయింది. ఎలా.,.. ‘అని కంగారుపడుతున్నాడు.*


*ఆ సమయంలో అటుగా ఒక సిద్ధ పురుషుడు వెళ్ళిపోతున్నాడు.*

*’ఏమి నాయనా... అలా కంగారు పడుతున్నావు...’అని అడిగాడు.*

*’అంటే ఏమి లేదండి... సముద్రం మీద ఓడ వెళ్ళిపోయింది….   ఇపుడు నేను ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. మళ్ళీ రేపటి వరకు ఓడ లేదు! అందుకని కంగారు పడుతున్నాను.’ అన్నాడు.*

*అపుడు సిద్ధుడు  ‘నీవేమి కంగారుపడకు.’ అని ఒక కాగితం మీద రాసి, మడిచి చేతిలో పేట్టి... ‘ఇది విప్పి చూడకు. చూడకుండా చేత్తో పట్టుకో. పట్టుకుని ఈ సముద్రం మీద నడిచి వెళ్ళిపో. నువ్వు వెళ్లిపోతావు. నీళ్ళల్లో పడవు. వెళ్ళు...’ అన్నాడు.*

*సిద్ధపురుషుడు అంటే మాటలు కాదు కదా..! ‘ఈయన ఇచ్చాడు కాబట్టి ఇది నన్ను రక్షించి తీరుతుంది.... నేను మునగను..’ అనుకున్నాడు.*

*అంటే ఆ నీళ్ళమీద పరుగెత్తడం మొదలుపెట్టాడు.*

*అందులో దిగిపోకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకా కొద్ది దూరంలో ఒడ్డు కనిపించింది. అపుడు ఆశ్చర్యం వేసింది.*

*ఇంతలా నన్ను నీటిమీద పరుగెట్టించిన ఈ కాగితంలో ఉన్న రహస్యం ఏమిటి..?’ అని అనుకున్నాడు.* 

*ఒకసారి ఆ కాగితంలో ఏమి రాసి ఉన్నదో చూడాలని అనుకున్నాడు.*

 *అనుకుని ఆ కాగితం విప్పాడు. ఆ కాగితంలో 'శ్రీరామ' అని రాసి ఉంది.*

*’ఈ నామమా నన్ను పరుగెత్తించింది' అన్నాడు.*

*వెంటనే మునిగిపోయాడు. విశ్వాసం పోయింది. కొట్టుకుపోయాడు.*

*విశ్వాసం ఉన్నంతసేపు వాడు మహా జ్ఞానితో సమానమై పోయాడు.*

*అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మ నామం చెప్పగలిగితే జ్ఞానితో సమానమైపోతావు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

తద్వారా మీ మనో వ్యధలన్నీ సమసిపోయి మీకు అఖండమైన మనశ్శాంతి లభిస్తుంది.* *మీ కర్మలన్నీ కరిగిపోయి మీ జన్మలు ధన్యం అవుతాయి.

 281222a1758.     291222-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀712.
నేటి…

              *ఆచార్య సద్బోధన:*
                  ➖➖➖✍️


*"సాధన లేక శాంతియు లేదు!                          శాంతి లేక సౌఖ్యము లేదు.                                 కనుక మీరు నిజముగా సౌఖ్యముగా ఉండవలెనన్న ఆధ్యాత్మిక సాధన చేసి తీరాలి.* 

*కేవలము మాసమునకు నాలుగు దినముల పాటు నాలుగు గుడులు తిరిగి దండం పెడితే సరిపోదు!*

*ఇది సాధన అనిపించుకోదు. దైవము నిత్యమూ ఉన్నాడు కనుక సాధన నిత్యమూ చేయాలి.*

*దేవుని లేని స్థలము లేదు కనుక మీరు ప్రత్యేకముగా దేవుని నిమిత్తం దేవాలయానికే వెళ్ళనవసరం లేదు. దేవుడు గుడిలో ఎలా ఉన్నాడో మీ గుండెలో కూడా అలానే ఉన్నాడు. కనుక మీరున్న చోటనే  కుదురుగా కూర్చుని మీ మనో బుద్ధులను స్థిరముగా భగవంతునిపై నిలపండి.*

*తీయనైన ఆయన నామాన్ని స్మరించండి. అతి సుందరమైన ఆయన రూపాన్ని ధ్యానించండి.*

*దీనులను భగవంతుని స్వరూపులుగా భావించి సేవించండి.*

*తద్వారా మీ మనో వ్యధలన్నీ సమసిపోయి మీకు అఖండమైన మనశ్శాంతి లభిస్తుంది.*

*మీ కర్మలన్నీ కరిగిపోయి మీ జన్మలు ధన్యం అవుతాయి." *✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

కర్ణుడిని ఏ అస్త్రంతో…* *సంహరించారు?

 2611  1G1717.  281222-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


 *కర్ణుడిని ఏ అస్త్రంతో…*
                    *సంహరించారు?*
                    ➖➖➖✍️

*విలువిద్యలో అర్జునుడితో సమానుడు. మహా భారత భీకర యుద్ధంలో చివరికంటూ పోరాడినవాడు. ఒకానొక దశలో అర్జునుడిపై పైచేయి సాధించిన కుఱుసేనాధిపతి.. కర్ణుడు.* 

*అన్ని అస్త్రాలు సంధించినా నేలకొరగని ఆ మహావీరుడు.. ఎలా నేలకొరిగాడు? అర్జునుడు ఇంతకీ ఏ అస్త్రం ప్రయోగించాడు?*

*మహాభారత యుద్ధంలో ద్రోణుని మరణం అనంతరం కురుసేనాధిపతిగా కర్ణుడు బాధ్యతలు స్వీకరించాడు.*

*విలువిద్యలో అర్జునుడితో సరిసమానుడు కావడం.. కౌరవ చక్రవర్తి సుయోధనుడికి అనుంగుమిత్రుడు కావడంతో కౌరవ శ్రేణుల్లో కర్ణుడంటే విపరీతమైన అభిమానం ఉండేది.*

*అస్త్ర విద్యల్లో అర్జునుడితో పోటీపడగలవాడు కావడంతో కౌరవ శిబిరంలో ఆనందం తాండవించింది.*

*మహాభారత యుద్ధంలో 17వ రోజు అర్జున, కర్ణుడి మధ్య భీకర యుద్ధం జరిగింది. సమవీరుల మధ్య జరిగిన పోరును యావత్‌ విశ్వం ఆసక్తిగా వీక్షించింది.  అస్త్రశస్త్రాలను ఇరువురు సంధించుకుంటున్నారు. ఒక అస్త్రానికి మించిన అస్త్రాలు వేస్తున్నారు.* 

*ఇంతలో కర్ణుడు హఠాత్తుగా నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. అశ్వసేనుడు అనే నాగకుమారుడు సర్పముఖ బాణాకారంలో ఉన్నాడు. ఖాండవ వన దహనంలో అశ్వసేనుడు బాధితుడు. అర్జునుడిపై పగ తీర్చుకునేందుకు అస్త్రంగా మారి కర్ణుడి వద్దకు చేరాడు. వెలుగులు చిమ్ముతూ వస్తున్న నాగాస్త్రాన్ని చూసిన శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని నేలలోకి కుంగేట్టు కాలితో తొక్కాడు. భీకర వేగంతో వచ్చిన నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని పడగొట్టింది. ప్రాణాపాయం నుంచి మాత్రం బయటపడ్డాడు.*

*కర్ణుడిపై సవ్యసాచి వరుసగా అస్త్రాలు వేస్తున్నాడు. గాయాలబారిన పడుతున్నప్పటికీ కర్ణుడు వాటిని ఎదుర్కొంటూ బాణాలతో జవాబు చెబుతున్నాడు. ఈ సమయంలోనే కర్ణుడి రథం నేలలోకి కుంగిపోయింది.* 

*ఎడమ వైపు చక్రం నేలలోకి దిగడంతో ఎత్తేందుకు కిందకు దిగాడు. రథం కుంగడం శాప ప్రభావమే. అప్పటికే పరశురాముడు గతంలో ఇచ్చిన భార్గవాస్త్రం అతడికి గుర్తురాలేదు.* 

*‘రథాన్ని ఎత్తేంత వరకు బాణాలు ప్రయోగించొద్దు.. ఇది యుద్ధధర్మం కాదు’ అని  అర్జునుడిని కోరాడు.* 

*అంతలో అర్జున రథ సారథి శ్రీకృష్ణుడు బదులిస్తూ.. “పాండవులు బస చేసిన లక్క ఇంటిని కాల్పించి, మాయా జూదంతో వారి సంపదను అపహకరించి.. ద్రౌపదిని నిండు సభలో అవమానించి.. బాలుడైన అభిమన్యుడిని చంపారు కౌరవులు. అప్పుడేమైంది ఈ న్యాయం?”అని ప్రశ్నించాడు.*

*చివరగా అర్జునుడు ‘అంజలికం’ అనే మహా అస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణ సుదర్శనం, మహదేవుడి శూలంతో సరిసమానమైన అస్త్రమది. ‘నేనే గనుక తపస్విని, గురువులకు సేవలతో సంతృప్తి కలిగించేవాడిని, పుణ్య కర్మలను ఆచరించేవాడినయితే ఈ బాణం కర్ణుడి తలను సంహరిస్తుంది’ అని ప్రతిజ్ఞ చేసి అస్త్రం సంధించాడు.* 

*వింటిని పూర్తిగా లాగి సంధించిన ‘అంజలికం’ వెలువరించిన కాంతులతో ఇరు పక్షాలు భీతిల్లాయి. అత్యంత వేగంగా వెళ్లిన అంజలికం కర్ణుని శిరస్సును ఖండించింది. అస్తమిస్తున్న సూర్యుడి వలె కర్ణుడి తల కిందపడగా అతని దేహం నుంచి అత్యంత ప్రకాశమైన కాంతిపుంజం వెలువడి సూర్యుడిని చేరింది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

పరిపూర్ణ విశ్వాసం

 X. X2.  1-5.  281222-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


              *పరిపూర్ణ విశ్వాసం*
                 ➖➖➖✍️

*మూగజీవాలు తమ పట్ల కారుణ్యం చూపే మనుషులపై విశ్వాసం చూపిస్తాయి.* 

*యజమాని పట్ల కుక్క చూపించే విశ్వాసం జగద్విదితం. జంతువులు మరో జంతువుపై విశ్వాసం చూపలేవు. అవిశ్వాసం కలిగి ఉండవు. జాతిధర్మంతో కలివిడిగా ఉంటాయవి.*

*మానవుడు మాత్రమే తనదైన ప్రవర్తనతో సమాజ విశ్వాసం పొందగలడు.*

*మనిషిగా విశ్వసనీయత కొరవడినప్పుడు ఏకాకిగా మిగిలిపోతాడు.*

 *మనిషికి ముందు తన మీద తనకు నమ్మకం ఉండాలి.*

*సమాజానికి తనపట్ల సానుకూల దృక్పథం ఏర్పడాలంటే, ధర్మవర్తనతో మెలగాలి.*

*మంచికి సన్నిహితంగా, చెడుకు దూరంగా నడుచుకోవాలి. సదా సత్యాన్నే పలకాలి.*

*పదిమందిలో ఉన్నా, ఒంటరిగా కాలం గడుపుతున్నా ఒకే విధమైన వ్యక్తిత్వం కనబరచాలి.*

*స్వార్థాన్ని విడనాడి, స్వలాభాపేక్షను దూరం చేసుకోవాలి. అందరి మనసులను గెలుచుకుని, మన్ననలు పొందిన వాళ్లను అజాత శత్రువు అంటాం.*

*అటువంటి వారికీ కోపతాపాలు ఉంటాయి.*

*వారు అవసరార్థం కోపాన్ని ఎక్కడ ఎంత మోతాదులో అవసరమో అక్కడ అంతే ప్రదర్శిస్తారు. మనసులో పేరబెట్టుకోరు. సమయం వచ్చినప్పుడు అవతలి వాళ్ల మీద విషం చిమ్మరు.*

*ఉత్తముల మాటలు, చేతలు   సదా అమృతాన్ని పంచుతాయి. అటువంటి ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన మనిషికి సంఘం బాసటగా నిలుస్తుంది. అభివృద్ధికి బాటలు పరుస్తుంది.*

*మనపట్ల ఒకరు విశ్వాసం ఏర్పరచుకున్నాక దాన్ని కాపాడుకోవడానికి మనమేమీ శ్రమించనక్కర్లేదు. మన వ్యక్తిత్వమే మనకా గుర్తింపు తెచ్చిందన్నది మరచిపోకూడదు.*

*అదే పునాది- మనిషికి కుంగిపోని, కుప్పకూలని బలాన్నిస్తుంది. కొంతమంది తాము నమ్మిన దానిపట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారు. అననుకూల పరిస్థితులు ఎదురైనా తొణకరు, బెణకరు, చెక్కుచెదరరు. అనుచరగణం విశ్వాసం పొందగలిగితేనే సాధారణ వ్యక్తి నాయకుడిగా రాణిస్తాడు.*

*ఉద్యమాలు విజయవంతం కావడానికి నాయకులు తాము నమ్మిన సిద్ధాంతాలపై సంపూర్ణ విశ్వాసం, అనుకున్నది సాధించే దీక్షాదక్షతలు కలిగి ఉండటమే కారణం.*

*మానవుడికి తాను నమ్మిన విషయం పట్ల విశ్వాసం ఉంటేనే నీటిపైన, నిప్పులోనూ నడవగలడు. ఆకాశంలో విహరించగలడు. శాస్త్రజ్ఞుడు ప్రయోగశాలలో ఎన్నిసార్లు అపజయం ఎదుర్కొన్నా సంబంధిత విషయం మీద తనకున్న పట్టుతో, మనసులో అంకురించిన ఊహకు రూపమిచ్చేదాకా విశ్రమించడు. మేధ ఆవిష్కరణను సమాజానికి అంకితం ఇచ్చి, ప్రపంచం రూపు రేఖలు మారుస్తాడు.*

*సృష్టికర్త ఒకడున్నాడని, అతడే దేవుడని నమ్మే వాళ్లకు భగవంతుడు వెన్నంటి ఉంటాడని భక్తాగ్రేసరుల ఆధ్యాత్మిక చరిత్ర చాటుతుంది.*

*వైద్యం కంటే ముందు రోగికి తనపై గురి కుదిరేలా చూసుకుంటాడు వైద్యుడు. పనితనంపై ఉన్న నమ్మకమే మనకు చేతినిండా పని కల్పిస్తుంది.*

*అనుసరించే దైవానికి, ప్రదర్శించే భక్తికి, చేసే పూజకు, అవలంబించే దానధర్మాలకు ఫలితం కంటికి కనిపించక పోయినా- పుణ్యం రూపంలో ఎక్కడో జమ అవుతుందన్న విశ్వాసమే మనుషులను మహానుభావులను చేస్తుంది. సమాజంలోని మన తోటివారి గురించి ఆలోచించేలా చేస్తుంది. వితరణ గుణం పెంపొందేలా చేస్తుంది.*

*జీవితం చాలా చిన్నదన్నది వాస్తవం.
ఆ పరిధిలోనే విశ్వాసంతో ఆకాశానికి ఎగిరేవారు కొందరు, అఖండజ్యోతిలా ఖ్యాతినార్జించేవారు మరికొందరు.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

నిజమైన భగవద్భక్తి

 271222g1859.    281222-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

            *నిజమైన భగవద్భక్తి*
                 ➖➖➖✍️


*సృష్టిక్రమంలో మనిషిగా పుట్టడం, పెరగడం, గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం, సంతానాన్ని పొందడం, ఈతి బాధలు అనుభవించడం, చివరికి మరణించడంతో జీవనచక్రం ముగుస్తుంది. క్షణికమైన ఈ కాలంలో నేను, నాది అనే స్వార్ధభావన పెచ్చు పెరిగి, మానవుడు దానవుడిగా మారిపోతున్నాడు.*

*సంసార లంపటంలో చిక్కుపడి తన గురించి తాను ఆలోచించలేక పోతున్నాడు.  ప్రకృతి పురుషుల స్వరూపాన్ని తెలుసుకోలేక, పాశాలను తెంచుకోలేక కూపంలో మండూకంలా బతుకుతున్నాడు. జన్మ వైశిష్ట్యాన్ని, జీవిత పరమార్థాన్ని, మోక్షమార్గాన్ని అన్వేషించక కాలం కోరల్లో నలిగి వ్యర్థ జీవితం గడుపుతున్నాడు. వీటిని గమనించిన మనుపుత్రిక దేవహూతి- సంసార దుఃఖం నుంచి పరమాత్మను చేరే మార్గాన్ని బోధించేవాడు సాక్షాత్తు వైకుంఠవాసుడే అని తెలుసుకొన్నది. స్వామిని పుత్రుడిగా పొంది ఆయన ముఖతః లోకానికి సందేశమివ్వాలని భావించింది.*

*తల్లిదండ్రులైన స్వాయంభువ మనువు, శతరూపలతో కలిసి సరస్వతీ నదీతీరంలోని బిందుసరోవర తీర్థంలో నివసిస్తున్న కర్దమ మహామునిని సందర్శించింది. వివాహేచ్ఛతో ఉన్న మునిని ఆ అతిలోకసుందరి కోరిమరీ పెండ్లాడింది. సంతానానంతరం సన్యసిస్తానని ముని ఆమెకు ముందే చెప్పాడు. ఆమె అంగీకరించింది.*

*తొమ్మిదిమంది కుమార్తెలకు ఆమె జన్మనిచ్చింది. వారిని ఉత్తమ ప్రజాపతులకిచ్చి వివాహాలు జరిపించింది. సన్యాసానికి సంసిద్ధుడైన భర్తతో తనకొక పుత్రుడిని అనుగ్రహించమని కోరింది.* 

*వరప్రభావంతో శ్రీమహావిష్ణువును పుత్రుడిగా ప్రసాదించాడు కర్దముడు. ఆయనే కపిలుడు.*

*కాలాంతరంలో ఆమెకు వైరాగ్య భావన పెరిగింది. జ్ఞానభిక్షతో మానవజాతిని సముద్ధరించమని అర్థించింది. మానవులకు ఆత్మ తత్త్వాన్ని బోధించేందుకే అవతరించిన కపిలుడు మాయాశక్తితో తానే స్వయంగా సాంఖ్యశాస్త్రాన్ని తల్లికి వివరించి పరోక్షంగా మానవజాతికి సందేశాన్నిచ్చాడు.*

*మనిషి మనసే బంధమోక్షాలకు మూలకారణం. భోగాలపై ఆసక్తిగల మనసు బంధాన్ని, పరమేశ్వరుడిపై నిలిచే మనసు మోక్షాన్ని కోరుతుంది. ఇది నేను, ఇది నాది అనే అభిమానం వల్ల కామ క్రోధ లోభాది దోషాలు పెరుగుతాయి. మనసు నుంచి ఇవి ఏనాడు తొలగిపోతాయో ఆనాడు సుఖాలపై విరక్తి కలిగి భక్తి వైరాగ్యాలు ఉదయిస్తాయి. జ్ఞానానికి వైరాగ్యాన్ని జోడించి యోగసాధన చేస్తూ భగవంతుడి పట్ల భక్తిని కలిగి ఉంటే ఈ జన్మలోనే అంతరాత్మ రూపుడైన పరమాత్మను చేరుకోగలం.*

*భక్తివిస్తారాన్ని, తత్త్వాల ఉత్పత్తిని, మోక్ష ప్రాప్తిని, అష్టాంగయోగ విధానాన్ని, భాగవత ధర్మాలను తల్లికి బోధించాడు కపిలుడు.*

*నిష్కామంగా భగవంతుడిని ప్రార్థించడమే నిజమైన భగవద్భక్తి.*

*మనసును స్థిరంగా నిలిపి భగవానుడికి సమర్పిస్తే అంతకన్నా గొప్ప కల్యాణమే లేదు. త్రికరణశుద్ధిగా దీన్ని నమ్మినవారికి ఏ కాలంలోనైనా శాంతియుత జీవనం లభిస్తుంది.*

*సంసారం సాగరంలోంచి బయట పడాలనుకునేవారు చైతన్య రూపమైన బ్రహ్మను దర్శించాలంటే మౌనాన్ని పాటించాలి.*

*శత్రుభావాన్ని దూరం చేసుకుని కర్తవ్యాన్ని శ్రద్ధగా పాటించాలి. లభించినదానితో తృప్తి పొంది రాగద్వేషాలకు అతీతంగా ప్రేమ, దయను ప్రదర్శించాలి. *

*స్వధర్మాన్ని పాటిస్తూ మితాహారంతో ధ్యానాన్ని అభ్యసించాలి. ఈశ్వరుడికంటే ఏదీ భిన్నం లేదన్న చింతన చెయ్యాలి.*

*ప్రాణుల్లో అంతర్యామిగా వ్యాపించి ఉన్న పరమాత్మ జ్ఞానాన్ని ప్రసాదించే మూర్తి అని తెలుసుకోవాలి. ఆ జ్ఞానమూర్తిని ప్రేమించేవారే పరమపదాన్ని అధిరోహించేందుకు అర్హులు అని తల్లీతనయులైన కపిల దేవహూతులు భాగవత కథ ద్వారా సందేశాన్ని అందించారు.*✍️
               -మాడుగుల రామకృష్ణ.
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

ఒక్కొక్కసారి మనిషికి విపరీతమైన కోపం వస్తుంది. ఉదాహరణకు ...

 271222a1737.   281222-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀711.
నేటి…

             *ఆచార్య సద్బోధన:*
                 ➖➖➖✍️

*ఒక్కొక్కసారి మనిషికి విపరీతమైన కోపం వస్తుంది.   ఉదాహరణకు తమ సంతానం తమ మాటలు వినకపోతే తల్లిదండ్రులకు చెప్పలేనంత కోపం వస్తుంది. సంతానం కొంచెం క్రమశిక్షణను అతిక్రమించినా అణచుకోలేని కోపం వచ్చి కొడతారు కూడా, అది మంచిదికాదు.* 

*కాని కోపం తగ్గిన తరువాత, తాము పిల్లలపై అంతగా ఆగ్రహాన్ని ప్రదర్శించవలసిన పనిలేదని ఆలోచిస్తారు.*

*మధురంగా మాట్లాడి పనిని పూర్తిచేసుకొనవచ్చును. మధురంగా మాట్లాడుటమంటే శాంత చిత్తులమైయుండటమే. అప్పుడు ఎటువంటి దుప్ప్రభావానికి లోనుకాము. అందువలన మన పనికూడ పూర్తవుతుంది.*

*పరిస్థితులెలా ఉన్నా కోపంతో విజయాన్ని సాధించగలమని భావించకూడదు. ఒక్కొక్కసారి కోపాన్ని నటించవచ్చు. కాని మనస్సులో మాత్రం లేశమాత్రమైనా కోపముండరాదు.*

*ప్రవహిస్తున్న జలం పర్వతం ఎదురైతే దానికి చుట్టూ తిరిగి మార్గం ఏర్పరుచుకుని రాళ్లమధ్య నుండి మార్గాన్ని వెదుక్కుంటుంది.*

*అలాగే కఠినమైన పదాలతో సాధించలేనిది మధురమైన వాక్కులతో సాధించవచ్చు. కొన్ని సందర్భాలలో కరినమైన పదాలు వ్యతిరేక ప్రభావాన్ని చూపవచ్చును.*

*भंक्तुं शक्तो यादृग्भवति मृदुस्यान्न तादृशस्तीक्षः* |
*अपि मृदु जलमपि निपतद्भिनन्ति शैलं क्षुरं न यत्नेन* ||
*కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించి, కోపానికి తావివ్వకుండ, జీవితంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుని జీవితాలను సన్మార్గంలో ఉండేటట్టు అలవరచుకోవాలి.*✍️
      --- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ*
                          *మహాస్వామివారు.*
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

ఐశ్వర్యము

 Xx7. X2. 1-5.   271222-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                  *ఐశ్వర్యము*
                 ➖➖➖✍️
                          … మురళీమోహన్.

*ఐశ్వర్యం అంటే అందరూ*     
                   *ఏమనుకుంటారంటే…* *ధనము, సంపదలు,ఆస్తులు, అంతస్తులు అని అనుకుంటారు. కాని  నిజమయిన ఐశ్వర్యము అంటే ...*

*ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి సంపూర్ణమైన ఆరోగ్యముతో జీవిస్తూ ఉంటాడో ,*
*ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి సంపూర్ణమైన ఆనందముతో జీవిస్తూ ఉంటాడో ,*

*ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటాడో*

*అతడే ఐశ్వర్య వంతుడు. దీనినే సంపూర్ణ ఐశ్వర్యం అంటారు. అంతే గాని చనిపోయేంతవరకు సంపాదిస్తూ పోతూ, సంపాదించిందంతా వైద్యాలయానికి పోయడం కాదు ఐశ్వర్యమంటే!*

*చనిపోయేంతవరకు ఇంటిలో గాని , వీధిలోగాని ఘర్షణలతో జీవించడం కాదు ఐశ్వర్యమంటే,*

*చనిపోయేంతవరకు సంపాదించిన ధనము వల్ల శత్రువులను , ఈర్ష్యాపరులను, ఏర్పరచుకుని ఎవరు నాకు హాని తలపెడతారో అని భయముతో జీవించడము కాదు ఐశ్వర్యమంటే ,*

*చనిపోయేంతవరకు నీ నిజస్వరూపాన్ని తెలుసుకోకుండా భగవంతునికోసం గుడి గోపురం తిరగడం , తీర్ధయాత్రలు చేయడం కాదు ఐశ్వర్యమంటే ,*

*వీటినన్న్నిటిని జయించినవాడే ఐశ్వర్య వంతుడు .*
*శరీరము ఎవరైనా విడిచిపెట్టవలసినదే ఎవరైనా సరే ......*

*పుట్టినవాడు మరణించక తప్పదు , మరణించినవారు మరలా పుట్టక మానరు .*

*ఆత్మ అవినాశి. ఆత్మకు చావులేదు , పుట్టుకాలేదు .కాని వున్నదంతా ఈ శరీరానికే .*

*అది తెలియక నేను-నేను అంటూ వ్యామోహానికి గురై బాధపడుతున్నారు అందరూ.*
*ఈ జీవితంలో ఏవిధంగా ఆరోగ్యవంతునిగా జీవించాలో , ఏ విధంగా ఆనందంగా జీవించాలో , ఏవిధంగా ఐశ్వర్యవంతునిగా జీవించాలో , ఏవిధంగా ఆధ్యాత్మికంగా జ్ఞానంతో జీవించాలో తెలియజేసేదే యోగ సాధన.*

*ఎవరు శరీరంతో వున్నంతవరకు ఏవిధంగానూ లోటుతో శరీరాన్ని వదలరాదు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     

ప్రొటీన్లు కోసం మాంసమే తినాలా?

 ప్రొటీన్లు కోసం మాంసమే తినాలా?



ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రొటీన్లు శరీరానికి అత్యవసరమైన సూక్ష్మ పోషకాలు. శరీర నిర్మాణంలో.. ముఖ్యంగా ఎముకలు, కండరాలు, కీళ్లను బలోపేతం చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే, శరీరానికి సరిపడా ప్రోటీన్లు తీసుకోవడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఎన్ని కిలోల బరువుంటారో అన్ని గ్రాముల ప్రోటీన్లు శరీరానికి అవసరమవుతాయట. అయితే, ప్రోటీన్లు ఎక్కువగా మాంసాహారంలోనే లభిస్తాయి. దీంతో శాకాహారులకు తక్కువ మొత్తంలోనే ఇవి అందుతాయని చాలా మంది భావిస్తుంటారు. నిజమే.. గుడ్డు, మాంసాహారంలోనే ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయి. అయితే.. మాంసం తినని వాళ్లకు ప్రోటీన్లు కావాలంటే కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవేంటంటే..
గుమ్మడికాయ గింజలు: గుమ్మడి కాయల్లో ఉండే గింజల్లో.. గుడ్డులో ఉండే ప్రోటీన్ల కంటే ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ప్రతి 100 గ్రాముల గింజల్లో 19 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ఉండేది కేవలం 13 గ్రాముల ప్రోటీన్లే.

శెనగలు/పచ్చి బఠాణీలు: సంప్రదాయ వంటకాల్లో శెనగలు/పచ్చి బఠాణీలను విరివిగా వాడుతుంటారు. వీటితో చోలె, కుల్చే, భటూర్‌, టిక్కా పరాటా, చాట్‌ ఇలా రకారకాల రుచులు చూడొచ్చు. ఉడకబెట్టిన శెనగలు, బఠాణీలకు మసాలా దట్టించి చేసే చిరుతిండ్లు దేశవ్యాప్తంగా ఫేమస్‌. వీటిలో మనిషికి కావాల్సిన ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. 100 గ్రాముల శెనగల్లో 19 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.
పన్నీర్‌: శాకహారులు ఎక్కువగా ఇష్టపడే కూరల్లో పన్నీర్‌తో చేసేవి ముందువరుసలో ఉంటాయి. 100 గ్రాముల పన్నీర్‌లో 23 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి.. తరచూ పన్నీర్‌తో చేసిన వంటకాలు తినడం అలవాటు చేసుకుంటే మంచిది.
గ్రీక్‌ యోగర్ట్‌: సాధారణ యోగర్ట్‌లో కంటే.. ప్రత్యేకంగా లభించే గ్రీక్‌ యోగర్ట్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. చాలా మందికి భోజనం చివర్లో యోగర్ట్‌ వేసుకోనిదే తిన్నట్లు ఉండదు. దాన్ని అలాగే కొనసాగించాలి. ఒక కప్పు గ్రీక్‌ యోగర్ట్‌లో 23 గ్రాముల ప్రోటీన్లుంటాయి.
సోయాబీన్స్‌: ప్రోటీన్లు అధికంగా ఉండే మరో శాకాహారం సోయా బీన్స్‌. ఒక కప్పు సోయాబీన్స్‌లో అత్యధికంగా 29 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. సోయాబీన్స్‌ వంటకాలతో తినడమే కాదు.. సోయాపాలను తాగినా ప్రోటీన్లు అందుతాయి. ఇవే కావు.. బాదం, అరటిపండ్లలోనూ ప్రోటీన్లు మెండుగా ఉంటాయి.✍️

నలదమయంతుల కధ

 ix. Xi. 1-4.   261222-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

          నలదమయంతుల కధ
                 ➖➖➖✍️


కలి దోషం పోవాలంటే..రోజూ..ఒకసారి ఈ కధ చదవండి..

ఒకరోజు బృహదశ్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. 

ధర్మరాజు ఆ మునికి అతిధిసత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలు అన్నీ వివరించి "మహాత్మా! రాజ్యాన్ని, నివాసాన్ని పోగొట్టుకుని మాలాగ అడవిలో కష్టాలుపడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి" అని అడిగాడు. 

అందుకు బృహదశ్వుడు "ధర్మరాజా! నీవు కష్టాలు పడుతూ అడవులలో ఉన్నా,నీ వెంట నీ అన్నదమ్ములు, 
నీ భార్యా, నీ హితం కోరే విప్రులు 
నీ వెంట ఉన్నారు. పూర్వం నలుడనే మహారాజు నీవలె జూదంలో సర్వం కోల్పోయి, పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు", అని చెప్పాడు. 

అది విని ధర్మరాజు "మహత్మా! నాకు నలుని కథ వివరించండి" అని అడిగాడు.

బృహదశుడు ధర్మరాజుకు ఇలా వివరించ సాగాడు. "నిషిధదేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతనికి జూదం అంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే రాజు    పరిపాలిస్తు న్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరము వలన దమయంతి అనే కూతురు, దముడు, దమనుడు, దాంతుడు అనే కుమారులు కలిగారు. 
దమయంతి సౌందర్యరాశి, గుణవంతు రాలు. దమయంతి నలుని గుణగణా లను గురించి విన్నది. నలుడు కూడా దమయంతి గురించి, ఆమె సౌందర్యం గురించి విన్నాడు. ఇరువురి నడుమ ప్రేమ అంకురించింది.

నలదమయంతుల మధ్య హంస రాయబారం...

ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసలగుంపు వచ్చి అక్కడ వాలింది. ఆహంసలను చూసి ముచ్చట పడి నలుడు వాటిలో ఒకదానిని పట్టుకున్నాడు. మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతున్నాయి. నలునితో అతని చేతిలోని హంస మానవభాషలో ఇలా అన్నది. "ఓ మహారాజా! నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. 
నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి, నీ అందచందాల గురించి..
గుణగణాల గురించి చెప్పి..నీమీద అనురాగం కలిగేలా చేస్తాను" అని పలికింది. 
ఆ హంస పలుకులు విని నలుడు ఆనంద పడి, దానిని విడిచిపెట్టాడు. 

ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భదేశానికి ఎగిరిపోయింది. 
అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చట పడింది. చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. 
ఆ హంస దమయంతితో "దమయంతీ! నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను.   నలుడు సౌందర్య 
వంతుడు, సంపన్నుడు, సద్గుణ వంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగినదానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు" అని పలికింది. 

దమయంతి "ఓ హంసా! నలుని గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నలునికి నా గురించి చెప్పు" అన్నది. 
ఆ హంస అలాగే చేసింది. 
ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమైంది.

దమయంతి స్వయంవరం...
నల దమయంతుల వివాహం.

నల దమయంతుల ప్రణయ విషయం దమయంతి చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమమహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. 

ఆహ్వానాన్నందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు. 
ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయం వరానికి బయలుదేరాడు. 
మార్గమధ్యంలో నలుని చూసిన ఇంద్రుడు నలునితో "నిషధ రాజా !నీవు నాకు దూతగా పని చేయాలి" అన్నాడు. 
నలుడు "అలాగే చేస్తాను. ఇంతకీ మీరెవరు? నేను నీకేమి చేయాలి?" అని అడిగాడు. 

ఇంద్రుడు నలునితో "నేను ఇంద్రుడను. వీరు దిక్పాలకులు. నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పి.. ఆమె మమ్ములను వరించేలా చేయాలి" అన్నాడు. 

నలుడు ఇంద్రునితో "అయ్యా! నీకిది ధర్మమా? నేను కూడా అదే పనిమీద పోతున్నాను కదా" అన్నాడు. ఇంద్రుడు నలునితో "నీవు మాకు మాటిచ్చావు కనుక, ఈ కార్యం చేయవలసిందే. ఇది దేవతాకార్యం, నీవు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు. మా మహిమచేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవరూ అడ్డు చెప్పరు" అన్నాడు. 

గత్యంతరం లేక, నలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించాడు. 
నలుడు దమయంతిని మొదటి సారిగా చూసి, 'హంస చెప్పినదాని కంటే దమయంతి సౌందర్యవతి' అనుకున్నాడు. 
దమయంతి, ఆమె చెలికత్తెలు నలుడుని చూసి ఆశ్చర్యపోయారు. 
దమయంతి నలుని చూసి "మహాత్మా మీ రెవరు? ఎక్కడి నుండి వచ్చారు? 
ఈ అంతఃపురంలో ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు?" అని అడిగింది. 
నలుడు దమయంతితో "నా పేరు నలుడు. నేను దేవదూతగా వచ్చాను. 
దిక్పాలకులు, వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు" అన్నాడు. 
నలుని మాటలకు ఆమె మనసు కష్టపడింది. "అయ్యా! నేను మానవ కాంతను. నమస్కరించ వలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు, నిన్నే నా భర్తగా తలచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్ము ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించాడు. మీరేనాభర్త, 
కనుక నన్ను స్వీకరించండి. లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను కాని, 
ఇతరులను వరించను" అని దమయంతి ప్రార్థించింది. 
నలుడు దమయంతితో "దమయంతీ! 
దేవతలు ఐశ్వర్యవంతులు, జరా మరణాలు లేని వారు, వారిని కాదని జరామరణాలకు ఆలవాలమైన నన్ను కోరడం న్యాయమా?" అని అన్నాడు. 
ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. 
ఆమె నలునితో "నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్ధించి నిన్ను వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు" అన్నది. 
ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. 
అది విని దిక్పాలకులు "దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము" అని అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. 
స్వయంవరమండపంలో ఒకేసారి ఐదుగురు నలులు కనిపించారు. 
దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది. 
మనస్సులో ధ్యానించి "దేవతలారా! నలుని గుర్తు పట్టడంలో నాకు సహకరించండి. మీ నిజరూపాలతో ప్రత్యక్షం అవండి" అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించి తమ నిజరూపాలతో ప్రత్యక్షం అయ్యారు. 
నలదమయంతులకు వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి అనుగ్రహించారు.

*నలదమయంతులపై కలిప్రభావం..
రాజ్యాన్ని కోల్పోయి అడవులకు వెళుతున్న నలుడు.*

దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళుతుండగా, దేవతలకు కలి పురుషుడు కనిపించాడు. 
ఇంద్రుడు కలి పురుషుని చూసి "ఎక్కడికి పోతున్నావు?" అని అడిగాడు. 
"భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి పోతున్నాను" అన్నాడు. 
అ మాటలకు వారు నవ్వి "దమయంతి స్వయంవరం జరిగిపోయింది. ఆమె నలుని వివాహమాడింది" అన్నారు. 

కలికి కోపం వచ్చింది. 
నలుడిని రాజ్యభ్రష్టుని చేసి వారిరువురికి వియోగం కల్పించాలని అనుకున్నాడు. 

నలుడు ధర్మాత్ముడు, కలి ప్రవేశానికి చాలా కాలానికి గాని అవకాశం రాలేదు. 

ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాదప్రక్షాళన చేయకుండా సంధ్యా వందనం చేశాడు. ఆ అశౌచాన్ని ఆధారం చేసుకుని కలి అతనిలో ప్రవేశించాడు. 
నలుని దాయాది అయిన పుష్కరుని వద్దకు వెళ్ళి నలునికి జూదవ్యసనం ఉందని అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలువవచ్చని నమ్మబలికాడు. 
బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో నలుని వద్దకు వెళ్ళి జూదానికి ఆహ్వానించాడు. 
జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని, నలుడు జూదమాడటానికి అంగీకరించాడు. 

జూదం మొదలైంది. 
నలుడు తనరాజ్యాన్ని, సంపదలను వరుసగా పోగొట్టుకుంటున్నాడు..
అయినా ఆడటం మానక, 
సమస్తం పోయే వరకు ఆడాడు. 
దమయంతి దుఃఖించి "ఓడేకొద్ది గెలవాలని పంతం పెరుగుతుంది. ఏమీ చెయ్యలేము" అని సరిపెట్టుకుంది. 
పుష్కరుడు గెలవటం, 
నలుడు ఓడటం తథ్యమని గ్రహించిన దమయంతి తన కుమార్తె ఇంద్రను, కుమారుడు ఇంద్రసేనను సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. 

నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి, 
నగరం వెలుపల మూడు రోజులు ఉన్నాడు. 
జూదంలో సర్వం పోగొట్టుకున్న నలుని చూడటానికి ఎవరూ రాలేదు. ఆకలికి తట్టుకోలేక పోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పైవస్త్రాన్ని వాటి మీద విసిరాడు. ఆ పక్షులు ఆవస్త్రంతోసహా ఎగిరిపోయాయి. 
నలుడు ఖేదపడి తన భార్య కొంగును పైవస్త్రంగా కప్పుకున్నాడు. 
ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు "దమయంతీ! ఇక్కడ నాలుగు మార్గాలు ఉన్నాయి. 1.. ఇది, నీపుట్టిల్లు విదర్భ దేశానికి పోయే దారి. 2. ఇది, దక్షిణ దేశానికి పోయే మార్గం, 3. ఇది కోసల దేశానికి పోయే మార్గం, 4. ఇది ఉజ్జయినికి పోయే మార్గం.. వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు. నీవు అడవులలో కష్టాలు పడలేవు, నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు" అని చెప్పాడు. "అవును నాథా, మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉందాము" అని చెప్పింది. 
నలుడు "దమయంతీ! మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని, రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు. అన్ని రోగాలకన్నా పెద్ద రోగం దుఃఖం.. అందుకు భార్య పక్కన ఉండటం పరమౌషధం. 
అందుకని నీవు పక్కన ఉంటే, ఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి" అన్నాడు నలుడు. 
దమయంతి "నిజమే అందుకనే నన్ను ఎప్పుడూ మీ వెంట ఉండటానికి అనుమతించండి" అన్నది. 
అందుకు నలుడు అంగీకరించాడు.

*నలదమయంతుల వియోగం..*
ఒకరోజు అడవిలో నలుని తొడమీద తల పెట్టుకుని, దమయంతి నిద్రపోతూ ఉంది. అమెను చూసి నలుడు "ఈ సుకుమారి నాతో అడవులలో కష్టాలు పడుతోంది. నా వెంట ఉండటమే ఈమె కష్టాలకు కారణం. నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖ పడుతుంది" అని మనసులో అనుకుని, తాను ధరించిన చీరభాగాన్ని చింపి, పైన వేసుకుని ఆమెను వదలలేక వదలలేక విడిచి వెళ్ళాడు. 
నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. 
భర్తను తలచుకుంటూ అడవిలో తిరుగు తున్న దమయంతిని ఒక కొండచిలువ పట్టుకుంది. భయంతో దమయంతి కేకలు వేసింది. ఆ కేకలు విని ఒక కిరాతుడు తన కత్తితో ఆ కొండచిలువను చంపి, దమయంతిని రక్షించాడు. 
ఆ కిరాతుడు దమయంతి గురించి తెలుసుకున్నాడు. ఆమె నిస్సహాయతను తెలుసుకుని, ఆమెను తాకబోవగా, 
పతివ్రతఐన దమయంతి అతనిని భస్మం చేసింది.

భర్తను తలుచుకుంటూ అడవిలో దారీ తెన్నూ లేకుండా ప్రయాణిస్తూ ఉండగా, ఆమెకు ఒక మునిపల్లె కనపడింది. అక్కడ ఆమె మునిశ్రేష్టులను చూసింది. 
మునులు దమయంతిని చూసి "అమ్మా! నీవు ఎవరు? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?" అని అడిగారు. సమాధానంగా దమయంతి "మునిపుంగవులారా! నేను నలచక్రవర్తి భార్యను. నా పేరు దమయంతి. 
విధివశాన నాభర్త నన్ను విడిచివెళ్ళాడు. 
నాకు వారి జాడ చెప్పగలరా? నేను భర్త లేనిదే జీవించ లేను" అని అడిగింది. 

మునులు "అమ్మా! నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది. చింత పడకుము" అని చెప్పి, వెళ్ళారు. 

దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉంది. ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూసారు. 
కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాళి చేసారు. కొందరు ఆమెకు మొక్కారు. 
వారిలో ఉన్న వ్యాపారి ఆమెను గురించి తెలుసుకుని "అమ్మా! నేను నలుని చూడలేదు, కానీ మేము ఛేది దేశానికి వెళుతున్నాము" అన్నాడు. దమయంతి వారితో "నేను కూడా మీ వెంట వస్తాను" అన్నది. 

ఆవ్యాపారి ఆమెను తమ వెంట తీసుకు వెళ్ళాడు. వారు అడవి మార్గంలో రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలా మందిని తొక్కివేసింది. వారిలో చాలామంది మరణించడం చూసి, దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. తనను చంపలేదని రోదిస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకు వెళ్ళారు. ఛేదిదేశ రాజధాని సుబాహుపురం చేరింది. 

ఒళ్ళంతా దుమ్ముతో వీధిలో వెళుతున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. 
రాజమాత దమయంతితో "అమ్మా! నిన్ను చూస్తుంటే రాచకళ ఉట్టి పడుతోంది. నీవు ఎవరు?" అని అడిగింది. 
దమయంతి "అమ్మా! నా భర్త జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు. 
అతనిని వెతుకుతూ తిరుగుతున్నాను" అని చెప్పింది. రాజమాత "అమ్మా! ఇకనుండి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు. నీకు ఏ లోటూ రాకుండా నేను చూస్తాను. నీ భర్తను వెతికిస్తాను" అని చెప్పింది. 
దమయంతి అందుకు అంగీకరించి "అలాగే ఉంటాను, కానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలీ తినను, పరులకు కాళ్ళు పట్టను, పరపురుషులతో మాట్లాడను. 
కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్ళే బ్రాహ్మణులతో మాత్రం మాట్లాడు తాను" అని చెప్పింది. 
రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది. 
దమయంతి అక్కడే ఉండిపోయింది.

*నలుడు వికృతరూపుడగుట..*
దమయంతిని వదిలివెళ్ళిన నలుడు అడవిలో ప్రయాణిస్తుండగా, అడవి అంతటా దావానలం వ్యాపించింది. 
ఆమంటల మధ్యనుండి "రక్షించండి రక్షించండి" అన్న ఆర్తనాదం వినిపించింది. ఆ ఆర్తనాదం విని నలుడు అగ్నికీలల నడుమ ఉన్న నాగ కుమారుని రక్షించాడు. ఆ పాము నలుని కాటు వేసింది. పాము కాటుకు నలుడు వికృత రూపుడయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షం అయి నలునితో "నలమహారాజా! నా పేరు కర్కోటకుడు. నేను నిన్ను కాటువేసానని భయపడకు. ఇక నిన్ను ఎవరూ గుర్తించరు. పాముకాటు నిన్ను ఏమీ చేయదు. నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది, 
నీ భార్య నీకు దక్కుతుంది, నీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా, 
నన్ను తలచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది. దానిని కప్పుకుంటే నీ పూర్వాకృతి వస్తుంది. నీకు మరొక విషయం చెప్తాను.. ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైన ఋతుపర్ణుని రాజ్యం ఉంది. నీవు అక్కడికి వెళ్ళు. 
బాహుకుడు అనే పేరుతో అతని వద్ద రధసారధిగా చేరు. నీవు అతనికి అశ్వహృదయం అనే విధ్యను ఇచ్చి అతనినుండి అక్షహృదయం అనేవిద్యను గ్రహించు", అని చెప్పి కర్కోటకుడు వెళ్ళాడు. 

నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. అలాగే వంటశాలలో చేరి రుచికరమైన వంటలు వండి పెట్టసాగాడు. నలునికి జీవలుడు సహాయకుడుగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా, నలుడు ఎప్పుడూ దమయంతిని తలచి దుఃఖిస్తూ ఉండేవాడు. ఒకరోజు నలుడు దమయంతిని తలచుకుని దుఃఖిస్తూ ఉండగా జీవలుడు విని ఈ వికృతరూపి ప్రియురాలు ఎంత వికృతరూపంతో ఉంటుందో అనుకుంటూ నలుని దగ్గరకు వచ్చి, విషయం ఏమిటని అడిగాడు. 

అందుకు నలుడు జీవలునితో "అయ్యా నాకు ఒక ప్రేయసి కూడానా. నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తుండగా చూసాను. 
అతనిని అనుకరిస్తూ ఏడుస్తున్నాను" అన్నాడు.

*దమయంతి విదర్భ దేశానికి చేరుట..*
విదర్భదేశంలో ఉన్న భీమునికి నలుని విషయాలు తెలిసాయి. 
తన కూతురు, అల్లుడు ఏమయ్యారో అని పరితపించాడు. వారిని వెదకడానికి నలువైపులా బ్రాహ్మణులను పంపించాడు. ఎన్నో బహుమానాలు ప్రకటించాడు. ఛేదిదేశం చేరిన బ్రాహ్మణుడు, దమయంతి నుదుటన ఉన్న పుట్టుమచ్చని చూసి ఆమెను గుర్తించాడు. అతడు దమయంతితో "అమ్మా! నేను నీ తండ్రి వద్దనుండి వస్తున్నాను. అక్కడి వారంతా క్షేమం. 
నేను నీ సోదరుని మిత్రుడను" అనగానే దమయంతి వారిని తలచుకుని పెద్దగా రోదించింది. 
అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి "బ్రాహ్మణోత్తమా! ఈమె ఎవరి భార్య? ఎవరి కూతురు? ఇలా ఉండటానికి కారణం ఏమిటి?" అని అడిగింది. 

అందుకు అతడు "అమ్మా! ఈమె విదర్భరాజు కుమార్తె. నలచక్రవర్తి భార్య. 
ఈమె పేరు దమయంతి. అతడు విధివశాత్తు రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. 
భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడికివచ్చి ఈమెను గుర్తించాను" అన్నాడు. 

అది విని దయంతిని కౌగలించుకున్న రాజమాత "దమయంతీ! నీవు నాకు పుత్రికా సమానురాలివి. నేను, నీ తల్లి దశార్ణరాజు కుమార్తెలము. నీ తల్లి విదర్భరాజును వివాహమాడింది. 
నేను వీరబాహును వివాహమాడాను" అన్నది. 
అందుకు అందరూ ఆనందపడ్డారు. 
దమయంతి బ్రాహ్మణునితో పుట్టింటికి ప్రయాణం అయింది.

*దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించుట..*
రాజ సౌధంలో ఉన్న దమయంతి భర్తృవియోగంతో బాధపడుతూనే ఉంది. 
ఆమె తనతండ్రితో "నా భర్తను తక్షణం వెతికించండి. ఆయన లేకుండా నేను బ్రతక లేను" అన్నది. 
భీముడు వెంటనే బ్రాహ్మణులను పిలిచి నలుని వెతకమని చెప్పాడు. 
వారితో దమయంతి ఇలా చెప్పింది. "నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కనుక, 
మారు వేషంలో ఉంటాడు. మీరు వెళ్ళిన రాజ్య సభలలో ఈ విధంగా ప్రకటించండి. "నీవు సత్యసంధుడవు కాని, నీ సతిని వంచించావు. ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళావు. అలా చెయ్యడం ధర్మమా? నాపై కరుణ చూపు" అని చెప్పండి. 
ఈ మాటకు ఎవరైనా రోషపడి బదులిస్తే, 
నా వద్దకు వచ్చి చెప్పండి" అన్నది. 

అలా నలుని వెదకడానికి వెళ్ళినవారంతా నలుని జాడ తెలుపక పోయినా, వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో "అమ్మా! నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవు చెప్పినట్లే చెప్పాను. అక్కడ ఒక కురూపి వంటవాడు, సారధి అయిన బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకుని, 'అయ్యా! భర్త కష్టాలలో ఉన్నా సహించి, ఆదరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది' అన్నాడు" అని దమయంతితో చెప్పాడు.

దమయంతి ఆలోచించగా ‘అతడు నలుడు కాకపోతే అలా ఎందుకు బదులిస్తాడు’ అనుకుంది. తన అనుమానం దృఢపరచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవుడనే బ్రాహ్మణుని పిలిపించింది. "సుదేవా నీవు ఋతుపర్ణుని రాజుతో, "రాజా! భీముడు తన అల్లుని కొరకు వెతికించినా ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలం లోని రాజులంతా వస్తున్నారు. మరునాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరు అని చెప్పు" అని చెప్పి పంపింది. 
సుదేవుడు ఋతుపర్ణునితో దమయంతి చెప్పమన్నట్లే చెప్పాడు.

*నలుడు స్వయంవరానికి బయలుదేరుట..*
దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విని ఋతుపర్ణుడు స్వయం వరానికి వెళ్ళాలనిఅనుకున్నాడు. ఒకరోజులో విదర్భను చేరటం ఎలా? 
అనుకుని సారధి అయిన బాహుకుని పిలిచి "బాహుకా! దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. 
నాకు చూడాలని ఉంది. ఒక్కరోజులో మనం విదర్భకు వెళ్ళాలి. 
నీ అశ్వసామర్ధ్యం ప్రకటించు" అన్నాడు. 
సరే అని చెప్పినా బాహుకుడు మనస్సు కలతకు గురైంది. "నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదా, దమయంతికి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు, కాని అది నిజంకాదు. 
నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది. అని దుఃఖించాడు. 
"అయినా దమయంతి పతివ్రత. ఇద్దరు పిల్లల తల్లి. ఈ విధంగా రెండవ పెళ్ళి చేసుకుంటుందా? ఏమో?  ఆ వింత చూస్తాను" అని మనసులో అనుకున్నాడు. 

వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణం అయ్యాడు. ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథంలా, బాహుకుడు అనూరుడిలా అనిపించింది. పక్కనే ఉన్న వార్షణేయుడికి అదే సందేహం కలిగింది. "భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది, కాని ఈ కురూపి నలుడెలా ఔతాడు?" అని మనసులో అనుకున్నాడు. 
ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి, క్రింద పడింది "బాహుకా రథం ఆపు, వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తీసుకు వస్తాడు" అన్నాడు. 
బాహుకుడు "మహారాజా! మనం ఆమడ దూరం వచ్చేసాం. 
అంతదూరం నడుచుకుంటూ ఎలా తీసుకు రాగలడు?" అన్నాడు. 
అతని రథ సారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు.  తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది. అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకునితో "బాహుకా ఆ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పూలు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను " అని అన్నాడు. 
బాహుకుడు "చెప్పండి మహారాజా" అని అడిగాడు. ఋతుపర్ణుడు చెప్పాడు లెక్కించి చూస్తే కాని నమ్మను అని రథం ఆపి ఆ చెట్టుని పడగొత్తించి లెక్కించాడు. ఋతుపర్ణుడు చిప్పిన లెక్కకు కచ్చితంగా సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. 
ఋతుపర్ణుడు "బాహుకా ఇది అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రం" అన్నాడు. 
అప్పుడు బాహుకుడు "మహారాజా! ఇందుకు ప్రతిగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను" అన్నాడు.
ఋతుపర్ణుడు "ఇప్పుడు కాదు, తరువాత అడిగి నేర్చుకుంటాను" అన్నాడు. 
అక్షహృదయ విద్య మహిమవలన నలునిలో నుండి కలి వెలుపలికి వచ్చాడు. తనను క్షమించమని నలుని వేడుకున్నాడు. 
నలుడు ఆగ్రహించి శపించబోయాడు. 
కలి నలునితో "నలమహారాజా! నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకడు కాటువేయడం వలన అనుక్షణం కాలిపోయాను. ఇంతకంటే శాపం ఏముంది, నన్ను క్షమించి విడిచిపెట్టు" అని వేడుకున్నాడు.

నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్భలో ప్రవేశించింది. 
ఆ ఘోష విని, దమయంతి అది నలుని రథం అని గుర్తుపట్టింది. 
కాని రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది చూపాడు. 
ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి కనిపించ లేదు. 
బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి, సేదతీరాడు.

*తిరిగి కలుసుకున్న నల దమయంతులు.*
దమయంతి తన దాసితో "వచ్చింది ఋతుపర్ణ మహారాజు అతని సారధి వార్ష్ణేయుడు. వారు నాకు తెలుసు, 
కాని వారి వెంట ఉన్న కురూపి ఎవరు? 
అతనిని చూసి నా మనసు పరవశించి పోతోంది. అతని వివరాలు తెలుసుకుని రా" అని పంపింది. 
దాసి నలుని వద్దకు వచ్చి "అయ్యా! రాకుమారి మీ యోగ క్షేమాలు కనుక్కుని రమ్మంది" అని చెప్పింది. 
నలుడు "మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా, దానికి నేను మా మహారాజును ఒక్కరోజులో నూరు ఆమడల దూరం ప్రయాణించి తీసుకు వచ్చాను అని చెప్పు " అన్నాడు. 
"మీతో వచ్చిన మూడవ వ్యక్తి ఎవరు?" అని దాసి అడిగింది. 
నలుడు "అతడు వార్ష్ణేయుడు. 
ఇంతకు ముందు నలుని సారధి" అన్నాడు. 
దాసి "అతనికి నలుని జాడ తెలుసు కదా?" అని అడిగింది. 
నలుడు దాసితో "తనరాజ్యాన్ని పోగొట్టుకునేముందు నలుడు తన పిల్లలనిచ్చి వృష్ణేయిని విదర్భకు పంపాడు. ఆ తరువాత వార్ష్ణేయుడు ఋతుపర్ణుని వద్ద సారధిగా చేరాడు. 
నలుని గురించి నలునికి తెలియాలి, లేదా అతని భార్యకి తెలియాలి, 
వేరొకరికి తెలిసే అవకాశం లేదు" అన్నాడు బాహుకుడు. 
దాసి "అయ్యా! నలుడు తనను ప్రాణపదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు. దమయంతి నలుడు విడిచి వెళ్ళిన సగంచీర ధరించి కాలం గడుపుతోంది. 
ఆమెను ఇలా విడిచి వెళ్ళడం ధర్మమా?" అని అడిగింది. 
నలుని కంట నీరు పెల్లుబికింది. 
అది దాసికి తెలియ కూడదని మొహం తిప్పుకున్నాడు. దమయంతికి దాసి జరిగినదంతా వివరించింది. 

దమయంతి దాసితో "సందేహం లేదు, 
అతడు నలుడే. అయినా ఈ వికృత రూపం ఏమిటి? అతను వంటవాడు అని చెప్పారు కనుక, వంట ఎలా చేస్తాడో పరీక్షించు" అని పంపింది. 
దాసి వెళ్ళి నలుని నిశితంగా పరిశీలించి "అమ్మా! అతను సామాన్యుడు కాదు. 
అతడు ఏపని అయినా సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి. వంట పూర్తయే వరకు అలా మండు తున్నాయి. 
వంటలు అద్భుతంగా ఉన్నాయి" అని దమయంతికి చెప్పింది. 
దమయంతి నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి "సందేహం లేదు, 
ఇవి నలుని వంటలే" అని గ్రహించి, 
దాసితో తన పిల్లలను నలుని వద్దకు పంపింది. 
నలుడు వారిని చూసి చలించి ఎత్తుకుని ముద్దాడాడు. దాసితో "అమ్మా! ఏమీ అనుకోవద్దు, వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు అందుకే అలాచేసాను. 
ఇక నువ్వు నా వద్దకు రావద్దు. ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. అయినా మేము విదేశాలనుండి వచ్చిన అతిధులం మాతో నీకేంపని?" అన్నాడు. 
ఇది విని దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి "ఋతుపర్ణుని సారధిగా వచ్చిన కురూపి బాహుకుడే నలుడు. అమ్మా అతను ఇక్కడకు వస్తాడా, నేను అక్కడకు వెళ్ళాలా నువ్వే నిర్ణయించు" అని అడిగింది. 
భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది. 
దమయంతి నలుని చూసి, "అయ్యా నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నట్టడవిలో నిర్డాక్షిణ్యంగా వదిలి వెళ్ళాడు. అలా సంతానవతినైన నన్ను విడిచి పెట్టడం ధర్మమా? అలా చేయడానికి నేనేమి అపకారం చేసాను? 
అగ్ని సాక్షిగా విడువను అని నాకు ప్రమాణం చేసిన భర్త అలా చేయవచ్చా?" అని దుఃఖించింది. 
నలుడు "సాధ్వీ! ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు. అందువలన నేను అలా చేసాను. జూదంలో సర్వం పోగోట్టుకుని బాధలు పడుతున్న నేను, నాతోపాటు బాధలు పడుతున్న నీ బాధను సహించ లేక, నిన్ను విడిచి వెళ్ళాను. అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని అలా చేసాను. నీపై అనురాగంతో మిమ్మల్ని చూడటానికే నేను ఇక్కడకు వచ్చాను. 
మరొక భర్తకోసం స్వయంవరం ప్రకటించడం కులస్త్రీలకు తగునా? 
అలా ఎందుకు చేసావు? అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు.ఇది ధర్మమా?" అని దమయంతిని అడిగాడు. 

దమయంతి "నాధా నేను మీకోసం గాలిస్తూ పంపిన విప్రులలో అయోధ్యకు వెళ్ళిన విప్రుడు మిమ్ముల్ని గుర్తించాడు. 
మిమ్ములను రప్పించుటకే ఇలా చేసాను. 
మీరుకాక, ఇంకెవరు నూరు యోజమలు దూరం ఒక్క రోజులో ప్రయాణించగలరు? 
నాలో ఎటువంటి పాపపు తలపు లేదు అని మీపాదములు అంటి నమస్కరించి ప్రమాణం చేస్తున్నాను" అని దమయంతి నలుని పాదాలకు నమస్కరించింది. 
వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు "నలచక్రవర్తీ! ఈమె పవిత్రురాలు, పతివ్రత. నేను, సూర్యుడు, చంద్రుడు ఈమె సౌశీల్యం కాపాడుతున్నాము" అని పలికాడు. 

నలుడు కర్కోటకుని స్మరించాడు 
వెంటనే ఒక వస్త్రం వచ్చింది. 
అది ధరించగానే నలునికి ఇంద్రతేజస్సుతో సమానమైన మనోహరమైన పూర్వరూపం వచ్చింది. 
దమయంతిని పరిగ్రహించాడు.

*నలదమయంతులు రాజ్యాన్ని పొందుట..*
సభలో నల దమయంతులు.
నలుడు విదర్భలో ఒక మాసం ఉండి, 
తన రాజధానికి వెళ్ళి పుష్కరుని కలిసాడు. 
నలుడు పుష్కరునితో "పుష్కరా!జూదమాడటం నీకు ప్రియం కదా. 
నేను నా భార్య దమయంతిని ఫణంగా పెడతాను, నీవు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా? లేదా నాతో యుద్ధం చెయ్యి, 
ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం. నీకేది ఇష్టమో నిర్ణయించుకో" అన్నాడు. 
పుష్కరుడు జూదప్రియుడు,పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు కనుక అతడు నలునితో "నేను జూదమే ఆడతాను" అన్నాడు. 
నలుడు పుష్కరునితో జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు. 
పుష్కరునితో "పుష్కరా, నేను ఇదివరకు నీతో జూదమాడినపుడు నన్ను కలి ఆవహించి ఉన్నాడు. కనుక ఓడి పోయాను, నీబలం వలన కాదు. 
నీవు నా పిన తండ్రి కుమారుడివి కనుక, 
నిన్ను ఏమి చేయను వెళ్ళు" అని చెప్పి పంపాడు.

ఫలశ్రుతి:-
ఈ నలుడి గాధ శ్రద్ధతో వినేవారు, 
సమావేశాలలో చదివి వినిపించేవారు, 
కలి వలన సంభవించే దోషాల నుండి విముక్తి చెందగలరు. సర్వపుణ్యకార్యాలు చేసినప్పుడు లభించే పుణ్యఫలితాలు నలోపాఖ్యానం విన్నవారికి, 
వినిపించిన వారికి కూడా లభిస్తాయి. 
అటువంటి వారికి బహుపుత్రలాభం, 
పౌత్రవృద్ధి, ఆయురారోగ్యధనసంపత్తులు కలుగుతాయి. విషప్రయోగం నుండి బాధలు, చెడు విషయాలలోని లంపటత్వం వారిని అంటవు! 
వారు ధర్మాత్ములు కాగలరు.

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ |
ఋతుపర్ణశ్చ రాజర్షే కీర్తనం కలినాశనం ||

కర్కోటకుడనే నాగుడిని, దమయంతిని, 
పుణ్యశ్లోకుడైన నలుడిని, ఋజుచరిత్రుడైన ఋతుపర్ణుడిని 
ధ్యానించి కీర్తించిన, కలిభయాలు తొలగగలవు.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

*****దైవాన్ని దేనికోసం ప్రార్ధించాలి?

 Xx2. X. 1-6.  261222-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

   *దైవాన్ని దేనికోసం ప్రార్ధించాలి?*
                 ➖➖➖✍️

*కోరికల చిట్టాతో దైవాన్ని ప్రార్థిస్తే, ఆ చిట్టా పెరుగుతుంది కాని- దైవబలం పెరగదు.*

*గతంలో ఎందరో చక్రవర్తులు ఈ భూమిని పాలించారు. సుదీర్ఘకాలం పాలన చేశారు. ఎన్నో విజయాలు సాధించారు. ఎన్నో సుఖాలు అనుభవించారు. ఎన్నో అద్భుత నిర్మాణాలు చేశారు. కానీ ఏ ఒక్క మహారాజూ ‘పొందవలసినది పొందాను, అంతా అనుభవించాను’ అనే తృప్తితో గతించలేదు.*

*దేవతల నుంచి దివ్యాస్త్రాలను పొందిన మహావీరుల గురించి మన ఇతిహాసాలు చెబుతాయి. వీరు బాహ్య శత్రువులను జయించారే తప్ప, అంతఃశ్శత్రువులను గెలవలేకపోయారు. ఆ మహావీరులెవ్వరూ మానసిక ఉన్నతికోసం దైవ శక్తులను కోరలేదు. వారి తపస్సులో కేవలం విజయకాంక్ష తప్ప మరొకటి లేదు. ఈ దివ్యాస్త్రాలూ నిష్ఫలమైన సందర్భాలున్నాయి. గొప్ప అస్త్రాలే హనుమను ఏమీ చేయలేకపోయాయని రామాయణం చెబుతోంది.* 

*అర్జునుడు వరాలకోసం శ్రీకృష్ణుణ్ని ఆశ్రయించలేదు. అందుకే దివ్యజ్ఞానామృతాన్ని (భగవద్గీత) పొందగలిగాడు. కోరికల చిట్టాతో దైవాన్ని ప్రార్థిస్తే, ఆ చిట్టా పెరుగుతుంది కాని- దైవబలం పెరగదు.*

*దేనివల్ల ఆనందాన్ని, శాంతిని, సంతృప్తిని పొందుతామో తెలియక, మనిషి ఇంద్రియాల చేతిలో మోసపోతున్నాడు. వేటగాడు జింకను వేటాడినట్లే, వాంఛలు మనిషిని వేటాడుతున్నాయి.* 

*కల్పవృక్షం ప్రసాదించే భోగాలూ క్షణికానందాన్నే ఇస్తాయి. మనిషి ఎన్ని తీర్థాలను, దేవతలను సేవించినా, విషయవాంఛల నుంచి బయటపడనిదే- ప్రయోజనం ఉండదు.*

*విషయవాంఛలు అనే శత్రుసేన ఈ శరీరాన్ని ఆక్రమించింది. ఇంద్రియాలతో పొందే అనుభూతులే వాటి గజబలగం. కామ క్రోధాదులే వాటి ఆయుధాలు. అహంకారం వాటికి సేనాపతి. ఇంద్రియాలు వాటి పతాకం. దేహమనే రాజ్యంలో అంతరంగమనే రాజప్రాకారాన్ని ఇవి చుట్టుముట్టాయి. బుద్ధి అనే మంత్రిని చీకటి గదిలో బంధించాయి. మనసు అనే రాజును బానిసను చేశాయి.* 

*ఎంతటి పరాక్రమశాలి అయినా బాహ్యంగా కనపడే శత్రువులతో తలపడగలడు కాని, కంటికి కనపడకుండా తనలోనే తిష్ఠవేసిన ప్రత్యర్థులతో పోరాడలేడు. ఇంద్రియ నిగ్రహం, బుద్ధి వికాసంతోనే ఇది సాధ్యమవుతుంది.*

*ఇంద్రియాలను అరణ్యంతో పోల్చారు పెద్దలు. అడవిని సులభంగా దాటాలంటే దాని గురించి తెలియాలి. అలాగే ఇంద్రియాల కిటుకు తెలిస్తే, ఇంద్రియారణ్యాన్ని సులభంగా దాటగలం. ఇంద్రియాలు మనసును ఎలా మాయచేస్తాయో, మనిషి సూక్ష్మదృష్టితో గమనించాలి. చర్మ సౌందర్యంతో మనసును మోహింపజేసే కళ్లు, వాటి వెనకనున్న రక్తమాంసాలను కప్పిపుచ్చుతుంది. సుగంధాలను అందించే ముక్కు, దుర్గంధమైన దేహంలోనే తాను కూడా ఉన్నాననే స్ఫురణను మరపిస్తుంది. రుచులను మనసుకు అలవరచే నాలుక, వాటి చాటున దాగిఉన్న రోగాలను దాచిపెడుతుంది. ఇక శ్రవణేంద్రియమైతే (చెవులు) మనిషిని సత్కార తిరస్కార మాటలతో మభ్యపెడుతుంది. ఇలా అన్ని ఇంద్రియాలూ మనిషిని తప్పుదోవ పట్టిస్తాయి.*

*మనిషిలోనే ఉంటూ, మనిషిని నడిపించే ఈ ఇంద్రియాలను మనసు స్వాధీనపరచుకోవాలి. వినటం, చూడటం, స్పృశించటం, గ్రహించటం... ఇలా మనం చేసే అన్ని పనులూ ఇంద్రియ కార్యకలాపాలే. ప్రతి ఇంద్రియానికీ దైవ ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి అనే రెండు స్వభావాలు ఉంటాయి.* 

*సత్కర్మలు, సత్ప్రవర్తన, సత్‌ సాంగత్యం- ఇంద్రియాల్లో దైవప్రవృత్తిని నింపుతాయి. అవి ఇంద్రియారణ్యం నుంచి బయటపడే మార్గం చూపిస్తాయి. బుద్ధి వికాసానికి తోడ్పడతాయి.*

*మనసును ఇంద్రియాలకు దూరంపెట్టి, బుద్ధికి చేరువ చేయాలి. అప్పుడే అంతరంగంలో తిష్ఠవేసిన విషయవాంఛలనే శత్రువులను జయించగలం. ఇంద్రుడు అనే ఇంద్రియాధిపతి (మనసు)కి, బృహస్పతి అనే బుద్ధి హితబోధ చేస్తే- ఆనందం శాంతి సంతృప్తి ఎక్కడ లభిస్తాయో మనిషి గ్రహించగలడు!*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

*****మనోజయం

 Xvi. Xi. 1-6.  261222-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                  *మనోజయం*
                 ➖➖➖✍️

*సహజంగా మనసు ప్రశాంతంగా ఉండదు. దాన్ని మనమే సరిచేసుకుంటూ ఉండాలి. లేకపోతే చిక్కులు పడిన తాడులా ఉంటుంది. అర్థం కాని సమస్యలా ప్రతీసారి మన ముందుకు వచ్చి నిలబడుతుంది.*

*ఎందుకిలా జరుగుతుంది? మనసుతో ఈ ఇబ్బంది ఏమిటి? చాలా సార్లు, చాలా మందికి అనిపిస్తుంది. మనసుతో ఇలాంటి గొడవ ఏదో ఒక రోజు రావాలి. అదే నాంది- మనసును శోధించడానికి. మనసును సాధించడానికి. దాని సంగతి తేల్చుకోవడానికి.*

*మనిషికి చాలా సంతోషకరమైన, మేధాపరమైన ఆట ఏది అంటే, మనసుతో నిత్యం ఆడేదే! మనసుతో ఆడాలి. మనసును పరుగెత్తించాలి. మనల్ని మనసు పరుగెత్తిస్తుంటే ఆపాలి. మనసుకు ఎదురుతిరగాలి అంటారు స్వామి వివేకానంద.*

*మనసు భయపెడుతుంది. బాధ పెడుతుంది. విసిగిస్తుంది. చివరకు కాళ్లబేరానికి వచ్చి బుజ్జగించి, లాలిస్తుంది. రాయిలా మనం కదలక మెదలక ఉంటే, చివరకు దండం పెడుతుంది- రమణ మహర్షికి వశమైన మనసులా.*

*మనసు లేని మనిషి గడ్డకట్టిన సరస్సులాగా ఉంటాడు. శీతోష్ణ, సుఖ, దుఃఖాలను సమంగా చూస్తాడు.*

*ఇలాంటి ప్రశాంతమైన మనసు కలిగిన మనిషే శక్తికి పుట్టినిల్లు అవుతాడు. శక్తి కావాలంటే నిరంతరం ఆలోచనలతో సతమతమయ్యే మనసును భారంగా మొయ్యడం కాదు. ఆలోచనలను నియంత్రించుకుని, సృజనాత్మక భావాల మీద ఏకాగ్రత నిలిపితే అసలైన శక్తి పుడుతుంది.*

*ఆ శక్తి అపారం. దాన్ని అందుకోగలిగిన నాడు, లోకంలో దేన్నయినా సాధించగలం. మనోవిజయమే లోక విజయం.*

*ప్రశాంతమైన మనసే అద్భుతాలు సృష్టించగలదు. ఆలోచనలు తగ్గుతున్న కొలదీ సృజనాత్మకత పెరుగుతుంది. వందలు, వేల కొద్దీ క్రమం లేని ఆలోచనలు మనసులోని శక్తిని తగ్గించేస్తాయి. ఒక మంచి, గొప్ప ఆలోచన దివ్య మార్గంలో నడిపిస్తుంది.*

*హృదయం మనసుకు అనుసంధానమైనప్పుడు పుట్టే ప్రతి ఆలోచనా గొప్పది అవుతుంది.* 

*హృదయం కలగజేసుకోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే క్రమబద్ధమైన, శక్తిమంతమైన ఉపయోగకరమైన ఆలోచనలు చెయ్యాలి.*

*ఆలోచనలకు ముందు ధ్యానం చెయ్యాలి. ఆలోచించిన తరవాత ధ్యానం చెయ్యాలి. మరిన్ని మంచి ఆలోచనల కోసం ఆలోచనల తీరుతెన్నులు తెలుసుకోవాలి. ఆలోచనలకు స్థావరమైన మనసును ముఖాముఖీ ఎదుర్కోవాలి. అవసరమైతే పక్కకు తప్పుకొని మనసుకు సాక్షిగా నిలబడి ఉండాలి. ఇదంతా సాధన వల్లనే సాధ్యపడుతుంది.*

*మనసుతో వ్యాయామం చెయ్యని మనిషి సాధనలో పరిణతి చెందలేడు. మనసుకు అతీతంగా వెళ్లని మనిషి ఆధ్యాత్మిక రహస్యాలు అందిపుచ్చుకోలేడు.*

*మనసు మనకు మంచి మిత్రుడు. దారుణమైన శత్రువు కూడా. ఉపయోగించుకోవడంలో అంతా ఉంది.*

*మనసు గాలిలో దీపంలా ఉంది. దీన్నెలా వశం చేసుకోవాలని దీనంగా ప్రార్థించాడు అర్జునుడు. అప్పుడు పరమాత్మ చెప్పాడు..,*

*‘నిస్సందేహంగా మనసు చంచలమైనది. దాన్ని వశపరచుకోవడం చాలా కష్టం. అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని నియంత్రించడం సాధ్యమే. మనసు వశం చేసుకున్న ప్రయత్నపరుడైన మనిషికి సాధనద్వారా సహజంగా యోగ సిద్ధి పొందడం సాధ్యమే’ అని వివరించాడు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

**** *::::::: ధ్యానం ఎవరెవరు చెయ్యాలి::::::::

::::::: ధ్యానం ఎవరెవరు చెయ్యాలి::::::::
ఈ క్రింద చెప్పిన వారు తప్పక చెయ్యాలి.
1) దుఃఖితులు తమ దుఃఖాన్ని పోగొట్టు కోవడానికి మరియు దుఃఖం రాకుండా చూచు కోవడానికి చెయ్యాలి
.2) ఆలోచనా పరులు ఎవరికైతే ఆలోచనలు తాము చేయి తల్చుకోక పోయినా వస్తున్నాయో వారు.
3) కోప తాపాలు ఎవరైతే తీవ్ర కోపిష్టిలో, ఉద్రేక పరులో వారు
4) వ్యసన పరులు. తాగుడు, జూదం, వ్యభిచారం, వీటికి బానిసలు
.5) రౌడీలు. దౌర్జన్యం, దోపిడి,హింస సంఘ విద్రోహ చర్యలకు పాలుపడేవారు
.6) నిద్ర పట్టని వారు. దిగులు విచారం,అనుమానం భయం మొదలగు వాటిచేత నిద్ర రాని వారు
7) ప్రేమ కరుణ,జాలి దయ మానవత్వం, మొదలగు ఉన్నత గుణాలు లేని వారు.
8) సోమరులు. జడత్వం, సోమరితనం,పిరికి, బిడియం, ఆత్మనూన్యత, గర్వం, మూర్ఖత్వం,గల వారు
9) భ్రమలు భ్రమలకు,పగటి కలలకు,మూడవిశ్వాసాలుకు,మోసాలకు త్వరగా లోనౌతుండే వారు
షణ్ముఖానంద 98666 99774

సేకరణ