Friday, March 3, 2023

:::::: వీధి కుక్క vs పెంపుడు కుక్క:::::

 *:::::: వీధి కుక్క vs పెంపుడు కుక్క::::::*
     కుక్క వీధి లో వున్నంత కాలం మనం దాని గురించి ఆలోచించం. అది తినిందా? తినలేదా? పటించు కోము. 
    ఈ వీధి కుక్కని పెంచుకుంటే  ఇక మొదలు అవుతుంది  సమస్య.  దాని మీద మమకారం, అభిమానం, ప్రేమ,  పుడుతుంది. అది అరుస్తే బాధ ,. అరవక పోతే  బాధ, తినక పోతే బాధ. అది మనలని వదలదు. మనం దానిని వదలం.  అది వీధి లో వున్నా, ఇంటిలో వున్నా, దాని బ్రతుకు దానిదే, మనం బ్రతుకు మనదే.  ఎప్పుడైతే అది మానసికంగా ఇంటి కుక్క అనిపించు కున్నదో  అది సమస్య  అయింది.
    అలాగే ఈ ప్రపంచం, సంసారం, కార్య కలాపాలు, సంబంధాలు, వ్యవహారాలు, వీటిని  హృదయపు బయట  వీధి లోనే  వుంచండి. హృదయం లోపలికి రానీయకుండా.
 బయటే వుంచి ఆలనా పాలనా చేయండి.
   ధ్యానం  ,మీ హృదయాన్ని  ఖాళీ గా వుంచే బాధ్యత తీసుకుంటుంది. హృదయం లోపలికి దేనిని రానివ్వదు. మీ పట్ల మీరు కూడా.
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment